image_print

కనక నారాయణీయం-63

కనక నారాయణీయం -63 –పుట్టపర్తి నాగపద్మిని ‘ఇంతకూ ఎందుకప్పా ఇట్లా వచ్చినావు?’ అయ్యగారు కాఫీ స్టీల్ కప్పు తీసుకోగానే తానూ కప్పు చేతిలోకి తీసుకుని కింద పెట్టి గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేశాడా శిష్య పరమాణువు. ‘అదే స్వామీ! మా స్కూల్ లో లైబ్రరీకి తీసుకోవాలసిన పుస్తకాలు, విద్యార్థులకు ఉపకరించేవి మీకు ఆ లిస్ట్ చూపించి వెంకట్రామా అండ్ కోలో కొందామని వచ్చినాను.’ ‘బాగుందిరా! ప్రతిసారీ యీ విధంగా నా సలహా కావాలంటే కష్టం. నేను ఊరిలో […]

Continue Reading

కనక నారాయణీయం-62

కనక నారాయణీయం -62 –పుట్టపర్తి నాగపద్మిని           ఈ ఆలోచనలిటు ప్రయాణిస్తూ ఉండగానే, యధాలాపంగా పుట్టపర్థి తన గదిలో భద్రపరచుకుని ఉన్న విజయనగర చరిత్రకు సంబంధించి తాను ప్రత్యేకంగా ఒక చోట పెట్టుకున్న సామగ్రిలోనుంచీ, ‘అళియ రామ భూపాలుడు’ అన్న పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. కారణమేమిటో తెలియదు కానీ అళియ రామరాయలంటే తనకు చాలా ఆరాధన. చరిత్రకారులు అతన్నిఅహంభావిగా, రాజ్యకాంక్ష కలిగినవానిగా క్రూర కర్కశ హృదయునిగా  చిత్రీకరించినా అతని సాహసం, రాజనీతి […]

Continue Reading

కనక నారాయణీయం-61

కనక నారాయణీయం -61 –పుట్టపర్తి నాగపద్మిని శ్రీ చపలకాంత్ భట్టాచార్య లేచి, పుట్టపర్తిని వాటేసుకున్నారు.’తెలుగు భాష ఎంత మధురమైనదో యీరోజు నాకు అర్థమైంది. గ్రాంధికమైన తెలుగు భాషకూ, సంస్కృతానికీ పెద్ద తేడా లేదని పుట్టపర్తి రచన ద్వారా తెలిసింది. ఆయన అచ్చ తెనుగులో వ్రాసిన భాగం కూడా వారి నాట్యాభినయం సాయంతో అర్థమైనట్టే అనిపించింది. అది లేకున్నా, వారి పఠనం శక్తివంతం కావటం వల్ల, అదేమిటో, పుట్టపర్తి చదివినదంతా నాకు అవగతమైపోయినట్టే భావన. అదే కవిత్వం శక్తి, […]

Continue Reading

కనక నారాయణీయం-60

కనక నారాయణీయం -60 –పుట్టపర్తి నాగపద్మిని నాకు బాల్యంలోనే సంగీతంతో గట్టి బంధం ఏర్పడింది. దానికి తోడు భక్తి తత్వం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంది. సాహిత్యాన్వేషణ ఎటూ ఉంది. ఈ ముప్పేటల బంధం, నన్ను ఎప్పుడూ ఏవో కొత్త గొంతుకలతో అహ్వానిస్తూనే ఉంటుంది. నేను ఎక్కడ ఏ సాహిత్యాన్ని  చదివినా, సంగీతపరంగా విన్నా, భక్తి తత్త్వ నేపథ్యంలో ఒడలు పులకరించేలా తన్మయత్వ భావనకు లోనైనా, నా అంతరంగంలో ఏదో ఘర్షణ మొదలవు తుంది. అటువంటి […]

Continue Reading

కనక నారాయణీయం-59

కనక నారాయణీయం -59 –పుట్టపర్తి నాగపద్మిని సభాప్రాంగణం చేరుకున్న పుట్టపర్తికి తాంబూల భరిత అరుణారుణిమలు స్వాగతం పలికాయి. యాజులు గారు హడావిడిగా తిరుగుతున్నారు. ఇంతకూ, నీలం సంజీవ రెడ్డి గారు ఏదో రాజకీయ కార్యాల వల్ల రావటం లేదని తెలిసింది. అధ్యక్షులు ఎవరుంటారా అన్న చర్చ జరుగుతున్నది. చపల కాంత భట్టాచార్య గారే సభా సారధ్యానికి  ఒప్పుకున్నా రని తెలిసింది. కాసేపటికే సభ ప్రారంభమైంది. క్రిక్కిరిసిన సభా మండపంలో శ్రీమతి మీనాక్షి కుమారి సత్యవతి మధురంగాప్రార్థనా గీతం […]

Continue Reading

కనక నారాయణీయం-58

కనక నారాయణీయం -58 –పుట్టపర్తి నాగపద్మిని ఎప్పుడో కేరళ ఉద్యోగ సమయంలో వ్రాసిన త్యాగరాజ సుప్రభాతం సంస్కృత రచన తెలుగు తాత్పర్యంతో ప్రొద్దుటూరు అభిమానులు ముద్రించారు. అది పుట్టపర్తికి ఎంత గానో సంతృప్తినిచ్చింది. సారంగ రాగ మధుర స్వర పూరితేన వక్రేణ రమ్య కమలాకర మార్గ చారీ భృంగ: కరోతి భగవద్భజనం సతృష్టం శ్రీ త్యాగరాజ భగవన్, తవ సుప్రభాతం! వికసించిన కమలముల మీద తుమ్మెదలు తిరుగాడుతున్నాయి. వాటి ఝుంకారం సారంగ రాగాన్ని పోలి ఉంది.అవన్నీ భగవద్భజనమొనర్చుచున్నాయి. […]

Continue Reading

కనక నారాయణీయం-57

కనక నారాయణీయం -57 –పుట్టపర్తి నాగపద్మిని           ‘అమ్మవారి చిరునవ్వు చూసి బాలుడిగా ఉన్న అతను, ముగ్ధుడై పోయి ‘అమ్మా,  నీ చిరునవ్వు ముందు, మల్లెల కాంతులు కూడా  ‘ కుహనా మల్లీమతల్లీరుచ ‘ నకిలీ మల్లె పూలా, అన్నట్టు,  వన్నె తగ్గి పోతాయి అన్నాడంట ఆయన! కామాక్షీ దేవి నవ్వుల కాంతు లు అంత స్వచ్చంగా మల్లెపూవులనే చిన్నబుచ్చే విధంగా ఉన్నాయంట! పోనీలే! నీ వల్ల నేనీరోజు మూక పంచ […]

