image_print

మా అమ్మ విజేత-4

మా అమ్మ విజేత-4 – దామరాజు నాగలక్ష్మి అమ్మాజీకి తన పెద్దమ్మ పిల్లలతో ఆడుకోవాలని వుండేది. స్కూలుకి వెళ్ళి చదువుకోవాలని వుండేది.  వర్ధని, ఇందిర చెల్లెళ్ళు ఇద్దరూ స్కూలుకి పుస్తపట్టుకుని వెడుతూ… తమవంక అలాగే చూస్తున్న అమ్మాజీతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయేవారు. దిగాలుగా కూచున్న అమ్మాజీని సరోజ వచ్చి “పెద్దదానివవుతున్నావు రోడ్డు మీద ఏంచేస్తున్నావు? సరోజ ఏడుస్తోంది వచ్చి ఆడించు” అని లోపలికి లాక్కుని వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి చూసేసరికి సుశీల బట్టలన్నీ తడుపుకుని పాడుచేసుకుంది.  అస్సలు […]

Continue Reading

చాతకపక్షులు నవల- 9

చాతకపక్షులు  (భాగం-9) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి ఆ రెండుభావాలూ శివరావూ, పరమేశం దృష్టి దాటిపోలేదు. ఆవిడ మనసులో మాట ఇద్దరికీ అర్థం అయింది. అదే వరసలో ఒకరికి సంతృప్తీ, రెండోవారికి అసంతృప్తీ కలిగేయి. అదే కారణంగా మొదటివారు ఆ సంభాషణ పొడిగించడానికీ, రెండోవారు తుంచేయడానికీ తలపడ్డారు. “నామాట విను, పరమేశం. ఆడపిల్లకి చదువు అవసరమా కాదా అన్నమాట అటుంచి. ఈరోజుల్లో అబ్బాయిలు కూడా చదువుకున్న అమ్మాయిలనే ఇష్టపడుతున్నారన్న సంగతి […]

Continue Reading
Posted On :

విజయవాటిక-3 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-3 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ మల్లికావల్లికి మల్లికాకుసుమాలంటే అమిత ప్రీతి. ఆమె అమరావతిలో, అమరేశ్వరుని ఆలయములో, దేవుని సేవకై ఉన్న దేవదాసి నాగవల్లి కూమార్తె. కళావంతుల పిల్ల, నాట్యమయూరి. సాహిత్యంలో సంగీతంలో అందె వేసిన చేయి. ఆమె తన సాహిత్యం, సంగీతం, నృత్యం, సర్వం అమరేశ్వరునికే అంకితమివ్వాలని ఉవిళ్ళూరుతున్నది. ఒకనాటి బ్రహ్మోత్సావాలలో ఆమెకు శ్రీకరునితో పరిచయం కలిగింది. పదహారేళ్ళ ఆ జవ్వని శ్రీకరుని హృదయాన్ని గిలిగింతలు పెట్టింది. ఆమె శ్రీకరుని చూచి ఆశ్చర్యపోయింది. ఆనాటి […]

Continue Reading

చాతకపక్షులు నవల-8

చాతకపక్షులు  (భాగం-8) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి “ఆమాట ఆయన్నే అడగండి,” అంది కామాక్షి తన తప్పేంలేదు అని స్పష్టం చేస్తూ. పిల్లచదువుకి తనతమ్ముడు సాయం చేస్తానంటే ఆయనతమ్ముడు హేళన చేసిన వైనం ఆవిడ ఎదలో ముల్లై కెలుకుతూ వుంది మరి. “రానియ్యి. వాణ్ణే అడుగుతాను,” అన్నారాయన. గీత తల్లివెనక చేరి, “అయిన గొడవ చాలదూ? మళ్లీ ఇప్పుడెందుకూ ఆ వూసెత్తడం?” అంది నసుగుతూ. “బాగుంది. నిన్ను ఎందుకు కాలేజీకి […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-11)

బతుకు చిత్రం-11 – రావుల కిరణ్మయి సారయ్య అంజులుకు సుత ముచ్చట చేవులేసిండు.నిన్న  అనుకోకుండా మీ తమ్ముడు శివుడు సుతం ఈ పని కాన్నే కల్సిండు. అట్నా ..!మా శివుడు ఈడి కచ్చేది గింత తెల్వకపాయనే? ఎట్లా ఎరుకయితది?అన్నదమ్ములంటే రామలచ్మనులోలె ఉండాలె.ఒక్క కంచం ల దినకున్నా ఒక్క మంచంల పండకున్నా ఒక్క కడుపుల పుట్టినం అన్న పావురం తోనన్న కల్సుండాలే.అప్పుడప్పుడ న్న కష్టమో ,నిష్టురమో పంచుకోవాలె.ఇప్పటికయినా మీ పెద్దన్న ముత్యాలు మిమ్ముల యాజ్జే త్తాండు.రేపు ఐతారం పో […]

Continue Reading
Posted On :

మా అమ్మ విజేత-3

మా అమ్మ విజేత-3 – దామరాజు నాగలక్ష్మి అమ్మాజీ సంవత్సరం పాప అయ్యింది. నడక, మాటలు అన్నీ బాగా వస్తున్నాయి. అందరికీ చాలా కాలక్షేపం. వీలక్ష్మిగారు మెలికలు తిరిగిపోతున్న సుందరిని చూసి – “సుందరీ… ఏమయ్యిందమ్మా…” అనుకుంటూ కంగారు పడిపోయి చుట్టు పక్కల అందరినీ పిలుచుకు వచ్చింది. ఎవరో వెళ్ళి ఊరందరికీ నమ్మకంగా వైద్యం చేసే శాస్త్రి గారిని పిలుచుకు వచ్చారు. శాస్త్రిగారు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఏవేవో కషాయాలు ఇచ్చారు. ప్రతిదీ సుందరి వాంతి చేసేసుకుంటోంది.  ఉన్నట్లుండి […]

Continue Reading

నిష్కల (నవల) భాగం-11

నిష్కల – 11 – శాంతి ప్రబోధ వాళ్ళు కలిసుండటం విడిపోవడం సెక్స్ చేసుకోవడం చేసుకోకపోవడం వారి ఛాయిస్….పూర్తిగా వారి వ్యక్తిగతం…ఎక్కడో చోట చిన్న రిలవెన్స్ సంపాదించి  విశ్లేషణలు తీర్పులు చెప్పేయడమేనా …ఎమోషనల్ గార్నిష్ చేయడమేనా…సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల వైవాహిక లైంగిక సంబంధాలతో మనకేం సంబంధం? పబ్లిగ్గా చర్చించాల్సినంత ఏముంది ఇందులో..సెలబ్రిటీల లైఫ్ లో నాకు బాగా నచ్చిన విషయం విడాకులు వాళ్ళు చాలా లైట్ తీసుకోవడం.  కుదిరితే కలిసి ఉంటారు. లేకుంటే అంతే […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-16

