image_print

సంపాదకీయం-జనవరి, 2025

“నెచ్చెలి”మాట  ధైర్యమే 2025! -డా|| కె.గీత  2025 నాటికి నోట్రదామస్ చెప్పినట్టో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో పుకార్లలో వినీ కనీ ఏదో జరిగిపోతుందని లోకం అంతమైపోతుందని భయపడే సంవత్సరం వచ్చేసింది! అయినా ఆ.. ఏముందిలే 2020వ సంవత్సరపు కరోనాని ఊహించలేనివారు 2025ని చూసొచ్చారా? 2025 అంటే ఈ శతాబ్దపు సిల్వర్ జూబ్లీ కదూ! 19వ శతాబ్దిలో పుట్టిన అందరికీ 2025 ని చూడడమంటే గొప్ప అద్భుతమే కదూ! ఒహోయ్ వట్టి నూతన సంవత్సరం కాదండోయ్.. 2025లోకి వచ్చేసాం! […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-డిసెంబర్, 2024

“నెచ్చెలి”మాట  ఒరులేయవి యొనరించిన -డా|| కె.గీత  ఒరులేయవి యొనరించిన యప్రియము తన మనంబున కగు తానొరులకు నవి సేయకునికి …… అంటే దెబ్బకు దెబ్బ చెల్లుకు చెల్లు టిట్ ఫర్ టాట్ అన్నీ గంగలో కలిపి ఎవరేం చేసినా తిరిగి ఏమీ చెయ్యకూడదన్నమాట! అంటే గాంధీ గారిలా ఓ చెంప మీద ఎవరైనా కొడితే మరో చెంప కూడా వాయగొట్టమని చూపించడమన్నమాట! సరే- చెప్పడానికి నీతులు బానే ఉన్నాయండీ- కానీ మళ్ళీ మళ్ళీ లోకువకట్టే వాళ్ళనీ మళ్ళీ […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-నవంబర్, 2024

“నెచ్చెలి”మాట  ఫలితాలు -డా|| కె.గీత  కొన్ని ఫలితాలు చేసిన పనుల మీద ఆధారపడి ఉంటాయి అసలు కీడెంచి మేలెంచాలని ముందుకే వెళ్ళం ఏం? అయినా అంతా మంచే జరుగుతుందని ఆశించొచ్చుగా – కొన్ని ఫలితాలు ఏం చేసినా మారవు సాకుకోసం ఎదురుచూస్తున్నట్టు తప్పించుకుంటాం ఏం? అయినా చెయ్యాల్సింది తప్పదని చేసుకుపోవచ్చుగా- కొన్ని ఫలితాలు ముందే తెలిసి పోతాయి అయినా ఆకాశమే విరిగిపడినట్టు బెంబేలెత్తిపోతాం ఏం? కాస్తో కూస్తో ఆశతో ధైర్యంగా ఉండొచ్చుగా- అయినా ఏ ఫలితాల గురించి […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-అక్టోబర్, 2024

“నెచ్చెలి”మాట  నిష్పాక్షి“కత” -డా|| కె.గీత  నిష్పాక్షికతఅనగానేమి?పాక్షికతఅనునది…. లే.. ఏ “కత”?అయ్యో ఏకతకాదూ ఏ కతా కాదు హయ్యో-కథ కానిది ఎవరి పక్షానా లేనిది మాకెందుకు? మాక్కావల్సిందిబఠాణీ కాలక్షేపంలా ఏదొక పక్షాన నిలబడి తన్నుకొనుట- ఎవరొకరి మీద పుకార్లు వెదజల్లుట- సనాతనమనో సమంతా అనో “జై” అనో “డై” అనో వద్దనుటకు కాదనుటకు మీదే పక్షం? ఈ పక్షపాతాలు వద్దనేనా మీ గోలంతా? అది కాదండీ అసలు “నిష్పాక్షిక” రాతలున్నాయా?“నిష్పాక్షిక” వార్తలున్నాయా?“నిష్పాక్షిక” పార్టీలు ఉన్నాయా?“నిష్పాక్షిక” ప్రభుత్వాలు ఉన్నాయా? అసలు […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-సెప్టెంబర్, 2024

