image_print
Kandepi Rani Prasad

ఎలుక పిల్ల పెళ్ళి

ఎలుక పిల్ల పెళ్ళి -కందేపి రాణి ప్రసాద్ ఒక ఎలుక తన కూతురికి పెళ్ళిచేయాలి అనుకున్నది. అనుకున్నదే తడవుగా తన మిత్రులందరికీ చెప్పింది. మా పిల్లకు మంచి సంబంధాలు చూడమని అందరినీ కోరింది. అందరూ మంచి సంబంధాలు చూస్తామని మాట ఇచ్చాయి . ఎలుక తన కూతురికి బాగా అందగాడైన భర్తను తీసుకురావాలని అనుకున్నది. ఒక రోజు నెమలి మంచి కబురు తీసుకు వచ్చింది . ” మీ పిల్లకు చాలా అందంగా ఉన్న వరుడిని చూశాను […]

Continue Reading

పౌరాణిక గాథలు -24 – అల్పత్వము – నహుషుడు కథ

పౌరాణిక గాథలు -24 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి అల్పత్వము – నహుషుడు కథ నహుషుడు ఒక మహారాజు. అతడి తల్లి ‘స్వర్భానవి’, తండ్రి ‘ఆయువు’, భార్య ‘ప్రియంవద’. ఎన్నో క్రతువులు చేసి దైవత్వాన్ని పొంది ఇంద్రపదవిని కూడా పొందాడు. నహుషుడు ఇంద్రపదవిని ఎలా పొందాడో తెలుసుకుందాం. త్వష్టప్రజాపతికి విశ్వరూపుడు అనే పేరు గల కొడుకు ఉండేవాడు. ఇంద్రుడి మీద కోపంతో త్వష్టప్రజాపతి మూడు శిరస్సులు గల విశ్వరూపుణ్ని సృష్టించుకుని అతణ్ని ఎలాగయినా సరే ఇంద్రుణ్ని చెయ్యాలని నంకల్పించుకున్నాడు. […]

Continue Reading
Kandepi Rani Prasad

తల్లి మాట వినని పిల్లపాము

తల్లి మాట వినని పిల్లపాము -కందేపి రాణి ప్రసాద్ “నొప్పి  తగ్గిందా తండ్రీ!” అంటూ అడిగింది నాగరాణి తన పుత్ర రత్నాన్ని. “ఇంకా చాలా నోప్పిగా ఉందమ్మా” ఏడుపు తన్నుకొస్తుండగా పాము పిల్ల బాధగా చెప్పింది. నాగరాణి అనే తల్లిపాము కూడా కళ్ళ వెంట నీరు కారుస్తూనే ఉన్నది.           “అయినా నేను జాగ్రత్తలు చెప్పి వెళ్ళాను, నువ్వు వినిపించుకోలేదు. పుట్ట విడిచి బయటకు రావద్దన్నానా! అంటూ తల్లి పాము తన కొడుకు […]

Continue Reading

పౌరాణిక గాథలు -23 – వ్యసనము – నలమహారాజు కథ

పౌరాణిక గాథలు -23 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి వ్యసనము – నలమహారాజు కథ రుచిగా వంట చేసేవాళ్ళ పేర్లు చెప్పమంటే నలుడు, భీముడు అని వెంటనే సమాధానం చెప్పేస్తాం. నలుడు చేసిన పాకాన్ని (వంటని) నలపాకం అంటారు. ఇప్పటి వరకు ఆయన వంట గురించి చెప్పుకుంటున్నాము అంటే అంత రుచిని తెప్పించే కిటుకులేవో ఆయన దగ్గర ఉండే ఉంటాయి. నలమహారాజుకి కొన్ని శక్తులు ఉన్నాయి. కొంచెం గడ్డిని చేత్తో తీసుకుని విసిరితే చాలు నిప్పు పుట్టేదిట. కట్టెలు […]

Continue Reading
Kandepi Rani Prasad

అన్యాయం చేస్తే చావు తప్పదు

అన్యాయం చేస్తే చావు తప్పదు -కందేపి రాణి ప్రసాద్ అనగనగా ఒక అడవి ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలున్నాయి.  ఆ చెట్లనిండా పక్షులు గూళ్ళు కట్టుకుని కాపురం చేస్తున్నాయి. పావురాయి, పిచ్చుకలు, కాకులు, రామచిలుకలు, గోరింకలు ఇలా రకరకాల పక్షులకు నెలవుగా ఉండేవి. చెట్ల మీద గూళ్ళు కట్టుకున్న పక్షు లన్నీ జాతి భేదం మరచి అన్యోన్యంగా ఉంటాయి. ఒకరినొకరు ఆనందంగా పలకరించు కుంటాయి.           పొద్దున్న లేవగానే ఎవరి పిల్లలకు వాళ్ళు […]

Continue Reading

పౌరాణిక గాథలు -22 – నమ్మకము – శబరి కథ

పౌరాణిక గాథలు -22 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి నమ్మకము – శబరి కథ ఆమె చాలా సామాన్యమైన స్త్రీ. కాని, ఆమె నమ్మకం చాలా గొప్పది. ఆ నమ్మకంతోనే ఆమె జీవితంలో అసాధ్యమైనదాన్ని సాధ్యామయినదాన్నిగా చేసుకోగలిగింది. ఆమె ఎవరో కాదు శబరి. ఆమె కథ భారతీయులందరికీ తెలుసు. శబరి అనగానే ఆశ్రమం తలుపు దగ్గర ఎవరి కోసమో ఆతృతతో ఎదురు చూస్తూ నిలబడిన ఒక వృద్ధురాలి చిత్రం మన మనస్సులో మెదులుతుంది. అప్పుడు శబరి చాలా చిన్నపిల్ల. […]

Continue Reading
Kandepi Rani Prasad

మాటలు – చేతలు

మాటలు – చేతలు -కందేపి రాణి ప్రసాద్ ఒక కుందేలు తన పిల్లలతో సహా బొరియలో నివసిస్తోంది. ఈ బొరియ చెట్టు కిందనే ఉన్నది. చెట్టు మీదుండే పక్షులన్నీ కుందేలుతో స్నేహంగానే ఉంటాయి. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పక్షులన్నీ మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆ సమయంలో కుందేలు కూడా వాళ్ళతో కబుర్లాడుతూ ఉంటుంది. ఇరుగు పొరుగు స్నేహాలు బాగుండా లని కుందేలు కోరుకుంటుంది.           కుందేలుకున్న నాలుగు పిల్లలు ఆటలు ఆడుతూ కొట్టుకుంటూ […]

Continue Reading

పౌరాణిక గాథలు -21 – దైవభక్తి – నందీశ్వరుడు కథ

పౌరాణిక గాథలు -21 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి దైవభక్తి – నందీశ్వరుడు కథ ద్వాపర యుగ౦లో శిలాదునుడనే పేరు గల శివ భక్తుడు ఉ౦డేవాడు. అతడికి స౦తాన౦ లేదు. శివుణ్ని గురి౦చి తప్పస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుణ్ని చూసిన శిలాదుడు ఆన౦ద౦తో పరవశి౦చిపోయాడు. “పరమేశ్వరా! నాకు స౦తాన౦ లేదు… నిన్నే నమ్ముకున్నాను. నీ య౦దు భక్తి గలిగి గుణవ౦తుడైన కొడుకు ఒకడు౦టే చాలు, ప్రసాది౦చు స్వామీ!” అని ప్రార్ధి౦చాడు. “శిలాదా! నీ […]

Continue Reading
Kandepi Rani Prasad

సింహం మనోగతం

సింహం మనోగతం -కందేపి రాణి ప్రసాద్ అదొక టైగర్ సఫారీ. పేరుకు టైగర్ సఫారీ అని పేరు కానీ అందులో సింహాలు, ఏనుగులు, ఖడ్గమృగాలు ఎలుగుబంట్లు వంటి పెద్ద జంతువులన్నీ ఉంటాయి. స్వేచ్చగా ప్రశాంత వాతావరణంలో జీవిస్తుంటాయి. అని మనుషులు చెప్తారు కానీ నమ్మకండి. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే నేనొక సింహాన్ని, నా కథ చెబుతా వినండి.           నేనొక సింహాన్ని. సింహమంటే ఎవరు? అడవికి రాజు కదా! అడవిలో రాజులా బతికేదాన్ని. నన్ను […]

Continue Reading

పౌరాణిక గాథలు -20 – త్రిశ౦కు స్వర్గము – సత్యవ్రతుడు కథ

పౌరాణిక గాథలు -20 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి  త్రిశ౦కు స్వర్గము – సత్యవ్రతుడు కథ ‘త్రిశ౦కు స్వర్గ౦’ అనే పేరు విన్నా౦ కదూ…ఆ స్వర్గాన్ని ఎవరు ఎవరికోస౦ నిర్మి౦చారు… ఎ౦దుకు నిర్మి౦చారు… విషయ౦ ఇప్పుడు తెలుసుకు౦దా౦. పూర్వ౦ సూర్యవ౦శ౦లో ‘త్రిబ౦ధనుడు’ అనే పేరుగల రాజు ఉ౦డేవాడు. అతడి కొడుకు పేరు సత్యవ్రతుడు. సత్యవ్రతుడు త౦డ్రిలా గుణవ౦తుడు కాదు. అందర్నీ బాధలు పెడుతూ ఉండే వాడు. త౦డ్రి ఎన్ని విధాలుగా చెప్పినా అతడి తలకెక్కేది కాదు. ఒకరోజు ఒక […]

Continue Reading
Kandepi Rani Prasad

పిల్ల దోమలు

పిల్ల దోమలు -కందేపి రాణి ప్రసాద్ అక్కడొక పెద్ద మురుగు నీటి గుంట ఉన్నది. దాంట్లో పెద్ద దోమల కుటుంబం ఉంటోంది. తాతలు, తండ్రులు, అత్తలు, మామలు అందరూ కలిసి ఉండే పెద్ద ఉమ్మడి కుటుంబం. ఈ గుంట పక్కనే పెద్ద నేషనల్ హైవే. ఆ హైవేలో ఒక డాబా హెూటల్ ఉన్నది. ఆ హైవేలో ప్రయాణించే వాళ్ళందరూ దాదాపుగా ఆ హెూటల్ దగ్గర ఆగి తింటుంటారు. అలా కార్లు ఆగినప్పుడు ఈ దోమల కాలనీలోని పిల్లలు […]

Continue Reading

పౌరాణిక గాథలు -19 – జీర్ణ౦ జీర్ణ౦ వాతాపి జీర్ణ౦ – ఇల్వలుడు కథ.

పౌరాణిక గాథలు -19 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి జీర్ణ౦ జీర్ణ౦ వాతాపి జీర్ణ౦ – ఇల్వలుడు కథ పూర్వ౦ ఒక ఊళ్ళో వాతాపి, ఇల్వలుడు అనే అన్నదమ్ములు౦డేవారు. ఇల్వలుడు ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి “ నేను అనుకున్న పనులు నిర్విఘ్న౦గా జరిగిపోయేలా ఒక మ౦త్రాన్ని ఉపదేశి౦చ౦డి స్వామీ!” అని అడిగాడు. “నాయనా! నువ్వు రాక్షసుడివి. రాక్షసులు మ౦త్రోపదేశానికి అర్హులు కాదు. నీకు ఏ మ౦త్రాన్నీ ఉపదేశి౦చలేను! అన్నాడు. ఇల్వలుడు ఊరుకోలేదు. కష్టపడకు౦డానే అన్ని పనులు జరిగిపోవాలన్నది […]

Continue Reading

పౌరాణిక గాథలు -18 – సజ్జనసాంగత్యము – చంద్రహాసుడు కథ.

