image_print
Kandepi Rani Prasad

ఎలుక పిల్ల పెళ్ళి

ఎలుక పిల్ల పెళ్ళి -కందేపి రాణి ప్రసాద్ ఒక ఎలుక తన కూతురికి పెళ్ళిచేయాలి అనుకున్నది. అనుకున్నదే తడవుగా తన మిత్రులందరికీ చెప్పింది. మా పిల్లకు మంచి సంబంధాలు చూడమని అందరినీ కోరింది. అందరూ మంచి సంబంధాలు చూస్తామని మాట ఇచ్చాయి . ఎలుక తన కూతురికి బాగా అందగాడైన భర్తను తీసుకురావాలని అనుకున్నది. ఒక రోజు నెమలి మంచి కబురు తీసుకు వచ్చింది . ” మీ పిల్లకు చాలా అందంగా ఉన్న వరుడిని చూశాను […]

Continue Reading
Kandepi Rani Prasad

తల్లి మాట వినని పిల్లపాము

తల్లి మాట వినని పిల్లపాము -కందేపి రాణి ప్రసాద్ “నొప్పి  తగ్గిందా తండ్రీ!” అంటూ అడిగింది నాగరాణి తన పుత్ర రత్నాన్ని. “ఇంకా చాలా నోప్పిగా ఉందమ్మా” ఏడుపు తన్నుకొస్తుండగా పాము పిల్ల బాధగా చెప్పింది. నాగరాణి అనే తల్లిపాము కూడా కళ్ళ వెంట నీరు కారుస్తూనే ఉన్నది.           “అయినా నేను జాగ్రత్తలు చెప్పి వెళ్ళాను, నువ్వు వినిపించుకోలేదు. పుట్ట విడిచి బయటకు రావద్దన్నానా! అంటూ తల్లి పాము తన కొడుకు […]

Continue Reading
Kandepi Rani Prasad

అన్యాయం చేస్తే చావు తప్పదు

అన్యాయం చేస్తే చావు తప్పదు -కందేపి రాణి ప్రసాద్ అనగనగా ఒక అడవి ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలున్నాయి.  ఆ చెట్లనిండా పక్షులు గూళ్ళు కట్టుకుని కాపురం చేస్తున్నాయి. పావురాయి, పిచ్చుకలు, కాకులు, రామచిలుకలు, గోరింకలు ఇలా రకరకాల పక్షులకు నెలవుగా ఉండేవి. చెట్ల మీద గూళ్ళు కట్టుకున్న పక్షు లన్నీ జాతి భేదం మరచి అన్యోన్యంగా ఉంటాయి. ఒకరినొకరు ఆనందంగా పలకరించు కుంటాయి.           పొద్దున్న లేవగానే ఎవరి పిల్లలకు వాళ్ళు […]

Continue Reading
Kandepi Rani Prasad

మాటలు – చేతలు

మాటలు – చేతలు -కందేపి రాణి ప్రసాద్ ఒక కుందేలు తన పిల్లలతో సహా బొరియలో నివసిస్తోంది. ఈ బొరియ చెట్టు కిందనే ఉన్నది. చెట్టు మీదుండే పక్షులన్నీ కుందేలుతో స్నేహంగానే ఉంటాయి. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పక్షులన్నీ మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆ సమయంలో కుందేలు కూడా వాళ్ళతో కబుర్లాడుతూ ఉంటుంది. ఇరుగు పొరుగు స్నేహాలు బాగుండా లని కుందేలు కోరుకుంటుంది.           కుందేలుకున్న నాలుగు పిల్లలు ఆటలు ఆడుతూ కొట్టుకుంటూ […]

