image_print

అనగనగా- చిన్న-పెద్ద (బాలల కథ)

చిన్న- పెద్ద -ఆదూరి హైమావతి  అనగనగా ఒక అడవిలో చీమనుండి ఏనుగు వరకూ, దోమ నుండీ డేగవరకూ అన్నీ కలసి మెలసి జీవిస్తూ ఉండేవి. ఎవరూ ఎవ్వరికీ కష్టంకానీ, అపకారం కానీ తలపెట్టేవి కావు. చేతనైతే సాయం చేసేవి. ఒకరోజున ఆ అడవికి ఏనుడు గజన్న స్నేహితుడుదంతన్న,చెలికాడిని చూడాలని వచ్చాడు . గజన్న మిత్రునికి మంచి విందుచేశాడు.  ఇద్దరూ ఒక మఱ్ఱి చెట్టు క్రింద విశ్రాంతిగా కూర్చుని చిన్న నాటి కబుర్లు చెప్పుకుంటున్నారు. మఱ్ఱి చెట్టు మానువద్ద  […]

Continue Reading
Posted On :

అనగనగా- స్మరణం (బాలల కథ)

స్మరణం -ఆదూరి హైమావతి  అప్పుడే పుట్టిన ఒక పురుగు  , కడుపు నిండా ఆహారం తిని కాస్తంత బలం చేకూరగానే బయటి ప్రపంచాన్ని చూడాలనే ఉత్సుకతతో  ఇంట్లోంచీ అమ్మకు చెప్పకుండానే  బయల్దేరింది . ఒక కప్ప మహా  ఆకలితో ఉండి నీళ్ళలో ఏజీవీ కనిపించక ‘ఉభయచరం’ గనుక నేలమీదకి గెంతింది .  దూరంగా వేగంగా వెళుతున్న ఈ పురుగు కనిపించింది . దాని మనస్సు ఆనందంతో నిండి పోయింది. “ఆహా! ఈపురుగును తిని నా ఆకలి చల్లార్చుకుంటాను […]

Continue Reading
Posted On :

అనగనగా- తగిన సాయం(బాలల కథ)

తగిన సాయం -ఆదూరి హైమావతి  అనగనగా ఒక చిట్టడవి.దాని సమీపాన ఒక నది. ఆ చిట్టడవిలోని చెట్ల మీద చాలా పక్షులు గూళ్ళుకట్టుకుని జీవించేవి. అక్కడ ఒకపెద్ద బూరుగు చెట్టుకూడా ఉంది. దానిపైకొమ్మమీద ఒక కాకి కర్రలతో గూడుకట్టు కుంది. దాని క్రిందికొమ్మ మీద  ఒక పిచ్చుక  పిడకల తో గూడు కట్టుకుంది. పక్క నే ఉన్న పెద్ద మఱ్ఱి  మాను మీద చాలా పక్షులు గూళ్ళుకట్టుకుని, ఎవరి పాటికి అవి జీవించేవి. ఒక వానాకాలం రాత్రి […]

Continue Reading
Posted On :

అనగనగా- ప్రతిఫలం (బాలల కథ)

 ప్రతిఫలం -ఆదూరి హైమావతి  అనగా అనగా ఒక అడవిప్రాంతంలో ఒక వేపచెట్టు మీద ఒక పిచ్చుక గూడు కట్టుకుని నివసించేది. దానికి రెండుపిల్లలు . వాటికి బయటి నుండీ తిండి తెచ్చిపెడుతూ ఉండేది. కాస్త పెద్దవి అవుతుండగా , ‘అమ్మఒడి ప్రధమబడి’ కదా!అందుకని తనపిల్లలకు బుధ్ధి మాటలు చెప్పేది. “బలవంతులతో విరోధం పెట్టుకోకండి. మనస్థాయికి తగినవారితో స్నేహం చేయండి. మనకడుపు నింపే విత్తనాల మొక్కలపట్ల  కృతజ్ఞత తో ఉండండి. ఎవరికీ హానిచేయకండి. ఐకమత్యమే మహా బలం అని […]

Continue Reading
Posted On :

అనగనగా- మంత్ర జప ఫలం (బాలల కథ)

మంత్ర జప ఫలం -ఆదూరి హైమావతి  అనగా అనగా అమలాపురం అనే ఊరి పక్కన ఉండే అడవి ప్రాంతాన ఆనందముని అనే ఒక ఆచార్యుడు ఒక ఆశ్రమం నిర్మించుకుని,తన వద్దకు విద్యార్జనకోసం వచ్చిన వారిని శిష్యులుగా స్వీకరించి విద్య బోధించే వాడు. ఆయన వేద వేదాంగాలను కూలంకషంగా ఔపోసన పట్టిన వాడు. విద్యా భోధనలో మంచి నేర్పరని పేరుగాంచిన వాడు. ఆయన శిష్యులు తమ గురువును సేవిస్తూ విద్యాభ్యాసం చేసే వారు. ఆయన ఆశ్రమంలో శిష్యులు ఉదయం […]

Continue Reading
Posted On :

అనగనగా- ఉచితం అనుచితం (బాలల కథ)

ఉచితం అనుచితం -ఆదూరి హైమావతి  అనగా అనగా ఆనందహళ్ళి అనే గ్రామంలో అనంతమ్మ అనే ఒక పేదరాలు ఉండేది.ఆమె కుమార్తె సుమతి. ఆ ఊర్లో ఉండే సర్కార్ స్కూలు అనంతమ్మ  చిమ్మేది . సుమతి ఆస్కూల్లోనే ఐదో క్లాసు చదువుతున్నది.ఆమెకు చిన్నతనంలో బురదలో జారిపడి పాదం కాస్త వంకపోయి వంకరగా నడిచేది. పేదతనం వల్ల సమయానికి వైద్యం చేయించలేకపోయింది అనంతమ్మ. సుమతి అలాగే నడుస్తుంది, బాగా చదువుతుంది. చక్కగా పద్యాలూ, పాడుతుంది. గణితంలో దిట్ట. డ్రాయింగ్ కూడా […]