పౌరాణిక గాథలు -18 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి సజ్జనసాంగత్యము – చంద్రహాసుడు కథ కుంతలదేశపు మహారాజుకి మగపిల్లలు లేరు. ఒక కూతురు మాత్రం ఉంది. ఆమె పేరు చంపకమాలిని. తన రాజ్యానికి వారసులు లేరని బాధపడుతూ ఉండేవాడు. అతడి మంత్రి పేరు దుష్టబుద్ధి. పేరుకు తగ్గట్టే ఉండేవాడు. అతడి కొడుకు పేరు మదనుడు. కుమార్తె పేరు విషయ. తన కొడుకు మదనుడికి రాజు కూతురు చంపకమాలినిని ఇచ్చి పెళ్ళిచేస్తే రాజ్యం తనదవుతుందని దుష్టబుద్ధి దుష్ట ఆలోచన చేస్తుండేవాడు. […]

Continue Reading
Kandepi Rani Prasad

పిల్లలు కాని కాకి గుడ్లు

పిల్లలు కాని కాకి గుడ్లు -కందేపి రాణి ప్రసాద్ ఒక పెద్ద మర్రి చెట్టు మీద కాకులు గూళ్ళు కట్టుకుని నివసిస్తున్నాయి. కొమ్మ కొమ్మకో గూడు కట్టుకున్నాయి. ఎవరి గూట్లో వారు గుట్టుగా కాపురం చేస్తున్నాయి. భార్యా పిల్లలతో కలసిమెలసి ఉంటున్నాయి. ఒకరి కొకరు అండగా ఉంటాయి. ఏదైనా ఆపద వచ్చినపుడు పెద్దల మాట వింటాము. ఆ చెట్టు మీద ముసలి కాకులు నాలుగున్నాయి.  అనుభవంలో బాగా తల పండినాయి. అన్ని కలసి ఒకే నిర్ణయం తీసుకుంటాయి. […]

Continue Reading

పౌరాణిక గాథలు -17 – ఏకాగ్రత – గురుశిష్యులు కథ

పౌరాణిక గాథలు -17 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ఏకాగ్రత – గురుశిష్యులు కథ అనగా అనగా ఒక ఊళ్ళో ఒక గురువుగారు ఉ౦డేవారు. ఆయన దగ్గర చాలా మ౦ది శిష్యులు చదువుకు౦టూ ఉ౦డేవాళ్ళు. ఉదయాన్నే గురువుగారి క౦టే ము౦దే లేచి ఆయన పుస్తకాలు సర్దడ౦, హోమానికి సమిథలు తీసుకు రావడ౦, పూజకి పువ్వులు కోయడ౦ వ౦టి పనులన్నీ చేసేవాళ్ళు. తరువాత గురువుగారు వచ్చి పాఠాలు చెప్పేవారు. శిష్యుల౦దరు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉ౦డేవాళ్ళు. ఒకరోజు గురువుగారికి పొరుగూర్లో […]

Continue Reading
Kandepi Rani Prasad

వలస పక్షులు

వలస పక్షులు -కందేపి రాణి ప్రసాద్ సరస్సు అంతా నీటి పక్షులతో కళకళ లాడుతోంది. సరస్సు అంటే మామూలు సరస్సు కాదు. ప్రఖ్యాతమైన పులికాట్ సరస్సు. ఇది దేశంలోనే రెండవ పెద్ద సరస్సు. సరస్సు లోపలేమో చేపలు రొయ్యలు గిరగిరా తిరుగుతూ సయ్యాటలాడుతున్నాయి. నిళ్ళ మీదనేమో అనేక పక్షులు ఎగురుతూ, దూకుతూ ఆటలాడుతున్నాయి. పెలికాన్ లు, కార్మోరాంట్ లు, స్పాట్ బిల్డ్ డక్ లు, పెయింటెడ్ కొంగలు, గ్రే హేరాన్లు, చిన్న ఎగ్రైట్లు వంటి ఎన్నో పక్షులు […]

Continue Reading

పౌరాణిక గాథలు -16 – కులవృత్తి – కౌశికుడు కథ

పౌరాణిక గాథలు -16 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి కులవృత్తి – కౌశికుడు కథ కౌశికుడు అనే బ్రాహ్మణుడు వేదాధ్యయన౦ చేస్తు౦డేవాడు. ఒకనాడు చెట్టు కి౦ద కూర్చొని వేదాలు వల్లి౦చుకు౦టున్నాడు. ఆ చెట్టు మీద ఉన్న ఒక కొంగ అతడి మీద రెట్ట వేసి౦ది. కౌశికుడికి కోప౦ ఆగలేదు. ఎర్రటి కళ్ళతో పైకి చూశాడు. అ౦తే! ఆ కొ౦గ బూడిదయి కి౦ద పడిపోయి౦ది. అతడు బిక్షకోస౦ బయల్దేరి ఒక ఇ౦టి ము౦దు ఆగాడు. ఆ ఇల్లాలు పనిలో ఉ౦డి […]

Continue Reading
Kandepi Rani Prasad

ఎర్రెర్రని పుచ్చకాయ

ఎర్రెర్రని పుచ్చకాయ -కందేపి రాణి ప్రసాద్ వేసవి కాలం ఎండ దంచి కొడుతోంది. అడవిలో జంతువులన్నీ ఎండకు మాడి పోతున్నాయి. అడవిలోని చెరువుల్లో నీళ్ళు తగ్గిపోతున్నాయి. కొన్ని చెరువులు కుంటలు పూర్తిగా ఎండి పోయాయి. గొంతు తడుపుకోవాలన్నా చాలా దూరం పోవాల్సి వస్తోంది.నీళ్ళకే కాదు నీడకు అల్లాడుతున్నాయి. మానవులు చెట్లు కొట్టేయడం వల్ల గూడుకూ స్థానం లేక బాధ పడుతున్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులు ఒక్క నిమిషం వాలదామన్నా చెట్టు లేదు. అలసి అలసి విశ్రాంతి లేక […]

Continue Reading

పౌరాణిక గాథలు -15 – కోపాగ్ని – ఔర్వుడు కథ

పౌరాణిక గాథలు -15 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి కోపాగ్ని – ఔర్వుడు కథ ప్రపంచంలో గొప్పవాడుగా ప్రసిద్ధిపొందిన పరాశరుడు వసిష్ఠ మహర్షికి మనుమడు. వసిష్ఠుడు అతణ్ని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. అంతకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటోంది అతడి తల్లి దృశ్యంతి. వాళ్ళిద్దరి ప్రేమతో సకల విద్యలు నేర్చుకుంటూ పెరుగుతున్నాడు పరాశరుడు. ఒకరోజు పరాశరుడు తల్లి దగ్గరకి వచ్చి “అమ్మా! నా తండ్రి ఎవరు?ఎక్కడున్నాడు?” అని అడిగాడు. దృశ్యంతి కళ్ళనీళ్ళు కారుస్తూ ఏడుస్తోంది కాని తండ్రి గురించి చెప్పలేదు. తల్లి […]

Continue Reading
Kandepi Rani Prasad

గోరింటాకు కోన్లు

గోరింటాకు కోన్లు -కందేపి రాణి ప్రసాద్ అడవిని ఆనుకుని ఊరు ఉండటం వల్ల తరచూ జంతువులు ఊర్లోకి వెళ్ళేవి. అక్కడి నుంచి వచ్చాక ఊర్లోని విషయాలు వింతగా చెప్పుకునేవి. “మనుష్యులకు నడవడం అవసరం లేకుండా సైకిళ్ళు, మోటారు వాహనాలు ఉంటాయి. వాళ్ళ చేతుల్లో ఎప్పుడూ సెల్ ఫోనులు ఉంటాయి. ఇళ్ళలో టీవీలు ఉంటాయి. పిల్లలేమో ఎప్పుడూ పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటారు. ఏమో రాస్తూ ఉంటారు. ఇలా ఏవేవో చాలా విషయాలు చెప్పుకుంటూ ఉంటాయి. వీళ్ళ మాటల్ని ఊర్లోకిరాని […]

Continue Reading

పౌరాణిక గాథలు -14 – పట్టుదల – ఉదంకుడు కథ

పౌరాణిక గాథలు -14 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి పట్టుదల – ఉదంకుడు కథ మహర్షుల్లో గొప్పవాడు గౌతమ మహర్షి. ఆయన దగ్గరకి విద్య నేర్చుకునేందుకు ఎంతో మంది విద్యార్ధులు వస్తుండేవాళ్ళు. వాళ్ళందరు మహర్షి చెప్పినట్టు విని విద్య నేర్చుకునేవాళ్ళు. ఆ రోజుల్లో శిష్యులకి విద్య నేర్చుకోవడం అయిపోయిందో లేదో గురువుగారే నిర్ణయిం చేవారు. ఆయన ఒక్కొక్కళ్ళనే పిలిచి “ఒరే అబ్బాయ్! నువ్వు ఎంత వరకు నేర్చుకున్నా వు?” అని అడిగేవారు. వాళ్ళు చెప్పినదాన్ని బట్టి కొన్ని ప్రశ్నలు […]

Continue Reading
Kandepi Rani Prasad

గ్లోబల్ విలేజ్

గ్లోబల్ విలేజ్ -కందేపి రాణి ప్రసాద్ అనగనగా ఒక సముద్రం. ఆ సముద్రంలో అనేక జలచారలున్నాయి. చేపలు, కప్పలు, ఆక్టోపస్ లు, తాబేళ్ళు, మొసళ్ళు, తిమింగలాలు, షార్కులు నత్తలు, పీతలు, రొయ్యలు ఒకటేమిటి రకరకాల జీవులు నివసిస్తూ ఉన్నాయి. అన్నీ ఎంతో ప్రేమగా ఒకదానినొకటి పలకరించుకుంటూ కలుసుకుంటూ ఉంటాయి. చాలా సంతోషంగా తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి.           సముద్రంలో చేపలు పట్టడానికి వేటగాళ్ళు వలలతో వస్తుంటారు. ఆ వలల నుండి జంతువులన్నీ […]

Continue Reading

పౌరాణిక గాథలు -13 – అంకితభావము – అహల్య కథ

పౌరాణిక గాథలు -13 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి అంకితభావము – అహల్య కథ ఆమెని మనం మర్చిపోయాం. కాని, ఆమెని పవిత్రమైన స్త్రీగా చరిత్ర గుర్తుపెట్టు కుంది. ఆమె పేరు అహల్య. గౌతమ మహర్షి భార్య. సన్యాసికి మహర్షికి మధ్య తేడా ఉంది. సన్యాసులకి గృహసంబంధమైన సంబంధాలు ఉండవు. అన్నీ త్యాగం చేసి వచ్చేస్తారు. మహర్షులకి కుటుంబం ఉంటుంది. కాని, నగరంలో జీవించరు. సమాజానికి దూరంగా వచ్చి జీవిస్తూ ఆధ్యాత్మిక చింతనతో పరమాత్మను గురించి తెలుసుకోడంలో మునిగి […]

Continue Reading
Kandepi Rani Prasad

జీవ సమతుల్యత

జీవ సమతుల్యత -కందేపి రాణి ప్రసాద్ రెండు కుందేళ్ళు బొరియలో నుంచి మెల్లగా బయటకు వచ్చాయి. ఆ రెండింటి పేర్లు చిన్ని, విన్ని. చిన్ని, విన్ని ఆహారం కోసం అడవి లోపలికి బయలుదేరాయి. చక్కగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నాయి. “ఎక్కడ ఆకుకూరలు దొరుకుతాయా” అని చూస్తూ ముందుకు వెళుతున్నాయి. చుట్టూ ఉన్న చెట్లను చూసుకుంటూ వెళుతున్నాయి.అమ్మానాన్నలు చిన్నీ, విన్నీలకు చాలా జాగ్రత్తలు చెప్పాయి. ఎగురుకుంటూ గెంతు కుంటూ దారి పక్కనున్న చెట్ల తీగల్ని తుంపుతూ సరదాగా నడుస్తున్నాయి.   […]

Continue Reading

పౌరాణిక గాథలు -12 – పాతివ్రత్యము – దమయంతి కథ

పౌరాణిక గాథలు -12 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి పాతివ్రత్యము – దమయంతి కథ నలమహారాజు గుణగణాల గురించి ఒక హంస ద్వారా విన్న దమయంతి అతణ్నే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంది. దమయంతి గురించి విని ఆమెనే పెళ్ళి  చేసు కోవాలని నలమహారాజు కూడా నిర్ణయించుకున్నాడు. ఆమె ఒక రాజకుమారి, అతడు ఒక రాజకుమారుడు. కొంత మంది దేవతలు కూడా దమయంతిని పెళ్ళి చేసుకోవాలని స్వయంవరానికి వచ్చారు. ఎవర్నయినా సరే వాళ్ళల్లో ఒకళ్ళని పెళ్ళి చేసుకోమని చెప్పమని నలుణ్ని […]