“నెచ్చెలి”మాట  వైపరీత్యం -డా|| కె.గీత  ఈ మధ్య ఏవిటో అన్నీ విపరీతాలే! ఎండకి ఎండా వానకి వానా చలికి చలీ మంచుకి మంచూ భూగోళమంతా గందరగోళం అయోమయం ఏవిటీ విపరీతాలంటే వాతావరణం గురించా! మనుషుల గురించేమో అనుకున్నాలెండి.. అంటే కొందరు అయితే ఎక్కడలేని ప్రేమా చూపించెయ్యడం లేకపోతే పాతాళానికి తొక్కెయ్యడం ఇంకా కొందరైతే ప్రేమ నటిస్తూ వెనక గోతులు తియ్యడం ఇక మరి కొందరు డబ్బు కోసమే ఆప్యాయతలు కొనితెచ్చుకోవడం ఇక… చాలు బాబోయ్ చాలు మనుషుల్లో […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఆగష్ట్, 2024

“నెచ్చెలి”మాట  ఫ్లెక్సీ -డా|| కె.గీత  జన్మదిన శుభాకాంక్షలు! చాలా థాంక్సండీ- ఇంతకీ ఎవరికి? అదేవిటీ? నిలువెత్తు బొమ్మతో వీథి మొదట్లో నించి ఊరి నలుమూలలా ఫ్లెక్సీలు వేయించాం కదా! అందుకే సందేహం వచ్చింది పోస్టరులో మధ్య ఉన్న బొమ్మదా? చుట్టూ ఉన్న పది పదిహేను బొమ్మలదా? అంటే స్థానిక ఛోటా మోటా నాయక లక్షణాలున్న ఎవరికో బర్త్ డే అని చెప్పి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరో మంత్రి మరో నాయకురాలు ఇలా ఇందరి ఫోటోల్లో శుభాకాంక్షలు […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-జులై, 2024

“నెచ్చెలి”మాట  5వ జన్మదినోత్సవం! -డా|| కె.గీత  ఇవేళ “నెచ్చెలి” విజయవంతంగా  5వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఆత్మీయంగా నెచ్చెలి కోసం రచనలు చేస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ  పేరుపేరునా ప్రత్యేక నెనర్లు! “నెచ్చెలి” తెలుగు అంతర్జాల స్త్రీల పత్రికలలోనే కాకుండా, అంతర్జాల పత్రిక లన్నిటిలోనూ అగ్రస్థానంలో ముందుకు దూసుకుపోతూ ఉంది! ఇందుకు కారణభూతమైన పాఠకులైన మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు!           5వ జన్మదినోత్సవ శుభ కానుకగా ఈ అయిదవ వార్షిక సంచికని […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-జూన్, 2024

“నెచ్చెలి”మాట  నిజంగా సంబరాల వేళేనా? -డా|| కె.గీత  హమ్మయ్య- ఓట్లపం(దం)డగ పూర్తయింది! అదేవిటండీ పండగ దండగెలా అవుతుందీ …. అదేలెండి ఓట్లు దండుకోవడం పూర్తయింది! లెక్కా పూర్తయింది! గెలుపోటముల బేరీజుల్లో సంబరాలు- ఉత్సవాలు- మొదలాయెను! మరి నియంతృత్వాలు- మతతంత్రాలు- రూపుమాయునా? మారురూపెత్తునా? అసలు నిజంగా సంబరాల వేళేనా? ప్రమాణ స్వీకారోత్సవాల పర్యంతం నిలిచే ప్రమాణాలెన్నో ప్రజాధనపు స్వీకారాలెన్నో మరి పం(దం)డగ మామూలు ఖర్చా?! అంతకంతా వెనక్కి రాబట్టుకోవద్దూ! రాజధానులు- రహదారులు- ఆనకట్టలు – గనులు- పరిశ్రమలు – […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-మే, 2024