రాగో భాగం-16 – సాధన  రుషి టైం చూసుకున్నాడు. అప్పుడే రెండు దాటింది. ఇంకా డోలు, డోబి, లెబుడుతో మాట్లాడాల్సి ఉంది. ఉదయం నుండి ఇక్కడే ఉండి మీటింగ్ సైతం జరిగి, జనాలు పోయాక అదే జాగలో ఉండడం సరియైంది గాదు. స్థలం మార్చాలి. పక్కూరుకు పోతే ఇక్కడ మాట, ముచ్చట పూర్తి గాకుండా పోతుంది. బాగా పొద్దుపోయి చేరితే ఆ ఊళ్ళో దళానికి రాత్రి భోజనం కూడ ఇబ్బంది కావచ్చు. ముందుగా కొందర్ని పంపడమే మంచిదనే […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-2 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 2 – గౌరీ కృపానందన్ “సిగ్గుగా ఉంది బాబూ.” “నాకు తెలుసు కోవాలని ఉంది. “కాస్త మెల్లగా మాట్లాడండీ.” మాటల్లోనే తనను ఆక్రమించుకోబోతున్న అతని చేతులని గట్టిగా గిల్లింది. “రాక్షసీ! నన్ను గిల్లుతావా?” “సారీ!” “ఫరవాలేదులే. నువ్వు గిల్లినా సుఖంగానే ఉంది.” “అయ్యో! రక్తం వస్తోంది.” “ఉండు. మీ నాన్నగారితో చెబుతాను. మీ అమ్మాయిని ముట్టుకున్నానో లేదో, ఎలా గిల్లింది చూడండీ అని.” “ప్లీజ్! చెప్పకండి.” “చెప్పి తీరతాను.” “వద్దు వద్దు. “ […]

Continue Reading
Posted On :

విజయవాటిక-2 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-2 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ “అయినా మన జాగ్రత్తలో మనముండాలి. సదా అప్రమత్తంగా ఉండాలి!” హెచ్చరికగా చెప్పారు గురుదేవులు. క్షణంలో వెయ్యోవంతు శ్రీకరుని కళ్ళలో వింత భావము కలిగి మాయమైనది. “అవును గురుదేవా!” అన్నాడు. “ఎంత వరకు వచ్చాయి విజయవాటిక (బెజవాడ) గుహాలయాలు?” అడిగారు గురుదేవులు. “పూర్తి కావచ్చినవి. శివరాత్రి ఉత్సవాలకు ముందే అక్కడ రుద్రయాగంతో కలిపి అశ్వమేధ యాగం చెయ్యాలని మహారాజుగారి వాంఛ. దానికి మిమ్ములను స్వయంగా ఆహ్వానించటానికి వచ్చాను…” “అవునా? వీలు […]

Continue Reading

చాతకపక్షులు నవల-7

చాతకపక్షులు  (భాగం-7) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి కాలేజీలు తెరిచారు. గీత క్లాసుమేటుల్లో కొందరు అనుకున్నట్టు తమ తమ అభిమానవిషయాలు చదవడానికి కాలేజీలో చేరారు. సరోజకంటే ఎక్కువ మార్కులే వచ్చినా వెంకటసుబ్బయ్యకి బయాలజీలో సీటు రాలేదు. ఆర్ట్సులో చేరేడు. శ్రీనివాససుబ్బారావూ, బుచ్చిలక్ష్మీ, సుందరీ, జాన్ గోపాల్ – అందరూ తలో దారీ పట్టేరు. గీత కూడా తమ పరిస్థితులకి అనుగుణంగా టైపుక్లాసులో చేరింది. కానీ ఎదలో చిన్న నొప్పి. తనకి […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-10

నిష్కల – 10 – శాంతి ప్రబోధ కావేరి ఇంటికి తన హోండా యాక్టీవ్ పై  బయలు దేరింది శోభ ఇన్నాళ్లకు తీరిందా నీకు . నీ బిడ్డకే  రాకూడని కష్టం వస్తే అలాగే నిర్లక్ష్యం చేస్తావా .. ఇన్నాళ్లు వెళ్లి చూడకుండా ఉంటావా .. వదిలేస్తావా అని ఆమె మనస్సు మొట్టికాయ వేసింది. నిజానికి , శోభకి కావేరి పదే పదే గుర్తు వస్తూనే ఉంది .  వీలు చిక్కినప్పుడల్లా ఫోన్ చేసి పలకరిస్తూనే ఉంది. […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-10)

బతుకు చిత్రం-10 – రావుల కిరణ్మయి మా అన్నలు లగ్గాని కన్న వత్తె బాగుండని పాణం కొట్టుకుంటాందే.నాయ్న ముంగట ఏదో వాళ్ళు వత్తేంది?రాకున్టేంది?అన్నట్టు ఉంటాన గని ,లోపల రావాలనే కాయిశు బాగున్నదే కోమలా ! అంతేగదెనే!ఆడపిల్లకు తోడబుట్టినోళ్ళు ఎంబడుంటే ఎయ్యేనుగుల బలముంటది.నువ్వే రంది వడకు.మా అన్న గా పొద్దు మీ పెద్దన్న ఏడో కల్సిండని చెప్పిండు.అటెన్కల ఉన్నడేమో!మల్లో పారి ఎవరి ద్వారానైన కనుక్కోమంట,గని నువ్వు ఇప్పుడపుడే మీ నాయ్నకు చెప్పకు అన్నది కోమల. నేనేం జెప్పను గని,నువ్వైతే […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం -1 (సీరియల్) (ఈ నెల నుంచి ప్రారంభం) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 1 – గౌరీ కృపానందన్ పెళ్లి పందిరి కళకళ లాడుతోంది. పిల్లలు అటూ ఇటు పరుగులు తీస్తున్నారు. పాట కచ్చేరి ముగిసి, గాయకులంతా తమ తమ వాద్యాలను పక్కకి తీసి పెట్టారు. నాన్నగారు తాంబూలంలో వెయ్యిరూపాయలు ఉంచి ప్రధాన గాయకుడి చేతికి ఇస్తూ, “కచ్చేరి దేవగానంలా అనిపించింది. అందరూ భోజనాలు చేసి మరీ వెళ్ళాలి” అన్నారు. పెళ్లి కూతురు ఉమ మెడలో ఉన్న పూల దండను తీసేసింది. పక్కనే నిలబడి ఉన్న మూర్తిని, […]

Continue Reading
Posted On :

మా అమ్మ విజేత-2

మా అమ్మ విజేత-2 – దామరాజు నాగలక్ష్మి అమ్మాజీ సంవత్సరం పాప అయ్యింది. నడక, మాటలు అన్నీ బాగా వస్తున్నాయి. అందరికీ చాలా కాలక్షేపం. వీలక్ష్మిగారు మెలికలు తిరిగిపోతున్న సుందరిని చూసి – “సుందరీ… ఏమయ్యిందమ్మా…” అనుకుంటూ కంగారు పడిపోయి చుట్టు పక్కల అందరినీ పిలుచుకు వచ్చింది. ఎవరో వెళ్ళి ఊరందరికీ నమ్మకంగా వైద్యం చేసే శాస్త్రి గారిని పిలుచుకు వచ్చారు. శాస్త్రిగారు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఏవేవో కషాయాలు ఇచ్చారు. ప్రతిదీ సుందరి వాంతి చేసేసుకుంటోంది.  ఉన్నట్లుండి […]

