image_print

శ్రీరాగాలు- 10 రిషబన్ తమిళ కథ “కూడు” కథకు గౌరీ కృపానందన్ తెలుగు అనువాదం “గూడు”

https://youtu.be/MeuEsryMCfw శ్రీరాగాలు-10 గూడు (రిషబన్ తమిళ కథ “కూడు” కథకు గౌరీ కృపానందన్ తెలుగు అనువాదం “గూడు”) – గౌరీ కృపానందన్ తలుపు తియ్యడానికి ఎందుకు ఇంత ఆలస్యం? కాలింగ్ బెల్లును మళ్ళీ నొక్కాను. బస్ స్టాండు నుంచి ఇంటికి రావడానికి పావుగంట నడక. ఇంకా ఊపిరి అందకుండా ఉంది. ఇంట్లో కుక్కూ మంటూ కాలింగ్ బెల్ మోగుతున్న శబ్దం వినిపిస్తూనే ఉంది. కానీ అమ్మ ఇంకా వస్తున్నట్లు లేదు. ఏమై ఉంటుంది? నిద్ర పోతోందా? లేక… […]

Continue Reading
Posted On :

శ్రీరాగాలు- 9 లంక సీత కథ – జీవన సత్యం

శ్రీరాగాలు-9 జీవన సత్యం -లంక సీత సుబ్బారావు సుజాతలు ఇంచుమించుగా ఒకేసారి బ్యాంకులో చేరారు. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకింటివారయ్యారు. ఇది పాతికేళ్ల నాటి సంగతి. ఈ పాతికేళ్ళ సంసార జీవితంలో సుబ్బారావు సుజాతలు ఎంతో అన్యోన్యంగా సుఖంగా గడిపారు. ఇద్దరు కూతుళ్ళు సౌజన్య, సౌమ్యల భవిష్యత్తు చక్కదిద్దాలనే తపనతో అహర్నిశలూ కష్టపడి, చదివించి పెంచి పెద్ద చేశారు. చక్కటి సంబంధాలు చూసి పెళ్లిళ్లు కూడా చేశారు. పెద్దమ్మాయి భర్త అమెరికాలో ఒక సాప్ట్ వేర్ ఇంజనీర్. […]

Continue Reading
Posted On :
K.Geeta

శ్రీరాగాలు- 8 డా.కె.గీత కథ – పుణ్యం దేవుడెరుగు

https://youtu.be/jmVMtR5PKHM శ్రీరాగాలు-8 పుణ్యం దేవుడెరుగు (డా.కె.గీత “వెంకటేశ్వర మెట్ట కథలు” నించి) -డా.కె.గీత నా చిన్నతనంలో మా తాతయ్య చచ్చిపోయాక అమ్మమ్మగారింటి దగ్గర నా మేనమామలే ఇల్లంతా నడిపేవాళ్ళు. మా అమ్మమ్మ మహా జాగ్రత్త గలది. ఒక్కోసారి అవసరమైనవి కూడా ఖరీదేక్కువైతే కొనేది కాదు. కొననిచ్చేది కాదు. మా పెద్దమామయ్య ఎప్పుడేనా అయిదు రూపాయల చేపలు కొన్నాడంటే, వంటింటి కవతలే అడిగేది ఖరీదు. రెండ్రూపాయల కంటే ఎక్కువైతే – బుట్ట గేటు కవతల పడేట్టు విసిరేది. మరొకటి […]

Continue Reading
Posted On :
Nirmala Kondepudi New Image

శ్రీరాగాలు- 7 కొండేపూడి నిర్మల కథ – ప్రేమజిల్లాలు

శ్రీరాగాలు-7 ప్రేమ జిల్లాలు -కొండేపూడి నిర్మల ప్రియమైన రతీదేవీ! ఎలా వున్నావు? నా వరకు నేను దుర్భరమైన ఒంటరితనం భరిస్తున్నాను. అన్నీవడ్డించాక విస్తట్లో నీళ్ళ గ్లాసు బోర్లించినట్టయింది నా పరిస్థితి. తలంబ్రాల తన్మయం ఇంకా వదల్లేదు. మైలస్నానం చెయ్యాల్సి వచ్చింది. అయినా పోక పోక ఎవరో శపించినట్టు మన శోభనం నాడే పోవాలా మా బామ్మ? ముహూర్తం పెట్టిన వాడెవడో గానీ.. ఛ! ఉత్సాహం అంతా నీరు కారిపోయింది. మనకిలా రాసిపెట్టినట్టుంది. ఏం చేస్తాం? రోజుల్ని యుగాల్లా […]

Continue Reading
Posted On :

శ్రీరాగాలు- 6 పూర్ణిమ తమ్మిరెడ్డి కథ ‘కెరీర్ ఓరియెంటెడ్ మాన్’

https://youtu.be/ondl_zyUydA శ్రీరాగాలు-6 కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నాడు కవి. పొరపాటు సంగతేమోగానీ, శరీర తత్వాలు మారితే మనస్తత్వాలూ, అవి సృష్టించే పరిస్థితులూ మారతాయా? ఈ ప్రశ్నకి వాస్తవ సమాధానాన్ని వినాలనుందా? ‘కెరీర్ ఓరియెంటెడ్ మాన్’ -పూర్ణిమ తమ్మిరెడ్డి మగత నిద్రలో తొడల మధ్య ఏదో కదులుతున్నట్టు అనిపించేసరికి ఉలిక్కిపడి సీటులో కదిలాడు సందీప్. పక్కనున్న పెద్దావిడ కూడా కాస్త కదిలి, మళ్ళీ సర్దుకుంది. ఆవిడ పనేనని అర్థమవుతున్నా సందీప్‌కి ఏం చేయాలో తోచలేదు. ఆల్రెడీ వెనుక […]

Continue Reading
Posted On :

శ్రీరాగాలు- 5 కుప్పిలి పద్మ కథ ‘ముక్త’

https://youtu.be/Dnjm95EQx1o శ్రీరాగాలు-5 ‘ముక్త‘ -కుప్పిలి పద్మ ఎన్నో పద్ధతులు… పద్ధతుల పేరిట పడే సంకెళ్లు… సంకెళ్లు అని తెలుసుకోలేక, తెలుసుకున్నా వాటిని తెంచుకోలేక, మధ్యలోనే విరిగిన అలల్లాంటి జీవితాలు… ఇవి చెలియలి కట్టని దాటే రోజు వస్తుందా? ***           అరేబియా అలల్ని బంధించేసిన మెరైన్ డ్రైవ్ మీద వెళ్తున్న వాహనాలని చూస్తోంది ముక్త. చేతిలో మెనూ కార్డ్. బృంద పరిచయం చేసిన ఆ రెస్టారెంట్‌లో కార్డ్ చూడకుండానే తనకి కావలసినవి […]

Continue Reading
Posted On :