image_print

బంగారమంటి (కవిత)

బంగారమంటి- -డా||కె.గీత ష్ …. పాపా నాన్నని డిస్టర్బ్ చెయ్యకు పని చేసుకొనీ అర్థరాత్రి వరకూ మీటింగులనీ చాటింగులనీ పాపం ఇంటి నించే మొత్తం పనంతా భుజాన మోస్తున్న బ్రహ్మాండుడు పొద్దుటే కప్పుడు కాఫీ ఏదో ఇంత టిఫిను  లంచ్ టైముకి కాస్త అన్నం  మధ్య ఎప్పుడైనా టీనో, బిస్కట్టో రాత్రికి ఓ చిన్న చపాతీ ఏదో ఓ కూరో, పప్పో పాపం సింపుల్ జీవితం అట్టే ఆదరాబాదరా లేని జీవితం లాక్ డవున్ లోనూ ఇవన్నీ […]

Continue Reading
Posted On :

కథామధురం-మంథా భానుమతి

కథామధురం మంథా భానుమతి -ఆర్.దమయంతి ‘ ప్రతి స్త్రీ విషాదం వెనక ఒక మగాడు వుంటాడు ‘ అని నిర్ధారించే కథ… – శ్రీమతి మంథా భానుమతి ‘స్వార్ధం’ కథ. ***** ‘స్త్రీ అమూల్యమైనదే. కాకపోతే చాలా  అమూల్యమైన పరికరం.’ అందుకే, మగాడు తన  తెలివితోనో, మోసం తోనో..ఆమెని వినియోగించుకుని లబ్ది పొందాలని తహతహలాడతాడు. ఆ  ప్రయత్నం లో, ఆ ఆరాటంలో..చివరికి నైతికం గా ఎంతగా దిగజారుతాడూ అంటే – ఎంత ద్రోహం తలబెట్టడానికైనా వెనకాడడు.  అతనెవరో […]

Continue Reading
Posted On :

కథా మధురం-స్వాతీ శ్రీపాద

కథా మధురం   స్వాతి శ్రీపాద -ఆర్.దమయంతి  రచయిత్రి గురించి : స్వాతి శ్రీపాదగారు  40 యేళ్ళు గా ఇటు కథా సాహిత్యం లో, అటు నవలా సాహిత్యం లో ఎనలేని కృషి సలుపుతూ, ఎప్పటికప్పుడు నూతన ఒరవడిని సృష్టిస్తూ సాహితీ పథం లో ముందుకు సాగుతున్నారు. తెలుగు సాహిత్య ప్రపంచం లో పేరెన్నిక గల రచయిత్రులలో స్వాతి శ్రీపాద  గారి పేరు స్ఫుటం గా వినిపిస్తుంది. కథల పోటీలలో అనేక ప్రతిష్టాత్మకమైన బహుమతులను గెలుచుకున్నారు.  అవార్డ్స్ ని […]

Continue Reading
Posted On :

‘శక్తివంతమైన ఆలోచనా తరంగం..’ S/O. అమ్మ’ కథాంతరంగం!

కథా మధురం   ‘శక్తివంతమైన ఆలోచనా తరంగం..’ S/O. అమ్మ’   కథాంతరంగం! -ఆర్.దమయంతి అమ్మ అంటే దైవమని, ప్రేమకి ప్రతిరూపమనీ, త్యాగమయి, రాగమయి అనీ అదనీ ఇదనీ అమ్మని ఇంతగా ప్రగల్భాల అభివర్ణనలు సాగినా,  ఈ బిడ్డ ఫలానా అని అధికారికంగా ధృవీకరించాల్సి వచ్చినప్పుడు మాత్రం తండ్రి పేరుని మాత్రమే సూచించాల్సివస్తోంది. అదంతే. అదే రూల్. మార్చడానికి వీలు లేదు. అతిక్రమించాలని  ప్రయత్నించడానికి సైతం వీలు లేని ఆదేశం. రాజ్యాంగబధ్ధమైన ఈ నియమాన్ని, తాను అంగీకరించలేక, అయిష్టంగా […]

Continue Reading
Posted On :

జీవన వాస్తవాలకి సజీవ రూపకల్పన – ‘ కలలోని నిజం’

కథా మధురం జీవన వాస్తవాలకి సజీవ రూపకల్పన – ‘ కలలోని నిజం’  -ఆర్.దమయంతి ఇది కథే అయినా, కథ లా వుండదు. నిజం  లా వుంటుంది. ఇంకా చెప్పాలీ అంటే, మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్టుంటుంది.   కథలో పాత్రలు మనకు బాగా తెలిసినవారే కావడం ఈ కథలోని ప్రత్యేకం.    ఇంతకీ కథేమిటంటే : ఒక తండ్రి కి ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు. ఒక కూతురు. ఇద్దరూ జీవితం లో స్థిరపడతారు. అయితే, అల్లుడి కి […]