Continue Reading
Kandepi Rani Prasad

ఒంటరి కాకి దిగులు

ఒంటరి కాకి దిగులు -కందేపి రాణి ప్రసాద్ నల్లమల అడవిలో చెట్ల మీద పక్షులు ఎన్నో ఉన్నాయి. అన్నీ గోలగోలగా మాట్లాడు కుంటున్నాయి. ఎవరి కుటుంబంలో సమస్యల్ని అవి చర్చించుకుంటున్నాయి. కొన్ని మగ పక్షులు పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నాయి. మరి కొన్ని ఆడ పక్షులు వంటల గురించి, పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాయి. చెట్టు నిండా ఉన్న పక్షులన్నీ ఇంత గోలగోలగా మాట్లాడుకుంటుంటే, ఒక కాకి ఒంటరిగా ఉన్నది. ఒక కొమ్మ మీద కూర్చుని దిగాలుగా మొహం వేసుకుని కూర్చున్నది.   […]

Continue Reading

పౌరాణిక గాథలు -11 – ఆదర్శము – భామతి కథ

పౌరాణిక గాథలు -11 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ఆదర్శము – భామతి కథ భర్తకోసం తనకు తానుగా ఎంతో గొప్ప త్యాగం చేసింది. మౌనంగా అంకితభావంతో సేవ చేసి భర్త సాధించాలనుకున్నదాన్ని సాధించడానికి తన వంతు సహకారం అందించింది. చాలా ప్రాచీన కాలంలోనే కాదు ప్రస్తుతపు రోజుల్లో కూడా అటువంటి మహిళలు ఉన్నారు అని చాటి చెప్పిన మహిళ కథ. ***           అడవంతా ప్రశాంతంగా ఉంది. అతడి విషయంలో అది […]

Continue Reading

అనగనగా-ఆత్మవిశ్వాసం

ఆత్మవిశ్వాసం -ఆదూరి హైమావతి  శైలేష్ నాన్నగారు బెంగుళూర్లో సాఫ్ట్ వేర్ ఇంజనీరు. అమ్మ, నాన్నలతో కల్సి సంక్రాంతి శలవులకు బామ్మగారి ఊరికి వచ్చాడు ఎనిమిదేళ్ళ శైలేష్. ఆ రోజు ఉదయం ఎంతకూ నిద్రలేవని శైలేష్ ను అమ్మ హంసిని నిద్ర లేపుతుంటే అటూ ఇటూ తిరిగి పడుకుంటున్నాడు. హంసిని వాడు కప్పుకున్న దుప్పటి లాగేసి వాడి బధ్ధకం వదల గొట్టను “శైలేష్! టైం ఎనిమిదైంది లే. తాతగారు, బామ్మగారూ ఎప్పుడో లేచేసి తోటపని చేస్తున్నారు. చూడూ!” అంటూ […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

కంగారూ మదర్ కేర్

కంగారూ మదర్ కేర్ -కందేపి రాణి ప్రసాద్ ఆస్ట్రేలియా దేశంలోని అడవుల్లో కంగారూలు ఎక్కువగా నివసిస్తాయి. కంగారూలను ఆస్ట్రేలియా దేశానికి చిహ్నంగా కూడా సూచిస్తారు. కంగారూలు చాలా తమాషాగా ఉంటా యి. ముందు కాళ్ళు పొట్టిగా, వెనక కాళ్ళు పొడుగ్గా బలంగా ఉంటాయి. అందువలన ఎక్కువగా రెండు కాళ్ళతోనే నడుస్తూ ఉండటం వల్ల గెంతుతూ నడుస్తున్నట్లుగా ఉంటుంది కంగారూను ఇంకో విషయంలో కూడా విచిత్రంగా చెప్పుకుంటాం. కంగారూలు వాటి పిల్లల్ని పొట్ట సంచిలో పెట్టుకుని తిరుగుతూ ఉంటాయి. […]

Continue Reading

పౌరాణిక గాథలు -10 – ఓర్పు – శకుంతల కథ

పౌరాణిక గాథలు -10 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ఓర్పు – శకుంతల కథ అమె భర్తే ఆమెని గుర్తుపట్టలేక పోయాడు. అంతకంటే దురదృష్టం ఇంకే ముంటుంది? అయినా ఓర్పుతో సమయం వచ్చేదాకా ఎదురు చూసింది. చివరికి ఆమె గెలిచింది… ఆమె ఎవరో కాదు కణ్వమహర్షి కూతురు ‘శకుంతల’. మనం చూస్తూ ఉంటాం…నిజాయితీ లేని వాళ్ళు, సత్ప్రవర్తన లేని వాళ్ళు పెద్ద పెద్ద భవంతుల్లో చాలా గొప్పగా జీవిస్తుంటారు. నిజాయతీగా జీవించేవాళ్ళు, మంచి ప్రవర్తన కలిగినవాళ్ళు గుడిసెల్లో కష్టాలు […]

Continue Reading

అనగనగా-సహకారం

సహకారం -ఆదూరి హైమావతి  అనగా అనగా ఒక అడవి. ఆ అడవిలో చాలా జంతువులుండేవి.. ఎవరిపాటికి అవి సుఖంగా జీవించేవి. ఒకరోజున గజరాజు విహారంగా నడుస్తూ ఉదయాన్నే సరస్సులో స్నానంచేసి రావాలని బయల్దేరింది. సరస్సుకు కొద్ది దూరంలో ఉండగానే తమరాజైన సింహం అరుపు వినిపించింది. ఆ అరుపు బాధగా కష్టంలో ఉన్నట్లు అనిపించి వడివడిగా నడుస్తూ ఆ అరుపు వినిపిస్తున్నచోటికి వచ్చింది గజరాజు. అక్కడ తమ రాజైన సింహం ముళ్ళగుట్టల చాటున ఉన్న ఒక ఊబిలోకి మునిగి […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

శాఖాహారి సింహం

శాఖాహారి సింహం -కందేపి రాణి ప్రసాద్ ఉదయాన సింహం నిద్రలేచింది. రోజూలాగా వళ్ళు విరుచుకుని బయటకు కదల బోయింది. ఏదో పొట్టలో కలుక్కుమన్నది. లేచింది లేచినట్లుగా కూలబడింది. మళ్ళీ పొట్టలో గడ బిడ మొదలయ్యింది. ‘ఏమైందబ్బా’ అని ఆలోచించేంతలో పొట్టలో పేగు లన్ని కదులుతున్నట్లనిపించింది. సింహం కడుపు పట్టుకుని కూలబడిపోయింది.           కాసేపటికి అడవికి అంతా తెలిసిపోయింది. “మృగరాజు కడుపునొప్పితో బాధ పడుతోంది” అని అందరూ మాట్లాడుకోసాగారు. “ఏమైంది?ఏమైంది?” అని ఆదుర్దా పడేవాళ్ళు […]

Continue Reading

పౌరాణిక గాథలు -9 – ఆరాధన – ధ్రువుడు కథ

పౌరాణిక గాథలు -9 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ఆరాధన – ధ్రువుడు కథ ధ్రువుడు ఒక గొప్ప చక్రవర్తికి కొడుకు. అయినా కూడా చక్రవర్తి కొడుకుకి ఉండవలసి నంత గొప్ప రాజభోగాలు అతడికి దక్కలేదు. ధ్రువుడు, అతడి తల్లి కూడా ఎన్నో కష్టాల్ని అనుభవించారు. అందుకు కారణం అతడి సవతి తల్లి. పూర్వం ఉత్తానపాదుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుండేవాడు. ప్రజలందరు అతడి పాలనలో సుఖంగా జీవించారు. అతడికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య […]

Continue Reading

పౌరాణిక గాథలు -8 – సత్యదీక్ష – హరిశ్చంద్రుడు కథ

పౌరాణిక గాథలు -8 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి సత్యదీక్ష – హరిశ్చంద్రుడు కథ భూ లోకంలో నిజం చెప్పేవాళ్ళల్లో హరిశ్చంద్ర మహారాజుని మించినవాళ్ళు లేరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి స్వర్గంలో ఇంద్రుడు మహర్షులందరితో కలిసి సభ నిర్వహిస్తున్నాడు. మహర్షులందరూ ఇంద్రసభలో ఎవరి ఆసనాల మీద వాళ్ళు కూర్చున్నారు. సభ జరుగుతుండగా ఎప్పుడూ నిజాన్నే పలికేవాడు ఎవరున్నారు? అనే విషయం మీద చర్చ వచ్చింది. దానికి వసిష్ఠ మహర్షి ‘హరిశ్చంద్రుడు’ అని సమాధానం చెప్పాడు. వెంటనే […]

Continue Reading
Kandepi Rani Prasad

ఒక సహాయం రెండు ఆనందాలు

ఒక సహాయం రెండు ఆనందాలు -కందేపి రాణి ప్రసాద్ ఒక దట్టమైన అడవిలో పెద్ద చెరువు ఉన్నది. చెరువు గట్టున పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. చెట్లన్నీ చెరువు వైపుకు వంగి చెరువుతో ముచ్చట్లు పెడుతుండేవి. చెట్ల నిండా రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకుని నివసిస్తూ ఉండేవి. చెరువు లోపల మొసళ్ళు, చేపలు, కొంగలు, తాబేళ్ళు, కప్పలు నివసించేవి. అన్నీ కలసిమెలసి జీవించేవి.                   కలువలు, తామరలు […]

Continue Reading

పౌరాణిక గాథలు -7 మహాభారతకథలు – ధైర్యము – సావిత్రి కథ

పౌరాణిక గాథలు -7 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ధైర్యము – సావిత్రి కథ ఆమెకి తెలుసు ఆమె భర్త ఒక సంవత్సరంలో చచ్చిపోతాడని. ఎలాగయినా సరే తన భర్తని బ్రతికించుకోవాలని ఆమె పట్టుదల. ఆమె అనుకున్నట్టే పట్టుదలతో భర్తని బ్రతికించుకుంది కూడా. ఇదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న సావిత్రి కథ. సావిత్రి ఒక రాజకుమార్తె. ఆమె తల్లితండ్రులు చాలా కాలం సూర్యభగవానుణ్ని ఉపాసించడం వల్ల ఆమె జన్మించింది. ఆమె గొప్ప గుణవంతురాలు. యుక్త వయస్సు వచ్చాక తనకు […]

Continue Reading
Kandepi Rani Prasad

మూగజీవుల సాయం

మూగజీవుల సాయం -కందేపి రాణి ప్రసాద్ అదొక పర్వత ప్రాంతం అంతేకాదు పర్యాటకప్రాంతం కూడా! చుట్టూ మంచు కొండలు ఆవరించి ఉంటాయి. మధ్యలో చిన్న గ్రామం. మంచు కొండల పైన హిమానీ నదాలు అంటే గ్లేసియర్స్ ఉంటాయి. వాటిని చూడటానికి మనుష్యులు వస్తుంటారు కొండల మీద పేరుకున్న మంచులో ఆటలు కూడా ఆడుతుంటారు. పర్వతాల పై బాగానికి చేరి లోయల అందచందాల్ని చూస్తే అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రకృతి అందాల్ని తిలకించేందుకే చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. […]

Continue Reading

పౌరాణిక గాథలు -6 మహాభారతకథలు – ఆత్మజ్ఞానము – నచికేతుడు కథ

పౌరాణిక గాథలు -6 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ఆత్మజ్ఞానము – నచికేతుడు కథ           నచికేతుడి తండ్రి గొప్ప మహర్షి. ఆయన నచికేతుణ్ని యముడి దగ్గరికి పంపించా డు. అయినా కూడా అతడు చిరంజీవిగా తిరిగి వచ్చేశాడు.           అసలు మహర్షి తన కొడుకు నచికేతుణ్నిఎందుకలా చేశాడు? నచికేతుడు తన తండ్రిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. అవి అడగదగ్గవే! అయినా పిల్లలు ప్రశ్నిస్తే పెద్దవాళ్ళ కి […]

