image_print

అముద్రిత కావ్యం (నెచ్చెలి-2024 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)

అముద్రిత కావ్యం (నెచ్చెలి-2024 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత) – శింగరాజు శ్రీనివాసరావు పుట్టినది ‘పాప’ అన్న మాట చెవుల బడితే చాలు పుడమి లోపలికి కూరుకుపోయిన భావనలు ఆమె బడికి పోతానని అడిగితే చాలు వళ్ళంతా వాచేలా బడిత పూజలు వయసు ఉబికి వస్తున్నదంటే చాలు ఉరికి మించిన భయంకరమైన ఆంక్షల శిక్షలు కట్టుకున్న గుడ్డలో నుంచి కాయం గాయపడేలా గుచ్చుకునే ఆకలి చూపుల శూలాలు అగ్నిహోత్రం సాక్షిగా ఆవిరయిపోయిన కొద్దిపాటి స్వేచ్ఛా స్వాతంత్రయాలు […]

Continue Reading

అమృత కలశం

అమృత కలశం – శింగరాజు శ్రీనివాసరావు అనాటమీలో తప్ప ఆవిర్భావంలో తేడా లేదు పలక పట్టకముందే వివక్షకు తెరలేచి చదువుకోవాలనే ఆశను ఆవిరిగా మార్చింది లక్ష్మణరేఖల మధ్య బంధించబడిన బాల్యం గుంజకు కట్టిన గాలిపటమై ఎగరలేక నాలుగు గోడల మధ్య శిలువ వేసుకుంది రేపటి పొద్దు జీవితానికి ముగ్గు పెడుతుందని పరిచయం లేని బంగారు మొలతాడును తెచ్చి పందిరిలో బందీని చేస్తే, మనసులో ఊహలు మసకెక్కాయి ఇంటి పేరు ఎగిరిపోయి, ఇల్లాలు పురుడు పోసుకుంది స్వేచ్ఛకు సంకెళ్ళు […]

Continue Reading

రథసారథులు (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

రథసారథులు (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – శింగరాజు శ్రీనివాసరావు పంచాక్షరి దిద్దవలసిన వయసున పరక చేతికిచ్చి పనిమనిషి పనికి అక్షరాభ్యాసము చేసిననాడు “పలక నాకు పనికిరాదా” అన్నపలుకు పలకనేలేదు మగవాడి మొలతాడును పురిపెట్టి పసుపుతాడును పేని మెడకు ఉరిబిగించి మరబొమ్మను చేసి ఆడించినా మూగగా రోదించినదే తప్ప నోరుమెదప లేదు పేగుల దారాలు లక్ష్మణరేఖను అడ్డుగా గీస్తే బక్కచిక్కిన మనిషి మీద ఆకలి చీకటి హాహాకారం చేస్తే శబ్దంలేని ఉరుము గుండెల్లోనే ఆగిపోయింది […]

Continue Reading

కుంభిక (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

కుంభిక (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – శింగరాజు శ్రీనివాసరావు తననుతాను చంపుకుంటూ అందరికీ ఆనందాన్ని పంచుతూ తాను ఖట్టికమీదశవమై తపించేవారికి వశమై ఎండిన మనసుకు ఎంగిలి మెరుపులు అద్దుతూ పడకమీద పువ్వులతో పెదాలమీద ప్లాస్టిక్నవ్వులతో తానుకోరని బ్రతుకును విధి విధించిన శిక్షగా పసుపుతాడులేని పడుపుతనమే వంచన ప్రేమకు వారసత్వంగా వెలుగుచూడక నలిగిపోయే వెలయాలి బ్రతుకులు పరువునుపూడ్చే బరువులు కావు సమాజదేహం మీద పచ్చబొట్లు ధరణిఒడిలో మొలకలై పెరిగి మనకు తోబుట్టువులుగా ఎదిగి కాలంకత్తికి […]

Continue Reading

అనఘతల్లి (కవిత)

అనఘతల్లి -శింగరాజు శ్రీనివాసరావు ప్రభానుడు తన ప్రతాపాన్ని ప్రజ్వలింప చేస్తున్నాడు రోహిణి వచ్చిందేమో రోళ్ళు పగిలేటంత భగభగలు సగం కాళ్ళు మాత్రమే కప్పుతున్న పాదరక్షలు వడివడిగా అడుగులు వేస్తూ కదిలి పోతున్నాయి నడినెత్తి మీద మెడలు విరిగేటంతటి భారం మోయకపోతే పొయ్యిలో పిల్లి లేవదు మరి చేతులు మాత్రం ఖాళీగా ఉన్నాయనుకోవడానికి లేదు నవమాసాల భారం నేలను తాకి చంకకు చేరింది బుడి బుడి అడుగులు మరో చేతికి అలంకారమాయె కొంగు చుట్టూచేరి చేతనున్న వాడికి గొడుగైతే […]

Continue Reading

కుసుమనిరీక్షణం

కుసుమనిరీక్షణం – శింగరాజు శ్రీనివాసరావు ఎన్నిసార్లు వహ్నిత చెప్పి చూసినా నిరీక్ష మనసు మారడం లేదు. ఆ పేదపిల్ల, అనాకారి కుసుమతో సన్నిహితంగా తిరగవద్దు అంటే వినడం లేదు. నాలుగు ఇళ్ళలో పనిచేసే పనిమనిషి రాములమ్మ కూతురు కుసుమ. ఆ పిల్ల తండ్రి తాగుబోతు. రాములమ్మను రోజూ ఏదో ఒక వంక పెట్టి కొడుతుంటాడట. పనిమనిషి కూతురని కుసుమంటే ఒక రకమైన చిన్నచూపు వహ్నితకు. కుసుమది తన కూతురిది ఒకటే తరగతి. ఇద్దరూ కలసి ఈ సంవత్సరం […]

Continue Reading

ఓటమి ఎరుగని తల్లి (కవిత)

ఓటమి ఎరుగని తల్లి -శింగరాజు శ్రీనివాసరావు కడుపు సంచి ఖాళీగా వున్న దేహాన్ని గర్భసంచి బరువు సమం చేసింది బక్కచిక్కిన శరీరపు ఒడిలోకి చచ్చుబడిన పిండం ప్రాణం పోసుకుంది నవ్వే బిడ్డకు నడకలేని కాళ్ళు దిష్టి చుక్కల్లా.. దరిద్రానికి తోబుట్టువులా అవిటితనం.. అసంపూర్ణ పుష్పాన్ని చూసి ఆమె దూషించలేదు నడవలేని కన్నయ్యవని మురిసి రొమ్ముపీకను నోటికందించింది తరువుకు కాయ బరువు కాదని తనయుడి భారాన్ని భుజాన వేసుకుంది కదలలేని కాయం మోయలేనంత ఎదిగితే నడుము వంచి గజమై […]

Continue Reading

పువ్వు పూసింది (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో మూడవ బహుమతి రూ.1000/- పొందిన కథ)

 పువ్వు పూసింది (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో మూడవ బహుమతి రూ.1000/- పొందిన కథ) – శింగరాజు శ్రీనివాసరావు కొత్తగా కొన్నఅపార్టుమెంటులో సాయంవేళ  కాలక్షేపం కోసం కిందికివచ్చి లాన్లో కూర్చుంది విహారిక. అదొక గేటెడ్  కమ్యూనిటీ కావడం వల్ల ఆటస్థలంలో పిల్లలందరూ చేరి ఆడుకుంటున్నారు. సుమారు నాలుగు వందల ఫ్లాట్లు ఉన్నాయి అందులో. విహారికకు సమీపంలో […]

Continue Reading