“నెచ్చెలి”మాట  ఎన్నికలనగా- -డా|| కె.గీత  ఎన్నికలు అనగా నేమి? నిష్పక్షపాత నిర్బంధరహిత… …… అడిగింది ఉపన్యాసం కాదండీ పోనీ అతిపెద్ద ప్రజాస్వామ్యదేశ వ్యవస్థీకృత… …… అడిగింది నిర్వచనం కాదండీ అసలు అడిగింది ఏవిటి? అడగడం ఏవిటి? మీకేం తెలుసో కనుక్కుంటుంటేనూ? ఓహో అలా వచ్చారా! అయినా ఏముందిలెండి! టీవీల్లో యూట్యూబు ఛానెళ్ళలో సోషల్ మాధ్యమాల్లో ఊదరగొట్టడం చూడ్డం లేదా? ఎన్నికలనగా ఒకరినొకరు తిట్టుకొనుట- ఆడిపోసుకొనుట- దుమ్మెత్తి పోయుట- ఏసీ బస్సులో షికారు కొచ్చే నాయకుల పదినిమిషాల ఉపన్యాస […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఏప్రిల్, 2024

“నెచ్చెలి”మాట  సంపూర్ణ గ్రహణం -డా|| కె.గీత  చారిత్రక గ్రహణం ఎన్నేళ్ళకో గానీ రానిదొస్తోందట! చూసేందుకు వెళ్తున్నారా? అమెరికాలో ఉన్నాకా చూడక ఛస్తామా- వేల డాలర్లు పోసి మరీ ప్రయాణించి చూడకపోతే కొంపలు మునిగిపోవూ?! మరి ఇతరప్రాంతాల ఇతరదేశాల మాటేవిటో! అసలు చూడని చూడకూడని వారి సంగతి ఏవిటో? ఆ… ఎన్ని గ్రహణాలు చూడడం లేదు! అసలు మానవజాతికి పట్టిన గ్రహణాలు అన్నా… ఇన్నా… అంటారా? నిజమే- యుద్ధాలు రాజ్య దాహాలు ఆయుధ కుతంత్రాలు ఎలక్షను బెదిరింపులు ఎన్ని […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-మార్చి, 2024

“నెచ్చెలి”మాట  మహిళాదినోత్సవం! -డా|| కె.గీత  సంవత్సరానికోసారి గుర్తొస్తుందండోయ్!మహిళలకో దినోత్సవమని! అంటే మహిళలకి సెలవేదైనా… కాస్త సాయమేదైనా…. ఉచిత బస్సు టిక్కెట్టుతాయిలం లాంటిదేదైనా…. అబ్బేఅవేవీ కావండీ- పోనీ పొద్దుటే కాఫీ అందించడం… ఆ వంటేదో చేసి పెట్టడం… ఇంటిపని ఓ రోజు చూసిపెట్టడం… వంటివేవైనా కాకపోయినా ఓ పూలగుత్తో ఓ సినిమానో ఓ షికారో అబ్బేబ్బేఅంతంత ఆశలొద్దండీ- మరేవిటో మహిళా దినోత్సవమని సంబరాలు! అదేనండీ-ఉచితంగా వచ్చే వాట్సాపు మెసేజీలు ఫేస్ బుక్ లైకులు ఇన్స్టా గ్రాము ఫోటోలు ఇంకా […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఫిబ్రవరి, 2024

“నెచ్చెలి”మాట  ఆరోగ్యమే మహాభాగ్యం! -డా|| కె.గీత  ఆరోగ్యమే మహాభాగ్యం! శరీరమాద్యం ఖలు ధర్మసాధనం!! అవునండీ అవును- తెలుసండీ తెలుసు- అన్నీ ధర్మ సూక్ష్మాలూ తెలుసు- అయినా ఇప్పుడు ధర్మ సూక్ష్మాలు ఎందుకో! అదేమరి! మానవనైజం!! ఏదైనా ముంచుకొచ్చేవరకూ పట్టించుకోం పట్టించుకునేసరికే ముంచుతుంది ఏవిటట? ముంచేది- మునిగేది- హయ్యో అదేనండీ ఆరోగ్యవంతమైన శరీరం- శరీరపుటారోగ్యం- తెలుసండీ తెలుసు- అన్నీ తెలుసు- కానీ ఇన్నేసి పనులు చెయ్యకపోతే కొంపలు మునిగిపోవూ! “పోవు” అసలే జీవితం క్షణభంగురం హయ్యో! ఇక్కడా ధర్మ […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-జనవరి, 2024

