image_print

పిట్ట గూళ్లు-యోగ్యతా పత్రం అవసరం లేని కథలు

పిట్ట గూళ్లు -సి.బి.రావు  యోగ్యతా పత్రం అవసరం లేని కథలు    కథలంటే పైపైన ఉన్నాయనుకున్నావా అవి రాయడానికెంతో ప్రజ్ఞ కావాలి చదవడానికెంతో రుచుండాలి ఒక్కోకథ ఒక్కో సందర్భంలో ఒక్కొక్కణ్ణి ఒడ్డున పడేస్తుంది అందుకే చదువులేని వృద్దుడుకన్నా చదువుకున్న యువకుడే మిన్న –శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి   కె.వరలక్ష్మి గారి కథలు, వాటిలోని పాత్రలు ఆకాశం నుంచి ఊడిపడవు. మన చుట్టూ ఉన్న సమాజంలోంచి, ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలోంచి ప్రాణం పోసుకున్నవే ఈ “పిట్టగూళ్ళు” కథా సంపుటి […]

Continue Reading
Posted On :

Telugu As A Computational Language-Telugu typing- A Beginning

Telugu typing- A Beginning  (Chapter-2) -Dr Geeta Madhavi Kala In October 1923, Sri Didugu Venkata Narasimharao from Guntur announced for financial assistance to make a Telugu Typewriter. Later in December of the same year, Acharya from Konda gadapa, a village near Bhuvanagiri in the Nizam’s kingdom, announced that he had the technology necessary to make […]

Continue Reading
Posted On :

రమణీయం: మనకోసమే!

రమణీయం మనకోసమే! -సి.రమణ  ట్రాఫిక్ నిబంధనలున్నది మనకోసమే. ఐతే, అవి మనకోసం అని, మనకు తెలియదు. అందుకనే మనం వాటిని అసలు పట్టించుకోము. కూడళ్ళ వద్ద వుండే ఎరుపు, ఆకుపచ్చ దీపాలను, చాలసార్లు గమనించకుండా, గుడ్డెద్దులాగా ప్రవర్తిస్తాము. కూడళ్ళ వద్ద రంగుల దీపాలతో పాటు, పోలీస్ వుంటేనే, మనం బాధ్యతకల పౌరులవలె ప్రవర్తిస్తాము. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, వాహనం నడపటం, మత్తు పదార్థాలు సేవించి వాహనం నడపడం, పాదచారులు కూడా సెల్‌ఫోన్ లో మాట్లాడుతూ రోడ్ దాటడం వంటివి […]

Continue Reading
Posted On :

గజల్-అమ్మచేతి గోరుముద్ద

  గజల్-అమ్మచేతి గోరుముద్ద –జ్యోతిర్మయి మళ్ల  అమ్మచేతి గోరుముద్ద తింటుంటే ఎంత హాయి అమ్మచీర కుచ్చిళ్ళలొ దాగుంటే ఎంత హాయి   అన్నలక్కలందరూ ఆడుకుంటు ఉంటారు అమ్మ ఒడిలొ కూచునీ చూస్తుంటే ఎంత హాయి   జ్వరమొచ్చిన బాధంతా లేనె లేదు హుష్ కాకి అమ్మ భుజమ్మీద నిదురపోతుంటే ఎంత హాయి   అందమంటే అమ్మదే ఎవరు లేరు లోకంలో అమ్మతోటి ఈమాటను చెబుతుంటే ఎంత హాయి   నవ్వు వెనక ఎంత బాధ దాగుందో తెలియదులే […]

Continue Reading

షర్మిలాం“తరంగం”-4

షర్మిలాం”తరంగం” వ్యక్తిగతాల్లోకి జొరపడొద్దు -షర్మిల కోనేరు  పక్కవాళ్ల జీవితాల్లోకి తొంగి చూసే నైజం మనలో ఎక్కువగానే కనిపిస్తుంది . వాళ్లతో కష్టం సుఖం పంచుకోవడం వేరు వ్యక్తిగత జీవితాల్లోకి జొరబడడం వేరు. ఎదుటివాళ్ల వ్యక్తిగతాన్ని వాళ్లకే వదిలెయ్యాలనే కనీస స్పృహ లోపిస్తోంది. ఇంతగా ఎదుగుతున్న మనం మరుగుజ్జులుగా మారిపోతున్నాం . ఎదుటివాళ్లను జడ్జ్ చేసే అధికారం మనకు ఎవరిచ్చారు? ఇటీవల ప్రముఖవ్యక్తులు కొందరి మరణం ఇదే ప్రశ్న లేవనెత్తింది. ఎదుటి వాళ్ల జీవితం గురించి , విలువల […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం(మెక్సికో)-4

యాత్రాగీతం(మెక్సికో)-4 కాన్ కూన్  -డా||కె.గీత భాగం-6   కాన్ కూన్ లో మొదటి రోజు  టైం షేరింగు స్కీము వాళ్ల బారిన పడి సగం రోజు వృథా అయినా సాయంత్రం వెళ్లిన  పైరేట్ షిప్పుటూరుతో ఆహ్లాదంగా గడిచింది. రెండవ రోజు మేం ఆధునిక ప్రపంచ వింతల్లో ఒకటైన “చిచెన్ ఇట్జా” టూరుకు బుక్ చేసుకున్నందున ఉదయానే లేచి తయారయ్యి  హోటలు లాబీలో చక్కని రెస్టారెంటులో బ్రేక్ ఫాస్టు చేసి టూరు బస్సు కోసం సిద్ధమయ్యేం. మా హోటలు […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల(భాగం-4)

వెనుతిరగని వెన్నెల(భాగం-4) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/F-B9S8XIchA వెనుతిరగని వెన్నెల(భాగం-4) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది […]

Continue Reading
Posted On :

భారతీయ నవలాదర్శనం (సాహితీ పుణ్యక్షేత్ర దర్శనం)-2

 భారతీయ నవలాదర్శనం (సాహితీ పుణ్యక్షేత్ర దర్శనం)-2 -వసుధారాణి రూపెనగుంట్ల భారతీయ నవలాదర్శనంలో తరువాతి పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రాల నెలవైన ఒరిస్సా , రాష్ట్ర భాష ఒరియా.ఈ భాష ,ఈ నేలా రెండూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓవైపు  స్పృశిస్తూ ఉన్నవే.వీరలక్ష్మీదేవి గారు ఈ భాషలో మొదట ఎన్నుకున్న నవల ఉపేంద్ర కిషోర్ దాస్ రచించిన ‘ మరాహవా చాంద్ ‘ తెలుగులో రాలిపోయిన చందమామ.పేరులోనే విషాదం ,ఉదాత్తత నింపుకున్న నవల. సత్యభామ అనే యువతి తెలిసో , తెలియకో […]

Continue Reading
Posted On :

అనుసృజన- లీవ్ మి అలోన్(కవిత)

అనుసృజన- లీవ్ మి అలోన్       హిందీ మూలం  -సుధా అరోరా                                            అనువాదం : ఆర్.శాంతసుందరి  నాకప్పుడు పద్ధెనిమిదేళ్ళు కలల రెక్కల మీద తేలిపోతూ ఎప్పుడూ గాలిలో ఎగురుతూ ఉండేదాన్ని సీతాకోక చిలుకలుండే లోకంలో  రంగు రంగుల పూల తోటల్లో  అగరొత్తుల మెత్తటి సువాసన చిన్నగా వెలిగే దీపజ్వాల హఠాత్తుగా అమ్మ వచ్చి నిలబడుతుంది నా వెనకాల నేను విసుగ్గా అంటాను అబ్బ ,అమ్మా లీవ్ మి అలోన్ నా స్పేస్ నాకిస్తుంది అమ్మ నా మీద పూర్తి నిఘా […]

Continue Reading
Posted On :

చిత్రలిపి-కుచ్ సుస్త్ కదం రస్తే!

