ఓ కవిత విందాం! “మేం పోరాడుతాం” (కవిత)
మేం పోరాడుతాం -లలితా వర్మ పుట్టినదాదిగా పోరాడుతూనే ఉన్నాంఎన్ని యుద్ధాలు చేయలేదు! మా జీవితం నిన్నటి సమరమైనా అనునిత్యం నూతన భావికి గమనమే రూపుదిద్దుకోక మునుపే రూపుమాపే జన్మకారకులతో లేలేత చిరు ప్రాయాన్నినలిపేసే కిరాతకులతో సొగసునలద్దుకున్న యవ్వనాన్ని కాటేసే కసాయిలతో కడుపుచేతబట్టి వెడలినచోటలైంగికవేధింపులకు గురిచేసేమేకవన్నె పులులతో నాలుగు గోడల మధ్య సాగే గృహహింసకుకారణభూతులైన పతిదేవుళ్లతో కనిపించే శారీరక గాయాలకు ప్రత్యామ్నాయంగా,మనసుకు కనబడని గాయం చేసేప్రబుద్ధులతో బాంధవ్యాలలో భేదాలు చూపేకన్నవారితో అడుగడుగున ఆంక్షలతోఅస్తిత్వాన్ని సవాలు చేసేమెట్టినింటివారితో నొసలు భక్తుడై నోరు తోడేళ్లయిన సంఘ జనులతో, ఆచారాలు దురాచారాలు చేసి బ్రతుకు దుర్భరం చేసేఛాందసులతో మేము మేము గా బ్రతకటానికి పోరాడుతూనే ఉన్నాం. మేము మహిళలంఆదిశక్తి అంశలంవిజయం సాధించే వరకూపోరాడుతూనే […]
Continue Reading