“నెచ్చెలి”మాట  సరికొత్త 2024వ సంవత్సరం! -డా|| కె.గీత  నూతన సంవత్సరంలోకి వచ్చేసాం! నూతనం అని అనుకోవడమే వినూత్నంగా ఉంటుంది కదూ! కొత్తదేదైనా వింతే! మార్పు ఎప్పుడూ ఆహ్వానించదగినదే! కొత్తదనం సువాసన- ఉత్సాహం- బలం- వేరు కదూ! కానీ కొన్ని పాతలు- జ్ఞాపకాలు- శిథిలాలు- బాధలు- నిరంతరం వెంటాడాల్సినవీ అంతర్లీనంగా భద్రంగా మోసుకెళ్ళడమే కొత్తదనానికి ఆభరణం కదూ! కొన్ని ముగిసిన కథల్ని కొన్ని ఆగిపోయిన పేజీల్ని కొన్ని విరిగిపోయిన మనసుల్ని కొత్తగా మళ్ళీ మొదలెట్టడమే జీవితం కదూ! ఎప్పటికీ […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-డిసెంబర్, 2023

“నెచ్చెలి”మాట  ఫలితం -డా|| కె.గీత  ఫలితం అనగానేమి? ఫలించినది- అయ్యో! నిఘంటువుల్లో ఏవుంటే మనకెందుకండీ- మరేవిటండీ? మరో మాట చెబుదురూ! అయితే ప్రారబ్ధం- కర్మ – తలరాత – చేజేతులా చేసుకున్నది – వగైరా… వగైరా? మరీ అంత నిష్టూరం మాటలెందుగ్గాని మరో మాట చెబుదురూ! ఎన్నుకున్న వారికి దొరికినది మార్పు కోసం ఎదురుచూసినవారికి లభించినది ఆ ఇప్పుడు వస్తున్నారు దారికి – ఫలితమనగా రాజకీయంబున పండినది మరోదారిలేనిదీ కొత్త చూపు కొత్త దారీ కొత్త ప్రభుత్వం….. […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-నవంబర్, 2023

“నెచ్చెలి”మాట  వాగ్దానాలు – వరదలు -డా|| కె.గీత  బాబోయ్ వాగ్దానాలు! అదేదో వరదొచ్చినట్టు అయ్యో వరదలండీ వరదలు! వాగ్దానాల వరదలా? వరదల వరదలా? రెండూనూ- ఏది మంచిది? ఎవరికి? ఏలినవారికా! ఏలుతున్నవారికా! ఏలబోయేవారికా! వారికన్నీ మంచివే! ఆర్చేవారా! తీర్చేవారా! నోటి మాటేగా వాగ్దానాలా? వరదలా? రెండూనూ- ఒకటి కంటిమెరుపులకీ రెండు కంటితుడుపుకీ మనబోటి ససామాన్యుల సంగతో! మన సంగతే చెప్పుకోవాలా? వాగ్దానానికి పొంగీ- వరదొస్తే కుంగీ- అయినా అయిదేళ్ళకోసారేగా ఏడాదికోసారి వస్తూనే ఉన్నాయిగా అయినా మన పిచ్చి […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-అక్టోబర్, 2023

“నెచ్చెలి”మాట  సత్యమేవజయతే -డా|| కె.గీత  సత్యమేవజయతే! అంటే ఏవిటంటారు? అయ్యో ఎలక్షన్లు వస్తున్నాయి ఆమాత్రం తెలీదా? సత్యమే జయించును కాబట్టి సత్యమే పలుకవలెను అర్థం బావుంది కానీ ఆ పేరు గల వారెవరూ నిలబడ్డం లేదే ! అయినా నిలబడ్డ వాళ్ళంతా సత్యమే పలుకుతారనా? అయ్యో నిలబడ్డ వాళ్ళుకాదండీ- వారితో పోటీ చేసేవారు ఎదుటివారిని ఓడించడానికి లోపాయకారిఆయుధంలా తవ్వి తీస్తారే అదన్నమాట! అమెరికాలోనా? ఇండియాలోనా?యూరప్ లోనా? ఎక్కడైనా పరిస్థితి ఒక్కటే సత్యము పలికే విధానంబు మాత్రమే వేరు […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-సెప్టెంబర్, 2023