చిత్రలిపి-కుచ్ సుస్త్ కదం రస్తే! –ఆర్టిస్ట్ అన్వర్  ఓ మధ్య ఊరికి వెళ్ళా. సమయం నాలుగు ముక్కాలు. నిజానికి నడిచే టైం కదా అని నడక మొదలెట్టా.  నడుస్తూ సంజీవనగర్ రామాలయం దగ్గరికి చేరుకున్నా. నిజానికి ఊరికి వెళ్ళడం బహు తక్కువ అయిపోయింది. వెళ్ళినా ఒక రోజు కు పైగా ఎక్కువ ఉండటం కూడా కష్టమే అయిపోయింది. కానీ ఆ తెల్లారు జామున నడుస్తుంటే ఎన్ని జ్ఞాపకాలో! నిజానికి ఊరు చాలా మారిపోయింది. అయినా బుర్ర మారలా […]

Continue Reading

క’వన’ కోకిలలు- విస్లావా సిమ్ బోర్ స్కా

    క’వన’ కోకిలలు- విస్లావా సిమ్ బోర్ స్కా -నాగరాజు రామస్వామి   విస్లావా సిమ్ బోర్ స్కా     Wislawa Szymborska    ( 1923 – 2012 )                  Wisława  Szymborska is ” Mozart of Poetry” – Nobel committee. మారియా విస్లావా సిమ్ బోర్ స్కా ( Maria Wisława Anna Szymborska ) పోలాండ్ కు […]

Continue Reading

చిత్రం-3

చిత్రం-3 -గణేశ్వరరావు  ప్రకృతి దృశ్యాలు చూస్తూ న్యూ ఇంగ్లండ్ లో పెరిగిన గ్రేస్ మెరిట్ వాటి నుంచి స్ఫూర్తి చెందడంలో ఆశ్చర్యం లేదు, ఆమె చిన్ననాటి అనుభవాలే ఆమెని ఒక ఫైన్ ఆర్ట్ ఫోటోగ్రాఫర్ ని చేసాయి. జీవితం అన్నాక ఎవరికైనా ఒడుదుడుకులు ఉండకుండా పోవు . గ్రేస్ కూడా వాటి నుంచి తప్పించుకోలేకపోయింది. అయితే ఆమె సృజనాత్మక శక్తి , కష్టాలనుంచి ఆమెను త్వరగా కోలుకునేలా చేసింది, ఆమె కెమెరాకన్ను ఎప్పుడూ రూప నిర్మాణంపైనే వుంటుంది, […]

Continue Reading
Posted On :

ప్రమద -తొలి విప్లవాల అంగారవల్లి రషీద్ జహాన్

ప్రమద తొలి విప్లవాల అంగారవల్లి రషీద్ జహాన్  – జగద్ధాత్రి “నీ నుదుటపైన  ఈ కొంగు చాలా అందంగా ఉంది కానీ నీవీ కొంగును ఒక పతాక చేసి ఉంటే ఇంకా బాగుండేది” అస్రరూల్ హక్ మజాజ్ ఎవరిగురించి ఈ మాటలు అనుకుంటున్నారా? అలా తన జీవితాన్నే తిరుగుబాటు బావుటాగా ఎగురవేసిన ఒక అత్యుత్తమ మహిళను గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆమె డాక్టర్ రషీద్ జహాన్. జీవించినది పూర్తిగా ఐదు పదులు కూడా కాకున్నా ఐదు జన్మలకు […]

Continue Reading
Posted On :

పునాది రాళ్ళు-3

పునాది రాళ్ళు- 3  –డా|| గోగు శ్యామల   అధ్యాయం:    గ్రామీణ వ్యవస్థ  – కుల రాజకీయాలు – వర్గ పోరాటాల్లో రాజవ్వ భూపోరాటం ఈ అధ్యాయం లో చోటు చేసుకున్న అంశాలు…  1. ఉత్తర తేలంగాణ గ్రామీణ వ్యవస్థలో రాజవ్వ  ఇతరులకు భూమి కావాలని, తన భూమి కోసం పోరాడిన క్రమంలో  కుల పితృ భూ వలస స్వామ్య అధిపత్యాలు కలగలిసిన పాలన విధానాలు నిర్వహించిన పాత్ర.     2. రాజవ్వ భూమి పట్టా […]

Continue Reading
Posted On :

రమణీయం: అరవై ఏళ్ళ వేడుక

రమణీయం: అరవై ఏళ్ళ వేడుక -సి.రమణ  మన భారతదేశంలో ఉన్నన్ని పండుగలు, పర్వాలు, వ్యక్తిగతంగా జరుపుకునే వేడుకలు, ఉత్సవాలు మరి ఏ ఇతర దేశాలలోను ఉండవని విశ్వసిస్తాను. మంచిదే, పండుగలు, వేడుకలు జరుపుకునే ఉత్సాహం, దానికి కావలసిన వనరులు, మన దగ్గర ఉంటే, ఎప్పుడూ ఆనందంగా ఉల్లాసంగా…… ఎంత బాగుంటుందో. మనం కూడా పండుగ వస్తుందంటే, పండుగ పనులతో, పండుగ గురించిన కబుర్లతో, ఎవరి స్థాయికి తగినట్లు వారు, కొత్త బట్టలు, కొత్త వస్తువులు కొనుక్కుంటూ ఒక […]

Continue Reading
Posted On :

ఉనికి పాట- ఆయువు పాట

ఉనికి పాట -చంద్ర లత        (అజరామరమైన పాటగా పదిలమైన కవిత గురించి ఒక మాట) చెలీ సెలవ్…! సెలవ్  సెలవ్ !   *** ఇక మనం మేలు కోవాలి  ఇక మనం తెలుసుకోవాలి    ఇక మనం మనకళ్ళు తెరిచిచూడాలి   ఇప్పుడే… ఇప్పుడే ఇప్పుడే !           మనం మేలైన రేపటిని నిర్మించుకోవాలి       ఆ పనిని మనం ఇప్పుడే మొదలుపెట్టాలి            […]

Continue Reading
Posted On :

నారీ”మణులు”- దుర్గాబాయి దేశ్‌ముఖ్-1

నారీ”మణులు” దుర్గాబాయి దేశ్‌ముఖ్  -కిరణ్ ప్రభ దుర్గాబాయి దేశ్‌ముఖ్ (జూలై 15, 1909 – మే 9, 1981) భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త . చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఈవిడే స్థాపించారు. ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభ, ప్రణాళికా సంఘ సభ్యురాలు. ఆమెను భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కు […]

Continue Reading
Posted On :

షర్మిలాం“తరంగం”-3

షర్మిలాం”తరంగం” అమ్మాయంటే ఆస్తి కాదురా ! -షర్మిల కోనేరు  అయిదుగురూ సమానంగా పంచుకోమని తల్లి చెప్తే పాండవులు ద్రౌపదిని పంచుకున్నారని భారతంలో విన్నాం . ఆస్తి పంచుకున్నట్టు అమ్మాయిని పంచుకోవడం ఏంటో ! ఆడాళ్లని వస్తువులుగా ఆస్తులుగా చూడడం అప్పుడూ ఇప్పుడూ కూడా ఏం కొత్త కాదు . అర్జున్ రెడ్డి సినిమాలో ఈ పిల్ల నాది అని కర్చీఫ్ వేసేస్తాడు . వాడికి నచ్చితే చాలు ! ఆ పిల్లతో పని లేదు ఎవడూ ఆ […]

Continue Reading
Posted On :

Telugu As A Computational Language-Intro- System of Computers

Telugu As A Computational Language Intro- System of Computers -Dr Geeta Madhavi Kala In 1991-92 the Telugu language came into use on computers. Until then, English was the first medium of all technologies, and in the computer field, English had to be matched. These are the days when the WWW (World Wide Web) was introduced […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-3