Continue Reading

కనక నారాయణీయం-56

కనక నారాయణీయం -56 –పుట్టపర్తి నాగపద్మిని వెంటనే పుట్టపర్తి అందుకున్నారు, “ఆదీప్త వహ్ని సదృశై: మరుతావధూతై: సర్వత్ర కింశుక వనై: కుసుమావనమ్రై: సద్యో వసంత సమయేన సమాగతేయం రక్తాంశుకా నవ వధూరివ భాతి భూమి:.’ ఎంతో గొప్ప వర్ణన! కింశుక వృక్షం వసంత కాలానికి ప్రతీకగా ఎందరో కవులు అద్భుతంగా వర్ణించారు. నిండుగా విరగబూచిన పలాశ, అదే మోదుగ చెట్ట్లు ఎటు జూసినా కనబడుతున్నాయి. ఇలా భూమిని చూడగానే, కాళిదాసుకు అరుణారుణ వస్త్రాలు ధరించి నిలచి ఉన్న […]

Continue Reading

కనక నారాయణీయం-55

కనక నారాయణీయం -55 –పుట్టపర్తి నాగపద్మిని           ఇంతలో కింద నుండి నాగపద్మిని వచ్చి, అయ్యా, మిమ్మల్ని స్కూల్ కు రమ్మంటు న్నారంట! ఎవరో వచ్చినారని చెప్పమనిందమ్మ!’ అని చెప్పింది.           పుట్టపర్తి ,’ఆ అవును, మర్చేపోయినాను. పదరా నాయనా! స్కూల్ లో ఏ పని పడిందో నాతో! పోవాలప్పా!’ అంటూ లేచారు.           ఇద్దరూ మిద్దె నుండి దిగి […]

Continue Reading

కనక నారాయణీయం-54

కనక నారాయణీయం -54 –పుట్టపర్తి నాగపద్మిని           ‘జీవితంలో సందర్భమేదైనా అన్నిటికీ తులసీ రామాయణంలోని ఘట్టాలను పాడుకుంటారు వాళ్ళు. మనసారా ఆయనను స్మరించుకోవడం వాళ్ళలోని గొప్ప గుణం రా!! నాకప్పుడే అనిపించింది, రాస్తే గీస్తే ఇటు వంటి రామయణం రాయాలబ్బా అని. నాకెదో పద్ధతిగా బాలకాణ్డే వ్రాయాలన్న నియమమెమీ లేదప్పా!! ముందు కిష్కింధ వ్రాసు కున్నా! అందులోని ఘట్టాలు నన్నావైపు ఆకర్షించినాయి. ఇదుగో ఇప్పుడు, బాలకాండ వ్రాస్తున్నా. అందులోని ఒక ఘట్టమే […]

Continue Reading

కనక నారాయణీయం-53

కనక నారాయణీయం -53 –పుట్టపర్తి నాగపద్మిని చంపకములు, తిమిశమ్ములు, తిలక మ్ములు తాలమ్ములు మొగళ్ళు, పద్మక ములు నతిముక్తకములు, వకుళమ్ములు తమాలములు హింతాలములూ.. కిష్కింధలో తార పాత్ర పై తాను ప్రత్యేక దృష్టిపెట్టి వ్రాసుకున్నాడు. శివతాండవం, మేఘ దూతం వలెనే రగడ వృత్తంలో రచనను సాగించాడు తాను. ఇందులోనూ! లయాత్మకంగా, హాయిగా పాడుకునే వీలు ఇందులోనే కదా ఉన్నది. పైగా తన లక్ష్యమూ అదే! ఆ ఉత్సాహం రెట్టింపై, జనప్రియ రామాయణ బాలకాండ వ్రాస్తున్న తరుణమిది. రామాయణానికి వైష్ణవ […]

Continue Reading

కనక నారాయణీయం-52

కనక నారాయణీయం -52 –పుట్టపర్తి నాగపద్మిని కేరళలో తను పని చేసింది కొద్ది సంవత్సరాలే ఐనా, అక్కడి విలక్షణ సంస్కృతి  చాలా ఆకట్టుకుంది తనను! మలయాళం చాలా వరకూ సంస్కృత పదాలతో నిండి ఉంటుంది. కొద్దిగా కర్త, కర్మ, క్రియాపదాలూ, వ్యాకరణాంశాలు ఒంటబట్టించుకుంటే మెల్లి మెల్లిగా భాష అర్థమౌతుంది. అదీ కాక అ భాష వాడకంలోని ఒక తూగు చాలా నచ్చుతుంది తనకు! సాహిత్య పరంగా కూడా విలక్షణ వైఖరుల సమాహారం. మళయాళ సాహిత్యంలో చంద్రోత్సవం కావ్యంలోని […]

Continue Reading

కనక నారాయణీయం-51

కనక నారాయణీయం -51 –పుట్టపర్తి నాగపద్మిని రాత్రి పుట్టపర్తికి వెంకటసుబ్బయ్య ఇంట్లోనే పడక.           బాగా అలసిపోయిన పుటపర్తి స్వామి భోజనం తరువాత మంచం మీద అలా వాలీ వాలగానే నిద్రలోకి జారుకున్నారు. పక్కనే కూర్చుని విసన కర్రతో వారికి గాలితగిలేలా   మెల్లగా విసురుతున్న వెంకటసుబ్బయ్యకు వీరు రేపేగదా మళ్ళీ కడపకు వెళ్ళిపోతారన్న సంగతి గుర్తుకు వచ్చి, ఏదో వెలితి ఏర్పడబోతున్నదన్న భావం కలిగింది.           […]

Continue Reading

కనక నారాయణీయం-50

కనక నారాయణీయం -50 –పుట్టపర్తి నాగపద్మిని           ‘ఎదురుగా హిమాలయ శిఖరాలు! వారి వారి స్థాయిలను బట్టి కూర్చుని ఉన్న దేవతలందరి నిర్నిమేష దృక్కులూ ఒకే చోట కేంద్రీకృతాలై ఉన్నాయి. డమరుక విన్యాసాలూ, శంఖ ధ్వనులూ, వీణా వేణు నాదాలూ, జతుల సందడులూ – అన్నిటితో కూడిన సర్వేశ్వరుని నాట్య చాతుర్య దృశ్యాలు!           ఏమానందము భూమీతలమున ! అదిగదిగో! బంగారు రంగుల మబ్బులు, నెమ్మది […]

Continue Reading

కనక నారాయణీయం-49

కనక నారాయణీయం -49 –పుట్టపర్తి నాగపద్మిని  సభలో నిశ్శబ్దం. పుట్టపర్తి చెప్పే విధానం అటువంటిది మరి.           ‘అస్థిరం జీవితంలోకే’ అనికదా అన్నారు? కీర్తి ధనమే స్థిరం. విజయనగర రాజులు సంస్కృతికి చేసిన సేవ స్థిరంగా ఉంటుంది. అంతే! వారు చేసిన సాహిత్య సేవ అనుపమానమైనది. అంతే కదూ? కృష్ణదేవరాయల వారి జయంతి ఉత్సవాలు కూడా మా ఊళ్ళో బాగా వైభవంగా జరిగేవప్పట్లో!! అప్పుడు మా అయ్య అంటే మీ మాటల్లో […]

