స్వప్న వీధిలో… (కవిత)
స్వప్న వీధిలో… -డి.నాగజ్యోతిశేఖర్ రోజూ రెప్పలతలుపులు మూయగానే … నిద్రచీకటిలో గుప్పున వెలుగుతుందో నక్షత్రమండలం! కలతకృష్ణబిలాల్ని కలల లతల్లో చుట్టేసి… దిగులు దిగుడుబావిని దిండుకింద పూడ్చేసి ఒళ్లు విరుచుకుంటుందో వర్ణప్రపంచం! ఊహాల్ని శ్వాసల్లో నింపి… ఊసుల్ని పూలలోయల్లో ఒంపి… మనస్సు మూట విప్పుతుందో వినువీధి! ఆ వీధి మధ్యలో పచ్చటి చెట్టయి నవ్వుతుంటుంది నా మస్తిష్కం.! ఆ సందు చివర కురులారాబోసుకుంటుంది నా నవ్వుల వెన్నెల కెరటం! నడి వీధిలో నవ్వేెంటనే ఆధిపత్యపు స్వరాలు లేవు! ఆకాశపు అంచుల్లో నువ్వేెంటనే అమావాస్యపు […]
Continue Reading