Continue Reading
Kandepi Rani Prasad

ఎవర్నీ నమ్మలేం

ఎవర్నీ నమ్మలేం -కందేపి రాణి ప్రసాద్ సోనీ, రాకీ స్కూలుకు తయారవుతున్నారు. సోనీ మూడవ తరగతి చదువుతున్నది. రాకీ ఒకటో తరగతి చదువుతున్నాడు. రోజూ స్కూలు బస్సు వచ్చి తీసుకెళ్తుంది. ఆ సందు చివర వరకు స్కూల్ బస్సు వస్తుంది. సందు చివర దాకా అమ్మ నళిని వెళ్ళి ఎక్కించి వస్తుంది.           నళిని రోజూ ఉదయమే పేపర్ చదువుతుంది. అందులో విషయాలు చదివి భయ పడుతుంది. అందులోను పిల్లల కిడ్నాపుల గురించి […]

Continue Reading

పౌరాణిక గాథలు -5 మహాభారతకథలు – పురాణపురుషుడు పరీక్షిత్తు మహారాజు కథ

పౌరాణిక గాథలు -5 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి పురాణపురుషుడు పరీక్షిత్తు మహారాజు కథ మహాభారతం మొత్తం వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్పినట్లు ఉంటుంది కదా. జనమేజయుడు ఎవరూ అంటే పరీక్షిత్తుమహారాజు కొడుకు. పరీక్షిత్తు మహారాజు ఎవరూ అంటే అభిమన్యుడికి కొడుకు పాండవులకి మనుమడు. ఈ మహా భారతంలో పరీక్షిత్తు మహారాజు గురించిన కథ చదువుదాం. ఉదంకమహర్షి ఒకసారి జనమేజయ మహారాజుని కలిసి దానాలు, యజ్ఞాలు చేస్తూ, భరతవంశాన్ని వృద్ధిపరుస్తూ, ప్రజలందరికీ మేలు చేస్తూ అర్జునుడితో సమానమైన, ఇంద్రియ […]

Continue Reading
Kandepi Rani Prasad

స్వచ్ఛత పాటిద్దాం

స్వచ్ఛత పాటిద్దాం -కందేపి రాణి ప్రసాద్           ఒకరోజు ఉదయాన్నే గుహ వదిలి బయటకు వచ్చింది మృగరాజు అలా ఆడవంత ఒకసారి తిరిగి వద్దామనుకున్నది.           పక్షుల కుహు కుహులు చెవుల కింపుగా వినిపిస్తున్నాయి. చెట్లన్నీ తలలూపుతూ నాట్యం చేస్తున్నట్లుగా ఊగుతున్నాయి. సింహం సంతోషంగా ముందుకు అడుగులు వేసింది. దారిలో జంతువులన్నీ నమస్కారం పెడుతున్నాయి. వాటిని చిరునవ్వుతో స్వీకరిస్తూ ముందుకు వెళ్ళింది.           […]

Continue Reading

పౌరాణిక గాథలు -4 మహాభారతకథలు – మాంధాతృడు కథ

పౌరాణిక గాథలు -3 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి మాంధాతృడు కథ మన పురాణాల్లోను, ఇతిహాసాల్లోను గొప్ప కీర్తి పొందినవాళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్లందరూ మనకి తెలియదు కదా! వాళ్లు ఏ కాలంలో జీవించినా ఆ కాలంలో వాళ్లే చాలా గొప్పవాళ్లు అనిపించు కున్నారు. అటువంటి వ్యక్తులు ఎంతోమంది ఈ భూమి మీద పుట్టి, వేల సంవత్సరాలు జీవించి, ఎన్నో మంచి పనులు చేసి యుగాలు గడుస్తున్నా ఇప్పటికీ కీర్తి కాయంతో జీవించి ఉన్నారు. వాళ్లు ఇప్పుడు […]

Continue Reading
Kandepi Rani Prasad

తప్పిన ప్రమాదం

తప్పిన ప్రమాదం -కందేపి రాణి ప్రసాద్ ఆ వీధిలో ఒక పాడుపడిన ఇల్లు ఉన్నది. సగం పడిపోయిన గోడలు, కూలిపోయిన కప్పుతో ఉన్నది. ఒక పిల్లి తన పిల్లల కోసం ఈ ఇంటిని ఎంచుకున్నది. ఆ పాడుపడిన ఇంటిలో పిల్లి నాలుగు పిల్లల్ని పెట్టింది. వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ కాపలా కాస్తున్నది. పిల్లల శరీరాలను తల్లి నాకుతూ శుభ్రం చేస్తుంది.          తల్లి పిల్లి తన పిల్లలకు పాలిస్తూ ప్రేమగా తల నిమురుతోంది. ఆ […]

Continue Reading

అనగనగా-నిజాయితీ

నిజాయితీ -ఆదూరి హైమావతి  నడమానూరు అనే గ్రామంలో రాములయ్య, సీతమ్మ అనే రైతుకూలీ దంపతులకు సోము అనే కుమారుడు ఉండేవాడు. వాడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నా డు. గత ఏడాదీ పాఠశాల ఉపాధ్యా యులు ఐదోతరగతి పిల్లలను బస్ లో ఎక్కంచుకుని నగరంలోని జంతు ప్రదర్శనశాలకు తీసుకెళ్ళి అక్కడి జంతువులనంతా చూపుతూ వాటి అలవాట్లు, పద్దతులు ఇంకా వాటి గురంచిన అనేక విషయాలు చెప్పే వారు. ఆ ఏడాది నగరానికి వెళ్ళను యాభై రూపాయలు […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -3 మహాభారతకథలు – అష్టావక్రుడు కథ

పౌరాణిక గాథలు -3 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి అష్టావక్రుడు కథ ఈ కథ కూడా పాండవులకి రోమశ మహర్షి చెప్పిన కథే! ధర్మరాజు కౌరవులతో జూదమాడి ఓడిపోయాడు. తరువాత వాళ్ళు అనుకున్న ప్రకారం పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. ఆ కాలంలో ఎవరూ అన్నమాట తప్పేవాళ్లు కాదు. ఒక మాట అన్నారు అంటే దాన్ని తప్పకుండా పాటించేవాళ్లు. అందుకే మాట అనే ముందు బాగా ఆలోచించి అనేవాళ్లు. ధర్మరాజు జూదం ఆడడానికి […]

Continue Reading

పౌరాణిక గాథలు -2 మహాభారతకథలు – మహాభారత కృతి కర్త వ్యాసమహర్షి కథ

పౌరాణిక గాథలు -2 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ధర్మోరక్షతి రక్షితః మహాభారతకథలు మహాభారత కృతి కర్త వ్యాసమహర్షి కథ మన దేశం భారతదేశం. ధర్మాధర్మాల్ని బోధించిన గ్రంథం.. వ్యాసమహర్షి చెప్పగా విఘ్నేశ్వరుడు రాసిన గ్రంథం మహాభారతం. సంస్కృతంలో రచించిన ఈ గ్రంథాన్ని నన్నయ తెలుగులో అనువదించడానికి ఉపక్రమించి వెయ్యిసంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికీ అదే ప్రమాణాలతో.. అదే పవిత్రతతో.. అదే గౌరవంతో నిలిచి ఉన్నశ్రీమదాంధ్ర మహాభారతంలో మనం తెలుసుకోవలసిన ఎంతో మంది మహర్షులు,గురువులు,రాజులు, ధర్మాత్ములు, దానపరులు వీరులు, ధీరులు […]

Continue Reading
Kandepi Rani Prasad

ఏనుగు సలహా

ఏనుగు సలహా -కందేపి రాణి ప్రసాద్ నల్లమల అడవికి రాజుగా కేసరి అనే సింహం ఉన్నది చాలా తెలివి కలది. తోటి జంతువులపట్ల దయా స్వభావం కలది. అడవిలోని జంతువులను సమానంగా చూస్తుంది. చేస్తే మంచి సహాయం చేస్తుంది తప్ప ఎవరిని చెడగొట్టాలని మోసం చేయాలని ఆలోచించదు. ఇన్ని మంచి లక్షణాలున్న కేసరికి ఒక్క బలహీనత ఉన్నది. తన మంత్రు లతో ఎవరు ఏమీ చెప్పినా నమ్మేస్తుంది ఏనుగు, ఎలుగుబంటి, నక్కలు మృగరాజు దగ్గర మంత్రులుగా పని […]

Continue Reading

పౌరాణిక గాథలు -1 మహాభారతకథలు

పౌరాణిక గాథలు -1 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి రచయిత్రి పరిచయ వాక్యాలు           శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుందరిగారు బాలసాహితీవేత్తగా విశేష రచనలు చేశారు. బాలల గేయకావ్యం తెలుగుభాషోద్యమ కోణంలోంచి చేసిన ప్రసిద్ధ రచన ‘ముంగిటిముత్యాలు’ పురస్కారాన్ని అందుకుంది. వీరి పరిశోధనాత్మక రచనలు మన ప్రాచీన సంస్కృతికి సంబంధించిన అనేక విశేషాలను వెలుగులోకి తెచ్చాయి. ఇప్పటి వరకూ 20కి పైగా పుస్తకాలు వెలువడ్డాయి. చిన్న పిల్లలు తమంత తాముగా చదివి అర్థం చేసుకో […]

Continue Reading
Kandepi Rani Prasad

ఆకతాయి కుక్కపిల్లలు

ఆకతాయి కుక్కపిల్లలు -కందేపి రాణి ప్రసాద్ హైవేకు పక్కగా ఒక కుక్క కుటుంబం నివసిస్తున్నది. ఒక కుక్క తన భార్య నలుగురు పిల్లలతో కాపురముంటున్నది. రోడ్డుకు పక్కనే అయినప్పటికీ అక్కడ పెద్ద చెత్త కుప్ప అడ్డుగా ఉన్నది. అంతేకాకుండా పక్క పొలాలకు అవసరమయ్యే గడ్డివాము ఉన్నది. పిల్లల్ని మరుగున దాచటానికీ, మెత్తగా గడ్డి పరుపు పరచటానికీ ఈ స్థలం అనువుగా ఉందని తల్లికుక్క భావించింది. పిల్లల్ని కనక ముందే మంచి స్థలం ఎక్కడ ఉన్నదా అని వెతుక్కుంటునపుడు […]

Continue Reading
Kandepi Rani Prasad

విత్తనాల విలాపం

విత్తనాల విలాపం -కందేపి రాణి ప్రసాద్ అదొక పండ్ల బజారు. అక్కడ పండ్ల దుకాణాలన్నీ వరుసగా ఉంటాయి. మామిడి, బత్తాయి, సపోటా, కమలా, బొప్పాయి, ద్రాక్ష యాపిల్ వంటి అన్నిరకాల పండ్లు అక్కడ కొలువు దీరి ఉన్నాయి. ఆ ప్రదేశమంతా సువాసనతో కూడిన తీపిదనం వ్యాపించి ఉంది. ఆడా, మగా, పిల్లలు, వృద్ధులు ఎంతో మంది ఆ బజారుకు వస్తారు. పండ్లు బావున్నాయని కొనుక్కుంటున్నారు. సంచుల్లో వేసుకొని ఇంటికి తీసుకెళ్లి అందరూ కూర్చొని ఫలాలను అరగిస్తున్నారు. ఎంతో […]

Continue Reading

అనగనగా-అసలు రహస్యం

అసలు రహస్యం -ఆదూరి హైమావతి  హనుమకొండ రాజ్యాన్ని ఆనందవర్మ పాలించే కాలంలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. రాజధాని చుట్టు పక్కల గ్రామ ప్రజలంతా యాడాదికి మూడు పంటలు పండించుకుంటూ సుఖశాంతులతో జీవించేవారు. ఉన్నట్లుండి ఎక్కడి నుంచో ఒక బందెపోటు ముఠావచ్చి గ్రామాల మీద పడి,  దోచుకో సాగింది. సరిగ్గా పంటలు పండి ధాన్యం ఇల్లు చేరేలోగా వచ్చి మొత్తం దోచుకుపోయేవారు. ఎదురు తిరిగిన వారిని చావబాదేవారు. వారి దెబ్బలకు బతికున్నా మళ్ళాలేచి పని చేసుకునే స్థితి ఉండేది […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

