image_print

ఒక్కొక్క పువ్వేసి-1

ఒక్కొక్క పువ్వేసి-1 స్మశానంలో కూడా చావని ఆంక్షలు   –జూపాక సుభద్ర ఈ మద్య ఒక సెలెబ్రిటీ భర్త చనిపోతే… భర్త శవయాత్రతో పాటు సాగింది నిప్పు కుండతో…. పాడెమోసింది, అంతిమ సంస్కారాలు నిర్వహించింది. దీనిమీద ఆమెను తిట్టిపోసిండ్రు హిందూకులాలు. ‘ఒక ఆడది పాడెమోయొచ్చా, శవయాత్రలో నడవొచ్చా, చితికి నిప్పు పెట్టొచ్చా’ హిందూ సనాతన విలువలు తుంగలో తొక్కిందనీ విమర్శల మీద విమర్శలు. ఆడవాల్లు అంతరిక్షంలోకి పోతున్న యీ కాలంలో యింకా యీ మగ ధిపత్యాలేంటి? మాదుక్కాలమీద […]

Continue Reading
Posted On :

వెనుకటి వెండితెర -3

వెనుకటి వెండితెర-3 పెళ్ళిచేసి చూడు (1952) -ఇంద్రగంటి జానకీబాల రకరకాల భావోద్వేగాలు, ఆదర్శాలు, కళారాధన, కాల్పనిక ఊహలూ గల మంచి మంచి దర్శకులు సినిమాపట్ల ఆకర్షితులై, తెలుగు సినిమాల్లోకి వచ్చారు. సినిమా తీయాలంటే ఆలోచనలు, అభిరుచీ వుంటే చాలదు. డబ్బు బాగా పెట్టుబడి పెట్టగల ధనవంతులు కూడా వుండాలి. సినిమా అనేది ఒక లాటరీలాంటిదే గ్యారంటీగా డబ్బు తిరిగి వస్తుందని ఎవ్వరూ చెప్పలేరు. సినిమా ప్రేక్షకుడికి నచ్చాలీ, డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని సినిమాహాల్లోకి రావాలి. అదీ […]

Continue Reading

వసంత కాలమ్-16 ట్రాష్ డయెట్!

ట్రాష్ డయెట్ ! -వసంతలక్ష్మి అయ్యగారి ఊ.. ఏమిటక్కా విశేషాలు ? ఏముంటాయే.. వెధవలాక్ డౌన్ కాదుగానీ  కట్టేసినట్టుంటోంది నాకైతే. అయినా మీ గేటెడ్ కమ్యూనిటీ పని బాగుందిలేవే. ముక్కులకి రామ్ రాజ్ తొడుగులేసుకుని యే కామన్ అడ్డాకో పోయి హాయిగా రకరకాల గాసిప్పులు కానిచ్చివస్తారు.నేనూ వున్నాను .. అయితే నట్టిల్లు … లేకపోతే నెట్టిల్లు . కొత్త వంటకాలేం చూశావేంటి? చూడడానికేం … వందలే. చేయడమే మరీ దిగిపోయింది వంటపని. అదేమలాగ?  ఏంచెప్మంటావ్.. అప్పుడే నాలుగు నెలలుగా యీయనేదో కీటో డైటని మొదలెట్టారు . ఆయన […]

Continue Reading

జ్ఞాపకాలసందడి -24

జ్ఞాపకాల సందడి-24 -డి.కామేశ్వరి  నవంబర్ నెల  వచ్చిందంటే  మేము  బతికే  వున్నాం అని ప్రభుత్వానికి  విన్నవించుకునే  నెల.   మేము చూడందే   నమ్మం  మమ్మల్ని  దర్శించాల్సిందే అని ప్రభుత్వం  రూల్. చచ్చినవారిని  బతికున్నట్టు  డెత్ సెర్టిఫికెట్స్ సృష్టించగలిగే  ఘనులున్న  ఈ  దేశంలో  మరి  ప్రభుత్వాలు  మాత్రం పాపం  ఏంచేయగలదు. సరే ముసలి వారు  కర్రలు పట్టుకు  మనవళ్ల  చేతులు పట్టుకునో  వాకర్లు  పట్టుకునో  పడుతూ లేస్తూ  వెళ్లి  ఫోటో  అంటించి  సంతకం  పడేస్తే  మళ్ళి  ఏడాది  వరకు  […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-7

నిష్కల – 7 – శాంతి ప్రబోధ తలూపి చిన్నగా నవ్వుతూ కిటికీలోంచి చేయి అందించిన కరుణ చేతిలో చేయి కలిపింది నిష్కల. ఆ తర్వాత సరస్వతిని పరిచయం చేసింది. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దామనుకుంటున్నారు అడిగింది నిష్కల. కరుణ భర్త వివరాలు అడిగింది సరస్వతి. గూగుల్ లో పని చేస్తారని మాత్రమే తెలుసు. మిగతా వివరాలు ఏమీ తెలియదు తల వంచుకుని చెప్పింది కరుణ. మీ ఆయన పేరు చెప్పండి.  నేను కూడా గూగుల్ లో పనిచేస్తున్నాను […]

Continue Reading
Posted On :
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -15 మధువులు చిలికించే రాగం – ధర్మవతి

ఒక భార్గవి – కొన్ని రాగాలు -15 మధువులు చిలికించే రాగం —ధర్మవతి -భార్గవి “అందెల రవమిది పదములదా? ” అని ప్రశ్నిస్తే కాదు అంబరమంటిన హృదయముదే అని సమాధానం ఇవ్వాలనిపిస్తేనూ “హలో మై డియర్ రాంగ్ నంబర్ “అని పలుకుతుంటే —రాంగ్ నంబర్ రైటవ్వాలనిస్తేనూ “కొంటె గాణ్ణి కట్టుకో కొంగు కేసి చుట్టుకో ” అని కవ్విస్తుంటే మనసులో కొంటె ఊహలు చెలరేగిపోతేనూ “గోవిందా శ్రిత గోకుల బృందా పావన జయ జయ పరమానందా” అని  […]

Continue Reading
Posted On :

నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక రచనలకు ఆహ్వానం!

నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక రచనలకు ఆహ్వానం! -ఎడిటర్ నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ  ప్రత్యేక రచనలకు ఆహ్వానం: నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవం (జూలై 10, 2021) సందర్భంగా ప్రత్యేక రచనలను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఆహ్వానిస్తున్నాం. కథ, కవిత, వ్యాసం, ట్రావెలాగ్ ప్రక్రియల్లో రచనలు స్వీకరించబడతాయి. ప్రతీ ప్రక్రియలోనూ ఎంపిక చెయ్యబడ్డ పది రచనలు ప్రత్యేక సంచికలో ప్రచురింబడతాయి. అందులో నుంచి ఒక ఉత్తమమైన రచనకు రూ.1000 (వెయ్యి రూపాయలు) పారితోషికంతో బాటూ “నెచ్చెలి ఉత్తమ రచన […]

Continue Reading
Posted On :

ఇలాటి తాతయ్య వుంటే బావుండు! (కారా మాస్టారి స్మృతిలో)

ఇలాటి తాతయ్య వుంటే బావుండు! (కారా మాస్టారి స్మృతిలో) -శాంతారామ్ ఇలాటి తాతయ్య వుంటే బావుండు అనిపించేలా , తాతయ్య లేనివాళ్లకు అసూయ పుట్టించేలా కాళీపట్నం రామారావు గారి మనవడు  శాంతారామ్ గారి స్మృతులు నెచ్చెలి పాఠకుల కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఇస్తున్నాం. (సేకరణ: ఫేస్ బుక్  నుండి)    తాతగారు 4-6-2021 ఉదయం 8:20కి వెళ్ళిపోయారు. పొద్దున్నలేచి టీ తాగి అత్తతో ప్రేమగా మాట్లాడి, అత్త చేతిలో వెళ్ళిపోయారు. ఆయన వయసు 97 అయినా, తాతగారు […]

Continue Reading
Posted On :

మదర్ తెరీసా అసాధారణ వ్యక్తిత్వం

మదర్ తెరీసా అసాధారణ వ్యక్తిత్వం -ఎన్.ఇన్నయ్య భారతదేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి, నాయకులను నిర్బంధించిన సంవత్సరంలో, 1975 మదర్ తెరీసా హైదరాబాద్ పర్యటించారు. పబ్లిక్ గార్డెన్స్లో పిల్లల కార్యక్రమానికి వచ్చిన ఆమెను, ఆంధ్రజ్యోతి ఛీఫ్ రిపోర్టర్ గా కలసి ఇంటర్వ్యూ చేశాను. ఏది అడిగినా అంతా దైవేచ్ఛ అని సమాధానం యిచ్చిన ఆమె నుండి, ఎలాంటి ఉపయోగకర విషయం సేకరించలేక, నిరుత్సాహపడ్డాను. కనీసం ఫోటో తీసుకోలేదని తరువాత అనుకున్నాను. మెసిడోనియా దేశానికి చెందిన తెరీసా, అల్బేనియా దంపతుల […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల-3

చాతకపక్షులు  (భాగం-3) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి గీత లేచి పెట్టెలోంచి, చీరే జాకట్టూ, లంగా తీసుకుని బాత్రూంలోకి వెళ్లింది. స్నానం ముగించుకు వచ్చేసరికి, రాధా మాధవులు వచ్చేశారు. ఇద్దరు పిల్లలు వాళ్లకి, వయసులు ఎనిమిదీ, పదీ. “పిల్లలేరీ?” అనడిగేడు హరి తలుపు తీస్తూ.  “మా పక్కింటావిడ వాళ్ల పిల్లలతో County fair‌కి తీసుకెళ్లింది వాళ్ల పిల్లలతోపాటు. మధ్యాన్నానికి వచ్చేస్తారు. అందుకే హడావుడిగా ఇటొచ్చేశాం ఆకాస్త టైమునీ సద్వినియోగం చేసుకుందాం […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-21

కనక నారాయణీయం -21 –పుట్టపర్తి నాగపద్మిని అసలు మేఘం ద్వారా సందేశం పంపే ఆలోచనకు ఆధారాలేమిటి?? అని ఆలోచిస్తే, ఋగ్వేదం కనిపిస్తుంది. సరమా – పణి, ఇంద్రుడు – ఇంద్రాణి, యమ – యమీ ఇటువంటి సందేశాత్మక కథలున్నాయి. భారతీయ సాహిత్యంలో ఋగ్వేదమే మొట్టమొదటి లభ్య రచన.   బృహస్పతి గోవులను ఒక జాతివారు అపహరించి తీసుకు వెళ్ళి ఒక గుహలో బంధించి వుంచుతారు. ఆ ఆవులను అన్వేషించేందుకు, ‘సరమ’  అనే శునకాన్ని పంపుతాడు బృహస్పతి. ఆ […]

Continue Reading

అంతర్జాల పత్రికలు (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

అంతర్జాల పత్రికలు (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)  -మణి కోపల్లె నేడు ఇంటర్నెట్ అతి వేగంగా దూసుకుపోతూ  సెల్ ఫోన్ లలోనూ ఇంటర్నెట్ లభ్యమవ్వటంతో ప్రింట్ మీడియాలో వచ్చే అన్ని  పత్రికలు  నేడు ఇంటర్నెట్ లో లభిస్తున్నాయి .  అంతర్జాలం ఆవిర్భవించిన తొలినాళ్లలో  అంటే  1999 కి ముందు వున్న నెట్ ని (రీడ్ ఓన్లీ)వెబ్ 1.0 గా వర్ణించారు.  ఆ సమయంలో ప్రముఖ పత్రికలు వాళ్ళకు మాత్రమే ఉపయోగపడే ఖతులను […]

Continue Reading
Posted On :

నా జ్ఞాపకాల్లో నాన్నగారు (“నడిచిన పుస్తకం: సి.ఎస్.శర్మ” ముందుమాట)

