image_print

నా నేస్తం!! (కవిత)

నా నేస్తం!! (కవిత) -సుభాషిణి ప్రత్తిపాటి అనాసక్త జీవన ప్రయాణంలో… చైత్రవర్ణాలు నింపిన వాసంతం!! కల్లోలకడలిన తెరలెత్తిన చుక్కాని! దుఃఖపు పొరల మధ్య… నా చెక్కిలి నిమిరే మలయసమీరం!! రెప్పలు దాటని స్వప్నాలను…. సాకారం చేసిన దేవత! మోడులైన పెదవంచుల… చిరునగవుల వెన్నెల పూయించిన జాబిల్లి! తనే…నా…నేస్తం!! గుండె గదుల్లో దాగిన చీకట్లను… తరిమి,తరిమి కొట్టిన వెలుతురు పిట్టలు….నా పుస్తకాలు. నన్నే నాకు కానుక చేసిన ప్రియచెలులేకేమివ్వగలను…??? మరు జన్మకు పుస్తకమై జతకలవడం తప్ప!!! ***** ఫోటో […]

Continue Reading

ఒకానొక బంధిత గేయం!(కవిత)

ఒకానొక బంధిత గేయం! (కవిత) -డి.నాగజ్యోతిశేఖర్ నెత్తుటి వాగొకటి  హృదయసంచిని చీల్చుకొని పోటెత్తింది! కొంచెం కొంచెంగా ఘనీభవిస్తున్న స్వప్న దేహాలు మౌనంగా రోదిస్తున్నాయి! పురాతన గోడల్లో చిక్కుకున్న ఉనికివిత్తు ఊపిరాడక కొట్టుకుంటుంది! బొట్టు బొట్టుగా విరుగుతున్న ప్రాణధారలు గాజుద్వీపంలో ఆఖరి పాటను లిఖిస్తున్నాయి! ఎక్కడో గుండెలోయల్లో వెలిగించుకున్న ఆశలదీపంపై రాబందు రెక్కల నీడ పరుచుకుంది! శూన్యాకాశపు అంచుల్లో  చీకట్లు వాటేసుకుని మనస్సు మబ్బులు మసకబారుతున్నాయి! నిన్ననే వచ్చిన వసంతం వేసంగి సెగ తగిలి కన్నీటి కొవ్వొత్తై కరుగుతున్నది! […]

Continue Reading

వాట్ ఏ రేపిస్ట్ డ్రామా (కవిత)

వాట్ ఏ రేపిస్ట్ డ్రామా (కవిత) -పేర్ల రాము ఎవర్ని నిలదీసి అడగాలో అర్థం కావట్లేదు సీతాకోకల్లా ఎగరాల్సిన వాళ్ళు ప్రాణం లేని నగ్నదేహాలతో కుప్పకూలుతున్నారు పావురాల్లా పరుగులు పెట్టాల్సిన వాళ్ళు కాలం కంచెల్లో బలైపోతున్నారు. నడిరోడ్డు మీద నగ్నదేహాల్ని కలకంటున్న కళ్ళకి వయస్సుతో పనేముంది?? మొలకల్ని ,చెట్లను వేటినైన నరుక్కోవచ్చు . కావాల్సినప్పుడల్లా న్యూడ్ వెబ్సైట్స్ ఓపెన్ సౌకర్యం పుట్టాక నేర్పేపనే ముంది?? వాడుకోవొచ్చు ,చంపేయొచ్చు అనే ఒక లోపలి నినాదానికి స్వేచ్ఛ చాలానే ఉందిగా. […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-1

రాగో – సాధన  1 రాగో దిగాలుగా కూచొని ఉంది. మనసంతా కకావికలమై ఉంది. కొలిక్కి రాని ఆలోచనలు. ఊరి బయటి గొడ్ల సదర్లలా చెల్లాచెదురుగా ఉన్నాయి తన ఆలోచనలు. ఎంత కూడదనుకున్నా గతమంతా దేవర జాతర్లా బుర్రలో అదే పనిగా తిరుగుతోంది. తోవ తప్పినోళ్ళు ఆగమాగమై అడవిలో తిరుగుతున్నట్లుంది రాగో జీవితం. తారీఖులు, పంచాంగాలు లెక్కలు తెలియకపోయినా, ఊరోళ్ళందరూ ‘పడుచుపోరి’ అని వెక్కిరిచ్చినప్పుడల్లా తనకూ వయసొస్తుందని అర్థమయేది. ఊళ్లో చలికాలం రాత్రుళ్ళు డోళ్ళు, డప్పులతో నెగళ్ళ […]

Continue Reading
Posted On :

వెంట్రుకల బంతి (మార్గరెట్ ఎట్ వుడ్ కథ)

తెనిగీయం-2 వెంట్రుకల బంతి (కథ) ఆంగ్ల మూలం: మార్గరెట్ ఎట్ వుడ్ స్వేచ్ఛానువాదం: అరుణజ్యోతి   కేట్ ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వచ్చింది. ఆమె గ్భాశయంపై ఒక కంతి పెరింగింది. కాస్త పెద్దదే. చాలా మంది ఆడవాళ్ళకు ఇలా అవుతుందని డాక్టరు చెప్పారు. అయితే ప్రమాదకరమైన కేన్సర్ కంతి అవునో కాదో ఇప్పుడే చెప్పలేమన్నారు. ఆ కంతిని తాను చూస్తానని కేట్ చెప్పింది. ఆపరేషన్ జరిగింది…ఆ కంతి కేన్సర్ కాదు. కాస్త పెద్ద కంతి డాక్టర్ ఆపరేషన్ చేసి […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-11

కనక నారాయణీయం -11 –పుట్టపర్తి నాగపద్మిని తెలుగు సాహిత్య చరిత్రలో మునుపెన్నడూ వినని కనని సందర్భమిది!! ఒక కవి, తాను వ్రాసిన కావ్యాన్నే, తాను విద్యార్థిగా చదవి, పరీక్ష వ్రాయవలసి రావటం ఎప్పుడైనా జరిగిందా?? ఈ వార్త క్షణాలమీద ప్రొద్దుటూరు సాహిత్య లోకంలో పాకి పోయింది. ఏమిటేమిటీ?? పుట్టపర్తి నారాయణాచార్యులనే యువ కవి వ్రాసిన కావ్యం, విద్వాన్ పరీక్షకు పాఠ్యాంశంగా ఉండటమేమిటి?? అతడు ప్రొద్దుటూరు వాసి కావడమేమిటి?? పైగా అతడే విద్వాన్ పరీక్షలు హాజరుకాబోతుండటమేమిటి?? అన్నీ ఉత్కంఠభరితమైన […]

Continue Reading

వాంగ్మూలం (మహాశ్వేతాదేవి వర్ధంతి సందర్భంగా) (కవిత)

వాంగ్మూలం (మహాశ్వేతాదేవి వర్ధంతి సందర్భంగా) -అరణ్యకృష్ణ (జులై 28) మహాశ్వేతాదేవి వర్ధంతి. భారతదేశ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన రచయితల్లో ఆమె ఒకరు. నా మీద అమితమైన ప్రభావం చూపిన పుస్తకాల్లో “ఒకతల్లి” ఒకటి. మహాశ్వేతాదేవి రాసిన “హజార్ చురాశిర్ మా” నవలని తెలుగులో “ఒకతల్లి” పేరుతో సూరంపూడి సీతారాం అనువదించారు. ఉద్యమంలో కన్నుమూసిన తన కుమారుడి మరణానికి కారణాల కోసం ఒక తల్లి చేసే అన్వేషణ ఈ అద్భుతమైన నవలకి కథాంశం. ఆ పుస్తకం చదివి నేను […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- జూలై, 2020

“నెచ్చెలి”మాట  “నెట్టిం”టి సాహితీ చెలి- నెచ్చెలి! -డా|| కె.గీత  “నెచ్చెలి”కి అప్పుడే ఏడాది నిండింది! “ఈ ఏడాదిగా “నెచ్చెలి” ఏమేం చేసిందీ?” అంటే అబ్బో , చెప్పడానికి బోల్డు విశేషాలున్నాయి. ఓపిగ్గా చదువుతానంటే కాసుకోండి మరి! ముందస్తు విశేషం ఏవిటంటే- ప్రతి నెల్లోనూ  కాసిన్ని కొత్త విశేషాలు చేర్చుకుంటూ ఏడాదికి తప్పటడుగులు కాదు ఏకంగా పరుగు ప్రారంభించింది. అదీ సంగతి! ముందుగా నా మీద ప్రేమతో అడగగానే తొలి సంచిక నుండీ రాస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ పేరుపేరునా […]

Continue Reading
Posted On :

రాగో(నవల)

రాగో (నవల)  – సాధన సృజన ప్రచురణలు, మలుపు బుక్స్ సౌజన్యంతో “నెచ్చెలి” పాఠకుల కోసం ప్రత్యేకంగా “రాగో” నవలను ఈ నెల నుండి ధారావాహికగా అందిస్తున్నాం.  అడగగానే “రాగో” నవలను ప్రచురించడానికి సమ్మతించిన శ్రీ ఎన్. వేణుగోపాల్ గారికి, శ్రీ బాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు. *** “రాగో అంటే రామచిలుకే గాని పంజరంలో చిలుక కాదు. అర్థం లేని కట్టుబాట్లను మనస్సు లేని మనువును ఎదిరించి, అడవిలోకి, అక్కడి నుంచి ఆశయంలోకి పయనించిన వీరవనిత. […]

Continue Reading
Posted On :

చీకటి పెట్టెలు (కవిత)

చీకటి పెట్టెలు -కొండేపూడి నిర్మల “అమ్మానాన్నెప్పుడొస్తారు ?” ఎడబిడ్డ అడిగాడు వస్తారు బాబూ , తెల్లారి బ౦డికి వస్తారు చండి బిడ్డను ఎత్తుకుని కిటికీలోంచి బైటికి చూస్తూ ఆమె అన్నది దూరంగా జెర్రిపోతులాంటి రైలు చీకటి పెట్టెల్ని ఈడ్చుకుంటూ పరిగెడుతోంది “అమ్మా నాన్న మిఠాయి తెస్తారా ?” తెస్తారు బాబూ పెద్ద పెట్టెనిండా తెస్తారు ఏడ్చి ఏడ్చి చారికలు కట్టిన బుగ్గమీద ముద్దు పెట్టి చెప్పింది తెల్లారుతూనే ఒక పెట్టెను సాయంపడుతూ కొంతమంది మనుషులొచ్చారు “అమ్మా ఈ […]

Continue Reading

నల్ల పాదం (కవిత)

  నల్ల పాదం -సతీష్ బైరెడ్డి మేము శ్వాసిస్తే సహించలేరు మా విశ్వాసాన్ని భరించలేరు శతాబ్దాలుగా  మా స్వేచ్చా కంఠాలపై శ్వేత ఖడ్గాలు వేలాడుతూనే ఉన్నాయి. మేమంటే హృదయము,మేధా లేని ఒట్టి  నల్ల రంగే పుట్టుకతోనే నిషిద్ధ మానవులగా మారిన వాళ్ళం మా కలలు నిషిద్ధం మా కదలికలూ నిషిద్ధం అగ్ర రాజ్యంలో పేదరికంతో పెనవేసుకపోయిన జీవితాలు మావి నల్ల జాతిని నేరానికి చిరునామా చేసింది  శ్వేత రాజ్యం పీఠాల  మీది బతుకులు వారివైతే పాదాల కింద నలిగిన […]

Continue Reading
Posted On :

బాలబాబు-బుజ్జి అత్త (కవిత)

బాలబాబు-బుజ్జి అత్త -యశస్వి ఆమె అనేక యుద్ధముల నారితేరిన నారిఇప్పుడు అంపశయ్య ఎక్కి బాల బాబూ బాలబాబూ అని పిలవరిస్తూ ఉంది నిన్నటి వరకూ నిలిచోడం ఆమె యుద్ధం,  పడకుండా నడవడం యుద్ధాన్ని  గెలవడమే..పడుకుంటే లేచి కూర్చోడం యుద్ధం గెలవడం,కూర్చుంటే అదరకుండా నడుం వాల్చడం యుద్ధంమే మంచాన పడ్డ పెనిమిటిని  పసిపిల్లాడిలా సాకిన గట్టిమనిషేకట్టుకున్నోడ్ని కాటికి అప్పజెప్పాక పట్టు వదిలేసిన ఒళ్లాయే; ఆపై తలతిరిగి   కూలబడి పోతుండేది ఎముక లేనట్టు వండి వడ్డించిన చేయి వందల సార్లు జారి కిందపడ్డందుకు జబ్బ జారిపోయింది కొడుకులు పురిట్లోనే పోయినా అడుగు దూరం నుంచి ప్రేమించే […]

