image_print

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి “ఈ పాడుబడిన ఇంటిలోనేనా నీకు మొహిరీలు దొరికింది?” అని అడిగాడు భవానీ పాఠక్. “అవును” “ఎంత బంగారం దొరికింది?” “చాలా” “అది కాదు, నిజంగా ఎంత దొరికిందో చెప్పు. నువ్వు అబద్ధం చెపుతున్నాననుకుంటే నేను నా మనుష్యులను తీసుకువచ్చి ఇక్కడ వెతికించగలను.” “ఇరవై జాడీల నిండా” “ఇంత ధనాన్ని ఏం చెయ్యాలనుకుంటున్నావు?” “నా ఇంటికి తీసుకు వెళ్దామనుకుంటున్నాను” “నీ ఇంటిలో మాత్రం […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి అక్కడ ఫూల్మణి బందిపోట్ల భయంతో పులి వెంటాడుతున్న లేడిలాగా వేగంగా పరిగెత్తసాగింది. ఫూల్మణికి ముందు దుర్లబ్ అంతకంటే వేగంగా పరిగెడుతున్నాడు. ఫూల్మణి “దుర్లబ్ నాకోసం ఆగు, నన్ను వదిలి వెళ్ళమాకు” అంటూ కేకలు పెట్టటం మొదలు పెట్టింది. దుర్లబ్ “అమ్మో నన్ను బందిపోట్లు పట్టుకుంటారు” అని గొణు క్కుంటూ, ధోతీ వదులై పోతుంటే, ఎగలాక్కుంటూ పరిగెత్తుతున్నాడు. ఒక చెప్పు వూడిపోయింది, అయినా […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి తల్లీకూతుళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చారు. ప్రయాణ బడలిక కారణమవ్వవచ్చు, మనేద కావచ్చు, ప్రఫుల్ల తల్లికి జ్వరం తగిలింది. ఏదన్నా ఎండిన రొట్టె ముక్క దొరికితే తింటున్నారు, లేకపోతే లేదు. కొన్ని రోజులకు తల్లికి జ్వరం ముదిరి విష జ్వరంగా మారి కాలాంతం చేసింది. ప్రఫుల్ల ఒంటరిదయ్యింది. ప్రఫుల్ల మీద లేనిపోని మాటలు చెప్పిన ఇరుగుపొరుగు వాళ్ళే దహన సంస్కారాలు చేసారు. […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి రాత్రి ఒకటవ ఝాముకి హరివల్లభ బాబు భోజనానికి వచ్చి కూర్చున్నాడు. ఇంటావిడ ప్రక్కనే కూర్చుని వడ్డిస్తున్నది. “ఆ కులత తిరిగి పోయిందా?” అడిగాడాయన. “రాత్రి పూట ఎలా వెళ్తుంది. ఈ రాత్రికి కోడలు అతిథి. ఇక్కడే వుంటుంది” అన్నది అత్తగారు. “అతిథి అయితే ఇంటికి బయట చావటి గదిలో ఉంచండి.” “చెప్పాను కదా ఈ రాత్రి వేళ ఎక్కడకీ పంపించనని. అంతగా పొమ్మనేటట్లయితే, […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి ఇంటావిడ హరివల్లభ బాబు గదిలోకి వెళ్ళింది. ఆయన అప్పుడే నిద్రలేచి తువ్వాలు మీద నీళ్ళు చిలకరించుకుని, ముఖం తుడుచుకుంటున్నాడు. ఆయనను ముందు కొంచెం మచ్చిక చేసుకోవటానికి, “అయ్యో మిమ్మల్ని ఎవరు నిద్ర లేపారు? నేనందరికీ చెప్పా, గోలచేసి మిమ్మల్ని నిద్ర లేపొద్దని. అయినా నా మాట ఎవరు వింటారు?” అన్నది. “నా నిద్ర చెడగొట్టేదే నువ్వు. లేకపొతే ఎవరు లేపుతారూ? ఏదో […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి మొదటి భాగం           “ఫీ ఫీ…., ప్రఫుల్లా, ఓయ్ ప్రఫుల్లా” “వస్తున్నానమ్మా. ఇదిగో వస్తున్నా” “ఏమీటో చెప్పమ్మా” కూతురు దగ్గరకు వచ్చి అడిగింది. “ఘోస్ ఇంటికి వెళ్ళి ఒక వంకాయ తీసుకుని రా.” “నేను వెళ్ళనమ్మా. అడుక్కుని రావటం నాకు చేతకాదు.” “అయితే ఏం తింటావ్? ఇంట్లో ఏమీ లేదు.” “అడుక్కుని ఎందుకు తినాలి? వట్టి […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి కథా రంగం ఈ కథ జరిగిన ప్రాంతము భౌగోళికముగా ఉత్తర బెంగాలు. ఇది బ్రహ్మపుత్ర, గంగా నదుల సంగమ ప్రాంతము. ఈ పెద్ద నదులే కాకుండా హిమాలయాల నుండి ప్రవిహించే తీస్తా, కర్ల, మహానంద, కరటొయ, నగర, తంగన్, జలధార, కల్యాణి వంటి ఉప నదులు, ఱుతుపవనాలతో ఉప్పొంగే ఇతర నదులతో కూడి దట్టమైన అడవులతో నిండి వుండేది. నేటి పశ్చిమ […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి కథా కాలం చరిత్రకారులకు ఏ యుద్ధంలో ఏ రాజు గెలిచాడో ముఖ్యం. ప్రబంధకారులకు, కవులకు ఏ రాజు ఎంతటి గొప్ప పరాక్రమవంతుడో, అనగా ఎంతటి పర ఆక్రమణదారుడో ఘణంగా వర్ణించటం ముఖ్యం. అయితే ఈ యుద్ధాలలో నలిగేది మాత్రం సామాన్య ప్రజలే. వారి కథలు, జీవన పోరాటాలు, తిరుగుబాటులు, పోరాటాలు జానపద కథలగానూ, జానపద గీతాలు గానూ జీవిస్తాయి. వీటికి విద్యాధికుల […]

Continue Reading
Posted On :