కుక్క పిల్లల తెలివి

కుక్క పిల్లల తెలివి -కందేపి రాణి ప్రసాద్ ఆ సందు మలుపులో రాళ్ళ కుప్ప పక్కన చెట్లలో ఓ కుక్క నాలుగు పిల్లల్ని పెట్టింది . తల్లికుక్క ఆ చెట్టు పక్కలకే ఎవర్ని రానివ్వటం లేదు . ఆ రోడ్డు వెంట వెళ్లే వాళ్ళను కూడా అరుస్తున్నది . పిల్లలు తెల్లగా జాతి కుక్కల వలె ముద్దుగా ఉన్నాయి . అందులో రెండు ఆడ పిల్లలు రెండు మగపిల్లలు . నెల తిరిగే సరికల్లా మెల్ల మెల్లగా […]

Continue Reading

అనగనగా-సమానత్వం

సమానత్వం -ఆదూరి హైమావతి  అనగా అనగా అమరగిరి రాజ్యాన్ని మహేంద్రవర్మ పాలించే రోజుల్లో తన రాజ్యంలో విద్యావ్యాప్తికి బాగా కృషి చేసాడు. విద్య వస్తే ప్రజలంతా ధర్మ మార్గాన ప్రవర్తిస్తారని ఆయన నమ్మిక.  అందుకోసం రాజ్యంలో నలుమూలల  విద్యావేత్తలైన  పండితుల చేత ఉచిత  గురుకులాలు నడిపించసాగాడు. అతని ఏకైక కుమారుడైన కుమారవర్మను  వేదవేద్యుడనే పండుతులవారు నిర్వహించే విద్యాలయంలో చేర్చాడు.  అక్కడ విద్యార్ధులంతా నేలమీద తుంగచాపల మీద పడుకోడం, నదీ స్నానం, అంతా కలసి  భుజించడం, ఆశ్రమంలో పనులు […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

పిల్ల చీమలు

పిల్ల చీమలు -కందేపి రాణి ప్రసాద్ అదొక పెద్ద చీమల పుట్ట . రాత్రయింది పగలంత పని చేసి ఉండటంతో ఓళ్ళు మరిచి నిద్రపోతున్నారు . ఒకింట్లో పిల్ల చీమలు మాత్రం మెలుకువతో ఉన్నాయి . వాటికి నిద్ర రావడం లేదు కారణం ఏంటంటే ఉదయం తిన్న , లడ్డు రుచి గుర్తుకు కావడం .            అదేదో కొత్త ఇల్లు . ఇది వరకు ఎప్పుడు వెళ్ళలేదు . ఈరోజే అమ్మా […]

Continue Reading

అనగనగా- స్వర్గాదపి

స్వర్గాదపి -ఆదూరి హైమావతి  బంగారు పాళ్య గ్రామం పక్కగా బాహుదానది పారుతుంటుంది.  నది దాటుకుని రోజూ ఆ పల్లె వాసులు  పక్కనున్న నగరం వెళ్ళి కూలి పనులు చేసుకుని వస్తుంటారు.  ఉన్నట్లుండి వచ్చే వరదల వలన ఇలా జరగడం వాడుకే. తొందరపడి దిగితే ప్రమాదం జరుగుతుంటుంది. రోజూ ఆ నది దాటితేకానీ  ఆ గ్రామ ప్రజల జీవనం సాగదు. ఒక రోజున పైవాలున కురిసిన వానల వల్ల బాహుదా నదికి వరద వచ్చింది. కూలి పనులు ముగించుకుని […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

బుజ్జి దూడ భయం

బుజ్జి దూడ భయం -కందేపి రాణి ప్రసాద్ ఒక ఊరిని ఆనుకుని ఉన్న అడవిలో ఆవులు, గేదెలు నివాసం ఉండేవి. అందులో ఒక ఆవు నెల క్రితమే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దూడ తెల్లగా అక్కడక్కడా గోధుమ వర్ణపు మచ్చలతో అందంగా ఉన్నది. పెద్ద పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా ప్రపంచాన్ని చూస్తుంటుంది. అదేమిటి, ఇదేమిటి అంటూ అన్నింటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. తల్లి కూడా దానికి అన్నీ విడమరిచి చెపుతుంది.           గోవులన్నీ […]

Continue Reading
Kandepi Rani Prasad

సింహ పరిపాలన

సింహ పరిపాలన -కందేపి రాణి ప్రసాద్ అడవికి రాజైన సింహం రోజు ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు అడవి అంత సంచారం చేస్తుంది. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటుంది. ఒకసారి అన్ని జంతువులను పిలిచి సమావేశం నిర్వహిస్తుంది. ఆ సమయంలో ఎవరికి ఎదురైనా సమస్యలు వారిని చెప్పమంటుంది. వాటికీ పరిష్కరాలు చెబుతుంది. ఇలా సింహరాజు తన రాజ్యాన్ని జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నది.           ఇలాగే ఒకరోజు అడవి సంచారం చేస్తున్న సమయంలో […]

Continue Reading

అనగనగా- నిజాయితీ నిద్రపోదు

నిజాయితీ నిద్రపోదు -ఆదూరి హైమావతి  మంతినవారి పాలెంలో ఉండే షాహుకారు శీనయ్య పట్టు చీరలు కొనను ధర్మవరం వెళ్ళవలసి వచ్చింది. శీనయ్య చాలా పీనాశి. బండితోలను మనిషినిపెట్టుకుంటే జీతమూ, బత్తెమూ వృధా అవుతాయని తానే బడితోలుకుంటూ బయల్దేరాడు. ఒక్కడే మూడు రోజులు బండి తోలుకుంటూ వెళ్లడం,ఆ ఎద్దులకు నీరూ, గడ్డీ వేసి, వాటిని కడగడం అన్నీ ఇబ్బందిగానే భావించి, ఏదో ఒక ఉపాయం దొరక్కపోతుందా అని ఆలోచిస్తూ బండి తోలుకు వెళుతుండగా దేవుడు పంపించినట్లు, ముందు ఒక […]

Continue Reading
Posted On :

అనగనగా- మార్పు

మార్పు -ఆదూరి హైమావతి  ఆరోక్లాస్ చదివే ఆనంద్ కు చదువుకంటే ఆటలంటేనే ఎక్కువ మక్కువ. తల్లి అన్నపూర్ణమ్మ ఎంతచెప్పినా చదువు జోలికే వెళ్ళడు. క్రికెట్ వాడికి ఆరోప్రాణం. క్రికెట్ మ్యాచ్ ఎక్కడజరుగుతున్నా తిండి సైతం మానేసి, బడిఎగ్గొట్టి, టి.వి.కి అతుక్కు పోతాడు. వాడి మూడునెలల పరీక్షల ప్రోగ్రెస్ కార్డ్ చూసి తండ్రి నాగేశం  ఎంతో బాధపడి వాడిని కోప్పడ్డా ఆనంద్ లో మార్పు లేదు. నాగేశం వాడిస్కూల్ కెళ్ళి క్లాస్ టీచరైన  గణపతి మాస్టార్ తో మాట్లాడాడు. గణపతి మాస్టర్  […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

పట్నం వద్దు – ప్రకృతి ముద్దు

పట్నం వద్దు – ప్రకృతి ముద్దు -కందేపి రాణి ప్రసాద్ ఒక అడవిలో ఆవుల మంద ప్రశాంతంగా జీవిస్తోంది. పచ్చని ప్రకృతి మధ్య అంతా అన్యోన్యంగా బతుకుతున్నా యి. తాజాగా మొలిచిన గడ్డిని మేస్తూ ఆరోగ్యంగా జీవిస్తున్నా యి.. పెద్దలు దూడలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా తినాలో నేర్పిస్తాయి. అడవిలోని అన్ని రకాల జంతువులను, అత్త, మామ, పిన్ని, బాబాయి, అన్న, అక్క అంటూ ప్రేమగా పలకరించుకుంటాయి. ఒకసారి పట్నంలోని చుట్టాలు వాళ్ళు వాళ్ళింటికి రమ్మని పిలిచారు. […]

Continue Reading
Kandepi Rani Prasad

అమ్మ గ్రేట్

అమ్మ గ్రేట్  -కందేపి రాణి ప్రసాద్ ఒక బాదం చెట్టు మీద కోతి తన పిల్లలతో నివసిస్తోంది. ఈ చెట్టు ఉరికి చివరిగానూ, అడవి మొదట్లోనూ ఉన్నది. కోతి తన ఆహారం కోసం అడవికి వెళుతుంది. వెళ్ళడానికి బద్ధకం అనిపిస్తే ఊర్లోకి వెళుతుంది. ప్రజలు వండుకున్న అన్నం చపాతీలు, చిప్స్, కూల్ డ్రింకులు నచ్చినవన్ని తిని పిల్లల కోసం ఇంటికి తిసుకెళుతుంది. పిల్లలు చిన్నగా ఉన్నాయని ప్రతి సారి వెంట తీసుకురాదు. అప్పుడప్పుడు తీసుకు వెళుతుంది.     […]

Continue Reading

అనగనగా- సముద్రమంత మనసు

సముద్రమంత మనసు -ఆదూరి హైమావతి  అనగా అనగా ఒక అడవి. ఆ అడవిలో చాలా జంతువులూ, పక్షులూ ఇంకా చీమ వంటి చిన్న జీవులూ కూడా కలసి మెలసి ఎవరి పనులు వారు చేసుకుంటూ జీవించేవి. చీమలు చాలా శ్రమజీవులే కాక, జాగ్రత్త కలవికూడా, వాటికి ముందుచూపు ఎక్కువ. నిరంతరం పనిలోనే ఉంటాయి. రోజంతా అడవంతా తిరుగుతూ వర్షాకాలం కోసం ఆహారం మోసుకు తెచ్చుకుని తమ పుట్టలోని అరల్లో దాచుకుంటుంటాయి. అడవిలో ఎక్కడెక్కడ ఏ తినే వస్తువులున్నోయో […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

చిన్నూ- బన్ను

చిన్నూ- బన్ను -కందేపి రాణి ప్రసాద్ ఎండలు భగ భగ మండుతున్నాయి. అడవిలో ఎటు చూసినా మొక్కలు తలలు వాల్చేసి ఉన్నాయి. వృక్షాలు కొన్ని చోట్ల రాలిన ఆకులు సూర్య కిరణాలు పడి వాటికవే కాలి పోతున్నాయి. వేసవి కాలంలో అడవి ఎండకు మాడి పోతున్నది. చిన్న చిన్న నీటి కుంటలు, దొరువులు ఎండిపోయాయి. నీళ్ళ కోసం చాల దూరం వెళ్ళ వలసి వస్తోంది చిన్న జంతువులు, పక్షులు దాహంతో గొంతెండి అల్లాడుతున్నాయి.        […]

Continue Reading

అనగనగా- చిలుకపలుకు

చిలుకపలుకు -ఆదూరి హైమావతి  అనగా అనగా అనకాపల్లి అనేగ్రామ సమీపాన ఉండే ఒక చిట్టడవిలో ఒక పెద్ద మఱ్ఱిచెట్టు మీద చాలా పక్షులు గూళ్ళు కట్టుకుని నివసించేవి. ఆహారం కోసం వెళ్ళిన పక్షులు అన్నీ సూర్యాస్తమయానికంతా గూళ్ళు చేరుకుని, అంతా తాము చూసిన వింతల గురించీ కబుర్లు చెప్పుకునేవి. ఒకరోజున ఒక చిలుక తనగూట్లోంచీ మాట్లాడుతున్న మాటలు పక్షులన్నీ విని,”చిలకమ్మా! ఏం పాట పాడు తున్నావ్! కొత్త పాటలా ఉందే! చెప్పవా!” అని స్నేహ పూర్వకంగా అడిగాయి. […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