నారి సారించిన నవల -కాత్యాయనీ విద్మహే 3 1924 లో పులవర్తి కమలావతీ దేవి ‘కుముద్వతి’ అనే చారిత్రక నవలతో నవలా సాహిత్య చరిత్రలో సాధికారంగా తనపేరును నమోదుచేసుకొన్నది. ఈ నవలను  రాజమహేంద్రవరంలోని సరస్వతీగ్రంథమండలి ప్రచురించింది. శివశంకరశాస్త్రి సంపాదకులు. ఉపోద్ఘాతంలో రచయిత్రి ఇదిమహారాష్ట్రలో శివాజీ తరువాత అతనికొడుకు శంభాజీ పాలనాకాలపు కాలపు రాజకీయ కల్లోలాన్ని చిత్రించిన నవల అని, కొమర్రాజు వేంకట లక్ష్మణరారావు వ్రాసిన శివాజీ చరిత్ర,  చిల్లరిగె శ్రీనివాసరావు వ్రాసిన మహారాష్ట్రుల చరిత్రచదివి తన నవలకు […]

Continue Reading

తాయిలం – ప్రాప్తం (పిల్లల కథ )

                                               ప్రాప్తం – కన్నెగంటి అనసూయ అడవి అంతా జంతువుల అరుపులు , కేకలతో గందరగోళంగా ఉంది.  ఆకలితో ఆహారాన్ని వెదుక్కుంటూ తోటి ప్రాణుల వెంట పరుగులు పెట్టే జంతువులు కొన్ని అయితే , ప్రాణభయంతో పరుగులు పెట్టేవి మరికొన్ని. వేటి అవసరం  వాటిదే. ఆ […]

Continue Reading
Posted On :

కంప్యూటర్ భాషగా తెలుగు-1 (ఉపోద్ఘాతం- కంప్యూటర్ వ్యవస్థ)

కంప్యూటర్ భాషగా తెలుగు-1  ఉపోద్ఘాతం– కంప్యూటర్ వ్యవస్థ -డా|| కె. గీత తెలుగుభాష  కంప్యూటర్ల మీద వాడుకలోకి 1991-92 ప్రాంతంలో వచ్చింది. అప్పటివరకు ఇంగ్లీషు మాత్రమే అన్ని టెక్నాలజీలకీ మొదటి మాధ్యమమైనట్టే కంప్యూటర్ రంగంలోనూ ఇంగ్లీషుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది. అవి WWW (World Wide Web) కొత్తగా ప్రపంచానికి పరిచయమైన రోజులు. “కంప్యూటర్లకి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జ్ఞాన సంపదనే ‘వరల్డ్ వైడ్ వెబ్’ అంటారు. వరల్డ్ వైడ్ వెబ్ ఇంటర్నెటులో అత్యధికంగా లభించే సేవ. […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల(భాగం-3)

వెనుతిరగని వెన్నెల(భాగం-3) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/UoaBm5NPkgM వెనుతిరగని వెన్నెల (భాగం-3) -డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  జరిగిన కథ: అమెరికా లో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం(మెక్సికో)-3

యాత్రాగీతం(మెక్సికో) కాన్ కూన్  -డా||కె.గీత భాగం-5 తిరిగి మా రిసార్టుకి వచ్చేసరికి మధ్యాహ్నం మూడు గంటలయ్యింది. ఆవురావురంటూ భోజనానికి పరుగెత్తేం. రిసార్టులో ఎకామడేషన్ తో పాటూ భోజనాదులన్నీ కలిపిన పాకేజీ కావడంతో డబ్బులేమీ కట్టకుండా బఫే సెక్షనులో జొరబడి చక్కగా నచ్చినవన్నీ తెచ్చుకుని కడుపారా తిన్నాం. అన్నిటికన్నా చాలా ఇష్టంగా పిల్లలు పుడ్డింగుల వంటి చిన్న కేకుల్ని తిన్నారు. నిజంగానే చాలా బావున్నాయవి. అందానికి అందంగానూ, రుచికి బ్రహ్మాండంగానూ. మొత్తానికి ఒక పూటంతా మాకు వృధా అయినా […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 3

నా జీవన యానంలో- (రెండవభాగం)- 3 -కె.వరలక్ష్మి  ఊళ్లో లయన్స్ క్లబ్ ప్రారంభించిన కొత్తరోజులు. వాళ్ల కమ్యూనిటీ హాలు మేమున్న ఇంటికి దగ్గర్లోనే ఉండేది. వాళ్ల పిల్లలకి ఫీజ్ కట్టడానికొచ్చిన లయన్ మెంబరొకాయన “మాస్టారూ మీరూ లయన్స్ క్లబ్ లో చేరచ్చు కదా” అని అడిగేడు. నేనా విషయం మోహన్ తో చెప్పి ‘చేరదామా’ అని అడిగేను . “శాంత, రుక్కుల పెళ్లిళ్లకి చేసిన అప్పులు నా నెత్తిమీదున్నాయి. నువ్విప్పుడిలాంటి సేవా కార్యక్రమాలు పెట్టకు” అన్నాడు. లయన్స్ […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -2

జ్ఞాపకాలసందడి -2 -డి.కామేశ్వరి  1971 -అపుడు మేము ఒరిస్సాలో బుర్ల అనే ఊరిలో ఉండేవారం. హిరాకుడ్  డాం ప్రాజెక్ట్ powerhouse లో అయన అస్సిస్టెంట్ ఇంజినీర్ గా పనిచేసేవారు. నేను 62  లో రచనలు ఆరంభించాను, అపుడు ఒక రోజు రిజిస్టర్ పోస్టులో చిన్న పార్సెల్ వచ్చింది. ఆరోజుల్లో నాకెవరు పోస్టులో పార్సెల్ పంపుతారు అనుకుంటూ ఆశ్చర్యంగా అడ్రస్ చూస్తే మద్రాస్ నించి, కేసరికుటీర్ అని వుంది. కేసారికుటీర్ నాకేం పంపింది, ఎందుకు పంపిందో తెలియక  ఆరాటంగా […]

Continue Reading
Posted On :

కొత్తకథ 2019

కొత్తకథ 2019 -సి.బి.రావు  నెచ్చెలి గత సంచికలో, కొత్తకథ 2019 పరిచయ వ్యాసంలో, వనజ తాతినేని – పూవై పుట్టి కథ పరిచయం చదివారు. ఈ సంచిక లో కొత్త కథలోని మిగిలిన రచయిత్రుల కథలను పరిచయం చేసుకొందాము. ముఖం – రిషిత గాలంకి  ఈనాడు ఉద్యోగస్తురాలైన మహిళ, ఉద్యోగ బాధ్యలతో పాటు, ఇంటిపనులు కూడా నాలుగు చేతులతో నిర్వహించవలసిన అవసరం ఉంది. ఐతే ఆమెకు ఉన్నది రెండు చేతులే కావటం, రెండు బాధ్యలతో తీరిక లేక, […]

Continue Reading
Posted On :

ప్రమద -మాన్ బుకర్ అందుకున్న తొలి అరబిక్  రచయిత్రి 

మాన్ బుకర్ అందుకున్న తొలి అరబిక్  రచయిత్రి  -జగద్ధాత్రి  మాన్ బుకర్ అంతర్జాతీయ బహుమతిని అందుకున్న తొలి అరబ్ రచయిత్రి జోఖా అల్హర్తి. ఆమె రచించిన పుస్తకం “ సెలెస్టియల్ బాడీస్” ఆంగ్లానువాదానికి ఈ బహుమతి లభించింది ఈ సంవత్సరం. తొలి సారిగా ఒక ఓమన్ రచయిత్రి నవల ఆంగ్లం  లోకి అనువాదమై మాన్ బుకర్ వంటి ప్రతిష్టాత్మకమైన బహుమతిని సాధించింది. ఇది ప్రపంచ రచయిత్రులందరికీ గర్వకారణం. అనువాదకురాలు మారిలిన్ బూత్ తో కలిసి 50,000 పౌండ్ల […]

Continue Reading
Posted On :

వీక్షణం 83 సమావేశంలో – “నెచ్చెలి” ఆవిష్కరణ

వీక్షణం- 83 -రూపారాణి బుస్సా  జూలై నెల 14వ తారీఖున బే ఏరియాలో శర్మిల గారి ఇంట్లో వీక్షణం 83వ సమావేశం అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది. సాయి బాబ గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశాన్ని శర్మిలగారు స్వయంగా రచించిన  “బెజవాడ నుంచి బెంగాల్ సరిహద్దు దాక” అన్న ఆసక్తికరమైన కథతో ప్రారంభించారు. నాయనమ్మ చిట్టెమ్మని తీసుకుని బెంగాల్ లో ఉంటున్న వాళ్ళ అబ్బాయి ఉంటున్న బెంగాల్ సరిహద్దు దాక ఎలా ప్రయాణం చేసి క్షేమంగా చేరారన్నది కథా విశేషం.తరువాత […]

Continue Reading
Posted On :

అనుసృజన-వెస్టరన్ కల్చర్ మై డియర్ !