Continue Reading

కనక నారాయణీయం-48

కనక నారాయణీయం -48 –పుట్టపర్తి నాగపద్మిని           గ్రంథంలోని అక్షరాలవెంట పుట్టపర్తి ఆలోచనలు పరుగులు పెడుతుంటే, చిత్తూరు బస్సు, తన గమ్యం వైపుకు పరుగులు పెట్టి పెట్టి చివరికి బస్టాండ్ చేరింది.’చిత్తూర్ చిత్తూర్..’ అని కండక్టర్ అరిచిన అరుపుకు పుట్టపర్తి ఉలిక్కిపడి  ఇహలోకానికి వచ్చారు. బస్సు ఆగింది. ప్రయాణీకులు మెల్లిగా దిగుతున్నారు. పుస్తకంలో తాను చదువుతున్న పుట కుడి పై భాగాన గుర్తుగా కాస్త మడిచి, చేతి సంచీలో పెట్టుకుని, మెల్లిగా […]

Continue Reading

కనక నారాయణీయం-47

కనక నారాయణీయం -47 –పుట్టపర్తి నాగపద్మిని           ‘ఆ..అట్నే ఉన్నాం స్వామీ. ఇంతకూ, నేనొచ్చిన సంగతేమంటే, మదనపల్లి దగ్గర అరగొండ పాఠశాల వాళ్ళూ మిమ్మల్ని సన్మానించుకుంటారంట వచ్చే నెల! అక్కడ మీకొక ఏకలవ్య శిష్యోత్తముడున్నాడు. పేరు వల్లంపాటి వెంకట సుబ్బయ్య. శివతాండవ మంటే ప్రాణమనుకోండి. ఈ మధ్య చిత్తూరులో కలిసినాడు. అప్పుడు, నేనక్కడున్నంత సేపూ  శివతాండవమూ, ప్రబంధ నాయికలు గురించే కలవరిస్తూ ఉన్నాడు. మీరేమో ఇట్లా ఉన్నారు కదా! వచ్చేనెలలో అక్కడ […]

Continue Reading

కనక నారాయణీయం-46

కనక నారాయణీయం -46 –పుట్టపర్తి నాగపద్మిని           పెళ్ళి తరువాత రంగయ్య సత్రంలో పనులన్నీ చక్కబెట్టుకున్న తరువాత, కడపకు వెళ్ళిపోవాలి. కానీ బాగా పొద్దుపోవటం వల్ల బస్సులు దొరకవు. ఒక వాన్ లో తక్కినవాళ్ళూ, పెళ్ళికూతురూ పెళ్ళికొడుకూ, పుట్టపర్తి దంపతులు వెళ్ళటానికి కారును ఒకదాన్ని తీసుకుని వచ్చాడు సుబ్రమణ్యం. కారులో పుట్టపర్తి దంపతులూ, కొత్త పెళ్ళి జంట కూర్చున్నారు. గట్టిగా మాట్లాడితే ప్రొద్దుటూరు నుండీ కడపకు మూడు గంటల ప్రయాణమే!! రాత్రి […]

Continue Reading

కనక నారాయణీయం-45

కనక నారాయణీయం -45 –పుట్టపర్తి నాగపద్మిని అమ్మరో కౌసల్య! అతివ సుకుమారియగు, ఇమ్మహీజాత గైకొమ్మ వేవేగ సమ్మతిని నీ సుతను సమముగా జూతువని నమ్మి మదిలోన మా యమ్మనొప్పించితిని..అమ్మరో కౌసల్య…           ఇలా పల్లవి వ్రాసుకున్న తరువాత, చరణాల కోసం కలం ఆగింది. ఇంతలో తరులత వచ్చింది బుంగమూతి పెట్టుకుని, ‘అమ్మా!!జడవేయమ్మా!! తలంటావు కదా!! బాగా చిక్కు పడింది. వేసుకోవటం రావటం లేదు. అక్కయ్య కసురుకుంది వేయమంటే!!’ అంటూ !!   […]

Continue Reading

కనక నారాయణీయం-44

కనక నారాయణీయం -44 –పుట్టపర్తి నాగపద్మిని           కనకవల్లి రెండు స్టీల్ లోటాల్లో పొగలు కక్కుతున్న కాఫీతో వచ్చేవరకు, శేషమ్మ, రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి చేయవలసి రావటంలోని సాధక బాధకాలను వివరిస్తూ వున్న శేషమ్మ, ‘ అల్లుడూ, ఇంతకూ మా వియ్యంకులు ఎప్పుడు వస్తున్నారట? ‘ అని అడిగింది.           ‘ఔను, మా అయ్యకు ఉత్తరం రాయవలె! కనకా!! త్వరగా రాద్దాం యీ రోజే!!’ అనేసి, […]

Continue Reading

కనక నారాయణీయం-43

కనక నారాయణీయం -43 –పుట్టపర్తి నాగపద్మిని          సుబ్బయ్య వ్రాసిన పుస్తకం తిరగేస్తున్నారు పుట్టపర్తి. సుబ్బయ్య, తాను మదరాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుతున్నప్పటి రోజులలో (1955 ప్రాంతాలు) పుట్టపర్తి ఉపన్యాసం ఏర్పాటు చేసినప్పటి జ్ఞాపకాలను పంచు కున్న పంక్తుల పై వారి దృష్టి నిలిచి పోయింది. ఆ సంఘటన ఇప్పుడు మళ్ళీ కళ్ళముందు కదలాడినా, శిష్యోత్తముడి మాటల్లో చదవటం గొప్ప అనుభూతిగా తోచింది వారికి!!          ‘అప్పుడు నేను […]

Continue Reading

కనక నారాయణీయం-42

కనక నారాయణీయం -42 –పుట్టపర్తి నాగపద్మిని          ప్రథమ పుత్రిక చి. కరుణ వివాహ ముహూర్తం మాఘ మాసంలోనూ, ద్వితీయ కుమార్తె చి.తరులత వివాహ ముహూర్తం, వైశాఖ మాసంలోనూ వుండేలా కుదిర్చాడు, ప్రొద్దుటూరు కృష్ణమాచార్యులు!!          ఇంక రెండునెలల సమయమే ఉంది. ఈ రెండు శుభకార్యాలూ నిర్విఘ్నంగా జరిగేలా చేయమని కనకమ్మ వెంకన్నకు ముడుపు కట్టింది. పుట్టపర్తి మళ్ళీ యధాతథంగా తన రచనాలోకంలోకి ప్రవేశించటం – ఆమెకు ఆశ్చర్య […]

