image_print

పౌరాణిక గాథలు -24 – అల్పత్వము – నహుషుడు కథ

పౌరాణిక గాథలు -24 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి అల్పత్వము – నహుషుడు కథ నహుషుడు ఒక మహారాజు. అతడి తల్లి ‘స్వర్భానవి’, తండ్రి ‘ఆయువు’, భార్య ‘ప్రియంవద’. ఎన్నో క్రతువులు చేసి దైవత్వాన్ని పొంది ఇంద్రపదవిని కూడా పొందాడు. నహుషుడు ఇంద్రపదవిని ఎలా పొందాడో తెలుసుకుందాం. త్వష్టప్రజాపతికి విశ్వరూపుడు అనే పేరు గల కొడుకు ఉండేవాడు. ఇంద్రుడి మీద కోపంతో త్వష్టప్రజాపతి మూడు శిరస్సులు గల విశ్వరూపుణ్ని సృష్టించుకుని అతణ్ని ఎలాగయినా సరే ఇంద్రుణ్ని చెయ్యాలని నంకల్పించుకున్నాడు. […]

Continue Reading

పౌరాణిక గాథలు -23 – వ్యసనము – నలమహారాజు కథ

పౌరాణిక గాథలు -23 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి వ్యసనము – నలమహారాజు కథ రుచిగా వంట చేసేవాళ్ళ పేర్లు చెప్పమంటే నలుడు, భీముడు అని వెంటనే సమాధానం చెప్పేస్తాం. నలుడు చేసిన పాకాన్ని (వంటని) నలపాకం అంటారు. ఇప్పటి వరకు ఆయన వంట గురించి చెప్పుకుంటున్నాము అంటే అంత రుచిని తెప్పించే కిటుకులేవో ఆయన దగ్గర ఉండే ఉంటాయి. నలమహారాజుకి కొన్ని శక్తులు ఉన్నాయి. కొంచెం గడ్డిని చేత్తో తీసుకుని విసిరితే చాలు నిప్పు పుట్టేదిట. కట్టెలు […]

Continue Reading

పౌరాణిక గాథలు -22 – నమ్మకము – శబరి కథ

పౌరాణిక గాథలు -22 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి నమ్మకము – శబరి కథ ఆమె చాలా సామాన్యమైన స్త్రీ. కాని, ఆమె నమ్మకం చాలా గొప్పది. ఆ నమ్మకంతోనే ఆమె జీవితంలో అసాధ్యమైనదాన్ని సాధ్యామయినదాన్నిగా చేసుకోగలిగింది. ఆమె ఎవరో కాదు శబరి. ఆమె కథ భారతీయులందరికీ తెలుసు. శబరి అనగానే ఆశ్రమం తలుపు దగ్గర ఎవరి కోసమో ఆతృతతో ఎదురు చూస్తూ నిలబడిన ఒక వృద్ధురాలి చిత్రం మన మనస్సులో మెదులుతుంది. అప్పుడు శబరి చాలా చిన్నపిల్ల. […]

Continue Reading

పౌరాణిక గాథలు -21 – దైవభక్తి – నందీశ్వరుడు కథ

పౌరాణిక గాథలు -21 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి దైవభక్తి – నందీశ్వరుడు కథ ద్వాపర యుగ౦లో శిలాదునుడనే పేరు గల శివ భక్తుడు ఉ౦డేవాడు. అతడికి స౦తాన౦ లేదు. శివుణ్ని గురి౦చి తప్పస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుణ్ని చూసిన శిలాదుడు ఆన౦ద౦తో పరవశి౦చిపోయాడు. “పరమేశ్వరా! నాకు స౦తాన౦ లేదు… నిన్నే నమ్ముకున్నాను. నీ య౦దు భక్తి గలిగి గుణవ౦తుడైన కొడుకు ఒకడు౦టే చాలు, ప్రసాది౦చు స్వామీ!” అని ప్రార్ధి౦చాడు. “శిలాదా! నీ […]

Continue Reading

పౌరాణిక గాథలు -20 – త్రిశ౦కు స్వర్గము – సత్యవ్రతుడు కథ

పౌరాణిక గాథలు -20 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి  త్రిశ౦కు స్వర్గము – సత్యవ్రతుడు కథ ‘త్రిశ౦కు స్వర్గ౦’ అనే పేరు విన్నా౦ కదూ…ఆ స్వర్గాన్ని ఎవరు ఎవరికోస౦ నిర్మి౦చారు… ఎ౦దుకు నిర్మి౦చారు… విషయ౦ ఇప్పుడు తెలుసుకు౦దా౦. పూర్వ౦ సూర్యవ౦శ౦లో ‘త్రిబ౦ధనుడు’ అనే పేరుగల రాజు ఉ౦డేవాడు. అతడి కొడుకు పేరు సత్యవ్రతుడు. సత్యవ్రతుడు త౦డ్రిలా గుణవ౦తుడు కాదు. అందర్నీ బాధలు పెడుతూ ఉండే వాడు. త౦డ్రి ఎన్ని విధాలుగా చెప్పినా అతడి తలకెక్కేది కాదు. ఒకరోజు ఒక […]

