image_print

కొత్త అడుగులు-33 అనామిక

కొత్త అడుగులు – 33 తెలంగాణా లో బలమైన స్వరం –‘అనామిక’ – శిలాలోలిత ‘అనామిక’ పేరుతో సాహిత్య లోకానికి పరిచయమైన వ్యక్తి సోన్నాయిలి కృష్ణవేణి. తెలంగాణా భూమి కన్న మరో జాతి విత్తనం. ఆ అక్షరాల్లో ఎంత పదునో, ఎంతధిక్కారమో, ఎంత ఆవేశమో, ఎంత తిరుగుబాటు తనమో ఆమె కవిత్వమే చెల్లుతుంటుంది. అనామిక ను మొదటిసారి గా ‘లోమవాన్’ లో జరుగుతున్న ‘కవిసంగమం’ సీరీస్ లో చూసాను. అప్పటికి ఆరోగ్యం గా ఉంది. అసమానతల గరళాన్ని […]

Continue Reading
Posted On :

విజయవాటిక-11 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-11 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ మహాదేవవర్మ మందిరము           ఎత్తైన పది మెట్లు ఎక్కిన తరువాత దేవడిలోకి ప్రవేశిస్తాము. రెండు సింహపు శిల్పములు ఆ మెట్లపైన కూర్చొని రాజసంగా చూస్తున్నాయి. దేవడిలోకి ప్రవేశించగానే ఎతైన స్తంభాలతో, గోడలనలంకరించిన తైలవర్ణ చిత్రాలతో, రకరకాల గాజు బుడ్డీలలో పెట్టిన దీపాలతో మందిరము మహోత్సవంగా ఉంది. ఆ చిత్రాలు విష్ణుకుండిన పూర్వపు రాజులవి. వీరత్వంతో తొణికిసలాడుతున్నాయి. విశాలమైన ఆ దేవడిలో ఒక వైపు […]

Continue Reading

మిట్టమధ్యాహ్నపు మరణం-10 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 10 – గౌరీ కృపానందన్ ఆనంద్ ఉమకేసి కాస్త భయంగా చూశాడు. “అన్నయ్య గురించి నాకు అంతగా తెలియదు వదినా?” “హత్య చేసేటంత బద్ద శత్రువులు మీ అన్నయ్యకి ఎవరున్నారు?” “తెలియదు వదినా.” మూర్తి శవాన్ని అతని తల్లి తండ్రులు కారులో ఎక్కించారు. శవాన్ని ఎక్కించడంలో మణి సహాయం చేశాడు. మణి ఎప్పుడూ సాయానికి ముందుంటాడు. మణి – దివ్యా… మాయా! ఎందుకోసం ఇనస్పెక్టర్ అలా ఆలోచించారు? ఉమ దివ్య వైపు చూసింది. […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-19

నిష్కల – 19 – శాంతి ప్రబోధ జరిగిన కథ: మనసులేని మనువు వదిలించుకుంటే ఒంటరైన శోభ, తెగిన ఊయల లాంటి ఆ బంధం కోసం వెంపర్లాడకుండా సర్వ స్వతంత్రంగా బిడ్డ నిష్కలను పెంచుతుంది. అయినప్పటికీ అతని తల్లి, ఆమె మేనత్త సరోజమ్మను  చేరదీసింది.  నిష్కల  స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న ఆధునిక యువతి. అంకిత్ తో సహజీవనం లోకి వెళ్ళింది.  అమెరికాలో అటార్నీగా పని చేస్తుంది. ఫ్యామిలీ, పిల్లల కేసులు డీల్ చేస్తుంది. తన క్లయింట్ తో కలసి వచ్చిన […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -36

జ్ఞాపకాల సందడి-36 -డి.కామేశ్వరి   కావమ్మ  కబుర్లు -5 వారాలబ్బాయి (మొదటి భాగం)           వారం అంటే పల్లెల నించి చదువుకోడానికి వచ్చే బీద అబ్బాయిలు కలిగిన  వారింట ‘వారంలో ఒక రోజు మీ ఇంట భోజనం పెట్టండి’ అని అడిగి, ‘ఫలానా రోజు మీ ఇంటికి వస్తాను’ అని చెప్పడం అన్న మాట. అలా బ్రాహ్మణ ఇళ్లల్లో ఏడు రోజులు వారం కుదుర్చుకుని ఆ ఇంటి అరుగు మీద పడుకుని, నూతి […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-34

కనక నారాయణీయం -34 –పుట్టపర్తి నాగపద్మిని           ఆ వీధిలోనే తరతరాలుగా స్థిరపడిన  పేరుమోసిన లాయర్ నరసరామయ్య గారి పేరుతోనే ఆ వీధి పిలువబడేది. దాదాపు వెయ్యి గజాల స్థలంలో…వీధి కంటే ఆరడుగుల ఎత్తులో చాలా హుందాగా…పేద్ద వరండా. అందులో ఓ ప్రక్క పేద్ద చెక్క ఉయ్యాల. ఆ ఉయ్యాలపై, ఎప్పుడూ కిల కిలా నవ్వుతూ ఆడుకునే నా వయసు పిల్లలూ!! తెల్లవారింది మొదలు  ఆడా, మగా అందరూ సందడిగా ఏవో […]

Continue Reading

స్వరాలాపన-13 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-13 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

చిత్రం-37

చిత్రం-37 -గణేశ్వరరావు  19 వ శతాబ్దానికి చెందిన జేమ్స్ మెక్నీల్ విజ్లర్ వేసిన ఈ సమస్యాత్మక తైలవర్ణ (నలుపు-బూడిద రంగు) చిత్రం ‘చిత్రకారుడి తల్లి’ మోనాలిసా లాంటి చిత్రాల్లా ప్రపంచ ప్రసిద్ధి గాంచిoది..           సీదా సాదాగా కనిపిస్తున్న ఈ చిత్రం విలువ 700 కోట్ల రూపాయలు. అమెరికా అధ్యక్షుడు ఈ చిత్రం చూడడం కోసం ప్రత్యేకంగా ఒక ప్రదర్శనకు వెళ్ళాడు, అమెరికా ప్రభుత్వం దీన్ని సంస్కృతి సంపద గా భావించి ఒక […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-24

రాగో భాగం-24 – సాధన  “ప్రాజెక్టుకు సంబంధించిన బోర్డు, పునాది రాళ్ళు అవి. ఇంద్రావతి మీద పెద్ద డాం కట్టి భూపాలపట్నం వరకు నీటి సౌలత్ కి, బిజిలి (కరెంటు) తీయడానికి కోట్ల రూపాయల ఖర్చుతో సర్కార్ ప్లాన్ చేసింది. ఆ డాం పూర్తయితే 150 ఊర్లతో పాటు ఈ అడివంతా నీటిలో మునిగిపోతుందట. ఇవి దాని బోర్డులు” అంటూ గిరిజ వివరించింది. “అబ్బో. ఇంత అడవి, ఇన్ని ఊర్లు పోతే ఎట్లక్కా? మన అందరం ఏం […]

Continue Reading
Posted On :

నెచ్చెలి తృతీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచికకు రచనలకు ఆహ్వానం!

నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక తృతీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచికకు రచనలకు ఆహ్వానం! -ఎడిటర్ నెచ్చెలి తృతీయ  వార్షికోత్సవం (జూలై 10, 2022) సందర్భంగా ప్రత్యేక రచనలను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఆహ్వానిస్తున్నాం. కథ, కవిత, వ్యాసం, ట్రావెలాగ్ ప్రక్రియల్లో రచనలు స్వీకరించబడతాయి. ప్రతీ ప్రక్రియలోనూ ఎంపిక చెయ్యబడ్డ పది రచనలు ప్రత్యేక సంచికలో ప్రచురింబడతాయి. ప్రత్యేక సంచికకు ఎంపిక కానివి నెచ్చెలి నెలవారీ సంచికల్లో  ప్రచురింపబడతాయి.  ప్రత్యేక సంచికకు  రచనలు పంపడానికి ఈ క్రింది […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-32 ఫణి మాధవి కన్నోజు

కొత్త అడుగులు – 32 ఈ తరం పాలపిట్ట – ఫణి మాధవి కన్నోజు – శిలాలోలిత           ‘ఫణి మాధవి కన్నోజు’- వేసిన కొత్త అడుగుల్ని ఈ సారి చూద్దాం. కవిత్వాన్ని నాన్ సీరియస్ గా కాకుండా సీరియస్ గా తీసుకున్న కవి. అందుకే ప్రాణం అద్దిన అక్షరాలూ, జల్లెడ పట్టిన జీవితాలు, కళ్ళ ముందే కదలాడుతున్న నగ్నసత్యాలు ఈమె కవిత్వంలోని సాధారణ అంశాలు, కవయిత్రిగా మొదలైన ఈమె నడక ఇప్పుడు కాలమిస్ట్ గా ఎదిగింది. ప్రపంచాన్ని, […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -35

జ్ఞాపకాల సందడి-35 -డి.కామేశ్వరి   కావమ్మ  కబుర్లు -4            ఆ రోజుల్లో కరెంట్ ఉండేది కాదు అన్ని ఊళ్ళల్లో. .పెద్ద పట్టణాల్లో తప్ప. కిరసనాయిలు, దీపం లాంతరు పెట్టుకుని పిల్లలు అందరూ చుట్టూ కూర్చుని చదువుకునే వారం. అందుకే ఎక్కువగా ఉదయం పూట  ఎక్కువ చదువుకునే వారం . ఆరు గంటలకల్లా లేపేసేవారు. కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి ఏడు నించి తొమ్మిది వరకు చదువుకుని, చద్దన్నాలు తినేసి స్కూలూకి వెళ్లి, […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-33

కనక నారాయణీయం -33 –పుట్టపర్తి నాగపద్మిని ‘ఉపనయనం (వడుగు) కాకుండా, గాయత్రీ తోడు లేకుండా ఇటువంటివి శాక్తేయ మంత్రాలు చేయకూడదు. ప్రమాదం. నీవు మా మాట వినకపోతే, మీ అయ్యగారికి చెప్పేస్తాం, అని కూడా బెదిరించినారు. (నవ్వు).’ దీనితో భయపడి మానుకున్నా!! ‘ భళ్ళున నవ్వేశారు పుట్టపర్తి. ఆయన నవ్వులో తనగొంతూ కలిపిన వాట్కిన్స్ గబుక్కున అడిగాడు. ‘ఇవన్నీ సరే స్వామీ, మీతో ఉన్న చనువు కొద్దీ మిమ్మల్ని ఒకమాట అడగాలని ఉంది. మళ్ళీ తిట్టరు కదా?’ […]

Continue Reading
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -20 మనోరంజకమైన రాగం—అభేరి