పిచ్చుక పిల్లల తప్పు

పిచ్చుక పిల్లల తప్పు -కందేపి రాణి ప్రసాద్ ఒక చెట్టు మీద పిచ్చుక తన పిల్లలతో భార్యతో జీవిస్తోంది. పిల్లలు ఇప్పుడిప్పుడే పెద్దవాల్లవుతున్నారు. ఎన్నో జాగ్రత్తలు  చెప్పి పిచ్చుకలు బయటకు వెలుతుంతుంటాయి. ఆనదంగా సంసారం సాగిస్తున్నాయి. పిచ్చుకలు జంట చీకటి పడగానే తినేసి నిద్రపోతుంటాయి. పిల్లలు మాత్రం చాలాసేపు మేలుకుంటున్నాయి. అప్పుడప్పుడు రాత్రిపూట మెలకువ వచ్చి చూసినప్పుడు పిల్లలు దగ్గర నుంచి వెలుగు కనిపిస్తోంది. నిద్ర మత్తులో ఏమి పట్టించుకోకుండా నిద్రపోతుంది తల్లి పిచ్చుక.ఒకరోజు తండ్రి పిచ్చుకకు […]

Continue Reading

అనగనగా- ఉచితం-అనుచితం

ఉచితం-అనుచితం -ఆదూరి హైమావతి  జ్యోతిష్మతి రాజ్యాన్నీ రజనీవర్మ అనే రాజు పాలించేవాడు.అతనికి కీర్తి కాంక్ష ఎక్కువ. ఎలాగైన తన తాతముత్తాతలను మరిపించేలా ప్రజలకు హితవు చేసి వారికంటే గొప్పపేరు తెచ్చుకోవాలనీ, తన తర్వాతి తరం వారంతా తన పేరే చెప్పుకోవాలనీ తెగ ఆశ పడుతూ ఏమి చేస్తే తన కోరిక తీరుతుందో అని రాత్రింబవళ్ళూ ఆలోచించేవాడు. అతనిరాజ్యం సుభిక్షంగా ఉండేది. పంటలు బాగా పండుతూ అంతా సుఖ సంతోషాలతో జీవించేవారు. కష్టపడి పనిచేసే తత్వం ప్రజలదంతా. ఎవ్వరూ  […]

Continue Reading
Posted On :

అనగనగా- తెలివైన మంత్రి

తెలివైన మంత్రి -ఆదూరి హైమావతి              అనగా అనగా అమరపురి అనే రాజ్యాన్ని  అమరవర్మ అనే రాజు పాలించేవాడు. అతనికి తనరాజ్యాన్ని విస్తరించాలనే ఆశపుట్టింది. యుధ్ధంచేసి పక్క రాజ్యాలను కలుపుకుని తానే  మహారాజు కావాలనీ, చుట్టుపక్కల రాజులంతా తనకు సామంతులుగా ఉండాలనే విపరీతమైన  కోరికతో నిద్రకూడా సరిగా పట్టకుండాపోయింది. ఆశమానవుని సుఖంగా ఉండనివ్వదు .             ఒకరోజున మహామంత్రిని పిలిచి తనకోరిక వివరించి, […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

పిల్ల చిలక అబద్ధం (బాలల కథ)

ఏనుగు నిర్ణయం -కందేపి రాణి ప్రసాద్ అదొక దేవాలయం ఆ దేవాలయం ఎప్పుడూ భక్తుల రాకపోకలతో కిటకిటలాడు తూ ఉంటుంది. ఆలయం ముందు పూలు, పళ్ళు, కొబ్బరి కాయలు అమ్మే వాళ్ళు తమ బండ్లను పెట్టుకొని వ్యాపారం చేస్తుంటారు. అడుక్కునే బిచ్చగాల్లంత ఆలయ ప్రధాన ద్వారానికి రెండు వైపులా కూర్చొని యాచిస్తుంటారు. అలాగే గుడి ముందు ఒక పక్కగా ఉన్న మంటపం దగ్గర ఒక ఏనుగు చిన్న గొలుసుతో కట్టి వేయబడి ఉంటుంది. దానికి పక్కగా ఒక […]

Continue Reading
Kandepi Rani Prasad

ఏనుగు నిర్ణయం (బాలల కథ)

ఏనుగు నిర్ణయం -కందేపి రాణి ప్రసాద్ అదొక దేవాలయం ఆ దేవాలయం ఎప్పుడూ భక్తుల రాకపోకలతో కిటకిటలాడు తూ ఉంటుంది. ఆలయం ముందు పూలు, పళ్ళు, కొబ్బరి కాయలు అమ్మే వాళ్ళు తమ బండ్లను పెట్టుకొని వ్యాపారం చేస్తుంటారు. అడుక్కునే బిచ్చగాల్లంత ఆలయ ప్రధాన ద్వారానికి రెండు వైపులా కూర్చొని యాచిస్తుంటారు. అలాగే గుడి ముందు ఒక పక్కగా ఉన్న మంటపం దగ్గర ఒక ఏనుగు చిన్న గొలుసుతో కట్టి వేయబడి ఉంటుంది. దానికి పక్కగా ఒక […]

Continue Reading

అనగనగా-దానం

 దానం -ఆదూరి హైమావతి  అనగా అనగా ముంగమూరులోని ప్రభుత్వపాఠశాలలో ఏడోతరగతి చదువు తున్నది ఊర్మిళ. ఊర్మిళ తండ్రికి ఆఊర్లో చాలా మామిడి ఇతర పండ్ల తోటలూ ఉన్నాయి. వాళ్ళ సైన్స్ పంతులుగారు పిల్లలను వృక్షా ల గురించిన పాఠం బోధిం చే ప్పుడు తోటల్లోకీ ,పంటపొలా ల్లోకీ తీసుకెళ్ళి చూపిస్తూ వివరంగా బోధించేవారు.   ఆరోజున మామిడి చెట్టు, పండులోని విటమిన్లూ, వ్యాపార పంటగా ఎలా మామిడి పెంచుకుంటారో వివరంగా  చెప్పాలని   ఊర్మిళ తండ్రి గారి అనుమతితో […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

చిన్నూ – ఉడుత (బాలల కథ)

చిన్నూ – ఉడుత -కందేపి రాణి ప్రసాద్ అదొక మూడంతస్తుల మేడ. మూడో అంతస్తు వేరే గానీ అక్కడొక రేకుల షెడ్డు మాత్రమే ఉంటుంది. అందులో వాళ్ళ పాత సామాన్లు పెట్టుకునేవారు. ఈ మధ్యనే వాచ్ మెన్ కుటుంబానికి ఇచ్చారు. వాచ్ మెన్ కు ఇద్దరు పిల్లలున్నారు చిన్నవాళ్ళు. ఏడేళ్ళ కొడుకు నేలుగేళ్ళ కూతురు ఉన్నారు.ఆ చిన్న రేకుల షెడ్డు తప్పించి మిగతా అంతా ఖాళీనే. పిల్లలిద్దరూ ఆ ఖాళి ప్రదేశమంతా చక్కగా ఆడుకుంటున్నారు. కింద నుంచీ […]

Continue Reading
Kandepi Rani Prasad

బద్ధకం (బాలల కథ)

బద్ధకం -కందేపి రాణి ప్రసాద్ ఓ మర్రిచెట్టు మీద కాకి జంట గూడు కట్టుకున్నది.అందులో పిల్లల్ని పెట్టుకొని కాపురం ఉంటున్నది.రోజు ఎక్కడెక్కడికో వెళ్లి ఆహారం సంపాదించుకొని వచ్చేది.తల్లి వచ్చేదాకా పిల్లలు నోరు తెరుచుకొని చూస్తూ ఉండేవి. ఎప్పుడెప్పుడు తల్లి ఆహారం తెస్తుందా! తిందాం అని ఎదురుచుస్తూండేవి.కాకి తన పిల్లల కోసం ఎంత దూరమైనా ఎగురుకుంటూ వెళ్ళేది. రెక్కలు నొప్పి వచ్చిన పిల్లల కోసం భరించేది.పిల్లలంటే ఎంతో ప్రేమ దానికి చాలా గరభంగా చూసుకునేది.ఎండు పుల్లలతో గూడు కట్టినా […]

Continue Reading

అనగనగా- చిన్న-పెద్ద (బాలల కథ)

చిన్న- పెద్ద -ఆదూరి హైమావతి  అనగనగా ఒక అడవిలో చీమనుండి ఏనుగు వరకూ, దోమ నుండీ డేగవరకూ అన్నీ కలసి మెలసి జీవిస్తూ ఉండేవి. ఎవరూ ఎవ్వరికీ కష్టంకానీ, అపకారం కానీ తలపెట్టేవి కావు. చేతనైతే సాయం చేసేవి. ఒకరోజున ఆ అడవికి ఏనుడు గజన్న స్నేహితుడుదంతన్న,చెలికాడిని చూడాలని వచ్చాడు . గజన్న మిత్రునికి మంచి విందుచేశాడు.  ఇద్దరూ ఒక మఱ్ఱి చెట్టు క్రింద విశ్రాంతిగా కూర్చుని చిన్న నాటి కబుర్లు చెప్పుకుంటున్నారు. మఱ్ఱి చెట్టు మానువద్ద  […]

Continue Reading
Posted On :

అనగనగా- స్మరణం (బాలల కథ)

స్మరణం -ఆదూరి హైమావతి  అప్పుడే పుట్టిన ఒక పురుగు  , కడుపు నిండా ఆహారం తిని కాస్తంత బలం చేకూరగానే బయటి ప్రపంచాన్ని చూడాలనే ఉత్సుకతతో  ఇంట్లోంచీ అమ్మకు చెప్పకుండానే  బయల్దేరింది . ఒక కప్ప మహా  ఆకలితో ఉండి నీళ్ళలో ఏజీవీ కనిపించక ‘ఉభయచరం’ గనుక నేలమీదకి గెంతింది .  దూరంగా వేగంగా వెళుతున్న ఈ పురుగు కనిపించింది . దాని మనస్సు ఆనందంతో నిండి పోయింది. “ఆహా! ఈపురుగును తిని నా ఆకలి చల్లార్చుకుంటాను […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

రంగు పానీయాలు (బాలల కథ)

రంగు పానీయాలు -కందేపి రాణి ప్రసాద్ అడవి అంత కోలాహలంగా పిల్ల జంతువులన్నీ ఒకే వైపుకు పరిగెడుతున్నాయి. ఆనందంగా గంతులేస్తూ పోతున్నాయి. నాలుకలు చప్పరించుకుంటూ సంతోషంగా వెళుతున్నాయి. పిల్ల కోతులు, పిల్ల ఎలుగుబంట్లు, పిల్ల పులులు, పిల్ల కుందేళ్ళు ఒకటేమిటి సమస్త జంతువులు పిల్లలన్ని పరుగులు తీసుకుంటూ పోతున్నాయి.పెద్ద జంతువులకేమి అర్థం కాలేదు ఇవన్ని ఎక్కడికి పోతున్నాయో? పడమటి దిక్కుకు పోయి వచ్చిన పిల్ల జంతువులన్నీ మిగతా వాటి చెవుల్లో ఏమో చెపుతున్నాయి ఆశ్చర్యంగా నోరు తెరుస్తూ, […]

Continue Reading
Kandepi Rani Prasad

సర్కస్ (బాలల కథ)

 సర్కస్ -కందేపి రాణి ప్రసాద్ అనగనగా ఒక అడవిలో జంతువులన్నీ కలిసిమెలసి ఆనందంగా జీవించేవి. ఒకదానికొకటి సహకరించుకుంటూ పోట్లాటలు లేకుండా చక్కగా ఉండేవి. ఎప్పుడైనా ఏదైనా కష్టం ఎదురైతే అన్నీ కలసి కూర్చుని ఆ విషయాన్ని చర్చించుకొని పరిష్కారాన్ని వెతుక్కునేవి. పగలంతా ఆహార అన్వేషణలో సమయం దొరక్కపోయిన రాత్రిపూట అన్నీ కలసి ఒక్కచోట చెరీ కబుర్లు చెప్పుకునేవి. ఆ రోజు వాటికి ఎదురైన అనుభవాల్ని అవి పక్కవాళ్లతో పంచుకునేవి. ఆ అడవికి అనుకోని ఒక ఊరు ఉండేది. […]