Continue Reading
Posted On :

నీ అస్థిత్వం ఎక్కడిది..? (కవిత)

నీ అస్థిత్వం ఎక్కడిది..? -గట్టు రాధిక మోహన్ పైన కప్పిన ఆ ఆకాశం మారలేదు కింద పరుచుకున్న ఈ పుడమీ మారలేదు. నా జన్మం కూడా మారలేదు. శతాబ్దాల వేదనలో నేనొక చెరగని సంతకంగానే ఉంటున్నాను. నా మీద రాసివ్వబడని పేటెంట్ హక్కులు నీ సొంతం అనుకుంటావు. ఎప్పటికప్పుడు నీకిష్టమైన కొత్త కొత్త నాగరికత విత్తనాలను విత్తుకుంటు నా కన్నీటి చుక్కలతో తడిపేస్తుంటావు. నువ్వు సృష్టించిన ఈ పితృస్వామ్య రాజ్యాంగంలో నా చూపుడు వేలును విరిచేసుకుంట నవ్వుకుంటుంటావు. […]

Continue Reading

రైన్ కోటు (కవిత)

రైన్ కోటు -యలమర్తి అనూరాధ గోడకు వేలాడదీయబడి బిక్కు బిక్కు మంటూ చూస్తూ ఎడారి జీవితాన్ని గడిపేస్తూ.. గాలివాన నేనున్నా అనాలి విప్పుకున్న గొడుగులా అప్పుడే ఊపిరి పోసుకున్న బిడ్డలా ఉత్సాహంగా ఉరకటానికి సిద్ధమవుతుంది కష్టాన్నంతా తనమీద వేసుకుంటూ వెచ్చదనం అంతా నీ సొంతం చేస్తుంది కన్నీళ్లను కనుపాపల్లో దాచుకుంటూ గూటిలో గువ్వలా తన ఒడిలో కాపాడే తల్లి మనసుకు ఏం తీసిపోదు చినుకు చినుకు కి చిత్తడవుతున్నా చిరునవ్వుతో నిన్ను హత్తుకుంటూనే నిలువెల్లా రక్షణ కవచం […]

Continue Reading
Posted On :

వెలుగుల రోజు (కవిత)

వెలుగుల రోజు -డా.కె.దివాకరాచారి నేను నాలాగా ఎదిగేప్పుడు నన్ను నడిపించి అక్కున చేర్చుకున్న అమ్మ ‘తులసి’ కౌగిలి నను ఒంటరిని చేసి వెళ్లినప్పుడు నన్ను అమ్మలా ఆదుకొని నా దారే తన జీవనమని నాతోనే తన జీవితమని అందరినీ, అన్నిటినీ వదిలి, కదిలి వచ్చి తన చేతిని, మనసును తలపుల్ని, బ్రతుకును నాతో పెనవేసుకుని తిరిగి నన్ను నిలబెట్టిన నా నెచ్చెలి వెచ్చని పరిష్వంగంలో ‘అమ్మ తనం’ సదా పరిమళిస్తూనే ఉంటుంది! ‘అమ్మలా’ నన్ను లాలించి మందలించి, […]

Continue Reading

అవేకళ్ళు (కవిత)

అవేకళ్ళు -అశోక్ గుంటుక తెలతెలవారుతూనే వాకిట  నే ముగ్గవుతున్న వేళ డాబాపై వాలిన నీరెండ కురుల ఆరబెడుతున్న వేళ తోపుడు బండిపై బయలెల్లిన కూరగాయల మేలిమి వెతుకుతున్న వేళ : అంతటా అవేకళ్ళు – వెకిలి నవ్వులు వెకిలి చేష్టలు…… పరుగు జీవితమైన వేళ అందీ అందని సిటీబస్సు లేదంటే మెట్రోరైలు చాలీ చాలని సమయం ఒక్కోసారీ వద్దనుకుంటూనే ఓ ఆటో లేదా ఓ క్యాబు – నిలుచున్నా కూర్చున్నా : అంతటా అవేకళ్ళు – వెకిలి […]

Continue Reading
Posted On :

అనాఘ్రాత (కవిత)

అనాఘ్రాత (కవిత) -జయశ్రీ మువ్వా ఊరికి చివరనచితికిన వర్ణం విరగపూసిందిసింధూరం దిద్దుకున్న రేరాణిఇక్కడ పతిత  పాపాల పావని నిదురనెపుడో రేయంచుకు విసిరేసినలుపు రంగు సలపరించే యామిని గంటలెక్కన ఇక్కడ గాయాల గుమ్మాలు ఎప్పుడూ తెరిచే వుంటాయిఉమ్ముతో మలాము అద్దుకోడంఅలవాటు పడిన అద్వంద్వ ఆకలి మంటని ఆర్పుకోలేకకన్నీటి కాష్టాన్నికైపుగా రాజేసుకునే నెరజాణ ఇంత బతుకులో వేల నిశ్శబ్ధ యుద్ధాలభేరినిమునిపంట  మ్రోగించేమంజరి గుప్పెడు పొట్టకి బతుకుని వెక్కిరించే ఆకలెందుకో వెకిలి సైగల వెనక వెతల కుంపటి ఒకటుందికోర్కెల కోరల విషం మింగిన దిగంబరి తనది కాని నిదురలో తానో స్వాప్నిక వీర్యాన్ని ఓపలేని వాడు వీరుడిక్కడతనని తానే ఆడి ఓడేఆమె  ఓ అనాఘ్రాత ***** ఆర్ట్: మన్నెం శారద జయశ్రీ మువ్వా – నా […]

Continue Reading
Posted On :

మాతృత్వపుసంతకం (కవిత)

మాతృత్వపుసంతకం -కె.రూప ౧ పాలబుగ్గల పసిడి నవ్వులు.. కేరింతల బాల్యపు చిగురింతలు ఆ చిట్టి చెక్కిలి నవ్వులలో అమ్మ పాల బువ్వలు దాచుకున్నాయి చిగురు లేత ప్రాయపు మునివేళ్ళ స్పర్శకు నెమలి కన్నులే చిన్నబోయినవి చిట్టి పాదాలే నాట్యమాడిన వేళ ఎన్నో… మధుర స్వరాలను వింటూ! చిన్నారి చూపులు కూడా నిలబడని చిత్రంలో అమ్మ బిడ్డ ప్రేమలో తేనెలద్దుకుంటుంది. ౨ పసిబిడ్డకందించే పాలబువ్వకు తానెన్ని వెతలు పడుతుందో! తాను తినే నాలుగు మెతుకులకు చేరిన రక్తాన్ని ప్రేమలో […]

Continue Reading
Posted On :

యుద్ధం (కవిత)

యుద్ధం -గిరి ప్రసాద్ చెల మల్లు దేశం కోసం  సరిహద్దుల్లో  కులమతాల భద్రతకోసం లోలోన చంపుకునేందుకు చంపేందుకు మంచుదుప్పట్లో వాడక్కడ కాపలా  లైన్ ఆఫ్ కంట్రోల్ మీదుగా రాడ్లు కర్రలు బాహాబాహీ భూముల గెట్ల తగాదాలో లోపల  అక్కడ సమిష్ఠి బాధ్యతకై వాడు ఇక్కడ పెత్తనం కోసం బలవంతుడు బలహీనుడిని తొక్కుతూ అక్కడా పెట్టుబడీ ఇక్కడా పెట్టుబడీ కోరలు అక్కడాఇక్కడా అవినీతి జాడ్యం చిదిమేది బడుగు బతుకునే  దేశమంటే మనుషులని వాడు అచ్చట ప్రాణాలొడ్డి దేశమంటే కులాలఎంపిక మతాల తరిమేత ఇక్కడ గద్దెకోసం రగడ రాజేయు అన్నివేళలా ఇక్కడసౌభ్రాతృత్వం కోసం వాడు రగులు అచ్చట  అచ్చట వాడికి మూడురంగుల జెండా యే కనపడు ఇచ్చట […]

Continue Reading

కనక నారాయణీయం-10

కనక నారాయణీయం -10 –పుట్టపర్తి నాగపద్మిని ప్రొద్దుటూరిలో, సుందరాచార్లు వీధిలో మా మాతామహులు శ్రీ ధన్నవాడ  దేశికాచార్య పనిచేస్తున్న  ప్రాథమిక పాఠశలలోనే పని చేస్తున్న కేశవమ్మ టీచర్ (బ్రాహ్మణేతరురాలు) మా అమ్మమ్మ శేషమ్మగారికి చాలా మంచి స్నేహితురాలట!! శేషమ్మ గారికేకష్టం వచ్చినా ఆమె తక్షణం ఆదుకునేదట!! కులం వేరైనా, గుణం బట్టి మాత్రమే ఆనాటి స్నేహాలు ఉండేవని, దీనివల్ల తెలుస్తున్నది కదా?? శేషమ్మగారికి ఎప్పుడూ ఒకటే చింత!! భర్త దేశికాచార్యులవారి తండ్రి గారు ధన్నవాడ రాఘవాచార్యులవారు కాకలు […]

Continue Reading

కొత్త అడుగులు-11 (జ్యోతి నండూరి)

కొత్త అడుగులు – 11 – శిలాలోలిత జ్యోతి నందూరి మరణించిందన్న వార్తను నమ్మలేకపోతున్నాను. నవ్వూతూ, తుళ్ళుతూ, సౌమ్యంగా, స్నేహంగా కనిపించే  ఈ కవయిత్రి ఇలా తన జీవనగీతను కోల్పొతుందని తెలీదు. ‘కాలంగీసిన చిత్రం’ అనే కవితా సంపుటి 2017 లో తీసుకొచ్చింది. చాలా అద్భుతమైన కవిత్వముంది. నర్సింగ్లో యం.ఫిల్ కూడా చేసింది. ఈకోర్సు క్లిష్టమని అతి తక్కువమంది చేస్తారు. దాన్ని తాను సాధించింది. ఇద్దరు పిల్లలూ, భర్త, కవిత్వమూ ఆమె వెంటే నడిచాయి. హఠాత్తుగా బ్రెయిన్కి ఏదో […]

Continue Reading
Posted On :

రాతిపరుపు (మార్గరెట్ ఎట్ వుడ్ కథ)

తెనిగీయం  రాతిపరుపు(కథ) ఆంగ్ల మూలం: మార్గరెట్ ఎట్ వుడ్ స్వేచ్ఛానువాదం: అరుణజ్యోతి   వెర్నా ఎవరినీ చంపాలనుకోలేదు మొదట. ఆమె ధ్యాసంతా కేవలం విహారయాత్రను ఎలా ఆస్వాదిద్దామన్నదానిపైనే. ఆర్కిటిక్ వాతావరణం కూడా ఆమెను ఉత్సాహపరుస్తోంది. తనతో పాటు విహారానికి వచ్చిన వారిని… ప్రత్యేకించి మగాళ్లను ఒక్కసారి పరికించింది. ఇన్నేళ్ల జీవితంలో తనతో పరిచయానికి తహతహలాడిన వారు చాలామందే వున్నారు. పాత అలవాట్లు అంత త్వరగా వదలవు మరి. అందుకే ఆ షిప్ డెక్ పై చేరిన వారిని ఆసక్తిగా […]

Continue Reading
Posted On :

తక్కెడబాట్లు

తక్కెడబాట్లు -తగుళ్ళ గోపాల్ అయ్యా…వొంటి చేతిదాన్ని తక్కెడబాట్లే నా చేతులు కండ్లకు నల్లరిబ్బను కట్టుకొని న్యాయాన్ని జోకుతున్న ధర్మదేవతను గాదు వొట్టి కండ్లు లేని దాన్ని పండ్లమ్ముకునే ముసలిదాన్ని దినాం ఇక్కడే,ఈ నల్లఛత్రి కిందనే కుళ్లిపోయిన పండ్లలాగ పడుంట బతుకును కుప్పలుకుప్పలుగా పెట్టుకుంట పెద్దకొడుకు పోయినప్పటిసంది ఈ అంగడే నా పెద్దకొడుకు ఈ తక్కెడబాట్లే ఇంతజీవగంజి సారూ….నీకాల్మొక్కుత… వొకచేతిలో పండ్లగంప పట్టుకొని బస్సుకిటికీలెంబడి రయ్యరయ్య ఉరుకలేనిదాన్ని కారుఅద్దాల ముందు ‘పదికి మూడు,పదికి మూడు’ అని కూతేసి వొంగి […]

Continue Reading
Posted On :

మిస్సోరీ లో (మాయా ఏంజిలో-అనువాద కవిత)

మిస్సోరీ లో (అనువాద కవిత) -దాసరాజు రామారావు నేనున్న మిస్సోరీలో ఒక సగటు మనిషి ఒక కఠిన మనిషి బాధకు అర్థం తెలియని చలన రహిత మనిషి కడుపులో పేగుల్ని దేవేసినట్లు హింసిస్తుంటడు వాణ్ణి చల్లని వాడనాల్నా పరమ కసాయి ఆ మనిషి   నేనెప్పుడూ మధురమైన మనిషిని కలువలేదు దయగల మనిషిని నిజమైన మనిషిని ఎవరొకరో చీకటిలో వుంటే భరోసా మనిషి తోడుండాలనుకుంట ఖచ్చితమైన మనిషే ఆ మనిషి   జాక్సన్ ,మిస్సిసిపీలో లక్షణమైన పురుషులున్నరు […]

Continue Reading

బ్రహ్మ కడగని పాదము (కవిత)

బ్రహ్మ కడగని పాదము (కవిత) -జయశ్రీ మువ్వా ఎల్లిపోతున్నాం… ఖాళీ పాదాలు మావి , అందుకే … తేలిగ్గా కదిలెల్లిపోతున్నాం .. బరువవుతున్న బ్రతుకుని చింకి చాపల్లో చుట్టుకెళ్ళిపోతాం చిరిగిన కలల్ని  చీకట్లో దాచుకుంటూ .. మా పొలిమేర పొరల్లోకి లాక్కెళ్ళి పోతాం శెలవు చీటీ కూడా రాసిచ్చి పోలేని నిశానీ కలాలం మేమిన్నాళ్ళూ గుర్తించలేదు కానీ మిగులు జీవితాల మూలల్లో గుంపుగా కంపు వాడల మీద  పరాన్నజీవులు కారా మీరూ..? పురుగు వచ్చిందని  ఏరివేసిన  మెరిగలయ్యాము […]

Continue Reading
Posted On :

క్షమించు తల్లీ!

