image_print

పుస్తకాలమ్ – 4 “హియర్ ఐ స్టాండ్” పాల్ రాబ్సన్ పుస్తక పరిచయం

స్వరమే ఆయుధంగా అనేక యుద్ధాలు పుస్త‘కాలమ్’ – 4 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ ఈ నెల నుండి ప్రారంభం)   -ఎన్.వేణుగోపాల్ స్వరమే ఆయుధంగా అనేక యుద్ధాలు “శ్రీశ్రీ కవిత్వమూ పాల్ రాబ్సన్ సంగీతమూ ఒకటే రకం అంటుంది సౌరిస్” అని మహాప్రస్థానానికి 1940 జూలై 17న రాసిన యోగ్యతాపత్రంలో చలం తెలుగు సమాజానికి పాల్ రాబ్సన్ (1898-1976) ను పరిచయం చేశాడు. చలం పాల్ రాబ్సన్ అని రాయలేదని, అప్పటికి సుప్రసిద్ధుడైన […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 3 స్వప్నం ఒక ఆరని నిప్పురవ్వ (మీనా కందసామి “ది ఆర్డర్స్ వర్ టు రేప్ యు” పై సమీక్ష )

స్వప్నం ఒక ఆరని నిప్పురవ్వ   -ఎన్.వేణుగోపాల్ పునరుజ్జీవనం ప్రకృతిలో నిత్య సత్యం. మేఘం కురిసి తనను తాను రద్దు చేసుకుంటుంది. కాని భవిష్యత్ మేఘాలెన్నిటికో జన్మనిస్తుంది. భూమి తనచుట్టూ తాను తిరిగి సూర్యుడినీ, చంద్రుడినీ, నక్షత్రాలనూ పోగొట్టుకుంటుంది. కొన్ని గంటల్లోనే తిరిగి తన కళ్ల ముందరికి తెచ్చుకుంటుంది. చెట్టు కూలిపోతుందన్నమాట నిజమే కానీ ఆ లోపు వేనవేల పూలు పూసి లక్షోపలక్షల విత్తనాలయి పునరుత్థానం చెందుతుంది. ఈ ప్రకృతి పునరాగమన చక్రాన్ని చూసి మనుషులు తాము […]

Continue Reading
Posted On :

“వెనుతిరగని వెన్నెల” డా.కె.గీత నవలపై సమీక్ష

“వెనుతిరగని వెన్నెల” డా.కె.గీత నవలపై సమీక్ష   -తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం నెచ్చెలి పత్రిక వ్యవస్థాపక సంపాదకురాలిగా డా. గీత సాహిత్యాభిమానుల మనసులలో తన స్థానం సుస్థిరం చేసుకున్న కవయిత్రి, రచయిత్రి. గీత ఎంతో ప్రేమగా తెచ్చి ఇచ్చిన నాలుగు వందల అరవై పేజీల తన మొదటి నవల “వెనుతిరగని వెన్నెల “ రెండు చేతులతో జాగ్రత్తగా అందుకున్నాను. నన్ను తన ఆత్మీయురాలిగా భావించి ఇచ్చిన బహుమానం అది. నాకు గౌరవంగా భావించాను. నవల పేరు ఎంత ఆసక్తికరంగా […]

Continue Reading

సంఘర్షణల యాత్ర (కల్పనా రెంటాల కథాసంపుటి “అయిదో గోడ” పై సమీక్ష)

సంఘర్షణల యాత్ర (కల్పనా రెంటాల కథాసంపుటి “అయిదో గోడ” పై సమీక్ష)   -సుధామురళి “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” అని ఎందుకు పొగిడారో, ‘కార్యేషు దాసి, కరణేషు మంత్రి’ అంటూ ఎందుకు ఓ స్పష్టమైన స్థాన నిర్దేశం చేస్తూ ఆడది అంటే ఇలానే ఉండాలనే వువాచలు నుడివారో కానీ అసలు ఆడవారిని గూర్చి చెప్పాల్సి వస్తే ‘ ఏ దేశమేగినా ఎందుకాలిడినా కష్టాలు కన్నీళ్లు తప్పవా ఆడజన్మకు’ అని ఆక్రోశించాల్సి వస్తోంది.  ఈ సంపుటి […]

Continue Reading
Posted On :