నా జ్ఞాపకాల్లో నాన్నగారు (“నడిచిన పుస్తకం: సి.ఎస్.శర్మ” ముందుమాట) -జఘనరాణి శర్మ ప్రముఖ రచయిత, కవి, విమర్శకులు, సాహితీ ప్రియులు ఐన శ్రీ చిర్రావూరి సర్వేశ్వర శర్మగారి శతజయంతి ప్రారంభోత్సవ వేడుక ఈ నెల ఫిబ్రవరి 17 న అంతర్జాల వేదిక ద్వారా జరిగింది. ఆ సందర్భంగా వయోలిన్ విద్వాంసులు శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు గారు ఆవిష్కరించిన “నడిచిన పుస్తకం: సి.ఎస్.శర్మ” పుస్తకం లో ప్రచురితమైన వారి పెద్ద కుమార్తె వ్రాసిన “నా జ్ఞాపకాల్లో నాన్నగారు” అన్న […]

Continue Reading
Posted On :

ప్రవాసాంధ్ర కథ- కవిత్వం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

ప్రవాసాంధ్ర కథ- కవిత్వం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం) -యామిని కొళ్లూరు ఏ రచన అయితే మనల్ని మనం సంస్కరించుకొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేందుకు ప్రేరణనిస్తుందో ఏ రచనను అధ్యయనం చేయడం వల్ల  సామాజిక స్పృహ , చైతన్యం మనలో అంకురిస్తాయో ఏ రచన మనలను కర్తవ్యోన్ముఖలను చేస్తుందో ఆ రచన ద్వారా వెలుగు చూసిన సాహిత్యాన్ని మంచి సాహిత్యం లేదా ఉత్తమమైన సాహిత్యం అనవచ్చు. ఒక […]

Continue Reading
Posted On :

వెనుకటి వెండితెర -2

వెనుకటి వెండితెర-2 -ఇంద్రగంటి జానకీబాల స్ఫూర్తి పొందాల్సిన అవసరం నిజమైన మేధావులు-సంఘం పట్ల అవగాహన, సానునభూతి వున్నవారూ – తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చి పనిచేయడం మొదలుపెట్టిన కాలం 1950 నుంచి 1960. అప్పుడు వున్న సినిమా చరిత్రను పరిశీలిస్తే – ఎల్.వి. ప్రసాద్- పి. పుల్లయ్య- సి. పుల్లయ్య- కె.వి. రెడ్డి, బి.ఎన్. రెడ్డి లాంటి సుప్రసిద్ధ దర్శకులు కనిపిస్తారు. వారెప్పుడూ మంచి కథల కోసం వేట సాగించేవారు. కథలు ఇతర భాషలవైనా, అది సినిమాగా […]

Continue Reading

షర్మిలాం“తరంగం”-23

షర్మిలాం “తరంగం” కనబడని శత్రువుతో పోరాటం ! -షర్మిల కోనేరు  ఈ బంధాలు శాశ్వతం కాదు అని చెప్తుంది వేదాంతం. ” రాక తప్పదు పోక తప్పదు ” అని అనుకుంటాం నిర్వేదంగా ! జగం అనే రంగస్థలం పైన మనం పాత్రధారులం అని కూడా అంటాం … కానీ ఈ రాక కి పోక కి మధ్య జరిగేవి ఉత్తి సన్నివేశాలేనా ? నాటకంలో నటిస్తాం జగన్నాటకంలో జీవిస్తాం! నటించడం అయిపోగానే పాత్రధారి నిష్క్రమిస్తే ఆ పాత్ర ముగిసినట్టే, కానీ జీవితంలో అలా కాదు ఆ మనిషి తోపెనవేసుకున్న ఎన్నో జీవితాలు అల్లకల్లోలం అవుతాయి. నడి సముద్రంలో జారవిడిచి నావ తీరానికి జేరిపోతే ఒడ్డెక్కడం ఎంత కష్టం! ఇప్పుడు ఈ కరోనా చేసే కరాళ నృత్యంలో పిల్లలకు తలులు , కొందరు పిల్లలకు తండ్రులు దూరం అవుతున్నారు. భర్తను పోగొట్టుకున్న  భార్యలు … భార్యలకు దూరమైన భర్తలు ఇంటరై బేలగా ఈ సంసారాన్ని తోడు లేకుండా ఎలాఈదాలో తెలియక తల్లడిల్లుతున్నారు . వృద్ధ తల్లి తండ్రులకు తీరని శోకం మిగులుతోంది. ఇవన్నీ చూస్తూ ఇంకెన్ని చూడాలో తెల్యక గుండెలు చిక్కబట్టుకుని బతుకుతోంది భారత దేశం . రాజకీయ ఎత్తుగడల్లో మునిగితేలడం  తప్ప ప్రజలి రక్షించే వ్యూహరచన లేని నాయకత్వాన్ని నిందించాలో తమ ఖర్మకిఏడ్వాలో తెలియని జనం శ్మశానాల దగ్గర బారులు తీరుతున్నారు. ఇదంతా మిధ్య అని చెప్పే వేదాంతం మాకొద్దు. జీవితం బుద్భుదప్రాయం కాదు. ఆలింగనాలు , అలకలు, కోపతాపాలు , ఆవేశ కావేషాలు  ప్రేమలు , బాధ్యతలు ఇంకెన్నెన్నో రంగుల సమ్మేళనం. ఒక క్రిమి గాని క్రిమి పడగ విప్పి జనాల్ని కాటేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాత . ఆప్తుల్ని పోగొట్టుకున్న వారిని వాటేసుకుని ఓదార్చడానికి సాటి మనుషులు సాహసించలేని పాడు కాలం దాపురించింది . కానీ మనిషి ఏనాటికైనా జయిస్తాడు. అంతవరకూ కరోనాతో జరిగే ఈ యుద్ధంలో మరణించిన అమరవీరులకు నివాళులు అర్పిద్దాం . అస్త్రం దొరికే వరకూ మనని మనం కాడుకుంటూ బాధితులకు బాసటగా నిలవడమే అందాకా మనం చేయాల్సిన పని ! ***** షర్మిల కోనేరుషర్మిల 20 ఏళ్లు డెస్క్ జర్నలిస్ట్ ఉద్యోగం చేసి విరామం తీసుకున్నారు. అలవాటైన రాతని , నమ్ముకున్న అక్షరాన్ని వదలకుండా వుండే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ” కౌముది, సారంగ ” వెబ్ పత్రికల్లో […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-11

రాగో భాగం-11 – సాధన  పడుకున్న వారి కిందినుండి వరదలు మొదలైనయి. అయినా ఎవరూ కదలడం లేదు. నాలుగు పొరకలు వేసుకున్న గాండో ఏ పేచీ లేకుండా మెదలకుండా గుర్రు పెడుతున్నాడు. రుషి పడకమాత్రం ఆ వరదలకు ఎపుడో తడిసి ముద్దయింది. అయినా చలనం లేదు. వర్షాల్లో ఇంతే అన్నట్టున్నవి వారి వాలకాలు. వీరిని తలచుకుంటే మూరనిలో తన మొదటి అనుభవం మెదలింది. తనకు కేటాయించిన పార్టీన్ కవరు కట్టుకోకుండా అలానే బాగుంటుందనీ, వర్షం రాగానే అందులో […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-21 ‘ పోర్షియా కవిత్వం’

కొత్త అడుగులు – 21  పోర్షియా కవిత్వం – శిలాలోలిత కవిత్వం మనస్సు జ్వలనంలో ఎగిసిపడే సెగ. తడినిండిన గుండెలను సాంత్వన లేపనం. బతుకు బొక్కెన ఎంతచేదినా తరగని అనుభవాల సంపుటి. జీవితంలో ఒక్కోమలుపూ చెప్పే, విడమర్చే అనుభూతించే, జీవన సారాన్నంతా ఒలకబోసే జ్ఞాన ప్రవాహం. నిజానికి, కవిత్వం చాలా ఊరటను కలిగిస్తుంది. ఆశను రేకెత్తిస్తుంది. వెలుగు రేఖల్ని చుట్టూ పరుస్తుంది. మనిషితనాన్ని నుని కాకుండా కాపాడుతుంది. కళ్నున్నది చూపు నివ్వడానికే అనుకుంటే, కవిత్వపు కళ్ళు బతుకు […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-6

నిష్కల – 6 – శాంతి ప్రబోధ కరణ్ ఇంట్లో ఉన్నంత సేపు కరుణకి ఊపిరి ఆడినట్లు ఉండదు.   అతని మొహం చూడటం ఇష్టం ఉండటం లేదు. మేడిపండు లో కులకులలాడే పురుగులు కనిపిస్తాయి ఆ ముఖంలో. అతను ఎప్పుడు బయటికి వెళతాడా అని ఎదురు చూస్తున్నది.  మంచం మీద నుంచి లేవకుండా నిద్ర నటిస్తున్నది. కానీ,అతను వెళ్తున్న అలికిడి లేదు. నిన్నటి నుంచి ఏమీ తినలేదు. కరుణకు ఆకలి బాగా వేస్తున్నది. ఏమీ చేసే ఓపిక లేదు.  శరీరం అంత పచ్చి పుండు లాగా ఉంది.  లేచి […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -23

జ్ఞాపకాల సందడి-23 -డి.కామేశ్వరి  మనం నాలుగు ఐదు వారాలకే lockdown  భరించలేక ,ఆపసోపాలు పడిపోతూ బందిఖానాలో  ఉన్నట్టు గిల గిలాడిపోతున్నాం. స్వేచ్ఛ కోల్పోయిన ఖైదీల్లాగా ఫీల్ అవుతూఎప్పటికి  విముక్తి అన్నట్టు ఎదురు చూస్తున్నాం. అలాటిది  రెండేళ్లు బయటి ప్రపంచం మొహం చూడకుండా, ఒక పెద్ద అటక  (annex ) మీద ప్రాణభయంతో  రెండుకుటుంబాలు ఎనిమిదిమంది సభ్యులు దాక్కుని ఎవరికంటా బడకుండా, అనుక్షణం భయంతో ,గట్టిగ మాట్లాడకూడదు , శబ్దాలు చేయకూడదు, మనుషుల ఉనికివున్నట్టు బయటి ప్రపంచానికి తెలియకుండా […]

Continue Reading
Posted On :
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -14 హాయిగా మెత్తగా మత్తును గొలిపే రాగం – హమీర్ కల్యాణి

ఒక భార్గవి – కొన్ని రాగాలు -14 హాయిగా మెత్తగా మత్తును గొలిపే రాగం – హమీర్ కల్యాణి -భార్గవి మండు వేసవి కాలం ,రాత్రి తొలిజాములో  ,వెలిగే నక్షత్రాల కింద   మేనువాల్చిన సమయంలో, హాయిగా తాకి సేదతీర్చే చల్లనిగాలిలా, పట్టుమెత్తని గులాబీ రేకులు తలపై నుండీ జలజలా రాలి తనువంతా సుగంధ భరితం చేసినట్లూ సుతిమెత్తని ముఖమల్ పరుపుపై ఒత్తిగిలినంత సుఖంగానూ అనిపించే రాగం హమీర్ కల్యాణి ఇది ఉత్తర భారతంలో పుట్టిన రాగం […]

Continue Reading
Posted On :

వసంత కాలమ్-15 భాషాభాగోతం

భాషాభాగోతం -వసంతలక్ష్మి అయ్యగారి యిదెక్కడి గోలండీ బాబూ…తెలుగు జాతీయాలు యింత నవ్విస్తాయనినాకు యిప్పుడిప్పుడే తెలుస్తోంది… కొన్నాళ్ళక్రితం…ఒక తెలుగు నేస్తంతో…”నువ్వు బొబ్ట్టట్లు ఎడం చేత్తో చేసిపారేస్తావుట కదా…”అంటేనూ…‘‘.నో నో…నేనెప్పుడూ వంటలుఎడమచేత్తో చెయ్యను..”అని శలవిచ్చింది..యిలా అన్నానని ఆవిడ నాకులీవు గ్రాంటు దేనికి చేసిందీ….అని మీరు నన్ను గాని ప్రశ్నించరు కదా…??సరే సరే…..ఆ విడ ‘‘బొబ్బట్లు చేసి పారెయ్యడమేమిటీ…”అనలేదనిసంతోషించాను. ఇది తలచుకున్నప్పుడల్లా నాలో నేనే నవ్వుకుంటూఉండేదాన్ని.ఇపుడంటే మీరంతా ఉన్నారు ..పంచుకోడానికి.ఇంతలో ఇదేజాబితాలోకి మరోటొచ్చి చేరింది..! మరో మిత్రురాలితో ..నేను..‘నిన్న ఒక్కపూట వంటచేయకపోతే […]