Continue Reading
Kandepi Rani Prasad

సింహం మనోగతం

సింహం మనోగతం -కందేపి రాణి ప్రసాద్ అదొక టైగర్ సఫారీ. పేరుకు టైగర్ సఫారీ అని పేరు కానీ అందులో సింహాలు, ఏనుగులు, ఖడ్గమృగాలు ఎలుగుబంట్లు వంటి పెద్ద జంతువులన్నీ ఉంటాయి. స్వేచ్చగా ప్రశాంత వాతావరణంలో జీవిస్తుంటాయి. అని మనుషులు చెప్తారు కానీ నమ్మకండి. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే నేనొక సింహాన్ని, నా కథ చెబుతా వినండి.           నేనొక సింహాన్ని. సింహమంటే ఎవరు? అడవికి రాజు కదా! అడవిలో రాజులా బతికేదాన్ని. నన్ను […]

Continue Reading
Kandepi Rani Prasad

పిల్ల దోమలు

పిల్ల దోమలు -కందేపి రాణి ప్రసాద్ అక్కడొక పెద్ద మురుగు నీటి గుంట ఉన్నది. దాంట్లో పెద్ద దోమల కుటుంబం ఉంటోంది. తాతలు, తండ్రులు, అత్తలు, మామలు అందరూ కలిసి ఉండే పెద్ద ఉమ్మడి కుటుంబం. ఈ గుంట పక్కనే పెద్ద నేషనల్ హైవే. ఆ హైవేలో ఒక డాబా హెూటల్ ఉన్నది. ఆ హైవేలో ప్రయాణించే వాళ్ళందరూ దాదాపుగా ఆ హెూటల్ దగ్గర ఆగి తింటుంటారు. అలా కార్లు ఆగినప్పుడు ఈ దోమల కాలనీలోని పిల్లలు […]

Continue Reading
Kandepi Rani Prasad

పిల్లలు కాని కాకి గుడ్లు

పిల్లలు కాని కాకి గుడ్లు -కందేపి రాణి ప్రసాద్ ఒక పెద్ద మర్రి చెట్టు మీద కాకులు గూళ్ళు కట్టుకుని నివసిస్తున్నాయి. కొమ్మ కొమ్మకో గూడు కట్టుకున్నాయి. ఎవరి గూట్లో వారు గుట్టుగా కాపురం చేస్తున్నాయి. భార్యా పిల్లలతో కలసిమెలసి ఉంటున్నాయి. ఒకరి కొకరు అండగా ఉంటాయి. ఏదైనా ఆపద వచ్చినపుడు పెద్దల మాట వింటాము. ఆ చెట్టు మీద ముసలి కాకులు నాలుగున్నాయి.  అనుభవంలో బాగా తల పండినాయి. అన్ని కలసి ఒకే నిర్ణయం తీసుకుంటాయి. […]

Continue Reading
Kandepi Rani Prasad

వలస పక్షులు

వలస పక్షులు -కందేపి రాణి ప్రసాద్ సరస్సు అంతా నీటి పక్షులతో కళకళ లాడుతోంది. సరస్సు అంటే మామూలు సరస్సు కాదు. ప్రఖ్యాతమైన పులికాట్ సరస్సు. ఇది దేశంలోనే రెండవ పెద్ద సరస్సు. సరస్సు లోపలేమో చేపలు రొయ్యలు గిరగిరా తిరుగుతూ సయ్యాటలాడుతున్నాయి. నిళ్ళ మీదనేమో అనేక పక్షులు ఎగురుతూ, దూకుతూ ఆటలాడుతున్నాయి. పెలికాన్ లు, కార్మోరాంట్ లు, స్పాట్ బిల్డ్ డక్ లు, పెయింటెడ్ కొంగలు, గ్రే హేరాన్లు, చిన్న ఎగ్రైట్లు వంటి ఎన్నో పక్షులు […]