ఒక భార్గవి – కొన్ని రాగాలు -20 మనోరంజకమైన రాగం – అభేరి -భార్గవి మండే వేసవి మధ్యాహ్నాన్ని మరపిస్తూ, చల్లని గాలి వీచే సాయం వేళ ఆరుబయట కూర్చున్న ఇల్లాలికి, ఆ గాలి తరగలతో పాటు “నీ చెలిమిలోనున్న నెత్తావి మాధురులూ” అనే పాట వినపడి సేదతీరుస్తుంది. ప్రతిష్ఠాత్మకమైన పాటల పోటీలలో పాల్గొని మైక్ అందుకుని “పదిమందిలో పాట పాడినా” అనే పాట పాడిన ఔత్సాహికుడికి ప్రథమ బహుమతి లభిస్తుంది. తొలి పొద్దులో, చీకట్లు విచ్చుకునే […]

Continue Reading
Posted On :

స్వరాలాపన-12 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-12 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-12

ఒక్కొక్క పువ్వేసి-12 రొమ్ములు కోసి పన్ను కట్టిన ప్రాణ త్యాగి – నాంగేళి -జూపాక సుభద్ర కేరళ రాష్ట్ర దక్షిణ ప్రాంతంలో బహుజన కులాల మహిళలు తమ చాతిమీద చిన్న గుడ్డ పేల్క వేసుకుంటే పన్ను కట్టాల్సిందే. కేరళ బహుజన కులాల మహిళలు రొమ్ము పన్ను మీద, రొమ్ము పన్నుల్లో కూడా వున్న వివక్షల మీద 17 వ శతాబ్దం నుంచి పోరాడు తున్నారని చరిత్రలు చెపుతున్నాయి. కేరళ బహుజన కులాల మహిళలు తమ చాతి మీద […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-23

రాగో భాగం-23 – సాధన  ఆకాశంలో చుక్కలు వెలిగాయి. మబ్బులు తేలిపోయి గాలి కూడా పొడిగా వస్తుంది. ఇక వర్షం తేలిపోయినట్టే. నక్షత్రాల మసక వెలుతురు చెట్ల ఆకులను దాటి కిందికి దిగడం లేదు. అలవాటయిన వారికి తప్ప అడవిలో ఆ చీకట్లో దారి కనిపించడమే కష్టం. మిణుగురు పురుగుల మెరుపులు ఉండి ఉండి జిగేలుమని కళ్ళు చెదరగొడుతున్నాయి. ఆ చీకటికి జీమ్, జీమ్ అని నిశ్శబ్దానికి భయాన్ని జోడిస్తున్నట్లు చిమ్మెట్లు రొద చేస్తున్నాయ్. సగం కాలిన […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-18

నిష్కల – 18 – శాంతి ప్రబోధ జరిగిన కథ: మనసులేని మనువు వదిలించుకుంటే ఒంటరైన శోభ, తెగిన ఊయల లాంటి ఆ బంధం కోసం వెంపర్లాడకుండా సర్వ స్వతంత్రంగా బిడ్డ నిష్కలను పెంచుతుంది. అయినప్పటికీ అతని తల్లి, ఆమె మేనత్త సరోజమ్మను  చేరదీసింది.  నిష్కల  స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న ఆధునిక యువతి. అంకిత్ తో సహజీవనం లోకి వెళ్ళింది.  అమెరికాలో అటార్నీగా పని చేస్తుంది. ఫ్యామిలీ, పిల్లల కేసులు డీల్ చేస్తుంది. తన క్లయింట్ తో కలసి వచ్చిన […]

Continue Reading
Posted On :

విజయవాటిక-10 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-10 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ అమరావతి రాజమందిరం           మహాదేవవర్మ తల్పం పైన పవళించి ఉన్నాడు. నిద్రపోవటం లేదు. ఎదో దీర్ఘమైన ఆలోచనలు అతనికి నిద్రపట్టనివ్వటం లేదు. నెమ్మదిగా లేచి ఆ మందిరానికి ఆనుకొని ఉన్న రాజ ప్రాసాదమిద్దె  మీదకొచ్చాడు. చల్లని గాలి శరీరానికి తాకింది. పై పంచ గాలికి వణికింది. కృష్ణానది మీదుగా వచ్చే ఆ చల్లని గాలి అతనిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఊహలలో ఆనాటి నర్తకి […]

Continue Reading

మిట్టమధ్యాహ్నపు మరణం-9 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 9 – గౌరీ కృపానందన్ అమ్మ వచ్చీ రాగానే కూతురిని పట్టుకుని భోరుమన్నది. “నా తల్లే!  ఆ దేవుడికి కళ్ళు లేవా? ఈ కష్టాన్ని మన నెత్తిన పెట్టాడే.” “అమ్మా… అమ్మా! ఎంత రక్తమో తెలుసా? హనీమూన్ కి బెంగళూరుకి రావడం తప్పా అమ్మా? నేను మాత్రం బాగానే ఉన్నాను. ఆయన్ని ఎవరో చంపేశారు.” వెక్కి వెక్కి ఏడిచింది. “ నా తల్లే! నీ ఈ గతి రావాలా?” “అక్కా! తనని ఎక్కువగా […]

Continue Reading
Posted On :

చిత్రం-36

చిత్రం-36 -గణేశ్వరరావు  ఇది తైలవర్ణ చిత్రం అనుకుంటున్నారా? నేను అలాగే అనుకున్నాను. మిమ్మల్ని తప్పు పట్టను. తర్వాత తెలిసింది. ఇది ఫోటో అని. ఈ ఫోటో నా కంట పడగానే ఆశ్చర్యంతో ఒక్క క్షణం నోట మాట రాలేదు. ఒకటి రెండు.. . ఫోటోలను బ్లెండ్ చేస్తుంటారని తెలుసు. ఈ ఫోటోలో మాత్రం కొన్ని ఫోటోలు కలిసిపోయి, ఒక అధివాస్తవికత తైల వర్ణ చిత్రంలా అయింది ! దీన్ని ఎన్నో కోణాల నుంచి చూసినప్పుడు గాని, అది […]

Continue Reading
Posted On :
sailaja kalluri

కొత్త అడుగులు-31 కాళ్లకూరి శైలజ

కొత్త అడుగులు – 31 కొంగలు గూటికి చేరిన వేళ-కాళ్లకూరి శైలజ – శిలాలోలిత అమూర్తమైన భావన అక్షరంగా మారడం, అది పాఠకుని మదిలో మళ్ళీ  ఒక అపురూపమైన స్పందన గా రూపాంతరం చెందడం సాహిత్యం మాత్రమే చేయగలదని కాళ్లకూరి శైలజ నమ్మకం. ఏ కళారూపమైనా కళా రూపానికైనా సాహిత్యం మూలం, అదే మనిషిని మనిషి గా చేసే ఏకైక మాధ్యమమని ఆమె నమ్మకం. శైలజ డాక్టరు  కూడా కావడం వల్ల, తత్వ వేత్త గానే కాక, […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-11

ఒక్కొక్క పువ్వేసి-11 ఆధునిక భారత తొలి వెలివాడ రచయిత్రి -జూపాక సుభద్ర ముక్తా సాల్వే పేరు చరిత్రలో చెరిపేయలేని గొప్ప రచయిత్రి పేరు. 15-02-1855 మరియు 1-03-1855 సంవత్సరం ‘జ్ఞానోదయమ్’ పత్రిక లో ‘మాంగ్ మహారాచ్య దుఖ్విసయి ‘ (Grief of the Mangs and Mahars)( మాoగ్ మహర్ల దుఃఖం) ముక్తా సాల్వే వ్యాసము రెండు భాగాలుగా వచ్చిన రచన. ఆ రచన లేవదీసిన అంశాలు ఆ కాలంలో సంచలనం. ముక్తా సాల్వే రాసిన ఈ […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-32

కనక నారాయణీయం -32 –పుట్టపర్తి నాగపద్మిని వాట్కిన్స్ ముఖంలో ఆనందం తాండవిస్తూంది. ‘అంతకంటేనా సార్?? గొప్ప పని కదా?? పుస్తకంతో పాటూ, నా పేరు, పుట్టపర్తి వారి పేరు, మన స్కూల్ పేరు నిలిచిపోతుంది, జాగ్రత్తగా భద్రపరచ గల్గితే!! నాకు కావలసిన సరంజామా, ఆయా కవుల వివరాలూ, చిత్రాలూ ఇస్తే, నా శక్తికి మించి యీ గొప్ప పనిలో పాలు పంచుకుంటాను తప్పక!!’ అన్నాడు. అలా ఒక గొప్ప చారిత్రాత్మక కార్యక్రమానికి పునాది పడింది, కడప రామకృష్ణా […]

Continue Reading

రాగో(నవల)-22

రాగో భాగం-22 – సాధన  అనుకున్న ప్రకారం అందరూ తోలుబొక్క దగ్గర జమ అవుతున్నారు. ఆడ, మగ పిల్లలు కూడా ఉన్నారు. ఎక్కడికి పోవాలో, ఏం చేయాలో ఎవరికీ అంతు చిక్కడం లేదు. పాండు వస్తే గానీ సంగతి తేలదు అనుకుంటున్నారు ఆయా ఊర్ల సంఘాలవాళ్ళు. ‘అన్నలొస్తారేమో’ అన్నట్టు మెట్టదిక్కు, వాగు దిక్కు చూస్తున్నారు. చూస్తూ చూస్తూ ఉండగానే జనం పెరిగారు. దూరం నుండి వచ్చినవారు కొందరు చెట్ల కింద నడుం వాల్చారు. పిల్లలకు తల్లులు పాలు […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-17)

బతుకు చిత్రం-17 – రావుల కిరణ్మయి జరిగిన కథ: జాజులమ్మ , సైదులు అనుకోకుండా ఒక వర్షం పడిన రాత్రి రాములవారి కళ్యాణ గద్దెపై కలుసుకుంటారు.ఇద్దరూ ఆ ఊరువారు కాకా పోవడంతో జనమంతా మూగి ఆసక్తిగా రాత్రి ఏమి జరిగి ఉంటుందని ఆరాతీస్తూ చివరికి సైదులు తల్లిదండ్రులు వచ్చి అసలు విషయం చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ***           కానీ పరాయి మగవాడితో రాత్రంతా గడిప్పిందంటే ఈమెకు పెళ్ళి ఎలా […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-17

నిష్కల – 17 – శాంతి ప్రబోధ జరిగిన కథ: భూతల స్వర్గంగా భావించే అమెరికాలో భర్తతో కాలు పెట్టిన శోభ తన ప్రమేయం లేకుండానే గోడకేసి కొట్టిన బంతిలా వెనక్కి వచ్చేస్తుంది.  దూరమవుతుంది. ఒంటరి తల్లి ఏకైక కూతురు నిష్కల. స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న ఆధునిక యువతి. అంకిత్ తో సహజీవనం లోకి వెళ్ళింది.  అమెరికాలో అటార్నీగా పని చేస్తున్నది. తన క్లయింట్ తో కలసి వచ్చిన సారా, అచ్చు తన నానమ్మ పోలికలతో ఉండడం […]

Continue Reading
Posted On :