Continue Reading

పౌరాణిక గాథలు -19 – జీర్ణ౦ జీర్ణ౦ వాతాపి జీర్ణ౦ – ఇల్వలుడు కథ.

పౌరాణిక గాథలు -19 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి జీర్ణ౦ జీర్ణ౦ వాతాపి జీర్ణ౦ – ఇల్వలుడు కథ పూర్వ౦ ఒక ఊళ్ళో వాతాపి, ఇల్వలుడు అనే అన్నదమ్ములు౦డేవారు. ఇల్వలుడు ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి “ నేను అనుకున్న పనులు నిర్విఘ్న౦గా జరిగిపోయేలా ఒక మ౦త్రాన్ని ఉపదేశి౦చ౦డి స్వామీ!” అని అడిగాడు. “నాయనా! నువ్వు రాక్షసుడివి. రాక్షసులు మ౦త్రోపదేశానికి అర్హులు కాదు. నీకు ఏ మ౦త్రాన్నీ ఉపదేశి౦చలేను! అన్నాడు. ఇల్వలుడు ఊరుకోలేదు. కష్టపడకు౦డానే అన్ని పనులు జరిగిపోవాలన్నది […]

Continue Reading

పౌరాణిక గాథలు -18 – సజ్జనసాంగత్యము – చంద్రహాసుడు కథ.

పౌరాణిక గాథలు -18 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి సజ్జనసాంగత్యము – చంద్రహాసుడు కథ కుంతలదేశపు మహారాజుకి మగపిల్లలు లేరు. ఒక కూతురు మాత్రం ఉంది. ఆమె పేరు చంపకమాలిని. తన రాజ్యానికి వారసులు లేరని బాధపడుతూ ఉండేవాడు. అతడి మంత్రి పేరు దుష్టబుద్ధి. పేరుకు తగ్గట్టే ఉండేవాడు. అతడి కొడుకు పేరు మదనుడు. కుమార్తె పేరు విషయ. తన కొడుకు మదనుడికి రాజు కూతురు చంపకమాలినిని ఇచ్చి పెళ్ళిచేస్తే రాజ్యం తనదవుతుందని దుష్టబుద్ధి దుష్ట ఆలోచన చేస్తుండేవాడు. […]

Continue Reading

పౌరాణిక గాథలు -17 – ఏకాగ్రత – గురుశిష్యులు కథ

పౌరాణిక గాథలు -17 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ఏకాగ్రత – గురుశిష్యులు కథ అనగా అనగా ఒక ఊళ్ళో ఒక గురువుగారు ఉ౦డేవారు. ఆయన దగ్గర చాలా మ౦ది శిష్యులు చదువుకు౦టూ ఉ౦డేవాళ్ళు. ఉదయాన్నే గురువుగారి క౦టే ము౦దే లేచి ఆయన పుస్తకాలు సర్దడ౦, హోమానికి సమిథలు తీసుకు రావడ౦, పూజకి పువ్వులు కోయడ౦ వ౦టి పనులన్నీ చేసేవాళ్ళు. తరువాత గురువుగారు వచ్చి పాఠాలు చెప్పేవారు. శిష్యుల౦దరు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉ౦డేవాళ్ళు. ఒకరోజు గురువుగారికి పొరుగూర్లో […]

Continue Reading

పౌరాణిక గాథలు -16 – కులవృత్తి – కౌశికుడు కథ

పౌరాణిక గాథలు -16 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి కులవృత్తి – కౌశికుడు కథ కౌశికుడు అనే బ్రాహ్మణుడు వేదాధ్యయన౦ చేస్తు౦డేవాడు. ఒకనాడు చెట్టు కి౦ద కూర్చొని వేదాలు వల్లి౦చుకు౦టున్నాడు. ఆ చెట్టు మీద ఉన్న ఒక కొంగ అతడి మీద రెట్ట వేసి౦ది. కౌశికుడికి కోప౦ ఆగలేదు. ఎర్రటి కళ్ళతో పైకి చూశాడు. అ౦తే! ఆ కొ౦గ బూడిదయి కి౦ద పడిపోయి౦ది. అతడు బిక్షకోస౦ బయల్దేరి ఒక ఇ౦టి ము౦దు ఆగాడు. ఆ ఇల్లాలు పనిలో ఉ౦డి […]