Continue Reading

రాగో(నవల)-15

రాగో భాగం-15 – సాధన  “ఏయ్, జైని హుడా” (చూడు) అంటూ చెప్పితే బాగుండదన్నట్టు బుంగమూతి పెట్టింది ఇర్పి. నువ్వే చెప్పు మరి” అంటూ గిరిజ ఇర్పినే ప్రోత్సహించింది. “సిగ్గక్కా సిగ్గు. అది ఊల్లెకు వల వేస్తుంది. ఆ విషయం అదే ఎట్ల చెప్పుతుంది?” అంటూ జైని చెప్పేసింది. “పచ్చబొట్లకు – మన ఊల్లెకు పోత్తేమిటి? అతనికి కూడ నుదుట ఉంది కదా! ఈవిడకుంటే వద్దంటాడా ఏంటి? ఎలాగు మనవాడికి ఈవిడగారు పుటులే కదా. అయినా ఉల్లెమీద […]

Continue Reading
Posted On :

విజయవాటిక-1 (చారిత్రాత్మక నవల) (ఈ నెల నుండి ప్రారంభం)

విజయవాటిక-1 – సంధ్య యల్లాప్రగడ నాంది  ఆంధ్రదేశమును శాతవాహనులు పరిపాలించిన తదనంతరం పాలించిన రాజవంశీయులలో విష్ణుకుండినలు ముఖ్యులు. వీరి పాలన మహోజ్జ్వల చరిత్ర. వీరి చరిత్ర వినయముతో, సమ్యక్ప్రజాపాలనతో కూడి అనుపానమైనది. నేటి తెలంగాణా నుండి వీరి పాలన మొదలైయ్యింది. వీరు మునుపు చిన్న జమిందారులుగా ఉన్నా, తదనంతరం రాజ్యాలు జయించి వీరి వంశ పరిపాలనను మొదలుపెట్టారు. ఆనాటి బలమైన రాజ వంశీయులతో సంబంధ భాందవ్యాలు నెరపి పూర్తి దక్షిణాపథాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నారు. కొడిగట్టిన వైదికధర్మాన్ని […]

Continue Reading

మా అమ్మ విజేత-1 (ధారావాహిక నవల) (ఈ నెల నుండి ప్రారంభం)

మా అమ్మ విజేత-1 – దామరాజు నాగలక్ష్మి వీరలక్ష్మి  “ఒరేయ్ సుబ్బారావ్ మన రోడ్డు చివర వీరభద్రయ్య గారి చెల్లెలు ఉంది.  నీకు ఈడూజోడూ సరిపోతుంది. సాయంత్రం వెళ్ళి చూసొద్దాం” అంది కొడుకు సుబ్బారావు. సుబ్బారావు “సరే అమ్మా” తల వూపి వెళ్ళిపోయాడు. మంచిరోజు చూసుకుని వీరభద్రరావు చెల్లెలు సుందరిని చూడ్డానికి వెళ్లారు. “అమ్మాయి చక్కగా వుంది. మాకేమీ అభ్యంతరం లేదు. మీ అమ్మాయికి ఏం నగలు పెడతారో మీ ఇష్టం. మాకేమీ అక్కరలేదు” అంది వీరలక్ష్మి. […]

Continue Reading

చాతకపక్షులు నవల-6

చాతకపక్షులు  (భాగం-6) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి నెమ్మదిగా కదిలి ఎవరిదారిన వారు పోతున్నారు విద్యార్థులు. గీత మాత్రం ఎవరితోనూ కలవకుండా కొందరికి కొంచెం ముందుగానూ చాలామందికి వెనగ్గానూ నిదానంగా నడుస్తూ, పొరపాటున ఎవరిభుజమేనా తగిల్తే చిరాకు పడుతూ, వాళ్లమాటలు వింటూ, వాటిని నిరసిస్తూ, తన ఆలోచనలేమిటో తనకే తెలీని అయోమయావస్థలో ఇల్లు చేరింది. “పాసయేవా?” వరండాలో వాలుకుర్చీలో కూర్చున్న తండ్రి పరమేశంగారు అడిగేరు. “ఆఁ” అంటూ తలూపి గీత […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-9

నిష్కల – 9 – శాంతి ప్రబోధ తనకు తెలిసిన వాళ్లలో అంకిత్ కూడా ఒకడు అంతే .. అంతకు మించి ఏమీ లేదు అని అతనిని ఆలోచనల నుండి దూరంగా నెట్టే ప్రయత్నం చేసింది.  కానీ అది సాధ్యం కావడం లేదు . ఇద్దరూ కలిసి నడచిన క్షణాలు కందిరీగల్లా మదిలో చొరబడి గోల చేస్తున్నాయి. ఇప్పుడు అతని ప్రవర్తనను తరచి చూస్తే అర్ధమవుతున్నది.  అతనేంటో.. అతని వ్యూహం ఏమిటో.. మన బంధం ఇరుగు పొరుగు […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-9)

బతుకు చిత్రం-9 – రావుల కిరణ్మయి పొద్దు పొద్దుగాల్నే వచ్చినవ్ ?అక్కా ?కూసో అని  ఇంటిముందున్న గద్దె ను తన భుజం మీది తువ్వాలు తో దులిపి ,సామిత్రి …సామిత్రి …..!అంటూ భార్యను కేకేసాడు.పరమేశు. ఏందీ ..!అని శిక ముడుచుకుంట వచ్చి న సావిత్రి,గద్దె మీద ఈర్లచ్చిమిని చూసి.. అయ్యో !వదినే ..!నువ్వేనా ?దాదా…!లోపల కూసుందం.పరాయిదానోలె వాకిట్ల కూసునుడేంది?అని చెయి పట్టి లోపలకు రమ్మన్నట్టుగా పిలిచింది. మనసుల పావురం ఉండాలె గని,ఇంట్లేంది?బైటేంది?వదినె?ఇట్ల గూసో!అని పక్కన కూర్చో బెట్టుకొన్నది. […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-14

రాగో భాగం-14 – సాధన  మహిళా సంఘం పనిని అక్కలకు అప్పచెప్పిన కమాండర్ పటేల్ వైపు దృష్టి మళ్ళించిండు. “ఆఁ! పటేల్ దాదా! అయితే ఇవాళ పోల్వ చేస్తున్నట్టా! వాయిదా వేస్తున్నట్టా” అంటూ ఇక మన పనిలోకి దిగుదామా అన్నట్టు ప్రారంభించాడు. “ఔ దాదా! ఈ రోజుకు ఆపుకుందామనే అనుకున్నాం. ముసుర్లు ఉండంగానే మడికట్టు పూర్తి చేయాలనుకున్నం. రైతులు తొందరపడుతున్నారు. కానీ, పనులు కూడ సరిగా నడుస్తలేవు. మీరు రానేవస్తిరి. తెగాల్సిన పంచాయితీలు కూడ ఉండె. అందుకని […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-13