విజయవాటిక-9 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-9 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ అమరావతి ఓడరేవు           విష్ణుకుండిన మహారాజుల కాలంలో వర్తకం దేశ విదేశాలలో అభివృద్ధి చెందింది. విష్ణుకుండినులు ఎన్నోవిదేశాల వారితో వర్తకం సాగించారు. స్వరాష్ట్ర, పరరాష్ట్రిక వ్యాపారులు క్రయ విక్రయాలలో అభివృద్ధి చెందారు.  విదేశాలైన సుమిత్రా, సిలోన్, జావా, సయాం, కంబోడియా, చీనా, జపాన్, మలయ మున్నగు తూర్పు దేశాలు నుండే కాక కొన్ని పశ్చిమ దేశాల నుంచి కూడా వ్యాపారం ఎంతో సాగుతుండేది. […]

Continue Reading

మా అమ్మ విజేత-8

మా అమ్మ విజేత-8 – దామరాజు నాగలక్ష్మి “నేను స్కూల్లో చదివినప్పటి నుంచీ ఫుట్ బాల్ బాగా ఆడేవాడిని, ఫుట్ బాల్ ప్లేయర్ గా ఎన్నో మెడల్స్ వచ్చాయి, నాకు ఆటలో బాగా పైకి రావాలనే కోరిక వుంద”ని మేనేజర్ కి చెప్పాడు.  అన్నపూర్ణమ్మగారు మాత్రం “కొడుకు ఆటలు ఆడి పాడయి పోతాడని ఏమైనా సరే ఉద్యోగంలో స్థిరపరచండి” అని ఆంధ్రాబ్యాంక్ బ్యాంక్ మేనేజర్ కి చెప్పింది. బ్యాంక్ మేనేజర్ రాఘవయ్యకి ఆటల గురించి కొంత తెలుసు […]

Continue Reading

మిట్టమధ్యాహ్నపు మరణం-8 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 8 – గౌరీ కృపానందన్ మణి దిగ్బ్రమ చెందిన వాడిలా, కలలో నడుస్తున్నట్టుగా వచ్చాడు. ఉమ దగ్గిరికి వచ్చి, “ఏమైంది ఉమా?” అన్నాడు. పరిచయమైన ముఖాన్ని మొట్ట మొదటిసారిగా చూడగానే ఉమకి దుఃఖం కట్టలు తెంచుకుంది. పెద్దగా ఏడిచింది. “మణీ! ఏమైందో చూడు. ఎంత రక్తం? కత్తి పోట్లు! సార్! ముఖాన్ని చూపించండి.” వెర్రి దానిలా అరిచింది. “మిస్టర్ మణీ! మీరు ఈమెకి బంధువా?” “అవును సార్. నేను తనకి మేనమామను.” మణి […]

Continue Reading
Posted On :

నాకు నచ్చిన కొడవటిగంటి కుటుంబరావు గారి కధ “ఆడబ్రతుకే మధురము”

ఆడబ్రతుకే మధురము -యామిజాల శర్వాణి 1930,1940 నాటి కోస్తా ఆంధ్ర సమాజము ముఖ్యముగా మధ్యతరగతి కుటుంబాల గురించి తెలుసుకోవాలంటే  కొడవటిగంటి కుటుంబరావు గారి రచనలు చదవాల్సిందే. ఇరవయ్యో శతాబ్ది సాహిత్య సంచనాలకు అద్దము పట్టిన కుటుంబరావు గారిని అధ్యయనము చేయకపోతే తెలుగు సమాజ సాహిత్యాల పోకడ పూర్తిగా అర్ధము చేసుకోలేము. అయన పుట్టి పెరిగింది పూర్తిగా కరుడుగట్టిన చాదస్తపు వాతావరణము అయినప్పటికీ పరోక్షంగా బ్రిటిష్ ప్రభావము వల్ల మరియు స్వస్థలమైన తెనాలి లో ఉన్న ప్రగతిశీల భావాలు […]

Continue Reading
Posted On :
subashini prathipati

కాదనదు (కవిత)

కాదనదు -సుభాషిణి ప్రత్తిపాటి వెన్నెల్లో ఇసుకతిన్నెలపై..కాళ్ళగజ్జెలతో చిందాడుతూ…చందమామతో దుప్పటి చాటుచేసుకు దొంగాటలాడుతూ…ఆకాశపందిరి క్రింద ఆదమరచి నిద్రించిన కాలమంతా…నాతోనే పయనిస్తోంది చిత్రంగా!! గడియారపు ముళ్ళతో పోటిపడిఐదోముల్లులా అటు,ఇటు తిరిగేస్తూ…ఇంటి పనులు, బయట ఉద్యోగంతో…సతమతమై పోతూ.. కూడా మనసుకళ్ళాన్ని అక్షరపు నారిగా సెలంగిస్తూ కవనశరాలనుసంధిస్తున్న వేళ సమయం నా చేతుల్లో ఒదిగిపోతోంది …పాపాయిలా నిద్రపోతోంది. అలుపెరుగని పయనంలో…అప్పుడప్పుడూ నా కోసంఓ రోజనుకుంటే మాత్రం   మొండికేసిన మోటారుబండిలా కాలం కదలదెందుకో! నన్నల్లుకున్న  అనుబంధాల తీవెలన్నిటికీవసంతాలవారసత్వాన్నందించి….పర్ణికనై నే రాలిపోతున్నప్పుడు కూడా…కాలం నన్ను కాదనదుకన్నతల్లిలా కౌగిలించుకునినా పంచ ప్రాణాలను తనలో […]

Continue Reading

షర్మిలాం“తరంగం”-32

షర్మిలాం “తరంగం” మినీ భారతం  -షర్మిల  మనుషుల మనస్తత్వాలు రకరకాలుగా వుంటాయి. మామూలుగా గతంలో మాదిరిగా పక్క పక్క ఇళ్ళల్లో నివసించే వారినేచూసే అవకాశం వుండేది. ఇప్పుడలా కాదు అపార్ట్మెంట్ కల్చర్ బాగా ఎక్కువైంది. అంతమంది ఒకే చోట నివశిస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళని సన్నిహితంగా చూడడం వాళ్ళ మనస్తత్వాలను స్టడీ చేస్తుంటే ఒక్కో సారి ఆశ్చర్యం , ఒక్కసారి బాధ , ఒక్కో సారి ఆనందం కూడా కలుగుతుందనుకోండి. ముఖ్యంగా ఈ అపార్ట్మెంటుల్లో పని చేసే వాచ్ మెన్ లకి […]

Continue Reading
Posted On :

చిత్రం-35

చిత్రం-35 -గణేశ్వరరావు  కలలు నిజమౌతాయా? కల ఆధారంగా పరిశోధన జరిపి ఓ హత్య కేసుని ఛేదించ వచ్చా? దర్శకుడు తాను కన్న కల ‘118’ తో కలలపై కొత్త అవగాహన కలిగించే ప్రయత్నం చేశాడు. . సినిమావాళ్ళకి కలలు అవసరమేమో కానీ జనం పనులు మానేసి పగటి కలలు కంటూ కూర్చుంటారా? మహా అయితే దీపూ పాడిన ‘కళ్ళకు ఒత్తులు వెలిగించి కలలకు రెక్కలు తొడిగించి గాలిలో తేలుతూ ఉంటున్నానే’ పాట వినమంటే వింటారు. కలలు మనస్తత్వంతో […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -34

జ్ఞాపకాల సందడి-34 -డి.కామేశ్వరి   కావమ్మ  కబుర్లు -3   మా చిన్నతనంలో చదువులు చెపితే మీరు ఆశర్య పోతారు. ఇప్పటిలా ఎల్కేజీ పిల్లకి సయితం రెండుకేజీల బరువుండే బ్యాగుల  పుస్తకాలుండేవి కావు. ఇలా మూడేళ్ళ పిల్లని స్కూల్లో పడేయడం ఉండేదికాదు. అసలు ఐదో క్లాస్ వరకు ఇంట్లోనే చదువుకుని ఐదో క్లాసులో చేరేవారం. అప్పటి వరకు అక్షరాలు నేర్చుకోవడం, ‘అల, వల’ అంటూ తెలుగు వాచకం మొదలెట్టడం, అంకెలు నేర్చుకోవడం, కూడికలు,  తీసివేతలు అన్నీ ఇంట్లోనే. ఇంట్లో పిల్లల […]

Continue Reading
Posted On :

స్వరాలాపన-11 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-11 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

నెచ్చెలి & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కథల పోటీ-2022కి కథలకు ఆహ్వానం

నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్   సంయుక్త ఆధ్వర్యంలో కథల పోటీ-2022కి కథలకు ఆహ్వానం -ఎడిటర్ బహుమతులు: రెండు మొదటి బహుమతి కథలు ఒక్కొక్కటికి రూ.2500/- రెండు ద్వితీయ బహుమతి కథలు ఒక్కొక్కటికి రూ.1500/- రెండు తృతీయ బహుమతి కథలు ఒక్కొక్కటికి రూ.1000/- సాధారణ ప్రచురణకు 20 కథలు  స్వీకరించబడతాయి. ఎంపిక చేసిన కథలు “నెచ్చెలి”లో నెలనెలా ప్రచురింపబడతాయి. నిబంధనలు:- * […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-30 నీలిమ

కొత్త అడుగులు – 30 నీలిమా తరంగం – శిలాలోలిత ఈ నెల పరిచయం చేయబోయే కొత్త రచయిత్రి నీలిమ. పోలిటికల్ సైన్స్ లెక్చరర్ గా ఇబ్రాహీం పట్నం లో పనిచేస్తోంది. ఈ మధ్య అనేక అడ్డు గోడల్ని దాటుకుని పిహెచ్.డి సబ్మిట్ చేసింది.  “రాష్ట్ర శాసన సభలో స్త్రీల నాయకత్వం పేరిట, విలువైన రిసెర్చ్ చేసింది.  40 కి పైగా కవితలు రాసినప్పటికీ ఇంకా పుస్తకం తీసుకురాలేదు.  ఎట్టకేలకు త్వరలో వేస్తానని ఇన్నాళ్లకు మాట ఇచ్చింది. […]

Continue Reading
Posted On :

వెనుకటి వెండితెర -7

వెనుకటి వెండితెర-7 కన్యాశుల్కం -ఇంద్రగంటి జానకీబాల ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘కన్యాశుల్కం’ నాటకానికి ప్రత్యేక స్థానముంది.  అది ఒక నాటకమే అయినా సాహిత్యం లోవున్న అన్ని ప్రక్రియల్ని తలదన్ని నిలబడటం అంటే సామాన్య విషయం  కాదు. ఒకానొక సమయంలో ఆడ పిల్లల్ని కన్యాశుల్కం పేరు తో డబ్బులు తీసుకొని, పెళ్లి కొడుకు ముసలి వాడైనా మూర్ఖుడైనా ఆడ పిల్లల్ని అమ్మేయడం అనే దుష్టసంప్రదాయం వుండేది.  అది కూడా ఆంధ్ర దేశానికి తూర్పున వెళ్తుంటే ఇలాంటి దుర్మార్గం – […]