Continue Reading
Posted On :

అనగనగా- అమ్మమాట (బాలల కథ)

అమ్మమాట -ఆదూరి హైమావతి  అనగనగా ఒక చిట్టడవి. ఆడవిలో ఒక మఱ్ఱి చెట్టు క్రింద ఉన్న బొరియలో ఒక ఎలుక నివాసం ఏర్పరచు కుని జీవిస్తూ ఉండేది. దానికి కొంతకాలానికి రెండు ఎలుకలు పుట్టాయి.వాటికి రోజూ ఇంత తిండి తెచ్చి పెడుతూ పెంచసాగింది. క్రమక్రమంగా అవి పెరగ సాగాయి.బొరియలో అటూ ఇటూ పరుగెడుతూ ఆడుకో సాగాయి. ఒకరోజున ఎలుక తిండి వెతికి తేవటానికి వెళుతూ “పిల్లలూ! బయటికి వెళ్లకండి. నేనే మిమ్మల్ని బయటి కి తీసుకెళ్ళి ,ఎలా […]

Continue Reading
Posted On :

అనగనగా- గొప్పదనం (బాలల కథ)

      గొప్పదనం -ఆదూరి హైమావతి  అనగ అనగా రామాపురం అనేగ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు.అతడు తన పొలంలో వాదుకునే పరికరాలనంతా తన ఇంటిపక్కనే ఉండే రేకులషెడ్డులో ఉంచేవాడు.రామయ్యభార్య సూరమ్మకూడా తాను పెరట్లోనూ , ఇంట్ళోనూ వాడుకునే కొన్ని వస్తువులను అందుబాటూగా ఉంటాయని అక్కడేపెట్టేది. ఒకరోజున ఆమె గబగబా రేకులషెడ్డులోకి వచ్చి అక్కడ క్యాలెండర్ కు గుచ్చి ఉంచిన సూదిని తీసుకెళ్ళి ముళ్ళు గుచ్చుకుని చిరిగిన రామయ్య పంచెను కుట్టి తెచ్చి మళ్ళీ అక్కడే ఉంచ్చి వెళ్ళింది. […]

Continue Reading
Posted On :

అనగనగా- భావన (బాలల కథ)

  భావన -ఆదూరి హైమావతి  అనగా అనగా మైసూరు రాజ్యాన్ని మేధవర్మ అనే రాజు  పరిపాలించేవాడు. ఆయన మంచి పాలకుడు. వివేకవంతుడు.ప్రఙ్ఞాశాలి. అతడు ప్రజల క్షేమం కోసం నిరంతరం శ్రమించే వాడు. ప్రతి రాత్రీ రెండోఝాములో తన ఆంతరంగిక మంత్రులతోనూ, విద్యా వేత్తలతోనూ సమావేశాలు జరిపి ప్రజల బాగోగులు చర్చించేవాడు. ఒకరోజున ఆంతరంగిక సమావేశంలో  “మనకు ఇతరులపై ఏర్పడే అభిప్రాయాలు వారిని మొదటిమారు చూడగానే   మన మనస్సులో కలిగే అభిప్రాయాన్నిబట్టి ఉండవచ్చు, లేదా తాము దేనిగురించీ ఆలోచిస్తు […]

Continue Reading
Posted On :

అనగనగా- మహాభాగ్యం (బాలల కథ)

మహాభాగ్యం -ఆదూరి హైమావతి  పావన దేశానికి రాజు పరిమళవర్మ .వారిపూర్వుల్లా ధర్మపాలనచేస్తూ పేద ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే వాడు. రాజ్యం సుఖిక్షంగా ఉండటాన పరిమళవర్మకు తగినపని లేకపోయింది. రాజ్యపాలన కూడా తగిన మంత్రివ ర్యు లుండటాన వారికే అన్నీ వదిలేసి, సోమరిగా మారాడు. క్రమంగా కూర్చుని తినటాన  స్థూలకాయం వచ్చింది. లేచి ఏ పనీ చేయలేక పోయేవాడు. రోజంతా సింహాసనం మీదో, హంస తూలికాతల్పంలోనో గడిపే వాడు. ఎవ్వరికీ మహారాజుకు తన దినచర్య గురించీ చెప్పే ధైర్యంలేక […]

Continue Reading
Posted On :

అనగనగా- మాతృదీవెన (బాలల కథ)

మాతృదీవెన -ఆదూరి హైమావతి   నారాయణపురం అనేగ్రామంలో అనంతమ్మ తన ఏకైక కుమారుడైన నారాయణతో జీవిస్తుండేది.ఆమె భర్త ఎండుకట్టెలు అడవినుంచీతెచ్చి అమ్మి సంసారం గడిపేవాడు. ఒకరోజున కట్టెలకోసం అడవికివెళ్ళి గంధం చెట్టు ఎండుకట్టెలు కొడు తుండగా నాగుపాము కాటేసి అక్కడికక్కడే మరణించాడు.       అనంతమ్మ ఎంతో నిబ్బరంగా  తన గుడిసె చుట్టూతా కూర పాదులు పెంచుకుంటూ ,అవి అమ్ముకుని వచ్చిన సొమ్ముతో పొదుపుగా  ,కుదురుగా కుమారుని పోషించుకుంటూ జీవించేది.    నారాయణ కూడా తల్లి రాగన్నం పెట్టినా, జొన్నన్నం పెట్టినా, గంజి […]

Continue Reading
Posted On :