“నెచ్చెలి”మాట  అంతర్యాన్ -డా|| కె.గీత  ఔరా చంద్రుని పై భారతయాన్ కాలుమోపినట! అదేనండీ చంద్రయాన్ – అక్కణ్ణించి చూసి కుందేలు ఏమనుకుంటుందో మరి! తన తలకాయంత లేని దేశంలో చీమ తలకాయంత లేని మనిషి ఇంతదూరపు యానం ఎలా చేసాడబ్బా! అనో- అక్కడ ఆకలితో మలమలమాడే పొట్టలు నింపడం కంటే తను సంచరించే ప్రదేశంలో ఏముందోనన్న ఉత్సుకతకే ఎక్కువ ఖర్చుపెడుతున్నారు వీళ్ళు! అనో- అది చంద్రయాన్ అయితే ఏవిటి మంగళ బుధ ఆదిత్య యాన్ అయితే ఏవిటి […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఆగస్టు, 2023

“నెచ్చెలి”మాట  సిగ్గు సిగ్గు -డా|| కె.గీత  మహాభారతం నించి మణిపూర్ దాకా క్రీస్తు పూర్వపు వేల యుగాల నుంచి క్రీస్తు శకం 2023 వరకు లిఖించ బడనీ బడకపోనీ ఒక్కటే చరిత్ర ఒక్కటే వర్తమానం సిగ్గు సిగ్గు దేశమా సిగ్గు సిగ్గు స్త్రీ దేహమే మొదటి దురాక్రమణ బుద్ధిలేని బుద్ధిరాని ప్రపంచమా సిగ్గు సిగ్గు స్త్రీ దేహమే మొదటి అంగడి వస్తువు మొదటి బలిపశువు సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మనింటి మనుషులు కాదు కదా మనకెందుకు […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-జూలై, 2023

“నెచ్చెలి”మాట  చతుర్థ జన్మదినోత్సవం! -డా|| కె.గీత  ఇవేళ “నెచ్చెలి” విజయవంతంగా  చతుర్థ జన్మదినోత్సవాన్ని జరుపు కుంటూ ఉంది.  ఆత్మీయంగా నెచ్చెలి కోసం రచనలు చేస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ  పేరుపేరునా ప్రత్యేక నెనర్లు!  “నెచ్చెలి” తెలుగు అంతర్జాల స్త్రీల పత్రికలలోనే కాకుండా, అంతర్జాల పత్రికలన్నిటిలోనూ అగ్రస్థానంలో ముందుకు దూసుకుపోతూ ఉంది! ఇందుకు కారణభూతమైన పాఠకులైన మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు!  చతుర్థ జన్మదినోత్సవ శుభ కానుకగా ఈ చతుర్థ వార్షిక సంచికని  మీకు అందజేస్తున్నాం.   ఈ చతుర్థ వార్షిక […]

Continue Reading
Posted On :
K.Geeta

సంపాదకీయం- జూన్, 2023

“నెచ్చెలి”మాట  పురుషులతోడిదే జీవనం -డా|| కె.గీత  ఇదేవిటి? పురుషులతోడిదే జీవనం స్త్రీలతోడిదే జీవనం ఉండునా? నామమాత్రపు స్త్రీలతోడిదే జీవనం ఎక్కడో ఉన్నప్పటికీ ఖచ్చితంగా పురుషులతోడిదే జీవనం ఉండును అసలిది మీకు తెలుసా! పురుషులతోడిదే జీవనం అని నమ్మడం కళ్ళు మూసుకుని జీవించడం ఒక్కటే- తండ్రి అన్నయ్య తమ్ముడు భర్త కొడుకు బంధమేదైనా బతుకు ఎవరికో ఒకరికి అప్పగించి నిశ్చింతగా పచారీలు తెచ్చుకోవడం తెలుసుకోకుండా టీవీ చూస్తూ గడిపే జీవితం బానే ఉండును- కాదు కాదు బహు భేషుగ్గా […]