క్షమించు తల్లీ! -ఆది ఆంధ్ర తిప్పేస్వామి అమ్మా! నీ అడుగులకు ఓసారి సాగిలబడాలనుంది! చెమ్మగిల్లిన కళ్ళతో .. నీ పాదాల చెంత మోకరిల్లాలనుంది! నీదంటూ ఒకరోజుందని…గుర్తుచేసుకుని నిన్ననే ఆకాశంలో సంబరాలు చేసుకున్నాం! నీకు సాటిలేరంటూ గొప్పలు పోయాం! గుండెలో పెట్టుకుని గుడికడతామంటూ కవితలల్లి ఊరువాడ వూరేగాం! క్షమించు తల్లీ! నిచ్చెనేసి ఆకాశంలో నిలబెట్టాలని నువ్వుడగలేదు సొంతూరికి చేర్చమని కాళ్లా వేళ్లా పడుతున్నావు..! రోజూ పరమాన్నంతో కడుపునింపమని కోరలేదు ఆకలితో చచ్చిపోయే ప్రాణాలకింత గంజి పోయ మంటున్నావు ..! […]

Continue Reading

ఏడికి (కవిత)

ఏడికి (కవిత) -డా||కె.గీత 1 ఏడికి బోతున్నవే? బతుకుదెర్వుకి- ఈడనె ఉంటె ఏమైతది? బతుకు బుగ్గయితది- 2 యాడికి బోతున్నావు? పొట్ట కూటికి- ఈడేడనో నెతుక్కోరాదూ? బతుకా ఇది- 3 ఎందాక? అడగ్గూడదు- ఊళ్లోనే సూసుకుంటేనో? కూలి పనైనా లేందే- *** 1 ఎందాక? ఏమో- 2 యాడికి? ఊరికి- 3 ఏడికి? బతకనీకి ***** డా||కె.గీతడా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి […]

Continue Reading
Posted On :

మనిషితనం(కవిత)

మనిషితనం (కవిత) -కె.రూప ఒంటరితనం కావాలిప్పుడు  నన్ను నాకు పరిచయం చేసే చిన్న చప్పుడు  కూడా వినపడని చోటుఏ వస్తువు కనబడని చోటునాలో  మెదులుతున్న శ్వాసనుకూడా దూరం చేసేదినన్ను నన్నుగా గుర్తించేది ౧ ఏ సంద్రపు ఘోషలు వినలేని నా మది నాకు వినపడేలా నాలో లేని తనాన్ని ఏదో వెతుక్కుని నాలో నింపుకోవలసిన సమయమిప్పుడు!౨బిగుతై పోతున్న గుండె బరువుల నుండి సేదతీరాలనే సంకల్పంతో౩ఉదయపు వేకువల చప్పుళ్ళనుండి మొదలురాత్రి వెన్నెలకు కురిసే తడి కూడా అంటనంత  నా అడుగుల చప్పుడు కూడా నన్ను గుర్తించనంతగాఏ శబ్దమో ..ఏ రాగమో ..వినపడనంత దూరంకొండవాలుగా […]

Continue Reading
Posted On :

అభినయ (కవిత)

అభినయ (కవిత) -లక్ష్మీ కందిమళ్ళ అది కాదు ఇంకేదో అనుకుంటూ కంటినుంచి కన్నీటిచుక్క రాలింది. కన్నీరు కనిపించకుండా ముఖం పక్కకు తిప్పుకొని తడిని  తుడుచుకుంటూ పెదవులపై, జీవంలేని నవ్వులను మొలిపించుకుంటూ కళ్ళల్లో లేని ఆనందాన్ని అభినయిస్తూ.. ఆమె. అందుకు తడిచిన గులాబీ సాక్ష్యం! ***** ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి కందిమళ్ళ లక్ష్మికర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading

విడదీయ లేరూ (కవిత)

విడదీయ లేరూ !!! -గిరి ప్రసాద్ చెల మల్లు నేను ఆమె మెడచుట్టూ అల్లుకుపోయి రెండుమూడు చుట్లు తిరిగి భుజాల మీదుగా ఆమె మెడవంపులోకి జారి గుండెలమీద ఒదిగిపోగానే ఆమెలో అనుభూతుల పర్వం  ఆమె కళ్ళల్లో మెరుపు కళ్ళల్లో రంగుల స్వప్నాలు ఆమె అధరాలపై అందం కించిత్తు గర్వం  తొణికిసలాడు ఆమె రూపులో కొత్తదనం బహిర్గతం  నేను  ఆమె అధరాలను స్పృశిస్తూ నాసికాన్ని నా ఆధీనంలోకి తీసుకు రాగానే ఆమె ఉఛ్వాసనిశ్వాసాల గాఢత నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది  ఆమె కింది కనురెప్పల వారగా నేను ముడతలను మూసేస్తూపై కనురెప్పల ఈర్ష్యను గమనిస్తూ ముంగురులను ముద్దాడుతూ ఆమె […]

Continue Reading

కనక నారాయణీయం-9

కనక నారాయణీయం -9 –పుట్టపర్తి నాగపద్మిని           వరుని తండ్రి పుట్టపర్తి శ్రీనివాసాచార్యులవారన్నారు.’జాతకాల మాట అటుంచితే, వాల్మీకి రామాయణం కంటే ప్రమాణం మరెక్కడుంది కనుక?? రామాయణ ప్రశ్న వేతాము. అందులో ఫలితాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాము.’   వధువు వైపువాళ్ళు ఆలోచనలో పడ్డారు.   ఇంతకీ ఏమిటీ రామాయణ ప్రశ్న??     రామాయణం ప్రశ్న అంటే,  ఏదైనా కష్ట సమయ వచ్చిన సందర్భంలో, వాల్మీకి మహాకవి విరచిత శ్రీమద్రామాయణ గ్రంథం ముందుంచుకుని, భక్తితో నమస్కరించి, తమ […]

Continue Reading

కొత్త అడుగులు-10 (రాణి చిత్రలేఖ)

కొత్త అడుగులు – 10 రాణి చిత్రలేఖ(కవిత్వం) – శిలాలోలిత వన్నెపూల విన్నపాలు ‘రాణీ చిత్రలేఖ’ కవిత్వం తెలుగు సాహిత్యం లో కొత్త. ‘ వన్నెపూల విన్నపాలు’ పేరుతో రాసిన శృంగార కావ్యం ఇది. రాధాకృష్ణుల ప్రేమ కథ ఇది. చిత్రలేఖకు కవిత్వం , సంగీతం, నృత్యం, నటన ఇష్టమయిన విషయాలు.  కవిత్వంలో ఇది తొలి పుస్తకం. ఇక ‘యాంకర్ ‘గా ప్రారంభమయిన ఆమె మంచి ఇంటర్వ్యూవర్ గా పేరు తెచ్చుకుంది. సినిమాల్లో కూడా కొంతకాలం నుంచీ […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- జూన్, 2020

“నెచ్చెలి”మాట  “స్వేచ్ఛ” -డా|| కె.గీత  “స్వేచ్ఛ” అంటే ఏవిటి? “స్వేచ్ఛ ఒకరు ఇచ్చేది కాదు. మనకు మనమే సంపాదించుకునేది” లాంటి గంభీరమైన నిర్వచనం కాకుండా మామూలు భాషలో చెప్పగలరా? అదేనండీ ఇళ్లలో ఇన్నేసి వారాలు కాళ్లు కట్టిపడేసినట్లు ఉన్న మనందరికీ లాక్ డౌన్ ఎత్తెయ్యంగానే  కలిగిన అద్వితీయమైన ఆనందాన్ని నిర్వచించుకునే మాటలన్నమాట- అబ్బా మళ్లీ భాషా గంభీరత! ఓకే- సింపుల్ మాటల్లోకి వద్దాం- జనరల్ రైలు కంపార్టుమెంటులో ఒకళ్ల మీద ఒకళ్లు నిలబడడం – కిక్కిరిసిన సిటీబస్సులో […]

Continue Reading
Posted On :

రిస్క్ తీసుకుంటాను(కవిత)

రిస్క్ తీసుకుంటాను(కవిత) -కొండేపూడి నిర్మల మొదటి పెగ్గు.. మొగుడు సీసాలో వున్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను సాయంత్రం రొట్టెలోకి తైలం లేక నేను రోడ్డెక్కిన సమయానికి తను నిండు సీసాతో ఇల్లు చేరుకుంటాడు జరగబోయే దేమిటో నా జ్ణానదంతం సలపరించి చెబుతుంది సోడాకోసం లోపలికొచ్చి అనవసరంగా నవ్విపోతాడు గోడమీద తగ కావిలించుకుని దిగిన హనీమూన్ ఫొటో వింత చూస్తూ వుంటుంది. సత్యనారాయణ వ్రతం మాదిరి సరంజామా సిద్ధం చేసుకుని ఎంతో తన్మయంతో సీసా మూత తిప్పుతాడు […]

Continue Reading

చీకటి వేకువ (గుగి వా థియోంగో) (అనువాద కవిత)

చీకటి వేకువ  (అనువాద కవిత) ఆంగ్ల మూలం: గుగి వా థియోంగో  తెలుగు అనువాదం: ఎన్. వేణుగోపాల్ (24 మార్చ్ 2020) తెలుసు, తెలుసు, నాకు తెలుసు ఒక కరచాలనం ఒక బిగి కౌగిలి దుఃఖ భారం దించుకోవడానికి ఒకరికొకరం అందించే భుజం ఎప్పుడైనా సరాసరి లోపలికి నడవగల పొరుగిల్లు మానవానుబంధపు అతి సాధారణ ఆనవాళ్లన్నిటినీ సవాల్ చేస్తున్నదిది ఎగుడుదిగుళ్ల వ్యక్తివాదపు గొప్పలతో మన భుజాలు మనమే చరుచుకుంటూ, మనిషి మీద సకల హక్కులూ ఆస్తికే ఉన్నాయంటూ […]

Continue Reading
Posted On :

ముందస్తు కర్తవ్యం (కవిత)

ముందస్తు కర్తవ్యం (కవిత) -యలమర్తి అనూరాధ కనికరం లేని కబళింపు  జాపిన చేతులు పొడగెక్కువ గాలి కన్నా వేగంగా వ్యాప్తి లక్షణాలు మెండే అయితే ఏంటంట చేయి చేయి కలుపు ఒకప్పటి నినాదమైతే దూరం దూరంగా జరుగు ఇప్పటి నినాదం  ఎంతలో ఎంత మార్పు?  ఊహించనవి ఎదురవ్వటమేగా జీవితమంటే!? తట్టుకుని నిలబడటమేగా ధైర్యమంటే  కరోనా అయినా మరేదైనా  ఆత్మస్థైర్యంతో తరిమి కొట్టడమే  ముందస్తు కర్తవ్యం    వైద్యులు అండ  పోలీసులు తోడు  శాస్త్రజ్ఞులు సహకారం నిస్వార్థ హృదయాల మానవత్వం […]

Continue Reading
Posted On :

ఒంటరి (కవిత)