Continue Reading
Kandepi Rani Prasad

ఎర్రెర్రని పుచ్చకాయ

ఎర్రెర్రని పుచ్చకాయ -కందేపి రాణి ప్రసాద్ వేసవి కాలం ఎండ దంచి కొడుతోంది. అడవిలో జంతువులన్నీ ఎండకు మాడి పోతున్నాయి. అడవిలోని చెరువుల్లో నీళ్ళు తగ్గిపోతున్నాయి. కొన్ని చెరువులు కుంటలు పూర్తిగా ఎండి పోయాయి. గొంతు తడుపుకోవాలన్నా చాలా దూరం పోవాల్సి వస్తోంది.నీళ్ళకే కాదు నీడకు అల్లాడుతున్నాయి. మానవులు చెట్లు కొట్టేయడం వల్ల గూడుకూ స్థానం లేక బాధ పడుతున్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులు ఒక్క నిమిషం వాలదామన్నా చెట్టు లేదు. అలసి అలసి విశ్రాంతి లేక […]

Continue Reading
Kandepi Rani Prasad

గోరింటాకు కోన్లు

గోరింటాకు కోన్లు -కందేపి రాణి ప్రసాద్ అడవిని ఆనుకుని ఊరు ఉండటం వల్ల తరచూ జంతువులు ఊర్లోకి వెళ్ళేవి. అక్కడి నుంచి వచ్చాక ఊర్లోని విషయాలు వింతగా చెప్పుకునేవి. “మనుష్యులకు నడవడం అవసరం లేకుండా సైకిళ్ళు, మోటారు వాహనాలు ఉంటాయి. వాళ్ళ చేతుల్లో ఎప్పుడూ సెల్ ఫోనులు ఉంటాయి. ఇళ్ళలో టీవీలు ఉంటాయి. పిల్లలేమో ఎప్పుడూ పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటారు. ఏమో రాస్తూ ఉంటారు. ఇలా ఏవేవో చాలా విషయాలు చెప్పుకుంటూ ఉంటాయి. వీళ్ళ మాటల్ని ఊర్లోకిరాని […]

Continue Reading
Kandepi Rani Prasad

గ్లోబల్ విలేజ్

గ్లోబల్ విలేజ్ -కందేపి రాణి ప్రసాద్ అనగనగా ఒక సముద్రం. ఆ సముద్రంలో అనేక జలచారలున్నాయి. చేపలు, కప్పలు, ఆక్టోపస్ లు, తాబేళ్ళు, మొసళ్ళు, తిమింగలాలు, షార్కులు నత్తలు, పీతలు, రొయ్యలు ఒకటేమిటి రకరకాల జీవులు నివసిస్తూ ఉన్నాయి. అన్నీ ఎంతో ప్రేమగా ఒకదానినొకటి పలకరించుకుంటూ కలుసుకుంటూ ఉంటాయి. చాలా సంతోషంగా తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి.           సముద్రంలో చేపలు పట్టడానికి వేటగాళ్ళు వలలతో వస్తుంటారు. ఆ వలల నుండి జంతువులన్నీ […]

Continue Reading
Kandepi Rani Prasad

జీవ సమతుల్యత

జీవ సమతుల్యత -కందేపి రాణి ప్రసాద్ రెండు కుందేళ్ళు బొరియలో నుంచి మెల్లగా బయటకు వచ్చాయి. ఆ రెండింటి పేర్లు చిన్ని, విన్ని. చిన్ని, విన్ని ఆహారం కోసం అడవి లోపలికి బయలుదేరాయి. చక్కగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నాయి. “ఎక్కడ ఆకుకూరలు దొరుకుతాయా” అని చూస్తూ ముందుకు వెళుతున్నాయి. చుట్టూ ఉన్న చెట్లను చూసుకుంటూ వెళుతున్నాయి.అమ్మానాన్నలు చిన్నీ, విన్నీలకు చాలా జాగ్రత్తలు చెప్పాయి. ఎగురుకుంటూ గెంతు కుంటూ దారి పక్కనున్న చెట్ల తీగల్ని తుంపుతూ సరదాగా నడుస్తున్నాయి.   […]

