image_print

ఆలోచనాత్మక కథలల్లిన గొప్పరచయిత కారా మాస్టారు!

ఆలోచనాత్మక కథలల్లిన గొప్పరచయిత కారా మాస్టారు! -కొండపల్లి నీహారిణి తెలుగు సాహిత్యంలో కథాప్రక్రియకు పెద్దపీట వేసి, గొప్ప కథలను రచించిన కాళీపట్నం రామారావు గారు 2021 – జూన్ – 4వ తేదీన కన్నుమూశారు. వారికి అక్షరాంజలి ప్రకటిస్తున్నాను. “జీవితంలో సమస్యలను, ఆ సమస్యలకు కారణాలను తెలియజేసేదే మంచి కథ” అన్నారు కారా. ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు ఎట్లా మాస్టారో, సాహితీవేత్తలకు ముఖ్యంగా కథా రచయితలకు కారా మాస్టారుగా అట్లే ప్రసిద్ధి. తొలికథ ‘ప్లాటుసారమో’ – చిత్రగుప్త కార్డు […]

Continue Reading

భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న కొడాలి కమలమ్మ

భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న కొడాలి కమలమ్మ -ఎన్.ఇన్నయ్య గాంధీజీ, గోరా (గోపరాజు రామచంద్రరావు)లను ఆదర్శంగా కొడాలి కమలమ్మ తన జీవితాన్ని గడిపిన స్వాతంత్య్ర సమర సైనికురాలు.  కొడాలి కమలమ్మ త్యాగమయ జీవితాన్ని గడిపారు. 1916లో గోగినేని రామకోటయ్య, వెంకాయమ్మలకు జన్మించిన కమలమ్మ మోపర్రు గ్రామవాసి. తెనాలికి సమీపంలో ఉన్న ఆ గ్రామం. ఆనాడు స్వేచ్ఛా పిపాసతో పోరాటంలోకి దిగిన ప్రాంతం. చదువుకుంటుండగా గాంధీజీ స్వాతంత్ర్య పోరాటం పట్ల ఆకర్షితురాలై, పాల్గొన్నారు. విద్య ఆట్టే సాగలేదు. హైస్కూలు […]

Continue Reading
Posted On :

ఓల్గా- ఓ బలమైన స్త్రీవాద స్వరం!! (ఓల్గా గారికి గౌరవడాక్టరేటు ప్రదానం సందర్భంగా వ్యాసం)

ఓల్గా గారికి గౌరవడాక్టరేటు ప్రదానం సందర్భంగా వ్యాసం -ఎ.రజాహుస్సేన్ (తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం గౌరవడాక్టరేటు ప్రదానం చేసిన సందర్భంగా ఓల్గా గారికి నెచ్చెలి అభినందనలు తెలియజేస్తూంది!) ఓల్గా…..ఓ బలమైన స్త్రీవాద స్వరం.,!! *తెలుగు నాట ఓల్గా ఒక ‘ ద్వంద్వ సమాసం.’ భార్యాభర్తలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు లాంటి పదాలను ఎలా విడదీయలేమో, స్త్రీవాదం ఓల్గా అనే పదాలని కూడా మనం విడదీయలేం. రెండు ఆత్మలు కలగలసిన ఏక జంటపదం ఓల్గా! రచన, ఆచరణ… ఈ రెండు ఆత్మలు’.(వంశీకృష్ణ) *కవిత్వంతో సాహిత్య ప్రస్ధానం మొదలు…వచనంతో స్థిరత్వం…!! […]

Continue Reading
Posted On :

సరస్వతి గోరా

సరస్వతి గోరా -ఎన్.ఇన్నయ్య నేను ప్రపంచంలో ముఖ్యమైన నాస్తిక కేంద్రాలను చూశాను. అమెరికా ఇంగ్లండ్ లో నాస్తి కేంద్రాల దగ్గిరకి వెళ్లాను. కాని ప్రపంచంలో ఎక్కడా కూడా విజయవాడలో ఉన్న నాస్తిక కేంద్రం వంటిది లేదు.  గోరా (గోపరాజు రామచంద్రరావు) స్థాపించిన నాస్తిక కేంద్రం విజయవాడలో ఉన్నది. ఈ కేంద్రం విశిష్ట స్థానాన్ని సంపాదించుకుని గౌరవం పొందింది. దీనికి చేయూతనిచ్చిన, అండగా నిలిచిన ప్రధాన వ్యక్తి సరస్వతి. ఈమె గోరా భార్య.  సరస్వతి 1912లో సెప్టెంబరు 28న […]

Continue Reading
Posted On :

మాలతీ చందూర్

మాలతీ చందూర్ -యామిజాల శర్వాణి 1950ల నుండి దాదాపు సుమారు మూడు దశాబ్దాల పాటు తెలుగువారికి సుపరిచితమైన పేరు శ్రీమతి మాలతి చందూర్ . ఈమె రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. మాలతీ చందూర్ కృష్ణా జిల్లా లోని నూజివీడులో 1930 లో జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు దంపతులకు జన్మించారు ఆరుగురి సంతానంలో అందరికంటే ఆమె చిన్నది.  ఊర్లో ఉయ్యూరు రాజావారి దివాణముండేది. దివాణం పక్కనే ఎస్‌ఆర్‌ఆర్‌ పాఠశాల ఉంది. 8వ తరగతి వరకు ఎస్‌ఎస్‌ఆర్‌ […]

Continue Reading
Posted On :

మదర్ తెరీసా అసాధారణ వ్యక్తిత్వం

మదర్ తెరీసా అసాధారణ వ్యక్తిత్వం -ఎన్.ఇన్నయ్య భారతదేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి, నాయకులను నిర్బంధించిన సంవత్సరంలో, 1975 మదర్ తెరీసా హైదరాబాద్ పర్యటించారు. పబ్లిక్ గార్డెన్స్లో పిల్లల కార్యక్రమానికి వచ్చిన ఆమెను, ఆంధ్రజ్యోతి ఛీఫ్ రిపోర్టర్ గా కలసి ఇంటర్వ్యూ చేశాను. ఏది అడిగినా అంతా దైవేచ్ఛ అని సమాధానం యిచ్చిన ఆమె నుండి, ఎలాంటి ఉపయోగకర విషయం సేకరించలేక, నిరుత్సాహపడ్డాను. కనీసం ఫోటో తీసుకోలేదని తరువాత అనుకున్నాను. మెసిడోనియా దేశానికి చెందిన తెరీసా, అల్బేనియా దంపతుల […]

Continue Reading
Posted On :