Continue Reading

అనగనగా- తగిన సాయం(బాలల కథ)

తగిన సాయం -ఆదూరి హైమావతి  అనగనగా ఒక చిట్టడవి.దాని సమీపాన ఒక నది. ఆ చిట్టడవిలోని చెట్ల మీద చాలా పక్షులు గూళ్ళుకట్టుకుని జీవించేవి. అక్కడ ఒకపెద్ద బూరుగు చెట్టుకూడా ఉంది. దానిపైకొమ్మమీద ఒక కాకి కర్రలతో గూడుకట్టు కుంది. దాని క్రిందికొమ్మ మీద  ఒక పిచ్చుక  పిడకల తో గూడు కట్టుకుంది. పక్క నే ఉన్న పెద్ద మఱ్ఱి  మాను మీద చాలా పక్షులు గూళ్ళుకట్టుకుని, ఎవరి పాటికి అవి జీవించేవి. ఒక వానాకాలం రాత్రి […]

Continue Reading
Posted On :

అనగనగా- ప్రతిఫలం (బాలల కథ)

 ప్రతిఫలం -ఆదూరి హైమావతి  అనగా అనగా ఒక అడవిప్రాంతంలో ఒక వేపచెట్టు మీద ఒక పిచ్చుక గూడు కట్టుకుని నివసించేది. దానికి రెండుపిల్లలు . వాటికి బయటి నుండీ తిండి తెచ్చిపెడుతూ ఉండేది. కాస్త పెద్దవి అవుతుండగా , ‘అమ్మఒడి ప్రధమబడి’ కదా!అందుకని తనపిల్లలకు బుధ్ధి మాటలు చెప్పేది. “బలవంతులతో విరోధం పెట్టుకోకండి. మనస్థాయికి తగినవారితో స్నేహం చేయండి. మనకడుపు నింపే విత్తనాల మొక్కలపట్ల  కృతజ్ఞత తో ఉండండి. ఎవరికీ హానిచేయకండి. ఐకమత్యమే మహా బలం అని […]

Continue Reading
Posted On :

అనగనగా- మంత్ర జప ఫలం (బాలల కథ)

మంత్ర జప ఫలం -ఆదూరి హైమావతి  అనగా అనగా అమలాపురం అనే ఊరి పక్కన ఉండే అడవి ప్రాంతాన ఆనందముని అనే ఒక ఆచార్యుడు ఒక ఆశ్రమం నిర్మించుకుని,తన వద్దకు విద్యార్జనకోసం వచ్చిన వారిని శిష్యులుగా స్వీకరించి విద్య బోధించే వాడు. ఆయన వేద వేదాంగాలను కూలంకషంగా ఔపోసన పట్టిన వాడు. విద్యా భోధనలో మంచి నేర్పరని పేరుగాంచిన వాడు. ఆయన శిష్యులు తమ గురువును సేవిస్తూ విద్యాభ్యాసం చేసే వారు. ఆయన ఆశ్రమంలో శిష్యులు ఉదయం […]

Continue Reading
Posted On :

అనగనగా- ఉచితం అనుచితం (బాలల కథ)

ఉచితం అనుచితం -ఆదూరి హైమావతి  అనగా అనగా ఆనందహళ్ళి అనే గ్రామంలో అనంతమ్మ అనే ఒక పేదరాలు ఉండేది.ఆమె కుమార్తె సుమతి. ఆ ఊర్లో ఉండే సర్కార్ స్కూలు అనంతమ్మ  చిమ్మేది . సుమతి ఆస్కూల్లోనే ఐదో క్లాసు చదువుతున్నది.ఆమెకు చిన్నతనంలో బురదలో జారిపడి పాదం కాస్త వంకపోయి వంకరగా నడిచేది. పేదతనం వల్ల సమయానికి వైద్యం చేయించలేకపోయింది అనంతమ్మ. సుమతి అలాగే నడుస్తుంది, బాగా చదువుతుంది. చక్కగా పద్యాలూ, పాడుతుంది. గణితంలో దిట్ట. డ్రాయింగ్ కూడా […]

Continue Reading
Posted On :

అనగనగా- అమ్మమాట (బాలల కథ)

అమ్మమాట -ఆదూరి హైమావతి  అనగనగా ఒక చిట్టడవి. ఆడవిలో ఒక మఱ్ఱి చెట్టు క్రింద ఉన్న బొరియలో ఒక ఎలుక నివాసం ఏర్పరచు కుని జీవిస్తూ ఉండేది. దానికి కొంతకాలానికి రెండు ఎలుకలు పుట్టాయి.వాటికి రోజూ ఇంత తిండి తెచ్చి పెడుతూ పెంచసాగింది. క్రమక్రమంగా అవి పెరగ సాగాయి.బొరియలో అటూ ఇటూ పరుగెడుతూ ఆడుకో సాగాయి. ఒకరోజున ఎలుక తిండి వెతికి తేవటానికి వెళుతూ “పిల్లలూ! బయటికి వెళ్లకండి. నేనే మిమ్మల్ని బయటి కి తీసుకెళ్ళి ,ఎలా […]

Continue Reading
Posted On :

అనగనగా- గొప్పదనం (బాలల కథ)

      గొప్పదనం -ఆదూరి హైమావతి  అనగ అనగా రామాపురం అనేగ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు.అతడు తన పొలంలో వాదుకునే పరికరాలనంతా తన ఇంటిపక్కనే ఉండే రేకులషెడ్డులో ఉంచేవాడు.రామయ్యభార్య సూరమ్మకూడా తాను పెరట్లోనూ , ఇంట్ళోనూ వాడుకునే కొన్ని వస్తువులను అందుబాటూగా ఉంటాయని అక్కడేపెట్టేది. ఒకరోజున ఆమె గబగబా రేకులషెడ్డులోకి వచ్చి అక్కడ క్యాలెండర్ కు గుచ్చి ఉంచిన సూదిని తీసుకెళ్ళి ముళ్ళు గుచ్చుకుని చిరిగిన రామయ్య పంచెను కుట్టి తెచ్చి మళ్ళీ అక్కడే ఉంచ్చి వెళ్ళింది. […]

Continue Reading
Posted On :

అనగనగా- భావన (బాలల కథ)

  భావన -ఆదూరి హైమావతి  అనగా అనగా మైసూరు రాజ్యాన్ని మేధవర్మ అనే రాజు  పరిపాలించేవాడు. ఆయన మంచి పాలకుడు. వివేకవంతుడు.ప్రఙ్ఞాశాలి. అతడు ప్రజల క్షేమం కోసం నిరంతరం శ్రమించే వాడు. ప్రతి రాత్రీ రెండోఝాములో తన ఆంతరంగిక మంత్రులతోనూ, విద్యా వేత్తలతోనూ సమావేశాలు జరిపి ప్రజల బాగోగులు చర్చించేవాడు. ఒకరోజున ఆంతరంగిక సమావేశంలో  “మనకు ఇతరులపై ఏర్పడే అభిప్రాయాలు వారిని మొదటిమారు చూడగానే   మన మనస్సులో కలిగే అభిప్రాయాన్నిబట్టి ఉండవచ్చు, లేదా తాము దేనిగురించీ ఆలోచిస్తు […]

Continue Reading
Posted On :

పెంచిన ప్రేమ (బాల నెచ్చెలి-తాయిలం)

పెంచిన ప్రేమ -అనసూయ కన్నెగంటి            తల్లికోడి పెరడు అంతా తిరుగుతూ  ఆహారాన్ని చూడగానే “క్కొ..క్కొ..క్కొ..” అంటూ పిల్లల్ని పిలుస్తూంది.  అప్పటిదాకా కబుర్లు చెప్పుకుంటున్న కోడిపిల్లలు తల్లి పిలుపు విన్న వెంటనే ..” అమ్మ పిలుస్తూంది..అమ్మ పిలుస్తూంది “ అని అరుస్తూ గోల గోలగా ఒకరితో ఒకరు పోటీలు పడి మరీ పరిగెత్తుకుంటూ వాళ్లమ్మ దగ్గరకు వెళుతున్నాయి. ఆ పిల్లల్లో నాలుగు బాతు పిల్లలు కూడా ఉన్నాయి. అవి కోడిపిల్లల అంత […]

Continue Reading
Posted On :

చిన్నిపిట్ట పెద్ద మనసు(బాలల కథ)

చిన్నిపిట్ట పెద్ద మనసు -ఆదూరి హైమావతి  పూర్వం ఒకాడవిలో చెట్లమీద చాలా పక్షులు గూళ్ళు కట్టుకుని నివసి స్తుండేవి.అక్కడి నాగావళీ నదీ సమీపాన ఒక పెద్ద బూరుగు చెట్టు ఉండే ది.దానికొమ్మలు బాగా పైకి పెరిగి చాలా చెట్లకంటే ఎత్తుగా ఉండేది. దానిపై కొమమ్మీద ఒక కాకి కర్రలతో గూడు కట్టుకుని నివసించేది.అది రోజూ తన గూడు నుంచీ క్రింద కొమ్మ ల మీద ఉన్న పక్షులను హేళనగా చూస్తూ “క్రింది వారంతా బావున్నారా! నేనూ కాకమ్మను, […]

Continue Reading
Posted On :

దాత బాలల కధ (బాల నెచ్చెలి-తాయిలం)

  దాత -అనసూయ కన్నెగంటి రాఘవాపురం అనే ఊర్లో  రామయ్య అనే ఒక రైతు  ఉండేవాడు.  ఆ రైతుకి ఒక అలవాటు ఉండేది. అదేమిటి అంటే  తన పొలంలో ఏ రకమైన పంట పండినా అందులో పదవ వంతు పంటను పేదలకు పంచిపెట్తటం. అలా పంచిన తర్వాతే  మిగతా పంటను తన కుటుంబ అవసరాలకు వాడుకునే వాడు.         అతనికి ఉన్న ఈ అలవాటుని భార్యాపిల్లలూ కూడా ఇష్టపడేవారు.          అయితే ఒకసారి పంట కోతకు వచ్చే సమయానికి బాగా వర్షాలు […]

Continue Reading
Posted On :

అనగనగా- మహాభాగ్యం (బాలల కథ)

మహాభాగ్యం -ఆదూరి హైమావతి  పావన దేశానికి రాజు పరిమళవర్మ .వారిపూర్వుల్లా ధర్మపాలనచేస్తూ పేద ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే వాడు. రాజ్యం సుఖిక్షంగా ఉండటాన పరిమళవర్మకు తగినపని లేకపోయింది. రాజ్యపాలన కూడా తగిన మంత్రివ ర్యు లుండటాన వారికే అన్నీ వదిలేసి, సోమరిగా మారాడు. క్రమంగా కూర్చుని తినటాన  స్థూలకాయం వచ్చింది. లేచి ఏ పనీ చేయలేక పోయేవాడు. రోజంతా సింహాసనం మీదో, హంస తూలికాతల్పంలోనో గడిపే వాడు. ఎవ్వరికీ మహారాజుకు తన దినచర్య గురించీ చెప్పే ధైర్యంలేక […]

Continue Reading
Posted On :

అనగనగా- మాతృదీవెన (బాలల కథ)

మాతృదీవెన -ఆదూరి హైమావతి   నారాయణపురం అనేగ్రామంలో అనంతమ్మ తన ఏకైక కుమారుడైన నారాయణతో జీవిస్తుండేది.ఆమె భర్త ఎండుకట్టెలు అడవినుంచీతెచ్చి అమ్మి సంసారం గడిపేవాడు. ఒకరోజున కట్టెలకోసం అడవికివెళ్ళి గంధం చెట్టు ఎండుకట్టెలు కొడు తుండగా నాగుపాము కాటేసి అక్కడికక్కడే మరణించాడు.       అనంతమ్మ ఎంతో నిబ్బరంగా  తన గుడిసె చుట్టూతా కూర పాదులు పెంచుకుంటూ ,అవి అమ్ముకుని వచ్చిన సొమ్ముతో పొదుపుగా  ,కుదురుగా కుమారుని పోషించుకుంటూ జీవించేది.    నారాయణ కూడా తల్లి రాగన్నం పెట్టినా, జొన్నన్నం పెట్టినా, గంజి […]