Continue Reading

మిట్టమధ్యాహ్నపు మరణం-7 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 7 – గౌరీ కృపానందన్ రిసెప్షన్ కి పక్కనే ఉన్న గదిలోకి ఉమను తీసుకెళ్ళారు ఇన్స్పెక్టర్ మాధవరావు. గది గుమ్మం దగ్గర ఎవరెవరో కెమెరాలతో నిలబడి ఉన్నారు. “ఇప్పుడు ప్రెస్ కి న్యూస్ ఏమీ లేదు. ప్లీజ్.. దయచేసి విసిగించకండి.” “మీరు రండి మిసెస్ మూర్తి! కాస్త ఫాను ఆన్ చెయ్యవయ్యా.” కూర్చున్నదల్లా ఏడవసాగింది. మళ్ళీ మళ్ళీ ఉధృతంగా వచ్చేసింది ఏడుపు. “మిసెస్ మూర్తి! ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. ఈ సమయంలో మిమ్మల్ని […]

Continue Reading
Posted On :

షర్మిలాం“తరంగం”-31

షర్మిలాం “తరంగం” లోకో భిన్నరుచిః -షర్మిల  ఒక్కొక్కరి ఇష్టాలు ఒక్కోలా వుంటాయి. నేను ఇష్టపడేదే గొప్ప… పక్క వాళ్ళ ది తక్కువ అనుకునే వాళ్ళు చాలామంది వుంటారు. ఈ మధ్య పంది మాంసం తింటే పంది బుద్ధి, జంతు మాంసం తింటేజంతువుల బుద్ధి వస్తుందని సెలవిచ్చారు ఒక స్వామి వారు! ప్రపంచం మొత్తం మీద అత్యంత ఎక్కువగా వినియోగించేది పోర్క్ ( పంది మాంసం ). ప్రపంచంలోని అంత మంది ఇష్టంగా తినే ఆహారాన్ని మనకి అలవాటులేదని […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-16)

బతుకు చిత్రం-16 – రావుల కిరణ్మయి కుమ్మరి మల్లన్న ఇంటి నుండి  కురాళ్ళు పట్టడం కోసం ఆడబిడ్డలకు చీరలు పెట్టింది. ముత్తయిదు వలను పిలుచుకు రావడానికి బయలుదేరతీసింది . పెద్దామె, నడిపామె మాత్రం సంతోషంగా పెట్టిన చీరలు కట్టుక తయారయిండ్రు గాని చిన్నామె మూతి ముడిసింది. ఉల్లి పొర చీరలు పెడుతేంది?పెట్టకున్టేంది ?ఇగ ఇవి కట్టుకొని ఇంక తగుదునమ్మాని పేరంటాండ్ల పిలవడానికి పోవాల్నా?చూసినోల్లు ఏమనుకుంటరు/ఇంత గతి లేకుంటున్నర?అని మా మొగోల్లను అనుకోరా?అని ఎల్లగక్కింది. పెద్దామె,కల్పించుకొని, ఏందే ?సెల్లె […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-16

నిష్కల – 16 – శాంతి ప్రబోధ కరిపై ఒకరు పెత్తనం లేని ప్రేమ సంబంధంగా తమ సంబంధం  మిగలాలని కోరుకున్న నిష్కల మనసులోకి అంకిత్ చేరి ఇబ్బంది పెడుతున్నాడు. ఆమె ఆలోచనలు వెనక్కి పరుగులు పెడుతున్నాయి. రంగనాయకమ్మ రాసిన జానకి విముక్తి నవలలోని శాంతా -సూర్యం లాగా పెళ్లి తంతు లేకుండా బతకాలని అనుకున్నది. శాంతా సూర్యంలనే స్ఫూర్తిగా తీసుకున్నది. వివాహ సంస్కృతిలో ప్రేమ కంటే శారీరక సుఖాలకే ప్రాధాన్యం ఉంటుంది కానీ సహజీవనంలో అలా ఉండదని […]

Continue Reading
Posted On :

చిత్రం-34

చిత్రం-34 -గణేశ్వరరావు  ముఖ్యమంత్రి ఎంజీఆర్ మరణించాక కూడా తలపైన టోపీని , నల్ల కళ్ళద్దాలని ఉంచేశారు. కారణం ఊహించగలరు. చనిపోయాక కూడా పార్థివ శరీరం చూడాటానికి బాగానే వుండాలన్న ఆలోచనలో తప్పులేదు. జగదేక సుందరి క్లియోపాత్రా శత్రురాజుకి చిక్కకుండా ఉండటం కోసం ఆత్మహత్య చేసుకోవాలని అనుకొంటుంది, ఆ మరణం అనాయాసంగా ఉండాలని మరణించాక కూడా తన అందం చెక్కు చెదరకుండా ఉండాలని ముందుగా మరణ శిక్ష పొందిన ఖైదీలపై పరిశోధనలు జరిపిస్తుంది, ఒక అంగుళం పొడుగు ఉన్న […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -33

జ్ఞాపకాల సందడి-33 -డి.కామేశ్వరి  కావమ్మ  కబుర్లు -2 మానయనమ్మ  పేరు లచ్చయ్యమ్మట  మరీ పాత కలంపేరు   అని మోడిఫైచేసి లక్ష్మి అని చేర్చి సుందరలక్ష్మి అనిఅక్కకి పెట్టారు .తాతగారి పేరు సుబ్బారావు అనిఅన్నయ్యకి పెట్టారు .గుంటూరు వాళ్ళ ధర్మమని బతికున్న వాళ్ళపేర్లు పెట్టారుకనక. మా అమ్ముమ్మపేరు. సూరమ్మ అని పెట్టలేదుట నాకు .అది వింటే గుడ్డిలో మెల్ల సూరమ్మ కంటే కామేశ్వరి కాస్త నయంగావుందని. అప్పటినించి నోరు మూసుకున్న . పోనీ కామేశ్వరిని కాస్త నాజూకుగా […]

Continue Reading
Posted On :

మా అమ్మ విజేత-7

మా అమ్మ విజేత-7 – దామరాజు నాగలక్ష్మి పెళ్ళి హడావుడి, పెళ్ళి ఏర్పాట్లతో అందరూ సందడి సందడిగా వున్నారు. పెళ్ళనేసరికి అమ్మాజీకి అంతా గాభరా గాభరాగా వుంది. ఆటలు ఆడుకుంటూ వుండే అమ్మాజీకి అంతా విచిత్రంగా వుంది. సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ వుండడం, ఎవరి పెళ్ళిళ్ళయినా అయితే సరదాగా తిరిగడం మాత్రమే తెలుసు,  రాత్రి 2.00 గంటల ముహూర్తం. ఇంకా పెళ్ళికి టైము వుండడంతో… అమ్మాజీ గాభరా చూసిన పెద్దమ్మ పిల్లలు “అమ్మాజీ! మనం మన ఇంట్లో […]

Continue Reading

స్వరాలాపన-10 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-10 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-31

కనక నారాయణీయం -31 –పుట్టపర్తి నాగపద్మిని పుట్టపర్తి అన్నారు.’ ఒరేయ్, మన తెలుగు కవుల్లో పది మంది కవుల పేర్లే తెలియవు మీకు!! వీణ్ణి ఎగతాళి చేస్తార్రా మీరు?? ఒరేయ్.. ఎవరైనా పోయి వాట్కిన్స్ ని పిల్చుకుని రాపోండి.’ అన్నారు పుట్టపర్తి. తెలుగు కవులకూ, డ్రాయింగ్  సార్ వాట్కిన్స్ కూ ఏమి సంబంధమో అర్థం కాలేదు వాళ్ళెవరికీ?? ఆయనేమైనా తెలుగు కవులగురించి పాఠం చెబుతాడా ఇప్పుడు??’ ఒక కుర్రవాడు లేచి తుర్రున వెళ్ళాడు వాట్కిన్స్ సర్ కోసం!! వాళ్ళకేమి […]

Continue Reading

విజయవాటిక-8 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-8 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ  ఇంద్రపురి బౌద్ధారామం           ఇంద్రపురి విశాలమైన, ఎతైన భవనపు సముదాయాల నగరం. ఆ నగరానికి పశ్చిమాన బౌద్ధ విహారంలో ఆచార్య దశబలబలి నివాసం. ఇంద్రపురిలో ఒక బౌద్ధవిహారం కట్టించాలన్న సత్యసంకల్పంలో ఉన్నాడాయన. కొడిగట్టిబోతున్న ‘జ్యోతి’ బౌద్ధానికి తన చేతులను అడ్డం పెట్టిన మహానుభావుడాయన. బౌద్ధానికి పూర్వపు వైభవం తేవాలన్నది ఆయన ఆశయం. బౌద్ధ గ్రంధాలు కూలంకుశంగా చదివినవాడు, మహా పండితుడు, బౌద్ధ త్రిపీటికలు […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-10

ఒక్కొక్క పువ్వేసి-10 విస్మృత వీర నారి ఝల్కారీబాయి -జూపాక సుభద్ర           చరిత్రను చరిత్రగా కాకుండా ఆధిపత్య కులదృష్టితో చూడడము వల్ల బహుజన కులాలకు చెందిన త్యాగాల చరిత్రలను కనుమరుగు చేయడం జరిగింది. చరిత్రంటే ఆధిపత్య కుల వ్యక్తుల చరిత్రనే చరిత్రగా చూపించుతున్నది ఆధిపత్య కులవ్యవస్థ. భారతదేశ చరిత్రలు తిరగేస్తే అణగారిన కులసమూహాల మహిళలు, మగవారు కనిపించరు. అణగారిన కులాల మహిళల త్యాగాలు, బలిదానాలు, చరిత్ర అంచుల్ని కూడా చేరని వివక్షల […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-21

రాగో భాగం-21 – సాధన  దల్సు ఇంట్లో నిండు గ్రహణం పట్టినట్టుంది. బట్ట పొట్టకు కరువులేని ఇంట్లో బుక్కెడు అంబలికే పూట పూట గండమవుతూంది. నూకల జావ తప్ప మరొకటి ఎరగని దల్సు ఇంట్లో నూకల వూసే లేదు సరికదా జొన్న అంబలి, జొన్న గటుక పుట్టడమే గగనమవుతూంది. రాగో ఉంటే జొన్నగడ్డ కూలికి పోయి జొన్నలన్నా తెచ్చేదని, పొయ్యి దగ్గరికి పోయినప్పుడల్లా తల్లీ, కూచీ సణుగుతూనే ఉన్నారు. గిన్నె (పళ్ళెం) దగ్గర కూచున్న ప్రతిసారి తండ్రికీ, […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-29 లావణ్య సైదీశ్వర్

కొత్త అడుగులు – 29 లావణ్య సైదీశ్వర్ – శిలాలోలిత కవయిత్రి లావణ్య సైదీశ్వర్ —నల్గొండలోని ‘హాలిమా’లో పుట్టి పెరిగింది. అమ్మా, నాన్నలు సరస్వతి యాదగిరి గార్లు. వీరు స్వంతంగా స్కూల్ నడిపేవారట. తల్లిదండ్రుల తోడ్పాటే కాక,పెళ్లయ్యాక కూడా ప్రోత్సాహం,స్వేచ్ఛ ఉండటం వల్ల లావణ్య రచనా వ్యాసంగం కొనసాగింది. కవిత్వమంటే చిన్నప్పటి నుంచీ చాలా ఇష్టం. చాలా ఎక్కువగా పుస్తకాలు చదవడం వల్ల ఎందరెందరి జీవితాలో ఆమె మనస్సులో నిక్షిప్తమైపోయాయి. జీవితాన్ని అనేక పార్శ్వాలను దగ్గరగా మనకు […]