      వెస్టర్న్ కల్చర్ మై డియర్ ! హిందీ మూలం: స్వాతి తివారీ అనుసృజన : ఆర్. శాంతసుందరి ఎవరో తలుపు నెమ్మదిగా తట్టారు. తలుపు గడియపెట్టి పడుకున్న నాకు లేవబుద్ధి కాలేదు. ఎవరితోనూ మాట్లాడాలనీ లేదు.కానీ లేచి తలుపు తెరవక తప్పదు. ప్రణవ్ ఏదైనా మర్చిపోయి వెనక్కి వచ్చాడేమో.కానీ తాళం చెవులూ, రుమాలూ, ఫైళ్ళూ అన్నీ ఇచ్చి పంపించింది ప్రతిమ.అతను వెళ్ళగానే తలుపు గడియ పెట్టేసింది.అదే పనిగా బైటినుంచి తలుపు తడుతూ ఉండేసరికి […]

Continue Reading
Posted On :

పుస్తక సమీక్ష -భారతీయ నవలాదర్శనం

భారతీయ నవలాదర్శనం (సాహితీ పుణ్యక్షేత్ర దర్శనం) -వసుధారాణి        నేను చెపుతున్న ఈ మాట కాస్తంత ముతకగా ,మోటుగా అనిపించినా  ఆవిడ నెత్తికి ఎత్తుకున్న పని మాత్రం మాత్రం సామాన్యమైనది కాదు. పాఠకులకు అరవై భారతీయ నవలలని దర్శనం చేయించడం. ఇది సంపూర్ణ భారతదేశ పుణ్యక్షేత్రాల యాత్రాదర్శనం లాంటిదే. ఈ పనిని తలపెట్టిన వీర వనిత డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు ,పుస్తకము “ భారతీయ నవలాదర్శనం”.  60 విశిష్ట భారతీయనవలల పరిచయసంపుటి.  ఇదీ వరస […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -1

జ్ఞాపకాలసందడి -1 -డి.కామేశ్వరి  1952 లో పెళ్లయింది. ఒరిస్సాలో కటక్ లో మా ఆయన ఇంజనీరింగ్ స్కూల్ లో పనిచేసేవారు. ఆరోజుల్లో మద్రాస్ హౌరా మెయిల్ ఒకటే రైల్ మధ్యలో అర్ధరాత్రి కటక్ లోఆగేది. మానాన్నగారు విశాఖపట్నంలో డివిజినల్ ఇంజినీర్ హైవేస్ లో పనిచేసేవారు. ఆయన ముందువెళ్ళి అన్ని ఏర్పాట్లుచేసుకున్నాక పంపమని చెప్పివెళ్ళారు. వైజాగ్ లో మెడిసిన్ చదివే మరిదిని తోడిచ్చిపంపారు. అర్థరాత్రి  కటక్ లో స్టేషన్ కొచ్చి రిసీవ్ చేసుకున్నారు ఆయన. ఆ రోజుల్లో మనిషిలాగే […]

Continue Reading
Posted On :

గజల్-ఎదురుచూసి

గజల్-ఎదురుచూసి -జ్యోతిర్మయి మళ్ళ  ఎదురుచూసి ఎదురుచూసి కనులకేమొ అలుపయ్యెను ఎదనుతాకి మదిని కలచి  మరువలేని తలపయ్యెను సుఖమునెంచి కన్నెమనసు పంజరమున చిలకయ్యెను సఖుని  కినుక తాళలేని చెలియకిదియె అలకయ్యెను   సగమురేయి సిగమల్లెల పరిమళమే సెగలయ్యెను  మరునితెలుపు వలపేదో తనువుచేరి వగలయ్యెను  తలచినంత చెంతచేరు తరుణమేమొ కరువయ్యెను విరహబాధకోర్వలేని హ్రుదయమింక బరువయ్యెను  వెన్నెలమ్మ చందమామ సరసమపుడె మొదలయ్యెను ప్రియుని రాక కానరాక గుండెకిపుడు గుబులయ్యెను  ప్రేమచిలుకు సమయమంత కరిగితరిగి కల అయ్యెను ప్రణయసీమ సరిహద్దులొ ఆమెచూపు శిల అయ్యెను  […]

Continue Reading

కె.బి లక్ష్మి స్మృతిలో –

    నాన్నని పోగొట్టుకుని !     – రేణుక అయోల     1 .  అస్తికలు బూడిద ఒడిలోకి తీసుకున్న గోదావరి –       ప్రవాహంలో నాన్న జీవితం –       పాదాలని కడుగుతూన్న గోదావరి       అలలకి నా దుఃఖం వో చినుకు      నది మెట్ల మీదనుంచి అడుగులు  వెన క్కివేయడం      ఒక దీర్ఘ జ్జాపకాన్ని మోయడం పల్చటి చలిలో      అగ్నిని  బొడ్డుకి చుట్టుకున్నట్టుగా ఉంది      నిన్నటి వరకు నీది  నాది ఒక పేగు బంధం      ఇప్పుడది ఎముకలు […]

Continue Reading
Posted On :

పుస్తకసమీక్ష-కొత్తకథ

కొత్తకథ -సి.బి.రావు కొత్తకథ 2019 ను ప్రసిద్ధ తమిళ రచయిత, చిన్నకథల ప్రయోగశీలి ఆరాత్తు, జులై 21, 2019 న హైదరాబాదులో ఆవిష్కరించారు. ఈ కథా సంపుటంలో మొత్తం 22 కథలుంటే, అందులో రచయిత్రుల కథలు 9 ఉన్నాయి. ఆ రచయిత్రులు 1) అరుణ పప్పు 2) అపర్ణ తోట 3) ఝాన్సి పాపుదేసి 4) కుప్పిలి పద్మ 5) కడలి సత్యనారాయణ 6) మెర్చీ మార్గరెట్ 7) మిథున ప్రభ 8) రిషిత గాలంకి 9) […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం(మెక్సికో)-2

యాత్రాగీతం(మెక్సికో) కాన్ కూన్  -డా||కె.గీత భాగం-3 కాన్ కూన్  ఎయిర్పోర్టు  అద్దాల తలుపులు సరిగ్గా రెండడుగుల్లో దాటుతామనంగా చక్కగా సూటు వేసుకుని, ఎయిర్పోర్టు  హెల్పింగ్ బూత్ లో పనిచేస్తున్నట్లున్న ఒకమ్మాయి మమ్మల్ని “సహాయం ఏమైనా కావాలా?” అని నవ్వుతూ పలకరించింది. అప్పటికే మేం బయటికెళ్లే ముందు పక్కకి ఆగి మా పాకేజీలో భాగమైన పికప్ టాక్సీ కి ఫోను చెయ్యడానికి నంబరు కోసం రిసీట్ లో చూడాలని అనుకుంటూ నడుస్తున్నాం. ఇంతలో ఈమె కనబడి పలకరించడంతో  “మేం […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు – సరోజినీ నాయుడు

క’వన’ కోకిలలు – 2   -నాగరాజు రామస్వామి సరోజినీ నాయుడు         ( ఫిబ్రవరి 13, 1879 – మార్చ్ 2, 1949 )           “Life is a prism of My light, And Death the shadow of My face.” – Sarojini Naidu         The Nightingale of India !            భారత నైటింగేల్ గా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు అలనాటి […]

Continue Reading

చిత్రలిపి-కపివరుండిట్లనియే….

