image_print
Rajita Kondasani

జవాబు (కవిత)

జవాబు -రజిత కొండసాని ఓ ఉషోదయాన ఎందుకో సందేహం వచ్చి భయం భయంగా లోలోపల ముడుచుక్కూర్చున్న గుండెను తట్టి అడిగా! ప్రపంచాన్ని చూసే కన్నుల్లానో ప్రాణ వాయువుల్ని పీల్చే ముక్కులానో సప్త స్వరాల్ని దేహంలోకి ఒంపే చెవిలానో సప్త స్వరాల్ని దేహంలోకి ఒంపే చెవిలానో సిగ్గుతో ఎర్రబారే చెంపలానో సాటి వారి మీద ప్రేమ ప్రకటించే నోరులాగనో దేహం మీద బాహాటంగా కనిపించక ఎముకల గూడు మధ్య ఏ మూలనో చిమ్మ చీకట్లో దాక్కున్నావెందుకని ? నేనీ […]

Continue Reading
Posted On :

ఊటబాయి కన్నీరు (కవిత)

ఊటబాయి కన్నీరు -డా. కొండపల్లి నీహారిణి ఎందుకింత ఏకాంత నిశీధి గమనాలో ఎందుకింత విషాద పవనసమూహాలో ఎక్కడినుండో పొగబండి ఏడుపుకు వేళ్ళాడుతూ ఎందర్నో మోసుకొస్తున్నది. పరాయీకరణను , పరాభవాలను కూరుకొని ఎఱ్ఱటి పట్టాలపై ఇటుగా….. ఆర్తనాదాలతో,ఆధిపత్యాలతో…. కాలం చేసే గాయాల్లో ఋతువుల్ని ప్రాణాల చెంత జేర్చ, అనుమానాలు చెప్పే బాధల గాధల్ని అననుకూల భావాలకూర్చి, కళ్ళసామ్రాజ్య సింహభాగాన సింహాసనమెక్కి , అట్లా…… అవునూ, నీదీ నాదీ ఒక్కచూపుల పొద నీదీ నాదీ ఒక్కమాటల సొద కలలతీరాన కనరాని […]

Continue Reading

ఆమెప్పటికీ…..!? (కవిత)

ఆమెప్పటికీ…..!? -సుధామురళి అకస్మాత్తుగా ఓ రాత్రి భోరున వర్షం కురుస్తుంది నదులన్నీ కళ్ళ కరకట్టల మీద యుద్ధం ప్రకటిస్తాయి మమ్మల్ని ఆపేందుకు మీకేం హక్కు ఉందని ప్రశ్నిస్తూ చెక్కిళ్ళ నిండా సైన్యాలను చారలు చారులుగా నిలబెట్టేస్తాయి ఆ వర్షం ఆమెకు మాత్రమే సొంతం మనసుంది కదా తనకు చిన్నా పెద్దా మాటలతో గాయపరుచుకునేందుకు ఒకటో రెండో గదమాయింపుల గద్దెల్ని ఎక్కేందుకు పొలిమేర దాటని తనను ఊరుకాని ఊరుకు తరిమినా మిన్ను విరగనట్టు విర్రవీగేందుకు ఎన్ని కష్టాల్ని దాపెట్టిందో […]

Continue Reading
Posted On :

వరద (కవిత)

వరద -శ్రీధరరెడ్డి బిల్లా జనసంద్ర నగరం జలసంద్రమయ్యింది. పెట్రోలు కొట్టకుండానే కార్లు కొట్టుకు పోతుంటే , చెరువుల్లో తిరిగే బోట్లు కాలనీల మధ్య తిరుగుతూ ఇంటి సామాను, వంట సామాను  మోస్తున్నాయి! వీధి రోడ్డు మాయమై, భీకర వాగు అయ్యింది. “వీధి మలుపు” వాగుకొక వంక అయ్యింది! దారి చూపిస్తూ పంపించే ట్రాఫిక్ సిగ్నలు , దారి తెల్వకుండా ఎటువైపో తేలిపోతా ఉంది ! కాళ్ళతో  టిక్కుటిక్కున నడిచిన నిన్నటి రోడ్డు మీద కాళ్ళు నేలకు ఆనక, […]

Continue Reading

ప్రకృతి (కవిత)

ప్రకృతి -గిరి ప్రసాద్ చెల మల్లు కృష్ణా నదిలోని నల్లని గులకరాళ్ళ కళ్ళ చిన్నది గోదావరంత పయ్యెద పై నే వాల్చిన తలని నిమిరే నల్లమల కొండ ల్లాంటి చేతివేళ్ళ చెలి సోమశిల లాంటి ముక్కు ఉచ్చ్వాస నిశ్వాసాలకి అదురుతుంటే నా గుండెలపై వెచ్చని రామగుండం స్పర్శ శేషాచలం కొండల కనుబొమ్మల మధ్య గుండ్రని చందవరం స్థూపం లాంటి తిలకంలో నా రూపు శాశ్వతం ఫణిగిరి లాంటి నల్లని వాలుజడ పిల్లలమర్రి ఊడల్లా ఊగుతుంటే మదిలో ఏటూరు […]

Continue Reading

అక్కమహాదేవి (కవిత)

అక్కమహాదేవి -గిరి ప్రసాద్ చెలమల్లు అక్కమ్మా! ఎప్పుడో ఏనాడో నీ నుండి జాలువారిన  వచనం మా సమాజాన్ని సూటిగా, నగ్నంగా ప్రశ్నిస్తున్నట్లగుపిస్తుందమ్మా నీ కాయం నీ ఇష్టం ఎవ్వరికి అర్పిస్తావో ఎవ్వరి దురాక్రమణకి లొంగక అణువణువూ చెన్నకేశవ చెంత దిగంబరమో నీ మనోభీష్టమో స్పర్శయో సాన్నిహిత్యమో తలంచినదే తడవుగా ఎక్కుబెట్టిన విమర్శనావచనం జీర్ణించుకోలేని ఆధిక్యత నీ గుహ ఎన్నో మనోనిగూఢాల వేదిక నీ మేను ప్రవచించిన కేశాల అల్లిక నాడే ఎలుగెత్తిన నీవే మా చలం కన్నా […]

Continue Reading

హథ్రాస్ (కవిత)

హథ్రాస్ -వసీరా సూర్యుడి తేజాన్ని మట్టిబలాన్ని చెమటలోని ప్రేమని తాగి పెరిగిన గోధుమ గింజ రక్త సిక్తమైంది చిన్నారి గోధుమ గింజ రక్తకన్నీరుతో తడిసి నేలలోకి వెళ్లపోయింది. నేల లోపల అణుప్రకంపనలు గంగాతీర మైదానాలు కంపిస్తున్నాయ్ కంకుల్లోని గింజలు నిప్పుల పాలుపోసుకుని గ్రెనేడ్లవుతున్నాయి కంకులు బులెట్లని కాస్తున్నాయి తరతరాలుగా నీదయిన నీ నేల రణరంగమవ్వడానికి సిద్ధమవుతోంది. విస్ఫోటించే నేల లోంచి కొత్త కాళిక ఆవిర్భవిస్తోంది. సత్యానికి నోరిచ్చేందుకు సహస్రబాహువుల్లో కొత్త ఆయుధాలు ధరించి పరపరా సరసరా నాలుకలు […]

Continue Reading
Posted On :

కనుక్కోండి (కవిత)

కనుక్కోండి -దిలీప్.వి ఆకలైతే కాదు నన్ను చంపింది పస్తులుoడి ఆకలితో అలమటించిన దినములెన్నో… పేదరికం కాదు నన్ను వల్లకాటికి చేర్చింది అయితే.. ఇన్నేళ్ల నుండి దానితోనే కదా సావాసం చేస్తున్నది కరోనాకా నేను బలిఅయినది? కాదు కాదు… అసలే కాదు దేనికి నేను బలి అయిందో తెలియదా మీకు? ఇంటికి చేరుతానని ఇంటికి దీపమైతానని నన్ను నడిపించిన ఆశ విగతజీవిగా మారి కన్నవారికి మిగిల్చిన నిరాశ కారకులెవరో కనుక్కోండని ప్రశ్నగా మారి వెళుతున్న… ***** దిలీప్.వినా పేరు […]

Continue Reading
Posted On :

అస్థిమితం….. (కవిత)

అస్థిమితం….. -సుధామురళి ఒకటే రెక్కని ఎన్నిసార్లు ఆడించను చెప్పుఒకటే గుండెని ఎన్నిసార్లు సర్దుకోమని సర్దుబాటు చెయ్యను చెప్పు ఓ నిప్పు కణాన్ని వదలాలనుకుంటాఆ రెప్పల చాటులో నుంచికనుగుడ్డు ఏ మాయలో కూరుకుపోతుందో కానీవేడి ఆవిరి ఎప్పుడో చల్లారిపోయిన కాఫీ కప్పు అవుతుంది….. ఓ అక్షర తూటాని లాగి పెట్టి విడవాలనుకుంటాఆ చేదు తేనెల కలయికల మధ్యలోనుంచినరంలేని అర్ధమందపు నాలుక నాకేం పట్టింది అనుకుంటుందో ఏమోగానీఅసలు అనుకోని పదాలను వల్లెవేస్తుందిఅది నేనేనా అన్నదనే భ్రమను నాకప్పగిస్తూ…. శూన్యం నిండా ఏదో నిండుకుని ఉంటుందివెలితిలేని […]

Continue Reading
Posted On :

ఇక్కడ- అక్కడ (కవిత)