Continue Reading
Posted On :

కమ్మని కన్నీరిచ్చిపోయిన కథ – తోడబుట్టువు

  కమ్మని కన్నీరిచ్చిపోయిన కథ –  తోడబుట్టువు  -ఆర్.దమయంతి జీవితం లో ఎవరిని పోగొట్టుకున్నా,  ఆ స్థానాన్ని భర్తీ చేసుకునే అవకాశం వుంటుంది. కానీ, అమ్మ లేని శూన్యం మాత్రం – ఎప్పటికీ ఖాళీ గానే వుండిపోతుంది. కారణం? – అమ్మనీ, అమ్మ లేని లోటుని తీర్చగల ప్రత్యామ్నాయ శక్తి   మరొకటి ఈ సృష్టిలోనే లేదు. అమ్మ అమ్మే. అమ్మ ప్రేమ అమృతభాండమే.  ఆడపిల్లలకి అమ్మతో గల ప్రేమానుబంధాలు ప్రత్యేకం గా వుంటాయి. అమ్మ చేతుల్లోంచి ప్రవహించే […]

Continue Reading
Posted On :

కథా మధురం-కల

కథా మధురం  ఒక వాస్తవానికి మెలకువ గా నిలిచిన కథ – ‘కల’  (రచయిత: విద్యార్థి) -ఆర్.దమయంతి  ఈ ప్రపంచంలో అత్యంత కటిక బీదవాడు ఎవరూ అంటే, అందరూ వుండీ ఎవరూ లేని వాడు. తన ఒంటరితనమే తనకు తోడు గా  చేసుకుని బ్రతికే వాడు.    మనిషి సంపాదనలో పడ్డాక ఎన్నో ఆస్తులను  కూడపెట్టుకుంటాడు. కానీ, ముసలి వయసులో ఆసరా గా నిలిచే   అసలైన సంపదను మాత్రం పొందలేకపోతున్నాడు. ఏమిటా సంపదా, ఐశ్వర్యం అంటే – […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-అక్టోబర్, 2019

“నెచ్చెలి”మాట  “దుఃఖాన్ని జయించడం ఎలా?” -డా|| కె.గీత  “దుఃఖాన్ని జయించడం ఎలా?”  అన్న అన్వేషణతోనే గౌతముడు బుద్ధుడయ్యాడు. ఇక మనమెంత! “దుఃఖానికి మూలం కోరికలు. కాబట్టి  కోరికల్ని జయించాలి” వినడం ఎంత సులభమో ఆచరణ అంత కష్టాతికష్టమైన ఇటువంటి గంభీరమైన జీవితసత్యాల వరకూ వద్దు గానీ ఒక చిన్న చిట్కా ఉంది. చిట్కా అంటే అల్లం, నిమ్మరసం గోరువెచ్చటి నీట్లో కలుపుకు తాగడం అనుకునేరు! అబ్బే అందువల్ల ఉపశమించేంత  సులభమైంది కాదు దుఃఖం. అబ్బా ఈ దుఃఖోపశమన మంత్రం […]

Continue Reading
Posted On :

అనుసృజన-అస్తిత్వపోరాటానికి చిరునామా: అమృతా ప్రీతమ్

అస్తిత్వపోరాటానికి చిరునామా :అమృతా ప్రీతమ్ – ఆర్.శాంతసుందరి ఒక స్త్రీ అందంగా ఉంటే,ఆపై ప్రతిభ గలదైతే,తన అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాలని అధిగమించేందుకు ఈ ప్రపంచంతో హోరాహోరీ పోరాడుతూ పేరు తెచ్చుకోడం ప్రారంభిస్తే ఆమెకి ఎన్ని రకాల సమస్యలు ఎదురౌతాయో తెలుసుకోవాలనుకుంటే అమృతా ప్రీతమ్ జీవితమే దానికి మంచి ఉదాహరణ. అమృతా ప్రీతమ్ కూడా ప్రేమ్ చంద్ , శరత్ చంద్ర లాగ తెలుగు సాహితీ ప్రేమికులకి సుపరిచితమే. ౧౦౧౯,౨౧ ఆగస్ట్ లో పుట్టిన అమృత […]

Continue Reading
Posted On :