Continue Reading
Posted On :

షర్మిలాం“తరంగం”-30

షర్మిలాం “తరంగం” మానవాళి నివాళి  -షర్మిల  ఒక్కోసారి ధైర్యం పోగొట్టుకుంటాం. మన చుట్టూ మమతలు పెనవేసుకున్న వారెందరో నిష్క్రమిస్తుంటే నిస్సహాయంగా  వుండిపోవడం ఎంత శిక్ష ? కరోనా ఎందర్ని ఎత్తుకుపోయిందో తల్చుకుంటే గుండె చెరువవుతుంది. ఆషామాషీగా ముక్కుకి నోటికీ ఒక మాస్క్  వేసుకుంటే దగ్గరకు రాదనుకొనే కోట్లాది జనంలాగానే నేనూ కాబోలనుకున్నాను. కానీ మృత్యుదేవత మారువేషమని నా సన్నిహితులెందరినో పోగొట్టుకున్నాకే అర్ధం అయ్యింది. కరుణాకర్ మా మరిది ఫ్రెండ్.  నేను పెళ్ళయి అత్తగారి ఇంట్లో అడుగుపెట్టిన  దగ్గర నుంచి “వదిన గారూ ! అంటూ నీడలా తిరిగేవాడు. నా కూతురు మాకంటే తన దగ్గరే ఎక్కువ వుండేది. కరోనాతో వున్న  అన్నయ్యని ఆసుపత్రికి తిప్పి అతనితో పాటు కరోనా బారినపడి కన్నుమూసాడు. వృద్ధులైన తల్లితండ్రులు నడివయసులో వున్న ఇద్దరు బిడ్డల్ని పోగొట్టుకుని బతుకీడుస్తున్నారు. నా మరదలు నా తమ్ముడి ఇంటి దీపం వాడిని పిల్లల్ని అనాధల్ని  చేసి వెళ్ళిపోయింది. వరసకి వదినని అయినా “అక్కా”  అని అరుణ పిలిచే పిలుపు ఇంకా చెవులకి వినిపిస్తూనే వుంది. మా తోటికోడలి తమ్ముడు నన్నూ ఎంతో ప్రేమగా “అక్కా! ఇంటికి ఓసారిరండి ” అని […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల- 12

చాతకపక్షులు  (భాగం-12) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి సోమవారం గుంటూరులో బస్సు దిగేవేళకి టైము దాటిపోయిందని కాలేజీకి వెళ్లలేదు. మర్నాడు ఆవరణలో అడుగెడుతూనే సత్యం ఎదురయింది. “నిన్న కాలేజీకి రాలేదేం?” “ఏం లేదు. వూరికే.” “ఒంట్లో బాగులేదా?” “అదేంలేదు. ఇంటికెళ్లేను.” “శనివారం వెళ్తే ఆదివారం వచ్చేయొచ్చు కదా.” “రాలేదు.” “పెళ్లిచూపులా?” గీత ఉలిక్కిపడింది. “ఎందుకలా అనుకున్నావూ?” “అంతకంటే నీకూ నాకూ ఏం వుంటాయిలే రాచకార్యాలు. నీ మొహం చూస్తే అనిపించింది. […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-30

కనక నారాయణీయం -30 –పుట్టపర్తి నాగపద్మిని ‘ మయూరము, అంటే, నెమలి షడ్జమాన్ని పలుకుతుందట!! వృషభం, అంటే, ఎద్దు రిషభాన్ని ఆలపిస్తుందట!! గ – గాంధారం, మేక గొంతులోనూ, మ మధ్యమం క్రౌంచ పక్షి  అరుపులోనూ బాగా వినిపొస్తుందట!! పంచమం ప స్వరానికి మన కోకిలమ్మ పెట్టింది పేరు. అశ్వము – అంటే గుర్రము, దైవతానికీ, ని నిషాద స్వరానికి గజము అంటే ఏనుగు ప్రసిద్ధాలు. ‘ పుట్టపర్తి యీ మాటలని ఆగగానే, అక్కడ కూర్చుని వున్న […]

Continue Reading

స్వరాలాపన-9 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-9 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -32

జ్ఞాపకాల సందడి-32 -డి.కామేశ్వరి  కావమ్మకబుర్లు-1 కావమ్మకబుర్లు —–ఎవరీ కావమ్మా ఏమకతని మీరేం ఆలోచలో పడక్కరలేదండోయి ,ఈ కామేశ్వరేఁ  కావమ్మ-ఇంట్లో పిలుపది !ఇప్పుడంటే ఎనభయో పడి లో పడ్డాను కనక కావమ్మా అన్నకాముడు అన్న కావమ్మగారన్న నాకేమి అభ్యతరం లేదు .చిన్నప్పుడు నాకు జ్ఞానం వచ్చినన్దగ్గనించి అంట ఇదే పిలుపు .పట్టుమని పదేళ్లు లేని పిల్లని అంత పెద్దదాన్ని. చేసే ఆ మోటు పిలుపు. విన్నప్పుడల్లా ఉడుకుమోత్తనం వచ్చేది .తక్కిన అప్పచెల్లెళ్లకి. సుందరి, aహేమ, శ్యామల, అన్న మంచి […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-15

నిష్కల – 15 – శాంతి ప్రబోధ నిన్నంతా ఎడతెరిపి లేని మంచువాన కురిసింది. ఇళ్లను, రోడ్లను పూర్తిగా మంచుతో కప్పేసింది.  ఎటు చూసినా శ్వేత వర్ణమే.              ఇంట్లోంచి  బయటికొచ్చిన పిల్లలు మంచు ముద్దలు  తీసుకొని బాల్స్ చేసి ఆడుకుంటున్నారు.             ఈ రోజు హిమపాతం లేదు.  వీకెండ్ కాబట్టి రోడ్లు ఖాళీగా ఉన్నాయి. చెట్ల కొమ్మలు తెల్లటి పూత పూసినట్లుగా కొత్త అందాలు ఒలకబోస్తుంటే… వాటిపై పడిన […]

Continue Reading
Posted On :

వెనుకటి వెండితెర -6

వెనుకటి వెండితెర-9 చక్రపాణి (1954) -ఇంద్రగంటి జానకీబాల మనిషి జీవితంలో హాస్య రసానికి ఒక ప్రధానమైన పాత్ర ఉంది. రకరకాల సమస్యలతో బాధలతో, ఇబ్బందులతో విసిగి పోయినపుడు, కాస్తంత హాయిగా నవ్వుకుంటే బాగుండుననిపిస్తుంది  ఎవరికైనా. కానీ అది తెచ్చి పెట్టుకుంటే వచ్చేది కాదు అలవోకగా వచ్చి, ఆనందంగా నవ్వుకునేలా చెయ్యాలి. అలా సహజంగా ఉన్నన్నప్పుడే అది మనసుల్ని తేలిక పరుస్తుంది. భరణీ వారి మొదటి చిత్రం రత్నమాల. తర్వాత లైలామజ్ను, ప్రేమ, చండీరాణీ లాంటి చిత్రాల నిర్మాణం […]

Continue Reading

మా అమ్మ విజేత-6

మా అమ్మ విజేత-6 – దామరాజు నాగలక్ష్మి “వీరలక్ష్మి గారూ ఇంట్లోనే ఉన్నారా? సుబ్బారావు బయటికి వెళ్ళాడా… అనుకోకుండా ఇటు వచ్చాను. నా కూతురు సరోజని చూసినట్టుంటుంది. మీ మనవరాలు అమ్మాజీని మా రాజుకి ఇచ్చి చేద్దామనుకున్నాం కదా.. పనిలో పని మంచి రోజు చూసుకుంటే పెళ్ళి పనులు మొదలు పెట్టుకుందాం… నేను ఇవాళ వచ్చినది మంచి రోజు కాదనుకోండి. నాకు అలాంటి నమ్మకాలు లేవు. ముందర పని అవడం కావాలి. సరే పెళ్ళికి అయితే మంచిరోజు […]

Continue Reading

చిత్రం-33

చిత్రం-33 జాన్ సింగర్ సార్జెంట్ -గణేశ్వరరావు  సుప్రసిద్ధ చిత్రకారుడు జాన్ సింగర్ సార్జెంట్ కి ఫ్రాన్స్ లో గోచరో (Gautreau) తో పరిచయం అయింది. ఆమెది అపురూప సౌదర్యం – కొనదేరిన ముక్కు, ఎత్తైన నుదురు, హంసను గుర్తుకు తెచ్చే మెడ, సన్నని నడుము. ఇసుక గడియారం లాంటి వంపు సొంపులున్న ఆకృతి – ప్రతీ చిత్రకారుడికి ఆమె బొమ్మ గీయాలని, పాలరాతిపై శిల్పం చెక్కాలనీ అనిపించేది . సార్జెంట్ ఆమె వ్యామోహంలో పడ్డాడు. ఆమె చిత్రం […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-20

రాగో భాగం-20 – సాధన              సుదీర్ఘమైన ఆలోచనలలో కూరుకుపోయినట్టు ఫిలాసఫర్ ఫోజులోనున్న గిరిజ వాలకం చూసి అప్పుడే అక్కడికి చేరుకున్న రుషి ‘బాండేని డోంగలో దాటంగా జడుసుకోలేదు కదా’ అనుకుంటూ అనుమానంగా గిరిజను పలకరించాడు.             “ఏం గిరిజక్కా! డోంగలో ఇబ్బంది కాలేదు కదా! ఇక్కడ ఇంకా నయం. సరికెడ రేవులోనయితే కుండతోనే దాటాలి. అది మాకే భయమేస్తుంది.”     […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-6 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 6 – గౌరీ కృపానందన్ మొదట ఆ రక్తపు ధార ఏమిటో ఆమెకి అర్ధం కాలేదు. ఎటువంటి సంశయం లేకుండా తలుపు తట్టింది. లోపల గొళ్ళెం వేసి ఉంటుందని అనుకున్న ఆమెకు తలుపు మీద చెయ్యి పెట్టగానే తెరుచుకోవడంతో లోపలికి అడుగు పెట్టింది. మూర్తి మంచం మీద లేడు. “లేచేసారా బాబ్జీ?” ఇప్పుడు మూర్తి చెయ్యి మాత్రం మంచం పరుపు మీద కనబడింది. మరీ ఇంత కలత నిద్రా? క్రింద పడిపోయింది కూడా […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-9