ఒంటరి (కవిత) -ములుగు లక్ష్మీ మైథిలి రాతిరి కొన్ని బాధలు కరిగిస్తుంది అర్థరాత్రి నిశ్శబ్దం వెలుతురు నాహ్వానిస్తూ గడిచిన వెతలకు జవాబు చెపుతుంది రాతిరి నా అక్షరాలు నల్లని చీకటిని చీల్చే కాంతి పుంజాలవుతాయి చెదిరిన ఆశల తునకలను కవిత్వం గా అల్లుకుంటాను రాతిరి వెన్నెల లో ఊసులు చెప్పుకొని ఎన్నాళ్ళయిందో? ఆ నిశీధి మౌనంలో హృదయాల సవ్వడులు మూగగా మాట్లాడుకుంటాయి రాతిరి నిదురలేని రాత్రులు ఈ దేహపు ఆకాశం లో ఉదయాస్తమయాలు ఒక్కటే కన్నీటి నక్షత్రాలు […]

Continue Reading

లక్ష్మణరేఖ (కవిత)

లక్ష్మణరేఖ (కవిత) -డా.సి.భవానీదేవి నీకిది సరికొత్త కాలం నాకుమాత్రం ఇది అసలు కొత్తకాదు నా జీవితమంతా ఎప్పుడూ లాక్ డౌనే ! అందుకే నాకస్సలు తేడా కనిపించటం లేదు ఏ మాల్స్ మూసేశారో ఏ మార్కెట్ తీసిఉందో నాకెప్పుడయినా తెలిస్తేగా… ఇప్పుడు నీ మార్నింగ్ వాక్ బంద్ నీ ఉద్యోగానికి నిర్విరామ విశ్రాంతి నువ్వు నిరంతరం ఇల్లు కదలకపోబట్టే నేను మరింత చాకిరీకాళ్ళకింద..నలుగుతూ తరతరాలుగా నాకోసం నువ్వు గీసిన లక్ష్మణరేఖను కరోనా భయంతోనైనా మొదటిసారి నువ్వు అనుభవిస్తుంటే […]

Continue Reading
Posted On :

మైల (కవిత)

మైల(కవిత) -జయశ్రీ మువ్వా మాకొద్దీ ఆడతనం అనుక్షణం అస్థిత్వం కోసం మాకీ అగచాట్లెందుకు..?? పిచ్చికుక్క సమాజం పచ్చబొట్టేసూకూర్చుంది అణుక్షణం అణువణువూ తడుముతూ వేధిస్తూనే ఉంది.. ఆకలి కోరలకి అమ్మతనాన్ని అమ్ముకున్నాం ఆబగా వచ్చే మగడికై ఆలితనాన్ని తాకట్టుపెట్టాం .. చివరికి మూడు రోజుల ముట్టు నెత్తుటి పుట్టుకకి ఇప్పుడు బతుకంతా మడికట్టా?? సమాజమా…సిగ్గుపడు… !! అలవాటుపడ్డ ప్రాణలే సిగ్గుకి ముగ్గుకి తలొంచుకున్నాం ఇక చాలు ఓ ఆడతనమా మరీ ఇంత సహనమా తాతమ్మ ,బామ్మ అంటు అంటూ […]

Continue Reading
Posted On :

నాన్నే ధైర్యం(కవిత)

నాన్నే ధైర్యం(కవిత) -కె.రూప ఆడపిల్లకు ధైర్యం నాన్నే! గుండెలపై ఆడించుకునే నాన్న చదువులకు అడ్డుచెప్పని నాన్న ఉద్యోగంలో అండగా నిలిచిన నాన్న చిన్నగాయానికే  అమ్మకు గాయంచేసే నాన్న ఇప్పుడెందుకు ఇలా! మనసుకైన గాయాలను చూడడెందుకో! చిన్నపాటి జ్వరానికే అల్లాడిపోయేవాడు పెద్ద తుఫానులో వున్నాను అంటే పలకడెందుకో! నీ సుఖమే ముఖ్యం అనే వ్యక్తి వ్యక్తిత్వం మర్చిపోయి సర్దుకోమంటాడే! ధైర్యంగా బ్రతకమని చెప్పిన మనిషి అణగారిన బ్రతుకునుండి బయటకు వస్తాను అంటే ఒప్పుకోడెందుకో! నా చిట్టిపాదాల మువ్వలచప్పుళ్లు చూసి […]

Continue Reading
Posted On :

ఆమె (కవిత)

ఆమె (కవిత) -గిరి ప్రసాద్ చెల మల్లు ఆమె ఒక ప్రశ్న జవాబు దొరకదు ఆమె ఒక పజిల్ అంచనాకు అందదు ఆమె వర్షిణి కురిపించే ప్రేమ కొలిచే పరికరం లేదు ఆమె సృష్టి బిడ్డ కోసం పంచే పాల నాణ్యత లాక్టో మీటర్ కి చేరదు ఆమె దుఖం కుటుంబ పాలన లో అడుగడుగునా రెప్పల మాటున గడ్డ గట్టి ఏకాంతంలో విష్పోటనం ఆమె ఆరోగ్యం జీవన శైలి ప్రతిబింబం ఆమె భద్రత ఆమె చుట్టూ […]

Continue Reading

కనక నారాయణీయం-8

కనక నారాయణీయం -8 –పుట్టపర్తి నాగపద్మిని శిరోమణిలో పుట్టపర్తి వారి స్నేహితుడు కలచవీడు శ్రీనివాసాచార్యుల బంధువులకు తాడిపత్రిలో దేశబంధు ప్రెస్ ఉన్నదనుకున్నాం కదా!! పుట్టపర్తి స్నేహితుడైన శ్రీనివాసాచార్యులకు, తన స్నేహితుని ‘పెనుగొండ లక్ష్మి’ ని తమ ముద్రణాలయంలో ప్రచురించవలెనని కోర్కె పుట్టింది. దానికి ధనం కావాలి కదా!! ఎలా మరి?? సహ విద్యార్థుల ప్రోద్బలంతొనే పెనుగొండ లక్ష్మి లోని కొన్ని పద్యాలు , అప్పట్లో సాహితీ లోకంలో అత్యంత ఆదరణకు నోచుకుంటూ, తలమానికంగా వెలుగొందుతున్న భారతి మాస […]

Continue Reading

సంపాదకీయం- మే, 2020

“నెచ్చెలి”మాట  “కరోనాకాలం” -డా|| కె.గీత  “కష్టకాలం”, “కలికాలం”… అని విన్నాం కానీ “కరోనాకాలం” అనేదొకటుందని ఎప్పుడైనా విన్నామా? ఇదో ఇప్పుడు వింటున్నాం, ప్రత్యక్షంగా కంటున్నాం. బొత్తిగా అంతు చిక్కని విషయమేవిటంటే వసంతకాలంలో ప్రారంభమైన ఈ మహమ్మారి కాలం వేసవికైనా ముగుస్తుందో లేదో!? అసలు “కరోనాకాలం” ఎన్నాళ్లుంటుందో ఎవరికీ తెలియదు! ఇళ్లని ఎంతకాలం అంటిపెట్టుక్కూచోవాలో, పోయిన ఉద్యోగాల్ని ఎక్కడ వెతుక్కోవాలో అర్థం కాని పరిస్థితి. రెండు వారాలు ఎవరి నెవరు ముట్టుకోకుండా ఉంటే అంతా “తూచ్చి” అన్నట్టు మాయమై […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-9 (భానుశ్రీ కొత్వాల్)

కొత్త అడుగులు – 9 భానుశ్రీ కొత్వాల్ – శిలాలోలిత స్త్రీలు ఇటీవలి కాలంలో ఎక్కువగా సాహిత్యప్రవేశం చేస్తున్నారు. మనం గమనించినట్లయితే – విద్యారంగం నుండి, ముఖ్యంగా టీచర్లు సాహిత్య సృజన చేస్తున్నారు. నల్గొండ జిల్లా స్థలకాల ప్రాధాన్యతల వల్ల కావచ్చు, సిటీకి దగ్గరవడం వల్ల చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు ఎక్కువున్నారు. రచనలపట్ల ఆసక్తి వున్నవారే ఎక్కవుగా కనిపిస్తున్నారు. ఒక ఆరోగ్యవంతమైన సాహిత్య వాతావరణంలో ‘భానుశ్రీ కొత్వాల్’ – ‘మొలక’ పేరుతో కవిత్వాన్ని తీసుకొచ్చారు. వానలు పడుతున్నయి. […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- ఏప్రిల్, 2020

“నెచ్చెలి”మాట  “దేశసేవ” -డా|| కె.గీత  దేశసేవంటే గుర్తుకొచ్చింది! మీరు “క్లీన్ హాండ్స్” అనే విషయం విన్నారా? “క్లీన్ హాండ్సా?” అంటే “చేతులు శుభ్రంగా ఉంచుకోమనా?” లేదా “చేతులు శుభ్రం చెయ్యమనా?” లేదా రెండూనా? “ఏవండీ, ఒక పక్క ప్రపంచం కరోనా బాధలో గిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఈ క్లీన్ హాండ్స్/ హాండ్స్ క్లీన్  అవసరమా?” అయినా  దేశసేవ అనే టైటిలేవిటి?  మధ్య ఈ “క్లీన్ హాండ్స్” గోలేవిటి? “హయ్యో! అక్కడికే వస్తున్నానండీ!” అసలు దేశసేవ అంటే- విదేశీ […]

Continue Reading
Posted On :

ఎందుకు (కవిత)

ఎందుకు(కవిత) -లక్ష్మీ దేవరాజ్ కంటికి కనిపించని జీవికంటి మీద కునుకు లేకుండా చేస్తుంటేమార్స్ వరకూ వెళ్ళిన మనిషిమౌనంగా మిగిలిపోయాడేం? ఎంతో కష్టపడి ఇష్టంగా కూడబెట్టిన డబ్బుఆరోగ్యాన్ని మాత్రం కొనలేదనిమరోసారి మరచిపోయాడేం? డైనోసార్లు….సరే ఎప్పటివోపులులు మాత్రం నిన్నమొన్నేగాకాలగర్భంలో కలిసిపోతుంటేఅంటీముట్టనట్టున్న మనిషిఇప్పుడెందుకిలా అల్లాడిపోతున్నాడు? ప్రకృతి నేర్పే పాఠం కష్టమేఇది మన దురాశ వల్ల కలిగిన నష్టమే ఇకనుంచైనా బాహ్య శుభ్రంతో పాటుఅంతఃశుభ్రంపై ఆలోచన పెడదాం అలాగే ప్రపంచంలో మనతోపాటు సంచరించేప్రతీజీవి ప్రాణంఖరీదుమనిషి ప్రాణంతో సమానమే అని ఒప్పుకుందాం ***** ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి లక్ష్మీ దేవరాజ్పేరు: లక్షీ దేవరాజ్ వృత్తి: […]

Continue Reading
Posted On :

నడుస్తున్న భారతం (కవిత)

నడుస్తున్న భారతం (కవిత) – వేముగంటి మురళి ముఖానికి మాస్క్దుఃఖానికి లేదుఆకలి ఎండినతీగల్లాంటి పేగుల్నిమెలిపెడుతున్నది ఒంట్లో నగరాల నరాల్లో విచ్చలవిడిగా మండుతున్న భయంపూరిగుడిసెలోచల్లారిన  కట్టెల పొయ్యిఅవయవాలు ముడుచుకొని ఉండడమేపెద్ద శ్రమ  కరెన్సీ వైరస్ ను జోకొట్టలేదుకాలాన్ని వెనకకు తిప్పలేదుప్రజలకు పాలకుల మధ్య డిస్టెన్స్ గీత మాత్రమే గీస్తుంది తిరిగే కాలు మూలకు,ఒర్రే నోరుకు రామాయణ తాళంగదంతా ఆధ్యాత్మిక ధూపదీప యాగంకంట్లో నిండుతున్న విశ్వాసాల పొగలుఎర్రబారిపోయింది పిచ్చి మనసు రోడ్డుమీద ఒక పక్కకు పక్షుల రాకడమరోదిక్కు వలసొచ్చిన మనుషులు పోకడ పిట్టలు ఎగరగలవుకరువు అమాంతం నెత్తిమీద వాలుతుందిభుజం మీద […]

Continue Reading
Posted On :

చైత్రపు అతిథి (కవిత)