సోమరాజు సుశీల స్మృతిలో: ఇల్లేరమ్మకు నివాళి

సోమరాజు సుశీల స్మృతిలో –  ఇల్లేరమ్మకు నివాళి    -తమిరిశ జానకి  స్నేహసుగంధ పరిమళం….నిష్కల్మష హృదయం…..నవనీత సమాన మానసం చతురోక్తుల పలుకుల సంబరం కలగలిసి రూపుదిద్దుకున్న స్వరూపమే మాఇల్లేరమ్మ శ్రీమతి సోమరాజు సుశీలగారు. 1945లో తూర్పుగోదావరిజిల్లా సిద్ధాంతంలో జన్మంచిన సుశీలగారికి 1966 లో వివాహమయినది. అప్పటికి ఆవిడ ఎమ్.ఎస్.సి. పట్టా పుచ్చుకున్నారు. కొన్నాళ్ళు విజయవాడ మేరీస్టెల్లా కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేశారు. ఆతర్వాత శ్రీవారితో కలిసి పూనేలో ఉన్నప్పుడు అక్కడి నేషనల్ కెమికల్ లేబొరేటరీలో సైంటిస్ట్ గా చేశారు. డాక్టరేట్ […]

Continue Reading
Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- సహన సముద్రం మా అమ్మ-3వ భాగం

ఇట్లు  మీ వసుధా రాణి  సహన సముద్రం మా అమ్మ-3వ భాగం -వసుధారాణి        పూర్తిగా బాల్యంలోకి వెళ్ళిపోయి గత రెండు నెలలుగా ధారావాహికగా రాస్తున్న అమ్మ కథ ముగించాలని అనుకుటుంటేనే ఏదో బాధ.మన అందరి ఆరంభం కదా అమ్మ ముగింపు ఏమిటి అని మనసులో ఓ మూల కలుక్కుమంటున్ననొప్పి.కానీ తప్పదు మొదలు పెట్టింది ముగించాలి కదా.నిజానికి నా జీవితంలో అమ్మ ముగిసిపోలేదు,ఎక్కడికీ వెళ్ళలేదు.ఎందరో రూపంలో వస్తూనే ఉంది నా తల ఆప్యాయంగా నిమురుతూనే ఉంది. […]

Continue Reading
Posted On :

ఉనికి పాట -ఓ వీధిదీపం నీడన

ఉనికి పాట ఓ వీధిదీపం నీడన -చంద్ర లత     అతనొక సామాన్యుడు.బడిపంతులు.అందమైన ప్రేయసి. కుదురైన జీవితం. కలల దుప్పటి కప్పుకొన్న యువకుడు. ఆమె ఒక కేబరే గాయని. నటనావిద్యార్థి. ఒక గాయపడ్డ గృహిణి.వంటరి తల్లి. సాంప్రదాయాలకు ఆవలగా విచ్చుకొన్న గొంతుక. అతనొక సైనికాధికారి. రాజద్రోహిగానిలిచిన దేశబహిష్కృతుడు. కరుకు నిబంధనల్లో విదిల్చిన సిరాచుక్క. ఆమె ఒక కళాకారిణి. నియంతృత్వం గీసిన గీటు దాటి గొంతెత్తితే,మరణదండనే. పాడమన్న పాట పాడలేక, ఖండాంతరాలు చేరిన కాందిశీకురాలు. భిన్నమైన మనుషులు,నేపథ్యాలు. భిన్నమైన […]

Continue Reading
Posted On :

మా కథ -1 గని కార్మికుల నివాసం

మా కథ  -ఎన్. వేణుగోపాల్  గని కార్మికుల నివాసం సైగ్లో-20 ఒక గని శిబిరం. అక్కడున్న ఇళ్లన్నీ కంపెనీవే, చాలామంది గని పనివాళ్లు పొరుగున ఉన్న లలాగువాలోను, దగ్గర్లోని ఇతర కంపెనీయేతర గ్రామాల్లోనూ కూడా నివసిస్తారు. ఈ శిబిరంలోని ఇళ్లన్నీ ఏ ప్రకారం చూసినా అద్దెవే కాని పనిచేసినంతకాలం కార్మికులకుంటారు. కంపెనీ మాకు వెంటనే ఇళ్లివ్వదు, ఇక్కడ ఇళ్ల కొరత బాగా ఉంది. ఐదేళ్లు, పదేళ్లు కూడా ఇల్లు దొరకకుండా పనిచేసిన గని పనివాళ్లెంతో మంది ఉన్నారు. […]

Continue Reading
Posted On :

ఫక్కున నవ్వెను పూర్ణమ్మ….(కథ)