ఒక్కొక్క పువ్వేసి-9 ఆధునిక భారత మొదటి ముస్లిమ్ టీచర్ ఫాతిమాషేక్ -జూపాక సుభద్ర ‘ఫాతిమాషేక్’ ఈ మధ్య కాలంలో బాగా వినబడుతున్న ప్రముఖమైన పేరు. ఫాతిమా షేక్, ఆధునిక భారత తొలి టీచర్ సావిత్రి బాయి పూలేతో కలిసి అధ్యాపకురాలి గా, సంస్కర్తగా పని చేసిన ఆధునిక భారతదేశ మొదటి ముస్లిమ్ అధ్యాపకురాలనీ ఆమె కృషిని గురించిన సమాచారాన్ని పుస్తకంగా తెలుగు ప్రపంచానికి తెలియజేసిన జర్నలిస్టు, పరిశోధకులు, రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ అభినందనీయులు. చరిత్ర పుస్తకాల్లో […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-15)

బతుకు చిత్రం-15 – రావుల కిరణ్మయి అవ్వా !ముందుగాల్నయితే పోల్లగాండ్లకు పిల్సి బువ్వ వెట్టు. అసలే బళ్ళు సుత లేక ఏడాడుతాన్డ్రో  ఏమో ! సరే..సరే..!నువ్వు కూకో.! నేను బొయి వాళ్ళను దేవులాడుకత్త. అని ముసలమ్మ బయిటికి పోయింది. ఆడీ…ఆడీ..దుమ్ము కొట్టుకుపోయిన మొహాలతో ఉన్న నలుగురు పిల్లలను తీసుకొని వచ్చింది. అవ్వ. వస్తూనే, చూసినావే ..జాజులు ..!వీళ్ళ వాలకం?బురదల బొర్లిన పసువులొతికే. చెడుగుల లెక్క ఏడ వడితె ఆడ ఎగురవట్టిరి. బళ్ళు తెర్సేదాంక పటేలు కాడికి పనికన్న […]

Continue Reading
Posted On :

విజయవాటిక-7 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-7 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ ఇంద్రపురి బౌద్ధారామం. విశాలమైన ఆ ఆరామము పూర్ణ చంద్రుని ఆకారంలో ఉంది. మహాస్థూపము గుండ్రని పెద్ద డోలు ఆకారంలో ఉన్నది. దాని మీద బుద్ధుని పాద ముద్రలు ముద్రించబడి ఉన్నాయి. మరో ప్రక్క బోధిచెట్టు, ధర్మచక్రం ఉన్నాయి. చుట్టూ జాతక కథలు చెక్కబడి ఉన్నాయి. బుద్ధుని జీవిత విశేషాలు, మాయావతి స్వప్నం, తెల్ల ఏనుగు, పద్మము ఇత్యాదివి ఆకర్షణీయంగా రచించి ఉన్నాయి. ఒకప్రక్క బౌద్ధ భిక్షుల విశాంత్రి గుహలు […]

Continue Reading

భారతదేశ సంగీత వినీలాకాశంలో నిలిచిన మహోన్నత ధృవతార – లతామంగేష్కర్

భారతదేశ సంగీత వినీలాకాశంలో నిలిచిన మహోన్నత ధృవతార లతామంగేష్కర్ -ఇంద్రగంటి జానకీబాల శ్రుతి లత – లత శ్రుతి అన్నారు బడేగులాం అలీఖాన్ – అంతటి గొప్ప సంగీత కారుడు – విద్వాంసుడు, గాయకుడు మహోన్నత వ్యక్తి లతా మంగేష్కర్ గురించి చెప్పిన మాటలు నిజంగా సరస్వతిదేవి నాలుక నుంచి జాలువారిన సంగీతాక్షరాలు. లతా మంగేష్కర్ కారణజన్మురాలు. అలాంటి మహా వ్యక్తులు, కళాకారులు మళ్ళీ మళ్ళీ పుట్టరు. ఏ దేశంలోనైనా అలాంటి జన్మ జీవితం అపురూప సందర్భాలే- […]

Continue Reading

రాగో(నవల)-19

రాగో భాగం-19 – సాధన  గాండో ముందు నడుస్తున్నాడు. ఆ వెనుక ఫకీర అతని వెనుక గిరిజ, కర్పలు నడుస్తున్నారు. ధీకొండ నుండి మడికొండ చాల దగ్గర, నడుమ బాండే నదే అడ్డం. ఆ ఒడ్డుకు మడికొండ. ఈ ఒడ్డుకు ధీకొండ. కాస్తా పైకి పోతే మధ్యప్రదేశ్ – మహారాష్ట్రల సరిహద్దుగా వస్తుంది బాండే. ఆపై నుండి తిరిగి మళ్ళీ మహారాష్ట్రలోనే పారుతుంది. పాము మెలికలు తిరిగే బాండే యం.పి.లో పుట్టి యం.పి. – మహారాష్ట్ర సరిహద్దులో […]

Continue Reading
Posted On :

మా అమ్మ విజేత-5

మా అమ్మ విజేత-5 – దామరాజు నాగలక్ష్మి ఇంటికి వచ్చిన సుబ్బారావు “అమ్మా… ఏంచేస్తున్నావు… నీతో కొంచెం మాట్లాడాలి” అన్నాడు. ఒక్కడే వచ్చిన సుబ్బారావుని చూసి “సుబ్బారావ్ అమ్మాజీ ఏది? నాతో ఏం మాట్లాడతావు చెప్పు. ఏమైందసలు” అంటూ గాభరాగా వచ్చి సుబ్బారావు పక్కన మంచమ్మీద కూర్చుంది. “అమ్మా… నువ్వేమీ కంగారు పడకు. ఏమీ జరగలేదు. అమ్మాజీ వాళ్ళ పెద్దమ్మా వాళ్ళింట్లో ఉండి బాగానే ఆడుకుంటోంది. అక్కడే అన్నం తిని వస్తానంది. నేనూ సరే అని వచ్చేశాను.” […]

Continue Reading

జ్ఞాపకాలసందడి -31

జ్ఞాపకాల సందడి-31 -డి.కామేశ్వరి  ఆరోజుల్లో అంటే మా కాలంలో అమ్మలు, అమ్మమ్మలు ఎంత సులువుగా పదిమందిని కని  పెంచేవారు! ఏడాదికి ఒకరిని మహా అయితే ఏణ్ణర్ధానికి ఒకరిని కని పడేసేవారు. కడుపులో పిల్ల, చంకలో ఎడ పిల్లతో కోడి పిల్లల్లా ఉండేవారు. నొప్పులు మొదలవగానే పురిటి గది  తలుపులు తీసి, తుడిపించి, కడిగించి, నులక మంచం వాల్చి పక్క తయారు చేయించడం. ఉన్నవాళ్లలో పెద్దకుర్రాడిని మంత్రసానిని పిలుచుకు రమ్మని తోలడం. వాడు పరిగెత్తి వెళ్లి పిలుచుకురావడం .అపుడు […]

Continue Reading
Posted On :

రెండు వియోగాలు ..నాలుగు విషాదాలు (ఎండ్లూరి సుధాకర్ కి నివాళిగా-)

ఓల్గా గారికి గౌరవడాక్టరేటు ప్రదానం సందర్భంగా వ్యాసం -ఎ.రజాహుస్సేన్ (తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం గౌరవడాక్టరేటు ప్రదానం చేసిన సందర్భంగా ఓల్గా గారికి నెచ్చెలి అభినందనలు తెలియజేస్తూంది!) ఓల్గా…..ఓ బలమైన స్త్రీవాద స్వరం.,!! *తెలుగు నాట ఓల్గా ఒక ‘ ద్వంద్వ సమాసం.’ భార్యాభర్తలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు లాంటి పదాలను ఎలా విడదీయలేమో, స్త్రీవాదం ఓల్గా అనే పదాలని కూడా మనం విడదీయలేం. రెండు ఆత్మలు కలగలసిన ఏక జంటపదం ఓల్గా! రచన, ఆచరణ… ఈ రెండు ఆత్మలు’.(వంశీకృష్ణ) *కవిత్వంతో సాహిత్య ప్రస్ధానం మొదలు…వచనంతో స్థిరత్వం…!! […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-5 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 5 – గౌరీ కృపానందన్ క్షణం… కాదు కాదు క్షణంలో సగానికి తక్కువ అని కూడా చెప్పవచ్చు. ఆ దృశ్యం ఉమ కళ్ళ ముందు కదలాడింది. ఆ రైలు వేరు. ప్రయాణికులు వేరు. భర్త పక్కన లేడు. ఉమ పుట్టెడు శోకంలో మునిగి పోయి ఉంది. కన్నీరు మున్నీరు గా విలపిస్తోంది. ఛీ.. ఎంత విచిత్రమైన పగటి కల! పగటి కల కాదు. ముందు ముందు జరగబోయే దానికి సూచన! కాదు కాదు […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-29

కనక నారాయణీయం -28 –పుట్టపర్తి నాగపద్మిని అవి 1955 ప్రాంతాలు. రాజమండ్రిలో అక్కడి ప్రముఖ కవి  శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారిని కలిసేందుకు వారి ఇంటికి వెళ్ళి కూర్చున్న సమయమది.   వారి చుట్టూ, వారి పరిజనులూ, ప్రియ శిష్యులూ, ఆరాధకులూ అందరూ ఉన్నారు. ’ మీరెక్కడినుంచీ వచ్చారు? అని ఎవరో అడిగారు. కాస్త  అతిశయంతోనే  తాను ,’రాయలేలిన రాయలసీమ నుంచీ!!’ అని సమాధానం ఇచ్చాడు.   తన ధీమా తనది. పెనుగొండ లక్ష్మి తెచ్చిపెట్టిన ధైర్యమది. […]

Continue Reading

నిష్కల (నవల) భాగం-14

నిష్కల – 14 – శాంతి ప్రబోధ అమ్మా .. షాకింగ్ గా ఉందా .. నాకు తెలుసు.  నువ్వు ఈ ఫోటో చూడగానే విస్తుపోతావని. నేను ఈ రాత్రికి నీ దగ్గరికి వస్తున్నా.  వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం.  అది సారా నుంచి వచ్చిన మెసేజ్ సారాంశం  అసలు చైయో  ఏం చెప్పాలని యోచిస్తున్నది ?  ఏ ఉద్దేశ్యంతో  ఈ ఫోటో నాకు పంపి ఉంటుంది? చిన్నప్పటి  నుండి  చాలా పద్దతిగా పెంచాను.  కుటుంబ విలువలకు ప్రాముఖ్యం ఇస్తూనే పెంచాను. కాకపోతే  కళ్ళముందు లేని తండ్రి […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-14)

బతుకు చిత్రం-14 – రావుల కిరణ్మయి నా పదమూడేళ్ళ వయసులోనే నన్ను పొరుగూరి కామందు,ఇంకొంతమంది పెద్దమనుషులు అందరూ కలిసి నన్నుదేవుడికి ఇచ్చి పెళ్ళి చేసి  దేవాలయ ప్రాంగణం లో శుభ్రం చేస్తుండే జోగిని గా మార్చి నా బతుకును బుగ్గిపాలు చేయాలని అనుకన్నప్పుడు అన్నలు వద్దనక పోగా అప్పుడు కూడా వారు ఇవ్వ జూపిన ఇళ్ళ స్థలం,పొలం పుట్ర కోసం ఆశపడి నన్ను ఒప్పించడానికి ప్రయత్నించారు.అప్పుడు కూడా కట్నకానుకలు తప్పుతాయని అందరి జీవితాలు బాగుంటాయని ఆ రోజు […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-28 సలీమ