Continue Reading

కనక నారాయణీయం-41

కనక నారాయణీయం -41 –పుట్టపర్తి నాగపద్మిని           తరువాత కొన్ని రోజులకే  కృష్ణమాచార్యుల అధ్వర్యంలో శ్రీమాన్ దేశికాచార్యుల వారి తండ్రిగారు బాణగిరి రామాచార్యులవారి సమక్షంలోనే హొసపేట కామలాపురంలో, చిరంజీవులు కరుణాదేవి రాఘవాచార్యుల పరిణయానికి సంబంధించి నిశ్చితార్థం, లగ్న పత్రిక పెట్టుకోవటం కూడా దివ్యంగా జరిగిపోయాయి. ఈ కార్యక్రమానికి పుట్టపర్తి కాబోయే వియ్యంకుడు దేశికాచార్యులవారు ముందే చెప్పినట్టు, శ్రీమాన్ బాణగిరి శింగరాచార్యుల వారు కూడా రావటం జరిగింది. అక్కడే, వారి ఏకైక పుత్రుడు, […]

Continue Reading

కనక నారాయణీయం-40

కనక నారాయణీయం -40 –పుట్టపర్తి నాగపద్మిని           పుట్టపర్తి  ‘ఒరే కృష్ణమాచారీ!! నువ్వు జాతక బ్రహ్మవు కదా!! పిల్లల జాతకాలూ నువ్వే కదా చూసింది!! ఈ పుణ్యం కూడా నువ్వే కట్టుకో!! ముహూర్తమదీ చూసి తెలిపితే ఇక మా ఏర్పాట్లు మేము చేసుకుంటాం.’ అన్నారు.           ‘ఇదిగో!! వదినగారికి  బొట్టు పెడతాను..’ అంటూ లోపలి నుంచీ పసుపూ కుంకుమా తీసుకు వచ్చి తంగమ్మకు తాంబూలం అందించింది. […]

Continue Reading

కనక నారాయణీయం-39

కనక నారాయణీయం -39 –పుట్టపర్తి నాగపద్మిని           ఆ ఆనందకర వాతావరణంలో ముందుగా తేరుకుని, చప్పట్లు కొడుతూ నిలబడి గొంతు సవరించుకుంటూ కృష్ణమాచార్యులు అన్నాడు,’ అమ్మా, కనకమ్మా!! చక్కటి కూతురును కన్నారమ్మా మీ దంపతులు!! చదువూ, సంస్కారం, కలగలసిన సంప్రదాయ కుటుంబం మీది. సాక్షాత్తూ సరస్వతీపుత్రుడు పుట్టపర్తి వారు. ఇటు, బాణగిరి వంశోద్భవులు, లక్ష్మీసంపన్నులు దేశికాచార్యులవారు. ఇద్దరి కుటుంబాల మధ్యా బంధుత్వం ఏర్పడే శుభ సూచనలు కనిపిస్తున్నాయి..’ అనేశాడు.     […]

Continue Reading

కనక నారాయణీయం-38

కనక నారాయణీయం -38 –పుట్టపర్తి నాగపద్మిని           సాయంత్రమైంది. కనకవల్లి కాలుగాలిన పిల్లి వలెనే హడావిడిగా తిరుగుతున్నా, పుట్టపర్తి మాత్రం, మేడ మీద తన గదిలో సారస్వతాలోకనంలో మునిగి ఉన్నారు. ఆయన ధోరణి తనకు తెలిసినా, వచ్చే వారి మర్యాద కోసమైనా ఆయన కిందికి వచ్చి, నిల్చోవచ్చు గదా??’ మనసులొనే అనుకుంటూ, పెళ్ళిచూపులకు వచ్చే పెద్దల కోసం ఎదురు చూస్తూ అప్పుడే ఇంట్లోకి వచ్చిన  కనకవల్లికి, ముందుగా కృష్ణమాచార్యుల మాటలు వినబడ్డాయి,’ఆఆ..ఇదే […]

Continue Reading

కనక నారాయణీయం-37

కనక నారాయణీయం -37 –పుట్టపర్తి నాగపద్మిని ‘ఆడపిల్లలిద్దరూ పెద్దవాళ్ళౌతున్నారు. పెళ్ళీడు వచ్చేస్తూంది. కరుణ అక్కడ హైద్రాబాద్ లో బీ.ఎస్సీ. రెండో సంవత్సరంలో ఉంది. ఇదిగో, తరులత కూడ చూడండి, చెట్టంత ఎదిగింది. ఇద్దరికీ పెళ్ళిల్లు చేసి, మన బాధ్యత తీర్చుకోవలె కదా!! ఇక్కడున్న వైష్ణవ కుటుంబాలకు మనమంటే ఏదో చిన్న చూపు. వాళ్ళ ఆర్థిక స్థితి గతులు మనకంటే ఎక్కువని కాబోలు!! అప్పటికీ నేనప్పుడప్పుడు వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వస్తూ, ఆ మాటా యీ మాటా మాట్లాడుతూ,పెళ్ళీ […]

Continue Reading

కనక నారాయణీయం-36

కనక నారాయణీయం -36 –పుట్టపర్తి నాగపద్మిని            నట్టింట వెలసిన నవరత్న ఖచితమై           నట్టి ఆసనమున మెట్టి కూర్చుండియు,            పట్టు పీతాంబరముగట్టి, జగముల నేలు            నట్టి కన్నతల్లి కమలాలయను మీరు..పిలువరె.. శ్రీలక్ష్మినీ..            శ్రావణ వరలక్ష్మి పావన రూపము            భావించి మది భక్తి భావమ్ముతో నిల్పి            పూవుల షోడశ పూజల నొనరించి            కావుమమ్మ మమ్ము కంబు కంఠియని..         […]

Continue Reading

కనక నారాయణీయం-35

కనక నారాయణీయం -35 –పుట్టపర్తి నాగపద్మిని   గీ. ఎన్ని కార్యముల్ చేసినా ,ఎన్ని సుఖము       లనుభవించినా, యొక్కటి యనుగమింప,       దా మరణ కాలమున యందు – నాత్మ భక్తి       యొక్కటే దప్ప – రఘువీరుడొకడు దప్ప!!           ఎన్ని పనులుచేసినా, ఎన్ని సుఖాలనుభవించినా, మరణకాలంలో, ఆత్మ అలవరచుకున్న భక్తి, అదీ రఘువీరుడొక్కడు దప్ప ఇవేవీ అనుగమింపవు” అన్నది ఆ పరమతారకనామోపాసిని దృఢ విశ్వాసం.     […]

Continue Reading

కనక నారాయణీయం-34

కనక నారాయణీయం -34 –పుట్టపర్తి నాగపద్మిని           ఆ వీధిలోనే తరతరాలుగా స్థిరపడిన  పేరుమోసిన లాయర్ నరసరామయ్య గారి పేరుతోనే ఆ వీధి పిలువబడేది. దాదాపు వెయ్యి గజాల స్థలంలో…వీధి కంటే ఆరడుగుల ఎత్తులో చాలా హుందాగా…పేద్ద వరండా. అందులో ఓ ప్రక్క పేద్ద చెక్క ఉయ్యాల. ఆ ఉయ్యాలపై, ఎప్పుడూ కిల కిలా నవ్వుతూ ఆడుకునే నా వయసు పిల్లలూ!! తెల్లవారింది మొదలు  ఆడా, మగా అందరూ సందడిగా ఏవో […]