ఫక్కున నవ్వెను పూర్ణమ్మ…. -వసుంధర అబద్ధం చెప్పే అలవాటు చిన్నప్పుడే లేదు నాకు. కొత్తగా రమ్మంటే ఇప్పుడెలా వస్తుందీ? కానీ నా గురించి మంచి మాటలు చెప్పినవాళ్ల గురించి నేనూ నాలుగు మంచి మాటలు చెప్పాలి కదా! అబద్ధం చెప్పలేను. నిజం చెబుదామంటే – నిష్ఠూరమౌతుందని భయం. నన్ను ప్రేమించేవాళ్లు. నా మనసుకు కష్టం కలగకూడదనుకునేవాళ్లు. ఆపైన తామందుకుంటున్న ఉన్నత శిఖరాలకు నేనే కారణమని స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నవాళ్లు. వాళ్ల గురించి అబద్ధం చెప్పలేను. నిజం చెప్పాలి. కానే […]

Continue Reading
Posted On :

చిత్రం-4

చిత్రం-4 లోయిస్ గ్రీన్ ఫీల్డ్ -గణేశ్వరరావు  ఈ అద్భుతమైన ఛాయా చిత్రాన్ని తీసిన  లోయిస్ గ్రీన్ ఫీల్డ్ నాట్య ఛాయాచిత్రకారిణిగా  సుప్రసిద్ధురాలు. ఆమె ఫొటోల్లో వస్తువు: కదలికలు, ఇతివృత్తo : సమయం. సహజ సిద్ధమైన కదలికలను నిశ్చలన ప్రతిబింబాలు గా చేయడంలో   ఆమె నైపుణ్యం అపారం. నాట్యకారుల అద్భుతమైన నృత్య భంగిమలను తన కెమెరా ఫిల్మ్ లో బంధించి గలదు, ఆ కళాకారుల సృజనాత్మకతకు దీటైన సృజనాత్మకతను తన ఫోటోగ్రఫీలో  కనబరచగలదు. ‘ప్రతిబింబించు క్షణాలు ‘ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 4

నా జీవన యానంలో- (రెండవభాగం)- 4 -కె.వరలక్ష్మి  M.A. తెలుగులో స్పెషలైజేషన్ కి చేమకూర వేంకటకవిని ఎంచుకున్నాను. ఎందుకంటే ఆయన వ్రాసినవి రెండు కావ్యాలే అందుబాటులో ఉన్నాయి కాబట్టి. 1.విజయ విలాసము, 2. సారంగధర చరిత్రము. చదువుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు అనుకున్నాను. ఇప్పట్లాగా నెట్ లోనో , పుస్తకాల షాపుల్లోనో విరివిగా బుక్స్ దొరికే కాలం కాదు. నాకేమో మోహన్ కూడా పి.జి. చేసి హెడ్ మాస్టరో, లెక్చరరో అయితే బావుండునని ఉండేది. బుక్స్ కొనేస్తే తనే […]

Continue Reading
Posted On :

ప్రమద -టోనీ మారిసన్ “రెసిటటిఫ్” కథ

ప్రమద టోనీ మారిసన్ –ఎ.వి. రమణమూర్తి టోనీ మారిసన్ రాసిన కథ- రెసిటటిఫ్ (1983) ఈ కథలోని గమ్మత్తైన విషయం ఏమిటంటే, కథ బొత్తిగా అర్థం కాకుండా పోదు; అలాగని పూర్తిగానూ అర్థం అయినట్టు ఉండదు. ఎక్కడో ఒక అసౌకర్యపు మలుపు దగ్గర మనల్ని వదిలేసే ఈ  కథలోని అంతరార్థాల ఉనికిని గమనించి, వాటిగురించి ఆలోచించడం కోసం దీనిని చదవాలి. 1987లో ప్రచురించబడిన ‘Beloved’ నవలకి ముందు,1983లో టోనీ మారిసన్ రాసిన కథ ఇది. 2015లో ది […]

Continue Reading
Posted On :

 కొత్త అడుగులు-2 (సుభాషిణి తోట)

 కొత్త అడుగులు-2 కొత్తతరపు చిక్కని కవిత్వస్వరం సుభాషిణి !  –శిలాలోలిత ఇటీవలి కాలంలో కవిత్వం రాస్తున్న కవయిత్రులలో చిక్కని కవిత్వం రాసే శక్తి సుభాషిణికి ఉంది. కొన్ని సంవత్సరాలుగా కవిసంగమంలో రాస్తున్న ఆమె కవిత్వం ఏవిధంగా మార్పుకు గురవుతూ, పరిణతి చెందుతూ వచ్చిందో గమనించే అవకాశమూ నాకు కలిగింది. అందుకే ఈ కవయిత్రి మీద  ప్రత్యేకాభిమానం. అధ్యయనం, జీవితం మీద, కవిత్వం పట్ల ఉన్న మక్కువా ఆ మూడింటినీ కలిపి కవిత్వాన్ని చేస్తున్న తీరూ సుభాషిణిని ఈ […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -3