కొత్త అడుగులు – 28 ఇది జవాబులు వెదుకుతున్న కాలం – శిలాలోలిత సలీమ 2009 నుంచి కవిత్వం రాస్తున్న కవి. ఉద్యమ కారిణి. పరిశోధకురాలు. ‘భారత స్వాతంత్రోద్యమంలో మహిళల పాత్ర’ అనే అంశంపై నాగార్జున యూనివర్సిటీలో పిహెచ్.డి. చేస్తోంది. యస్.ఎఫ్.ఐ లో చురుగ్గా పాల్గొనేది. ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ ని ఎంతో ఇష్టంగా చేసింది. ప్రశ్నించడమే, జ్ఞానాన్ని పెంచుతుందనీ, జవాబులు అప్పుడే దొరుకుతాయని బలంగా నమ్మే, నడిచే వ్యక్తి. అందుకే కవిత్వ పుస్తకానికి కూడా ‘జవాబు […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-8

ఒక్కొక్క పువ్వేసి-8 అట్టడుగు కులాలకు మహిళలకు అక్షరాలద్దిన మొదటి టీచర్ సావిత్రీబాయి ఫూలే -జూపాక సుభద్ర కుల వ్యవస్థలో మానవ హక్కులు కోల్పోయిన శూద్ర, దళిత కులాలకు, స్త్రీలకు 1848 లోనే ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పి వారికి చదువు చెప్పిన , మొదటి ఉపాధ్యాయిని సావిత్రీబాయి ఫూలే. బతికినంత కాలం స్త్రీ విద్యకోసం, అంటబడని వారికి చదువు నందించడానికి శ్రమించింది.బ్రాహ్మణాధిక్య హిందూసమాజంపై తిరుగు బాటు చేసింది. మద్యపానం పై పోరాడింది. కార్మిక,కర్షక అభ్యున్నతికి ఉద్యమాలు నడిపింది. జ్యోతిబాపూలె […]

Continue Reading
Posted On :

విజయవాటిక-6 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-6 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ ఇంద్రపాల నగరం. విశాలమైన రాజప్రసాదంలో దివ్యమైన మందిరం. అది రాజమాత వాకాటక మహాదేవి పూజా మందిరం. ఎనుబది రెండు సంవత్సరాల రాజమాత ప్రతిదినం దీర్ఘకాలం ఈశ్వర ధ్యానంలో ఉంటుంది. అందమైన శిల్పాలతో, ఈశ్వరుని దివ్య లీలలను చూపుతూ అలంకరించిన పూజాగృహమది. బంగారు దీపపు కాంతులలో మహాదేవుడు లింగాకారంగా ప్రతిష్ఠించబడి ఉన్నాడు. మరో ప్రక్కన శ్రీచక్ర సహిత రాజరాజేశ్వరి కొలువై ఉన్నది. దేవదేవుని ముందర, అమ్మవారి ముందర నేతి దీపాలు […]

Continue Reading

స్వరాలాపన-8 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-8 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల- 11

చాతకపక్షులు  (భాగం-11) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి కాలేజీలో ఎలక్షన్ల జ్వరం మొదలయింది. కాలేజీ ఆవరణ దాటి ఇంటింటికీ పాకిపోయింది. గీతకి శ్యాం ఇచ్చిన ఉపన్యాసాలతోపాటు, తోటి విద్యార్థులమూలంగా కూడా చాలా సంగతులు తెలుస్తున్నాయి. కమ్మవారమ్మాయి రెడ్డివారి చిన్నదానితో పోటీ చేస్తే కమ్మవారంతా ఓపార్టీ. నాయుళ్లు రెడ్లతో కలుస్తారు. బ్రాహ్మలు నాయుళ్లతో కలుస్తారు కానీ కమ్మవారికి మద్దతు ఇవ్వరు. ఎంచేత అని గీత అడిగతే మరేదో కారణం చెప్పేరు. కలవారి […]

Continue Reading
Posted On :

చిత్రం-32

చిత్రం-32 -గణేశ్వరరావు  ‘ధనమేరా అన్నిటికి మూలం’ అనే పాట ఉంది, అన్నిటికీ ‘ఆడదే’ ఆధారం అంటూ మొహమ్మద్.అఫ్సర వలీషా ఒక కవిత రాశారు. ఆడదే లేకపోతే అడ్వర్టైజ్మెంట్ రంగం ఉంటుందా? టోనీ లాంటి రూప చిత్రకారులు ఉండేవారా? ‘తల్లి ప్రేమ’ లాంటి చిత్రాన్ని చూడగలిగే వాళ్ళమా? టోనీ ప్రో, కాలిఫోర్నియా కు చెందిన చిత్రకారుడు. తండ్రి ప్రోత్సాహం తో చిన్న తనంలోనే ప్రముఖ చిత్రకారులను కలుసుకున్నాడు. స్టూడియోలను దర్శించాడు, గ్రాఫిక్ డిజైనర్ అవడం కోసం అకడమిక్ ఫిగర్ డ్రాయింగ్, […]

Continue Reading
Posted On :
lakshmi sri

కొత్త అడుగులు-27 లక్ష్మి శ్రీ

కొత్త అడుగులు – 27  చిట్టి చిట్టి అడుగులతో లక్ష్మీశ్రీ – శిలాలోలిత లక్ష్మీ శ్రీ కి కవిత్వమంటే చాలా ఇష్టం.సాహిత్యం మనుష్యుల ప్రవర్తనలో,ఆలోచనా విధానాలలో ,మార్పును తీసుకు వస్తుందని నమ్ముతుంది.లక్ష్మీ శ్రీ అసలు పేరు లక్ష్మి మామిళ్లపల్లి. కలం పేరు లక్ష్మి శ్రీ. అమ్మ నాన్నలు సుజాత,రాఘవులు.ఆగస్టు 6,1976 లో పుట్టింది.ఖమ్మం జిల్లా వాసి. ఎమ్మెస్సీ బాటనీ,బి.ఎస్ ,ఎం.సి.జె (జర్నలిజం )ఇష్టంగా చేసింది. ఎం.పీ ఈవో గా వ్యవసాయరంగంలో కొంతకాలం, 10 టీవీ  లో న్యూస్ […]

Continue Reading
Posted On :

విజయవాటిక-5 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-5 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ మరుసటి రోజు రాజప్రసాదంలోని మరొక అత్యంత కీలకమైన సమావేశంలో పాల్గొన్నారు మహాదేవవర్మ, శ్రీకరులు. మంత్రులకు ఈ రాచకార్యం గురించి ఆలోచించి, తగు విధంగా కళింగులతో కార్యము నడపని మహారాజు ఆజ్ఞాపించాడు. “కారా! నీవు మరింత జాగ్రత్త వహించు. రాజధాని విజయవాటికలోనైనా, అమరావతిలోనైనా  మనకు తెలియనిదే గాలి కూడా చొరకూడదు…” అన్నారు మహారాజు. “తమ ఆజ్ఞ మహారాజా!!” చెప్పాడు శ్రీకరుడు. తదనంతరం మహాదేవుడు పరివారంతో అమరావతి వచ్చేశాడు. శ్రీకరుడు మాత్రం […]

Continue Reading

స్వరాలాపన-7 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-6 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

షర్మిలాం“తరంగం”-29

షర్మిలాం “తరంగం” మచ్చల్ని చెరిపేద్దాం ! -షర్మిల (Sharmila) బుల్లీబాయ్ అనే యాప్ లో ముస్లిం మహిళల ముఖాలతో అసభ్యమైన ఫొటోలు మార్ఫింగ్ చేసి వారిని వేలం పాటకు పెడుతూన్న ఉదంతం ఇప్పుడు ఎందరో మహిళల్ని కలవరపెడుతోంది .ఈ ఏప్ లక్ష్యం చేసుకున్న మహిళలు అందరూ హక్కుల కోసం పోరాటం చేసేవారు , అణచివేతకు వ్యతిరేకంగా తమ గొంతు వినిపించే అభ్యుదయ భావాలు కలవారే !ప్రశ్నించే ఈ గొంతులను నులిమేందుకే ఈ బుల్లీబాయ్ ఏప్ వినియోగించుకుంటున్నారు.శీలహననమే ఆడవారిని […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-18

రాగో భాగం-18 – సాధన  ఊళ్ళో సైతం జంగ్లాత్ వారికి అడిగింది సమర్పించుకొని కాళ్ళు, కడుపులు పట్టుకొని వారి దయా దాక్షిణ్యాలపైన బతికేవారు. దొడ్డికెళ్ళి ఆకు తెంపుకున్నా జంగలోడు (గార్డు) చూస్తే ఎంత గుర్రు గుర్రంటడోనన్న భయంతోనే వెన్నులో జ్వరం పుట్టేది. కూలి నాలి ఇచ్చినంతే తీసుకోవాలి. చెప్పినంత చేయాలి. ఊళ్ళో ఉద్యోగస్తులకు, పై నుండి వచ్చే అధికారులకు నచ్చేవన్నీ ఊరివాళ్ళంతా ఇచ్చుకోవలసిందే – కల్లు దించినా భయమే. ఇప్పపూలు ఇంట్లో ఉన్నా ఇబ్బందే. పట్టాలేని తుపాకులు […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-4 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 4 – గౌరీ కృపానందన్ అమ్మ, నాన్న, మణి మామయ్య, పక్కింటి రామ్ అంకుల్ అందరూ వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. “ఊరికి వెళ్ళే వాళ్ళ కన్నా వీడ్కోలు చెప్పడానికి మేము ముందుగా వచ్చేసినట్లున్నాం.” మణి చేతిలో సూట్ కేస్ కనబడింది. అమ్మ ప్రయాణంలో తినడానికి చక్కిలాలు, చేగోడీలు అన్నీ పాక్ చేసి తీసుకుని వచ్చింది. “పెళ్లి హడావిడిలో నీ భర్తను నాకు సరిగ్గా పరచయం చెయ్యనే లేదు ఉమా” అన్నాడు […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల- 10

చాతకపక్షులు  (భాగం-10) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి పరమేశంగారు శివరావుని పక్కకి పిలిచి, “నీ ఋణం ఈజన్మలో తీర్చుకోలేనురా” అన్నారు పైపంచెతో కళ్లు ఒత్తుకుంటూ. “ఛా, అవేం మాటలు పరం, గీత నీకొకటీ నాకొకటీనా?” అన్నారు శివం అప్యాయంగా పరమేశంగారి భుజంమీద చెయ్యేసి. పరమేశంగారు గీతదగ్గరకి వచ్చి బుద్ధిగా చదువుకోమనీ, ఏం కావాలిసినా శివం మామయ్యనో, కనకమ్మత్తయ్యనో అడగమనీ, మొహమాట పడవద్దనీ పదే పదే చెప్పేరు. శివరావు తండ్రిలాటివాడనీ, కనకమ్మ […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-13

