image_print
subashini prathipati

నీకు నాకు మధ్యన (కవిత)

నీకు నాకు మధ్యన -సుభాషిణి ప్రత్తిపాటి అప్పుడెప్పుడో… దశాబ్దాల క్రితంఏడేడు జన్మల బంధంనీది నాది అనుకుంటూ…అడుగులో అడుగు వేసినప్పుడుమన మధ్యన ఏముంది?? మహా గొప్పగా చెప్పడానికి!తొలి వలపులతహతహల చెర వీడిన మలి అడుగుల్లో …మది తలుపులేవో మెల్లగా తెరిచాక కదాఅగాధాల లోతులు తెలిసిందికర్కశపు జాడలు చూసింది కన్నీటి వ్యథ ఎదురైంది అప్పుడు మన నడుమదట్టమైన గాజు తెరలుమన నీడలే మనకు శత్రువులైఅనిశ్చితంగా కదలాడేవి! గదిలోపలి గోడలు బీటలు వారిన ఇన్నేళ్ళకు,నాకర్థమయింది,కాలంతో పాటు మంచులా కరిగింది మన మధ్యన ఇన్నాళ్లూ పేరుకున్న *నిశ్శబ్దమని*! శాబ్దికమయినాకే తెలిసిందిహృదయం రవళిస్తుందని, అదేమిటోఁ…. ముసురుకున్న హృదయాకాశంకరుణావృష్టిని ధారపోస్తే […]

Continue Reading
subashini prathipati

ఆరాధనాగీతి (కవిత)

ఆరాధనాగీతి -సుభాషిణి ప్రత్తిపాటి పాత పుస్తకాలుతిరగేస్తుంటే నెమలీక జారిపడింది,ఎన్ని దశాబ్దాల నాటిదోఇంకా శిథిలం కాలేదుగుండెలో దాచుకున్నతొలివలపులా ఇంకామెరుపులీనుతూనే ఉంది! ఊరంతామారిపోతోందిపాతభవనాలన్నీ రాళ్ళగుట్టలవుతుంటేఅల్లుకున్న నా జ్ఞాపకాలన్నీచెంపలపై చెమ్మగా జారసాగాయి!అదిగో ఆ రంగువెలసినఅద్దాలమేడ కిటికీ మాత్రంతెరిచే ఉందిఅక్కడినుంచి ఒకప్పుడునన్ను తడిమిన పద్మనేత్రాలులేకపోవచ్చుకానీఆ ఆరాధనా పరిమళం మాత్రంఇప్పటికీనాకు నిత్యనూతనమే!!మా కళాశాలకుపాతబడిన విద్యార్థిగావెళ్లాను,అన్నీ నవాంశలే అక్కడ,కొత్త గదులు,చెట్లుఒక్కటిమాత్రమేనన్ను హృదయానికిహత్తుకుందిపాత మిత్రుడిలా..నా వేళ్ళు తడిమిన ఆ పుటలన్నీవిశ్వభాషలో నన్నుపలకరించాయి,నన్ను సేదతీర్చాయిచంటిపాపను చేసి లాలించాయితాదాత్మ్యతలోకాలం తెలీనేలేదు.సముద్రం వైపునడిచాను.తీరం హంగులు దిద్దుకుంది గానీ…అలల దాహమే ఇంకాతీరినట్టు లేదునా బాల్యంలోలాగేఒకటే […]

Continue Reading
subashini prathipati

ప్రత్తిపాటి నానీలు (కవిత)

ప్రత్తిపాటి నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి 1. అమ్మే.. నా బలం ఎప్పుడూ! నా కలంలో సిరా.. అమ్మ కన్నీళ్ళేగా! 2. ఆమె కళ్ళకు ఒకటే ఋతువు! అతని అహం తీర్చే… శ్రావణమేఘాలవి! 3. ఆ రాత్రి అరుణమై జ్వలించింది! వీరుని రక్తం పూసుకుందదిగో కశ్మీరం! 4. ఆదివారం ఒక్కటే, బతికిపోయాను…! రెండైతే… బొందితో స్వర్గమే!.. 5. అంతా ఆ నలుగురే! ఆహ్వానించడానికీ‌… సాగనంపడానికి కూడా! 6. అవమానాలు తూటాల్లాంటి మాటలవ్వచ్చు. కానీ… గుండెకు తూట్లు కారాదు! 7. […]

Continue Reading
subashini prathipati

హృదయ పుష్పకం (కవిత)

హృదయ పుష్పకం -సుభాషిణి ప్రత్తిపాటి ఆ మూడుకాళ్ళ ముసలితో…పరుగులు తీయలేక…పగలంతా అలసి , సొలసినిద్రా శయ్యపై తలవాల్చగానే…కలలు తలగడై జోలపాడగాఅంతులేని శాంతి పొందిన నా హృదయంలోవేకువ రాలే పారిజాతాల్లా…… నూతనోత్తేజపు పరిమళాలు! జారే వెచ్చని కన్నీళ్ళనుపీల్చుకునేనా కొంగు చల్లని తోడై నాతో నడుస్తూ…అవసరమైన చోటల్లా…నడుంచుట్టూ బిగిసినవశకానికి నాందీ వాక్యమైసుప్రభాతపు పూవై వికసిస్తుంది! తలపుల తడితో…ఊహల అల్లరితో వల్లరిగా సాగి,హృదయ కుహరంలో బీజమై…లోలోపలి ఆశలకు చివురులు తొడిగి,రగిలే క్షణాలను సింధూరంగా మార్చుకుంటూ…తూరుపు వీణెపై పలికే నవరాగానికిజత కలిసే తాళమై….వేవేల మయూఖలుగా ఉదయించేభానుతేజమై…భావికి వెలుగయే […]

Continue Reading