జ్ఞాపకాలసందడి -3 -డి.కామేశ్వరి  నాకు  మా వారి వల్ల వచ్చినఒక మంచి అలవాటు ఇంటిఖర్చుల పద్దురాయటం. ఇపుడు మంచి అలవాటు అని వప్పుకుంటున్నాగాని  ఆయన వున్నపుడు చచ్చినా రాయలేదు. ఆయనకి, నాకు ఎప్పుడు ఒక గొడవ ఉండేది. నాకు ఇంటిఖర్చుకింద డబ్బు ఇవ్వాలి, అదెలా ఖర్చు పెడతానో నా ఇష్టం. మీకు మూడుపూటలా తిండిపెట్టడం నా వంతు. ఇచ్చిందాంట్లో మిగిలిందో, దీనికెంత దానికెంత అని అడగొద్దు అనేదాన్ని. ఆయనగారి గవర్నమెంట్ ఆఫీస్ బుద్ధి  నా దగ్గరచూపిస్తూ ముందు […]

Continue Reading
Posted On :

పునాది రాళ్ళు-4

పునాది రాళ్ళు-4 –డా|| గోగు శ్యామల  కోదురుపాక గ్రామంలో పోరాటాలు సాగుతున్నాయి. వాటికీ ఆ గ్రామ ప్రజలే నాయకత్వం వహిస్తున్నారు. ఎం ఎల్ పార్టీ పరోక్షంగా  సలహాలు ఇస్తూ రాజకీయ మద్దతు ఇచ్చినప్పటికిని పోరాటంలో ముందు భాగాన గ్రామస్తులే ఉన్నారు. ఆలా ఉన్నవారిలో చిట్యాల చినరాజవ్వ ఒకరు. ఈమెతో పాటు ఇతర దళిత మహిళలు పురుషులూ ఉన్నారు. వారే మాదిగ  బానవ్వా , మాదిగ కనకవ్వ, కుడుకల దుర్గయ్య తదితరులున్నారు. 1970 నుండి 1980వరకు గల దశాబ్దంలో […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-4

నారి సారించిన నవల -కాత్యాయనీ విద్మహే 4 1924 లో అ.పె. పిరాట్టమ్మ వ్రాసిన నవల ‘శోభావతి’ వచ్చింది. నగానపల్లి సంస్థాన ఆస్థాన కవి కసిరెడ్డి వేంకట సుబ్బారెడ్డి వ్రాసిన పరిచయ వచనం వలన, ‘స్వవిషయము’ అనే శీర్షికతో రచయిత్రి వ్రాసిన ముందుమాట వలన  పిరాట్టమ్మ జీవిత విశేషాలు కొన్ని తెలుస్తున్నాయి. ఆమె భర్త శ్రీమాన్ ఏ. నమ్మాళ్వారయ్య. ఆయన కడప మండలం లో ప్రొద్దుటూరు తాలూకా తహసీల్దారు గా పనిచేసాడు. ఆంద్ర ఆంగ్ల సంస్కృత భాషా […]

Continue Reading

తీర్పు (బాల నెచ్చెలి-తాయిలం)

                                                తీర్పు –అనసూయ కన్నెగంటి          ఒకరోజు ఒక విచిత్రమైన తగవు తీర్పు కోసం వచ్చింది రాజుగారి దగ్గరకి.           గంగయ్య, మంగయ్య ఇద్దరూ పక్క పక్క పొలాలున్న రైతులు. గంగయ్య మోసకారి. తన పొలం నాలుగు పక్కలా ఉన్న రైతుల్లో ముగ్గురు రైతులు వాళ్ళ వాళ్ల […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- అమ్రితా ప్రీతమ్

    క’వన’ కోకిలలు-  అమ్రితా ప్రీతమ్  -నాగరాజు రామస్వామి   ( ఆగస్టు 31 , 1919 – అక్టోబర్ 31 , 2005 )                                                            ” శాంతి కేవలం సంక్షోభ రాహిత్యం కాదు; […]