రాగో భాగం-13 – సాధన  12 November 2020 దళం వచ్చిందన్న కబురు విన్న గ్రామస్తులంతా సంగంలో తెగని పంచాయితీలు అన్నల ముందు తెంపుకోవచ్చని సంతోషించారు. ఊరి సంగంతోనే అన్ని పంచాయితీలు చేసుకోవాలనీ, పంచాయితీలు దళం చేయదనీ ప్రతిసారి ఎంతగా నచ్చ చెప్పినా మామూలుగా సంఘంలో తెగని పంచాయితీలు అన్నలే చేయక తప్పదని ఊరందరితో పాటు సంఘనాయకులక్కూడా ఉంటుంది. అలా ఒకటో, రెండో తప్పనిసరిగా మీదపడక తప్పదని దళానిక్కూడ తెలుసు. అలా అప్పుడే రెండు పంచాయితీలు తయారగున్నయి. […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల-5

చాతకపక్షులు  (భాగం-5) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి అలవాటు లేని పని కావడంతో బాగా అలిసిపోయిందేమో ఇట్టే నిద్ర పట్టేసింది మంచంమీద వాలీ వాలగానే.   తెల్లారి లేచి టైము చూస్తే ఏడు దాటింది. అయ్యో ఇంతసేపు పడుకున్నానా అనుకుంటూ లేచి మొహం కడుక్కుని వంటగదిలోకి వచ్చింది కాఫీ పెట్టడానికి. అక్కడి దృశ్యం చూసి తెల్లబోయింది. నిన్నరాత్రి తాను ఎలా వదిలేసిందో అలాగే వుంది మొత్తం సీను, ఎక్కడిగిన్నెలు అక్కడే వున్నాయి.  […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-8

నిష్కల – 8 – శాంతి ప్రబోధ నిష్కల నడుం వాల్చింది గానీ నిద్రపట్టడం లేదు. అంకిత్  గుర్తొచ్చాడు. అతను వెళ్లి అప్పుడే రెండు నెలలు అవుతున్నది.  పదేపదే మెసేజ్ లు పెడుతున్నాడు. వచ్చేస్తానంటున్నాడు.నేను పొమ్మంటే కదా రమ్మనడానికి, అతను రావడానికి. తనకు తానుగా నోటికి వచ్చినట్టు దూషించి వెళ్ళిపోయాడు.  అతను దూషించినందుకంటే ఎక్కువగా ఆమెను బాధించింది అతనిలోని హిపోక్రసీ.  మాటకి చేతకి ఉన్న వ్యత్యాసం.   అతని నిజస్వరూపం తెలిసిన తర్వాత అతని నీడ భరించలేక పోతున్నది నిష్కల.  భావోద్వేగాల నుంచి విడదీసి అతని గుణ దోషాలను ఎంచడానికి ప్రయత్నిస్తున్నది. సహజ ప్రకృతి నుంచి […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-8)

బతుకు చిత్రం-8 – రావుల కిరణ్మయి ఈర్లచ్చిమ్మి ఓ రోజు ఉదయం రాజయ్యతో, లగ్గం చాన దగ్గర్లచ్చె.చేయాల్సిన పనులు చానా ఉండే,ఎట్లనయ్య?నాకైతే కాల్జేతులు ఆడ్తలెవ్వు.అన్నది. అదెనే?ఆడకపోను నువ్వు నేను లగ్గానికి చేసే పనేమున్నదని?అంత ఊరోల్లె చెయ్యవట్టిరి.యాళ్ళకు మనోన్ని తయారుజేసి తీస్కపోతె అయిపాయే,ఏమన్న ,ఆయిమన్నోళ్ళు అయిపట్టికనా?పైసలు కట్టలకు కట్టలు ఇచ్చపట్టికనా?గుట్టలకు గుట్టలు కాన్కలు పెట్టపట్టికనా?అవేడదాయాలె?ఇవేడ సదరాలనే ఆరాటపడ?అన్నాడు దెప్పిపొడుస్తూ. గురివిందగింజ తన ఈపు నున్న కర్రె రంగు చూస్కోక తనది తనే సక్కదనాన్ని చూస్కొని,మురిసినట్టే ఉన్నది నీ ముచ్చట […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-7)

బతుకు చిత్రం-7 – రావుల కిరణ్మయి ఎందుకురా?అట్లంటవ్?మేమెప్పటికీ శాశ్వతమార?జాజులమ్మ తోనే నీ పెళ్ళి జరుగుతది.నాక్కూడా ఆ పొల్లయితేనే కండ్లల్ల వెట్టుకొని సూస్కుంటదనిపిత్తాంది.అన్నది ఈర్లచ్చిమి. ఇట్లా అనేకానేక వాదోపవాదాల నడుమన రాజయ్య చాలా అయిష్టంగా జాజులమ్మతో సైదులు పెండ్లికి అంగీకరించాడు.సైదులు లో కొత్త ఉత్సాహం కనపడింది.ఈర్లచ్చిమికి.ఆ పిల్లే వీడి జీవితాన్ని మార్చే భాగ్యరేఖ కాబోలు అని సంతోషపడింది. పీరయ్య కూడా తన ఇంతకంటే మంచి సంబంధం తానెలాగూ తేలేనని దృఢంగా నమ్మి,కోరుకున్న వారికే బిడ్డనిచ్చి పెళ్ళి చేస్తే సుఖంగానైనా […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల-4

చాతకపక్షులు  (భాగం-4) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి హరి సాయంత్రం ఆఫీసునించి వచ్చి గీత అందిచ్చిన కాఫీ చప్పరిస్తూ, శనివారం తన ఆఫీసులో స్నేహితులని నలుగురిని భోజనానికి పిలిచానని చెప్పేడు. గీత అయోమయంగా చూసింది. తనకి ఇంకా అంతా కొత్తగానే వుంది. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో పాలుపోలేదు. నిజానికి హరితో చెప్పలేదు కానీ దేశంలో వుండగా తను వంటింట్లో అడుగెట్టలేదు. గత రెండురోజులుగా అమ్మవంటలు తలుచుకుని ఉప్పురుచీ చింతపండు […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-12

రాగో భాగం-12 – సాధన  భళ్ళున తెల్లారింది. తూరుపు పొద్దు కరకర పొడుస్తుంది. తొలిపొద్దుకి ఆహ్వానం పలుకుతున్నట్లు ఆకులు ఆనంద బాష్పాలు రాలుస్తున్నాయి. నాలుగు రోజులుగా ముసురులో తడిసిన చెట్లు తలారబెట్టుకుంటున్నట్లు పిల్ల గాలులకు సుతారంగా తల లాడిస్తున్నాయ్. పొద్దు వెచ్చవెచ్చగా పెరుగుతూంటే ఆ పొడి పొడి వాతావరణంతో ఒళ్ళు పులకరించినట్టుగానే ఉంది. అడవిలోని పిట్టలు కిచకిచమంటున్నాయి. ధీకొండలోని పోలీస్ పటేల్ పుస్లె పావురాలు గూడు నుండి బయటకు ఎగిరి సోలార్ లైటు స్తంభం మీద, బ్యాటరీ […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-7