ఇక్కడ- అక్కడ  -కుందుర్తి కవిత పెళ్ళైన కొన్నాళ్ళకే  పుట్టింటి మీద బెంగొచ్చి వచ్చా ఇక్కడ…. చిన్ననాటి స్నేహితురాళ్ళంతా కలిసి చాన్నాళ్ళయిందని వచ్చి చుట్టూ చేరారు … రుసరుసలాడుతూ, తమలోతాము గుసగుసలు చెప్పుకుంటున్నారు ఏదో నిర్ధారణకి వచ్చినట్టుగా నాతో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు గా నా ఆత్మగౌరవం నన్ను నిలదీసింది నీకసలు ఆత్మసాక్షి అంటూ ఉందా అని చిన్నప్పటినుండీ వేలు వదలకుండా  నీతోనే నడిచిన నీ చిరకాల స్నేహితురాలిని ఈరోజు ఎవరెవరి కోసమో వదిలెళ్ళిపోతావా అని ఎవరో కాదు నా వాళ్ళే అని సంకోచంగానే నాకు నేను సర్ది చెప్పుకున్నాను కనీసం అప్పుడప్పుడైనా పలకరించవేమని చిందులు తొక్కుతూ  చటుక్కున చక్కా పోయిందది , నామీద కాసింతైనా  మర్యాద లేకుండా !!  అచ్చం అక్కడి గర్వం లాగే !! నా ఆత్మ విశ్వాసం నన్నూ నీతో తీసుకుపొమ్మంది నీకక్కడ సరిపడినంత చోటు ఉండకపోవచ్చు అంటే… ఈ ఇంటికంటే ఆ ఇల్లు పెద్దదికదా అని ప్రశ్నించింది అవునో కాదో నాకే తెలీనట్టు తలూపాను దాని అమాయకత్వానికి నాలో నేనే నవ్వుకున్నాను ఇరుకు ఇంట్లో కాదు,  మనుషుల మనసుల్లో అని  నోటిదాకా వచ్చినా, చచ్చినా వద్దనుకొని దాని నోరే, సులువు కదాని నొక్కేసాను విశ్వాసం లేని చూపులు విసురుతూ  విరవిరా వదిలి వెళ్ళిపోయింది !!  అచ్చం అక్కడి స్వార్ధం లాగే!! వెనుకనుంచి భుజంమీద తట్టి నన్ను మర్చిపోయావా, అనింది నా ఆత్మాభిమానం నాకోసం కాసింతైనా పోరాడాలనిపించలేదా  […]

Continue Reading
Posted On :

వరద (కవిత)

వరద -శ్రీధరరెడ్డి బిల్లా జనసంద్ర నగరం జలసంద్రమయ్యింది. పెట్రోలు కొట్టకుండానే కార్లు కొట్టుకు పోతుంటే , చెరువుల్లో తిరిగే బోట్లు కాలనీల మధ్య తిరుగుతూ ఇంటి సామాను, వంట సామాను  మోస్తున్నాయి! వీధి రోడ్డు మాయమై, భీకర వాగు అయ్యింది. “వీధి మలుపు” వాగుకొక వంక అయ్యింది! దారి చూపిస్తూ పంపించే ట్రాఫిక్ సిగ్నలు , దారి తెల్వకుండా ఎటువైపో తేలిపోతా ఉంది !   కాళ్ళతో  టిక్కుటిక్కున నడిచిన నిన్నటి రోడ్డు మీద కాళ్ళు నేలకు […]

Continue Reading

మార్పు (కవిత)

మార్పు -సంధ్యారాణి ఎరబాటి నీలి నీలి నింగికి…నేనెపుడూప్రేమదాసీనే…ఆకులతో నిండిన…పచ్చదనానికినేను ఎపుడూ ఆరాధకురాలినేఎగిరే అలల కడలి అంటేఎంతో ప్రాణంరహస్యం నింపుకున్న అడవన్నాఅంతులేని అభిమానం నింగి అందాన్ని చూడాలంటే…..చిన్న డాబా రూపు మార్చుకుంది…..అందనంత ఎత్తుకుఎదిగి పోయిందికొబ్బరాకుల గలగలలుకొంటె చంద్రుడిసరాగాలు మరుగున పడ్డాయిచెట్ల జాడలు…..నీలి నీడల్లామారిచోటు తెలియనితీరాలకు వెళ్లిపోయాయి…. గ్రీష్మపు సాయంత్రాలు…కూడారూక్షత్వపు ఆహ్లాదపులయ్యాయి ఋతువులు మారిపోయాయి వర్షం ఎపుడో స్నిగ్ధత్వం  మరచింది పచ్చదనం…ఖచ్చితంగా…..చిన్నబుచ్చుకుంది..ఈ మహానగరంలో  పేక మేడల్లాంటి ఈ  కట్టడాలపునాదుల్లో.. హరితం  మౌనంగాసమాధి అయింది…. పక్షిలా ఎగిరే నా భావాలన్నీ…. విశాలగగనం లో విహరించక ఎన్నాళ్ళయిందో అగ్గిపెట్టేల్లా కట్టిన కాంక్రీట్  అడవిలోఆకాశం కనిపించడం లేదు నాకు పక్షుల […]

Continue Reading

నీవు లేని రోజు (కవిత)

నీవు లేని రోజు -చందలూరి నారాయణరావు ఓ  ప్రియతమా! నీవు ప్రక్కన లేని ఒక్క రోజు ఒక పూవు అడిగింది నా అవసరం యిప్పుడెందుకని? ఓ పాట నిలదీసింది నా హాయి అవసరమేమని? ఓ రాత్రి ఆశర్యపడింది ఈనాటి కలను ఏమిచేస్తావని? ఒక రోజు నీవు దూరమైతే ఇన్ని ప్రశ్నలా? ఇన్ని అనుమానాలా? ఇంత అవమానమా? ఇక తట్టుకోలేను తల్లడిల్లుతున్నా ఎప్పుడూ భరింపలేను ఎడబాటును క్షమించు కరుణించి రక్షించు క్షమించి నీ ఒడిని వీడితే లోకం ఇంత […]

Continue Reading

ఆమె (కవిత)

ఆమె -సాహితి అతడి ధైర్యం నిజం. ఎంత ఎండకైనా మాడిపోడు. మసిలి మసిలి సహనంగా ఆవిరౌతాడు. ప్రేమతో మేఘమై పుట్టి మళ్ళీ కురుస్తాడు పగలు రేయి కుండపోతగా. పచ్చిక ఒడిలో మంచు బిందువులో ఒదిగిచూస్తాడు మొగ్గల బుగ్గ చాటున తొంగిచూస్తాడు. అతని నిజం ధైర్యం. ఆమె కురుల పరుపు కోరి కునుకు తీస్తాడు. ఆమె కనుల చాటుగా దూరి కలను దోస్తాడు. ఆమె కలల కౌగిట చేరి కలుసుకుంటాడు. అతడి నిజం ధైర్యం ఆమే. ***** ఆర్ట్: […]

Continue Reading
Posted On :

అష్టభుజి (కవిత)

అష్టభుజి -సుభాషిణి ప్రత్తిపాటి చించేసిందినా రాతల్ని కాదు..వేవేల నా భావాల్ని…ఎన్నో అంటని రెప్పల కాగడాలతో..నన్ను,నేనురగిలించుకుని…నిలుపుకున్న అస్తిత్వపు జాడల్ని!!వేకువకి మొలిచేవైతే…నా చేతులు తెగిపడేవే…ఇరు సంధ్యల మధ్య కడుపు నింపే…వంటలకవి అవసరం కనుకపాపం మిగిలాయవి…నాతో!!కాగితపు గీతలకు గిరి గీయగలవు కానీ…మరిగే మది తలపులనెలా….ఆపగలవు???ఎగిరే ఊహాల రెక్కలనెలాకట్టగలవు??అరచేతితో..అర్కుని ఆపగలవా…???జ్వలించే కవనోదయానికైఏదో ఓ ఉదయంనేను అష్టభుజిగా..అవతరిస్తాను.అక్షర సేవకై సరికొత్త అవతారికవ్రాసుకుంటా నా నవ జీవితానికి!! ***** ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత […]

Continue Reading

నిశిరాతిరి (కవిత)

నిశిరాతిరి – డా. కొండపల్లి నీహారిణి ఎక్కడినుండి రాలిందో ఓ చిమ్మచీకటి కుప్ప. ఎందుకు మౌనంవహించిందో మనసు కుండలో చేరి. ఒలకని మేధోమథనం ఒడవని బతుకుసమరం ఈ నిశిరాతిరి ఏ గుసగుసలుచేస్తున్నది? ఆకలి మంటలవికావు, అన్నపు రాసుల లేమివీకావు, ఒళ్ళు చిల్లుపడ్డ దాఖలాలూలేవు. మృత్యువు ధారాపాతనడకతో వీధుల్ని శవాలుగా ముంచెత్తుతూ ఈ నిశిరాతిరి ఏ గుసగుసలుచేస్తున్నది? సందులు గొందులు మూగవడినవి పనిముట్ల సందోహాలు మూలబడినవి చిక్కాలతో మూతులుముక్కులు ఆలింగనాలు లేని దూరాలవలెనేనన్న ఆనవాళ్ళ చిట్టాలిప్పలేకపోతున్నదంటూ… ఈ నిశిరాతిరి […]

Continue Reading

బాపట్ల నానీలు (కవిత)

బాపట్ల నానీలు – డా.సి.భవానీదేవి నీవాళ్ళు దూరమయ్యారా ? చింతించకు .. మేలు చేసుంటావు అందుకే ! అమ్మ.. నాన్న.. వెళ్లిపోయారు మట్టి మరోరూపందాల్చినా గుర్తించలేం  కదా.. శతాధిక నాటకాల పేటి కొర్రపాటి …. నాటక రచనలో ఘనాపాఠి ! సాహితీ రుద్రమ కప్పిన తొలిశాలువా నాకది బాధ్యతా పులకరింత ! బతుకంతా  నడకైనా కాళ్ళనెప్పుల్లేవు ఆరిపాదాలకు మా ఊరిమట్టి ! కిలో బియ్యం లీటర్ కిరోసిన్ కోసం రోజంతా క్యూలో … తుఫాన్ కు అంతా […]