Continue Reading

పుస్తక సమీక్ష – మైనా

   మైనా     -వసుధారాణి     రచయిత :-  శీలావీర్రాజు 1969 లో’ మైనా’ నవలకు ఆంద్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ నవల పురస్కారం  లభించింది. వెలుగు రేఖలు కాంతిపూలు కరుణించని దేవత ఆయన ఇతర నవలలు. పది కథా సంపుటాలను, తొమ్మిది కవిత్వ సంకలనాలను రచించారు. కాలానికి ఇటూ అటూ (వ్యాస సంపుటి) శిల్పరేఖ (లేపాక్షి రేఖా చిత్రాలు) శీలావీర్రాజు చిత్రకార్తీయం (వర్ణ చిత్రాల ఆల్బమ్). ఒక వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి అయివుండటం అరుదైన విషయం.సాహిత్యం,చిత్రకళ ఈ రెండిటిలోనూ సమానంగా […]

Continue Reading
Posted On :

కంప్యూటర్ భాషగా తెలుగు-2(తెలుగు టైపు ప్రాథమిక దశ)

కంప్యూటర్ భాషగా తెలుగు  తెలుగు టైపు ప్రాథమిక దశ   -డా|| కె. గీత “1923 అక్టోబర్ నెలలో గుంటూరు నుంచి శ్రీ దిడుగు వెంకట నరసింహారావు తెలుగు టైప్ రైటర్ తయారు చేయడానికి ఆర్ధిక సహాయం కోసం ప్రకటన చేశారు.  ఆ తరువాత అదే సంవత్సరం డిసెంబర్ నెలలో తెలుగులో మొదటి టైప్ రైటర్ తయారు చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం తన వద్ద కూడా ఉన్నదని నిజాం రాజ్యంలోని భువనగిరి దగ్గర గ్రామమైన కొండగడప […]

Continue Reading
Posted On :

నారీ”మణులు”- దుర్గాబాయి దేశ్‌ముఖ్-2

నారీ”మణులు” దుర్గాబాయి దేశ్‌ముఖ్  -కిరణ్ ప్రభ   దుర్గాబాయి దేశ్‌ముఖ్ (జూలై 15, 1909 – మే 9, 1981) భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త . చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఈవిడే స్థాపించారు. ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభ, ప్రణాళికా సంఘ సభ్యురాలు. ఆమెను భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ […]

Continue Reading
Posted On :

Telugu As A Computational Language-Telugu typing- A Beginning

Telugu typing- A Beginning  (Chapter-2) -Dr Geeta Madhavi Kala In October 1923, Sri Didugu Venkata Narasimharao from Guntur announced for financial assistance to make a Telugu Typewriter. Later in December of the same year, Acharya from Konda gadapa, a village near Bhuvanagiri in the Nizam’s kingdom, announced that he had the technology necessary to make […]

Continue Reading
Posted On :

పిట్ట గూళ్లు-యోగ్యతా పత్రం అవసరం లేని కథలు

పిట్ట గూళ్లు -సి.బి.రావు  యోగ్యతా పత్రం అవసరం లేని కథలు    కథలంటే పైపైన ఉన్నాయనుకున్నావా అవి రాయడానికెంతో ప్రజ్ఞ కావాలి చదవడానికెంతో రుచుండాలి ఒక్కోకథ ఒక్కో సందర్భంలో ఒక్కొక్కణ్ణి ఒడ్డున పడేస్తుంది అందుకే చదువులేని వృద్దుడుకన్నా చదువుకున్న యువకుడే మిన్న –శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి   కె.వరలక్ష్మి గారి కథలు, వాటిలోని పాత్రలు ఆకాశం నుంచి ఊడిపడవు. మన చుట్టూ ఉన్న సమాజంలోంచి, ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలోంచి ప్రాణం పోసుకున్నవే ఈ “పిట్టగూళ్ళు” కథా సంపుటి […]

Continue Reading
Posted On :

Cineflections: Nimajjanam (Immersion)

Cineflections: Nimajjanam (Immersion)  -Manjula Jonnalagadda Language: Telugu Year: 1979 Hindus believe Ganga washes away their sins.  If a person’s ashes are immersed in the river Ganga, that person will be relieved form the cycle of birth and death. If a person dies in Varanasi, they attain salvation. There are several people who go there just […]

Continue Reading
Posted On :

రమణీయం: మనకోసమే!