Continue Reading

బతుకు చిత్రం నవల (భాగం-6)

బతుకు చిత్రం-6 – రావుల కిరణ్మయి జాజులమ్మ చాలా భయంగా ఏ విషయమూ …మా అయ్యనే అడుగుండ్రి.మా అయ్య ఎట్లంటే అట్లనే.అన్నది. ఇంకేం?సర్పంచ్ గారూ…ఇక వాళ్ళూ వాళ్ళూ చూసుకుంటారు.ఇక మన పని అయిపోయినట్టే అన్నాడు. మునేశ్వరయ్య కల్పించుకొని, వరయ్య గారూ ..!అయిపోవడం కాదండీ.మొదలయింది. వివాహోర్దశ్చ మరణ మన్నం జనన మేవచ కన్ట్టే బద్వా దృఢం సూత్రం యత్రస్థం తత్ర నీయతే వివాహమూ ,ధనమూ,మరణమూ,అన్నమూ,జననం ఇవి ఎవరికి  ఎక్కడ ప్రాప్తి ఉంటే అక్కడికి వారు కంఠానికి త్రాడు వేసి […]

Continue Reading
Posted On :

నెచ్చెలి & జె.డి. పబ్లికేషన్స్ స్త్రీవాద కవితాసంకలనం కోసం స్త్రీ వాద కవితలకు ఆహ్వానం! –

‘స్త్రీ వాద కవితలకు ఆహ్వానం‘ -ఎడిటర్ గమనిక:  మిత్రులారా! నెచ్చెలి & జే.డీ పబ్లికేషన్స్ తో కలిసి ప్రచురణకు పూనుకున్న “అపరాజిత” స్త్రీవాద కవితా సంకలనం అనివార్య కారణాల వల్ల ఆగిపోయినందుకు చింతిస్తున్నాం. ఇక మీదట కేవలం జే.డీ పబ్లికేషన్స్ పేరుతో ప్రచురించుకునే సంకలనానికి, నెచ్చెలికి ఎటువంటి సంబంధమూ లేదు.  నెచ్చెలి & జే.డీ పబ్లికేషన్స్ లో సంయుక్త ప్రచురణకు మీ కవితలకు మీరు ఇచ్చిన అనుమతి జే.డీ పబ్లికేషన్స్ పేరుతో ప్రచురించుకునే సంకలనానికి చెల్లదు.  ఇక “అపరాజిత” అన్న పేరు […]

Continue Reading
Posted On :

హేమలతా లవణం

హేమలత (1932-2008) అనన్య సామాన్యకృషి -ఎన్.ఇన్నయ్య  ఆంధ్రప్రదేశ్‌లో తెంగాణాలో చిరకాలంగా ఆచరణలో వున్న దేవదాసి, జోగిని పద్ధతులను తొలగించడంలో హేమలత ఎదురీది సాధించారు. దేవుడి పేరిట అట్టడుగు వర్గాల స్త్రీలను వ్యభిచారంలోకి నెట్టిన దురాచారమే జోగిని పద్ధతి. తెలంగాణాలో నిజామాబాద్‌ జిల్లాలో నాటుకుపోయిన ఈ దురాచారం చిరకాంగా, ఎవరూ ఏమీ చేయలేక చేతులెత్తేశారు. అటువంటి దశలో హేమలత రంగప్రవేశం చేసి, ఎదురీది చాలా వరకు జోగిని దురాచారాన్ని ఆపించగలిగింది. హేమలత సుప్రసిద్ధ కవి గుర్రం జాషువా కుమార్తె. […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల-2

చాతకపక్షులు  (భాగం-2) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి అదివో అల్లదివో శ్రీహరి నివాసమూ అన్నాడు హరి మూడంతస్థులమేడ చూపించి, గీత టాక్సీలోంచి దిగి అటువేపు చూసింది. వరసగా నాలుగు కిటికీలు. అతను చూపిస్తున్నది ఏకిటికీవో అర్థం కాలేదు. సరేలే లోపలికెళ్లేక అదే తెలుస్తుందని వూరుకుంది. అప్పటికి రాత్రి తొమ్మిదయింది. కొత్తకోడలు అత్తారింట అనగా భర్తగారింట అడుగెట్టింది. తలుపుమీద “వెల్కమ్ హోమ్” అట్టముక్క స్వాగతం చూసి చిన్నగా నవ్వుకుంది. హరి తలుపు […]

Continue Reading
Posted On :

వెనుకటి వెండితెర -1

వెనుకటి వెండితెర-1 -ఇంద్రగంటి జానకీబాల తెలుగువారు చాలా తెలివైన వారు, కార్యశూరులు, ఉత్సాహవంతులు, ధైర్యం కలవారు అని చెప్పడానికి మనకి చరిత్రలో చాలా సందర్భాలే స్ఫురణకొస్తాయి. ముఖ్యంగా సినిమా నిర్మాణం విషయంలో మన పెద్దలు చాలామందికంటే ముందు వున్నారని చెప్పుకోక తప్పదు. భారతీయ చలనిత్ర నిర్మాణంలో టాకీ (మాట్లాడే సినిమా) వచ్చిందనగానే తెలుగులోనూ టాకీలు తీయాలని ఉత్సాహపడి ప్రయత్నాలు మొదలుపెట్టినవారిలో దక్షిణాదిని తెలుగువారు మొదటివారు. 1931లోనే హెచ్.ఎమ్. రెడ్డిగారు తెలుగు సినిమా నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టారు. సినిమా […]

Continue Reading

చిత్రం-23

చిత్రం-23 -గణేశ్వరరావు  ఇది బృందావన్ ‘క్వారంటైన్’ ఫోటో, వితంతువుల క్వారంటైన్. ‘అసుంటా’ ‘అస్పృశ్యత’ మడి-ఆచారాలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఆటవిక దశనుంచే ఉన్నాయి.ఎవడిని తాకితే ఏమౌతుందో, దేన్నీ తాకితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని ఆటవిక మానవుడు భయంతో తల్లడిల్లి పోయేవాడు. ఆటవికులు చచ్చిపోతే వాళ్ళ వస్తువులను వాళ్ళతో పాతేసే వాళ్ళు. మన మతాచారాలు ఆటవికుల భయం నుంచే పుట్టాయని అనిపిస్తోంది.ఇప్పుడు కరోనా భయంతో మనం పాటిస్తున్న నియమాలను భవిష్యత్తులో చరిత్రకారులు ఎలా తీసుకుంటారో ఊహించగలమా?ఈ ఫోటోలో గేటుకు […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -22

జ్ఞాపకాల సందడి-22 -డి.కామేశ్వరి  నాలుగు రోజుల  క్రితం మనవడి పెళ్ళికుదిరి  దసరా శుభదినాన ముత్తయిదువులు  పసుపు దంచి శుభారంభం చేసారు అన్న నా పోస్టుకి “ముత్తయిదువులంటే ఎవరు?”  అని సత్యవతి వ్యంగమో, ఎత్తిపొడవడమో  నాకు తెలియదు అన్నారు. పండగ రోజులు ,ఇంట్లో బంధువులు ,మనవరాలు వచ్చివెళ్లే హడాడావిడీ శుభకార్యం అని అన్నప్పుడు చేసిన విమర్శకి నొచ్చుకున్నా. ముత్తయిదువంటే ఆవిడకి తెలియదనుకునేటంత వెర్రిదాన్ని కాదు. గంటలకొద్దీ టైపు చేసే తీరిక లేక ఊరుకున్నా. ఆమె నా స్వవిషయాన్ని విమర్శించకుండా […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-5

నిష్కల – 5 – శాంతి ప్రబోధ ఆ ముందు రోజు నిష్కల కోవిడ్ 19 కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ వేయించుకుని వచ్చింది. మొదటి డోస్ వేసుకున్నప్పుడు కొద్దిగా చెయ్యి నొప్పి వచ్చింది అంతే. కానీ రెండో డోస్ తీసుకున్న సాయంత్రానికి ఒళ్ళు నొప్పులు, మరుసటి రోజుకి తీవ్రమైన ఒళ్లు నొప్పులు జ్వరం. ఆఫీస్ కి వెళ్ళే ఓపిక లేదు. కానీ వెళ్ళాలి.  ఈ రోజు ఫైల్ చేయాల్సిన కేసులు ఉన్నాయి.  ఒక కేసు స్టడీ చేయాల్సి ఉంది. అది ఇండియన్స్ […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-5)

బతుకు చిత్రం-5 – రావుల కిరణ్మయి అమ్మా..!ఈ ఉప్మా తినమన్నడు అయ్యగారు.అని రెండు పేపెర్ ప్లేట్లలో వేడి వేడి ఉప్మా తెచ్చిపెట్టిండు.ఆ ఇంట్ల పన్జేసే సితాలయ్య. ఇద్దరికీ…..నిన్న పొద్దట్నుంచి ఏమీ లేక పోవడం తో బాగా ఆకలి గానే ఉన్నప్పటికీ,అట్నే గూసుంటే సీతాలయ్యన్నడు, పోద్దువోయింది.ఆయ్యచ్చేదాంక అమాసాగుతదాన్నట్టు ఏదెట్లయినా ఆకలైతే ఆగదు కదా!తినుండ్రి.అని మంచినీళ్ళు సుత ఇచ్చిండు. ఇక ఆగలేక ఊదుకుంటూ తినడం మొదలు పెట్టారు.తింటాంటే …తింటాంటే జాజులమ్మకు కుత్తిక వడ్డది.మంచినీళ్ళు తాగుదామనుకొని అందుకోబోతాంటే గ్లాసు బోర్లవడి నీళ్ళన్ని […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-10

రాగో భాగం-10 – సాధన  ఇలాటి మూర దళంలోకి వచ్చాడు. ఇంటివద్ద అతడి పోషణ కాక ‘గిన్సు’ చేసేవాడు. జ్ఞానం తెల్సిన ఆదివాసీ పిల్లల్ని పెంచటానికి పెద్దలు పడాల్సిన శ్రమ ఏముండదు. పిల్లలు సైతం ఏదో పనిచేస్తూనే ఉంటారు. అడవిలో చదువు సంధ్యల ప్రసక్తి లేనేలేదు. ఎవరైనాసరే, పసులు కాయడానికో, కూలి పనులకో, ఎవరి దగ్గరో జీతానికో, అడవిలో ఉసిరికాయలో, కరక్కాయలో, ఇప్పపూలో ఏరుకొచ్చి షావుకారికి కొలవడానికో నిత్యం అడవిపట్టుక తిరగాల్సిందే. ఏదీ దొరక్కపోతే చేపలకో, కొక్కులకో, […]

Continue Reading
Posted On :
karimindla

వైవిధ్యభావమాలికలు – “అమ్మ” సంగీత నృత్యరూపకాలు (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

వైవిధ్యభావమాలికలు – “అమ్మ” సంగీత నృత్యరూపకాలు అత్యాధునిక తెలుగు సాహిత్యం–వస్తు, రూప పరిణామం (2000-2020) నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం -డా. కరిమిండ్ల లావణ్య మనిషి జీవితంలో బాల్యం అత్యంత ముఖ్యమైనదశ. ఈ దశపైనే వ్యక్తిత్వ వికాసం ఆధారపడి ఉంటుంది. అందుకు గేయ సాహిత్యం తోడ్పడుతుంది. దీనివల్ల బాలల్లో మానవ  విలువల పరిరక్షణ పెరుగుతుంది. సృజనాత్మకత పెంపొందించబడుతుంది. భావ పరిపక్వత, మనోవికాసం కలుగుతుంది. మానవత్వ వికాసమే సాహిత్యపు ప్రధాన కర్తవ్యం. గేయ సాహిత్యం సామాజిక, సాంస్కృతిక వికాసంతో పాటు శాస్త్రసాంకేతిక విజ్ఞానాలను అందించడానికి ఉపయోగపడుతుంది. ఈ గేయాల్లో బాలసాహిత్యానికి […]

Continue Reading

కొత్త అడుగులు-20 ‘రూపా రుక్మిణి’