Continue Reading
Posted On :

నవవాక్యం (కవిత)

నవవాక్యం -గిరి ప్రసాద్ చెల మల్లు అక్కడో పరువుతండ్లాడుతుంది గోబ్యాక్ నినాదాల వెనుక మర్మం జగద్విదితం  కులం గొంతుఆఖరిచూపునిచిదిమేసింది బిడ్డ భర్త హత్యలోప్రేమపర్వం తెరలుతెరలుగా సమాజగోడలపై చిత్రించబడుతుంది  మానసికస్థైర్యానివ్వలేని కులంమనిషిని చంపినా చేవ తగ్గకరంకెలేస్తుంది  గొడ్డలి వేటులో ప్రాణం గిలగిలలాడుతుంటేహర్షాతిరేకాలతోవీధుల్లో పైశాచిక కులోన్మాదం  పరిణతి ఇరవైల్లోనేజవాబులకు రంగుల పులిమే పాత్రికీచకత్వం  ప్రేమ భాష్యం  మారుతుందోమార్చబడుతుందో పరువు పదంలో కొంగ్రొత్తగా చెక్కబడుతున్న శిల్పంప్రేమ సహచర్యాన్ని ఓర్వలేని కులంతెగనరికి ప్రేమంటుంటేశిలపై ఉలి మొరాయిస్తూసమ్మెటకే ఎదురుతిరిగి వెలివాడల్లో ప్రేమకోసం పరుగులెత్తుతుంటే అడుగుల్లో నవవాక్యం కనబడుతుంది ***** గిరి ప్రసాద్ చెలమల్లుపుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. నాన్న గారి నుండి వామపక్ష భావజాలం పొందాను. విద్యార్థి […]

Continue Reading

తొలకరిజల్లుతో చెరువు (కవిత)

 తొలకరిజల్లుతో చెరువు -సుగుణ మద్దిరెడ్డి పాడి పశువులకు గడ్డి మేత లందించు పచ్చని పచ్చిక బీళ్లు!  చెరువులో చెట్ల మధ్యన ఆడిన  దాగుడు మూతలజోరు! పేడ ముద్దలు ఏరి సేకరించిన పిడకలకుప్పలెన్నో! ఎంత గిల్లినా తరగని పొనగంటాకు దిబ్బ లెన్నో!  చెరువునిండాక నీటి కోళ్ల  తల మునకలు రెక్కలు ఇదిలించే నీటి తుంపరలు నీటి పాముల  సొగసైన ఈతలు! చెరువుగట్టు అడుగున ఎండ్రకాయ బొక్కలుజూసి వాటిలో పుల్లలతో కలబెట్టి అవి బొక్కనుంచి బయటకొస్తే ఆనంద డోలికలూగినవేళ! ఆవులు, […]

Continue Reading

అన్నిటా సగం (కవిత)

 అన్నిటా సగం -చెరువు శివరామకృష్ణ శాస్త్రి నీవో సగం, నేనో సగం ఆకాశంలో, అవనిలో అన్నిటా మనం చెరి సగమంటూ తాయిలాల మాటలతో అనాదిగా మీరంటున్న సగానికే కాదు అసలు మా అస్తిత్వానికే సవాలుగా మిగిలిపోయాము అబలలమై! నిన్ను అన్నగా, నాన్నగా, తాతగా, మామయ్యగా, బావగా తలచి చెల్లినై, కూతురినై, మనుమరాలిగా, కోడలిగా, ముద్దుల మరదలిగా బహురూపాలుగా విస్తరించి ప్రేమను, కరుణను పంచగల మహోత్తుంగ జలపాతాన్ని నేను! సంపాదనలో నీ కన్నా మెరుగ్గా ఆర్జిస్తూ నీతో బాటు […]

Continue Reading

స్వప్న వీధిలో… (కవిత)

స్వప్న వీధిలో… -డి.నాగజ్యోతిశేఖర్ రోజూ రెప్పలతలుపులు మూయగానే … నిద్రచీకటిలో గుప్పున వెలుగుతుందో నక్షత్రమండలం! కలతకృష్ణబిలాల్ని కలల లతల్లో చుట్టేసి… దిగులు దిగుడుబావిని దిండుకింద పూడ్చేసి ఒళ్లు విరుచుకుంటుందో వర్ణప్రపంచం! ఊహాల్ని శ్వాసల్లో నింపి… ఊసుల్ని పూలలోయల్లో  ఒంపి… మనస్సు మూట విప్పుతుందో వినువీధి! ఆ వీధి మధ్యలో పచ్చటి చెట్టయి నవ్వుతుంటుంది నా మస్తిష్కం.! ఆ సందు చివర కురులారాబోసుకుంటుంది నా నవ్వుల వెన్నెల కెరటం! నడి వీధిలో నవ్వేెంటనే ఆధిపత్యపు స్వరాలు లేవు! ఆకాశపు అంచుల్లో నువ్వేెంటనే అమావాస్యపు […]

Continue Reading

జాబిల్లి ఎప్పుడూ ఆడ నే! (మార్గె పియర్సీ-అనువాద కవిత)

జాబిల్లి ఎప్పుడూ ఆడ నే! మూలం: మార్గె పియర్సీ అనువాదం: ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ జాబిల్లి ఎప్పుడూ ఆడ నే! ఈ రేజర్ బ్లేడ్ల నడుమ లోయలో నా ఆడతనాన్ని అలానే దుస్తుల్లా మార్చుకొంటూండాలని ఉంది… ఏం,ఎందుక్కూడదు? మగాళ్ళెప్పుడూ తమ మగతనాన్ని తొడుక్కొనే ఉంటారా? ఆ ఫాదరీ, ఆ డాక్టరు, ఆ మాష్టారు అందరూ విలింగతటస్థభావంలో నత్తగుల్లల్లా తమ వృత్తులకు హాజరవుతున్నామంటారా? నిజానికి నేను పనిలో ఉన్నప్పుడు ఏంజిల్ టైగర్ లా స్వచ్ఛంగా ఉంటాను చూపు స్పష్టంగా […]

Continue Reading

తండ్రీ, కూతురూ (కవిత)

తండ్రీ, కూతురూ -చెరువు శివరామకృష్ణ శాస్త్రి ఆనాడు అల్లరి చేసే పిల్ల ఈనాడు చల్లగ చూసే తల్లి ఆనాడు ముద్దులొలికే బంగరు బొమ్మ నేడు సుద్దులు చెప్పే చక్కని గుమ్మ నీ పసితనమున నీకు అన్నం తినిపించబోతే నీ చిన్ని చేతులతో తోసి వేసినావు మారం చేసినావు, హఠం చేసినావు కథలూ కబుర్లు చెప్పి, నిను మాయ చేసినాను. కాలము కరుగగ, ఈ మలి వయసులో చేయూత నిచ్చావు, నాకు అన్నం తినిపించావు చదువు కోకుండా, ఆడుతూ […]

Continue Reading

ఆత్మీయ నేస్తం (కవిత)

ఆత్మీయ నేస్తం -ములుగు లక్ష్మీ మైథిలి ప్రతి ఉదయం అలారమై పిలుస్తుంది బ్రతకడానికి పాచిపని అయినా ఇంటి మనిషిలా కలిసిపోతుంది ఒక్క చేత్తో ఇల్లంతా తీర్చిదిద్దుతుంది నాలుగు రోజులు రాకపోతే డబ్బులు తగ్గించి ఇచ్చే నేను.. ఇప్పుడు లాక్ డౌన్ కాలంలో పనంతా నా భుజస్కంధాలపై వేసుకున్నా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ పని మొత్తం చిటికెలో చేసేది నిత్యం ముంగిట్లో ముగ్గులు ఆమె రాకను తెలియచేస్తాయి పెరట్లో చిందరవందరగా వేసిన గిన్నెలన్నీ ఒద్దికగా బుట్టలో చేరేవి ఒక్కోరోజు […]

Continue Reading

దుఃఖ మోహనం (కవిత)

దుఃఖ మోహనం -ఐ.చిదానందం నీవెప్పుడు ఏడవాలనుకున్నా నిస్సంకోచంగా ఏడ్చేయ్ దుఃఖాన్ని వర్షపు నీటిలో తడిపేయ్ కానీ మద్యంలో తేలనీయకు ఏడ్వలనిపించినప్పుడల్లా ఏడ్చేయ్ కానీ ఈ లోకానికి  దూరంగా వెళ్లి ఏడ్వు ప్రతి దుఃఖాన్ని వెలకట్టే ఈ దుష్టప్రపంచం నీ గొంతుతో ఎప్పటికీ గొంతు కలపదు ఈ లోకం మాటలు ఒట్టి ఓదార్పులు నీ హృదయంలో సంతోషం మొలిచే వరకు ఏడ్వు నీ గుండె లో ఆవేదన తొలిగే వరకు ఏడ్వు నీ బాధను చూసి ఎప్పుడైతే ఈ లోకం […]

Continue Reading
Posted On :

ప్రత్తిపాటి నానీలు (కవిత)

ప్రత్తిపాటి నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి నా ఉనికి నిశ్శబ్దం! కానీ నా రాతలు మాత్రం ఓ శబ్దస్పర్శే!! వేలభావాలు తోడుతున్నాను! చిత్రంగా గుండెబావి ఊరుతూనే ఉంది!! కలం విప్లవానికి తొలి గళం! సంఘం గుట్టు విప్పుతుంది కదా! కాలం కరిగిపోతోంది!! ఆయువు కూడా తరిగిపోతోంది!! చందమామ మెరిసిపోతున్నాడు!! మకిలిలేని.కొత్తగాలి కమ్ముతోందిగా!! అంతులేని విశ్రాంతిలో ఆయనకు నడక! అలసటతో.. ఆమె పడక! ***** ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా […]