రమణీయం మనకోసమే! -సి.రమణ  ట్రాఫిక్ నిబంధనలున్నది మనకోసమే. ఐతే, అవి మనకోసం అని, మనకు తెలియదు. అందుకనే మనం వాటిని అసలు పట్టించుకోము. కూడళ్ళ వద్ద వుండే ఎరుపు, ఆకుపచ్చ దీపాలను, చాలసార్లు గమనించకుండా, గుడ్డెద్దులాగా ప్రవర్తిస్తాము. కూడళ్ళ వద్ద రంగుల దీపాలతో పాటు, పోలీస్ వుంటేనే, మనం బాధ్యతకల పౌరులవలె ప్రవర్తిస్తాము. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, వాహనం నడపటం, మత్తు పదార్థాలు సేవించి వాహనం నడపడం, పాదచారులు కూడా సెల్‌ఫోన్ లో మాట్లాడుతూ రోడ్ దాటడం వంటివి […]

Continue Reading
Posted On :

కథా మధురం-దూరపు కొండలు (ఉమ అద్దేపల్లి)

కథా మధురం   కథా సాహిత్యం లో  – నే చదివిన స్త్రీలు దూరపు కొండలు (ఉమ అద్దేపల్లి కథ)  -ఆర్.దమయంతి శీర్షిక గురించి నాలుగు మాటలు : కథా సాహిత్యం లో  నే చదివిన స్త్రీలు ఎందుకు రాయాలనిపించిందంటే .. ఏ కథ చదివినా, ఎవరి కథ విన్నా అందులో స్త్రీ  పాత్ర ఏమిటా అని శ్రధ్ధ గా ఆలకిస్తూ, ఆ కారెక్టరైజేషన్ ని పరిశీలిస్తుంటాను.  ఈ గమనిక వల్ల, స్టడీ వల్ల, నాకు తెలీని ఎందరో […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-1

  కనక నారాయణీయం-1     –పుట్టపర్తి నాగపద్మిని  కథలు వినటంలోని ఆనందాన్ని ఆస్వాదించటం మా  అమ్మమ్మ శ్రీమతి శేషమ్మ గారి ద్వారా మొదలైందన్నాను కదా!! అసలు నా పుట్టుక వెనుక కూడా ఓ ఉత్కంఠభరితమైన ఉదంతముందని అమ్మమ్మే చెబుతుంటే………వినటం…ఒక మహత్తరానుభూతి నాకైతే!! అదేమిటో మీరూ ఆలకించండి…కాస్త ఉపోద్ఘాతం తరువాత!! ప్రొద్దుటూరినుండీ..కడపకు వలస వచ్చేసిన కారణం, ఇక్కడి మోచంపేటలో శ్రీ రామకృష్ణా హైస్కూల్ లో తెలుగు పండితుడిగా అయ్యకు ఉద్యోగం రావటం. జీతం అప్పట్లో తక్కువే, పైగా తెలుగు పండితుడికి కాబట్టి, […]

Continue Reading

గద్వాల రాజసం… రాచరీకము

గద్వాల రాజసం… రాచరీకము -విశాలి పేరి గద్వాల్…  ఈ పేరు వినగానే మనకు మొదట గుర్తుకొచ్చేది చీరలు, ఆ తరవాత ఈ మద్యన వచ్చిన అరుందతి సినిమా!  కానీ ఆ గద్వాల… అంటే విద్వద్ గద్వాల అని సాహీతీ సుమాల మాల అని పట్టుచీరల జరీ రెపరెపల… కృష్ణమ్మ పరవళ్ళ గలగలల గద్వాల్ అని మీకు తెలుసా? (ఎంత మందికి తెలుసు..?) చరిత్ర : ఈ గద్వాల చరిత్ర ఒకసారి తెలుసుకుందాము. గద్వాల సంస్థానము తుంగభద్ర మరియు […]

Continue Reading
Posted On :

గజల్-అమ్మచేతి గోరుముద్ద

  గజల్-అమ్మచేతి గోరుముద్ద –జ్యోతిర్మయి మళ్ల  అమ్మచేతి గోరుముద్ద తింటుంటే ఎంత హాయి అమ్మచీర కుచ్చిళ్ళలొ దాగుంటే ఎంత హాయి   అన్నలక్కలందరూ ఆడుకుంటు ఉంటారు అమ్మ ఒడిలొ కూచునీ చూస్తుంటే ఎంత హాయి   జ్వరమొచ్చిన బాధంతా లేనె లేదు హుష్ కాకి అమ్మ భుజమ్మీద నిదురపోతుంటే ఎంత హాయి   అందమంటే అమ్మదే ఎవరు లేరు లోకంలో అమ్మతోటి ఈమాటను చెబుతుంటే ఎంత హాయి   నవ్వు వెనక ఎంత బాధ దాగుందో తెలియదులే […]