కొత్త అడుగులు – 20 రూపా రుక్మిణి – శిలాలోలిత రహాస్యాల్లేని నీడల కవిత్వం కవిత్వం రాయటం అంటే నిన్ను నీవు ధ్వంసం చేసుకొని కొత్తగా నిర్మించుకోవటం లాంటిది. అందుకే ఒకసారి కవిత్వానికి అలవాటైన వాళ్ళంతా మొదట సొంత ఆనందాన్నో, బాధనో చెబుతూ కవిత్వాన్ని రాయడం మొదలు పెడతారు. ఎప్పుడు, ఎలా మారామో అర్థం కాకుండానే పక్కవాళ్ళ బాధల్లో, సంతోషాలకి కూడా స్పందించడం మొదలు పెడతారు. నెమ్మది నెమ్మదిగా స్వరం పెరుగుతుంది. స్పష్టత పెరుగుతుంది. కవులు తమ […]

Continue Reading
Posted On :

వసంత కాలమ్-14 నవ్వుల్ నవ్వుల్

నవ్వుల్ నవ్వుల్ -వసంతలక్ష్మి అయ్యగారి ఒకాఫీసు…పాతిక మందిదాకా సిబ్బంది వుంటారు.. జీతాలూ…లీవులూ ..లోనుసాంక్షనులు ..ట్రాన్స్ఫర్లు,ప్రమోషనుకుపుటప్లు…వగైరా లను చూసుకునే సెక్షను ఒకటుంటుంది.ఇంచుమించుHR అనుకోండీ..అందులో యాభైదాటిన గుమాస్తా తనదైన ఇంగ్లీషుతోఅదరగొట్టేస్తూ ఉండేవారు.. .  ఇంగ్లీషు దిగి మాతృభాషలో పలకరించడంకూడా నామోషీ ఆయనకి…ఐతేమాత్రం…అందరినీ కలుపుపోతూఉండేవారు…very “colloquial” అనమాట!!![దయచేసి జోకునుగ్రహించవలెనహో!]ప్రమోషను అంతవరకూ తీసుకోలేదు… ఆయనవద్ద నేను విని..మేధోమథనం  కావించుకున్న కొన్నిమధురాలనుమీతో పంచుకుంటాను..సరేనా!!okay…. నెలపొడుగునా  సిబ్బంది లీవులు పెడుతూనేఉంటారుకదా..మామూలే..అటెండెన్సు రిజిస్టరుచూసుకుంటూ..లీవులెటర్లుఇవ్వని వారందరినీ పేరుపేరునా కలిసిమర్యాదపూర్వకంగా అడిగి..ప్రింటెడు లెటరు మీద వారి పేరుతోపాటురాని తేదీలను రాసిచ్చిమరీ వారి సంతకాలడిగేవారు…పాపం ఈచాదస్తపు పెద్దమనిషి.ఈపని పూర్తయ్యాకా లీవు పుస్తకంలోకి ఎక్కించివారివారి ఖాతాలకు కొయ్యాలనమాట..చేసిన పనిని బాసుగారికిచెప్పేసుకుంటే ఓపనిఅయిపోయినట్టు. సదరు గుమాస్తా గారు బాసువద్దకు వెళ్ళి..“సార్..no pending papers with me ….all promotion eligible files putupped…… boss: what about leave record?have u updated it? గుమాస్తా: yes sir…i have entertained all d leave letters…by bringing personally also…. boss: ok ok….what about your  promotion eligibility ? I think u have reached maximum basic…n r […]

Continue Reading
archarya

తిలక్ కథలు – చెహావ్ ప్రభావం

తిలక్ కథలు – చెహోవ్ ప్రభావం -ఆచార్య యస్. రాజేశ్వరి కన్నీటి జడులలో తడిసిన దయాపారావతాల వంటి- వెన్నెల్లో ఆడుకునే అందమైన అమ్మాయిల వంటి నిశిత పరిశీలనతో నిలిచిన మణి దీపాల వంటి- తిలక్ కథలు 20 సేకరించి 1967లో ప్రచురించారు ప్రకాశకులు. వాటికి మరి 9 కథలు కలిపి 1983 ద్వితీయ ముద్రణ వెలువరించారు. 1921లో పుట్టిన తిలక్ 11వ ఏటనే కథలు రాయడం మొదలుపెట్టాడు. తాను 1966 లో తనువు చాలించే వరకు కథలు, […]

Continue Reading

కనక నారాయణీయం-20

కనక నారాయణీయం -20 –పుట్టపర్తి నాగపద్మిని    పుట్టపర్తి లేఖిని ద్వారా- శివతాండవం అన్న గేయ   కావ్య ఆవిష్కరణకు వేదికగా నిలిచింది – ప్రొద్దుటూరులోని అగస్తేశ్వర ఆలయం !!         అలా ఆవిష్కరింపబడిన శివతాండవం లోని కొంత భాగాన్ని భారతి పత్రిక కు పంపగా, వెంటనే ప్రచురితమైంది. ఆ తర్వాత, కొన్ని సభలలో శివతాండవ భాగాలను చదవగా, స్పందన అద్భుతం. అందులో అనుపమానం గా ఇమిడిపోయిన లయ, అచ్చతెనుగు పదాలలో శివ వైభవం, సంగీత, నాట్య కళా విశేషాలు, […]

Continue Reading

డా.ప్రభాకర్ జైనీ “హీరో” నవల-స్త్రీ పాత్రలు (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

డా.ప్రభాకర్ జైనీ “హీరో” నవల-స్త్రీ పాత్రలు అత్యాధునిక తెలుగు సాహిత్యం–వస్తు, రూప పరిణామం (2000-2020) నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం -డా. గడ్డం శ్యామల అత్యాధునిక తెలుగు సాహిత్యంలో సదస్సు (సెమినార్‌) అంటే పెద్ద సాహసమే. సాహిత్య వృక్షం, కొమ్మలు, రెమ్మలు, పూవులు, కాయలు, పళ్ళతో విస్తరిస్తున్న సమయం 2000-2020. ఒక విధంగా చెప్పాంటే 1980 వరకు వచ్చిన తెలుగు సాహిత్యం ఒక ఎత్తు – 80 తరువాత వచ్చిన సాహిత్యం మరొక యెత్తు. 2000-2020 మధ్య వెలువడిన సాహిత్యం సముద్రం. అందులో రత్నాలు ఉంటాయి. రాళ్ళూ ఉంటాయి, […]

Continue Reading
Posted On :

డయాస్పోరా కథ &కవిత సంకలనాలు- 2021- వంగూరి ఫౌండేషన్ & నెచ్చెలి పత్రిక-రచనలకు ఆహ్వానం!

డయాస్పోరా తెలుగుకథ-మొదటి సంకలనం & డయాస్పోరా తెలుగు కవిత-మొదటి సంకలనం-రచనలకి ఆహ్వానం -ఎడిటర్ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & నెచ్చెలి అంతర్జాల వనితా  మాస పత్రిక  సంయుక్త ఆధ్వర్యంలో  డయాస్పోరా తెలుగు కథ-మొదటి సంకలనం & డయాస్పోరా తెలుగు కవిత-మొదటి సంకలనం రచనలకి ఆహ్వానం మిత్రులారా, భారత దేశం నుంచి ఉత్తర అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, దక్షిణ ఆఫ్రికా, సౌదీ అరేబియా, యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్  మొదలైన అనేక పరాయి దేశాలకి వెళ్ళి, స్థిరపడిన తెలుగు వారిలో మంచి రచయిత(త్రు)లు చెప్పుకోదగ్గ సాహిత్య సృష్టి చేస్తున్నారు. అటువంటి వారి […]

Continue Reading
Posted On :

శ్రీ సింగమనేని నారాయణ స్మారక రాయలసీమ కథల పోటీలు

 శ్రీ సింగమనేని నారాయణ స్మారక రాయలసీమ కథల పోటీలు -ఎడిటర్ (10,000/- రూపాయల బహుమతులు)    శ్రీ సింగమనేని నారాయణ గారు ఎనిమిది దశాబ్దాల జీవన క్రమంలో ముప్పాతిక పై భాగం సాహిత్యజీవిగా కొనసాగారు. ప్రసిద్ద కథకులుగా, విమర్శకులుగా, ఉపన్యాసకులుగా, సంపాదకులుగా  తనదైన ముద్ర వేసారు. నమ్మిన ఆశయాల కోసం జీవితాంతం నిబద్ధతగా నిలబడ్డారు. ప్రజాస్వామిక, శాస్త్రీయ, సమసమాజ భావనలకు ఆయన రచనలు అద్దం పడతాయి. మనుషుల మధ్యే కాకుండా ప్రాంతాల మధ్య కూడా సమానత్వం ఉండాలనేవారు. రాయలసీమ ప్రాంత సామాజిక, సాహిత్య వికాసానికి కృషి చేసారు. […]

Continue Reading
Posted On :

మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021 ఫలితాలు

మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021 ఫలితాలు -ఎడిటర్ మహిత సాహితీ సంస్థ & నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక సంయుక్తంగా నిర్వహించిన “తమిరిశ జానకి కథా పురస్కారం” ఉగాది కథల పోటీ-2021 ఫలితాలు: ఎంపికైన మూడు ఉత్తమ కథలు (ఒక్కొక్కటికి రూ.1116 వెయ్యి నూట పదహార్లు వంతున) 1) కళ్ళల్లో ప్రాణాలు(జి . ఎస్. లక్ష్మి) 2) ఆగిపోకు సాగిపో(పి.వి.శేషారత్నం)3) స్వాభిమాని(రామలక్ష్మి జొన్నలగడ్డ) సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలు-12 1) చెట్టునీడలో ప్రాణదీపం(డా.రమణ […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల-1

చాతకపక్షులు  (భాగం-1) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి తొలిపలుకు  గత మూడున్నర దశాబ్దాలలోనూ అమెరికాలో ఉంటున్న తెలుగువారి ఆచారవ్యవహారాల్లో, ప్రవర్తనలలో చాలా మార్పులు వచ్చేయి. డెబ్భైవ దశకంలో వచ్చినవారికి తగిలినంత కల్చర్ షాక్ ఇప్పటివారికి లేదనే నేను అనుకుంటున్నాను. ఇది కేవలం స్త్రీలకే పరిమితం కాదు. అమెరికాకి వచ్చిన మగవారు ఇక్కడి సంస్కృతిలో నిలదొక్కుకుని, అనేక వత్తుడులని తట్టుకుని తమ ధ్యేయాలని సాధించడానికి పడిన అవస్థలు సామాన్యమయినవి కావు. అదే […]

Continue Reading
Posted On :

ప్రమద -అమండా గోర్‌మన్

ప్రమద అమండా గోర్‌మన్ –సి.వి.సురేష్  1998 లో  లాస్ ఏంజెల్స్ లో జన్మించింది.  ఆమె తల్లి జాన్ విక్స్. 6th గ్రేడ్  ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు. సింగల్ మదర్. అమండ గోర్మన్ మరియు గబ్రియలి ఇద్దరూ కవల పిల్లలు. టెలివిజన్ సౌకర్యం కూడా తక్కువగా ఉన్న ప్రాంతం, వాతావరణం లో పెరిగింది.  తన యవ్వన దశను Weird child  గా పెరిగానని అనుకుంటుంది. తన తల్లి ప్రోత్సాహం తో చదవడం, రాయడం పైన బాగా దృష్టి పెట్టింది. చాల […]

Continue Reading
Posted On :

గోడమీద అడవి

గోడమీద అడవి -దేవనపల్లి వీణావాణి అటవీ శాఖ పనుల తనిఖీ కోసం ఈ రోజు మా బృందం ఏటూరునాగారం నుంచి గోదావరి నదికి కింది వైపు ఉన్న అడవికి వెళ్లాం. దారిలో చిన్న చిన్న గ్రామాలు. గోదావరి నదికి ఆనుకొని ఉన్న  గూడాలను 1986 ప్రాంతంలో వచ్చిన వరదల కారణంగా నదికి దూరంగా అడవిలో నివాసం కల్పించినందు వల్ల  ఈ గ్రామాలు ఏర్పడ్డాయి.  గత ముప్పై ఏళ్లుగా అడవిలో దొరికే మట్టి కర్రలను ఉపయోగించి కట్టుకున్న కుటీరాలే […]

Continue Reading

జానపద గేయ సాహిత్యంలో స్త్రీ వాదం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