Continue Reading

పౌరాణిక గాథలు -15 – కోపాగ్ని – ఔర్వుడు కథ

పౌరాణిక గాథలు -15 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి కోపాగ్ని – ఔర్వుడు కథ ప్రపంచంలో గొప్పవాడుగా ప్రసిద్ధిపొందిన పరాశరుడు వసిష్ఠ మహర్షికి మనుమడు. వసిష్ఠుడు అతణ్ని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. అంతకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటోంది అతడి తల్లి దృశ్యంతి. వాళ్ళిద్దరి ప్రేమతో సకల విద్యలు నేర్చుకుంటూ పెరుగుతున్నాడు పరాశరుడు. ఒకరోజు పరాశరుడు తల్లి దగ్గరకి వచ్చి “అమ్మా! నా తండ్రి ఎవరు?ఎక్కడున్నాడు?” అని అడిగాడు. దృశ్యంతి కళ్ళనీళ్ళు కారుస్తూ ఏడుస్తోంది కాని తండ్రి గురించి చెప్పలేదు. తల్లి […]

Continue Reading

పౌరాణిక గాథలు -14 – పట్టుదల – ఉదంకుడు కథ

పౌరాణిక గాథలు -14 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి పట్టుదల – ఉదంకుడు కథ మహర్షుల్లో గొప్పవాడు గౌతమ మహర్షి. ఆయన దగ్గరకి విద్య నేర్చుకునేందుకు ఎంతో మంది విద్యార్ధులు వస్తుండేవాళ్ళు. వాళ్ళందరు మహర్షి చెప్పినట్టు విని విద్య నేర్చుకునేవాళ్ళు. ఆ రోజుల్లో శిష్యులకి విద్య నేర్చుకోవడం అయిపోయిందో లేదో గురువుగారే నిర్ణయిం చేవారు. ఆయన ఒక్కొక్కళ్ళనే పిలిచి “ఒరే అబ్బాయ్! నువ్వు ఎంత వరకు నేర్చుకున్నా వు?” అని అడిగేవారు. వాళ్ళు చెప్పినదాన్ని బట్టి కొన్ని ప్రశ్నలు […]

Continue Reading

పౌరాణిక గాథలు -13 – అంకితభావము – అహల్య కథ

పౌరాణిక గాథలు -13 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి అంకితభావము – అహల్య కథ ఆమెని మనం మర్చిపోయాం. కాని, ఆమెని పవిత్రమైన స్త్రీగా చరిత్ర గుర్తుపెట్టు కుంది. ఆమె పేరు అహల్య. గౌతమ మహర్షి భార్య. సన్యాసికి మహర్షికి మధ్య తేడా ఉంది. సన్యాసులకి గృహసంబంధమైన సంబంధాలు ఉండవు. అన్నీ త్యాగం చేసి వచ్చేస్తారు. మహర్షులకి కుటుంబం ఉంటుంది. కాని, నగరంలో జీవించరు. సమాజానికి దూరంగా వచ్చి జీవిస్తూ ఆధ్యాత్మిక చింతనతో పరమాత్మను గురించి తెలుసుకోడంలో మునిగి […]

Continue Reading

పౌరాణిక గాథలు -12 – పాతివ్రత్యము – దమయంతి కథ

పౌరాణిక గాథలు -12 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి పాతివ్రత్యము – దమయంతి కథ నలమహారాజు గుణగణాల గురించి ఒక హంస ద్వారా విన్న దమయంతి అతణ్నే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంది. దమయంతి గురించి విని ఆమెనే పెళ్ళి  చేసు కోవాలని నలమహారాజు కూడా నిర్ణయించుకున్నాడు. ఆమె ఒక రాజకుమారి, అతడు ఒక రాజకుమారుడు. కొంత మంది దేవతలు కూడా దమయంతిని పెళ్ళి చేసుకోవాలని స్వయంవరానికి వచ్చారు. ఎవర్నయినా సరే వాళ్ళల్లో ఒకళ్ళని పెళ్ళి చేసుకోమని చెప్పమని నలుణ్ని […]