నిష్కల – 7 – శాంతి ప్రబోధ తలూపి చిన్నగా నవ్వుతూ కిటికీలోంచి చేయి అందించిన కరుణ చేతిలో చేయి కలిపింది నిష్కల. ఆ తర్వాత సరస్వతిని పరిచయం చేసింది. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దామనుకుంటున్నారు అడిగింది నిష్కల. కరుణ భర్త వివరాలు అడిగింది సరస్వతి. గూగుల్ లో పని చేస్తారని మాత్రమే తెలుసు. మిగతా వివరాలు ఏమీ తెలియదు తల వంచుకుని చెప్పింది కరుణ. మీ ఆయన పేరు చెప్పండి.  నేను కూడా గూగుల్ లో పనిచేస్తున్నాను […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల-3

చాతకపక్షులు  (భాగం-3) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి గీత లేచి పెట్టెలోంచి, చీరే జాకట్టూ, లంగా తీసుకుని బాత్రూంలోకి వెళ్లింది. స్నానం ముగించుకు వచ్చేసరికి, రాధా మాధవులు వచ్చేశారు. ఇద్దరు పిల్లలు వాళ్లకి, వయసులు ఎనిమిదీ, పదీ. “పిల్లలేరీ?” అనడిగేడు హరి తలుపు తీస్తూ.  “మా పక్కింటావిడ వాళ్ల పిల్లలతో County fair‌కి తీసుకెళ్లింది వాళ్ల పిల్లలతోపాటు. మధ్యాన్నానికి వచ్చేస్తారు. అందుకే హడావుడిగా ఇటొచ్చేశాం ఆకాస్త టైమునీ సద్వినియోగం చేసుకుందాం […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-11

రాగో భాగం-11 – సాధన  పడుకున్న వారి కిందినుండి వరదలు మొదలైనయి. అయినా ఎవరూ కదలడం లేదు. నాలుగు పొరకలు వేసుకున్న గాండో ఏ పేచీ లేకుండా మెదలకుండా గుర్రు పెడుతున్నాడు. రుషి పడకమాత్రం ఆ వరదలకు ఎపుడో తడిసి ముద్దయింది. అయినా చలనం లేదు. వర్షాల్లో ఇంతే అన్నట్టున్నవి వారి వాలకాలు. వీరిని తలచుకుంటే మూరనిలో తన మొదటి అనుభవం మెదలింది. తనకు కేటాయించిన పార్టీన్ కవరు కట్టుకోకుండా అలానే బాగుంటుందనీ, వర్షం రాగానే అందులో […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-6

నిష్కల – 6 – శాంతి ప్రబోధ కరణ్ ఇంట్లో ఉన్నంత సేపు కరుణకి ఊపిరి ఆడినట్లు ఉండదు.   అతని మొహం చూడటం ఇష్టం ఉండటం లేదు. మేడిపండు లో కులకులలాడే పురుగులు కనిపిస్తాయి ఆ ముఖంలో. అతను ఎప్పుడు బయటికి వెళతాడా అని ఎదురు చూస్తున్నది.  మంచం మీద నుంచి లేవకుండా నిద్ర నటిస్తున్నది. కానీ,అతను వెళ్తున్న అలికిడి లేదు. నిన్నటి నుంచి ఏమీ తినలేదు. కరుణకు ఆకలి బాగా వేస్తున్నది. ఏమీ చేసే ఓపిక లేదు.  శరీరం అంత పచ్చి పుండు లాగా ఉంది.  లేచి […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-6)

బతుకు చిత్రం-6 – రావుల కిరణ్మయి జాజులమ్మ చాలా భయంగా ఏ విషయమూ …మా అయ్యనే అడుగుండ్రి.మా అయ్య ఎట్లంటే అట్లనే.అన్నది. ఇంకేం?సర్పంచ్ గారూ…ఇక వాళ్ళూ వాళ్ళూ చూసుకుంటారు.ఇక మన పని అయిపోయినట్టే అన్నాడు. మునేశ్వరయ్య కల్పించుకొని, వరయ్య గారూ ..!అయిపోవడం కాదండీ.మొదలయింది. వివాహోర్దశ్చ మరణ మన్నం జనన మేవచ కన్ట్టే బద్వా దృఢం సూత్రం యత్రస్థం తత్ర నీయతే వివాహమూ ,ధనమూ,మరణమూ,అన్నమూ,జననం ఇవి ఎవరికి  ఎక్కడ ప్రాప్తి ఉంటే అక్కడికి వారు కంఠానికి త్రాడు వేసి […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల-2

చాతకపక్షులు  (భాగం-2) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి అదివో అల్లదివో శ్రీహరి నివాసమూ అన్నాడు హరి మూడంతస్థులమేడ చూపించి, గీత టాక్సీలోంచి దిగి అటువేపు చూసింది. వరసగా నాలుగు కిటికీలు. అతను చూపిస్తున్నది ఏకిటికీవో అర్థం కాలేదు. సరేలే లోపలికెళ్లేక అదే తెలుస్తుందని వూరుకుంది. అప్పటికి రాత్రి తొమ్మిదయింది. కొత్తకోడలు అత్తారింట అనగా భర్తగారింట అడుగెట్టింది. తలుపుమీద “వెల్కమ్ హోమ్” అట్టముక్క స్వాగతం చూసి చిన్నగా నవ్వుకుంది. హరి తలుపు […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-5

నిష్కల – 5 – శాంతి ప్రబోధ ఆ ముందు రోజు నిష్కల కోవిడ్ 19 కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ వేయించుకుని వచ్చింది. మొదటి డోస్ వేసుకున్నప్పుడు కొద్దిగా చెయ్యి నొప్పి వచ్చింది అంతే. కానీ రెండో డోస్ తీసుకున్న సాయంత్రానికి ఒళ్ళు నొప్పులు, మరుసటి రోజుకి తీవ్రమైన ఒళ్లు నొప్పులు జ్వరం. ఆఫీస్ కి వెళ్ళే ఓపిక లేదు. కానీ వెళ్ళాలి.  ఈ రోజు ఫైల్ చేయాల్సిన కేసులు ఉన్నాయి.  ఒక కేసు స్టడీ చేయాల్సి ఉంది. అది ఇండియన్స్ […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-5)