కపివరుండిట్లనియే….  -ఆర్టిస్ట్ అన్వర్  చిన్నప్పుడు మాకు ఆంజనేయ స్వామి అంటే దేవుడని అసలు తెలీనే తేలీదు. ఆంజనేయుడు నా బాల్య కాలపు హీరో. మా సూపర్మాన్ ,డూపర్మాన్ , స్పైడర్మాన్, బ్యాట్మన్, హీమాన్, అదీ ఇదీ ఇత్యాది … నాకు ఒక్క ముక్కరాదు కానీ నా ఫ్రెండ్స్ చాలామంది హనుమాన్ చాలీసా వచ్చి ఉండేది , చిన్నప్పుడు దయ్యాలకు భూతాలకు భయపడేవాణ్ణి కాదు కావున హనుమాన్ చాలీసా నేర్చుకోవాల్సిన అవసరం అనిపించలా. నాకు లేదు కానీ నా […]

Continue Reading

రమణీయం-మన కోసం మనం

రమణీయం-మన కోసం మనం –సి.వి.రమణ   ఇల్లు అలకంగానే పండుగా కాదు, పందిరి వేయంగానే పెళ్ళీ కాదు, అన్నట్లు, మొక్క నాటంగానే వృక్షమూ కాదని మాకు వారం రోజులలోనే తెలిసిపోయింది. వాతావరణ శాఖ వెలువరిస్తున్న  సూచనలను గమనిస్తున్నాము. నైరుతి ఋతుపవనాలు అదిగో వస్తున్నాయి, ఇదిగో వస్తున్నాయి, అండమాన్ దాటేశాయి, కేరళ తీరం చేరుకుంటున్నాయి అంటున్నారు. మబ్బులు వచ్చినట్లే వచ్చి, వెనక్కు వెళ్తున్నాయి. కొన్నిసార్లు, మెరుపులు కూడా మెరుస్తున్నాయి. ఫెళ ఫెళ మనే శబ్దార్భాటం చూస్తే, ఇహనో, ఇప్పుడో వర్షం […]

Continue Reading
Posted On :

తాయిలం-ఎవరి అసూయ వారికే చేటు

          ఎవరి అసూయ వారికే చేటు –అనసూయ కన్నెగంటి               అది చిన్న చేపల చెరువు. ఆ చెరువులో బోలెడన్ని చేపలు ఉన్నాయి. అవన్నీ గుంపులు గుంపులుగా తిరుగుతూ ఆహారాన్ని తింటూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమంది చేపలంటే ఇష్టం ఉన్నవాళ్ళు  తేలికపాటి ఆహారం తీసుకువచ్చి నీళ్లల్లో విసురుతూ ఉంటారు. అప్పుడవి పోటీపడి మరీ తింటూ ఉంటాయి.      అలా ఆ  చేపల్లో అన్నింటి కంటే కాస్త వేరేగా బంగారు రంగులో ఉండే చేప ఒకటి […]

Continue Reading
Posted On :

ఉనికి పాట- పడాం…పడాం… !

 పడాం…పడాం… ! -చంద్ర లత ఎడిత్ పియెఫ్( 1915-1963) ఫ్రెంచ్ గాయని,నటి, గేయరచయిత, స్వరకర్త, ఛాసో నెట్. ఫ్రెంచ్ అభూత కల్పన గా  ప్రస్తావించే ఎడిత్ పియెఫ్ , అంతర్జాతీయ ఫ్రెంచ్ తార. “పడాం… పడాం… ” అన్న పాట ఒక వాల్ట్జ్ గీతం. ఇది సంగీత జ్ఞాపకాల గురించిన పాట. ఒక స్వరం వినబడగానే, జ్ఞాపకాల తుట్టి ఎలా కదిలించబడుతుందో ఈ పాట చెపుతుంది. తన ఇరవైఏళ్ల వయస్సు నాటి గతించిన ప్రేమ జ్ఞాపకాలు ఈ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 2

నా జీవన యానంలో- (రెండవభాగం)- 2 -కె.వరలక్ష్మి  మా మామగారికి అనకాపల్లి దగ్గర అడ్డు రోడ్డు కొరుప్రోలు ట్రాన్స్ ఫర్ అయ్యిందట. అక్కడి నుంచే మా అత్త గారొక సారి, మామగారొకసారి వచ్చి వెళ్లే వారు.  ఆ సంవత్సరం సెలవుల్లో మేం పిల్లల్ని తీసుకుని కొరుప్రోలు వెళ్లేం. రెండు గదుల డిపార్టుమెంట్ క్వార్టర్స్. పెద్ద కాంపౌండు లోపల చెట్లు , ఆఫీసు. పక్కనే రోడ్డు కవతల సంత. పెద్ద సైజు టేబులంతేసి పై డిప్పలున్న తాబేళ్లని నేనక్కడే […]

Continue Reading
Posted On :

పునాది రాళ్ళు-2 

పునాది రాళ్ళు-2  -డా|| గోగు శ్యామల  ”దళిత స్త్రీల జీవిత అనుభవాల ఆధారంగా తెలంగాణా  రాష్ట్రంలోని కులాల చరిత్రను అధ్యయనం చేయడం ” అనే శీర్షికన జరిగిన నా పరిశోధన కోసం ఈ   ఐదుగురు స్త్రీలనే ఎందుకు ఎంపిక చేసుకున్నాను ? వారితో  నాకున్న సంబంధం ఏమిటీ ? మరో వైపు ఈ స్త్రీల కుటుంబం, కమ్యూనిటీ నేపథ్యాల ద్వారా కులవ్యవస్థను  పరిశీలించడం కూడా ప్రాధానంగా జరిగింది. ఈ ఐదుగురు స్త్రీలు దళిత కమ్మూనిటీలలోని వివిధ కిన్ […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-2

నారి సారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    2 20 వ శతాబ్ది తొలిదశకంలో స్త్రీల నవలా రచన ప్రారంభమైతే  రెండొదశకం లో (1910-1920) మల్లవరపు సుబ్బమ్మ ‘కళావతీ చరిత్ర’(1914), ఎస్ స్వర్ణమ్మ ఇందిర’(1916),నవలలు వ్రాసినట్లు ( నవ్యాంధ్ర  సాహిత్య వీధులు ) తెలుస్తున్నది. 1916 లోనే వి. శ్రీనివాసమ్మ, ‘సేతు పిండారీ’ నవల వ్రాసింది. ఈ నవల రాజమహేంద్రవరం శ్రీ మనోరమా ముద్రాక్షర శాలలో ప్రచురించబడింది. విజ్ఞప్తి అనే శీర్షిక తో రచయిత్రి వ్రాసిన ముందుమాటను […]

Continue Reading

నారీ”మణులు”- ప్రీతిలత వడేదార్

నారీ”మణులు”  ప్రీతిలత వడేదార్ -కిరణ్ ప్రభ చిట్టగాంగ్ లో 1911 లో జన్మించి 21 ఏళ్లకే బ్రిటిషు వారిని ఎదిరించి, ప్రాణాల్ని తృణప్రాయంగా దేశం కోసం, సంఘం కోసం అర్పించిన స్ఫూర్తి ప్రదాత, చైతన్యజ్యోతి – “ప్రీతిలత వడేదార్” అత్యంత స్ఫూర్తిదాయకమైన బెంగాల్ విప్లవ తేజం “ప్రీతిలత వడేదార్” గాథని కిరణ్ ప్రభ గారి మాటల్లో ఇక్కడ వినండి: https://youtu.be/CHK0TQGRtFk కిరణ్ ప్రభతెలుగు సాహితీ లోకానికి కిరణ్ ప్రభ పేరు సుపరిచితమే. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. దాదాపు […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల(భాగం-2)

వెనుతిరగని వెన్నెల(భాగం-2) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/BUVVIDaWTsM వెనుతిరగని వెన్నెల (భాగం-2) -డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  జరిగిన కథ: సమీర రాజీ కూతురు. ఉదయిని, రాజీ చిన్ననాటి స్నేహితులు. అమెరికాలో అదే ప్రాంతంలో ఉంటున్న ఉదయినిని తప్పక కలవమని రాజీ కూతురికి చెప్తుంది. ఉదయిని స్త్రీలకు సహాయం […]