Continue Reading

పౌరాణిక గాథలు -11 – ఆదర్శము – భామతి కథ

పౌరాణిక గాథలు -11 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ఆదర్శము – భామతి కథ భర్తకోసం తనకు తానుగా ఎంతో గొప్ప త్యాగం చేసింది. మౌనంగా అంకితభావంతో సేవ చేసి భర్త సాధించాలనుకున్నదాన్ని సాధించడానికి తన వంతు సహకారం అందించింది. చాలా ప్రాచీన కాలంలోనే కాదు ప్రస్తుతపు రోజుల్లో కూడా అటువంటి మహిళలు ఉన్నారు అని చాటి చెప్పిన మహిళ కథ. ***           అడవంతా ప్రశాంతంగా ఉంది. అతడి విషయంలో అది […]

Continue Reading

పౌరాణిక గాథలు -10 – ఓర్పు – శకుంతల కథ

పౌరాణిక గాథలు -10 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ఓర్పు – శకుంతల కథ అమె భర్తే ఆమెని గుర్తుపట్టలేక పోయాడు. అంతకంటే దురదృష్టం ఇంకే ముంటుంది? అయినా ఓర్పుతో సమయం వచ్చేదాకా ఎదురు చూసింది. చివరికి ఆమె గెలిచింది… ఆమె ఎవరో కాదు కణ్వమహర్షి కూతురు ‘శకుంతల’. మనం చూస్తూ ఉంటాం…నిజాయితీ లేని వాళ్ళు, సత్ప్రవర్తన లేని వాళ్ళు పెద్ద పెద్ద భవంతుల్లో చాలా గొప్పగా జీవిస్తుంటారు. నిజాయతీగా జీవించేవాళ్ళు, మంచి ప్రవర్తన కలిగినవాళ్ళు గుడిసెల్లో కష్టాలు […]

Continue Reading

పౌరాణిక గాథలు -9 – ఆరాధన – ధ్రువుడు కథ

పౌరాణిక గాథలు -9 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ఆరాధన – ధ్రువుడు కథ ధ్రువుడు ఒక గొప్ప చక్రవర్తికి కొడుకు. అయినా కూడా చక్రవర్తి కొడుకుకి ఉండవలసి నంత గొప్ప రాజభోగాలు అతడికి దక్కలేదు. ధ్రువుడు, అతడి తల్లి కూడా ఎన్నో కష్టాల్ని అనుభవించారు. అందుకు కారణం అతడి సవతి తల్లి. పూర్వం ఉత్తానపాదుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుండేవాడు. ప్రజలందరు అతడి పాలనలో సుఖంగా జీవించారు. అతడికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య […]

Continue Reading

పౌరాణిక గాథలు -8 – సత్యదీక్ష – హరిశ్చంద్రుడు కథ

పౌరాణిక గాథలు -8 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి సత్యదీక్ష – హరిశ్చంద్రుడు కథ భూ లోకంలో నిజం చెప్పేవాళ్ళల్లో హరిశ్చంద్ర మహారాజుని మించినవాళ్ళు లేరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి స్వర్గంలో ఇంద్రుడు మహర్షులందరితో కలిసి సభ నిర్వహిస్తున్నాడు. మహర్షులందరూ ఇంద్రసభలో ఎవరి ఆసనాల మీద వాళ్ళు కూర్చున్నారు. సభ జరుగుతుండగా ఎప్పుడూ నిజాన్నే పలికేవాడు ఎవరున్నారు? అనే విషయం మీద చర్చ వచ్చింది. దానికి వసిష్ఠ మహర్షి ‘హరిశ్చంద్రుడు’ అని సమాధానం చెప్పాడు. వెంటనే […]

Continue Reading

పౌరాణిక గాథలు -7 మహాభారతకథలు – ధైర్యము – సావిత్రి కథ

పౌరాణిక గాథలు -7 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ధైర్యము – సావిత్రి కథ ఆమెకి తెలుసు ఆమె భర్త ఒక సంవత్సరంలో చచ్చిపోతాడని. ఎలాగయినా సరే తన భర్తని బ్రతికించుకోవాలని ఆమె పట్టుదల. ఆమె అనుకున్నట్టే పట్టుదలతో భర్తని బ్రతికించుకుంది కూడా. ఇదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న సావిత్రి కథ. సావిత్రి ఒక రాజకుమార్తె. ఆమె తల్లితండ్రులు చాలా కాలం సూర్యభగవానుణ్ని ఉపాసించడం వల్ల ఆమె జన్మించింది. ఆమె గొప్ప గుణవంతురాలు. యుక్త వయస్సు వచ్చాక తనకు […]