నిష్కల – 13 – శాంతి ప్రబోధ తల్లి అడుగుల సవ్వడి గుర్తించిందేమో బిడ్డ ఏడుపు అంతకంతకు పెరిగిపోతున్నది.  గుక్కపెట్టిన బిడ్డను చేతుల్లోకి తీసుకొని గుండెకు అదుముకున్నది కావేరి. అప్పుడు  చూసిందామె.  బిడ్డ చెవి దగ్గర వెచ్చగా తగలడంతో కంగారుగా చూసింది. బిడ్డ చెవి పక్క నుంచి ఎర్రటి చుక్కలు  మొదట అదేంటో అర్ధం కాలేదు కావేరికి . ఒక్కసారిగా గుండె ఆగినంత పనయింది.  కాళ్ళు చేతులు ఆడడం లేదు.  గొంతు పెగలడం లేదు.  ఒళ్ళంతా చెమటలు […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-13)

బతుకు చిత్రం-13 – రావుల కిరణ్మయి చాట్లో బియ్యం పోసుకొని చెరుగుతున్న జాజులమ్మ దగ్గరికి ముత్యం భార్య వచ్చి .. నువ్వుండు ,నేను చెరిగి వంట పని కానిస్తగని , నాయన ఏమన్న ఎంగిలిపడి పోయిండా?లేకుంటే ఖాళీ కడుపుతోని పోయిండా ?అసలే పెద్దవయసాయే గాబరా గాబరా గాదు …!అని ఎంతో ప్రేమ ,గౌరవం ఉన్నట్టు ప్రేమ కురిపించుకుంట అడిగింది. జాజులమ్మ కు ఒకింత ఆశ్చర్యం కలుగుతుండగా , లే …ఒదినే ..!అట్టి కడుపుతోని నేనెట్ల కాలు బయట […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-7

ఒక్కొక్క పువ్వేసి-7 సామాజిక సేవా చరిత్రలో బహుజన మహిళ -జూపాక సుభద్ర భారతదేశంలో బహుజన కులాల మహిళలు ఎస్సీ,ఎస్టీ ,బీసీలు,కొన్ని మైనారిటీ తెగలుగావున్నమహిళల జనాభా సగభాగంగా వున్న ఉత్పత్తి శక్తులు.వీరికి సామాజికంగా ఉత్పత్తి సంబంధిత జీవితమే గాని,నాలుగ్గోడల మధ్య వున్న జీవితాలు కావు. గడప దాటితేనే కడుపు నిండే జీవితాలు. వంట ఇండ్లు లేని జీవితాలు. గట్క/సంకటి/ అంబలి ఇవ్వే,కూర ఎప్పుడో ఒకసారి. పొద్దుగాల మూడు రాళ్ల పొయ్యి,సాయంత్రం పనికి బొయి వచ్చేటాలకు పిల్లి కుక్కలు ఆడే […]

Continue Reading
Posted On :

చిత్రం-31

చిత్రం-31 -గణేశ్వరరావు  ఈ కళాత్మక చాయా చిత్రం తీసినది పారిస్ కు చెందిన మార్తా (moth art అన్న దానికి బదులుగా ఈ పేరు ను వాడుతుంది ఆమె, అసలు పేరు చెప్పదు). సాధారణమైన రూప చిత్రాలపై ఆమె ఎంత పట్టు సాధించిందో అన్న దానికి ఈ ఫోటో ఒక రుజువు. తన మోడల్స్ హావభావాలను శక్తివంతంగా కెమెరా లో బంధిస్తుంది. ఆమె తీసిన ప్రతీ ఫోటో ఒక కథను చెబుతుంది. ఫోటోలోని అమ్మాయి ఒక్క చూపు […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -30

జ్ఞాపకాల సందడి-30 -డి.కామేశ్వరి  మాగ్నిఫిషియంట్ సెంచరీ: మనకు మాములుగా బ్రిటిష్ , యూరోప్ , హిస్టరీ  తెలిసినంతగా ఇతరదేశాల చరిత్ర , అక్కడి రాజరికాలు ,ప్రజా జీవితం ,వాతావరణ  స్థితిగతులు, ఆచారవ్యవహారాల గురించి తెలియదు. ఇప్పుడంటే గూగుల్ నిమిషాల్లో ఏదికావాలన్నా చెప్పేస్తుంది. మా రోజుల్లో హిస్టరీ, జాగ్రఫీలో చదివిన పాఠాల వల్ల  తెలుసుకొన్న వాటివల్ల కొంచెం తెలిసేది. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని చాల రోజులు పాలించారు కనక వాళ్ళ చరిత్ర తెలిసేది. ఇండియన్ హిస్టరీ, బ్రిటిష్ […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-28

కనక నారాయణీయం -28 –పుట్టపర్తి నాగపద్మిని అవి 1955 ప్రాంతాలు. రాజమండ్రిలో అక్కడి ప్రముఖ కవి  శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారిని కలిసేందుకు వారి ఇంటికి వెళ్ళి కూర్చున్న  సమయమది.   వారి చుట్టూ, వారి పరిజనులూ, ప్రియ శిష్యులూ, ఆరాధకులూ అందరూ ఉన్నారు.     ’ మీరెక్కడినుంచీ వచ్చారు? అని ఎవరో అడిగారు.      కాస్త  అతిశయంతోనే  తాను ,’రాయలేలిన రాయలసీమ నుంచీ!!’ అని సమాధానం ఇచ్చాడు.   తన ధీమా తనది. పెనుగొండ లక్ష్మి […]

Continue Reading

బతుకు చిత్రం నవల (భాగం-12)

బతుకు చిత్రం-12 – రావుల కిరణ్మయి పైసలు మనమిత్తే ఈయనా మీ వదినే ఇద్దరు పోయి చూసేటోళ్ళకు అబ్బా ..!ఎంత బాధ్యతెమ్బడి వచ్చిండు చెల్లెపెల్లిచెయ్యాల్నని ,అని ఊరంత అనుకొని నిన్ను మీ తమ్మున్ని ఆడివోసుకోను ఉపాయం జేత్తాండు.అని అంటుండగా , ఎహే ..!ఆపు నీ సోది ..!మా అన్న గంత యావ గల్లోడైతే, రమ్మని మమ్ములనెందుకు పిలుత్తడు.డైరెక్టుగ చార్జీలియ్యుండ్రి.అనేటోడు గదా!పచ్చకామెర్లోనికి లోకమంతా పచ్చగనే కనవడ్డట్టు ఆళ్ళను గురించి నువ్వు ఎట్లనుకుంటే అట్నే కనవడుతది.ఆయన కాదా పైసలు లేకనే […]

Continue Reading
Posted On :

స్వరాలాపన-6 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-6 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-17

రాగో భాగం-17 – సాధన  ప్రభుత్వం లొంగివచ్చి ప్రజల డిమాండ్ మేరకు షేకడా ఇరవై రూపాయలు ఇవ్వడంతో ఊర్లో అందరూ తునికి ఆకులు కోశారంటూ, ఊరూరికి కళ్ళం కావాలని రెండేళ్ళుగా ప్రజలు డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వం మొండిగా నిరాకరిస్తున్నందుకు బుద్ది చెప్పడంలో భాగంగా ఫారెస్టు వారి కలప, కళ్ళాలు ధ్వంసం చేసిన వరకు డోలు ఉత్సాహంగా చెప్పాడు. పోలీసులతో దాగుడుమూతల వ్యవహారంగా సాగిన కళ్ళాల కాల్చివేత చెబుతుంటే, అందరి ముఖాల్లో తామెంతో గొప్ప పని చేశామన్న ఫీలింగ్ […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-27

కనక నారాయణీయం -27 –పుట్టపర్తి నాగపద్మిని సాహిత్య అకాడమీ నుంచీ వచ్చే ఆనరోరియం డబ్బు, సుబ్రమణ్యం ప్రొద్దుటూరు రేషన్ దుకాణంలో పనిలో ఉన్న కారణంగా,వారానికోసారైనా తనతో తెచ్చే బియ్యం, చక్కెర, మరో శిష్యుడు సుబ్బన్న రాకపోకలప్పుడు పంపే సరుకులతో –  ఇలా ఏదో విధంగా రోజులు గడిచి, మొత్తానికి కాస్త ఇబ్బందులతోనే,    పుట్టపర్తి మళ్ళీ పూర్వ రూపానికి చేరుకున్నారు. కోలుకున్న తరువాత, శ్రీ ఆర్. రంగనాథం గారి సహృదయాహ్వానం తో మళ్ళీ, శ్రీ రామకృష్ణ  ఉన్నత […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-6

ఒక్కొక్క పువ్వేసి-6 మద్యమ్ మత్తు నేరాలకు ఎవరు బాధ్యులు? -జూపాక సుభద్ర ఈ మద్య హుజురాబాద్ బై ఎలక్షన్స్ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వము ‘దళిత బంధు’ ను ప్రకటించినట్లు మద్యం షాపుల కేటాయిపుల్లో ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% గౌండ్లవాల్లకు 15% రిజర్వేషండ్లనీ, యింకా నాలుగు వందల నాలుగు (404) మద్యం షాపులు పెంచుతున్నామని ప్రకటించింది.ఈ సంగతి టీవీలో చూసిన మా అటెండర్ విజయ వచ్చి ’ఏందమ్మా ! గీ ముచ్చటిన్నవా, తెలంగాణను ఇదివరకే కల్లుల ముంచి […]

Continue Reading
Posted On :

షర్మిలాం“తరంగం”-28

షర్మిలాం “తరంగం” పరువు తీస్తున్న హత్యలివి ! -షర్మిల కోనేరు  ఇప్పుడే ఒక వార్త చదివాను. మహారాష్ట్రలో ఒక యువతి తల ఆమె తమ్ముడే తెగ నరికి తల్లితో సహా పోలీసులకి లొంగిపోయాడు.  ఈ హత్యకి కారణం ఆమెకు నచ్చిన యువకుడ్ని పారిపోయి పెళ్ళిచేసుకోవడమే ! తమ పరువు పోయిందన్న కోపంతో రగిలి పోయారు. పెళ్ళి చేసుకుని అదే వూరిలో ఆ యువకుడి కుటుంబంతో వుంటోంది ఆ అమ్మాయి. తల్లి, తమ్ముడు ఆ యువతిని చూడటానికి వచ్చామంటూ వెళ్ళారు . వారు తనను చూడడానికి వచ్చారన్న ఆనందంలో టీ పెడదామని ఆమె వంటింట్లోకి  వెళ్ళింది. అంతే స్వంత తమ్ముడే పదునైన ఆయుధంతో ఆ యువతి తల నరికేశాడు. ఆ తలను అందరికీ చూపించి అక్కడే పడేసి మరీ తల్లీ కొడుకులు పోలీస్టేషన్ కి వెళ్ళి లొంగిపోయారు. వారు ఆ అమ్మాయిని  కడతేర్చి పరువు నిలబెట్టుకున్నామనుకున్నారు !  జీవితాంతం ఊచలు లెక్కపెట్టడం పరువైన పనా ? ఇటువంటి సంఘటనలు మనకి కొత్తేం కాదు. తమిళనాడు లో 2016 లో ఒక […]

Continue Reading
Posted On :