Continue Reading

కనక నారాయణీయం-33

కనక నారాయణీయం -33 –పుట్టపర్తి నాగపద్మిని ‘ఉపనయనం (వడుగు) కాకుండా, గాయత్రీ తోడు లేకుండా ఇటువంటివి శాక్తేయ మంత్రాలు చేయకూడదు. ప్రమాదం. నీవు మా మాట వినకపోతే, మీ అయ్యగారికి చెప్పేస్తాం, అని కూడా బెదిరించినారు. (నవ్వు).’ దీనితో భయపడి మానుకున్నా!! ‘ భళ్ళున నవ్వేశారు పుట్టపర్తి. ఆయన నవ్వులో తనగొంతూ కలిపిన వాట్కిన్స్ గబుక్కున అడిగాడు. ‘ఇవన్నీ సరే స్వామీ, మీతో ఉన్న చనువు కొద్దీ మిమ్మల్ని ఒకమాట అడగాలని ఉంది. మళ్ళీ తిట్టరు కదా?’ […]

Continue Reading

కనక నారాయణీయం-32

కనక నారాయణీయం -32 –పుట్టపర్తి నాగపద్మిని వాట్కిన్స్ ముఖంలో ఆనందం తాండవిస్తూంది. ‘అంతకంటేనా సార్?? గొప్ప పని కదా?? పుస్తకంతో పాటూ, నా పేరు, పుట్టపర్తి వారి పేరు, మన స్కూల్ పేరు నిలిచిపోతుంది, జాగ్రత్తగా భద్రపరచ గల్గితే!! నాకు కావలసిన సరంజామా, ఆయా కవుల వివరాలూ, చిత్రాలూ ఇస్తే, నా శక్తికి మించి యీ గొప్ప పనిలో పాలు పంచుకుంటాను తప్పక!!’ అన్నాడు. అలా ఒక గొప్ప చారిత్రాత్మక కార్యక్రమానికి పునాది పడింది, కడప రామకృష్ణా […]

Continue Reading

కనక నారాయణీయం-31

కనక నారాయణీయం -31 –పుట్టపర్తి నాగపద్మిని పుట్టపర్తి అన్నారు.’ ఒరేయ్, మన తెలుగు కవుల్లో పది మంది కవుల పేర్లే తెలియవు మీకు!! వీణ్ణి ఎగతాళి చేస్తార్రా మీరు?? ఒరేయ్.. ఎవరైనా పోయి వాట్కిన్స్ ని పిల్చుకుని రాపోండి.’ అన్నారు పుట్టపర్తి. తెలుగు కవులకూ, డ్రాయింగ్  సార్ వాట్కిన్స్ కూ ఏమి సంబంధమో అర్థం కాలేదు వాళ్ళెవరికీ?? ఆయనేమైనా తెలుగు కవులగురించి పాఠం చెబుతాడా ఇప్పుడు??’ ఒక కుర్రవాడు లేచి తుర్రున వెళ్ళాడు వాట్కిన్స్ సర్ కోసం!! వాళ్ళకేమి […]

Continue Reading

కనక నారాయణీయం-30

కనక నారాయణీయం -30 –పుట్టపర్తి నాగపద్మిని ‘ మయూరము, అంటే, నెమలి షడ్జమాన్ని పలుకుతుందట!! వృషభం, అంటే, ఎద్దు రిషభాన్ని ఆలపిస్తుందట!! గ – గాంధారం, మేక గొంతులోనూ, మ మధ్యమం క్రౌంచ పక్షి  అరుపులోనూ బాగా వినిపొస్తుందట!! పంచమం ప స్వరానికి మన కోకిలమ్మ పెట్టింది పేరు. అశ్వము – అంటే గుర్రము, దైవతానికీ, ని నిషాద స్వరానికి గజము అంటే ఏనుగు ప్రసిద్ధాలు. ‘ పుట్టపర్తి యీ మాటలని ఆగగానే, అక్కడ కూర్చుని వున్న […]

Continue Reading

కనక నారాయణీయం-29

కనక నారాయణీయం -28 –పుట్టపర్తి నాగపద్మిని అవి 1955 ప్రాంతాలు. రాజమండ్రిలో అక్కడి ప్రముఖ కవి  శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారిని కలిసేందుకు వారి ఇంటికి వెళ్ళి కూర్చున్న సమయమది.   వారి చుట్టూ, వారి పరిజనులూ, ప్రియ శిష్యులూ, ఆరాధకులూ అందరూ ఉన్నారు. ’ మీరెక్కడినుంచీ వచ్చారు? అని ఎవరో అడిగారు. కాస్త  అతిశయంతోనే  తాను ,’రాయలేలిన రాయలసీమ నుంచీ!!’ అని సమాధానం ఇచ్చాడు.   తన ధీమా తనది. పెనుగొండ లక్ష్మి తెచ్చిపెట్టిన ధైర్యమది. […]

Continue Reading

కనక నారాయణీయం-28

కనక నారాయణీయం -28 –పుట్టపర్తి నాగపద్మిని అవి 1955 ప్రాంతాలు. రాజమండ్రిలో అక్కడి ప్రముఖ కవి  శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారిని కలిసేందుకు వారి ఇంటికి వెళ్ళి కూర్చున్న  సమయమది.   వారి చుట్టూ, వారి పరిజనులూ, ప్రియ శిష్యులూ, ఆరాధకులూ అందరూ ఉన్నారు.     ’ మీరెక్కడినుంచీ వచ్చారు? అని ఎవరో అడిగారు.      కాస్త  అతిశయంతోనే  తాను ,’రాయలేలిన రాయలసీమ నుంచీ!!’ అని సమాధానం ఇచ్చాడు.   తన ధీమా తనది. పెనుగొండ లక్ష్మి […]

Continue Reading

కనక నారాయణీయం-27

కనక నారాయణీయం -27 –పుట్టపర్తి నాగపద్మిని సాహిత్య అకాడమీ నుంచీ వచ్చే ఆనరోరియం డబ్బు, సుబ్రమణ్యం ప్రొద్దుటూరు రేషన్ దుకాణంలో పనిలో ఉన్న కారణంగా,వారానికోసారైనా తనతో తెచ్చే బియ్యం, చక్కెర, మరో శిష్యుడు సుబ్బన్న రాకపోకలప్పుడు పంపే సరుకులతో –  ఇలా ఏదో విధంగా రోజులు గడిచి, మొత్తానికి కాస్త ఇబ్బందులతోనే,    పుట్టపర్తి మళ్ళీ పూర్వ రూపానికి చేరుకున్నారు. కోలుకున్న తరువాత, శ్రీ ఆర్. రంగనాథం గారి సహృదయాహ్వానం తో మళ్ళీ, శ్రీ రామకృష్ణ  ఉన్నత […]