బతుకు చిత్రం-5 – రావుల కిరణ్మయి అమ్మా..!ఈ ఉప్మా తినమన్నడు అయ్యగారు.అని రెండు పేపెర్ ప్లేట్లలో వేడి వేడి ఉప్మా తెచ్చిపెట్టిండు.ఆ ఇంట్ల పన్జేసే సితాలయ్య. ఇద్దరికీ…..నిన్న పొద్దట్నుంచి ఏమీ లేక పోవడం తో బాగా ఆకలి గానే ఉన్నప్పటికీ,అట్నే గూసుంటే సీతాలయ్యన్నడు, పోద్దువోయింది.ఆయ్యచ్చేదాంక అమాసాగుతదాన్నట్టు ఏదెట్లయినా ఆకలైతే ఆగదు కదా!తినుండ్రి.అని మంచినీళ్ళు సుత ఇచ్చిండు. ఇక ఆగలేక ఊదుకుంటూ తినడం మొదలు పెట్టారు.తింటాంటే …తింటాంటే జాజులమ్మకు కుత్తిక వడ్డది.మంచినీళ్ళు తాగుదామనుకొని అందుకోబోతాంటే గ్లాసు బోర్లవడి నీళ్ళన్ని […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-10

రాగో భాగం-10 – సాధన  ఇలాటి మూర దళంలోకి వచ్చాడు. ఇంటివద్ద అతడి పోషణ కాక ‘గిన్సు’ చేసేవాడు. జ్ఞానం తెల్సిన ఆదివాసీ పిల్లల్ని పెంచటానికి పెద్దలు పడాల్సిన శ్రమ ఏముండదు. పిల్లలు సైతం ఏదో పనిచేస్తూనే ఉంటారు. అడవిలో చదువు సంధ్యల ప్రసక్తి లేనేలేదు. ఎవరైనాసరే, పసులు కాయడానికో, కూలి పనులకో, ఎవరి దగ్గరో జీతానికో, అడవిలో ఉసిరికాయలో, కరక్కాయలో, ఇప్పపూలో ఏరుకొచ్చి షావుకారికి కొలవడానికో నిత్యం అడవిపట్టుక తిరగాల్సిందే. ఏదీ దొరక్కపోతే చేపలకో, కొక్కులకో, […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల-1

చాతకపక్షులు  (భాగం-1) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి తొలిపలుకు  గత మూడున్నర దశాబ్దాలలోనూ అమెరికాలో ఉంటున్న తెలుగువారి ఆచారవ్యవహారాల్లో, ప్రవర్తనలలో చాలా మార్పులు వచ్చేయి. డెబ్భైవ దశకంలో వచ్చినవారికి తగిలినంత కల్చర్ షాక్ ఇప్పటివారికి లేదనే నేను అనుకుంటున్నాను. ఇది కేవలం స్త్రీలకే పరిమితం కాదు. అమెరికాకి వచ్చిన మగవారు ఇక్కడి సంస్కృతిలో నిలదొక్కుకుని, అనేక వత్తుడులని తట్టుకుని తమ ధ్యేయాలని సాధించడానికి పడిన అవస్థలు సామాన్యమయినవి కావు. అదే […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-4

నిష్కల – 4 – శాంతి ప్రబోధ పుట్టింట్లో నలుగురు అన్నల ముద్దుల చెల్లెలు సుగుణమ్మ.  ఆమెను బాగా గారాభం చేసింది మాత్రం ఆమె తండ్రి, పెద్దన్న రాజారాం.  దీంతో రాను రాను సుగుణమ్మ చాలా అహంభావి గా మారిపోయింది.  సుగుణమ్మ ఇంట్లో సర్వాధికారం ఆమెదే.  భర్త సాధు స్వభావి.  పెళ్లయిన మొదట్లో అత్తమామల మధ్య ఉన్న సుగుణమ్మ లోని అహం అడకత్తెరలో  పోకచెక్కలా పెళ్ళైన మొదట్లో భర్త మెతకదనం కనిపెట్టిన ఆమె అతన్ని ఏనాడూ మాట్లాడ నిచ్చేది కాదు, ఏ విషయంలోనూ గెలవ నిచ్చేది కాదు.  .  భార్య మనస్తత్వం […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-4)

బతుకు చిత్రం-4 – రావుల కిరణ్మయి సెప్పు ..,ఈంది ఏ ఊరు?అయ్యవ్వలు ఏంజేత్తరు?ఫోన్ సుత లేకుండ ఈ మనిసిని ఈడెట్ల ఇడిసిపెట్టిండ్రు ?నీ కాడ వాళ్ళ నెంబరుంటది గదా!ఫోన్ జేసి పిలిపియ్యి అన్నడు వరయ్య. ఇగో అట్నే ఈ పొల్ల అయ్యను సుత పిల్సుకురాండ్రి.అన్నడు పోలయ్య వైపు చూస్తూ. పూజారి మునేశ్వరయ్య జాజులమ్మ వైపు చూపిస్తూ … వరయ్య గారూ !ఒక్కసారి ఆ పొళ్ళను సూడుండ్రి.పాపం …బేలగా భయంతోనూ,సిగ్గు తోనూ ఎలా వణికిపోతుందో..!ఇది పాడి గాదు.వీళ్ళ అయ్యవ్వను […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-9

రాగో భాగం-9 – సాధన  రోజులు గడుస్తున్నయి. చూస్తుండగానే వర్షాకాలం రానే వచ్చింది. ఓ రోజు రాత్రి చిమ్మచీకటి. కళ్ళు పొడుచుకు చూస్తున్నా ముందు నడుస్తున్న మనిషి ఎంత దూరంలో ఉన్నాడో కూడ తెలవడం లేదు. ముందు నడిచేవారు ఆగితే వెనుకవారు మీద పడి గుద్దుకుంటున్నారు. ముందుండే పైలట్స్ అద్దానికి చేయి అడ్డం పెట్టి టార్చిలైటు వేస్తే చిమ్మచీకట్లో అకస్మాత్తుగా కనపడే వెలుతురుకు కళ్ళు చిట్లించుకుంటూ వెనుక వారంతా గాభరాగా ముందువారి అడుగులో అడుగు లేస్తూ దగ్గరగా […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-3

నిష్కల – 3 – శాంతి ప్రబోధ నలబై ఐదేళ్ల నడివయసు మహిళ , ఇద్దరు పిల్లలున్న మహిళ,  భర్తతో విడిపోయి ఒంటరిగా బతుకుతున్న మహిళకు ఆమె పిల్లలే పెళ్లి చేశారట . ఆ వార్త చూసినప్పుడు చీదరించుకుంది. ఈ వయసులో ఇదేం పోయేకాలం.. దీని మొహంమండ .  ఇంకా పదహారేళ్ళ పడుచుపిల్లననుకుంటుందా ..  దీనికిప్పుడు పెళ్లి కావాల్సి వచ్చిందా .. మొగుడు అవసరమయ్యాడా .. ఛి ఛీ .. సిగ్గులేకపోతే సరి .. ఆడాళ్ళు మరీ బరి తెగించి పోతున్నారని మనసులోనే […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-3)