Continue Reading

బతుకు బీడీలు (కవిత)

బతుకు బీడీలు -అశోక్ గుంటుక నా పెళ్లిచూపుల్లో నాన్నకెదురైన మొదటి ప్రశ్న “అమ్మాయికి బీడీలు వచ్చు కదా ?” లోపల గుబులున్నా నేనపుడే అనుకున్నా జవాబు వారికి నచ్చేనని కట్నం తక్కువే ఐనా నేనే ఆ ఇంటి కోడలయ్యేనని………. నీటిలో తడిపి కొంచెం ఆరిన తునికాకు కట్టల్ని బీడీలు చుట్టే ఆకుగా కత్తిరించాక ఒక్కో ఆకులో కాసింత తంబాకు పోసి బీడీలుగా తాల్చి దారం చుట్టేది……. ఈ రోజుకివ్వాల్సిన వేయి బీడీల మాపుకి తక్కువైన నాలుగు కట్టల […]

Continue Reading
Posted On :

వర్షానికి ప్రేమ లేఖ (కవిత)

వర్షానికి ప్రేమ లేఖ -వెంకటేష్ పువ్వాడ ఒక ఉష్ణ ధామ హృదయం ఊసులు బాసలు ఉడుకుతున్న సాయంకాలం వేల దేహమంతా పగుళ్లు ఉచ్వాశ నిశ్వాసాలనిండా విరహ గేయం పశ్చిమ మలయ మారుత వింజామరాల హాయి లాలనలో లోలనమై ఊగుతున్న క్షణాన ఒక కణాన సంధ్య తో సంధి కుదిరింది కుదరక ఏంచేస్తుంది ఇద్దరి రందీ ఒకటే మరి అల గడ్డి పోచల మెత్త పై వొళ్ళు వాల్చి కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నా మబ్బుల పందిరికేసి మరో […]

Continue Reading

ఊరుపిలుస్తుంది (కవిత)

ఊరుపిలుస్తుంది -కె.రూపరుక్మిణి అది నివాస స్థలమే నల్లని మేఘాలు ఆవరించాయి చుట్టూ దట్టమైన  చీకటి గాలులు ఎక్కడా నిలబడే నీడ కూడా  దొరకడం లేదు కడుపు తీపి సొంత ఊరిని  అక్కడి మట్టి వాసనను గుర్తుచేస్తుంది ఊరు *ప్రేమ పావురం* లా మనసున  చేరి రమ్మని పిలుస్తోంది ఆ ..నల్లని దారుల్లో ఎక్కడి నుంచో  వలస పక్షులు దారికాచుకుంటూ రక్తమోడుతూ వస్తున్నాయి చూపరులకు ఎదో *కదన భేరీ* మ్రోగిస్తున్నట్లుగా  గుండేలవిసేలా నిశ్శబ్ద శబ్దాన్ని వినిపిస్తున్నాయి ఏ దారిలో […]

Continue Reading
Posted On :

నలుపు (కవిత)

నలుపు -గిరి ప్రసాద్ చెల మల్లు నేను నలుపు నా పొయ్యిలో కొరకాసు నలుపు రాలే బొగ్గు నలుపు నాపళ్లని ముద్దాడే బొగ్గు పొయ్యిమీది కుండ  నలుపు నాపొయ్యిపై పొగచూరిన  తాటికమ్మ నలుపు కుండలో బువ్వ నా దేహదారుఢ్య మూలం నల్లని నాదేహం నిగనిగలాడే నేరేడు నల్లని నేను కనబడకపోతే ఎవ్వరిని నల్లగా చేయాలో తెలీక సూరీడు తికమక సూరీడు  తూర్పునుండి  పడమర నామీదుగానే పయనం పొద్దుని చూసి కాలం చెప్పేంత స్నేహం మాది నా పందిరిగుంజకి […]

Continue Reading

ప్రకృతి నా నేస్తం (కవిత)

ప్రకృతి నా నేస్తం -యలమర్తి అనూరాధ పువ్వు నన్ను అడిగింది  దేవుని పాదాలచెంతకు నన్ను తీసుకెళ్ళావూ అని  గోడ నాకు చెప్పింది  బంధాలకూ అనుబంధాలకూ తాను అడ్డుగోడ కానని పక్షి నాతో గుసగుసలాడింది మాటలు రాకపోయినా కువకువల భాష తమకుందని  శునకం కాళ్ల దగ్గర చేరింది బుద్ధివంకరకు కాదు విశ్వాసానికి గుర్తుగా తమని చూపమని చెట్టు నన్ను స్పృశించింది  గాలి ,నీడ ,పండు సరిగా అందుతున్నాయా అని  ఆకాశం నా నీలికళ్ళతో ఊసులాడింది  నీకూ నాకూ మధ్యన […]

Continue Reading
Posted On :

నా కవితా వేదిక (కవిత)

  నా కవితా వేదిక -శీలా సుభద్రా దేవి బాల్యంలో బుడ్డీదీపం వెలుగు జాడలో చాపమీద కూర్చుని అక్షరాలు దిద్దిన నాటి వెలిసి పోయిన జ్ణాపకం బొంతచేను పై బోర్లానో, వెల్లకిలో దొర్లుతూనో గెంతుతూనో పదాలకంకుల్ని ముక్కున కరుచుకున్న వల్లంకి పిట్టనయ్యాను అలా అలా జంటపిట్ట తో జతకట్టి కొత్త లోకం లోకి ఎగిరొచ్చి గూట్లో కువకువ లాడేను ముచ్చట పడి కొన్న డబుల్ కాట్ మంచం అన్యాక్రాంత మై పోగా పాత నవారుమంచమే హంసతూలికైంది మూడు […]

Continue Reading

నేనే తిరగ రాస్తాను (కవిత)

నేనే తిరగ రాస్తాను -అరుణ గోగులమంద ఎవరెవరో ఏమేమో చెప్తూనే వున్నారు. యేళ్ళ తరబడి..నా అడుగుల్ని, నడకల్ని నియంత్రిస్తూనే వున్నారు. నా పడకల్ని, చూపుల్ని, నవ్వుల్ని నిర్ణయిస్తూనే ఉన్నారు. వడివడిగా పరిగెత్తనియ్యక అందంగా బంధాల్ని, నా ధైర్యాన్ని హరించే పిరికి మందుల్ని శతాభ్దాలుగా అలుపూ సొలుపూ లేక నూరిపోస్తూనే వున్నారు. నన్ను క్షేత్రమన్నారు.. వాళ్ళబీజాల ఫలదీకరణల ప్రయోగాలకు నన్ను పరీక్షాకేంద్రంగా మార్చారు. వాడి పటుత్వ నిర్ధారణకు నన్ను పావుగా వాడిపడేశారు. నేనో ప్రాణమున్న పరీక్ష నాళికను. నాలోకి […]

Continue Reading
Posted On :

మెరుస్తోన్న కలలు (కవితలు)

మెరుస్తోన్న కలలు – శాంతి కృష్ణ రేయంతా తెరలు తెరలుగా  కమ్మిన కలలు కను రెప్పలపై హిందోళం పాడుతున్నాయి…. నీ రాకను ఆస్వాదించిన గాలి  తన మేనికి ఎన్ని గంధాలు అలదుకుందో…. మగతలోనూ ఆ పరిమళం నన్ను మధురంగా తాకిన భావన… ఓయ్ వింటున్నావా…. ఒక్కో చినుకు సంపెంగలపై  జారుతున్న ఆ చప్పుడును…. ఇప్పుడు నా కలలకు నేపధ్య సంగీతమవే… వర్షం ఇష్టమని చెప్పిన సాక్ష్యంలా నీతో పాటు ఇలా ప్రతిరేయి పలుకరించే చిరుజల్లుకి… ఋతువులతో పని […]

Continue Reading
Posted On :

మాకూ ఊపిరాడటం లేదు(కవిత)

మాకూ ఊపిరాడటం లేదు -జె. గౌతమ్ నల్ల సముద్రం మళ్లీ గర్జిస్తోంది నల్ల హృదయం ఉద్విగ్నంగా ఎగసి పంజా విసురుతోంది నల్ల ఆకాశం దావానలమై రగులుతోంది నల్ల నేత్రాలు నెత్తుటి మెరుపులతో ఉరుముతున్నాయి. నల్ల పర్వతాలతో కొన్ని తెల్లమేఘాలూ చేతులు కలిపాయి. శ్వేత సామ్రాజ్యపు విద్వేష సౌధంపై కణకణమండే పిడుగులవాన కురుస్తోంది తెల్ల తోడేలు భయంతో కాస్సేపు బంకర్లో తలదాచుకుంది. గుండె పగిలిన మానవత్వం మోకాళ్ళపై నిలబడుతోంది ప్రపంచ పీడితుల జెండాపై అజెండాలా దుఃఖ గాయాల ధర్మాగ్రహం […]

Continue Reading
Posted On :

ఆకాశంలో సగం(కవిత)

ఆకాశంలో సగం -లక్ష్మీకందిమళ్ళ నీ అడుగుతో నా అడుగు ఈ నడక కొత్తగా మొదలైంది కాదు బంధంతో బతుకు బతుకుకో బంధం ఎప్పుడో ముడిపడింది మనసు మనసు.మురిపెం హద్దులు దాటని పరిధి నదులుగా తడుస్తూ అహం తెలియని ఆసరాల ఆలింగనాలు ఆవేశం కాని ఆలోచనలు నువ్వు ఆకాశమై నీలో సగమై నేను. ***** కందిమళ్ళ లక్ష్మికర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading

అభేద్యారణ్యం (కవిత)