Continue Reading
Kandepi Rani Prasad

ఒంటరి కాకి దిగులు

ఒంటరి కాకి దిగులు -కందేపి రాణి ప్రసాద్ నల్లమల అడవిలో చెట్ల మీద పక్షులు ఎన్నో ఉన్నాయి. అన్నీ గోలగోలగా మాట్లాడు కుంటున్నాయి. ఎవరి కుటుంబంలో సమస్యల్ని అవి చర్చించుకుంటున్నాయి. కొన్ని మగ పక్షులు పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నాయి. మరి కొన్ని ఆడ పక్షులు వంటల గురించి, పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాయి. చెట్టు నిండా ఉన్న పక్షులన్నీ ఇంత గోలగోలగా మాట్లాడుకుంటుంటే, ఒక కాకి ఒంటరిగా ఉన్నది. ఒక కొమ్మ మీద కూర్చుని దిగాలుగా మొహం వేసుకుని కూర్చున్నది.   […]

Continue Reading
Kandepi Rani Prasad

కంగారూ మదర్ కేర్

కంగారూ మదర్ కేర్ -కందేపి రాణి ప్రసాద్ ఆస్ట్రేలియా దేశంలోని అడవుల్లో కంగారూలు ఎక్కువగా నివసిస్తాయి. కంగారూలను ఆస్ట్రేలియా దేశానికి చిహ్నంగా కూడా సూచిస్తారు. కంగారూలు చాలా తమాషాగా ఉంటా యి. ముందు కాళ్ళు పొట్టిగా, వెనక కాళ్ళు పొడుగ్గా బలంగా ఉంటాయి. అందువలన ఎక్కువగా రెండు కాళ్ళతోనే నడుస్తూ ఉండటం వల్ల గెంతుతూ నడుస్తున్నట్లుగా ఉంటుంది కంగారూను ఇంకో విషయంలో కూడా విచిత్రంగా చెప్పుకుంటాం. కంగారూలు వాటి పిల్లల్ని పొట్ట సంచిలో పెట్టుకుని తిరుగుతూ ఉంటాయి. […]

Continue Reading
Kandepi Rani Prasad

శాఖాహారి సింహం

శాఖాహారి సింహం -కందేపి రాణి ప్రసాద్ ఉదయాన సింహం నిద్రలేచింది. రోజూలాగా వళ్ళు విరుచుకుని బయటకు కదల బోయింది. ఏదో పొట్టలో కలుక్కుమన్నది. లేచింది లేచినట్లుగా కూలబడింది. మళ్ళీ పొట్టలో గడ బిడ మొదలయ్యింది. ‘ఏమైందబ్బా’ అని ఆలోచించేంతలో పొట్టలో పేగు లన్ని కదులుతున్నట్లనిపించింది. సింహం కడుపు పట్టుకుని కూలబడిపోయింది.           కాసేపటికి అడవికి అంతా తెలిసిపోయింది. “మృగరాజు కడుపునొప్పితో బాధ పడుతోంది” అని అందరూ మాట్లాడుకోసాగారు. “ఏమైంది?ఏమైంది?” అని ఆదుర్దా పడేవాళ్ళు […]

Continue Reading
Kandepi Rani Prasad

ఒక సహాయం రెండు ఆనందాలు

ఒక సహాయం రెండు ఆనందాలు -కందేపి రాణి ప్రసాద్ ఒక దట్టమైన అడవిలో పెద్ద చెరువు ఉన్నది. చెరువు గట్టున పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. చెట్లన్నీ చెరువు వైపుకు వంగి చెరువుతో ముచ్చట్లు పెడుతుండేవి. చెట్ల నిండా రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకుని నివసిస్తూ ఉండేవి. చెరువు లోపల మొసళ్ళు, చేపలు, కొంగలు, తాబేళ్ళు, కప్పలు నివసించేవి. అన్నీ కలసిమెలసి జీవించేవి.                   కలువలు, తామరలు […]