Continue Reading
Posted On :

కలసి ఉంటే కలదు సుఖము (బాల నెచ్చెలి-తాయిలం)

కలసి ఉంటే కలదు సుఖము -అనసూయ కన్నెగంటి వేసవి శెలవులకు వచ్చిన మనవడు సుశాంత్ ని  పొలం తీసుకెళ్ళాడు తాతయ్య. పొలంలో ధాన్యాన్ని రాశులుగా పోసి బస్తాలకు ఎత్తుతున్నారు పనివాళ్ళు. అక్కడికి  రివ్వుమని ఎగురుతూ గుంపులు గుంపులుగా  వచ్చి ధాన్యం రాశుల మీద వాలుతున్న  పిచ్చుకలను చూశాడు సుశాంత్. వాడికి చాల ఆనందం కలిగింది వాటన్నింటినీ ఒకచోట అలా గుంపుగా చూస్తే. “ తాతయ్యా ..అవి చూడు “ అంటూ తాతయ్య వేలు విడిచి పెట్టి అక్కడ […]

Continue Reading
Posted On :

పారని ఎత్తు (బాల నెచ్చెలి-తాయిలం)

     పారని ఎత్తు -అనసూయ కన్నెగంటి ఒకానొక అడవిలో ఉదయాన్నే తల్లి జింక పిల్ల జింకా గడ్డి మేయసాగాయి.  అలా గడ్డి తింటూ తింటూ పిల్ల జింక తల్లికి దూరంగా వెళ్ళిపోయింది.  అది గమనించిన తల్లి గడ్డి తింటూనే మధ్య మధ్యలో  దుష్ట జంతువులు ఏమన్నా వస్తున్నాయేమోనని తలెత్తి చుట్టూ ఒకసారి చూసి ఏమీ లేవు అనుకున్నాకా గడ్డి తినటం చేయసాగింది.    అలా చూడగా చూడగా  కొంతసేపటికి దూరంగా వస్తూ ఒక నక్క తల్లి జింక కంటపడింది.     దానికి […]

Continue Reading
Posted On :

అనగనగా- యద్భావం – తద్భవతి (బాలల కథ)

  యద్భావం – తద్భవతి -ఆదూరి హైమావతి  గోవిందపురంలో గోపయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఐదెక రాల  మంచి భూమి ఉండేది.దాన్లో అతను తండ్రి వద్ద నేర్చుకున్న వ్యాపారమెళకువలను పాటిస్తూ వ్యవసాయం చేసి మంచి దిగుబడి, దానికి  తగిన ప్రతిఫలమూ పొందే వాడు. ప్రతి ఏడాది అంతా ఏ పంటలు వేస్తున్నారో బాగా పరిశీలించి తాను వారికి భిన్నంగా ఎంపికచేసు కున్న పంట వేసేవాడు. అంతా వేలం వెర్రిగా వరి పంటో, గోధుమపంటో, రెండో కాపుకు పొగాకో, […]

Continue Reading
Posted On :

మంచి కుటుంబం (బాల నెచ్చెలి-తాయిలం)

మంచి కుటుంబం -అనసూయ కన్నెగంటి అనగనగా ఒక ఊర్లో ఒక చిన్న రైతు  ఉండేవాడు. అతనికి ఉన్న కొద్దిపొలంలోనే ఇంట్లో వాళ్లంతా కష్టపడి  పంటలను పండించే వారు. కానీ అది కుటుంబ అవసరాలకు ఏ మాత్రమూ సరిపోయేది కాదు.  ఆ విషయంలో భార్యకు ఎప్పుడూ బాధగా ఉండేది. “ మరి కొంత పొలం ఎవరిదైనా తీసుకుని వ్యవసాయం చేద్దాము.లేదంటే ఏదైనా చిన్న వ్యాపారం చేద్దాము. ఎన్నాళ్లని ఇలా చాలీ చాలని ఆదాయంతో కుటుంబం గడుపుకుందాం” అంటూ ఉండేది. […]

Continue Reading
Posted On :

అనగనగా- ప్రజలత్యాగం (బాలల కథ)

  ప్రజలత్యాగం -ఆదూరి హైమావతి అనగా అనగా అమరపురి రాజ్యాన్ని అమరసేనుడు అనేరాజు ప్రజారంజ కంగా పాలిస్తుండేవాడు. ఆయన పాలనలో ప్రజలకు కష్టమన్నది తెలిక సుఖశాంతులతో హాయిగా జీవించసాగారు. ఒకరోజున  అమరసేనుడు మహామంత్రి త్యాగరాజుతో ఇష్టాగోష్టిగా మాట్లా డు తుండగా ప్రజలకు భగవంతునిపై ఉండే భక్తిగురించీ సంభాషణ మళ్ళింది.  అమరసేనుడు “మంత్రివర్యా మన ప్రజలకు భగవధ్భక్తి   కూడా ఎక్కువగానే ఉంటుందని భావిస్తాను”అన్నాడు. దానికి త్యాగరాజు “మహారాజా! ప్రజలకు కష్టమన్నది తెలీక పోటాన భగ వంతుని కూడా ఎంత […]

Continue Reading
Posted On :

పిల్లకోడి ప్రయత్నం (బాల నెచ్చెలి-తాయిలం)

   పిల్లకోడి   ప్రయత్నం -అనసూయ కన్నెగంటి పిల్లలకు జాగ్రత్తలు చెప్పి  బయటికి వస్తూనే తలెత్తి ఆకాశం వైపు చూసింది తల్లికోడి.  అది చూసినంత మేరలో ఎక్కడా కాకిగాని, గ్రద్ద కానీ దానికి కనపడలేదు. “ ఎప్పుడూ నా పిల్లల్ని అవే ఎత్తుకుని వెళతాయి. పాపం. మిగతా పక్షులు నా పిల్లల వైపు కన్నెత్తి కూడా చూడవు..” అని మనసులో అనుకుంటూ అక్కడికి  దగ్గరలో ఉన్న చెట్ల పైనంతా మరింతగా పరికించి చూసింది ఎక్కడైనా మాటుకాసాయేమోనని. ఏవీ కనపడకపోయేసరికి..” […]

Continue Reading
Posted On :

నిజాయితీపరుడు (బాల నెచ్చెలి-తాయిలం)

నిజాయితీపరుడు -అనసూయ కన్నెగంటి ఒకరోజు భూపాల రాజ్యపు రాజు భూపాలుడు తన ముఖ్యమంత్రితో కలసి మారువేషంలో గుర్రపు బగ్గీ మీద రాజ్యమంతా తిరగసాగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా .. సాయంత్రం అయిపోయింది. ఇక రాజప్రాసాదానికి వెళ్ళిపోదాము అనుకుంటూ ఇద్దరూ వెనక్కి తిరిగారు. దారిలో బాగా పెరిగిన పచ్చటి పొలాలు, పండ్ల తోటలూ వారిద్దరికీ  కనువిందు  చేయసాగాయి. రాజ్యంలో పండే రకరకాల పంటలు, వాటిలోని నాణ్యత, రాజ్యంలోని అవసరాలు..వాటి ధరలు, రైతుకి వచ్చే ఆదాయం వంటి అనేక […]

Continue Reading
Posted On :

అనగనగా-హేళన తగదు (బాలల కథ)

హేళన తగదు -ఆదూరి హైమావతి అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చిన్న చితకా జంతువులూ, పక్షులూ అన్నీ ఎవరి పాటికి అవి జీవిస్తున్నాయి. ఆ అడవి గుండా ప్రవహించే గౌతమీ నదీపాయ వాటి దాహానికి ఆధారంగా ఉండేది. అన్నికాలాల్లో ఆ నదిలో నీరు పారుతుండటం వారి పాలిటి వరమైంది. ఆ అడవి జీవులకు ఒక నియమం ఉంది.  ఎవ్వరూ ఎవ్వరి జోలికీ వెళ్ళ కుండా ఎవరిపని వారు చూసు కుంటూ హాయిగా జీవించేవి. ప్రతి పౌర్ణమి […]

Continue Reading
Posted On :

విత్తనం (బాల నెచ్చెలి-తాయిలం)

విత్తనం -అనసూయ కన్నెగంటి   బదిలీ మీద పొరుగు ఊరు నుండి ఆ ఊరు బడికి వచ్చిన సాంఘికశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు రామేశంకి పిల్లలన్నా, మొక్కలన్నా ఎంతో ఇష్టం. బడికి వచ్చిన మొదటి రోజే  ఆ బడిలో బోలెడంత ఖాళీ స్ధలం ఉండేసరికి చూసి ఆనంద పడ్డాడు. కానీ  ఆ స్ధలంలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయి ఉండటం చూసి చాల బాధపడ్డాడు.       అతను ఎలాగైనా పిచ్చి మొక్కలు పీకేసి..అక్కడ మంచి మంచి మొక్కలు నాటి పెంచి […]

Continue Reading
Posted On :

అనగనగా-కృషితో ఋషి (బాలల కథ)

కృషితో ఋషి -ఆదూరి హైమావతి నాగవరం  ఒక మారుమూల గ్రామం. ఆగ్రామంలోని శివాలయం చాలా ప్రసిధ్ధిచెందినది . దూర ప్రాంతాల నుంచీ భక్తులు  ఆ ఆలయంలోని శివుడు దర్శించి వెళ్లను వస్తుంటారు. పూజారి  అర్చనచేసి హారతిస్తూ భక్తులకు ” భక్తులారా! ఈ శివాలయం చాలా ప్రసిధ్ధిచెందినది. పూర్వం దేవతలు. సైతం వచ్చి,ఈ భవనాశి పుష్కరిణి లో  స్నానం చేసి  ఈ స్వామి వారిని దర్శించేవారని చెప్తారు.మా తాతముత్తాతలనుండీ మేము ఈ శివాలయ అర్చకులం ,  ఏదో ఒక […]

Continue Reading
Posted On :

అమ్మమాట (బాల నెచ్చెలి-తాయిలం)

అమ్మమాట -అనసూయ కన్నెగంటి   అడవిని ఆనుకుని ఉన్న తన పొలం లోనికి ఆవును దూడను మేత కోసం తోలుకు వచ్చాడు రైతు. ఆ దూడ పుట్టి ఎక్కువ కాలం కాలేదు. అది తల్లి కూడా పొలం రావటం అదే మొదటి సారి.      అలా తన కూడా వచ్చిన దూడకు దూరంగా ఉన్న అడవిని చూపిస్తూ.. “ అది అడవి. అక్కడ క్రూర జంతువులు ఉంటాయి. మనలాంటి వాళ్లం కనిపిస్తే తినేస్తాయి. నువ్వు పొరపాటున కూడా నన్ను, […]

Continue Reading
Posted On :

అనుకరణ (బాలల కథ)

అనుకరణ -ఆదూరి హైమావతి అనగా అనగా విజయపురి అనే రాజ్యం ఉండేది.ఆరాజ్యానికి మహారాజు విక్రమసింహుడు.ఆయన తన ప్రజలు చాలా విఙ్ఞులనీ, తెలివై నవారనే నమ్మకం ఉండేది. పక్కనే వున్న అమలపురి మహారాజు ఆనందభూపతి ఆయన బాల్యమిత్రుడు. ఇరువురూ ఒకమారు  కలసి నపుడు ,పరస్పరం తమరాజ్య పరిస్థితి గురించీ మాట్లాడుకునే సమ యం లో , విక్రమసింహుడు ” మాప్రజలు చాలాతెలివైన వారు, విఙ్ఞు లు కూడా.అందువలన మాకు మా ప్రజల గురించిన చింత ఏమాత్రం మాకు లేదు.వారు […]

Continue Reading
Posted On :