అభేద్యారణ్యం  -కె.వరలక్ష్మి ఇల్లు వదిలి ఇంత దూరమొచ్చానా ఏరు దాటి కొండ ఎక్కి దిగి ఆవలి వైపు అక్కడా వాగూ వంకా ఎడ తెగని వాన మనసు మబ్బుల్లో కూరుకుపోయి దుఃఖం కరిగి నీరై కురుస్తున్న వాన కీకారణ్యంలో ఎన్నెన్నొ మూగజీవులున్నై పలకరించే పెదవి ఒక్కటీ లేదు బయలుదేరినప్పటి ఉత్సాహం ఉద్వేగం ఆవిరై పోయాయి ఎక్కడ ఉన్నానో ఎరుక లేనిచోట ఒక్క పూపొదైనా పరిమళించని చోట జీవితం శూన్యపుటంచుకి చేరుకుంటోంది బాల్యం నుంచి నేరుగా వృద్ధాప్యం లోకి […]

Continue Reading
Posted On :

నువ్వేంటి…నా లోకి…(కవిత)

నువ్వేంటి…నా లోకి…(కవిత) -ఝాన్సీ కొప్పిశెట్టి నువ్వేంటి ఇలా లోలోకి.. నాకే తెలియని నాలోకి… నేనేమిటో నా పుట్టుక పరమార్ధమేమిటో ఏ పుట్టగతులనాశించి పుట్టానో అసలెందుకు పుట్టానోనన్న అన్వేషణలో నేను… గాలివాటుతో ఊగిసలాడే నా చంచల చిత్తం సత్యాసత్యాల చిక్కుముడిలో చిక్కడిన నా అంతరంగం వాటిపై జరిగే అనేకానేక దురాక్రమణలు నా ఉనికితనపుటంచుల్లో భయాందోళనలు నా తెలిసీ తెలియనితనపు తప్పటడుగులు… నా మకిలంటిన మనసుకి విహ్వలించిన నేను నన్నథిక్షేపించే నాపై నేనే ప్రకటించుకునే యుద్దాలు నాలో నేనే సాగించే […]

Continue Reading

నా నేస్తం!! (కవిత)

నా నేస్తం!! (కవిత) -సుభాషిణి ప్రత్తిపాటి అనాసక్త జీవన ప్రయాణంలో… చైత్రవర్ణాలు నింపిన వాసంతం!! కల్లోలకడలిన తెరలెత్తిన చుక్కాని! దుఃఖపు పొరల మధ్య… నా చెక్కిలి నిమిరే మలయసమీరం!! రెప్పలు దాటని స్వప్నాలను…. సాకారం చేసిన దేవత! మోడులైన పెదవంచుల… చిరునగవుల వెన్నెల పూయించిన జాబిల్లి! తనే…నా…నేస్తం!! గుండె గదుల్లో దాగిన చీకట్లను… తరిమి,తరిమి కొట్టిన వెలుతురు పిట్టలు….నా పుస్తకాలు. నన్నే నాకు కానుక చేసిన ప్రియచెలులేకేమివ్వగలను…??? మరు జన్మకు పుస్తకమై జతకలవడం తప్ప!!! ***** ఫోటో […]

Continue Reading

ఒకానొక బంధిత గేయం!(కవిత)

ఒకానొక బంధిత గేయం! (కవిత) -డి.నాగజ్యోతిశేఖర్ నెత్తుటి వాగొకటి  హృదయసంచిని చీల్చుకొని పోటెత్తింది! కొంచెం కొంచెంగా ఘనీభవిస్తున్న స్వప్న దేహాలు మౌనంగా రోదిస్తున్నాయి! పురాతన గోడల్లో చిక్కుకున్న ఉనికివిత్తు ఊపిరాడక కొట్టుకుంటుంది! బొట్టు బొట్టుగా విరుగుతున్న ప్రాణధారలు గాజుద్వీపంలో ఆఖరి పాటను లిఖిస్తున్నాయి! ఎక్కడో గుండెలోయల్లో వెలిగించుకున్న ఆశలదీపంపై రాబందు రెక్కల నీడ పరుచుకుంది! శూన్యాకాశపు అంచుల్లో  చీకట్లు వాటేసుకుని మనస్సు మబ్బులు మసకబారుతున్నాయి! నిన్ననే వచ్చిన వసంతం వేసంగి సెగ తగిలి కన్నీటి కొవ్వొత్తై కరుగుతున్నది! […]

Continue Reading

వాట్ ఏ రేపిస్ట్ డ్రామా (కవిత)

వాట్ ఏ రేపిస్ట్ డ్రామా (కవిత) -పేర్ల రాము ఎవర్ని నిలదీసి అడగాలో అర్థం కావట్లేదు సీతాకోకల్లా ఎగరాల్సిన వాళ్ళు ప్రాణం లేని నగ్నదేహాలతో కుప్పకూలుతున్నారు పావురాల్లా పరుగులు పెట్టాల్సిన వాళ్ళు కాలం కంచెల్లో బలైపోతున్నారు. నడిరోడ్డు మీద నగ్నదేహాల్ని కలకంటున్న కళ్ళకి వయస్సుతో పనేముంది?? మొలకల్ని ,చెట్లను వేటినైన నరుక్కోవచ్చు . కావాల్సినప్పుడల్లా న్యూడ్ వెబ్సైట్స్ ఓపెన్ సౌకర్యం పుట్టాక నేర్పేపనే ముంది?? వాడుకోవొచ్చు ,చంపేయొచ్చు అనే ఒక లోపలి నినాదానికి స్వేచ్ఛ చాలానే ఉందిగా. […]

Continue Reading
Posted On :

వాంగ్మూలం (మహాశ్వేతాదేవి వర్ధంతి సందర్భంగా) (కవిత)

వాంగ్మూలం (మహాశ్వేతాదేవి వర్ధంతి సందర్భంగా) -అరణ్యకృష్ణ (జులై 28) మహాశ్వేతాదేవి వర్ధంతి. భారతదేశ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన రచయితల్లో ఆమె ఒకరు. నా మీద అమితమైన ప్రభావం చూపిన పుస్తకాల్లో “ఒకతల్లి” ఒకటి. మహాశ్వేతాదేవి రాసిన “హజార్ చురాశిర్ మా” నవలని తెలుగులో “ఒకతల్లి” పేరుతో సూరంపూడి సీతారాం అనువదించారు. ఉద్యమంలో కన్నుమూసిన తన కుమారుడి మరణానికి కారణాల కోసం ఒక తల్లి చేసే అన్వేషణ ఈ అద్భుతమైన నవలకి కథాంశం. ఆ పుస్తకం చదివి నేను […]

Continue Reading
Posted On :

చీకటి పెట్టెలు (కవిత)

చీకటి పెట్టెలు -కొండేపూడి నిర్మల “అమ్మానాన్నెప్పుడొస్తారు ?” ఎడబిడ్డ అడిగాడు వస్తారు బాబూ , తెల్లారి బ౦డికి వస్తారు చండి బిడ్డను ఎత్తుకుని కిటికీలోంచి బైటికి చూస్తూ ఆమె అన్నది దూరంగా జెర్రిపోతులాంటి రైలు చీకటి పెట్టెల్ని ఈడ్చుకుంటూ పరిగెడుతోంది “అమ్మా నాన్న మిఠాయి తెస్తారా ?” తెస్తారు బాబూ పెద్ద పెట్టెనిండా తెస్తారు ఏడ్చి ఏడ్చి చారికలు కట్టిన బుగ్గమీద ముద్దు పెట్టి చెప్పింది తెల్లారుతూనే ఒక పెట్టెను సాయంపడుతూ కొంతమంది మనుషులొచ్చారు “అమ్మా ఈ […]

Continue Reading

నల్ల పాదం (కవిత)

  నల్ల పాదం -సతీష్ బైరెడ్డి మేము శ్వాసిస్తే సహించలేరు మా విశ్వాసాన్ని భరించలేరు శతాబ్దాలుగా  మా స్వేచ్చా కంఠాలపై శ్వేత ఖడ్గాలు వేలాడుతూనే ఉన్నాయి. మేమంటే హృదయము,మేధా లేని ఒట్టి  నల్ల రంగే పుట్టుకతోనే నిషిద్ధ మానవులగా మారిన వాళ్ళం మా కలలు నిషిద్ధం మా కదలికలూ నిషిద్ధం అగ్ర రాజ్యంలో పేదరికంతో పెనవేసుకపోయిన జీవితాలు మావి నల్ల జాతిని నేరానికి చిరునామా చేసింది  శ్వేత రాజ్యం పీఠాల  మీది బతుకులు వారివైతే పాదాల కింద నలిగిన […]

Continue Reading
Posted On :

బాలబాబు-బుజ్జి అత్త (కవిత)

బాలబాబు-బుజ్జి అత్త -యశస్వి ఆమె అనేక యుద్ధముల నారితేరిన నారిఇప్పుడు అంపశయ్య ఎక్కి బాల బాబూ బాలబాబూ అని పిలవరిస్తూ ఉంది నిన్నటి వరకూ నిలిచోడం ఆమె యుద్ధం,  పడకుండా నడవడం యుద్ధాన్ని  గెలవడమే..పడుకుంటే లేచి కూర్చోడం యుద్ధం గెలవడం,కూర్చుంటే అదరకుండా నడుం వాల్చడం యుద్ధంమే మంచాన పడ్డ పెనిమిటిని  పసిపిల్లాడిలా సాకిన గట్టిమనిషేకట్టుకున్నోడ్ని కాటికి అప్పజెప్పాక పట్టు వదిలేసిన ఒళ్లాయే; ఆపై తలతిరిగి   కూలబడి పోతుండేది ఎముక లేనట్టు వండి వడ్డించిన చేయి వందల సార్లు జారి కిందపడ్డందుకు జబ్బ జారిపోయింది కొడుకులు పురిట్లోనే పోయినా అడుగు దూరం నుంచి ప్రేమించే […]

Continue Reading
Posted On :