చైత్రపు అతిథి (కవిత) – విజయ దుర్గ తాడినాడ కుహు కుహు రాగాల ఓ కోయిలమ్మా! ఎట దాగుంటివి చిరు కూనలమ్మా!! మానుల రెమ్మల దాగితివందున,  కొమ్మలె లేని మానులకు రెమ్మలె కరువాయే !!  కాకులు దూరని కీకారణ్యమునెగిరెదవేమో, మనుషులు తిరిగెడి కాంక్రీటడవులనగుపడవాయే !! చైత్రపు అతిథిగ ఆహ్వానిద్దునా, ఆదరముగ చూత చివురులు సిద్ధమాయే !! గ్రీష్మ తాపపు భగభగలు, చేదువగరుల చిరచిరలు మేమున్నామని గుర్తించమనీ నీ వెంటే ఏతెంచునాయే !! వగరుల చిగురులు తిందువు ‘ఛీ ఛీ’ […]

Continue Reading
Posted On :

మానవాళికి కరోనా వైరస్ ఉత్తరం (అనువాద కవిత)

మానవాళికి కరోనా వైరస్ ఉత్తరం (అనువాద కవిత) ఆంగ్ల మూలం: వివియన్ ఆర్ రీష్  తెలుగుసేత: ఎన్.వేణుగోపాల్    నేలతల్లి నీ చెవిలో గుసగుసలాడింది నువ్వది ఆలకించలేదు  నేలతల్లి పెదవి విప్పి నీకు చెప్పింది నువ్వది వినలేదు నేలతల్లి అరిచి గగ్గోలు పెట్టింది నువు చెవిన పెట్టలేదు అప్పుడు నేను పుట్టాను… నిన్ను శిక్షించడానికి కాదు నిన్ను మేల్కొల్పడానికే నేను పుట్టాను… సాయానికి రమ్మని నేలతల్లి విలపించింది… బీభత్సమైన వరదలు. నువు వినలేదు. మహారణ్య దహనాలు. నువు […]

Continue Reading
Posted On :

ఖాళీ (కవిత)

ఖాళీ (కవిత) – జయశ్రీ మువ్వా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా..? ఏదని చెప్పాలి.. ముగించాలనుకున్నపుడు కామా కోసం వెతకులాట ఎందుకు? చదవబడని పేజీలన్నీ వదిలెళ్ళు నేనూ వదిలేస్తాలే అందమైన కాగితం పడవలుగా – అన్నట్టూ… అద్దాన్ని ఓ సారి తుడుచుకో బొట్టుబిళ్ళలు అంటించిన మరకలుంటాయేమో కన్నీటి చారల మొకాన్ని కడుక్కున్నట్టు  ఫ్రెష్ గా- అవునూ.. ముందు డికాక్షన్ పెట్టుకో చేతికందించే కాఫీ కప్పు టేస్ట్ మారినా, వంటగదిలో గాజుల మెలోడి వినపడ్డా పట్టించుకోకు ఇలాంటివేగా ఎన్ని చెప్పినా… నాకంటూ ఏమి  చెప్పాలని […]

Continue Reading
Posted On :

ఆమె (కవిత)

ఆమె (కవిత) -కె.రూప ఆమెను నేను…… పొదరిల్లు అల్లుకున్న గువ్వ పిట్టను లోగిలిలో ముగ్గుని గడపకు అంటుకున్న పసుపుని వంటింటి మహారాణిని అతిథులకు అమృతవల్లిని పెద్దలు మెచ్చిన అణుకువను మగని చాటు ఇల్లాలుని ఆర్ధిక సలహాదారుని ఆశల సౌధాల సమిధను చిగురించే బాల్యానికి వెలుగురేఖను స్వేచ్ఛనెరుగని స్వాతంత్ర్యాన్ని కనుసైగలోని మర్మాన్ని భావం లేని భాద్యతను విలువ లేని శ్రమను ఆమెను నేను… కల్లోల సంద్రంలో కన్నీటి కడలిగా ఎన్ని కాలాలు మారిన నిలదొక్కుకోవాలనే అలుపెరుగని పోరాటం సమానత్వం […]

Continue Reading
Posted On :

ఈ వనము లో నీకు చోటెందుకు? (కవిత)

ఈ వనము లో నీకు చోటెందుకు? (కవిత) -డా|| మీసాల అప్పలయ్య ఇది జీవన వనం వర్ణాల పరిమళాల రుచుల తాదాత్మ్యాల శిబిరం ఈ రంగుల బొకేలు నాజూకుని తొడుక్కొని  మృదుత్వాన్ని ఊ రేగించుకొంటున్న సీతాకోక చిలుకలు నీ పేలవ బ్రతుక్కి రంగవల్లులు , కానీ ఇవి నీ  కర్కశత్వంలో చెరిగి నలిగిన కళేబరాలు కావచ్చు ! ఆర్ద్రత చిమ్మే ఈ మల్లెలు పరిమళాల తెమ్మెరలు పరామర్శల పరవశాలు, కానీ ఇవి నీ కళింకిత బూటు కాళ్ల […]

Continue Reading

కనక నారాయణీయం-7

కనక నారాయణీయం –7 –పుట్టపర్తి నాగపద్మిని తండ్రిగారు, తన చదువు గురించి పడుతున్న ఆరాటం గమనించాడు తరుణ నారాయణుడు!! ఆంగ్ల సాహిత్య పాఠాల గురించి తెలిసినా, తండ్రి గారి మనసులో, సాంప్రదాయక విద్య    కుమారునికి అబ్బటంలేదనే బాధ ఇంకా ఉండనే ఉంది. దానికి తోడు పిట్ దొరసాని ఆంగ్ల సాహిత్య వ్యవసాయానికి వేసిన కళ్ళెం!! నిజానికి ఆమె అలా అనకుండా ఉండి వుంటే, ఆ రోజుల్లోనే అదే తరహా కృషిని  కొనసాగించి ఉంటే, నారాయణాచార్యులవారు అంతర్జాతీయ […]

Continue Reading

కొత్త అడుగులు-8 (శైలజ బండారి)

కొత్త అడుగులు – 8 శైలజ బండారి – శిలాలోలిత శైలజ బండారి కరీంనగర్ జిల్లా గోదావరి ఖని, 8 ఇంక్లైవ్ కాలనీలో జననం. తండ్రి అక్కపల్లి కొమురయ్య. తల్లి అక్కపల్లి లక్ష్మీకాంత. గోదావరి ఖని, వరంగల్, హైదరాబాద్ లలో  విద్యాభ్యాసం. బిఎస్సీ, బి.యిడి విద్యార్హత. కొన్నాళ్ళు ప్రభుత్వ టీచర్ గా  మెట్ పల్లిలో పనిచేసారు. జీవన సహచరుడు బండారి రాజ్ కుమార్, జనీర్, నిష్ణాత్, విఖ్యాత్ పిల్లలు. ప్రస్తుతం ఉద్యోగరీత్యా యు.ఎ.ఇ లో నివాసం. సోషల్ […]

Continue Reading
Posted On :
Padmaja Kundurti

రామి (క‌థ‌)

 ‘రామి ‘ -పద్మజ కుందుర్తి  పొద్దువాలబోతోంది. వాకిట్లో ఆటో హారన్ విని గబబా సర్దిన సామాన్లన్నీ బైటకు చేర్చారు,  రామీ కుటుంబం. రెండిళ్ళ అవతల ఉన్న రామీ అన్నా వొదినా కూడా ఆటో చప్పుడుకి బైటికివచ్చి తొంగిచూసి తమ సామాన్లు కూడా బైటకి చేర్చటం మొదలు పెట్టారు. మూడునాలుగు బస్తాలలో మూటలు కట్టిన సామానూ ,కర్రల సంచీల్లో కుక్కున బట్టలూ ,ఒక తాళమున్న ట్రంకు పెట్టే ఒక బేగూ ఇవీ సామాను. దాదాపు రామి అన్నాఒదినెల సామాను […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-7 (కిరణ్ బాల)

కొత్త అడుగులు – 7 కిరణ్ బాల స్వాప్నిక దర్శనం -శిలాలోలిత కిరణ్ బాల కలంపేరది. అసలు పేరు ఇందిర. నిజామబాద్ లో అర్గుల్ లో టీచర్ గా పనిచేస్తున్నారు. నా కలల ప్రపంచంలో అనే కవితా సంపుటిని వెలువరించింది. 2011 లో ఒక కథా సంపుటి, నాటికల సంపుటి కూడా వేసింది. ‘కిరణ్ బాల’ స్వాప్నిక దర్శనం నిజామాబాద్ లో చాన్నాళ్ళక్రితం అమృత లత గారి పిలుపు మేరకు మీటింగ్ కి వెళ్ళాను. అక్కడ కవిత్వం […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- మార్చి , 2020

“నెచ్చెలి”మాట  “అందానికి నిర్వచనం” -డా|| కె.గీత  అందానికి మగవారి నిర్వచనం “స్త్రీ” (ఠక్కున చెప్తారు!) నిజమా! అందం చూసే వారి కళ్ళని బట్టి ఉంటుంది  మరి మగవారి సంగతి ఏవిటి అంటారా?! అన్నట్టు పాపం  ఈ మధ్య ఓ హీరోయిన్ మగవాడి అందమ్మీద ఒక్క పాటా లేదేవిటి అని ఒక పాటలో వాపోతుంది! సర్లేవమ్మా ! అది ఆ పాట రచయితకి, దర్శకుడికి ఉన్న బాధన్నమాట అంటారా?! ముఖారవింద సొగసుదనమే అందమైతే-  అసలు అందంగా ఉండడానికి  ఏం […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-6

కనక నారాయణీయం -6 –పుట్టపర్తి నాగపద్మిని ఎవరికొరకూ ఆగని కాలం, పరుగులు పెడుతూనే ఉంది. ఈ లోగా మెట్రిక్ పరీక్షలొచ్చాయి. లెక్కలంటే ఇప్పటి తరుణ నారాయణునికి సిం హ స్వప్నమే!! అందువల్ల మెట్రిక్ లో లెక్కల్లో తప్పారు. పరీక్ష తప్పినందుకు అయ్యగారి నుండీ దండన బాగానే అందింది. కారణం, ‘నాట్యమూ, సంగీతాభ్యాసం తో పాటూ, ఆకతాయి పనుల బదులు గణితాభ్యాసం చేసి ఉంటే, మెట్రిక్ గట్టెక్కి ఉండేవాడివి కదా!!’ అని వారి వాదన. కానీ..గణితమంటే, భూతం లాగే […]

Continue Reading

కొత్త అడుగులు – 6 (రాజేశ్వరి)

కొత్త అడుగులు – 6 ఒంటరి నక్షత్రం – రాజేశ్వరి  -శిలాలోలిత సిరిసిల్ల రాజేశ్వరి కవిత్వంలో అందర్నీ ఆకర్షించింది. సిరిసిల్ల ఊరిపేరే ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. చేతులు పనిచేయని ఈమె కాలి బొటనివేలుతో కవిత్వం రాస్తోంది. అది తెలిసిన సుద్దాల అశోక్ తేజ గారు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి, 2014 సంవత్సరానికి గాను, సుద్దాల ఫౌండేషన్ పురష్కారానికి ఎంపిక చేసి సత్కరించారు. ఆమెలోని ఆత్మవిశ్వాసానికి జీవన పోరాట పరిమకు గుర్తింపుగ పుస్తక రూపంలో సుద్దాల హనుమంతు జానకమ్మ […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- ఫిబ్రవరి, 2020

“నెచ్చెలి”మాట  “విలువైనదేది?” -డా|| కె.గీత    ఈ ప్రపంచంలోకెల్లా అన్నిటికన్నా విలువైనదేది? కొత్తగా కొనుక్కున్న రవ్వల నెక్లెసు..  మాంఛి బిజీ సెంటర్లో మూడంతస్తుల బంగాళా..   ఎన్నాళ్లుగానో కలలుగన్న లగ్జరీ కారు..  కాకుండా మరో మాట చెప్పండి- అయినా విలువైనదేదంటే ఠకీమని  చెప్పెయ్యడానికి అందరికీ ఒక్కటే ఉండదు కదా!  మనిషిని బట్టి, దక్కని లిస్టుని బట్టి ఒక్కొక్కరికి ఒక్కోటి మారుతూ ఉంటుంది. కడుపుకి పట్టెడన్నం లేక మట్టి తిని మరణించిన చిన్నారులున్న దౌర్భాగ్యపు ప్రపంచం మనది!  ఆ చిన్ని […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-5

కనక నారాయణీయం-5 -పుట్టపర్తి నాగపద్మిని ఆమె : ఎవరు నాయనా  నువ్వు? బాల: మునిసిపల్ పాఠశాల తెలుగు పండితులు పుట్టపర్తి తిరుమల శ్రీనివాసాచార్యులవారి కుమారుణ్ణి. అమె: శ్రీవైష్ణవులన్నమాట!! నీ పేరు? బాల: పుట్టపర్తి తిరుమల నారాయణాచార్యులు. ఆమె : నాట్యం నచ్చిందా? బాల: బాగా..!! ఆమె: నేర్చుకుంటావా?? బాల: నేర్పిస్తే…!! ఆమె: మీ తండ్రిగారి అనుమతిస్తారా?? బాల: నేనే అడుగుతాను!! ఆమె : అలాగైతే..రేపటినుంచే రా మరి!! ఇంకేముంది?? మా అయ్య గారి జీవితంలో మరో  కొత్త […]