Continue Reading

పౌరాణిక గాథలు -6 మహాభారతకథలు – ఆత్మజ్ఞానము – నచికేతుడు కథ

పౌరాణిక గాథలు -6 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ఆత్మజ్ఞానము – నచికేతుడు కథ           నచికేతుడి తండ్రి గొప్ప మహర్షి. ఆయన నచికేతుణ్ని యముడి దగ్గరికి పంపించా డు. అయినా కూడా అతడు చిరంజీవిగా తిరిగి వచ్చేశాడు.           అసలు మహర్షి తన కొడుకు నచికేతుణ్నిఎందుకలా చేశాడు? నచికేతుడు తన తండ్రిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. అవి అడగదగ్గవే! అయినా పిల్లలు ప్రశ్నిస్తే పెద్దవాళ్ళ కి […]

Continue Reading

పౌరాణిక గాథలు -5 మహాభారతకథలు – పురాణపురుషుడు పరీక్షిత్తు మహారాజు కథ

పౌరాణిక గాథలు -5 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి పురాణపురుషుడు పరీక్షిత్తు మహారాజు కథ మహాభారతం మొత్తం వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్పినట్లు ఉంటుంది కదా. జనమేజయుడు ఎవరూ అంటే పరీక్షిత్తుమహారాజు కొడుకు. పరీక్షిత్తు మహారాజు ఎవరూ అంటే అభిమన్యుడికి కొడుకు పాండవులకి మనుమడు. ఈ మహా భారతంలో పరీక్షిత్తు మహారాజు గురించిన కథ చదువుదాం. ఉదంకమహర్షి ఒకసారి జనమేజయ మహారాజుని కలిసి దానాలు, యజ్ఞాలు చేస్తూ, భరతవంశాన్ని వృద్ధిపరుస్తూ, ప్రజలందరికీ మేలు చేస్తూ అర్జునుడితో సమానమైన, ఇంద్రియ […]

Continue Reading

పౌరాణిక గాథలు -4 మహాభారతకథలు – మాంధాతృడు కథ

పౌరాణిక గాథలు -3 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి మాంధాతృడు కథ మన పురాణాల్లోను, ఇతిహాసాల్లోను గొప్ప కీర్తి పొందినవాళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్లందరూ మనకి తెలియదు కదా! వాళ్లు ఏ కాలంలో జీవించినా ఆ కాలంలో వాళ్లే చాలా గొప్పవాళ్లు అనిపించు కున్నారు. అటువంటి వ్యక్తులు ఎంతోమంది ఈ భూమి మీద పుట్టి, వేల సంవత్సరాలు జీవించి, ఎన్నో మంచి పనులు చేసి యుగాలు గడుస్తున్నా ఇప్పటికీ కీర్తి కాయంతో జీవించి ఉన్నారు. వాళ్లు ఇప్పుడు […]

Continue Reading

పౌరాణిక గాథలు -3 మహాభారతకథలు – అష్టావక్రుడు కథ

పౌరాణిక గాథలు -3 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి అష్టావక్రుడు కథ ఈ కథ కూడా పాండవులకి రోమశ మహర్షి చెప్పిన కథే! ధర్మరాజు కౌరవులతో జూదమాడి ఓడిపోయాడు. తరువాత వాళ్ళు అనుకున్న ప్రకారం పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. ఆ కాలంలో ఎవరూ అన్నమాట తప్పేవాళ్లు కాదు. ఒక మాట అన్నారు అంటే దాన్ని తప్పకుండా పాటించేవాళ్లు. అందుకే మాట అనే ముందు బాగా ఆలోచించి అనేవాళ్లు. ధర్మరాజు జూదం ఆడడానికి […]

Continue Reading

పౌరాణిక గాథలు -2 మహాభారతకథలు – మహాభారత కృతి కర్త వ్యాసమహర్షి కథ

పౌరాణిక గాథలు -2 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ధర్మోరక్షతి రక్షితః మహాభారతకథలు మహాభారత కృతి కర్త వ్యాసమహర్షి కథ మన దేశం భారతదేశం. ధర్మాధర్మాల్ని బోధించిన గ్రంథం.. వ్యాసమహర్షి చెప్పగా విఘ్నేశ్వరుడు రాసిన గ్రంథం మహాభారతం. సంస్కృతంలో రచించిన ఈ గ్రంథాన్ని నన్నయ తెలుగులో అనువదించడానికి ఉపక్రమించి వెయ్యిసంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికీ అదే ప్రమాణాలతో.. అదే పవిత్రతతో.. అదే గౌరవంతో నిలిచి ఉన్నశ్రీమదాంధ్ర మహాభారతంలో మనం తెలుసుకోవలసిన ఎంతో మంది మహర్షులు,గురువులు,రాజులు, ధర్మాత్ములు, దానపరులు వీరులు, ధీరులు […]

Continue Reading