నీ అస్థిత్వం ఎక్కడిది..? (కవిత)

నీ అస్థిత్వం ఎక్కడిది..? -గట్టు రాధిక మోహన్ పైన కప్పిన ఆ ఆకాశం మారలేదు కింద పరుచుకున్న ఈ పుడమీ మారలేదు. నా జన్మం కూడా మారలేదు. శతాబ్దాల వేదనలో నేనొక చెరగని సంతకంగానే ఉంటున్నాను. నా మీద రాసివ్వబడని పేటెంట్ హక్కులు నీ సొంతం అనుకుంటావు. ఎప్పటికప్పుడు నీకిష్టమైన కొత్త కొత్త నాగరికత విత్తనాలను విత్తుకుంటు నా కన్నీటి చుక్కలతో తడిపేస్తుంటావు. నువ్వు సృష్టించిన ఈ పితృస్వామ్య రాజ్యాంగంలో నా చూపుడు వేలును విరిచేసుకుంట నవ్వుకుంటుంటావు. […]

Continue Reading

రైన్ కోటు (కవిత)

రైన్ కోటు -యలమర్తి అనూరాధ గోడకు వేలాడదీయబడి బిక్కు బిక్కు మంటూ చూస్తూ ఎడారి జీవితాన్ని గడిపేస్తూ.. గాలివాన నేనున్నా అనాలి విప్పుకున్న గొడుగులా అప్పుడే ఊపిరి పోసుకున్న బిడ్డలా ఉత్సాహంగా ఉరకటానికి సిద్ధమవుతుంది కష్టాన్నంతా తనమీద వేసుకుంటూ వెచ్చదనం అంతా నీ సొంతం చేస్తుంది కన్నీళ్లను కనుపాపల్లో దాచుకుంటూ గూటిలో గువ్వలా తన ఒడిలో కాపాడే తల్లి మనసుకు ఏం తీసిపోదు చినుకు చినుకు కి చిత్తడవుతున్నా చిరునవ్వుతో నిన్ను హత్తుకుంటూనే నిలువెల్లా రక్షణ కవచం […]

Continue Reading
Posted On :

వెలుగుల రోజు (కవిత)

వెలుగుల రోజు -డా.కె.దివాకరాచారి నేను నాలాగా ఎదిగేప్పుడు నన్ను నడిపించి అక్కున చేర్చుకున్న అమ్మ ‘తులసి’ కౌగిలి నను ఒంటరిని చేసి వెళ్లినప్పుడు నన్ను అమ్మలా ఆదుకొని నా దారే తన జీవనమని నాతోనే తన జీవితమని అందరినీ, అన్నిటినీ వదిలి, కదిలి వచ్చి తన చేతిని, మనసును తలపుల్ని, బ్రతుకును నాతో పెనవేసుకుని తిరిగి నన్ను నిలబెట్టిన నా నెచ్చెలి వెచ్చని పరిష్వంగంలో ‘అమ్మ తనం’ సదా పరిమళిస్తూనే ఉంటుంది! ‘అమ్మలా’ నన్ను లాలించి మందలించి, […]

Continue Reading

అవేకళ్ళు (కవిత)

అవేకళ్ళు -అశోక్ గుంటుక తెలతెలవారుతూనే వాకిట  నే ముగ్గవుతున్న వేళ డాబాపై వాలిన నీరెండ కురుల ఆరబెడుతున్న వేళ తోపుడు బండిపై బయలెల్లిన కూరగాయల మేలిమి వెతుకుతున్న వేళ : అంతటా అవేకళ్ళు – వెకిలి నవ్వులు వెకిలి చేష్టలు…… పరుగు జీవితమైన వేళ అందీ అందని సిటీబస్సు లేదంటే మెట్రోరైలు చాలీ చాలని సమయం ఒక్కోసారీ వద్దనుకుంటూనే ఓ ఆటో లేదా ఓ క్యాబు – నిలుచున్నా కూర్చున్నా : అంతటా అవేకళ్ళు – వెకిలి […]

Continue Reading
Posted On :

అనాఘ్రాత (కవిత)

అనాఘ్రాత (కవిత) -జయశ్రీ మువ్వా ఊరికి చివరనచితికిన వర్ణం విరగపూసిందిసింధూరం దిద్దుకున్న రేరాణిఇక్కడ పతిత  పాపాల పావని నిదురనెపుడో రేయంచుకు విసిరేసినలుపు రంగు సలపరించే యామిని గంటలెక్కన ఇక్కడ గాయాల గుమ్మాలు ఎప్పుడూ తెరిచే వుంటాయిఉమ్ముతో మలాము అద్దుకోడంఅలవాటు పడిన అద్వంద్వ ఆకలి మంటని ఆర్పుకోలేకకన్నీటి కాష్టాన్నికైపుగా రాజేసుకునే నెరజాణ ఇంత బతుకులో వేల నిశ్శబ్ధ యుద్ధాలభేరినిమునిపంట  మ్రోగించేమంజరి గుప్పెడు పొట్టకి బతుకుని వెక్కిరించే ఆకలెందుకో వెకిలి సైగల వెనక వెతల కుంపటి ఒకటుందికోర్కెల కోరల విషం మింగిన దిగంబరి తనది కాని నిదురలో తానో స్వాప్నిక వీర్యాన్ని ఓపలేని వాడు వీరుడిక్కడతనని తానే ఆడి ఓడేఆమె  ఓ అనాఘ్రాత ***** ఆర్ట్: మన్నెం శారద జయశ్రీ మువ్వా – నా […]

Continue Reading
Posted On :

మాతృత్వపుసంతకం (కవిత)

మాతృత్వపుసంతకం -కె.రూప ౧ పాలబుగ్గల పసిడి నవ్వులు.. కేరింతల బాల్యపు చిగురింతలు ఆ చిట్టి చెక్కిలి నవ్వులలో అమ్మ పాల బువ్వలు దాచుకున్నాయి చిగురు లేత ప్రాయపు మునివేళ్ళ స్పర్శకు నెమలి కన్నులే చిన్నబోయినవి చిట్టి పాదాలే నాట్యమాడిన వేళ ఎన్నో… మధుర స్వరాలను వింటూ! చిన్నారి చూపులు కూడా నిలబడని చిత్రంలో అమ్మ బిడ్డ ప్రేమలో తేనెలద్దుకుంటుంది. ౨ పసిబిడ్డకందించే పాలబువ్వకు తానెన్ని వెతలు పడుతుందో! తాను తినే నాలుగు మెతుకులకు చేరిన రక్తాన్ని ప్రేమలో […]

Continue Reading
Posted On :

యుద్ధం (కవిత)

యుద్ధం -గిరి ప్రసాద్ చెల మల్లు దేశం కోసం  సరిహద్దుల్లో  కులమతాల భద్రతకోసం లోలోన చంపుకునేందుకు చంపేందుకు మంచుదుప్పట్లో వాడక్కడ కాపలా  లైన్ ఆఫ్ కంట్రోల్ మీదుగా రాడ్లు కర్రలు బాహాబాహీ భూముల గెట్ల తగాదాలో లోపల  అక్కడ సమిష్ఠి బాధ్యతకై వాడు ఇక్కడ పెత్తనం కోసం బలవంతుడు బలహీనుడిని తొక్కుతూ అక్కడా పెట్టుబడీ ఇక్కడా పెట్టుబడీ కోరలు అక్కడాఇక్కడా అవినీతి జాడ్యం చిదిమేది బడుగు బతుకునే  దేశమంటే మనుషులని వాడు అచ్చట ప్రాణాలొడ్డి దేశమంటే కులాలఎంపిక మతాల తరిమేత ఇక్కడ గద్దెకోసం రగడ రాజేయు అన్నివేళలా ఇక్కడసౌభ్రాతృత్వం కోసం వాడు రగులు అచ్చట  అచ్చట వాడికి మూడురంగుల జెండా యే కనపడు ఇచ్చట […]

Continue Reading

క్షమించు తల్లీ!

క్షమించు తల్లీ! -ఆది ఆంధ్ర తిప్పేస్వామి అమ్మా! నీ అడుగులకు ఓసారి సాగిలబడాలనుంది! చెమ్మగిల్లిన కళ్ళతో .. నీ పాదాల చెంత మోకరిల్లాలనుంది! నీదంటూ ఒకరోజుందని…గుర్తుచేసుకుని నిన్ననే ఆకాశంలో సంబరాలు చేసుకున్నాం! నీకు సాటిలేరంటూ గొప్పలు పోయాం! గుండెలో పెట్టుకుని గుడికడతామంటూ కవితలల్లి ఊరువాడ వూరేగాం! క్షమించు తల్లీ! నిచ్చెనేసి ఆకాశంలో నిలబెట్టాలని నువ్వుడగలేదు సొంతూరికి చేర్చమని కాళ్లా వేళ్లా పడుతున్నావు..! రోజూ పరమాన్నంతో కడుపునింపమని కోరలేదు ఆకలితో చచ్చిపోయే ప్రాణాలకింత గంజి పోయ మంటున్నావు ..! […]

Continue Reading

మనిషితనం(కవిత)

మనిషితనం (కవిత) -కె.రూప ఒంటరితనం కావాలిప్పుడు  నన్ను నాకు పరిచయం చేసే చిన్న చప్పుడు  కూడా వినపడని చోటుఏ వస్తువు కనబడని చోటునాలో  మెదులుతున్న శ్వాసనుకూడా దూరం చేసేదినన్ను నన్నుగా గుర్తించేది ౧ ఏ సంద్రపు ఘోషలు వినలేని నా మది నాకు వినపడేలా నాలో లేని తనాన్ని ఏదో వెతుక్కుని నాలో నింపుకోవలసిన సమయమిప్పుడు!౨బిగుతై పోతున్న గుండె బరువుల నుండి సేదతీరాలనే సంకల్పంతో౩ఉదయపు వేకువల చప్పుళ్ళనుండి మొదలురాత్రి వెన్నెలకు కురిసే తడి కూడా అంటనంత  నా అడుగుల చప్పుడు కూడా నన్ను గుర్తించనంతగాఏ శబ్దమో ..ఏ రాగమో ..వినపడనంత దూరంకొండవాలుగా […]