‘ఇక మారాల్సింది నువ్వే’ పెనుగొండ సరసిజ కవితా సంపుటి పై సమీక్ష

ఇక మారాల్సింది నువ్వే కవితా సంపుటి పై సమీక్ష   -గిరి ప్రసాద్ చెలమల్లు వరంగల్ లో పుట్టిన సరసిజ పెనుగొండ గారు తాను పుట్టిన నేల ఆవేశాన్ని ఇక మారాల్సింది నువ్వే కవితా సంపుటి లోని తన కవితల్లో పెల్లుబికించారు. కవితా సంపుటి లో స్త్రీ వాదాన్ని , ప్రశ్నించే తత్వాన్ని, వలసల్లోని బాధని, రైతు వ్యధని చిత్రీకరిస్తూ లోతైన పదాలను వాడుతూ సామాన్య పాఠకులకు చేరువయ్యేల వ్రాసారు. కవితా వస్తువుల ఎంపికలో తనదైన అభిమతాన్ని […]

Continue Reading

”మా పిల్లల ముచ్చట్లు” పుస్తక సమీక్ష

  మా పిల్లల ముచ్చట్లు  ఒక టీచర్ అనుభవాలు   -అనురాధ నాదెళ్ల బడి అంటే పిల్లలప్రపంచం అనుకుంటాం. కానీ బడిలో ఉండేది పిల్లలొక్కరే కాదుగా. ఆ పిల్లల్ని స్వంతం చేసుకుని తమ కుటుంబంగా భావించే టీచర్లుండేది కూడా బడిలోనే. సహనంతో, ప్రేమతో వారి అమాయకత్వాన్ని జీర్ణించుకుంటూ, అక్షరాలను నేర్పి పిల్లల భవిష్యత్తుకు బాటవేసే టీచర్లు సమాజానికి ఎంత విలువైన సంపదో కదా. పసివాళ్లుగా బడిలో ప్రవేశించే పిల్లలు బడి వదిలే సమయానికి భవిష్య జీవితానికి కావలసిన ప్రాథమిక […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 2 “అదృశ్యమవుతున్న తథాగతుని అడుగుజాడల అసాధారణ అన్వేషణ”

అదృశ్యమవుతున్న తథాగతుని అడుగుజాడల అసాధారణ అన్వేషణ (తథాగతుని అడుగుజాడలు– పుస్తక పరిచయం)   -ఎన్.వేణుగోపాల్ ఎప్పుడూ ఇవాళ లోనే జీవిస్తుంటాం. రేపు గురించి ఆశలతో సందేహాలతో వేగిపోతుంటాం. అయినా నిన్న మీద తరగని ఆసక్తి ఉండడం మానవ స్వభావంలో అనివార్యమైన, అవిభాజ్యమైన లక్షణం కావచ్చు. అది ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అనే వెనుకచూపు కానక్కర లేదు. ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయష’ అనే భయం గొలిపే పునరుద్ధరణ వాదమూ కానక్కర లేదు. ‘మంచి గతమున […]

Continue Reading
Posted On :

కన్నీళ్లు సాక్ష్యం

కన్నీళ్లు సాక్ష్యం (పుస్తక పరిచయం)   -జ్యోతి మువ్వల    ప్రముఖ కవి గవిడి శ్రీనివాస్ గారి పరిచయం రెండు తెలుగు రాష్ట్రాల పాఠకులకు సుపరిచితమే. నేటి జీవితాలలో వాస్తవ సంఘటనలను తీసుకొని కవితగా మలుస్తారు గవిడి శ్రీనివాస్ గారు. అలా రాసిన పుస్తకమే కన్నీళ్లు సాక్ష్యం.కవి కన్నీరే కవిత్వం అవుతుంది. ఎందుకీలా చెప్తున్నాను అంటే గవిడి శ్రీనివాస్ గారి కన్నీటి సాక్ష్యం కవితాసంపుటి అభివ్యక్తి విధానంపై  అతనికి  శ్రద్ధ ఉందనటానికి   నిదర్శనం. ఆవేదన భరితమైన కవిత్వం నేటి సమాజానికి అవసరమైన ధోరణి. […]

Continue Reading
Posted On :

గాబ్రియెల్ గార్షియా మార్కెజ్ ‘ది స్కాండల్ ఆఫ్ ది సెంచురీ’ పుస్తక పరిచయం

 గాబ్రియెల్ గార్షియా మార్కెజ్ ‘ది స్కాండల్ ఆఫ్ ది సెంచురీ’ పుస్తక పరిచయం  (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ ఈ నెల నుండి ప్రారంభం)   -ఎన్.వేణుగోపాల్ మార్కెజ్ గురించి మరొకసారి… బెజవాడ ఏలూరు రోడ్డులో గడిచిన వైభవోజ్వల దినాలలో నవోదయ పబ్లిషర్స్ దుకాణంలో 1981-82ల్లో పరిచయం అయిన నాటి నుంచి మిత్రులు, ప్రస్తుతం పల్లవి పబ్లికేషన్స్ నడుపుతున్న వెంకటనారాయణ గారు రెండు మూడు రోజుల కింద ఉదయాన్నే ఫోన్ చేసి మార్కెజ్ ను […]

Continue Reading
Posted On :