జానపద గేయ సాహిత్యంలో స్త్రీ వాదం అత్యాధునిక తెలుగు సాహిత్యం–వస్తు, రూప పరిణామం (2000-2020) నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం -సోనబోయిన సతీష్ జానపద విజ్ఞానాన్ని స్త్రీవాద దృక్పథంతో పరిశీలించినట్లయితే తరతరాల స్త్రీల సామాజిక ఆర్థిక పరిస్థితులే కాక పురుషాధిపత్య సమాజం స్త్రీ జీవితాన్ని ఏ విధంగా అణచివేసిందో, స్త్రీల సమస్యలు ఏ విధంగా అపరిష్కృతంగా మిగిలి పోతున్నాయో అవగతమవుతుంది. జానపద విజ్ఞానంలో జానపద సాహిత్యానిదొక పెద్ద శాఖ. మానవ సంబంధాల […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -21

జ్ఞాపకాల సందడి-21 -డి.కామేశ్వరి  శ్రీ పివి నరసింహరావుగారు  ప్రధానమంత్రిగా వున్నప్పుడు  వారి  మనవరాలు  పెళ్లి హైదరాబాద్ లో మా చెల్లెలుశ్యామల మరిదికొడుకుతో పెళ్లిఅయినపుడు  మేమందరం వెళ్ళాము .అపుడు  ఆయన్ని కలిసి నా పుస్తకాలూ కొన్ని ఇవ్వడం అయన  నా వివరాలు అడగడం  ఓ రచయిత్రిగా నాకు  ఎంతో సంతోషం ,గర్వం  కలిగించిన  క్షణాలు . ఆయన స్వతహాగా బహుభాషాప్రవీణులు కాకరచయితా కూడా .ఆ పెళ్లికికూడా మొత్తంరాజకీయ ,సినిమా ప్రముఖులు ఎంతోమంది వచ్చారు .తేదీ సరిగా గుర్తు లేదుకానీ […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-4

నిష్కల – 4 – శాంతి ప్రబోధ పుట్టింట్లో నలుగురు అన్నల ముద్దుల చెల్లెలు సుగుణమ్మ.  ఆమెను బాగా గారాభం చేసింది మాత్రం ఆమె తండ్రి, పెద్దన్న రాజారాం.  దీంతో రాను రాను సుగుణమ్మ చాలా అహంభావి గా మారిపోయింది.  సుగుణమ్మ ఇంట్లో సర్వాధికారం ఆమెదే.  భర్త సాధు స్వభావి.  పెళ్లయిన మొదట్లో అత్తమామల మధ్య ఉన్న సుగుణమ్మ లోని అహం అడకత్తెరలో  పోకచెక్కలా పెళ్ళైన మొదట్లో భర్త మెతకదనం కనిపెట్టిన ఆమె అతన్ని ఏనాడూ మాట్లాడ నిచ్చేది కాదు, ఏ విషయంలోనూ గెలవ నిచ్చేది కాదు.  .  భార్య మనస్తత్వం […]

Continue Reading
Posted On :

చిత్రం-22

చిత్రం-22 -గణేశ్వరరావు  వివియన్ ఈ ఫోటో ను ఎలా తీసారన్నది మన ఊహకు అందని విషయం. దీనిలో ఎన్నో ఎంతో పొందికగా … చక్కగా అమరాయి.. ఫోటోలో reflection, silhouette, exposure, అన్నీ కలిసి ఉన్నాయి. పైగా అన్నీ కలిసి దీన్ని ఒక సృజనాత్మక ‘సెల్ఫీ ‘ గా చూపిస్తున్నాయి. ఇంకొన్ని అంశాలను గమనార్హం. షాప్ లోపల కూర్చున్న వ్యక్తులు .. గ్లాస్ విండో ముందు నిల్చుని తమని ఎవరో ఫోటో తీస్తున్న సంగతి గమనించినట్లు తెలుస్తోంది. […]

Continue Reading
Posted On :

స్వరాలాపన-2 (మీ పాటకి నా స్వరాలు) -పగలే వెన్నెలా

స్వరాలాపన-2 (మీ పాటకి నా స్వరాలు) పగలే వెన్నెలా -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-19 ‘విజయ సాధించిన కవిత్వ విజయం’

కొత్త అడుగులు – 19 ‘విజయ సాధించిన కవిత్వ విజయం‘ – శిలాలోలిత అలల అంతరంగం విజయ మొదటి సంపుటి 1984లో వచ్చిన ‘దీపిక.’ 93, 94 ప్రాంతాల్లో అనుకుంటా విజయను కలవడం. ‘భూమిక’ ఆఫీస్లో  రచయిత్రుల మీటింగ్ కు రెగ్యులర్ గా వస్తుండేది. ఎంతో బిడియస్తురాలిగా వుండేది. చాలా ఉత్సాహంగా శ్రద్ధగా వింటూ వుండేది. అలా పరిచయమైన విజయ కలిసిన ప్రతిసారి ఆప్యాయంగానే మాట్లాడుకొనే వాళ్ళం. 2016 వచ్చే సరికి సమాజాన్ని పరిశీలించే శక్తి ఎక్కువై […]

Continue Reading
Posted On :

సుద్దాల అశోక్‌తేజ పాటలు: వస్తు, రూప పరిణామం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

సుద్దాల అశోక్‌తేజ పాటలు: వస్తు, రూప పరిణామం అత్యాధునిక తెలుగు సాహిత్యం–వస్తు, రూప పరిణామం (2000-2020) నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం -రాఘవేందర్ రెడ్డి బెంకి పరిచయం: మానవ సమాజం ఆదిమానవుని దగ్గర మొదలుకొని నేటి ఆధునిక, అత్యాధునిక యుగం వరకూ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ పరిణామంలో ఎన్నో మార్పులను చూస్తూ వస్తుంది. ఆ మార్పులలో చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలు మొదలైనవి. వాటన్నింటినీ సాహిత్యం రికార్డు చేస్తూ, విశ్లేషిస్తూ, […]

Continue Reading

బతుకు చిత్రం నవల (భాగం-4)

బతుకు చిత్రం-4 – రావుల కిరణ్మయి సెప్పు ..,ఈంది ఏ ఊరు?అయ్యవ్వలు ఏంజేత్తరు?ఫోన్ సుత లేకుండ ఈ మనిసిని ఈడెట్ల ఇడిసిపెట్టిండ్రు ?నీ కాడ వాళ్ళ నెంబరుంటది గదా!ఫోన్ జేసి పిలిపియ్యి అన్నడు వరయ్య. ఇగో అట్నే ఈ పొల్ల అయ్యను సుత పిల్సుకురాండ్రి.అన్నడు పోలయ్య వైపు చూస్తూ. పూజారి మునేశ్వరయ్య జాజులమ్మ వైపు చూపిస్తూ … వరయ్య గారూ !ఒక్కసారి ఆ పొళ్ళను సూడుండ్రి.పాపం …బేలగా భయంతోనూ,సిగ్గు తోనూ ఎలా వణికిపోతుందో..!ఇది పాడి గాదు.వీళ్ళ అయ్యవ్వను […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-9

రాగో భాగం-9 – సాధన  రోజులు గడుస్తున్నయి. చూస్తుండగానే వర్షాకాలం రానే వచ్చింది. ఓ రోజు రాత్రి చిమ్మచీకటి. కళ్ళు పొడుచుకు చూస్తున్నా ముందు నడుస్తున్న మనిషి ఎంత దూరంలో ఉన్నాడో కూడ తెలవడం లేదు. ముందు నడిచేవారు ఆగితే వెనుకవారు మీద పడి గుద్దుకుంటున్నారు. ముందుండే పైలట్స్ అద్దానికి చేయి అడ్డం పెట్టి టార్చిలైటు వేస్తే చిమ్మచీకట్లో అకస్మాత్తుగా కనపడే వెలుతురుకు కళ్ళు చిట్లించుకుంటూ వెనుక వారంతా గాభరాగా ముందువారి అడుగులో అడుగు లేస్తూ దగ్గరగా […]

Continue Reading
Posted On :

వసంత కాలమ్-13 చుక్చుక్ రైలువచ్చింది

చుక్చుక్ రైలువచ్చింది -వసంతలక్ష్మి అయ్యగారి నిజమే ..సరదాగా గతాన్ని కథలుగా,కబుర్లుగాచెప్పుకోవడంలో ఆనందంలేకపోలేదు.అందుకే..కొత్తసమాచారానికై తహతహలాడేమిత్రులున్నారనితెలియగానే..నడుంబిగించాను. 1998 లో ననుకుంట..తొలిసారికంప్యూటరైజ్డ్..రైల్వే సమాచారం రికార్డుచేయడంజరిగింది..సోమాజీగూడాలోనిఓస్టూడియోలో.తరువాతిరోజుల్లో యీ IVR ప్రక్రియ ప్రతి సంస్థవారు అవలంబించారు. టెలిఫోనులోఅవతలివైపు ఓరిసెప్షనిస్టుచేసేపనిమాదిరిగావుంటుందనుకోండియివతల ఫోనుచేసి వినేవారికి.వారుచెప్పినట్టునంబర్లు నొక్కుతే..సరిపడే సమాధానాలు మనకివినిపిస్తాయనమాట..దీనినే యింటరాక్టీవ్వాయిస్ రెస్పాన్స్..పద్ధతి అంటారు.మరమనిషిమనతో మాట్లాడినట్టే.నిజానికి అవతలివైపుమనిషంటూ లేకుండా ..మనమీరోజు సెల్ఫోన్సర్వీసు ప్రొవైడర్లతో యిలాంటి రీతిలోనేమనబిల్లు,కంప్లైంటు,ప్లాను మార్పువగైరాలన్నీజరుపుకుంటున్నాం.అయితే యిదెలా? రైల్వే స్టేషనులో గతంలో కాంట్రాక్టుఉద్యోగులు,షిఫ్టులలో ఓచిన్ని గదిలోమైకుముందుకూర్చుని..బండిఆగమనిగమసందేశాలు,విలంబనసూచనలురాత్రా,పగలా అన్నతేడా లేకుండావారికున్నఆదేశాలమేరకు..చేతికిచ్చినసమాచారాన్ని ఓbang వేసి చదివేవారట. మరిIVR వచ్చాకా కంప్యూటరే..ముందుగారికార్డుచేసిన వేవ్ ఫైల్ నుఫీడూ,లోడూ చేసి  ప్లేచేస్తే..సమయానుకూలంగా సమాచారంమోగిస్తుంది స్పీకర్లలో ప్రయాణీకులకు. రికార్డింగులో నాకు ఓకట్ట పేపర్లిచ్చేవారు.మైకుపొజిషన్ సెట్ చేసుకున్నాకా..విషయం కాస్తవంటపట్టించుకుని..చదువుతూపోయేదాన్ని.తెలుగు,యింగ్లీషు కాకహిందీలోనూ చదివిన సందర్భాలనేకం.ముందుతెలుగు చేసేదాన్నిఅలసిసొలసేదాకా! మామూలు డాక్యుమెంటరీలలాగ కాకుండాముందు స్టాండర్డు ప్రకటనలుకొన్ని..ఆపైఒకటినుండి  యాభైతొమ్మిది నంబర్లు..విడిగా“ఒంటిగంట..వంద,నూరు,వెయ్యి…గంటలు,గంటల,నిముషములు,సెకెన్లు…కొద్దిసేపట్లో…పగలు,మధ్యాహ్నం,సాయంత్రం, రాత్రి..“లాంటి పదాలు.. అలాగే….“నుండి“,“వరకు“,“కొరకు“,“లో.“..“యందు..“లాంటి విభక్తిప్రత్యయాలు విడిగా టేక్చేసేదాన్ని.ప్రతిమాటకు వారు కట్ చేసుకునేవీలు కల్పిస్తూ pause యివ్వాలి..పరుగులుపనికిరావస్సలు! ఆపైన..దేశంలో సికింద్రాబాద్ ను టచ్అయ్యేఅన్ని రైళ్లపేర్లు…[జంక్షన్ కనుక] ఒకటొకటీవైనంగా చదవాలి.మరికొన్నిఅనువైన,అవసరమైన పదాలను నేను బాగాసూచించేదాన్ని….అన్నీ రికార్డుచేసేసేవారు. వీటి అతుకుల పని..సౌండ్యింజనీరు,ప్రొడ్యూసర్ కమ్ agent లదే..అది మనం నిష్క్రమించాకే జరిగేది. కొత్తరైళ్లచేరిక జరిగినా…మార్పులేవివచ్చినా…నాకుపిలుపూ వచ్చేది! సమయం చాలాపట్టేది..తొలిరోజులప్రయోగాలుకనుక.యిపుడుయీరంగంలోవచ్చిన స్పీడు ఎవ్వరూఊహించనిది..అందుకోలేనిది. రైలుస్టేషన్ లో వారుచేసే సాఫ్ట్ వేర్ యిన్స్టలేషన్గురించి నాకుతెలియదు. కానీ..updating dynamics అంటూ మనకి కేబుల్టీవీ లో అపుడపుడుమాటలు,వీడియో..ముక్కలుగాబ్రేక్అయినచందానుంటాయా ప్రకటనలు. ప్రకటన!(టింగ్టింగటిటింగ్..) సమయం…రాత్రి పదిగంటల….యిరవైనిముషాల….పదమూడు సెకెన్లు. హైదరాబాదు…నుండి…విజయవాడ…మీదుగా…విశాఖపట్టణం చేరుకోవలసిన ..విశాఖా …express…. నంబరు..అయిదు..సున్నా.. నాలుగు..తొమ్మిది..తొమ్మిదీ.. మరికొద్ది…నిముషాలలో   …ఫ్లాట్ఫా్మ్…నంబరు…మూడు…పై… విచ్చేయనుంది. (tingtintiting) ఇలా వినిపించగానే..ముందు విన్నవారు ఏవిటాతెలుగు..ఆభాషనిఖూనీచేస్తూ..ఆవిరుపులేంటీ..యింతకంటేబాగాచదివేవాళ్లేలేరా..చిచీ..అంటూ నాలాగేప్రవర చదువుతారేమో కదా! కానీ..యీప్రకటనలన్నీ అతుకులబొంతలనిగ్రహించాలి.నిజానికి నేను..విభక్తిప్రత్యయాలను..[అంటే..నుండి..గూర్చి,గురించి,కొరకు,కై..]సందర్భంతెలుసుకునిమరీ..వీలైనంతదగ్గరగా అతికేలా శృతిచేసుకునిచదివేదాన్ని.రెండేళ్లతరువాత కొత్తఅతుకులకుస్టూడియోకి వెళ్లినా..మేడమ్ మీశృతి ఏమాత్రంమారలేదండీ…కరెక్ట్ గా అందుకుంటారుఎన్నేళ్లతరువాతైనా…భలే!అనేవారు! ఇపుడు అసలు కథ…నేను ఊహ తెలిసిఊరుకదిలి రైలు ఎక్కినది గట్టిగాఅయిదారుసార్లు.మావారు తరచు వారిఆఫీసుపనులమీద సిబ్బందితోకలిసి రైళ్లలో తెగతిరిగేవారు.ఆయనకిఏనాడూ నాగురించి  ప్రత్యక్షంగాపొగడటంకాదుసరికదా…యిదివిన్ననానో..అదిచూశాననో..చెప్పేఅలవాటులేదు…అన్నీ పరోక్షంగానే. ఓసారి వారి బాస్ ఒకరు మాయింటికిభోజనానికొచ్చి..మాటలసందర్భంలో..“వసంతా..u r so lucky,..ur husband praises u a lot..about ur cooking…..infact …the other day he stopped all of us at  secbad […]