Continue Reading
Posted On :

రిస్క్ తీసుకుంటాను(కవిత)

రిస్క్ తీసుకుంటాను(కవిత) -కొండేపూడి నిర్మల మొదటి పెగ్గు.. మొగుడు సీసాలో వున్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను సాయంత్రం రొట్టెలోకి తైలం లేక నేను రోడ్డెక్కిన సమయానికి తను నిండు సీసాతో ఇల్లు చేరుకుంటాడు జరగబోయే దేమిటో నా జ్ణానదంతం సలపరించి చెబుతుంది సోడాకోసం లోపలికొచ్చి అనవసరంగా నవ్విపోతాడు గోడమీద తగ కావిలించుకుని దిగిన హనీమూన్ ఫొటో వింత చూస్తూ వుంటుంది. సత్యనారాయణ వ్రతం మాదిరి సరంజామా సిద్ధం చేసుకుని ఎంతో తన్మయంతో సీసా మూత తిప్పుతాడు […]

Continue Reading

చీకటి వేకువ (గుగి వా థియోంగో) (అనువాద కవిత)

చీకటి వేకువ  (అనువాద కవిత) ఆంగ్ల మూలం: గుగి వా థియోంగో  తెలుగు అనువాదం: ఎన్. వేణుగోపాల్ (24 మార్చ్ 2020) తెలుసు, తెలుసు, నాకు తెలుసు ఒక కరచాలనం ఒక బిగి కౌగిలి దుఃఖ భారం దించుకోవడానికి ఒకరికొకరం అందించే భుజం ఎప్పుడైనా సరాసరి లోపలికి నడవగల పొరుగిల్లు మానవానుబంధపు అతి సాధారణ ఆనవాళ్లన్నిటినీ సవాల్ చేస్తున్నదిది ఎగుడుదిగుళ్ల వ్యక్తివాదపు గొప్పలతో మన భుజాలు మనమే చరుచుకుంటూ, మనిషి మీద సకల హక్కులూ ఆస్తికే ఉన్నాయంటూ […]

Continue Reading
Posted On :

ముందస్తు కర్తవ్యం (కవిత)

ముందస్తు కర్తవ్యం (కవిత) -యలమర్తి అనూరాధ కనికరం లేని కబళింపు  జాపిన చేతులు పొడగెక్కువ గాలి కన్నా వేగంగా వ్యాప్తి లక్షణాలు మెండే అయితే ఏంటంట చేయి చేయి కలుపు ఒకప్పటి నినాదమైతే దూరం దూరంగా జరుగు ఇప్పటి నినాదం  ఎంతలో ఎంత మార్పు?  ఊహించనవి ఎదురవ్వటమేగా జీవితమంటే!? తట్టుకుని నిలబడటమేగా ధైర్యమంటే  కరోనా అయినా మరేదైనా  ఆత్మస్థైర్యంతో తరిమి కొట్టడమే  ముందస్తు కర్తవ్యం    వైద్యులు అండ  పోలీసులు తోడు  శాస్త్రజ్ఞులు సహకారం నిస్వార్థ హృదయాల మానవత్వం […]

Continue Reading
Posted On :

ఒంటరి (కవిత)

ఒంటరి (కవిత) -ములుగు లక్ష్మీ మైథిలి రాతిరి కొన్ని బాధలు కరిగిస్తుంది అర్థరాత్రి నిశ్శబ్దం వెలుతురు నాహ్వానిస్తూ గడిచిన వెతలకు జవాబు చెపుతుంది రాతిరి నా అక్షరాలు నల్లని చీకటిని చీల్చే కాంతి పుంజాలవుతాయి చెదిరిన ఆశల తునకలను కవిత్వం గా అల్లుకుంటాను రాతిరి వెన్నెల లో ఊసులు చెప్పుకొని ఎన్నాళ్ళయిందో? ఆ నిశీధి మౌనంలో హృదయాల సవ్వడులు మూగగా మాట్లాడుకుంటాయి రాతిరి నిదురలేని రాత్రులు ఈ దేహపు ఆకాశం లో ఉదయాస్తమయాలు ఒక్కటే కన్నీటి నక్షత్రాలు […]

Continue Reading

లక్ష్మణరేఖ (కవిత)

లక్ష్మణరేఖ (కవిత) -డా.సి.భవానీదేవి నీకిది సరికొత్త కాలం నాకుమాత్రం ఇది అసలు కొత్తకాదు నా జీవితమంతా ఎప్పుడూ లాక్ డౌనే ! అందుకే నాకస్సలు తేడా కనిపించటం లేదు ఏ మాల్స్ మూసేశారో ఏ మార్కెట్ తీసిఉందో నాకెప్పుడయినా తెలిస్తేగా… ఇప్పుడు నీ మార్నింగ్ వాక్ బంద్ నీ ఉద్యోగానికి నిర్విరామ విశ్రాంతి నువ్వు నిరంతరం ఇల్లు కదలకపోబట్టే నేను మరింత చాకిరీకాళ్ళకింద..నలుగుతూ తరతరాలుగా నాకోసం నువ్వు గీసిన లక్ష్మణరేఖను కరోనా భయంతోనైనా మొదటిసారి నువ్వు అనుభవిస్తుంటే […]

Continue Reading
Posted On :

మైల (కవిత)

మైల(కవిత) -జయశ్రీ మువ్వా మాకొద్దీ ఆడతనం అనుక్షణం అస్థిత్వం కోసం మాకీ అగచాట్లెందుకు..?? పిచ్చికుక్క సమాజం పచ్చబొట్టేసూకూర్చుంది అణుక్షణం అణువణువూ తడుముతూ వేధిస్తూనే ఉంది.. ఆకలి కోరలకి అమ్మతనాన్ని అమ్ముకున్నాం ఆబగా వచ్చే మగడికై ఆలితనాన్ని తాకట్టుపెట్టాం .. చివరికి మూడు రోజుల ముట్టు నెత్తుటి పుట్టుకకి ఇప్పుడు బతుకంతా మడికట్టా?? సమాజమా…సిగ్గుపడు… !! అలవాటుపడ్డ ప్రాణలే సిగ్గుకి ముగ్గుకి తలొంచుకున్నాం ఇక చాలు ఓ ఆడతనమా మరీ ఇంత సహనమా తాతమ్మ ,బామ్మ అంటు అంటూ […]

Continue Reading
Posted On :

నాన్నే ధైర్యం(కవిత)

నాన్నే ధైర్యం(కవిత) -కె.రూప ఆడపిల్లకు ధైర్యం నాన్నే! గుండెలపై ఆడించుకునే నాన్న చదువులకు అడ్డుచెప్పని నాన్న ఉద్యోగంలో అండగా నిలిచిన నాన్న చిన్నగాయానికే  అమ్మకు గాయంచేసే నాన్న ఇప్పుడెందుకు ఇలా! మనసుకైన గాయాలను చూడడెందుకో! చిన్నపాటి జ్వరానికే అల్లాడిపోయేవాడు పెద్ద తుఫానులో వున్నాను అంటే పలకడెందుకో! నీ సుఖమే ముఖ్యం అనే వ్యక్తి వ్యక్తిత్వం మర్చిపోయి సర్దుకోమంటాడే! ధైర్యంగా బ్రతకమని చెప్పిన మనిషి అణగారిన బ్రతుకునుండి బయటకు వస్తాను అంటే ఒప్పుకోడెందుకో! నా చిట్టిపాదాల మువ్వలచప్పుళ్లు చూసి […]

Continue Reading
Posted On :

ఎందుకు (కవిత)

ఎందుకు(కవిత) -లక్ష్మీ దేవరాజ్ కంటికి కనిపించని జీవికంటి మీద కునుకు లేకుండా చేస్తుంటేమార్స్ వరకూ వెళ్ళిన మనిషిమౌనంగా మిగిలిపోయాడేం? ఎంతో కష్టపడి ఇష్టంగా కూడబెట్టిన డబ్బుఆరోగ్యాన్ని మాత్రం కొనలేదనిమరోసారి మరచిపోయాడేం? డైనోసార్లు….సరే ఎప్పటివోపులులు మాత్రం నిన్నమొన్నేగాకాలగర్భంలో కలిసిపోతుంటేఅంటీముట్టనట్టున్న మనిషిఇప్పుడెందుకిలా అల్లాడిపోతున్నాడు? ప్రకృతి నేర్పే పాఠం కష్టమేఇది మన దురాశ వల్ల కలిగిన నష్టమే ఇకనుంచైనా బాహ్య శుభ్రంతో పాటుఅంతఃశుభ్రంపై ఆలోచన పెడదాం అలాగే ప్రపంచంలో మనతోపాటు సంచరించేప్రతీజీవి ప్రాణంఖరీదుమనిషి ప్రాణంతో సమానమే అని ఒప్పుకుందాం ***** ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి లక్ష్మీ దేవరాజ్పేరు: లక్షీ దేవరాజ్ వృత్తి: […]

Continue Reading
Posted On :

నడుస్తున్న భారతం (కవిత)