బతుకు చిత్రం-3 – రావుల కిరణ్మయి తండ్లాటెందుకు?పొర్లాటెందుకు?నువ్వే అంటివి గదెనే !చెట్టంత కొడుకని.అందుకే నిమ్మళంగున్న.సంకల ఆడే శాంతి పోరడయితే నేను సుత నీ లెక్కల్నే సూత్తును కావచ్చు.అన్నాడు మంచం మీద జేరి ఆవలించుకున్టనే. గందుకే అంటాన,దున్నపోతు మీద వాన కురిసినట్టని…….అన్నది కోపంగానే. ఏందే?ఏమో…దున్నపోతంటానవ్?పెయ్యెట్లున్నదే? అన్నాడు. గీ బెదిరింపులకేం తక్కువ లేదు.”ఉన్న మాటంటే ఊర్లున్డనీయరన్నట్టు ..”దున్నపోతని ఉన్నమాటే  అన్న. నీ వల్లనే కదా!ఆ ఊర్ల ఇడిశి పెట్టి అచ్చిన.నీకేమన్న ఇజ్జతున్నదా?పొల్లను సూడ వోయిన ఊర్లనే పొలగాన్ని ఇడ్సిపెట్టి వత్తే […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-8

రాగో భాగం-8 – సాధన  “నీ పేరు ఏందక్కా?” అంటూ మరో ప్రశ్న వేసేసరికి రాగో తత్తర పడింది. వెనుకనున్న మిన్కో వెంటనే “జైని” అంటూ అందించింది. “ఆఁ! అచ్చం జువ్వి రాగో తీరుగుంటే అడిగినక్క కళ్ళల మసకలు. మనిషిని పోల్చలేము” అంటూ ముసలమ్మ కదిలింది. “అబ్బా! కొత్త పేరు పెట్టుకోవడమే మంచిదయింది” అనుకుంటూ రాగో ముందుకు సాగింది. చివరింటి ముందు దళం ఆగింది. కిట్లు దించారు. వాకిట్లో వాల్చిన మంచాలపై దళ సభ్యులు కూచున్నారు. కర్రె […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-7

రాగో భాగం-7 – సాధన  దళం గూర్చి ఏమీ తెలియని రాగో దళం వెంట నడుస్తుంది. దళం ఎటుపోతుందో తెలియని రాగో దళంతో నడుస్తుంది. గిరిజ వెనకే రాగో నడుస్తుంది. అంత రాత్రి ఎంత దూరం నడుస్తారో, ఏ ఇంట్లో పడుకుంటారో ఏమీ తెలియదు. తన వద్ద చెద్దరు, దుప్పటి లేవు. కప్పుకోను చీర పేగు కూడ తెచ్చుకోలేదు అని బాధపడుతున్న రాగోకు ఎవరో ఏదో అనడం వినపడింది. కానీ ఏమన్నాడో అర్థం కాలేదు. దళం దారి […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-2)

బతుకు చిత్రం-2 – రావుల కిరణ్మయి కంచే చేను మేసిన్దన్నట్టుగా కన్న తండ్రే కన్న కొడుకు కళ్ళ ముందే  జీవితాన్ని పాడు చేసుకుంటుంటే  చీమ కుట్టినట్టైనా లేకుండా ఆడు మగోడు వాడేమి  జేసినా చెల్లుతుందని మాట్లాడుతున్న భర్త రాజయ్యను ఓవైపు మందలిస్తూనే తల్లిగా ఒక దారికి తేవాలని పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎంత మంది వచ్చి చూసినా ,అడిగేది ఆస్తి పాస్తులే మున్నాయి?పిలగాడు నెలకు ఏ మాత్రం సంపాదిస్తాండు?ఎంత పొడుపు చేస్తాండు?అనే. వీర్లచ్చిమికి ఈ ప్రశ్నలకు […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-2

నిష్కల – 1  – శాంతి ప్రబోధ ‘మనకున్నది ఒకటే పుట్టుక . ఒక్కటే మరణం. ఈ మధ్య కాలమే కదమ్మా జీవితం . ఇంత చిన్న జీవితకాలంలో జలపాతాల్లా ఎగిసిపడే ఆనందాల కంటే, ఉప్పెనల్లా వురికొచ్చే  దుఃఖాలే ఎక్కువమో.. మనసును ఆహ్లాద పరిచే సంఘటనల కంటే హృదయాన్ని మెలిపెట్టి పిండేసే వ్యధలే ఎక్కువ కావచ్చు.. మనిషికీ మనిషికీ మధ్య మంచుపొరల్లా కమ్మేసిన అహంభావపు తెరలు,  ఆధిపత్యపు కోట్లాటలూ .. ఆంక్షల అడ్డుగోడలూ .. ఎన్ననీ.. ఒకటా రెండా .., దాటుకొచ్చినకొద్దీ, మేమున్నామంటూ కొత్తవి మొలుసుకుంటూ పోతుండడమేనా .. జీవితం? మరీ ముఖ్యంగా ఆడపిల్లల జీవితంలో క్షణక్షణం అనుక్షణం ఎదురయ్యే చింతనిప్పుల గుండాలు , కుప్పలు తెప్పలుగా తుమ్మముళ్ళూ ..బ్రహ్మ జెముళ్లూ .. […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-1

నిష్కల – 1  – శాంతి ప్రబోధ ‘మనకున్నది ఒకటే పుట్టుక . ఒక్కటే మరణం. ఈ మధ్య కాలమే కదమ్మా జీవితం . ఇంత చిన్న జీవితకాలంలో జలపాతాల్లా ఎగిసిపడే ఆనందాల కంటే, ఉప్పెనల్లా వురికొచ్చే  దుఃఖాలే ఎక్కువమో.. మనసును ఆహ్లాద పరిచే సంఘటనల కంటే హృదయాన్ని మెలిపెట్టి పిండేసే వ్యధలే ఎక్కువ కావచ్చు.. మనిషికీ మనిషికీ మధ్య మంచుపొరల్లా కమ్మేసిన అహంభావపు తెరలు,  ఆధిపత్యపు కోట్లాటలూ .. ఆంక్షల అడ్డుగోడలూ .. ఎన్ననీ.. ఒకటా రెండా .., దాటుకొచ్చినకొద్దీ, మేమున్నామంటూ కొత్తవి మొలుసుకుంటూ పోతుండడమేనా .. జీవితం? మరీ ముఖ్యంగా ఆడపిల్లల జీవితంలో క్షణక్షణం అనుక్షణం ఎదురయ్యే చింతనిప్పుల గుండాలు , కుప్పలు తెప్పలుగా తుమ్మముళ్ళూ ..బ్రహ్మ జెముళ్లూ .. […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-6

రాగో భాగం-6 – సాధన  మర్కనాలో ఫారెస్టువారి నర్సరీ పనులు జోరుగా సాగుతున్నాయి. సమ్మె చేసి కూలిరేట్లు పెంచుకున్న కూపు కూలీలు ఆ రోజే పనుల్లోకి దిగారు. వీడింగ్ పని చకచకా సాగిపోతుంది. సాయంకాలం ఆరున్నర అవుతుంది. ఊరి బయటే తెలుగు ప్రాంతీయ వార్తలు విని దళం ఊళ్ళోకొచ్చింది. మసక మసకగా ఉన్న వెలుతురు కాస్తా మనుషుల్ని గుర్తు పట్టరాని చీకటిగా చిక్కపడింది. అడవిని అనుకొనే ఉన్న చివరి ఇంటి ముందు దళం ఆగింది. దళ కమాండర్ […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-1)