Continue Reading
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -13 రక్తి రాగం – ఖమాస్

ఒక భార్గవి – కొన్ని రాగాలు -13 రక్తి రాగం – ఖమాస్ -భార్గవి శంకరాభరణం సినిమాలో లో శంకర శాస్త్రి చెప్పినట్లు “బ్రోచే వారెవరురా” అనే మైసూర్ వాసుదేవాచార్  కీర్తనలో ఆర్తీ ఆర్ద్రతా తొంగిచూడటానికీ,”డోలాయాంచల డోలాయ” అనే అన్నమయ్య పదంలో భక్తి భావం పొంగి పొర్లడానికీ “సీతాపతే నా మనసున” అనే త్యాగ రాజ కీర్తనలో వేడుకోలుకీ “అపదూరుకు లోనైతినే” అనే జావళీలో శృంగార రసం చిప్పిల్లడానికీ “ఎందుకే నీకింత తొందరా ఓ చిలుక నా చిలుక ఓ రామచిలుక” […]

Continue Reading
Posted On :

షర్మిలాం“తరంగం”-22

షర్మిలాం “తరంగం” వెంటాడే రుచులు -షర్మిల కోనేరు  గడిచిపోయిన క్షణాలు జ్ఞాపకాలై ఎప్పుడూ మనవెంటే వుంటాయి. అవి తలుచుకుంటే బడికెళ్ళేటప్పుడు అమ్మ ఇచ్చిన భోజనం క్యారేజీలా కమ్మగా వుంటాయి. స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళే భోజనం క్యారేజీలు గొప్ప సామ్యవాదం నేర్పేవి. పేదాగొప్పా తేడాల్లేని స్కూల్ రోజులవి. స్కూల్ లంచ్ బెల్ మోగగానే బిలబిల లాడుతూ బయటికి వచ్చి డైనింగ్ హాల్ కి. వెళ్ళి బుద్దిగా మేం రోజూ కూర్చునే స్థలాల దగ్గర నేప్కిన్ లు పరుచుకుని కూర్చునే […]

Continue Reading
Posted On :

తెలుగు పద్యకవిత్వంలో వస్తురూప పరిణామం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

 తెలుగు పద్యకవిత్వంలో వస్తురూప పరిణామం అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం (2000-2020) నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం -రోహిత్ ఆదిపూడి తెలుగు భాషాచరిత్రలో మనకు లభ్యముగా ఉన్న వాంజ్మయంలో పద్యకవిత్వం అత్యంత దృఢమైన స్థానం సంపాదించుకుంది. అతిప్రాచీన కాలం నాటినుండి, ఆదికవిగా పేరు గాంచిన నన్నయభట్టారకుని ఆంధ్రమహాభారతముతో మొదలుకొని, పోతన ఆంధ్రమహాభాగవతమూ, కవిసార్వభౌమునిగా బిరుదుగొన్న శ్రీనాథుని భీమఖండము, శృంగారనైషథము, కవిత్రయము లో చోటు సంపాదించుకొన్న తిక్కన, యెర్రాప్రగడా మహాభారత స్వేచ్ఛానువాదఘట్టములు, […]

Continue Reading
Posted On :

మణిబెన్ కారా

మణిబెన్ కారా (1905-1999) -ఎన్.ఇన్నయ్య   1905లో బొంబాయిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మణిబెన్, సెయింట్ కొలంబియా హైస్కూలులో చదివి, బర్మింగ్ హాంలో సోషల్ సైన్స్ డిప్లొమా పొందారు. దేశ స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. బొంబాయిలో సేవామందిర్ స్థాపించి, ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు.  బొంబాయి రేవు కార్మికోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. నేత కార్మికులకు సేవ చేశారు.  బొంబాయిలో లేబర్ యూనియన్ కార్యకలాపాలలో పాల్గొని, సమ్మెలు నిర్వహించారు.  స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటూ విదేశీయుల సహాయం స్వీకరించే పనుల్లో పర్యటనలు […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-19

కనక నారాయణీయం -19 –పుట్టపర్తి నాగపద్మిని    పరమ కారుణ్య ఋషుల నివాసమైన    లోకములనాతడందెడు  గాక!! శాంతి    రాయలేలిన సీమలో బ్రదుకు వారు    బెద్దల గుణంబులను గౌరవింత్రు గాత!! ఇప్పటికైనా సీమవాసులు బెద్దలైనవారిని గౌరవించే గుణాన్ని అలవరచుకునవలెనన్న హితవు యీ అశ్రునివాళి సందేశం కాగా, యీ శతకాన్ని, కొప్పరపు సుబ్బయ్యగారి అభిమానులు, వెంటనే ముద్రించటం కూడా జరిగింది.    పుట్టపర్తి జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది కూడా పడింది.    పుట్టపర్తి మనసు అశాంతికి లోనయింది. కొప్పరపు సుబ్బయ్య గారు […]

Continue Reading

ప్రమద -రాజేశ్వరి

ప్రమద రాజేశ్వరి రామాయణం –సి.వి.సురేష్  “In spite of difference of soil and climate, of language and manners, of laws and customs, in spite of things silently gone out of mind and things violently destroyed, the Poet binds together by passion and knowledge the vast empire of human society, as it is spread over the whole earth, […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి డా. సి. ఆనందారామం గారికి నివాళి!

ప్రముఖ నవలా రచయిత్రి డా. సి. ఆనందారామం గారికి నివాళి! -మణి కోపల్లె ప్రముఖ రచయిత్రి డా. సి. ఆనందారామం గారు ఫిబ్రవరి  11, 2021 న ఈ లోకాన్ని విడిచి పెట్టారు. వారి  గురించి తెలియని తెలుగు పాఠకులుండరు. తెలుగు సాహిత్యంలో నవల, కథా రచయిత్రిగా, వ్యాసకర్తగా, విమర్శకురాలిగా  ఆన్ని ప్రక్రియలలోనూ   పేరు పొందారు.  1935 ఆగస్టు 20 న ఏలూరులో జన్మించిన (ఆనంద లక్ష్మి) ఆనందారామం గారి చదువు ఏలూరులోనే సాగింది. తొలి […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-3

నిష్కల – 3 – శాంతి ప్రబోధ నలబై ఐదేళ్ల నడివయసు మహిళ , ఇద్దరు పిల్లలున్న మహిళ,  భర్తతో విడిపోయి ఒంటరిగా బతుకుతున్న మహిళకు ఆమె పిల్లలే పెళ్లి చేశారట . ఆ వార్త చూసినప్పుడు చీదరించుకుంది. ఈ వయసులో ఇదేం పోయేకాలం.. దీని మొహంమండ .  ఇంకా పదహారేళ్ళ పడుచుపిల్లననుకుంటుందా ..  దీనికిప్పుడు పెళ్లి కావాల్సి వచ్చిందా .. మొగుడు అవసరమయ్యాడా .. ఛి ఛీ .. సిగ్గులేకపోతే సరి .. ఆడాళ్ళు మరీ బరి తెగించి పోతున్నారని మనసులోనే […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-3)

బతుకు చిత్రం-3 – రావుల కిరణ్మయి తండ్లాటెందుకు?పొర్లాటెందుకు?నువ్వే అంటివి గదెనే !చెట్టంత కొడుకని.అందుకే నిమ్మళంగున్న.సంకల ఆడే శాంతి పోరడయితే నేను సుత నీ లెక్కల్నే సూత్తును కావచ్చు.అన్నాడు మంచం మీద జేరి ఆవలించుకున్టనే. గందుకే అంటాన,దున్నపోతు మీద వాన కురిసినట్టని…….అన్నది కోపంగానే. ఏందే?ఏమో…దున్నపోతంటానవ్?పెయ్యెట్లున్నదే? అన్నాడు. గీ బెదిరింపులకేం తక్కువ లేదు.”ఉన్న మాటంటే ఊర్లున్డనీయరన్నట్టు ..”దున్నపోతని ఉన్నమాటే  అన్న. నీ వల్లనే కదా!ఆ ఊర్ల ఇడిశి పెట్టి అచ్చిన.నీకేమన్న ఇజ్జతున్నదా?పొల్లను సూడ వోయిన ఊర్లనే పొలగాన్ని ఇడ్సిపెట్టి వత్తే […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-8

రాగో భాగం-8 – సాధన  “నీ పేరు ఏందక్కా?” అంటూ మరో ప్రశ్న వేసేసరికి రాగో తత్తర పడింది. వెనుకనున్న మిన్కో వెంటనే “జైని” అంటూ అందించింది. “ఆఁ! అచ్చం జువ్వి రాగో తీరుగుంటే అడిగినక్క కళ్ళల మసకలు. మనిషిని పోల్చలేము” అంటూ ముసలమ్మ కదిలింది. “అబ్బా! కొత్త పేరు పెట్టుకోవడమే మంచిదయింది” అనుకుంటూ రాగో ముందుకు సాగింది. చివరింటి ముందు దళం ఆగింది. కిట్లు దించారు. వాకిట్లో వాల్చిన మంచాలపై దళ సభ్యులు కూచున్నారు. కర్రె […]