Continue Reading

కనక నారాయణీయం-26

కనక నారాయణీయం -26 –పుట్టపర్తి నాగపద్మిని ఇటువంటి అనుభవాలెన్నెన్నో పుట్టపర్తి వారి లేఖలలో చదివి, పోయేవారందరూ!! పిల్లల ఆశ్చర్యం మాట అటుంచి, కనకవల్లి మనసునిండా కలవరమే ఎప్పుడూ!! అసలు పెండ్లైన నాటినుండీ, ఆ ఇల్లాలితో  కలవరాలకు దోస్తీ కుదిరిందేమో నన్నంతగా, సంసారంలో ఎప్పుడూ, ఏదో ఒక కలవరమే!!  కలవరానికి అలవాటైన  కనకమ్మ మనసు నిండా నిర్వేదమే!! కానున్నది కాకమానదు!! భారమంతా భగవంతునిమీదే వేసినప్పటికీ, ఏదో దిగులు!! ఆయన ఎలాగైనా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే బాగుండు..’ అనే అనిపిస్తున్నది. […]

Continue Reading

కనక నారాయణీయం-25

కనక నారాయణీయం -25 –పుట్టపర్తి నాగపద్మిని ప్రియురాలి కోర్కె తీర్చని ప్రియుడూ ఒక ప్రియుడేనా?? వెంటనే ఆమె కోర్కెను తీర్చేందుకు గంధర్వుడు ఎటువంటి ప్రయత్నాలు చేశాడు?? అతని ప్రయత్నాలకూ, చంద్రోత్సవానికీ లంకె ఏమిటి?? ఇదే ఆ చంద్రోత్సవ కావ్య కథావస్తువు. ఈ కావ్యము మణిప్రవాళ శైలిలో ఉంటుందట!! కథలోని విశేషాలు చెబుతూనే   భాషా,చారిత్రక సంబంధమైన విశేషాలు విపులీకరించటం పుట్టపర్తి వ్యాసాలలోని ప్రత్యేకత.    ఈ మణిప్రవాళ శైలి కావ్యపద్ధతిని సృష్టించినవారు నంబూద్రీలేనంటారు వారు.  నంబూద్రీలకు   సెందమిళ్ భాషతో […]

Continue Reading

కనక నారాయణీయం-24

కనక నారాయణీయం -24 –పుట్టపర్తి నాగపద్మిని ఎక్కడో తెలుగు ప్రాంతాలనుంచీ వచ్చిన వాడు, మాపై పెత్తనం చలాయించటమేంటి?? అని  ఆ స్థానిక కేరళ ఉద్యోగుల బాధ!! అప్పటికే ప్రాకృత భాషలూ, సంస్కృతమూ పైనున్న పట్టుతో మళయాళం నేర్వటం కష్టమేమీ కాలేదు పుట్టపర్తికి!!  గ్రీక్, లాటిన్, కాస్త ఫ్రెంచ్ కూడా  కాస్త  వచ్చిన పుట్టపర్తిని నిరోధించగలిగే సత్తా ఎవరికీ లేదు. ఇన్ని కారణాలవల్ల  అక్కడి వాళ్ళు పుట్టపర్తిని ఎప్పుడూ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే చూసేవారట!! గ్రంధాలయాల్లో […]

Continue Reading

కనక నారాయణీయం-23

కనక నారాయణీయం -23 –పుట్టపర్తి నాగపద్మిని కేరళ వాసం అనుభవాలను, తన దగ్గరున్న చిన్న దైనిక డైరీ లాంటి బుక్కులో తన భావాలు రాసుకునేవారు పుట్టపర్తి పొడి పొడి వాక్యాలుగా వ్రాసుకునేవారన్నాను కదా! ఆ చిన్ని డైరీ ఇలా ఉంది. (నా దగ్గర ఉన్నది ఇప్పుడు కూడా) ****      ‘త్రిశూర్, ఎర్నాకుళం దగ్గర , బస్సులో ప్రయాణం!! అందరూ నాయర్లే!! ఈ దేశాన్ని గురించి విన్నదంతా నిజమే!! మందులూ, మాకులూ, మంత్రాలూ – అన్నీ జరుగుతాయి!! […]

Continue Reading

కనక నారాయణీయం-22

కనక నారాయణీయం -22 –పుట్టపర్తి నాగపద్మిని పుట్టపర్తి ‘మేఘ దూతం’ కావ్య రచన సమయంలోనే రాయలనాటి కవితా జీవనము – వ్యాసం ( పరిశోధన _ ఏప్రిల్ 1954) అల్లసానివారి అల్లిక జిగిబిగి – వ్యాసం (పరిశోధన జూన్ 1954) వర్ణనా సంవిధానంలో పెద్దన సమ్యమనం – వ్యాసం (పరిశోధన ఆగస్ట్,సెప్టెంబర్ 1954) పాత్రల తీర్పులో ముక్కు తిమ్మన్న నేర్పు, రామభద్రుని శయ్యలో ఒయ్యారం – వ్యాసం (పరిశోధన అక్టోబర్, నవంబర్ 1954) శ్రీమదాంధ్ర మహాభాగవతము -మహాకవి […]

Continue Reading

కనక నారాయణీయం-21

కనక నారాయణీయం -21 –పుట్టపర్తి నాగపద్మిని అసలు మేఘం ద్వారా సందేశం పంపే ఆలోచనకు ఆధారాలేమిటి?? అని ఆలోచిస్తే, ఋగ్వేదం కనిపిస్తుంది. సరమా – పణి, ఇంద్రుడు – ఇంద్రాణి, యమ – యమీ ఇటువంటి సందేశాత్మక కథలున్నాయి. భారతీయ సాహిత్యంలో ఋగ్వేదమే మొట్టమొదటి లభ్య రచన.   బృహస్పతి గోవులను ఒక జాతివారు అపహరించి తీసుకు వెళ్ళి ఒక గుహలో బంధించి వుంచుతారు. ఆ ఆవులను అన్వేషించేందుకు, ‘సరమ’  అనే శునకాన్ని పంపుతాడు బృహస్పతి. ఆ […]

Continue Reading

కనక నారాయణీయం-20

కనక నారాయణీయం -20 –పుట్టపర్తి నాగపద్మిని    పుట్టపర్తి లేఖిని ద్వారా- శివతాండవం అన్న గేయ   కావ్య ఆవిష్కరణకు వేదికగా నిలిచింది – ప్రొద్దుటూరులోని అగస్తేశ్వర ఆలయం !!         అలా ఆవిష్కరింపబడిన శివతాండవం లోని కొంత భాగాన్ని భారతి పత్రిక కు పంపగా, వెంటనే ప్రచురితమైంది. ఆ తర్వాత, కొన్ని సభలలో శివతాండవ భాగాలను చదవగా, స్పందన అద్భుతం. అందులో అనుపమానం గా ఇమిడిపోయిన లయ, అచ్చతెనుగు పదాలలో శివ వైభవం, సంగీత, నాట్య కళా విశేషాలు, […]

