image_print

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-9 ‘సర్పపరిష్వంగం’ కథ

నా జీవన యానంలో- రెండవభాగం- 20 సర్పపరిష్వంగం – కథానేపధ్యం -కె.వరలక్ష్మి నా చిన్నప్పుడు మా ఇంటి వెనక వీధిలో పెద్ద తాటాకిల్లు వుండేది. ఆ ఇంటి యజమాని ఆయుర్వేదం మందులు అమ్మడానికి తరచుగా పడమటికి (రాయలసీమవైపు) వెళ్తూండేవాడు. మా వీధిలో చాలా కాపు కుటుంబాల్లో ఆయుర్వేద గుళికలు తయారుచేస్తూ వుండేవారు. అలా అమ్మడానికి వెళ్ళేవాళ్ళు ఆరేసినెలలు, ఇంకా పైన తిరిగి వచ్చేవారు. మధ్యలో అప్పుడప్పుడు ఓ కార్డురాసి క్షేమం తెలిపి పదో పరకో పంపిస్తూ వుండేవారు. […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-8 స్వస్తి కథ

నా జీవన యానంలో- రెండవభాగం- 19 స్వస్తి – కథానేపధ్యం -కె.వరలక్ష్మి బాబ్రీ మసీదు సంఘటన తర్వాత కవుల కలాలు, గళాలు ఆవేశంతో వెల్లువెత్తాయి. కథకులూ విశేషంగా స్పందించారు. నేనూ ఓ కథ రాయాలనుకున్నాను ఎక్కడో జరిగిన సంఘటనకు, ఎవరి కళ్ళతోనో చూసినదానికి నేనెలా స్పందించాలో అర్థం కాలేదు. ఆ సంఘటనను వ్యతిరేకిస్తూ కొందరు, అనుకూలంగా కొందరు పేపర్లలో రాస్తున్నారు. రాజకీయ పార్టీలు చూద్దామా అంటే ఒక పార్టీ ‘అలా మసీదును కూలగొట్టడం తప్పు’ అంటే వెంటనే […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-7 ఏ గూటి సిలక – కథానేపధ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 18 ఏ గూటి సిలక – కథానేపధ్యం -కె.వరలక్ష్మి సరిగా గమనించగలిగితే జీవితాల్లోని కదిలించే సంఘటనలన్నీ కథలే. మా అత్తగారికి కొడుకు తర్వాత ఐదుగురు కూతుళ్ళు, అంటే నాకు అయిదుగురు ఆడపడచులు. అందులో పెద్దమ్మాయి భర్త ఇంజనీరు కావడంతో ఆమె జీవితం ఆర్థికంగా బావుండేది. మిగతా నలుగురివీ అంతంతమాత్రపు ఆర్థిక స్థితులు. దాంతో ఆవిడ చాలా అతిశయంతో డామినేటింగ్ పెర్సన్ గా వుండేది. కాని, ఆమెకు పిల్లలు కలగలేదు. అప్పటికి మెడికల్ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-6 మల్లెపువ్వు – కథానేపధ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 17 మల్లెపువ్వు – కథానేపధ్యం -కె.వరలక్ష్మి మా పెద్దమ్మాయి పెళ్ళికి ముందూ, పెళ్ళి తర్వాతా నేనెదుర్కున్న చికాకులు అన్నీ ఇన్నీ కావు. అంతకు రెండేళ్ళ ముందే ఎల్.ఐ.సి లోన్ పెట్టి ఇల్లు కట్టుకోవడం, పిల్లల చదువులు పూర్తయ్యేవరకూ పెళ్ళిళ్ళ మాట తలపెట్టవద్దులే అనుకోవడం వల్ల నా సంపాదనలో ఇంటి ఖర్చులు పోను మిగిలినది లోకి వడ్డీ కట్టేస్తూ వచ్చేదాన్ని, నా సంపాదన అని ఎందుకంటున్నానంటే మా పిల్లల తండ్రిది నాకన్నా ఎక్కువ […]

Continue Reading
Posted On :