నడుస్తున్న భారతం (కవిత) – వేముగంటి మురళి ముఖానికి మాస్క్దుఃఖానికి లేదుఆకలి ఎండినతీగల్లాంటి పేగుల్నిమెలిపెడుతున్నది ఒంట్లో నగరాల నరాల్లో విచ్చలవిడిగా మండుతున్న భయంపూరిగుడిసెలోచల్లారిన  కట్టెల పొయ్యిఅవయవాలు ముడుచుకొని ఉండడమేపెద్ద శ్రమ  కరెన్సీ వైరస్ ను జోకొట్టలేదుకాలాన్ని వెనకకు తిప్పలేదుప్రజలకు పాలకుల మధ్య డిస్టెన్స్ గీత మాత్రమే గీస్తుంది తిరిగే కాలు మూలకు,ఒర్రే నోరుకు రామాయణ తాళంగదంతా ఆధ్యాత్మిక ధూపదీప యాగంకంట్లో నిండుతున్న విశ్వాసాల పొగలుఎర్రబారిపోయింది పిచ్చి మనసు రోడ్డుమీద ఒక పక్కకు పక్షుల రాకడమరోదిక్కు వలసొచ్చిన మనుషులు పోకడ పిట్టలు ఎగరగలవుకరువు అమాంతం నెత్తిమీద వాలుతుందిభుజం మీద […]

Continue Reading
Posted On :

చైత్రపు అతిథి (కవిత)

చైత్రపు అతిథి (కవిత) – విజయ దుర్గ తాడినాడ కుహు కుహు రాగాల ఓ కోయిలమ్మా! ఎట దాగుంటివి చిరు కూనలమ్మా!! మానుల రెమ్మల దాగితివందున,  కొమ్మలె లేని మానులకు రెమ్మలె కరువాయే !!  కాకులు దూరని కీకారణ్యమునెగిరెదవేమో, మనుషులు తిరిగెడి కాంక్రీటడవులనగుపడవాయే !! చైత్రపు అతిథిగ ఆహ్వానిద్దునా, ఆదరముగ చూత చివురులు సిద్ధమాయే !! గ్రీష్మ తాపపు భగభగలు, చేదువగరుల చిరచిరలు మేమున్నామని గుర్తించమనీ నీ వెంటే ఏతెంచునాయే !! వగరుల చిగురులు తిందువు ‘ఛీ ఛీ’ […]

Continue Reading
Posted On :

మానవాళికి కరోనా వైరస్ ఉత్తరం (అనువాద కవిత)

మానవాళికి కరోనా వైరస్ ఉత్తరం (అనువాద కవిత) ఆంగ్ల మూలం: వివియన్ ఆర్ రీష్  తెలుగుసేత: ఎన్.వేణుగోపాల్    నేలతల్లి నీ చెవిలో గుసగుసలాడింది నువ్వది ఆలకించలేదు  నేలతల్లి పెదవి విప్పి నీకు చెప్పింది నువ్వది వినలేదు నేలతల్లి అరిచి గగ్గోలు పెట్టింది నువు చెవిన పెట్టలేదు అప్పుడు నేను పుట్టాను… నిన్ను శిక్షించడానికి కాదు నిన్ను మేల్కొల్పడానికే నేను పుట్టాను… సాయానికి రమ్మని నేలతల్లి విలపించింది… బీభత్సమైన వరదలు. నువు వినలేదు. మహారణ్య దహనాలు. నువు […]

Continue Reading
Posted On :

ఖాళీ (కవిత)

ఖాళీ (కవిత) – జయశ్రీ మువ్వా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా..? ఏదని చెప్పాలి.. ముగించాలనుకున్నపుడు కామా కోసం వెతకులాట ఎందుకు? చదవబడని పేజీలన్నీ వదిలెళ్ళు నేనూ వదిలేస్తాలే అందమైన కాగితం పడవలుగా – అన్నట్టూ… అద్దాన్ని ఓ సారి తుడుచుకో బొట్టుబిళ్ళలు అంటించిన మరకలుంటాయేమో కన్నీటి చారల మొకాన్ని కడుక్కున్నట్టు  ఫ్రెష్ గా- అవునూ.. ముందు డికాక్షన్ పెట్టుకో చేతికందించే కాఫీ కప్పు టేస్ట్ మారినా, వంటగదిలో గాజుల మెలోడి వినపడ్డా పట్టించుకోకు ఇలాంటివేగా ఎన్ని చెప్పినా… నాకంటూ ఏమి  చెప్పాలని […]

Continue Reading
Posted On :

ఆమె (కవిత)

ఆమె (కవిత) -కె.రూప ఆమెను నేను…… పొదరిల్లు అల్లుకున్న గువ్వ పిట్టను లోగిలిలో ముగ్గుని గడపకు అంటుకున్న పసుపుని వంటింటి మహారాణిని అతిథులకు అమృతవల్లిని పెద్దలు మెచ్చిన అణుకువను మగని చాటు ఇల్లాలుని ఆర్ధిక సలహాదారుని ఆశల సౌధాల సమిధను చిగురించే బాల్యానికి వెలుగురేఖను స్వేచ్ఛనెరుగని స్వాతంత్ర్యాన్ని కనుసైగలోని మర్మాన్ని భావం లేని భాద్యతను విలువ లేని శ్రమను ఆమెను నేను… కల్లోల సంద్రంలో కన్నీటి కడలిగా ఎన్ని కాలాలు మారిన నిలదొక్కుకోవాలనే అలుపెరుగని పోరాటం సమానత్వం […]

Continue Reading
Posted On :

ఈ వనము లో నీకు చోటెందుకు? (కవిత)

ఈ వనము లో నీకు చోటెందుకు? (కవిత) -డా|| మీసాల అప్పలయ్య ఇది జీవన వనం వర్ణాల పరిమళాల రుచుల తాదాత్మ్యాల శిబిరం ఈ రంగుల బొకేలు నాజూకుని తొడుక్కొని  మృదుత్వాన్ని ఊ రేగించుకొంటున్న సీతాకోక చిలుకలు నీ పేలవ బ్రతుక్కి రంగవల్లులు , కానీ ఇవి నీ  కర్కశత్వంలో చెరిగి నలిగిన కళేబరాలు కావచ్చు ! ఆర్ద్రత చిమ్మే ఈ మల్లెలు పరిమళాల తెమ్మెరలు పరామర్శల పరవశాలు, కానీ ఇవి నీ కళింకిత బూటు కాళ్ల […]

Continue Reading

ముసలివాడు-సీతాకోక చిలుక(కవిత)

ముసలి వాడు-సీతాకోక చిలుక(కవిత)              – పాలపర్తి ఇంద్రాణి ముసలి వాడొకడు వణుకుతున్న చేతులతో  గాజు జాడీ పైన రంగురంగు పూలు చిత్రించినాడు.  పుట్ట తేనె తీసుకుని అక్కడక్కడ చిలకరించినాడు.   రంగు పూల గాజు జాడీని తన తోటలోన ఉంచినాడు. సీతాకోక చిలకలకై వేచి చూస్తూ నిలచినాడు.   ముసిలివాడు ఒకప్పుడు సీతాకోకల వేటగాడు.  కానీ ఇప్పుడు సత్తువ ఉడిగి అలసినాడు.  పరుగెత్తలేక ఆగినాడు.    తనంత తానుగా సీతాకోక చిలుక వచ్చి వాలేలా  ఉచ్చులల్లి పెట్టడం ఆరంభించి ఆరితేరినాడు.  […]

Continue Reading

గీత శ్రావణం, సంగీతం (కవితలు)

గీత శ్రావణం, సంగీతం (కవితలు) -నాగరాజు రామస్వామి   గీత శ్రావణం   ఉదయాకాశం తడి తడిగా నన్ను పెనవేసుకున్నప్పుడల్లా రాత్రంతా నానిన అక్షరం నాలో మొలకెత్తి గొంతెత్తుతుంటుంది. చీకటి దైన్యానికి ద్రవించిన సూర్యుడు తడి పదాలై బొట్లు బొట్లుగా రాలుతుంటాడు నా చిరు చీకటి చూరు లోంచి. శ్రావణం అంటే ఎంత ఇష్టమో నాకు! ముసురు ముసుగుల వెనుక సప్త వర్ణాలను పాడుకుంటూ వేకువ! ఏడు రాగాలను విచ్చుకుంటూ ఇంద్రచాపం! చీకటి బతుకులలో కిరణమై నదించాలని తొందరిస్తున్న తొలిపొద్దు […]

Continue Reading

కాళీ పదములు       

కాళీ పదములు                                 -పాలపర్తి ఇంద్రాణి 1. ధూళి ధూసరితమైన  భూమి పైన్నుంచి లేచి హంసలా మబ్బులలో  ఎగురుతున్నాను సాటి రాయంచల  హొయలు చూచి  మైమరచానో మోహించానో ఆ వేల అడుగుల  ఎత్తునుంచి జారి పడబోయాను  అమ్మా,అమ్మా, అమ్మా,అమ్మా! అద్భుతమాశ్చర్యమానందం!  మూడు హస్తాలు  నిలువరించాయి నన్ను నువ్వు పంపిన పరమ గురువులు ముగ్గురు పక్షి పాదాల వారు కాంతి కమండలాల వారు గాలి బిరడాల వారు […]

Continue Reading

దేహమంటే మనిషి కాదా

దేహమంటే మనిషి కాదా – కొండేపూడి నిర్మల దేశమ౦తా మనది కాకపోవచ్చు దేహమయినా  మనది కాకుండా ఎలా వుంటుంది ? దగ్ధమయిన దేహం ఇంక ఎవరి కన్నీరూ తుడవదు, కోపగించుకోదు కానీ నిన్నటి దాకా  చెప్పిన పాఠాలు ఎక్కడికి పోతాయి ఏళ్లతరబడి అల్లుకున్న స్నేహాలెక్కడిపోతాయి సగం చదివి మడత పెట్టిన పేజీకి అవతల కధ ఎటు పారిపోతుంది ఇంత జవ౦, జీవం, పునరుజ్జీవ౦ వున్న మనిషి  నుంచి దేహాన్ని  విడదీసి మంట పెట్టడం  ఏమి న్యాయం..? కాలధర్మం […]

Continue Reading