Continue Reading
Posted On :

సరోజినీ నాయుడు

ఉత్తమ ఉపాధ్యాయురాలు – ఆన్ సులివాన్ -శర్వాణి ఒక ఆణిముత్యాన్ని లోకానికి అందించిన ఉపాధ్యాయురాలు “ఆన్ సులివాన్”.  ఆ ఆణిముత్యం మరెవరోకాదు  ప్రపంచములో ఆత్మవిశ్వాసముతో అంగ వైకల్యాన్నిజయించి జీవించి చూపిన మహత్తర మహిళ “హెలెన్ కెల్లర్” . ఆవిడ పేరు విననివారు సామాన్యముగా వుండరు ఆవిడ  వికాలుంగుల సంక్షేమార్థము నిరంతరముశ్రమించిన మహిళా కెల్లర్. అంగవైకల్యముతో కృంగిపోయిన వారిలోఆత్మవిశ్వాసాన్ని నమ్మకాన్ని కల్పించిన కర దీపికగా కేల్లర్ నుఅభివర్ణిస్తారు కానీ ఆశ్చర్యము ఏమిటి అంటే కెల్లర్ వంటి దీపాన్నివెలిగించిన కొవ్వొత్తి […]

Continue Reading
Posted On :

వసంత కాలమ్-12 ఒబ్బిడి

ఒబ్బిడి -వసంతలక్ష్మి అయ్యగారి ఊ.. ఏమిటక్కా విశేషాలు ? ఏముంటాయే.. వెధవలాక్ డౌన్ కాదుగానీ కట్టేసినట్టుంటోంది నాకైతే. అయినా మీ గేటెడ్ కమ్యూనిటీ పని బాగుందిలేవే. ముక్కులకి రామ్ రాజ్తొడుగులేసుకుని యే కామన్ అడ్డాకో పోయి హాయిగా రకరకాలగాసిప్పులు కానిచ్చివస్తారు. నేనూ వున్నాను .. అయితే నట్టిల్లు … లేకపోతే నెట్టిల్లు . కొత్త వంటకాలేం చూశావేంటి? చూడడానికేం … వందలే. చేయడమే మరీ దిగిపోయింది వంటపని. అదేమలాగ? ఏంచెప్మంటావ్.. అప్పుడే నాలుగు నెలలుగా యీయనేదో కీటో […]

Continue Reading
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -12 హంసానంది-ఒక అనుభూతి

ఒక భార్గవి – కొన్ని రాగాలు -12 హంసానంది-ఒక అనుభూతి -భార్గవి హంసానంది ఒక రాగం కాదు,ఒక అనుభూతి,ఒక వేదన, ఒక విన్నపం, ఒక వేడికోలు ,ఒక నిర్వచించలేని భాషకందని భావన చల్లని సాయం సమయంలో గాలిలో  తేలివచ్చే హంసానంది రాగాలాపన మనసుని వేరే లోకాలలోకి తీసుకువెళ్లి ఒక తియ్యని బాధకి గురి చేస్తుందనడంలో సందేహం లేదు .తీవ్రమైన ఉద్వేగాన్ని రేకెత్తించే రాగం. ఊరికే రాగం ఆలపిస్తే చాలు,ఈ రాగపు అలల కుచ్చిళ్ల పై సొక్కి సోలిపోతారెవరైనా. […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-18 ఆమే ఓ కవిత్వం – పద్మావతి రాంభక్త

కొత్త అడుగులు – 18 ఆమే ఓ కవిత్వం – శిలాలోలిత ‘పద్మావతి రాంభక్త’ – అనే కవయిత్రిని గురించి ఈసారి పరిచయం చేస్తున్నాను. ‘నెచ్చెలి’ కాలమ్ ఉద్దేశ్యం కూడా అదే. ఇప్పటివరకూ పరిచయం కాని కవయిత్రిని ఎన్నుకోవడం.  అందుకని నేను వారి వారి రచనలు నాకు తెలిసినప్పుడు రాస్తూవున్నాను. ఇదొక వ్యాసమో, సమీక్షో కాదు. ఆ లక్షణాలు లేవు. వీరి కవిత్వాన్ని చదివినప్పుడు నాకు కలిగిన అనుభూతి, నాలో ఏర్పడిన స్పందనే ప్రధానంగా వుంటాయి. ఇదంతా […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -20

జ్ఞాపకాల సందడి-20 -డి.కామేశ్వరి  మా అన్నయ్య పెళ్లి  68 లో ఢిల్లీ లో జరిగింది. ఆపెళ్ళికి  అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, రాష్ట్రపతి, వివి గిరి . మొత్తం ఇందిరాగాంధీ కేబినెట్ మంత్రివర్గం, చీఫ్ జస్టిస్ లాటి పెద్దలు అందరు ఎటెండ్ అయ్యారు. ప్లానింగ్ కమీషన్ మెంబెర్  శ్రీ బుర్ర వెంకటప్పయ్యగారి  అమ్మాయి పెళ్లికూతురు. వెంకటప్పయ్యగారు  ఆ రోజులలో ఐసిఎస్ అంటే  బ్రిటిష్ వారి కాలంలో  ఇంగ్లాండ్ వెళ్లి పరీక్షా పాస్ అయి వచ్చి, కలెక్టర్ , సెక్రటరీ  […]

Continue Reading
Posted On :

చిత్రం-21

చిత్రం-21 -గణేశ్వరరావు  ఈ కళాత్మక చాయా చిత్రం తీసినది పారిస్ కు చెందిన మార్తా (moth art అన్న దానికి బదులుగా ఈ పేరు ను వాడుతుంది ఆమె, అసలు పేరు చెప్పదు). సాధారణమైన రూప చిత్రాలపై ఆమె ఎంత పట్టు సాధించిందో అన్న దానికి ఈ ఫోటో ఒక రుజువు. తన మోడల్స్ హావభావాలను శక్తివంతంగా కెమెరా లో బంధిస్తుంది. ఆమె తీసిన ప్రతీ ఫోటో ఒక కథను చెబుతుంది. ఫోటోలోని అమ్మాయి ఒక్క చూపు […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-18

కనక నారాయణీయం -17 –పుట్టపర్తి నాగపద్మిని కళాశాల ప్రిన్సిపాల్ మీనన్ కు గాంధీ పట్లా, విద్యార్థుల పట్లా ముఖ్యంగా స్వాతంత్ర్య సమరం పట్లా చాలా చిన్న చూపు ఉన్నట్టుంది!! పెనుగొండ లక్ష్మి లో భారతీయ సంస్కృతి పట్ల కళల పట్లా, చరిత్ర పట్లా అంతులేని గౌరవాన్ని ప్రకటించి పులకించిన తనకు , యీ మీనన్ భావాలను సమర్థించటం సాధ్యమా?? అన్న ఆలోచన మొదలైంది పుట్టపర్తి లో!! తరగతిలో సంధుల గురించి పాఠం చెప్పి బైటికి వచ్చేస్తున్నప్పుడొక కుర్రాడు […]

Continue Reading

నార్ల సులోచన

లిలియన్ హెల్ మన్ -ఎన్.ఇన్నయ్య అమెరికాలో బ్రాడ్ వే థియేటర్స్ లో లిలియన్ హెల్ మన్ రచనల ప్రదర్శన కొన్నేళ్ళు అత్యంత ఆకర్షణీయంగా సాగాయి. ముఖ్యంగా పిల్లలపై ఆమె రచనలు స్టేజి మీద రావడం ఒక విశిష్టతగా చరిత్రకెక్కింది. లిలియన్ ఫ్లారెన్స్ హెల్ మన్ ప్రదర్శనలు కొన్ని తరాల వారిని ఆకట్టుకున్న అంశం అపురూపం. ఆమె ప్రదర్శనలో స్వార్థం పై దాడి, అన్యాయం పై ధ్వజం, దోపిడీ పై పోరాటం అనితర సాధ్యం. హెల్మన్ రచనలలో చిల్డ్రన్స్ […]

Continue Reading
Posted On :

షర్మిలాం“తరంగం”-21

షర్మిలాం “తరంగం” ఏజ్ ఈస్ జస్ట్ ఏ నంబర్ ! -షర్మిల కోనేరు  ఏజ్ జస్ట్ ఏ నంబర్ ! ఈ మాట ఇటీవల తరచుగా వినబడుతోంది ! నేను మీడియాలో పనిచేసేటప్పుడు మా రిపోర్టర్లు 50 ఏళ్ళకు పైబడిన వారిగురించి వార్త రాసినప్పుడు 53 ఏళ్ళ వృద్ధుడనో , 52 ఏళ్ళ వృద్ధురాలనో రాసేవారు. అసలు వృద్ధులు అనే పదం వాడొద్దనే దాన్ని. వయోధికులు అని రాయమని చెప్పేదాన్ని . కానీ ఇప్పటికీ వాళ్ళు మారలేదనుకోండి! […]

Continue Reading
Posted On :

విజయవంతమైన “అత్యాధునిక తెలుగు సాహిత్యం – వస్తు, రూప పరిణామం (2000-2020)” అంతర్జాల సదస్సు

అత్యాధునిక తెలుగు సాహిత్యం – వస్తు, రూప పరిణామం (2000-2020)  తెలుగు అధ్యయన శాఖ, బెంగళూరు విశ్వవిద్యాలయం & నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, కాలిఫోర్నియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన మూడు రోజుల అంతర్జాల సదస్సు నివేదిక  జనవరి19-21, 2021 -ఆచార్య ఆశాజ్యోతి & డా. కె. గీత అత్యాధునిక తెలుగు సాహిత్యం – వస్తు, రూప పరిణామం (2000-2020) అన్న అంశంపై 19.01.2021 నుండి 21.01.2021 వరకు మూడు రోజుల పాటు అంతర్జాల అంతర్జాతీయ సదస్సును […]

Continue Reading
Posted On :

స్వరాలాపన-1 (మీ పాటకి నా స్వరాలు)”రాధకు నీవేరా ప్రాణం” పాటకి స్వరాలు!

స్వరాలాపన-1  (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-7

రాగో భాగం-7 – సాధన  దళం గూర్చి ఏమీ తెలియని రాగో దళం వెంట నడుస్తుంది. దళం ఎటుపోతుందో తెలియని రాగో దళంతో నడుస్తుంది. గిరిజ వెనకే రాగో నడుస్తుంది. అంత రాత్రి ఎంత దూరం నడుస్తారో, ఏ ఇంట్లో పడుకుంటారో ఏమీ తెలియదు. తన వద్ద చెద్దరు, దుప్పటి లేవు. కప్పుకోను చీర పేగు కూడ తెచ్చుకోలేదు అని బాధపడుతున్న రాగోకు ఎవరో ఏదో అనడం వినపడింది. కానీ ఏమన్నాడో అర్థం కాలేదు. దళం దారి […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -19

జ్ఞాపకాల సందడి-19 -డి.కామేశ్వరి  నేను గత రెండేళ్ల నించి ఈ ఇంట్లోకి వచ్చిందగ్గర నించి బెడ్ మీద కూర్చుని యోగ చేస్తున్నా కింద కూర్చోలేక . నా ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం నిలువెత్తుది వుంది. నేను కపాలభాతి చేస్తూ కన్నార్పకుండా  రెండు మూడు నిముషాలు తదేకంగా ఎదుట అద్దం వైపు నా వైపు దృష్టి ఉంచి చేసేదాన్ని.  మూడునిమిషాలు అయ్యాక కళ్ళు ముసుకు విశ్రాంతి ఇచ్చేదాన్ని . కళ్ళుమూసుకోగానే  అద్భుతంగా  ఎదురుగా  నా బొమ్మ నీడ […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-2)