Continue Reading
Kandepi Rani Prasad

మూగజీవుల సాయం

మూగజీవుల సాయం -కందేపి రాణి ప్రసాద్ అదొక పర్వత ప్రాంతం అంతేకాదు పర్యాటకప్రాంతం కూడా! చుట్టూ మంచు కొండలు ఆవరించి ఉంటాయి. మధ్యలో చిన్న గ్రామం. మంచు కొండల పైన హిమానీ నదాలు అంటే గ్లేసియర్స్ ఉంటాయి. వాటిని చూడటానికి మనుష్యులు వస్తుంటారు కొండల మీద పేరుకున్న మంచులో ఆటలు కూడా ఆడుతుంటారు. పర్వతాల పై బాగానికి చేరి లోయల అందచందాల్ని చూస్తే అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రకృతి అందాల్ని తిలకించేందుకే చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. […]

Continue Reading
Kandepi Rani Prasad

ఎవర్నీ నమ్మలేం

ఎవర్నీ నమ్మలేం -కందేపి రాణి ప్రసాద్ సోనీ, రాకీ స్కూలుకు తయారవుతున్నారు. సోనీ మూడవ తరగతి చదువుతున్నది. రాకీ ఒకటో తరగతి చదువుతున్నాడు. రోజూ స్కూలు బస్సు వచ్చి తీసుకెళ్తుంది. ఆ సందు చివర వరకు స్కూల్ బస్సు వస్తుంది. సందు చివర దాకా అమ్మ నళిని వెళ్ళి ఎక్కించి వస్తుంది.           నళిని రోజూ ఉదయమే పేపర్ చదువుతుంది. అందులో విషయాలు చదివి భయ పడుతుంది. అందులోను పిల్లల కిడ్నాపుల గురించి […]

Continue Reading
Kandepi Rani Prasad

స్వచ్ఛత పాటిద్దాం

స్వచ్ఛత పాటిద్దాం -కందేపి రాణి ప్రసాద్           ఒకరోజు ఉదయాన్నే గుహ వదిలి బయటకు వచ్చింది మృగరాజు అలా ఆడవంత ఒకసారి తిరిగి వద్దామనుకున్నది.           పక్షుల కుహు కుహులు చెవుల కింపుగా వినిపిస్తున్నాయి. చెట్లన్నీ తలలూపుతూ నాట్యం చేస్తున్నట్లుగా ఊగుతున్నాయి. సింహం సంతోషంగా ముందుకు అడుగులు వేసింది. దారిలో జంతువులన్నీ నమస్కారం పెడుతున్నాయి. వాటిని చిరునవ్వుతో స్వీకరిస్తూ ముందుకు వెళ్ళింది.           […]

Continue Reading
Kandepi Rani Prasad

తప్పిన ప్రమాదం

తప్పిన ప్రమాదం -కందేపి రాణి ప్రసాద్ ఆ వీధిలో ఒక పాడుపడిన ఇల్లు ఉన్నది. సగం పడిపోయిన గోడలు, కూలిపోయిన కప్పుతో ఉన్నది. ఒక పిల్లి తన పిల్లల కోసం ఈ ఇంటిని ఎంచుకున్నది. ఆ పాడుపడిన ఇంటిలో పిల్లి నాలుగు పిల్లల్ని పెట్టింది. వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ కాపలా కాస్తున్నది. పిల్లల శరీరాలను తల్లి నాకుతూ శుభ్రం చేస్తుంది.          తల్లి పిల్లి తన పిల్లలకు పాలిస్తూ ప్రేమగా తల నిమురుతోంది. ఆ […]

Continue Reading
Kandepi Rani Prasad

ఏనుగు సలహా

ఏనుగు సలహా -కందేపి రాణి ప్రసాద్ నల్లమల అడవికి రాజుగా కేసరి అనే సింహం ఉన్నది చాలా తెలివి కలది. తోటి జంతువులపట్ల దయా స్వభావం కలది. అడవిలోని జంతువులను సమానంగా చూస్తుంది. చేస్తే మంచి సహాయం చేస్తుంది తప్ప ఎవరిని చెడగొట్టాలని మోసం చేయాలని ఆలోచించదు. ఇన్ని మంచి లక్షణాలున్న కేసరికి ఒక్క బలహీనత ఉన్నది. తన మంత్రు లతో ఎవరు ఏమీ చెప్పినా నమ్మేస్తుంది ఏనుగు, ఎలుగుబంటి, నక్కలు మృగరాజు దగ్గర మంత్రులుగా పని […]