Continue Reading

షర్మిలాం“తరంగం”-4

షర్మిలాం”తరంగం” వ్యక్తిగతాల్లోకి జొరపడొద్దు -షర్మిల కోనేరు  పక్కవాళ్ల జీవితాల్లోకి తొంగి చూసే నైజం మనలో ఎక్కువగానే కనిపిస్తుంది . వాళ్లతో కష్టం సుఖం పంచుకోవడం వేరు వ్యక్తిగత జీవితాల్లోకి జొరబడడం వేరు. ఎదుటివాళ్ల వ్యక్తిగతాన్ని వాళ్లకే వదిలెయ్యాలనే కనీస స్పృహ లోపిస్తోంది. ఇంతగా ఎదుగుతున్న మనం మరుగుజ్జులుగా మారిపోతున్నాం . ఎదుటివాళ్లను జడ్జ్ చేసే అధికారం మనకు ఎవరిచ్చారు? ఇటీవల ప్రముఖవ్యక్తులు కొందరి మరణం ఇదే ప్రశ్న లేవనెత్తింది. ఎదుటి వాళ్ల జీవితం గురించి , విలువల […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం(మెక్సికో)-4

యాత్రాగీతం(మెక్సికో)-4 కాన్ కూన్  -డా||కె.గీత భాగం-6   కాన్ కూన్ లో మొదటి రోజు  టైం షేరింగు స్కీము వాళ్ల బారిన పడి సగం రోజు వృథా అయినా సాయంత్రం వెళ్లిన  పైరేట్ షిప్పుటూరుతో ఆహ్లాదంగా గడిచింది. రెండవ రోజు మేం ఆధునిక ప్రపంచ వింతల్లో ఒకటైన “చిచెన్ ఇట్జా” టూరుకు బుక్ చేసుకున్నందున ఉదయానే లేచి తయారయ్యి  హోటలు లాబీలో చక్కని రెస్టారెంటులో బ్రేక్ ఫాస్టు చేసి టూరు బస్సు కోసం సిద్ధమయ్యేం. మా హోటలు […]

Continue Reading
Posted On :
లక్ష్మీ కందిమళ్ళ

ఆమె ధరణి(కవిత)

ఆమె ధరణి -కందిమళ్ళ లక్ష్మి  కొందరు అప్పుడప్పుడు కఠిన మాటలతో ఆమెను శిలగా మారుస్తుంటారు.  ఆమె కూడా చలనం లేని రాయిలా మారిపోతూ ఉంటుంది. ఆమె  ఒక మనిషని మరచిపోతుంటారు.  కానీ ఆమె మాత్రం చిరచిత్తంతో మమతానురాగాల వంతెనపైనే నడుస్తూ ఉంటుంది. ఆమెనుఒక చైతన్య మూర్తిగా ఎప్పుడు గుర్తిస్తారు?? మీకు తెలియదా??ఆమె ఎప్పుడూ లాలిత్యాన్ని వదలని ఒక ధరణని!!***** కందిమళ్ళ లక్ష్మికర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading

America Through my eyes-Los Angeles -part 1

America Through my eyes -Los Angeles-1   Telugu original : K.Geeta  English translation: Swathi Sripada Los Angeles! world renowned great city. No wonder, if everyone in the world knows its name. People in India, when we say ‘we are in California,’ “You are in Hollywood then” they   comment. I was so anxious to visit […]

Continue Reading
Posted On :

వ్యక్తి-శక్తి(కవిత)

వ్యక్తి-శక్తి -డా||కె.గీత వ్యక్తిగా మొదలవ్వడం అంటే నీకు నువ్వే అంకురమవ్వడం నీ జీవితానికి నువ్వే బాధ్యతకావడం నిన్ను నువ్వే ప్రేమించుకోవడం ద్వేషించుకోవడం నీలోనువ్వే మాట్లాడుకోవడం పోట్లాడుకోవడం నీకు నువ్వుగా మిగలడం వ్యక్తిగా ఉన్నంతసేపు నీ పరిధి నీ కనుచూపుమేర- నీ దుఃఖోపశమనం నీ అరచేతికందినంతమేర- నీ బాధల్ని నువ్వే తుడుచుకోవడం నీ బంధాల్ని నువ్వే పెంచుకోవడం నువ్వే తుంచుకోవడం *** సమిష్టిగా మొదలవ్వడం అంటే నీకు నువ్వే కొత్తగా పరిచయం కావడం సమిష్టిశక్తిగా మొదలవ్వడం అంటే నీ  […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల(భాగం-4)

వెనుతిరగని వెన్నెల(భాగం-4) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/F-B9S8XIchA వెనుతిరగని వెన్నెల(భాగం-4) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది […]

Continue Reading
Posted On :

Garden Meditation Day

Garden Meditation Day! –Satyavani Kakarla Thanks to the New age movement that although most of us have become too familiar with the word meditation, the most commonly and ignorantly used term, it still remains an enigma, a paradox… Going to the etymology of the word ‘meditation’, it derives from the Latin root meditatum, meaning to […]

Continue Reading
Posted On :