Continue Reading

కనక నారాయణీయం-19

కనక నారాయణీయం -19 –పుట్టపర్తి నాగపద్మిని    పరమ కారుణ్య ఋషుల నివాసమైన    లోకములనాతడందెడు  గాక!! శాంతి    రాయలేలిన సీమలో బ్రదుకు వారు    బెద్దల గుణంబులను గౌరవింత్రు గాత!! ఇప్పటికైనా సీమవాసులు బెద్దలైనవారిని గౌరవించే గుణాన్ని అలవరచుకునవలెనన్న హితవు యీ అశ్రునివాళి సందేశం కాగా, యీ శతకాన్ని, కొప్పరపు సుబ్బయ్యగారి అభిమానులు, వెంటనే ముద్రించటం కూడా జరిగింది.    పుట్టపర్తి జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది కూడా పడింది.    పుట్టపర్తి మనసు అశాంతికి లోనయింది. కొప్పరపు సుబ్బయ్య గారు […]

Continue Reading

కనక నారాయణీయం-18

కనక నారాయణీయం -17 –పుట్టపర్తి నాగపద్మిని కళాశాల ప్రిన్సిపాల్ మీనన్ కు గాంధీ పట్లా, విద్యార్థుల పట్లా ముఖ్యంగా స్వాతంత్ర్య సమరం పట్లా చాలా చిన్న చూపు ఉన్నట్టుంది!! పెనుగొండ లక్ష్మి లో భారతీయ సంస్కృతి పట్ల కళల పట్లా, చరిత్ర పట్లా అంతులేని గౌరవాన్ని ప్రకటించి పులకించిన తనకు , యీ మీనన్ భావాలను సమర్థించటం సాధ్యమా?? అన్న ఆలోచన మొదలైంది పుట్టపర్తి లో!! తరగతిలో సంధుల గురించి పాఠం చెప్పి బైటికి వచ్చేస్తున్నప్పుడొక కుర్రాడు […]

Continue Reading

కనక నారాయణీయం-17

కనక నారాయణీయం -17 –పుట్టపర్తి నాగపద్మిని కళాశాల ప్రిన్సిపాల్ మీనన్ కు గాంధీ పట్లా, విద్యార్థుల పట్లా ముఖ్యంగా స్వాతంత్ర్య సమరం పట్లా చాలా చిన్న చూపు ఉన్నట్టుంది!! పెనుగొండ లక్ష్మి లో భారతీయ సంస్కృతి పట్ల కళల పట్లా, చరిత్ర పట్లా అంతులేని గౌరవాన్ని ప్రకటించి పులకించిన తనకు , యీ మీనన్ భావాలను సమర్థించటం సాధ్యమా?? అన్న ఆలోచన మొదలైంది పుట్టపర్తి లో!! తరగతిలో సంధుల గురించి పాఠం చెప్పి బైటికి వచ్చేస్తున్నప్పుడొక కుర్రాడు […]

Continue Reading

కనక నారాయణీయం-16

కనక నారాయణీయం -16 –పుట్టపర్తి నాగపద్మిని పుట్టపర్తి సాహిత్య జైత్ర యాత్ర, విజయ మార్గాన ప్రయాణిస్తున్న సమయంలో ఒక రోజు..!! పుట్టపర్తి వారిని కొప్పరపు సుబ్బయ్య హఠాత్తుగా తన గదికి పిలుస్తున్నారని ప్యూన్ వచ్చి చెప్పాడు. హఠాత్తుగా ఇప్పుడీ పిలుపేమిటి?? ‘ఇదుగో సామీ..నీకేదో అనంతపురం కాలేజీ నుంచీ జాబొచ్చిందే!! అంతా ఇంగ్లీష్ లో ఉండాది..మద్రాసోళ్ళు నిన్ను విద్వాన్ అన్నారు. వీళ్ళేమంటుండారో నిన్ను..సూడు …’ నిండారా నవ్వుతూ, ఆ లేఖను పుట్టపర్తి చేతుల్లో పెట్టారు కొప్పరపు సుబ్బయ్య గారు. […]

Continue Reading

కనక నారాయణీయం-15

కనక నారాయణీయం -15 –పుట్టపర్తి నాగపద్మిని ‘భలేవాడివయ్యా!! ఇంత పనిచేసినా, ఒక్కమాటైనా చెప్పనేలేదే నాకు?? ఐనా నాకు తెలుసు, యాడో ..పొరపాటు జరిగినాదని!! ఎట్టా దెలుసుకోవాలో దెలీక ఊరుకుణ్ణ్యా!! నీ బ్రమ్మాస్త్రానికి జవాబుగూడా బ్రమ్మాండంగానే వచ్చినాది గందా!! ఒరే కొండయ్యా!! సారుకు వేడి వేడి కాఫీ దీసుకురా పో!! ఐనా ఆచార్లూ?? ఈడ గూర్చో!! ఇంతకూ ఏం రాసినావు ఆ యూనివర్సిటీ వాల్లకు??’ పుట్టపర్తి అన్నారు,’విద్వాన్ పరీక్ష పాసవటం, అవకపోవటం – గురించి కాదు సుబ్బయ్య గారూ, […]

Continue Reading

కనక నారాయణీయం-14

కనక నారాయణీయం -14 –పుట్టపర్తి నాగపద్మిని కొప్పరపువారు పరీక్ష వివరాలన్నీ కనుక్కున్నారు. వారి ఆప్యాయత చూసి పుట్టపర్తి చెప్పారు, తాను ఒకే ప్రశ్న మూడు గంటలూ వ్రాసినట్టు!! ఆశ్చర్యపోవటం కొప్పరపు వారి వంతైంది. ‘ఏందీ?? మూడూ గంటలూ కూచుని ఒకే ప్రశ్నకు జవాబు రాసినావా??’ మౌనవే సమాధానం. తాను ప్రొద్దుటూరిలో అడుగుపెట్టినప్పటినుంచీ, తనకు పెద్దదిక్కుగా నిలిచిన వారిముందు, మరో సమాధానం ఏమిచెప్పగలడు తాను?? ఐతే మరి…రిజల్ట్ వచ్చిందిగదా?? ఏంజెయ్యాలనుందిప్పుడు?? అడిగారు కొప్పరపు సుబ్బయ్య. ‘ఏముంది..మల్లీగట్టుకోవాల పరీచ్చకు!!’ఎవరో అందించారు, […]