Continue Reading

రోడ్డు రోలరు (హాస్య కథ)

రోడ్డు రోలరు – టి.వి.ఎస్.రామానుజ రావు ఇంట్లో మా ఆవిడ లేదు. వాళ్ళ చెల్లెల్ని చూసోస్తానని పొద్దున్నే ఉప్పల్ వెళ్ళింది. ఏదో అన్నం, కాస్తంత పప్పు వుడ కేసుకుని భోజనం కానిచ్చాను. కాసేపు నడుం వాల్చి లేచేసరికి, సాయంత్రం నాలుగయ్యింది. కాస్త టీ పెట్టుకుని తాగి, అలా నాప్రెండు సుబ్బు గాడింటికి  వెళ్ళి వద్దామని ఇంటికి తాళం పెట్టి బయల్దేరాను. ఇంతలో సెల్ ఫోను ఇంట్లో వదిలేశానన్న సంగతి గుర్తుకొచ్చింది. మా ఆవిడ ఫోను చేసినప్పుడు తియ్యకపోతే, […]

Continue Reading

వారు వీరయితే !(క‌థ‌)

వారు వీరయితే  -వాత్సల్యా రావు “అబ్బా, నీలూ, రోజూ పొద్దున్నే పిల్లల మీద విసుక్కోకపోతే మెల్లిగా చెప్పలేవా?”, విసుగ్గా అరిచి దుప్పటీ పైకిలాక్కుని  పడుకున్నాడు ఆనంద్.ఆ అరుపు అప్పుడే మూడో కూత పెట్టిన కుక్కర్ శబ్దం తో కలిసిపోవడంతో ఆరోజుకి పెద్ద యుద్ధం తప్పింది వాళ్ళింట్లో. “ఏమిటో, నాకు వయసు మీద పడుతోందో, ఈ పిల్లలు రాక్షసులో అర్ధం కావట్లేదు, అస్సలు లేచి తెమలరు పొద్దున్నే…” నిన్న కిందనుండి  ఆటో వాడి అరుపులు, హారన్ గుర్తొచ్చి చంటాడికి […]

Continue Reading
Posted On :

నిర్భయ నుంచి దిశ దాకా

నిర్భయ నుంచి దిశ దాకా –సి.వనజ  అత్యాచారాల గురించి మరొకసారి దేశవ్యాప్త చర్చకు దారితీసిన దిశపై అత్యాచారం, నిందితుల బూటకపు ఎన్ కౌంటర్ నేపథ్యంలో అత్యాచార సంస్కృతి అసలు మూలాల గురించి విశ్లేషిస్తున్నారు సి వనజ- *** నిర్భయకి ముందు కానీ ఆ తరవాత కానీ భారత దేశంలో ఇటువంటి దారుణాలు జరగలేదని కాదు గాని ఈ రెండు సంఘటనలకి ఒక ప్రాధాన్యత ఉంది. హక్కులే కాదు బాధ్యతలు కూడా చెప్పకుండా పెంచిన, సహకారం బదులుగా పోటీ, […]

Continue Reading
Posted On :

మా అమ్మ

శ్రీమతి కె. వరలక్ష్మి అజో-విభో కందాళం విశిష్ట సాహితీ మూర్తి జీవిత కాల సాధన పురస్కారం జనవరి 6, 2020న బాపట్లలో అందుకున్న సందర్భంగా – అమ్మ గురించి వారి ముగ్గురు పిల్లల ఆంతరంగ వచనాలు మా అమ్మంటే- -కె. రవీంద్ర మా అమ్మ… మమతకు మారుపేరు అనురాగానికి అర్థం ఆప్యాయానికి అలవాలం త్యాగానికి ప్రతిరూపం నిస్వార్ధ ప్రేమకు నిలువుటద్దం మా అభివృద్ధికి బంగారు బాటలు వేసింది మా ఆశలకు ఆయువు నింపింది మా ఊహలకు ఊపిరి […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-4

కనక నారాయణీయం -4 -పుట్టపర్తి నాగపద్మిని    నా చిన్నప్పటి నుండీ కథలు కథలుగా విన్న మా అయ్యగారి జీవన నేపథ్యం చెబుతున్నాను కదా!! ‘అననగననగ  రాగ మతిశయిల్లుచునుండు.’ .అన్నట్టు, యీ కథలు ఎప్పటికప్పుడు శ్రవణ పేయాలే మా కుటుంబానికంతా!! ఇంతకూ, యెక్కడున్నాం??            అయ్యగారి బాల్య క్రీడల్లో వారికి తోడు, సమ వయస్కులైన పాముదుర్తి నారాయణ, హెచ్.ఎస్.నారాయణ, వానవెల్లి నారాయణలు!! వీళ్ళను దుష్ట చతుష్టయమనేవాళ్ళట, ఇరుగుపొరుగుల వాళ్ళు!!      పెనుగొండ కొండలలో కొండ చిలువలూ, నెమళ్ళూ […]

Continue Reading

సంపాదకీయం- జనవరి, 2020

“నెచ్చెలి”మాట  “ట్వంటీట్వంటీ” -డా|| కె.గీత  ఓహోయ్ కొత్తసంత్సరం! అంతేకాదు స్పెషల్ వత్సరం! “ట్వంటీట్వంటీ” “రెండువేలాఇరవై” “రెండుసున్నారెండుసున్నా”  ఏవిటో స్పెషల్? అదేనండీ ఈ సంఖ్యతో చిన్న తిరకాసుంది! మాములుగా తారీఖు వెయ్యాల్సొస్తే సంత్సరంలో చివరి రెండంకెలు రాయడం రివాజు కదా! లేదా మనకు నాలుగంకెలు రాయడం బద్ధకం కదా!! ఇక “ట్వంటీట్వంటీ” లో బద్ధకానికి  సెలవు చెప్పాల్సిన సమయం వచ్చింది! “ఏవిటీ ఈవిడ చెప్తే నేను చేసెయ్యలా?” “రెండంకెలు రాస్తే వచ్చే నష్టమేమిటో!” “అబ్బా, నాకు బద్ధకానికే బద్ధకం […]

Continue Reading
Posted On :

 కొత్త అడుగులు-5 (దారిలో లాంతరు)

కొత్త అడుగులు-5 దారిలో లాంతరు – శిలాలోలిత అనగనగా ఓ రక్షితసుమ. ఆ పాపకు పదమూడేళ్ళు. కవిత్వమంటే ఇష్టం. రక్షితసుమ అమ్మ పేరు లక్ష్మి డిగ్రీ చదివేరోజుల్లో హైకూ కవిత్వం రాసేవారు. నాన్న పేరు కట్టా శ్రీనివాస్, కవి, ‘మూడుబిందువులు’, ‘మట్టివేళ్ళు’ కవితా సంపుటులతో సాహిత్య ప్రపంచంలో తనదైన స్థానాన్ని స్థిరపరచుకున్న వ్యక్తి. వీళ్ళిద్దరి సాహిత్య వారసత్వ సంపదను రక్షిత కైవసం చేసుకుంది. నానమ్మ కట్టా లీలావతి చెప్పే కథలతో మౌఖిక సంపదనూ సమకూర్చుకుంది. ఇదీ క్లుప్తంగా […]

Continue Reading
Posted On :

మానవ సంబంధాలకు తాత్త్విక రూపం – కె. వరలక్ష్మి కవిత్వం

శ్రీమతి కె. వరలక్ష్మి అజో-విభో కందాళం విశిష్ట సాహితీ మూర్తి జీవిత కాల సాధన పురస్కారం జనవరి 6, 2020న బాపట్లలో అందుకున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం- మానవ సంబంధాలకు తాత్త్విక రూపం – కె. వరలక్ష్మి కవిత్వం  -కొండేపూడి నిర్మల ప్రధానంగా నేను కె. వరలక్ష్మి కధలకు  అభిమాన పాఠకురాలిని. ఆమె వేళ్ళు కధలోనే ఎక్కువ దూరం వెళ్ళాయి. వరలక్ష్మి నిర్లక్ష్యం చేసిన ఇంకో మొక్క ఆమె కవిత్వం . సరే ప్రక్రియ ఏమయినా ఒక […]

Continue Reading

“వాసా ప్రభావతి స్మృతిలో- నేనెరిగిన వాసా ప్రభావతి “

నేనెరిగిన వాసా ప్రభావతి  -గణేశ్వరరావు  మా కుటుంబానికి ఎంతో ఆత్మీయురాలు, ప్రముఖ రచయిత్రి, సాహితీవేత్త  వాసా ప్రభావతి 2019, డిసెంబర్ 18వ తేదీ ఉదయం హైదరాబాదులో మరణించారు. ఆమె   మరణం దారుణంగా మమ్మల్ని బాధిస్తోంది.’80 వ దశకంలో ఢిల్లీ కందుకూరి మహాలక్ష్మి ఇంట్లో వారితో అయిన  పరిచయం అయింది ఇటీవల దాకా కొనసాగుతూ వచ్చింది. మా ఢిల్లీ తెలుగు అకాడమీ వారిని ఉత్తమ సాహితీవేత్త అవార్డ్ నిచ్చి  సత్కరించింది. తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ రచయిత్రి […]

Continue Reading
Posted On :

తమసోమా జ్యోతిర్గమయ!(క‌థ‌)

తమసోమా జ్యోతిర్గమయ ! -విజయ తాడినాడ  “బావా! ఒకసారి రాగలవా?”  ఉలిక్కిపడ్డాను ఆ మెసేజ్ చూసి. త్రిపుర నుంచి వచ్చింది అది. అదీ చాలా రోజుల తర్వాత. ‘ఏమై ఉంటుంది?’ అంతుచిక్కని ఆలోచన …వెంటనే రామశాస్త్రి బాబాయ్ మొన్న కలెక్టర్ ఆఫీసు లో కనబడ్డప్పుడు అన్న మాటలు గుర్తొచ్చాయి. “ఏంటో రా మాధవా, మీ మావయ్య నాల్రోజుల నుండి గుడికేసి రావటమే లేదు. చూడడానికి ఎప్పుడు వెళ్ళినా నిద్రపోతూ కనిపిస్తున్నాడు. ఒంట్లో ఏమన్నా నలతగా ఉందో ఏమో. […]

Continue Reading
Posted On :
Padmaja Kundurti

జెండర్ (క‌థ‌)

జెండర్(క‌థ‌) పద్మజ.కె.ఎస్    ఆ పద్మవ్యూహం నించైనా తప్పుకోవచ్చు గానీ హైదరాబాద్ ట్రాఫిక్ నుంచి బయటపడటం చాలాకష్టం. ఓ పక్క బస్ కి టైం అవుతొంది. పదిగంటలకే బస్. రాత్రిపూట బయలుదేరేవి ,అందులో కూకట్ పల్లినుంచి బయలుదేరేవి సరిగ్గా సమయానికే బయల్దేరతాయి. అసలే సంక్రాంతి రోజులు. …ఇంకో వారంలో పండగ. బస్సుల్లో రిజర్వేషన్ దొరకటమే కష్టంగా ఉంది. ఎలాగోలా సూపర్ లగ్జరీ లో దొరికింది సీటు. వెళ్ళకుండా ఆగిపోదమన్నా పండగ రోజులు. ప్రయాణం తప్పనిసరి ..అందుకని చలిరోజులే […]

Continue Reading
Posted On :

 కొత్త అడుగులు-4 (రమాదేవి బాలబోయిన)

 కొత్త అడుగులు-4 ఆత్మగల్ల కవిత్వం – డా|| శిలాలోలిత రమాదేవి బాలబోయిన ఈతరం కవయిత్రి. తెలంగాణ సాధించుకున్న తర్వాత కవిత్వరంగంలో ఎందరెందరో వెలికివస్తున్న కాలంలో ఎన్నదగిన కవయిత్రి ఈమె. వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలైనప్పటికీ, ప్రవృత్తిరీత్యా కవయిత్రి. సామాజిక కార్యకర్త. ‘సాంత్వన’ అనే సేవా సంస్థను నడుపుతున్నారు. చాలా మందికి బాసటగా, ఊరటగా నిలబడ్డారు. తనవంతు సాయం అందించడమనేది మనిషిగా తన కర్తవ్యం అని భావించే వ్యక్తి. రాష్ట్ర నలుమూలలలో తననెరిగిన వారందరూ ఆమెను గౌరవించిన తీరులో ఆమె […]