బతుకు చిత్రం – రావుల కిరణ్మయి అదో పెద్ద అడవిలాగుంది.చుట్టూ ఎంత దూరం నడిచినా దట్టంగా అల్లుకున్న పెద్ద పెద్ద వృక్షాలు. తాను ఆ చెట్లు ఎక్కుతున్నది. బాగా విరగకాసిన పండ్ల తో చెట్లన్నీ గూని అవ్వ లా కనిపిస్తుంటే,ఎక్కిన చెట్లను దిగి ఆ చెట్ల వైపు పరుగు తీస్తున్నది. చిత్రం….అక్కడికి వెళ్లి వాటిని అందుకొని అవి ఏ పండ్లు?..అని పరికిస్తూ…..జామ ,మామిడి,సపోటా….అంటూ ఒక్కో చెట్టును గుర్తిస్తూ పోతూ ఉంటే ఆశ్చర్యంగా పూలతోట లోకి చేరుకుంది. పువ్వులు…..పిచ్చిపట్టినట్టుగా […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-5

రాగో భాగం-5 – సాధన  పెద్ద బండను మీదికి దొబ్బినట్టె రాగోకు దిగ్గున తెలివైంది. బండలు దొర్లిస్తున్నారు. గడ్డపారలతో బలంగా తవ్వుతున్నారు. గొడ్డళ్ళతో నరుకుతున్నారు. ఒకరూ, ఇద్దరూ కాదు. ఊరికి ఊరే మీద పడ్డట్టుంది. లోగొంతులో గుసగుసలుగా మాట్లాడుతున్నారు. ఆ అల్లరీ, హడావిడి అంతా దగ్గర్లోనే వినబడుతూంది. లేచింది లేచినట్లే మద్ది చెట్టును పొదువుకుంది రాగో. ఎవరై ఉంటారు? ఏమిటి అల్లరి? ఏం చేస్తున్నారు? తననే వేటాడుతున్నారా? తాను ఎక్కువ దూరం పరుగెత్తలేదా? దార్లోనే మొద్దు నిద్ర […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-4

రాగో భాగం-4 – సాధన  రోజులు గడుస్తున్నాయి. రాగో మనసు ఓ పట్టాన నిలవడం లేదు. రకరకాల ఆలోచనలతో పొద్దస్తమానం ఎటూ పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటుంది. ఎక్కడికి పోయినా, ఏ పరిచయస్తుల వద్దనైనా, చిన్ననాటి స్నేహితుల వద్దనైనా తలదాచుకోవడానికి పూట, అరపూట ఉండాల్సి వచ్చేసరికి అక్కడి వారంతా ‘కేర్లే (భర్తను వదలి మరో సంబంధం వెతుక్కునే ఆడది) అంటూ అదో రకంగా చూస్తుంటే దిన దిన గండంగా సాగుతుంది. ఏ కాలం నాడు ఏ పెద్దలు నామకరణం […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-3

రాగో భాగం-3 – సాధన  ఊళ్ళో గోటుల్ ముందు జీపు ఆగి ఉంది. నల్లటి జీపుకు ముందరి భాగంపై “మహారాష్ట్ర శాసన్” అనే అక్షరాలు తెల్లటి రంగుతో ఉండ్రాళ్ళలా చోటు చేసుకున్నాయి. నంబరు ప్లేటుపై హిందీ లిపిలో నంబరు కొట్టొచ్చినట్లు కనపడుతుంది. బాబులు అందరూ గోటుల్ ముందు మంచాల్లో కూచున్నారు. వాళ్ళకెదురుగా గ్రామస్తులు కూచున్నారు. పిల్లలందరూ దాదాపు బరిబాతలనే డ్రైవర్ కసరుకోవడం లెక్క చేయకుండానే ఉరుకులు పరుగులు చేస్తూ దాన్నొక వింత జంతువులా చూస్తున్నారు. ఎవరింటి ముందు […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-2

రాగో భాగం-2 – సాధన  గోటుల్ ముందు కూచున్న వాళ్ళల్లో కూడ రకరకాల ఆలోచనలున్నయి. లచ్చుకు ఎటూ తేలకుండా ఉంది. నాన్సుకు మొదటి పెళ్ళి పెళ్ళాముంది. పెళ్ళయి మూడేళ్ళైనా కోడలు కడుపు పండకపోవడంతో నాన్సుకి మరోపిల్లను తెస్తే బాగుండుననే ఆలోచన లచ్చుకు లేకపోలేదు. అందుకే వరసైన రాగో వస్తానంటుందంటే నాన్సును తాను వారించలేదు. రాగోకైనా సంతానమైతే తన ఇల్లు నిలబడుతుందనేది లచ్చు ఆపతి. అయితే రాగో తండ్రి దల్సు మొండిగా వ్యవహరించి పిల్లను ససేమిరా ఇయ్యనని మేనవారికి […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-1

రాగో – సాధన  1 రాగో దిగాలుగా కూచొని ఉంది. మనసంతా కకావికలమై ఉంది. కొలిక్కి రాని ఆలోచనలు. ఊరి బయటి గొడ్ల సదర్లలా చెల్లాచెదురుగా ఉన్నాయి తన ఆలోచనలు. ఎంత కూడదనుకున్నా గతమంతా దేవర జాతర్లా బుర్రలో అదే పనిగా తిరుగుతోంది. తోవ తప్పినోళ్ళు ఆగమాగమై అడవిలో తిరుగుతున్నట్లుంది రాగో జీవితం. తారీఖులు, పంచాంగాలు లెక్కలు తెలియకపోయినా, ఊరోళ్ళందరూ ‘పడుచుపోరి’ అని వెక్కిరిచ్చినప్పుడల్లా తనకూ వయసొస్తుందని అర్థమయేది. ఊళ్లో చలికాలం రాత్రుళ్ళు డోళ్ళు, డప్పులతో నెగళ్ళ […]

Continue Reading
Posted On :

రాగో(నవల)

రాగో (నవల)  – సాధన సృజన ప్రచురణలు, మలుపు బుక్స్ సౌజన్యంతో “నెచ్చెలి” పాఠకుల కోసం ప్రత్యేకంగా “రాగో” నవలను ఈ నెల నుండి ధారావాహికగా అందిస్తున్నాం.  అడగగానే “రాగో” నవలను ప్రచురించడానికి సమ్మతించిన శ్రీ ఎన్. వేణుగోపాల్ గారికి, శ్రీ బాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు. *** “రాగో అంటే రామచిలుకే గాని పంజరంలో చిలుక కాదు. అర్థం లేని కట్టుబాట్లను మనస్సు లేని మనువును ఎదిరించి, అడవిలోకి, అక్కడి నుంచి ఆశయంలోకి పయనించిన వీరవనిత. […]

Continue Reading
Posted On :