Continue Reading

కనక నారాయణీయం-13

కనక నారాయణీయం -13 –పుట్టపర్తి నాగపద్మిని   కనకవల్లి తళిహిల్లు (వంటిల్లు) సర్దుకుంటూఉండగా, పుట్టపర్తి, రేపు పొద్దున్న మొదటి బస్సుకే తిరుపతికి పోవాలన్న ఆలోచనల్లో మునిగిపోయారు- ఎవరి ఊహల్లో వారు!!     అప్పట్లో ప్రొద్దుటూరినుండి, తిరుపతికి వెళ్ళాలంటే, ఎర్రగుంట్ల వెళ్ళి రైలు పట్టుకోవలసిందే!! తెల్లవారుఝామునే బయలుదేరి ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ చేరుకుని,రైల్లో  మూడవ తరగతి డబ్బాలో ఏదో తోపులాటల్లో కాస్త చోటు సంపాదించుకుని కూర్చునేందుకు ఎంతో శ్రమపడవలసి వచ్చింది పుట్టపర్తికి !! జీవన సంఘర్షణ కూడా ఇంతే కదా!! […]

Continue Reading

కనక నారాయణీయం-12

కనక నారాయణీయం -12 –పుట్టపర్తి నాగపద్మిని ఇంటి పనులూ, భర్త నారాయణాచార్యులవారి శిష్య వర్గానికి పాఠాలు పునస్చరణ చేయించటంలోనూ తలమునకపైపోతూకూడా, భర్త విద్వాన్ పరీక్ష బాగా వ్రాశారని విని చాలా సంతోషపడిపోయిందా నేదరి ఇల్లాలు – పుట్టపర్తి కనకవల్లి!! ఇక పరీక్ష ఫలితాలకోసం ఎదురుచూపు !!   ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. విద్వాన్ పరీక్ష ఫలితాలొచ్చాయి. అది విని కనకవల్లి దిగ్భ్రాంతి చెందింది!! కానీ పుట్టపర్తి కి యీ విషయాలే పట్టటం లేదు. పరీక్ష […]

Continue Reading

కనక నారాయణీయం-11

కనక నారాయణీయం -11 –పుట్టపర్తి నాగపద్మిని తెలుగు సాహిత్య చరిత్రలో మునుపెన్నడూ వినని కనని సందర్భమిది!! ఒక కవి, తాను వ్రాసిన కావ్యాన్నే, తాను విద్యార్థిగా చదవి, పరీక్ష వ్రాయవలసి రావటం ఎప్పుడైనా జరిగిందా?? ఈ వార్త క్షణాలమీద ప్రొద్దుటూరు సాహిత్య లోకంలో పాకి పోయింది. ఏమిటేమిటీ?? పుట్టపర్తి నారాయణాచార్యులనే యువ కవి వ్రాసిన కావ్యం, విద్వాన్ పరీక్షకు పాఠ్యాంశంగా ఉండటమేమిటి?? అతడు ప్రొద్దుటూరు వాసి కావడమేమిటి?? పైగా అతడే విద్వాన్ పరీక్షలు హాజరుకాబోతుండటమేమిటి?? అన్నీ ఉత్కంఠభరితమైన […]

Continue Reading

కనక నారాయణీయం-10

కనక నారాయణీయం -10 –పుట్టపర్తి నాగపద్మిని ప్రొద్దుటూరిలో, సుందరాచార్లు వీధిలో మా మాతామహులు శ్రీ ధన్నవాడ  దేశికాచార్య పనిచేస్తున్న  ప్రాథమిక పాఠశలలోనే పని చేస్తున్న కేశవమ్మ టీచర్ (బ్రాహ్మణేతరురాలు) మా అమ్మమ్మ శేషమ్మగారికి చాలా మంచి స్నేహితురాలట!! శేషమ్మ గారికేకష్టం వచ్చినా ఆమె తక్షణం ఆదుకునేదట!! కులం వేరైనా, గుణం బట్టి మాత్రమే ఆనాటి స్నేహాలు ఉండేవని, దీనివల్ల తెలుస్తున్నది కదా?? శేషమ్మగారికి ఎప్పుడూ ఒకటే చింత!! భర్త దేశికాచార్యులవారి తండ్రి గారు ధన్నవాడ రాఘవాచార్యులవారు కాకలు […]

Continue Reading

కనక నారాయణీయం-9

కనక నారాయణీయం -9 –పుట్టపర్తి నాగపద్మిని           వరుని తండ్రి పుట్టపర్తి శ్రీనివాసాచార్యులవారన్నారు.’జాతకాల మాట అటుంచితే, వాల్మీకి రామాయణం కంటే ప్రమాణం మరెక్కడుంది కనుక?? రామాయణ ప్రశ్న వేతాము. అందులో ఫలితాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాము.’   వధువు వైపువాళ్ళు ఆలోచనలో పడ్డారు.   ఇంతకీ ఏమిటీ రామాయణ ప్రశ్న??     రామాయణం ప్రశ్న అంటే,  ఏదైనా కష్ట సమయ వచ్చిన సందర్భంలో, వాల్మీకి మహాకవి విరచిత శ్రీమద్రామాయణ గ్రంథం ముందుంచుకుని, భక్తితో నమస్కరించి, తమ […]

Continue Reading

కనక నారాయణీయం-8

కనక నారాయణీయం -8 –పుట్టపర్తి నాగపద్మిని శిరోమణిలో పుట్టపర్తి వారి స్నేహితుడు కలచవీడు శ్రీనివాసాచార్యుల బంధువులకు తాడిపత్రిలో దేశబంధు ప్రెస్ ఉన్నదనుకున్నాం కదా!! పుట్టపర్తి స్నేహితుడైన శ్రీనివాసాచార్యులకు, తన స్నేహితుని ‘పెనుగొండ లక్ష్మి’ ని తమ ముద్రణాలయంలో ప్రచురించవలెనని కోర్కె పుట్టింది. దానికి ధనం కావాలి కదా!! ఎలా మరి?? సహ విద్యార్థుల ప్రోద్బలంతొనే పెనుగొండ లక్ష్మి లోని కొన్ని పద్యాలు , అప్పట్లో సాహితీ లోకంలో అత్యంత ఆదరణకు నోచుకుంటూ, తలమానికంగా వెలుగొందుతున్న భారతి మాస […]

Continue Reading

కనక నారాయణీయం-7

కనక నారాయణీయం –7 –పుట్టపర్తి నాగపద్మిని తండ్రిగారు, తన చదువు గురించి పడుతున్న ఆరాటం గమనించాడు తరుణ నారాయణుడు!! ఆంగ్ల సాహిత్య పాఠాల గురించి తెలిసినా, తండ్రి గారి మనసులో, సాంప్రదాయక విద్య    కుమారునికి అబ్బటంలేదనే బాధ ఇంకా ఉండనే ఉంది. దానికి తోడు పిట్ దొరసాని ఆంగ్ల సాహిత్య వ్యవసాయానికి వేసిన కళ్ళెం!! నిజానికి ఆమె అలా అనకుండా ఉండి వుంటే, ఆ రోజుల్లోనే అదే తరహా కృషిని  కొనసాగించి ఉంటే, నారాయణాచార్యులవారు అంతర్జాతీయ […]

Continue Reading