Continue Reading
Posted On :

వీక్షణం- 87

వీక్షణం- 87 -రూపారాణి బుస్సా వీక్షణం 87 వ సమావేశం కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ లో నవంబరు 10 వ తేదీన జరిగింది. ఈ సమావేశానికి శ్రీమతి శారదా కాశీవఝల అధ్యక్షత వహించారు.  ముందుగా  బలివాడ కాంతారావుగారి కథ “అరచేయి” కథ గురించి చర్చ జరిగింది.  అక్కిరాజు రమాపతిరావుగారు కాంతారావు గారి స్నేహితులు. ఆయనను దగ్గరగా చూసిన వ్యక్తి గా కాంతారావు గారి గురించి కొన్ని  జ్ఞాపకాలు పంచుకున్నారు.   కాంతారావు గారు సత్యము పలుకు వారు, బంగారం వంటి […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-డిసెంబర్, 2019

“నెచ్చెలి”మాట “క్లిష్టాతిక్లిష్టమైనదేది?” -డా|| కె.గీత    అన్నిటికన్నా కష్టమైనదీ, క్లిష్టమైనదీ, సంక్లిష్టమైనది ఏది? ఆగండాగండి!  ఇదేదో ధర్మసందేహంలా  ఉందా?  అవును, పక్కా గసుంటి సందేహమే!  సరే ప్రశ్నలో కొద్దాం.   ఈ ప్రశ్నకి సమాధానం “పూర్తిగా వైయక్తికమూ, సందేహమూను” అని దాటవేయకుండా ఆలోచిస్తే   ఆ… తట్టింది.  “కాలిఫోర్నియాలో రోజల్లా కరెంటు పోవడం!”  చాల్లేమ్మా చెప్పొచ్చేవు, వేసవి మొత్తం కరెంటన్నదే ఎరగం మా “సౌభాగ్య వంత”మైన పల్లెటూళ్లో అనుకుంటున్నారా?  కాలిఫోర్నియా లోనే  కాదు అసలు ఇప్పటిరోజుల్లో కరెంటు పోవడమంటే నిత్యజీవితం […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-3

కనక నారాయణీయం-3 -పుట్టపర్తి నాగపద్మిని అలా, ఎన్నెన్నో నా పుణ్యాల ఫలంగా, విజయ నామ సంవత్సరం (1953), ఆషాఢ శుద్ధ అష్టమి, (రేపు అష్టమి అనగా) ఆదివారం తెల్లవారుఝామున 3.10 నిముషాలకు, నేను కడపలో మా అమ్మ,అయ్యల సంతానంగా పుట్టగలిగాను. (ఈ విషయం  అయ్యగారి వ్రాతలోనే చూసినప్పుడు, ఎంత ఉద్వేగానికి గురయ్యానో తెలుసా?) హమ్మయ్య…నా పేరు వెనుక నేపథ్యం అదండీ!! ఆ మాట కొస్తే, మా తోబుట్టువుల పేర్లకూ ఒక్కొక్క నేపథ్యం ఉంది.   మామూలుగా, పిల్లలకు […]

Continue Reading

సంపాదకీయం-నవంబర్, 2019

“నెచ్చెలి”మాట  “స్వీయ క్రమశిక్షణ” అను “సెల్ఫ్ డిసిప్లిన్” -డా|| కె.గీత  “క్రమశిక్షణ” అనగా నేమి? “డిసిప్లిన్” “డిసిప్లిన్” అనగానేమి? “క్రమశిక్షణ” …. ఇదేదో పిల్లి అనగా మార్జాలం కథ లాగో;  కన్యాశుల్కం లో గిరీశం, వెంకటేశాల సంభాషణ లాగో ఉందా? సరిగ్గా అదే నాకూ అలాగే అనిపించింది సుమండీ! ఎప్పట్నుంచో “క్రమశిక్షణ” అనగానేమో వెతుక్కుంటూ వెళ్లగా వెళ్లగా తెలిసిందేమంటే చిన్నప్పట్నుంచి “క్రమశిక్షణ” గా పెరిగి పెద్దవ్వడం అన్నమాట! హమ్మయ్య “క్రమశిక్షణ” అంటే ఏవిటో తెలిసిపోయింది కదా! ఇక […]

Continue Reading
Posted On :

దీపావళి మ్యూజింగ్స్

దీపావళి మ్యూజింగ్స్  -పద్మా మీనాక్షి  అమావాస్య రాతిరిలో ఆకాశం అలిగి చీకటి చీరని చుట్టేస్తే… జాబిలమ్మ నే కనిపించనంటూ గారాలు పొతే.. వెలుగుల దీప మాలలతో నీ అలక తీర్చడానికి భువి పడే తపనే ఈ దీపావళి ఏమో! ఎంతైనా ఎన్ని లక్షల దీపాలు వెలిగించినా, విద్యుత్ దీపాలు పెట్టినా నీ ప్రియ నేస్తం చంద్రుని వెలుగుతో, తారల కాంతితో పోటీ పడగలమా? ఏటా వచ్చే పండగేగా…ఎందుకంత సంబరం? ఏమో! ఎపుడూ ఒక్క బాణాసంచా కాల్చినది లేదు…మహా […]

Continue Reading
Posted On :

పరస్థాన శయన పురాణము (గల్పిక)

పరస్థాన శయన పురాణము (గల్పిక)  -జోగారావు  నేను ఈ మధ్య రజత గ్రీన్స్ ఎపార్ట్ మెంట్స్ లో ఉంటున్న మా మేనకోడలు విజయ ఇంటికి వెళ్ళేను. ఆ రోజు శని వారం. అప్పుడు సాయంత్రము ఆరు గంటలు. వారి పదేళ్ళ శుభ ఒక సంచీతో లోపల గదిలో నుంచి వస్తూ నన్ను చూసి హల్లో అని పలకరించింది. శుభ వెనుకనే మరో పదేళ్ళ అమ్మాయి వచ్చింది. పేరు విభ . “ బాగున్నాయి పేర్లు. “ అన్నాను. […]

Continue Reading
Posted On :
atluri

జీవితమే సఫలమా! (క‌థ‌)

జీవితమే సఫలమా! -అత్తలూరి విజయలక్ష్మి “ఇవాళ గోంగూర పప్పు చేయండి..” కాగితాలలోంచి తలెత్తకుండా చెప్పింది సుబ్బు అని ముద్దుగా పిలవబడే సుబ్బలక్ష్మి.  ఆకుకూరల వాడి అరుపుతో వీధిలోకి వెళ్ళబోతున్న బాలకృష్ణ  మండిపడుతూ చూసాడు భార్యవైపు.  ఇది పెళ్ళామా! చచ్చి తనమీద పగ సాధించడానికి పిశాచిలా వచ్చిన ఆత్మా! కసిగా అనుకుంటూ విస, విసా వెళ్లి నాలుగు గోంగూర కట్టలు, నాలుగు పాలకూర కట్టలు, నాలుగు తోటకూర కట్టలు తెచ్చాడు. అన్నీ కలిపి ఓ బోకే లాగా పట్టుకుని […]

Continue Reading

 కొత్త అడుగులు-3 (వెలుగుతున్న మొక్క నస్రీన్‌)

 కొత్త అడుగులు-3 వెలుగుతున్న మొక్క నస్రీన్‌  -శిలాలోలిత               తెలంగాణా మట్టిని తొలుచుకుని వచ్చిన మరో స్వప్న ఫలకం నస్రీన్‌. ఒక జర్నలిస్టుగా తాను చూసిన జీవితంలోంచి, ఒక ‘పరీ’ కన్న కలే ఆమె కవిత్వం. ఆమె రాసిన ‘అంధేరా’ కవితను చదివి నేను పెట్టిన కామెంట్‌ గుర్తొస్తోంది. ‘పరీ’(దేవత)… ‘ఓ నా దేవతా! మొలిచిన రెక్కలు జాగ్రత్త’ అని. నస్రీన్‌ జర్నలిస్ట్‌గా ఎదిగిన క్రమంలో జీవితాన్ని అతి […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-2

కనక నారాయణీయం -2 -పుట్టపర్తి నాగపద్మిని    “ఒక్కసారిక్కడికి రాండి..మందాసనం కింద ఏదో శబ్దమౌతూంది..’     “ఆ…ఏ ఎలకో తిరుగుతుంటుందిలే..”    భర్త మాటకు కాస్త ధైర్యం వచ్చింది. మళ్ళీ….పని!!    కానీ మందాసనం కింద అలికిడే కాక, అక్కడున్న దీపపు సెమ్మెలు కూడా కింద పడ్డాయీసారి!!     ఆ ఇల్లాలిక చేస్తున్న పని ఆపి.. మెల్లిగా లేచి, తాను దగ్గరుంచుకున్న లాంతరును తీసుకుని..మందాసనం దగ్గరికి చేరుకుంది. మెల్లిగా ఆయాస పడుతూ, మందాసనం దగ్గరికి చేరుకుని, చేతిలోని లాంతరును మందాసనం కిందకి వెలుగు […]

Continue Reading

సంపాదకీయం-అక్టోబర్, 2019

“నెచ్చెలి”మాట  “దుఃఖాన్ని జయించడం ఎలా?” -డా|| కె.గీత  “దుఃఖాన్ని జయించడం ఎలా?”  అన్న అన్వేషణతోనే గౌతముడు బుద్ధుడయ్యాడు. ఇక మనమెంత! “దుఃఖానికి మూలం కోరికలు. కాబట్టి  కోరికల్ని జయించాలి” వినడం ఎంత సులభమో ఆచరణ అంత కష్టాతికష్టమైన ఇటువంటి గంభీరమైన జీవితసత్యాల వరకూ వద్దు గానీ ఒక చిన్న చిట్కా ఉంది. చిట్కా అంటే అల్లం, నిమ్మరసం గోరువెచ్చటి నీట్లో కలుపుకు తాగడం అనుకునేరు! అబ్బే అందువల్ల ఉపశమించేంత  సులభమైంది కాదు దుఃఖం. అబ్బా ఈ దుఃఖోపశమన మంత్రం […]

Continue Reading
Posted On :

సోమరాజు సుశీల స్మృతిలో: ఇల్లేరమ్మకు నివాళి

సోమరాజు సుశీల స్మృతిలో –  ఇల్లేరమ్మకు నివాళి    -తమిరిశ జానకి  స్నేహసుగంధ పరిమళం….నిష్కల్మష హృదయం…..నవనీత సమాన మానసం చతురోక్తుల పలుకుల సంబరం కలగలిసి రూపుదిద్దుకున్న స్వరూపమే మాఇల్లేరమ్మ శ్రీమతి సోమరాజు సుశీలగారు. 1945లో తూర్పుగోదావరిజిల్లా సిద్ధాంతంలో జన్మంచిన సుశీలగారికి 1966 లో వివాహమయినది. అప్పటికి ఆవిడ ఎమ్.ఎస్.సి. పట్టా పుచ్చుకున్నారు. కొన్నాళ్ళు విజయవాడ మేరీస్టెల్లా కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేశారు. ఆతర్వాత శ్రీవారితో కలిసి పూనేలో ఉన్నప్పుడు అక్కడి నేషనల్ కెమికల్ లేబొరేటరీలో సైంటిస్ట్ గా చేశారు. డాక్టరేట్ […]

Continue Reading
Posted On :

 కొత్త అడుగులు-2 (సుభాషిణి తోట)

 కొత్త అడుగులు-2 కొత్తతరపు చిక్కని కవిత్వస్వరం సుభాషిణి !  –శిలాలోలిత ఇటీవలి కాలంలో కవిత్వం రాస్తున్న కవయిత్రులలో చిక్కని కవిత్వం రాసే శక్తి సుభాషిణికి ఉంది. కొన్ని సంవత్సరాలుగా కవిసంగమంలో రాస్తున్న ఆమె కవిత్వం ఏవిధంగా మార్పుకు గురవుతూ, పరిణతి చెందుతూ వచ్చిందో గమనించే అవకాశమూ నాకు కలిగింది. అందుకే ఈ కవయిత్రి మీద  ప్రత్యేకాభిమానం. అధ్యయనం, జీవితం మీద, కవిత్వం పట్ల ఉన్న మక్కువా ఆ మూడింటినీ కలిపి కవిత్వాన్ని చేస్తున్న తీరూ సుభాషిణిని ఈ […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-1