Continue Reading
Posted On :

 “స్వార్ధమా! నీ చిరునామా ఎక్కడ?”(కథ)

        “స్వార్ధమా! నీ చిరునామా ఎక్కడ?”                                                                            –మంథా భానుమతి    “వెంటనే బయల్దేరి రా భారతీ. రేప్పొద్దున్నే కారు పంపిస్తా బస్టాండ్ […]

Continue Reading
Posted On :

Telugu As A Computational Language

Telugu As A Computational Language -Dr Geeta Madhavi Kala Telugu emerging as a computer language among the many languages from the last decade is very prominent and a noticeable fact that everyone should know. In view of the importance of it increasing through social media and smartphone, I feel interesting aspects behind the computerization of […]

Continue Reading
Posted On :

కంప్యూటర్ భాషగా తెలుగు

కంప్యూటర్ భాషగా తెలుగు  -డా|| కె. గీత ప్రపంచ భాషల్లో  కంప్యూటర్ పరంగా గొప్ప వృద్ధిని  సాధించిన భాషల దిక్కుగా తెలుగు భాష గత దశాబ్ది కాలంగా వేగంగా  ప్రయాణం సాగించడం చెప్పుకోదగిన విషయమే కాదు, తెలీనివారందరూ తెలుసుకోదగిన విషయం కూడా. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని తెలుగులో కమ్యూనికేషను అందరికీ అవసరమైన యుగంలో ఉన్న మనకు తెలుగు భాష ని కంప్యూటరీకరించడం వెనుక దాగున్న అనేక ఆసక్తికర అంశాల్ని పరిచయం చేస్తే బావుణ్ణన్న […]

Continue Reading
Posted On :

షర్మిలాం“తరంగం”-2

షర్మిలాం“తరంగం”  -షర్మిల కోనేరు ” దైవం మానుష రూపేణా ” అంటారు . ఈ మాట వాడుతున్నానని నేనేదో సంస్కృత పండితురాల్ని అనుకునేరు … నేను ఆరు ఏడో తరగతుల్లో సంస్కృతం నేర్చుకున్నాను గానీ రఘు వంశం , దిలీపుడు అన్న మాటలు తప్ప ఏమీ గుర్తులేవు . అంతెందుకు మా వూరి లైబ్రరీలో వున్న సాహిత్యాన్నంతా ఒక్కో పుస్తకం చొప్పున పరపరా నమిలేసే దాన్ని . ఇప్పుడు స్క్రీన్లు చూస్తే అమ్మానాన్నలు గగ్గోలు పెట్టినట్టు పుస్తకాలు […]

Continue Reading
Posted On :

చిత్రం -2

చిత్రం-2 -గణేశ్వరరావు ఈ చిత్రాన్ని వేసింది మెక్సికన్ ఆర్టిస్ట్ ఫ్రిడా  (ప్రముఖ భారతీయ చిత్రకారిణి అమృతా షేర్ గిల్ ను ఇండియన్ ఫ్రిడా  గా కొందరు విమర్శకులు గుర్తించారు). ఫ్రిడా మరణం తర్వాత ఆమె ప్రతిభ వెలుగులోకి వచ్చింది.   ఆమె చిత్రాలు ‘అధివాస్తవికత’తో నిండి ఉంటాయి. ఈ ‘గాయపడ్డ లేడి’చిత్రంలో ఆమె తన వ్యక్తిగత జీవితంలో అనుభవించిన భౌతిక, మానసిక బాధలను చూపరులతో పంచుకుంటుంది. చాలావరకు ఆమె గీసినవి స్వీయ చిత్రాలే. లేడి తల తన […]

Continue Reading
Posted On :

కథామధురం (ఉడ్ రోజ్ – అబ్బూరి ఛాయాదేవి)

కథామధురం  -జగద్ధాత్రి ఆధునిక తెలుగు సాహిత్యం లో రచయిత్రులు ఇరవైయవ  శతాబ్దం లో అందించిన రచనలెన్నో ఉన్నాయి. అందులో రచయిత్రులు రాసిన కథలు, అలాగే స్త్రీల ను గురించిన కథలు ఈ శీర్షిక లో మనం చదువుకోబోతున్నాం. ఇక్కడ ఈ శీర్షికలో మహిళల గురించిన రచనలను అవి మహిళ చేసినా లేక రచయితలు రాసినవి అయినా ఆ కథను ఇక్కడ అందించ దలిచాము. తెలుగు సాహిత్యం లో చాలా మంచి కథలు వచ్చాయి వస్తున్నాయి. అయితే మిగిలిన […]

Continue Reading
Posted On :
కోసూరి ఉమాభారతి

అభినయ భారతి కోసూరి ఉమాభారతి తో ఇంటర్వ్యూ 

అభినయ భారతి కోసూరి ఉమాభారతి తో ఇంటర్వ్యూ  -పద్మిని భావరాజు మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి క్లుప్తంగా చెప్పండి. జవాబు: బాల్యం అనగానే, నాట్యం పట్ల నాకున్న ఆసక్తి గుర్తొస్తుంది. వెంపటి చినసత్యం గారి డాన్స్ క్లాస్ కి వెళ్ళడం, గొప్ప డాన్సర్ అవ్వాలన్న నా కలలు గుర్తొస్తాయి. ఇంట్లో నలుగురు పిల్లల్లో పెద్దదాన్నవడంతో అదనపు బాధ్యతలతో పాటు చదువు, క్రమశిక్షణ పాటించవలసి రావడం గుర్తొస్తుంది. మద్రాసులో ఉండగా, కొద్దిరోజులు కేవలం డాన్స్ చూడ్డానికే చినసత్యం గారి డాన్స్ క్లాసుకి వెళ్ళడం గుర్తొస్తుంది. […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం (మెక్సికో)-1

యాత్రా గీతం (మెక్సికో-కాన్ కూన్) -డా||కె.గీత భాగం-1 ఇంతకు ముందు కాలిఫోర్నియాని ఆనుకుని ఉన్న మెక్సికో సరిహద్దు నగరమైన బాహా కాలిఫోర్నియా కి నౌకా ప్రయాణం (క్రూయిజ్) వెళ్లొచ్చేం కదా!  ఇప్పుడు మెక్సికో కి తూర్పు తీరంలో ఉన్న కానుకూన్ వెళ్లి రావాలని అనుకున్నాం. అమెరికా పశ్చిమ తీరంలో ఉన్న కాలిఫోర్నియా నుంచి మెక్సికో తూర్పు తీరానికి  ప్రయాణం అంటే విమానాల్లో దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం. అంతే కాదు, కాలమానంలో మూడు గంటలు ముందుకి వెళ్తాం.  […]

Continue Reading
Posted On :

అనుసృజన-నేను ఓడిపోలేదు

నేను ఓడిపోలేదు   హిందీ మూలం : ఊర్మిలా శిరీష్    అనుసృజన : ఆర్.శాంతసుందరి ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చిన్నప్పుడు అక్కడ ఎవరూ లేరు. నల్లటి నిశ్శబ్దం మాత్రం అలుముకుంది.దోమల రొద, తేమ వాసన గదినిండా పరుచుకునుంది.బైట వర్షం ఆగిపోయింది,కానీ నీళ్ళు పారుతున్న చప్పడూ, చినుకుల చిటపటలూ ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.రోడ్డుమీద మనుషుల సందడి వినిపిస్తోంది.ఆమె తన కళ్ళని చేత్తో తడిమింది…నిద్రపోతున్నానా, మేలుకునే ఉన్నానా… ఒక్క క్షణం పాటు అయోమయంగా అనిపించింది.ఇంకేదో రహస్యలోకం తన చుట్టూ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 1