Continue Reading
Posted On :
K.Geeta

సంపాదకీయం- మే, 2023

“నెచ్చెలి”మాట  చిన్న జీవితం! -డా|| కె.గీత  చిన్న జీవితం అనగా నేమి? వేదాంతంబు కాదు నిజ్జంబుగ నిజ్జమే పేద్ద జీవితం అనుకుని ఎన్నో వాయిదాలు వేస్తాం ఒక కలయికనీ- ఒక ముఖాముఖినీ- చివరికి ఒక పలకరింపునీ – కానీ చిన్న జీవితం అని ఎప్పుడు అర్థం అవుతుందీ? మన కళ్ళెదురుగా ఉన్న మనుషులు అర్ధాంతరంగా మాయమైపోయినప్పుడు ఎంత రోదించినా ఏవీ వెనక్కి రానప్పుడు జ్ఞాపకాలు మాత్రమే చెవుల్లో రొద పెడుతున్నప్పుడు మరి చిన్న జీవితం అని తెల్సిపోయేకా […]

Continue Reading
Posted On :
K.Geeta

సంపాదకీయం- ఏప్రిల్, 2023

“నెచ్చెలి”మాట  శోభకృత్ ఉగాది! -డా|| కె.గీత  శోభకృత్ ఉగాది అంటే శోభని కలగజేస్తుందట! పండుగ రానూ వచ్చింది పోనూ పోయింది లోకంలో ఎక్కడన్నా శోభ వుందా? కళ వుందా? కాంతి వుందా? అయ్యో అసలు శోభ ఎక్కణ్ణించొస్తుందీ?! దిక్కుమాలిన ప్రపంచం మారి చస్తేనా? ఓ పక్క సంవత్సరం దాటుతున్నా యుద్ధం ఆగదు- కాదు.. కాదు… ఆగనిస్తేనా? దురాక్రమణలూ ఆయుధ కుతంత్రాలూ ఆగి చస్తేనా?! ఇక శోభ ఏవిటి? కళ ఏవిటి? కాంతి ఏవిటి? మరో పక్క భూకంపాలు […]

Continue Reading
Posted On :
K.Geeta

సంపాదకీయం- మార్చి, 2023

“నెచ్చెలి”మాట  ధైర్యం చెబుతున్నామా? -డా|| కె.గీత  ఏది ముఖ్యం? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? గొప్ప చదువు పేద్ద ఉద్యోగం బాగా డబ్బు సంపాదన ప్రశ్నలు వేసుకుంటూ కూచుంటే పిల్లలకేం చెబుతాం? వాళ్ళ గొప్ప చదువులు వాళ్ళ పేద్ద ఉద్యోగాలు వాళ్ళ డబ్బు సంపాదనలు వాళ్ళకంటే మనకే కదా ముఖ్యం పొరుగు వాళ్ళతో పోటీ బంధుమిత్రులతో పోటీ అన్నిటికీ అన్నిటిలో మన పిల్లలే గెలవాలన్న అర్థం లేని పోటీ అన్నీ గొప్పవిషయాలే చెబుతాం బాగా చదువు పేద్ద ఉద్యోగం […]

Continue Reading
Posted On :
K.Geeta

సంపాదకీయం- ఫిబ్రవరి, 2023

“నెచ్చెలి”మాట  హక్కులు -డా|| కె.గీత  హక్కు అనగానేమి? బాధ్యత.. అధికారము.. స్వామ్యము.. అబ్బా! నిఘంటువుల్లోని అర్థాలు కాదండీ- అసలు హక్కులు అనగానేమేమి? సమానత్వపు హక్కు- స్వాతంత్య్రపు హక్కు- దోపిడిని నివారించే హక్కు- మతస్వాతంత్య్రపు హక్కు- సాంస్కృతిక హక్కు – విద్యాహక్కు- రాజ్యాంగ పరిహారపు హక్కు- ఆస్తి హక్కు – అనబడు రాజ్యాంగ బద్ధమైన ప్రాథమిక హక్కులు మరియు…. అబ్బా! అరిగిపోయిన విరిగిపోయిన పగిలిపోయిన అలిసిపోయిన రికార్డు హక్కులు కాదండీ…. రోడ్డెక్కిన హక్కులు బైఠాయించిన హక్కులు పోరాడుతూనే వున్న […]

Continue Reading
Posted On :