Continue Reading
Kandepi Rani Prasad

ఆకతాయి కుక్కపిల్లలు

ఆకతాయి కుక్కపిల్లలు -కందేపి రాణి ప్రసాద్ హైవేకు పక్కగా ఒక కుక్క కుటుంబం నివసిస్తున్నది. ఒక కుక్క తన భార్య నలుగురు పిల్లలతో కాపురముంటున్నది. రోడ్డుకు పక్కనే అయినప్పటికీ అక్కడ పెద్ద చెత్త కుప్ప అడ్డుగా ఉన్నది. అంతేకాకుండా పక్క పొలాలకు అవసరమయ్యే గడ్డివాము ఉన్నది. పిల్లల్ని మరుగున దాచటానికీ, మెత్తగా గడ్డి పరుపు పరచటానికీ ఈ స్థలం అనువుగా ఉందని తల్లికుక్క భావించింది. పిల్లల్ని కనక ముందే మంచి స్థలం ఎక్కడ ఉన్నదా అని వెతుక్కుంటునపుడు […]

Continue Reading
Kandepi Rani Prasad

విత్తనాల విలాపం

విత్తనాల విలాపం -కందేపి రాణి ప్రసాద్ అదొక పండ్ల బజారు. అక్కడ పండ్ల దుకాణాలన్నీ వరుసగా ఉంటాయి. మామిడి, బత్తాయి, సపోటా, కమలా, బొప్పాయి, ద్రాక్ష యాపిల్ వంటి అన్నిరకాల పండ్లు అక్కడ కొలువు దీరి ఉన్నాయి. ఆ ప్రదేశమంతా సువాసనతో కూడిన తీపిదనం వ్యాపించి ఉంది. ఆడా, మగా, పిల్లలు, వృద్ధులు ఎంతో మంది ఆ బజారుకు వస్తారు. పండ్లు బావున్నాయని కొనుక్కుంటున్నారు. సంచుల్లో వేసుకొని ఇంటికి తీసుకెళ్లి అందరూ కూర్చొని ఫలాలను అరగిస్తున్నారు. ఎంతో […]

Continue Reading
Kandepi Rani Prasad

కుక్క పిల్లల తెలివి

కుక్క పిల్లల తెలివి -కందేపి రాణి ప్రసాద్ ఆ సందు మలుపులో రాళ్ళ కుప్ప పక్కన చెట్లలో ఓ కుక్క నాలుగు పిల్లల్ని పెట్టింది . తల్లికుక్క ఆ చెట్టు పక్కలకే ఎవర్ని రానివ్వటం లేదు . ఆ రోడ్డు వెంట వెళ్లే వాళ్ళను కూడా అరుస్తున్నది . పిల్లలు తెల్లగా జాతి కుక్కల వలె ముద్దుగా ఉన్నాయి . అందులో రెండు ఆడ పిల్లలు రెండు మగపిల్లలు . నెల తిరిగే సరికల్లా మెల్ల మెల్లగా […]

Continue Reading
Kandepi Rani Prasad

పిల్ల చీమలు

పిల్ల చీమలు -కందేపి రాణి ప్రసాద్ అదొక పెద్ద చీమల పుట్ట . రాత్రయింది పగలంత పని చేసి ఉండటంతో ఓళ్ళు మరిచి నిద్రపోతున్నారు . ఒకింట్లో పిల్ల చీమలు మాత్రం మెలుకువతో ఉన్నాయి . వాటికి నిద్ర రావడం లేదు కారణం ఏంటంటే ఉదయం తిన్న , లడ్డు రుచి గుర్తుకు కావడం .            అదేదో కొత్త ఇల్లు . ఇది వరకు ఎప్పుడు వెళ్ళలేదు . ఈరోజే అమ్మా […]