  కనక నారాయణీయం-1     –పుట్టపర్తి నాగపద్మిని  కథలు వినటంలోని ఆనందాన్ని ఆస్వాదించటం మా  అమ్మమ్మ శ్రీమతి శేషమ్మ గారి ద్వారా మొదలైందన్నాను కదా!! అసలు నా పుట్టుక వెనుక కూడా ఓ ఉత్కంఠభరితమైన ఉదంతముందని అమ్మమ్మే చెబుతుంటే………వినటం…ఒక మహత్తరానుభూతి నాకైతే!! అదేమిటో మీరూ ఆలకించండి…కాస్త ఉపోద్ఘాతం తరువాత!! ప్రొద్దుటూరినుండీ..కడపకు వలస వచ్చేసిన కారణం, ఇక్కడి మోచంపేటలో శ్రీ రామకృష్ణా హైస్కూల్ లో తెలుగు పండితుడిగా అయ్యకు ఉద్యోగం రావటం. జీతం అప్పట్లో తక్కువే, పైగా తెలుగు పండితుడికి కాబట్టి, […]

Continue Reading

గద్వాల రాజసం… రాచరీకము

గద్వాల రాజసం… రాచరీకము -విశాలి పేరి గద్వాల్…  ఈ పేరు వినగానే మనకు మొదట గుర్తుకొచ్చేది చీరలు, ఆ తరవాత ఈ మద్యన వచ్చిన అరుందతి సినిమా!  కానీ ఆ గద్వాల… అంటే విద్వద్ గద్వాల అని సాహీతీ సుమాల మాల అని పట్టుచీరల జరీ రెపరెపల… కృష్ణమ్మ పరవళ్ళ గలగలల గద్వాల్ అని మీకు తెలుసా? (ఎంత మందికి తెలుసు..?) చరిత్ర : ఈ గద్వాల చరిత్ర ఒకసారి తెలుసుకుందాము. గద్వాల సంస్థానము తుంగభద్ర మరియు […]

Continue Reading
Posted On :

కశ్మీరీ పండితులు భారత్ చేతి ఆయుధాలు కావద్దు

కశ్మీరీ పండితులు భారత్ చేతి ఆయుధాలు కావద్దు –ఎన్. వేణుగోపాల్  స్వయంగా కశ్మీరీ పండిత కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కశ్మీరియత్, మానవత్వం, ప్రజాస్వామ్యం ప్రాతిపదికగా కశ్మీరీలకు వర్తమాన విషాదం నుంచి బైటపడే మార్గం సూచిస్తున్నారు నిశితా త్రిసాల్ ఈ నెల భారత ప్రభుత్వం ఏకపక్షంగా కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసింది. కశ్మీర్ వివాదానికి శాంతియుత, ప్రజాస్వామ్యయుత పరిష్కారం కనుగొనాలంటూ ఐక్యరాజ్య సమితి భద్రతామండలి చేసిన ఎన్నో తీర్మానాలను ఉల్లంఘిస్తూ జరిగిన చర్య ఇది. కశ్మీరీ ముస్లింల […]

Continue Reading
Posted On :

బుడుగూ – వినాయక చవితీ 

బుడుగూ – వినాయక చవితీ                                                     —  రామ్ ఎమ్వీయస్  వినాయక చవితి అంటేనే  చిన్న పిల్లల పండగ .  అస్సలు మనం చేసే అల్లరికే – కుంచెం మంచి పేర్లు పెట్టి – ఇది సంపరదాయం అనేస్తారు పెద్దాళ్ళు  .  మనం  చెట్లు ఎక్కి ఆకులు కోసేస్తే ” అల్లరి  చేయొద్దన్నానా ” అంటారా .  వినాయకచవితి రాగానే  “బాబాయి తో వెళ్లి  పత్రి కోసుకురామ్మా బుడుగూ” అనేస్తారు  !! నేను గోడల మీద చాక్పీసు తోనో , బొగ్గు తోనో గీస్తే – […]

Continue Reading
Posted On :

‘ప్రజ్వలిత’ అవార్డ్ గ్రహీత -సి.మృణాళిని 

‘ప్రజ్వలిత’ అవార్డ్ ‘సి.మృణాళిని’ గార్కి వచ్చిన సందర్భంలో…. -డా. శిలాలోలిత మృణాళిని కేవలం ఒక వ్యక్తి కాదు. ఒక సమూహం. ఒక శక్తి. బహుముఖ ప్రజ్ఞ ఆమె సొతుత. ఇప్పటి వరకు ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ‘బెస్ట్ టీచర్ అవార్డ్’, ‘గృహలక్ష్మి స్వర్ణకంకణ అవార్డ్ (2007) తెలుగు యూనివర్సిటీ వాళ్ళిచ్చే అబ్బూరి ఛాయాదేవి అవార్డ్, వాసిరెడ్డి సీతాదేవి అవార్డ్, తురగా జానకీరాణి అవార్డ్, యద్దనపూడి సులోచనారాణి అవార్డ్, బెస్ట్ ట్రాన్స్ లేటర్ అవార్డ్ (మాల్గుడి డేస్కి), […]

Continue Reading
Posted On :

రేప‌టి టీచ‌ర్లు (క‌థ‌)

రేప‌టి టీచ‌ర్లు (క‌థ‌) – జగద్ధాత్రి ‘గుడ్‌ మార్నింగ్‌ మేడమ్‌!’ రిజిస్టర్‌లో సంతకం చేసి తలెత్తి చూశాను. మా స్టూడెంట్‌. అంటే పాడేరు నుంచి వచ్చిన ట్రైబల్‌ స్టూడెంట్‌. మా బిఎడ్‌ కాలేజీకి కొంత గిరిజనుల కోటా ఉంటుంది, అందులో వచ్చిన బ్యాచ్‌లో స్టూడెంట్‌ ఈ అబ్బాయి. నా ఇంగ్లీష్‌ మెథడాలజీనే. వీరికి సరైన అవకాశాలు కల్పించి బి.ఎడ్‌ డిగ్రీ అందిస్తే.., ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. వారి గూడేలు బాగుపడతాయి. వారిని చూసి మరికొందరు చదివేందుకు ముందుకొస్తారు. […]

Continue Reading
Posted On :

ముసలివాడు-సీతాకోక చిలుక(కవిత)

ముసలి వాడు-సీతాకోక చిలుక(కవిత)              – పాలపర్తి ఇంద్రాణి ముసలి వాడొకడు వణుకుతున్న చేతులతో  గాజు జాడీ పైన రంగురంగు పూలు చిత్రించినాడు.  పుట్ట తేనె తీసుకుని అక్కడక్కడ చిలకరించినాడు.   రంగు పూల గాజు జాడీని తన తోటలోన ఉంచినాడు. సీతాకోక చిలకలకై వేచి చూస్తూ నిలచినాడు.   ముసిలివాడు ఒకప్పుడు సీతాకోకల వేటగాడు.  కానీ ఇప్పుడు సత్తువ ఉడిగి అలసినాడు.  పరుగెత్తలేక ఆగినాడు.    తనంత తానుగా సీతాకోక చిలుక వచ్చి వాలేలా  ఉచ్చులల్లి పెట్టడం ఆరంభించి ఆరితేరినాడు.  […]

Continue Reading

 కొత్త అడుగులు-1 (కందిమళ్ళ లక్ష్మి)

 కొత్త అడుగులు-1  –శిలాలోలిత ఇప్పుడిప్పుడే రాస్తున్న కొత్తకవయిత్రులను పరిచయం చేయాలన్న నా ఆలోచనకు రూపకల్పనే ఈ కాలమ్. ఇటీవల కాలంలో స్త్రీల రచనల సంఖ్య బాగా పెరిగింది. యం.ఫిల్, పీహెచ్.డి లను నేను కవయిత్రుల మీదే పరిశోధనను ఇష్టంగా చేశాను. స్త్రీలపై వారి రచనలపై అనేక వ్యాసాలు, ముందు మాటలు, ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నాను. నాకు తృప్తిని కలిగించే విషయాలివి. ‘నారి సారించి’ పేరుతో విమర్శా వ్యాసాల పుస్తకం వేశాను. రీసెర్చ్ గ్రంధరూపంలో వచ్చాక ‘కవయిత్రుల కవిత్వంలో […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం

కనక నారాయణీయం -పుట్టపర్తి నాగపద్మిని  ”అనగనగనగా…….చీమలు దూరని చిట్టడవి…కాకులు దూరని కారడవి…అందులో…” ఊపిరి బిగబట్టుకుని వినే చిన్నారి కళ్ళల్లో…ఒకటే ఉత్కంఠ!! ఆ చీమలు దూరని చిట్టడవిలో…ఏముందో, ఎటువంటి క్రూర మృగం మనమీదకి వచ్చి పడుతుందోనని..భయం!! వినాలనే తహతహ!! ఎవరో రాజకుమారుడు వచ్చి మనల్ని రక్షిస్తాడనే ధైర్యం కూడా!!       మా బాల్యం కూడా ఇటువంటి కారడవుల కథలతో పాటూ హాస్యం ఉట్టిపడే తెనాలి రామకృష్ణుడూ, తాతాచార్యుల కథాశ్రవణంతో  ఉత్కంఠభరితంగానే సాగింది. ఎండాకాలం సెలవుల్లో, ఆ కథల లోకంలో మమ్మల్ని […]

Continue Reading

గీత శ్రావణం, సంగీతం (కవితలు)

గీత శ్రావణం, సంగీతం (కవితలు) -నాగరాజు రామస్వామి   గీత శ్రావణం   ఉదయాకాశం తడి తడిగా నన్ను పెనవేసుకున్నప్పుడల్లా రాత్రంతా నానిన అక్షరం నాలో మొలకెత్తి గొంతెత్తుతుంటుంది. చీకటి దైన్యానికి ద్రవించిన సూర్యుడు తడి పదాలై బొట్లు బొట్లుగా రాలుతుంటాడు నా చిరు చీకటి చూరు లోంచి. శ్రావణం అంటే ఎంత ఇష్టమో నాకు! ముసురు ముసుగుల వెనుక సప్త వర్ణాలను పాడుకుంటూ వేకువ! ఏడు రాగాలను విచ్చుకుంటూ ఇంద్రచాపం! చీకటి బతుకులలో కిరణమై నదించాలని తొందరిస్తున్న తొలిపొద్దు […]

Continue Reading

వీక్షణం 83 సమావేశంలో – “నెచ్చెలి” ఆవిష్కరణ

వీక్షణం- 83 -రూపారాణి బుస్సా  జూలై నెల 14వ తారీఖున బే ఏరియాలో శర్మిల గారి ఇంట్లో వీక్షణం 83వ సమావేశం అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది. సాయి బాబ గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశాన్ని శర్మిలగారు స్వయంగా రచించిన  “బెజవాడ నుంచి బెంగాల్ సరిహద్దు దాక” అన్న ఆసక్తికరమైన కథతో ప్రారంభించారు. నాయనమ్మ చిట్టెమ్మని తీసుకుని బెంగాల్ లో ఉంటున్న వాళ్ళ అబ్బాయి ఉంటున్న బెంగాల్ సరిహద్దు దాక ఎలా ప్రయాణం చేసి క్షేమంగా చేరారన్నది కథా విశేషం.తరువాత […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఆగస్టు,2019

“నెచ్చెలి మాట”  “అభినందన మందారమాల” -డా|| కె.గీత  “నెచ్చెలి” మొదటి వారంలోనే దాదాపు మూడువేల వ్యూలతో అత్యంత ఆదరణ పొందింది. విలక్షణమైన రచనలతో పఠనాసక్తి కలిగిస్తోందని మెసేజీలు, ఉత్తరాలతో అభినందనలు, శుభాకాంక్షలు అందజేసి ఆశీర్వదించిన పాఠకులైన మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రతినెలా 10 వ తారీఖున తప్పనిసరిగా మీముందుకు వచ్చే “నెచ్చెలి” వనితా మాస పత్రికలో ఆసక్తిదాయకమైన ధారావాహికలు, కాలమ్స్ తో బాటూ కథలు, కవిత్వమూ, ఇంకా అనేకానేక శీర్షికలూ మీ సాహిత్యపూదోటలో ఎప్పటికీ దాచుకునే […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-జూలై ,2019

“నెచ్చెలి”మాట  “అంతా మన మంచికే” -డా|| కె.గీత    నా చిన్నప్పుడు మా అమ్మమ్మ  ఎప్పుడూ “ఏం జరిగినా మన మంచికేనల్లా”  అంటూ ఉండేది.    “అంతా మన మంచికే” అనుకోవడానికి చాలా బాగానే ఉంటుంది కానీ నిజంగా మనకు నచ్చనివి జరుగుతున్నంత సేపు సంయమనంతో నిలదొక్కుకోవడం చాలా కష్టం.    ఇంటా, బయటా మనకు నచ్చనివెన్నో జరుగుతూఉంటాయి. కొన్నిటిని మన ప్రయత్నంతో మార్చగలం. కొన్నిటికి ప్రేక్షక పాత్ర వహించడం తప్ప మరో మార్గం ఉండదు. వాటిని […]

Continue Reading
Posted On :