నా జీవన యానంలో- (రెండవభాగం)- 1 -కె.వరలక్ష్మి  అప్పటికి నాకు ఇరవై ఐదవ సంవత్సరం నడుస్తోంది. స్కూల్ ఫైనల్ (11 వ తరగతి ) తో నా చదువాగిపోయి పదేళ్లైపోయింది. స్కూల్ ఫైనల్లో నాకొచ్చిన మార్కుల వల్ల హిందీలో ప్రాధమిక, మాధ్యమిక చదవకుండానే డైరెక్టుగా రాష్ట్ర భాషకు అటెండై పాసయ్యాను . అప్పటికి హిందీ అక్కయ్యగారు ట్యూషన్స్ మానేసారని గుర్తు . నేను సొంతంగానే చదువుకునే దాన్ని . రాజమండ్రిలో పుష్కరాల రేవు పక్కనున్న రాణీ మహల్లో […]

Continue Reading
Posted On :

క“వన” కోకిలలు – మాయా ఆంజలోవ్

                                         క “వన” కోకిలలు   -నాగరాజు రామస్వామి                                                    మాయా ఆంజలోవ్  ( ఏప్రిల్ 4 , […]

Continue Reading

పునాది రాళ్ళు-1

పునాది రాళ్ళు -డా||గోగు శ్యామల నా పీహెడీ టాపిక్ : “తెలంగాణ దళిత జీవిత చరిత్రల  ద్వారా కుల చరిత్రల అధ్యనం” ఈ పరిశోధనలో ఐదుగురు మహిళను ఎంపిక చేసుకున్నాను.  వీరి జీవితాలను కొన్ని సిద్దాoతాల వెలుగులో కొంత లోతుగా అధ్యయనం చేయాలనుకున్నాను.   ఈ అధ్యయనం ఇంకొంత విస్తృతo చేస్తూ ఇంకా కొంతమంది అణగారిన జాతుల, వర్గాల, ప్రాంతాల స్త్రీల జీవిత చరిత్రలను కూడా  రాసి ఇందులో చేర్చాలనుకుంటున్నాను. ఇంకా, ఈ పరిశోధనలోని ఐదుగురు మహిళల […]

Continue Reading
Posted On :

తప్పటడుగు(కథ)

తప్పటడుగు -వంజారి రోహిణి “నీతా! బంటి, రీతూ రడీనా? వాళ్ళ స్కూల్ బస్ వచ్చింది, పిల్లలను పంపు” అన్నాడు అరవింద్ పేపర్ లో తలదూర్చి. “ఆ రడీ అయ్యారు” అంటూనే బంటీ,రీతూల భుజాలకి బ్యాగ్ లు తగిలించి చేతికి చిన్న లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ ఉండే బాస్కెట్లను అందించింది నిఖిత.  ఓకే డాడీ, మామ్ టాటా అంటూ స్కూల్ బస్ ఎక్కేసారు ఇద్దరు. “నీతా నేను కూడా ఈ రోజు ఆఫీస్ కి త్వరగా వెళ్ళాలి” […]

Continue Reading
Posted On :

 నాన్నని పోగొట్టుకుని ! (కవిత) 

    నాన్నని పోగొట్టుకుని !     – రేణుక అయోల     1 .  అస్తికలు బూడిద ఒడిలోకి తీసుకున్న గోదావరి –       ప్రవాహంలో నాన్న జీవితం –       పాదాలని కడుగుతూన్న గోదావరి       అలలకి నా దుఃఖం వో చినుకు      నది మెట్ల మీదనుంచి అడుగులు  వెన క్కివేయడం      ఒక దీర్ఘ జ్జాపకాన్ని మోయడం పల్చటి చలిలో      అగ్నిని  బొడ్డుకి చుట్టుకున్నట్టుగా ఉంది      నిన్నటి వరకు నీది  నాది ఒక పేగు బంధం      ఇప్పుడది ఎముకలు […]

Continue Reading
Posted On :

రమణీయం-కదులుతున్న కల 

రమణీయం కదులుతున్న కల  -సి.వి.రమణ   టివి లో చెన్నై గురించి వార్తలు చూస్తున్నాము. అక్కడి తీవ్రమైన నీటి ఎద్దడిని, ప్రజల కడగండ్లను వివరిస్తున్నారు. ప్రభుత్వం సంక్షేమ పధకాలకుఖర్చు చేస్తూ, అభివృద్ధి పధకాలను నిర్లక్ష్యం  చేసిన కారణంగా ……. చెట్లు ఎండి, మొక్కలు మాడి, పసువులు, పక్షులు ఆఖరికి మనుషులు కూడా విలవిలలాడుతున్నారు; నీటికరువువలన కలిగే ఇక్కట్లుతో. కరువు, కరువు అంటాం కాని, ఈ కరువు ఎందుకొచ్చింది? నివారణ ఏమిటి? మనము ఏమి చెయ్యగలం, అని ఆలోచించం. రాజకీయనాయకులు […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-1

నారి సారించిన నవల -1 -కాత్యాయనీ విద్మహే    నవల 1870లలో   తెలుగు సాహిత్య ప్రపంచంలో అంటుకట్టబడిన కొత్తప్రక్రియ. సూతుడు కథకుడుగా, శౌనకాదిమహామునులు శ్రోతలుగా అభివృద్ధి చేయబడిన పురాణసాహిత్యం సాధారణ ప్రజలకు స్థానిక పౌరాణికులు ద్వారా అందే సంప్రదాయం నుండి- వలసపాలనా కాలపు నగర జీవనం,జీవితం రూపొందుతున్న క్రమంలో- ఎవరికీ వారు చదువుకొనే సాహిత్య ప్రక్రియలకు జరిగిన పరివర్తన చిన్నదేమీకాదు. సాహిత్య ప్రపంచంలో పాఠకులుగా స్త్రీలు కూడా ఉంటారన్న ఒక ప్రజాస్వామిక చైతన్యం నవలా ప్రక్రియ […]

Continue Reading

ప్రమద-అక్షర బ్రహ్మ పుత్రి ఇందిరా గోస్వామి

అక్షర బ్రహ్మపుత్రి ఇందిరా గోస్వామి-జగద్ధాత్రి  “మీరు ఆత్మ కథ రాస్తే బాగున్ను కదా ?” అని ఇటీవలతన 90 వ జనం దినోత్సవం నాడు తెలుగు కథకు చిరునామా కారా మాస్టారిని ప్రశ్నించినపుడు ఆయన ఇచ్చిన సమాధానమిది “ ఆత్మ కథ రాయడం వలన అందులో సమాజానికి ఉపయోగ పడే విషయాలేమైనా ఉంటే తప్ప ఊరికే రాయగలం కదా అని ఆత్మ కథ రాయనక్కర్లేదు” ఎంత ఉదాత్తం ఆయన భావన. ఆత్మ కథల్లో బాగా పేరు పొందినవి […]

Continue Reading
Posted On :

కాళీ పదములు       

కాళీ పదములు                                 -పాలపర్తి ఇంద్రాణి 1. ధూళి ధూసరితమైన  భూమి పైన్నుంచి లేచి హంసలా మబ్బులలో  ఎగురుతున్నాను సాటి రాయంచల  హొయలు చూచి  మైమరచానో మోహించానో ఆ వేల అడుగుల  ఎత్తునుంచి జారి పడబోయాను  అమ్మా,అమ్మా, అమ్మా,అమ్మా! అద్భుతమాశ్చర్యమానందం!  మూడు హస్తాలు  నిలువరించాయి నన్ను నువ్వు పంపిన పరమ గురువులు ముగ్గురు పక్షి పాదాల వారు కాంతి కమండలాల వారు గాలి బిరడాల వారు […]

Continue Reading

చిత్రం-1

చిత్రం -గణేశ్వరరావు జార్జియా కీఫ్, అమెరికన్ చిత్రకారిణి, ‘మనం పూలని సరిగ్గా చూడం, ఎందుకంటే అవి చిన్నవి. సరిగ్గా నేను చూసే పద్ధతిలో పెద్దవిగా చూపిస్తూ వాటి బొమ్మ గీస్తే? మీరు తప్పక చూస్తారు’ అంటుంది. 1928లో గస గసాల పుష్పం బొమ్మను (30″/40″) గీ సింది, ప్రకృతిని నైరూప్య కళలో ప్రదర్శించి కళ్ళముందుకు తెచ్చింది. రెండు పూలే కనిపిస్తాయి, వాటి వెనుక కొమ్మలూ రెమ్మలూ లేవు . రంగుల మేళవింపులోనూ, వేసిన పద్ధతిలోనూ ఆధునికమైన ఈ […]

Continue Reading
Posted On :

చూడలా గులాబిలా!