Continue Reading
Kandepi Rani Prasad

బుజ్జి దూడ భయం

బుజ్జి దూడ భయం -కందేపి రాణి ప్రసాద్ ఒక ఊరిని ఆనుకుని ఉన్న అడవిలో ఆవులు, గేదెలు నివాసం ఉండేవి. అందులో ఒక ఆవు నెల క్రితమే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దూడ తెల్లగా అక్కడక్కడా గోధుమ వర్ణపు మచ్చలతో అందంగా ఉన్నది. పెద్ద పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా ప్రపంచాన్ని చూస్తుంటుంది. అదేమిటి, ఇదేమిటి అంటూ అన్నింటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. తల్లి కూడా దానికి అన్నీ విడమరిచి చెపుతుంది.           గోవులన్నీ […]

Continue Reading
Kandepi Rani Prasad

సింహ పరిపాలన

సింహ పరిపాలన -కందేపి రాణి ప్రసాద్ అడవికి రాజైన సింహం రోజు ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు అడవి అంత సంచారం చేస్తుంది. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటుంది. ఒకసారి అన్ని జంతువులను పిలిచి సమావేశం నిర్వహిస్తుంది. ఆ సమయంలో ఎవరికి ఎదురైనా సమస్యలు వారిని చెప్పమంటుంది. వాటికీ పరిష్కరాలు చెబుతుంది. ఇలా సింహరాజు తన రాజ్యాన్ని జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నది.           ఇలాగే ఒకరోజు అడవి సంచారం చేస్తున్న సమయంలో […]

Continue Reading
Kandepi Rani Prasad

పట్నం వద్దు – ప్రకృతి ముద్దు

పట్నం వద్దు – ప్రకృతి ముద్దు -కందేపి రాణి ప్రసాద్ ఒక అడవిలో ఆవుల మంద ప్రశాంతంగా జీవిస్తోంది. పచ్చని ప్రకృతి మధ్య అంతా అన్యోన్యంగా బతుకుతున్నా యి. తాజాగా మొలిచిన గడ్డిని మేస్తూ ఆరోగ్యంగా జీవిస్తున్నా యి.. పెద్దలు దూడలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా తినాలో నేర్పిస్తాయి. అడవిలోని అన్ని రకాల జంతువులను, అత్త, మామ, పిన్ని, బాబాయి, అన్న, అక్క అంటూ ప్రేమగా పలకరించుకుంటాయి. ఒకసారి పట్నంలోని చుట్టాలు వాళ్ళు వాళ్ళింటికి రమ్మని పిలిచారు. […]

Continue Reading
Kandepi Rani Prasad

అమ్మ గ్రేట్

అమ్మ గ్రేట్  -కందేపి రాణి ప్రసాద్ ఒక బాదం చెట్టు మీద కోతి తన పిల్లలతో నివసిస్తోంది. ఈ చెట్టు ఉరికి చివరిగానూ, అడవి మొదట్లోనూ ఉన్నది. కోతి తన ఆహారం కోసం అడవికి వెళుతుంది. వెళ్ళడానికి బద్ధకం అనిపిస్తే ఊర్లోకి వెళుతుంది. ప్రజలు వండుకున్న అన్నం చపాతీలు, చిప్స్, కూల్ డ్రింకులు నచ్చినవన్ని తిని పిల్లల కోసం ఇంటికి తిసుకెళుతుంది. పిల్లలు చిన్నగా ఉన్నాయని ప్రతి సారి వెంట తీసుకురాదు. అప్పుడప్పుడు తీసుకు వెళుతుంది.     […]

