image_print

కొండమల్లిపూలు (కవిత)

కొండమల్లిపూలు   -వసీరా కొండమల్లి పూలు ఊరికే రావు కూడా తీసుకొస్తాయి కొత్త రుతువుని పిల్లలకు తీయని సన్నాయిలని వెళ్ళిపోయే వర్షాలు ఇచ్చే తాయిలాన్ని మంచులో పొట్లం కట్టిన వెచ్చని సూరీణ్ణి కొండమల్లి పూలు చూసినప్పుడల్లా నాకెందుకో ఊరికూరికే నవ్వాలనిపిస్తుంది నెత్తిన పోసుకుని పిచ్చి పిచ్చిగా ఆడుకోవాలనిపిస్తుంది పసితనం తీయగా పిలిచి తనలోకి లాక్కుంటుంది జీవితం ముందు చేతులు చాచి నుంచుని స్తుతి గీతాలు పాడాలని పిస్తుంది. ఓ నా జీవితమా! నీ ముందు మోకరిల్లి ప్రార్థించకుండానే పువ్వుల్లోకి […]

Continue Reading
Posted On :

నీ కలని సాగు చేయడానికి (కవిత)

నీ కలని సాగు చేయడానికి   -వసీరా చల్లగా వచ్చిన వరద నీరు వీడని నీడలా….లోపలి నుండి తొలుచుకొచ్చే నీడలా ఇక జీవితకాలపు సహచరిలా స్థిరపడిపోతోందా? నువ్వయితే ఇన్ని సూర్యకిరణాలనీ వాసంత సమీరాల్ని, యేటి ఒడ్డు ఇసుక మీద ఆటల్నీ వదలి చప్పుడు లేకుండా వెళ్ళిపోయావు అప్పుడు తెలియలేదు శూన్యం ఎంత పెద్దదో బహుశా నువ్వు రాలిన ఆకుల మీది రంగుల రెక్కల్ని తీసుకుని జ్వాలలోంచి జ్వాలలోకి , కలని ఖాళీచేసి శూన్యంలోకి వెళ్ళావనుకున్నాను లేదు, నువ్వు శూన్యాన్ని […]

Continue Reading
Posted On :

వెలుగు రేకల చీకటిపువ్వు

వెలుగు రేకల చీకటిపువ్వు -వసీరా మా నేస్తం కత్తిపద్మ. విశాఖ సముద్రంలో ఒక చిన్నిచేపపిల్ల. ఈ చేపపిల్ల ఏకంగా సముద్రం కథనే కథలుగా చెప్పగలదు. చిన్ని చేపపిల్ల సముద్రం లోతుల్ని విస్తృతినీ, ఆకాశాన్నీ దానిలో సగమైన మట్టిబతుకుల వెతల్నీ కథలుగా చెప్పగలదు. చేపకి సముద్రం గురించి తెలిసినట్టుగా ఆమెకు జనజీవన సాగరం తెలుసు.           ఆమె ఉత్తరాంధ్ర జనజీవన సాగర సంచారి. విప్లవ కారుడు నీటిలో చేపలా ప్రజల మధ్య పనిచెయ్యాలట. పద్మ […]

Continue Reading
Posted On :

ఊ…ఊ అంటోంది పాప (కవిత)

ఊ…ఊ అంటోంది పాప   -వసీరా ఒక స్వప్నంలో తేలుతోంది పాప పడుకున్న మంచం కల మీద తేలే మరో కలలాగ ఉన్నది మంచం మీద పడుకున్న పాప చిన్నిపాప నిద్రపోతోంది మంచు నిద్రపోయినట్లు మంచు ఉదయం సరస్సు నిద్రపోయినట్లు సరస్సు మీద లేత ఎండ నిద్రరపోయినట్లు మేలిమి ఎండలో సరస్సులోని కలువ నిద్రపోయినట్లు అలా పడుకుని ఉన్న పాప శరీరం బహుశ ఒక స్వప్నం తన చిన్నిశ్వాసలోంచి పాపలోకి ఓ స్వప్నం ప్రవేశించి విస్తరిస్తోంది బేబీ నిశ్వాసంలోంచి […]

Continue Reading
Posted On :

సముద్రం (కవిత)

సముద్రం   -వసీరా ఆకాశాన్ని నెత్తి మీదమోస్తూ సముద్రం ఒక చేపగా మారి ఈదేస్తుంది భూతలం మీద సముద్రం ఎగురుతుంది పక్షిగా మారి నీటిరెక్కలతో నీలమేఘమైపోయి సూరీడికి ఆవిరి స్నానం చేయించి సముద్రమే బడి వరండాలోంచి బయటపెట్టిన చిన్నారుల అరచేతుల మీద చినుకులై మునివేళ్లమీద విరిసిన సన్నజాజులై సముద్రమే చిన్నారుల ముఖాలమీద మెరుపులై ముఖపుష్పాల మీంచి ఎగిరే నవ్వుల సీతాకోక చిలుకలై సముద్రమే సముద్రమే బడిగంటమోగినంతనే చినుకుల మధ్య కేరింతలతో మారుమోగే గాలికెరటాలై సముద్రమే తన సొట్టబుగ్గల మీద […]

Continue Reading
Posted On :