చూడలా గులాబిలా! -చంద్రలత లా వి యెనా రోజా ! ఎడిత్ పియెఫ్  ( La Vie en Rose *  Edith Piaf) బురదగుంటలో వేళ్ళూనుకొన్నప్పటికీ, తామరలా వికసించమంటాడు గౌతమ బుద్ధుడు. ముళ్ళకంపపై మొగ్గతొడిగినా, గులాబీలా జీవితాన్ని చూడమంటొంది ఎడిత్ పియెఫ్. అలాగని, ఎడిత్ పియెఫ్ తాత్వికురాలో దార్షనికురాలో కాదు. ఒక గాయని.తన పాటలు తానే రాసుకొని ,తనే స్వరపరుచుకొని పాడగలిగిన జనరంజక గాయని.ఫ్రెంచ్ దేశీయుల గుండెల్లో ప్రతిధ్వనించే  ఫ్రాన్స్ జాతీయ సంపద. ఫ్రెంచ్ గాయనీ […]

Continue Reading
Posted On :

 స్నేహం (బాల నెచ్చెలి-తాయిలం)

                                                స్నేహం                                                    -అనసూయ కన్నెగంటి      హరిత, భవిత ఇద్దరూ […]

Continue Reading
Posted On :

చిత్రలిపి (గంగమ్మా గౌరమ్మా)

చిత్రలిపి -అన్వర్ ఆ మధ్య ఊరికి పోతే ఇదిగో గంగమ్మా గౌరమ్మా కనబడినారు. ముచ్చట వేసింది. గంగమ్మా గౌరమ్మా అంటే మరేం కాదు. ఇంటికి భిక్ష అడగడానికి వచ్చేవాళ్లల్లో ఒక రకపు  వారు తమ చేతిలో ఒక పీఠం పైన గంగాదేవి, గౌరీ దేవి బొమ్మల్ని ఎదురెదురుగా కూచుని చెరో రోలు పుచ్చుకుని రోట్లో దంచడానికి సిద్దమై ఉంటారు. ఈ పీఠం పుచ్చుకున్న స్త్రీ కిందనుండి చేతులు ఉంచి ఆడించగానే ఇద్దరు సవతులు మర చేతులు ఊపుకుంటూ  […]

Continue Reading

దేహమంటే మనిషి కాదా

దేహమంటే మనిషి కాదా – కొండేపూడి నిర్మల దేశమ౦తా మనది కాకపోవచ్చు దేహమయినా  మనది కాకుండా ఎలా వుంటుంది ? దగ్ధమయిన దేహం ఇంక ఎవరి కన్నీరూ తుడవదు, కోపగించుకోదు కానీ నిన్నటి దాకా  చెప్పిన పాఠాలు ఎక్కడికి పోతాయి ఏళ్లతరబడి అల్లుకున్న స్నేహాలెక్కడిపోతాయి సగం చదివి మడత పెట్టిన పేజీకి అవతల కధ ఎటు పారిపోతుంది ఇంత జవ౦, జీవం, పునరుజ్జీవ౦ వున్న మనిషి  నుంచి దేహాన్ని  విడదీసి మంట పెట్టడం  ఏమి న్యాయం..? కాలధర్మం […]

Continue Reading

ఆకాశమే ..గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ ఆకాశమే ఒక కాగితం హరివిల్లు దించేసుకోనా నా మనసునే కుంచెగా ఒక బొమ్మ నే గీసుకోనా ఆ కొండ కోనల్లొ ఆగనా ఆవాగు నీరల్లె సాగనా నా కంటిలో ఆ సోయగం పదిలంగ నిధి చేసుకోనా ఆతీగ పువ్వల్లె నవ్వనా ఆ కొమ్మలో కోయిలవ్వనా ఈ గుండెతో ఆ గీతిని మురిపెంగ పెనవేసుకోనా ఓ మేఘనీలమై మారనా ఓ సంధ్య ఎరుపై జారనా  ఆ వర్ణకాంతులే నిండుగా ఒళ్ళంత నే పూసుకోనా మధుమాస […]

Continue Reading

యశోబుద్ధ

యశోబుద్ధ –సి.బి.రావు  కొన్ని చారిత్రకాంశాల ఆధారంగా వ్రాసిన, ఈ కాల్పనిక కథను నవలగా మలిచారు రచయిత్రి ఓల్గా. 2500 సంవత్సారాల క్రితం జరిగిన కథకు సరైన ఆధారాలు లభించటం దుర్లభమే. అయినా రచయిత్రి ఊహించి వ్రాసిన యశోధర పాఠకులను ఆసాంతం ఆసక్తిగా చదివిస్తుంది. కపిలవస్తు, కౌలీయ గ్రామాల మధ్యనున్న దేవాలయం లో సిద్ధార్థుని యశోధర యాదృచ్ఛికంగా చూడటం జరిగి, తొలిచూపులోనే  ఆకర్షితురాలవుతుంది. అతని ప్రవర అడిగి, తన ప్రవర చెప్తుంది. యశోధర రూపం గౌతముడి మదిలో చెరగని […]

Continue Reading
Posted On :

 నారీ“మణులు”- భండారు అచ్చమాంబ

నారీ“మణులు” భండారు అచ్చమాంబ -కిరణ్ ప్రభ  భండారు అచ్చమాంబ (1874-1905) తొలి తెలుగు కథా రచయిత్రి. ఇప్పటికి దాదాపు నూరు సంవత్సరాల క్రితం ”అబలా సచ్చరిత్ర రత్నమాల” గ్రంథాన్ని రచించారు. ఆమె తన రచనల్ని స్త్రీల అభ్యున్నతిని ప్రోత్సహించటానికే ఉపయోగించారు. అత్యంత స్ఫూర్తిదాయకమైన భండారు అచ్చమాంబ గారి జీవితగాథని కిరణ్ ప్రభ గారి మాటల్లో ఇక్కడ వినండి: https://youtu.be/nvQxwM8iyDo కిరణ్ ప్రభతెలుగు సాహితీ లోకానికి కిరణ్ ప్రభ పేరు సుపరిచితమే. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. దాదాపు అయిదారువందల […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల(భాగం-1)

వెనుతిరగని వెన్నెల(భాగం-1) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/U4aGyMHNEZ8 వెనుతిరగని వెన్నెల(భాగం-1) -డా|| కె.గీత   (*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** “యు హావ్ ఎరైవ్డ్ యువర్ డెస్టినేషన్”  సమీర జీ.పీ యస్ ని ఆపి,  కారు దిగింది. చుట్టూ పరికించి చూసింది.  “గ్రేట్ అమెరికా, ఈ జీ.పీ యస్లు లేకముందు […]

Continue Reading
Posted On :

షర్మిలాం“తరంగం”-1

షర్మిలాం“తరంగం”  -షర్మిల కోనేరు ” దైవం మానుష రూపేణా ” అంటారు . ఈ మాట వాడుతున్నానని నేనేదో సంస్కృత పండితురాల్ని అనుకునేరు … నేను ఆరు ఏడో తరగతుల్లో సంస్కృతం నేర్చుకున్నాను గానీ రఘు వంశం , దిలీపుడు అన్న మాటలు తప్ప ఏమీ గుర్తులేవు .  అంతెందుకు మా వూరి లైబ్రరీలో వున్న సాహిత్యాన్నంతా ఒక్కో పుస్తకం చొప్పున పరపరా నమిలేసే దాన్ని .  ఇప్పుడు స్క్రీన్లు చూస్తే అమ్మానాన్నలు గగ్గోలు పెట్టినట్టు పుస్తకాలు […]

Continue Reading
Posted On :