Continue Reading
Kandepi Rani Prasad

చిన్నూ- బన్ను

చిన్నూ- బన్ను -కందేపి రాణి ప్రసాద్ ఎండలు భగ భగ మండుతున్నాయి. అడవిలో ఎటు చూసినా మొక్కలు తలలు వాల్చేసి ఉన్నాయి. వృక్షాలు కొన్ని చోట్ల రాలిన ఆకులు సూర్య కిరణాలు పడి వాటికవే కాలి పోతున్నాయి. వేసవి కాలంలో అడవి ఎండకు మాడి పోతున్నది. చిన్న చిన్న నీటి కుంటలు, దొరువులు ఎండిపోయాయి. నీళ్ళ కోసం చాల దూరం వెళ్ళ వలసి వస్తోంది చిన్న జంతువులు, పక్షులు దాహంతో గొంతెండి అల్లాడుతున్నాయి.        […]

Continue Reading
Kandepi Rani Prasad

పిచ్చుక పిల్లల తప్పు

పిచ్చుక పిల్లల తప్పు -కందేపి రాణి ప్రసాద్ ఒక చెట్టు మీద పిచ్చుక తన పిల్లలతో భార్యతో జీవిస్తోంది. పిల్లలు ఇప్పుడిప్పుడే పెద్దవాల్లవుతున్నారు. ఎన్నో జాగ్రత్తలు  చెప్పి పిచ్చుకలు బయటకు వెలుతుంతుంటాయి. ఆనదంగా సంసారం సాగిస్తున్నాయి. పిచ్చుకలు జంట చీకటి పడగానే తినేసి నిద్రపోతుంటాయి. పిల్లలు మాత్రం చాలాసేపు మేలుకుంటున్నాయి. అప్పుడప్పుడు రాత్రిపూట మెలకువ వచ్చి చూసినప్పుడు పిల్లలు దగ్గర నుంచి వెలుగు కనిపిస్తోంది. నిద్ర మత్తులో ఏమి పట్టించుకోకుండా నిద్రపోతుంది తల్లి పిచ్చుక.ఒకరోజు తండ్రి పిచ్చుకకు […]

Continue Reading
Kandepi Rani Prasad

పిల్ల చిలక అబద్ధం (బాలల కథ)

ఏనుగు నిర్ణయం -కందేపి రాణి ప్రసాద్ అదొక దేవాలయం ఆ దేవాలయం ఎప్పుడూ భక్తుల రాకపోకలతో కిటకిటలాడు తూ ఉంటుంది. ఆలయం ముందు పూలు, పళ్ళు, కొబ్బరి కాయలు అమ్మే వాళ్ళు తమ బండ్లను పెట్టుకొని వ్యాపారం చేస్తుంటారు. అడుక్కునే బిచ్చగాల్లంత ఆలయ ప్రధాన ద్వారానికి రెండు వైపులా కూర్చొని యాచిస్తుంటారు. అలాగే గుడి ముందు ఒక పక్కగా ఉన్న మంటపం దగ్గర ఒక ఏనుగు చిన్న గొలుసుతో కట్టి వేయబడి ఉంటుంది. దానికి పక్కగా ఒక […]

Continue Reading
Kandepi Rani Prasad

ఏనుగు నిర్ణయం (బాలల కథ)

ఏనుగు నిర్ణయం -కందేపి రాణి ప్రసాద్ అదొక దేవాలయం ఆ దేవాలయం ఎప్పుడూ భక్తుల రాకపోకలతో కిటకిటలాడు తూ ఉంటుంది. ఆలయం ముందు పూలు, పళ్ళు, కొబ్బరి కాయలు అమ్మే వాళ్ళు తమ బండ్లను పెట్టుకొని వ్యాపారం చేస్తుంటారు. అడుక్కునే బిచ్చగాల్లంత ఆలయ ప్రధాన ద్వారానికి రెండు వైపులా కూర్చొని యాచిస్తుంటారు. అలాగే గుడి ముందు ఒక పక్కగా ఉన్న మంటపం దగ్గర ఒక ఏనుగు చిన్న గొలుసుతో కట్టి వేయబడి ఉంటుంది. దానికి పక్కగా ఒక […]

Continue Reading