బతుకు చిత్రం-2 – రావుల కిరణ్మయి కంచే చేను మేసిన్దన్నట్టుగా కన్న తండ్రే కన్న కొడుకు కళ్ళ ముందే  జీవితాన్ని పాడు చేసుకుంటుంటే  చీమ కుట్టినట్టైనా లేకుండా ఆడు మగోడు వాడేమి  జేసినా చెల్లుతుందని మాట్లాడుతున్న భర్త రాజయ్యను ఓవైపు మందలిస్తూనే తల్లిగా ఒక దారికి తేవాలని పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎంత మంది వచ్చి చూసినా ,అడిగేది ఆస్తి పాస్తులే మున్నాయి?పిలగాడు నెలకు ఏ మాత్రం సంపాదిస్తాండు?ఎంత పొడుపు చేస్తాండు?అనే. వీర్లచ్చిమికి ఈ ప్రశ్నలకు […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-17 అడవితల్లి బిడ్డ వీణావాణి

కొత్త అడుగులు – 17 అడవితల్లి బిడ్డ వీణావాణి – శిలాలోలిత దేవనపల్లి వీణావాణి ప్రత్యేకమైన చైతన్యంతో రాస్తున్న కవయిత్రి. జూలపల్లి మండలం, పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈమె, వృక్షశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అటవీశాఖలో మండలాధికారిగా ఏటూరి నాగారంలో పనిచేస్తోంది. ప్రకృతన్నా అడవులన్న అమితంగా ఇష్టపడుతుంది. వీటి ప్రతిఫలనాలు ఈమె కవితలన్నింటిలోనూ దాదాపుగా కనిపిస్తూనే వుంటాయి. అరణ్యమెంత గందరగోళమో, అడవెంత జ్ఞానచక్షుతో అడవితల్లి మనకిచ్చే అటవీసంపద, వర్షాలు కుడవడమేకాదు పేదల కన్నీళ్ళను […]

Continue Reading
Posted On :
sivaraju subbalakshmi

రచయిత్రీ, చిత్రకారిణీ, అసామాన్యగృహిణి శివరాజు సుబ్బలక్ష్మిగారు! (నివాళి)

రచయిత్రీ, చిత్రకారిణీ, అసామాన్యగృహిణి శివరాజు సుబ్బలక్ష్మిగారు! (నివాళి) -నిడదవోలు మాలతి శివరాజు సుబ్బలక్ష్మిగారు కథలు రాస్తారని నాకు చాలాకాలంగానే తెలుసు కానీ నేను చదివినవి చాలా తక్కువ. అది కూడా ఎప్పుడో కొన్ని దశాబ్దాలక్రితం. నిజానికి బుచ్చిబాబుగారికంటే ఆవిడే బాగా రాస్తారని కూడా విన్నాను. అంచేత, 2006లో ఇండియా వచ్చినప్పుడు, హైదరాబాదునించి ఫోను చేసేను వారికథ ఏదైనా పంపితే అనువాదం చేసి తూలిక.నెట్ సైటులో వేసుకుంటానని. ఆవిడ “అలాగే మామనవడితో చెప్తాను” అన్నారు. ఆతరవాత మళ్లీ ఇప్పుడే, […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-17

కనక నారాయణీయం -17 –పుట్టపర్తి నాగపద్మిని కళాశాల ప్రిన్సిపాల్ మీనన్ కు గాంధీ పట్లా, విద్యార్థుల పట్లా ముఖ్యంగా స్వాతంత్ర్య సమరం పట్లా చాలా చిన్న చూపు ఉన్నట్టుంది!! పెనుగొండ లక్ష్మి లో భారతీయ సంస్కృతి పట్ల కళల పట్లా, చరిత్ర పట్లా అంతులేని గౌరవాన్ని ప్రకటించి పులకించిన తనకు , యీ మీనన్ భావాలను సమర్థించటం సాధ్యమా?? అన్న ఆలోచన మొదలైంది పుట్టపర్తి లో!! తరగతిలో సంధుల గురించి పాఠం చెప్పి బైటికి వచ్చేస్తున్నప్పుడొక కుర్రాడు […]

Continue Reading

నిష్కల (నవల) భాగం-2

నిష్కల – 1  – శాంతి ప్రబోధ ‘మనకున్నది ఒకటే పుట్టుక . ఒక్కటే మరణం. ఈ మధ్య కాలమే కదమ్మా జీవితం . ఇంత చిన్న జీవితకాలంలో జలపాతాల్లా ఎగిసిపడే ఆనందాల కంటే, ఉప్పెనల్లా వురికొచ్చే  దుఃఖాలే ఎక్కువమో.. మనసును ఆహ్లాద పరిచే సంఘటనల కంటే హృదయాన్ని మెలిపెట్టి పిండేసే వ్యధలే ఎక్కువ కావచ్చు.. మనిషికీ మనిషికీ మధ్య మంచుపొరల్లా కమ్మేసిన అహంభావపు తెరలు,  ఆధిపత్యపు కోట్లాటలూ .. ఆంక్షల అడ్డుగోడలూ .. ఎన్ననీ.. ఒకటా రెండా .., దాటుకొచ్చినకొద్దీ, మేమున్నామంటూ కొత్తవి మొలుసుకుంటూ పోతుండడమేనా .. జీవితం? మరీ ముఖ్యంగా ఆడపిల్లల జీవితంలో క్షణక్షణం అనుక్షణం ఎదురయ్యే చింతనిప్పుల గుండాలు , కుప్పలు తెప్పలుగా తుమ్మముళ్ళూ ..బ్రహ్మ జెముళ్లూ .. […]

Continue Reading
Posted On :

లిలియన్ హెల్ మన్

లిలియన్ హెల్ మన్ -ఎన్.ఇన్నయ్య అమెరికాలో బ్రాడ్ వే థియేటర్స్ లో లిలియన్ హెల్ మన్ రచనల ప్రదర్శన కొన్నేళ్ళు అత్యంత ఆకర్షణీయంగా సాగాయి. ముఖ్యంగా పిల్లలపై ఆమె రచనలు స్టేజి మీద రావడం ఒక విశిష్టతగా చరిత్రకెక్కింది. లిలియన్ ఫ్లారెన్స్ హెల్ మన్ ప్రదర్శనలు కొన్ని తరాల వారిని ఆకట్టుకున్న అంశం అపురూపం. ఆమె ప్రదర్శనలో స్వార్థం పై దాడి, అన్యాయం పై ధ్వజం, దోపిడీ పై పోరాటం అనితర సాధ్యం. హెల్మన్ రచనలలో చిల్డ్రన్స్ […]

Continue Reading
Posted On :

షర్మిలాం“తరంగం”-20

షర్మిలాం “తరంగం” ఏజ్ ఈస్ జస్ట్ ఏ నంబర్ ! -షర్మిల కోనేరు  ఏజ్ జస్ట్ ఏ నంబర్ ! ఈ మాట ఇటీవల తరచుగా వినబడుతోంది ! నేను మీడియాలో పనిచేసేటప్పుడు మా రిపోర్టర్లు 50 ఏళ్ళకు పైబడిన వారిగురించి వార్త రాసినప్పుడు 53 ఏళ్ళ వృద్ధుడనో , 52 ఏళ్ళ వృద్ధురాలనో రాసేవారు. అసలు వృద్ధులు అనే పదం వాడొద్దనే దాన్ని. వయోధికులు అని రాయమని చెప్పేదాన్ని . కానీ ఇప్పటికీ వాళ్ళు మారలేదనుకోండి! […]

Continue Reading
Posted On :

పల్లె ఒడిలో సంక్రాంతి తడి

పల్లె ఒడిలో సంక్రాంతి తడి -కొట్నాన సింహాచలం నాయుడు పండగ వచ్చిందంటే అందరికీ ఒకటే పండగ. నెలగంటు పెట్టిన వెంటనే నాన్న సున్నం డబ్బా తెచ్చేవాడు. నీలిమందు తెచ్చేవాడు. ఇల్లంతా పట్లు దులిపి శుభ్రం చేసేవాళ్ళం. సున్నం లో నీలిమందు కలిపి అన్ని గోడలకు వెల్ల వేసే వాళ్ళు. ఒకరు సున్నం వేస్తుంటే ఒకరు నిచ్చెన పట్టుకునే వాళ్ళు. తడిగా ఉన్నంతవరకు నీలంగా ఉన్న గోడలు ఆరగానే తెల్లగా మెరిసే వి. ఊర్లో ఎవరి గోడలు తెల్లగా […]

Continue Reading

వసంత కాలమ్-11 గోపికాబొమ్మలు

గోపికాబొమ్మలు -వసంతలక్ష్మి అయ్యగారి మొన్న సంక్రాంతికి ముందూ వెనుక …రెండుమూడు పేరంటాలకి వెళ్లివచ్చాను.మా కొత్త ఫ్లాటుకొచ్చాకా గేటుదాటి బయట యిరుగుపొరుగు నాకు బొత్తిగా ఎవ్వరూ తెలియదు.నలుగురి తో పరిచయాలిష్టపడతానుకనుక పిలిచినచోటకల్లా వెళ్లాను.కొత్త కనుక ”సునిశిత పరిశీలనకుపెద్దపీటవేసి కూర్చోబెట్టి …నోటికి చిన్నిషీల్  తాళంవేశాననొచ్చు.‘‘ నా మూలాలు తూగోజీ కోనసీమవే అయినా…ఊహ తెలిసినప్పటినుండీ హైదరాబాదీ నే!అంచేత భాష అర్థమవకపోవడం వంటి యిష్యూస్ అస్సలు లేవు.పైగా అన్నియాసలమాధుర్యాన్ని ఆస్వాదిస్తాను,ఆనందిస్తాను,తనివి తీరా!! ముక్కనుమ నాడు సాయంత్రం నేను వెళ్లిన వారిల్లు పేరంటాళ్లతో సందడిగా […]

Continue Reading
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -11 కమ్మటి పరిమళాలు వెదజల్లే కాపీ రాగం

ఒక భార్గవి – కొన్ని రాగాలు -11 కమ్మటి పరిమళాలు వెదజల్లే కాపీ రాగం -భార్గవి మన దక్షిణాది రాష్ట్రాల వారికి పొద్దున్నే కళ్లు తెరవంగానే కమ్మటి కాఫీ చుక్క గొంతులో పడితే గానీ కాలకృత్యాలు మొదలవ్వవు అసలు కాఫీ రుచంతా అది వెదజల్లే పరిమళంలోనే దాగి వుందంటారు కాఫీ శాస్తృజ్ఞులు. అలాగే ఒక పాట కు కూడా రంగూ,రుచీ,వాసనా కలగజేసేది, ఆ పాటకు ఆధారమైన రాగమే.మన జీవితాలలో కాఫీ కొక ప్రత్యేక స్థానమున్నట్టే, కర్ణాటక సంగీతంలో కాపీ రాగానికి కూడా ఒక ప్రత్యేక స్థానముంది.ఒక ఆర్తినీ,ప్రణయాన్నీ ,విరహాన్నీ , వేడికోలునీ,భక్తినీ […]

Continue Reading
Posted On :

చిత్రం-20

చిత్రం-20 -గణేశ్వరరావు  ఛాయా చిత్రాలు..ఫోటోలు షూట్ చేయడానికి, వాటిని పోస్ట్ చేయడానికి మధ్య ఎంతో తతంగం విధిగా చోటు చేసుకుంటుంది. ఒకప్పుడయితే ఫోటోలు తీసిన వెంటనే వాటిని పంపేవారు, పత్రికలు యథాతథంగా వాటినే ప్రచురించేవి. ఇప్పుడు ఫోటో చూడగానే తెలిసిపోతోంది, ఫోటో షాప్ ధర్మమా అని అది ఎంత మారిపోయిందో!ఎవరైనా చెబుతారు – ఫోటోగ్రఫీ ప్రక్రియలలో నీటి అడుగున ఫోటోలు తీయడం (underwater ఫోటోగ్రఫీ) ఎంత కష్టమైనదో అని. కారణాలు ఊహించగలరు. ముందు మీకు ఒక ఆరితేరిన మోడల్ దొరకాలి, నీళ్ళలో మునిగినప్పుడు […]

Continue Reading
Posted On :

ఉగాదికథల పోటీ-2021- నెచ్చెలి & మహిత సంయుక్త నిర్వహణలో “తమిరిశ జానకి కథా పురస్కారం”

మహిత సాహితీ సంస్థ & నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక సంయుక్తంగా నిర్వహించే “తమిరిశ జానకి కథా పురస్కారం” ఉగాది కథల పోటీ-2021కి కథలకు ఆహ్వానం- -ఎడిటర్ మూడు ఉత్తమ కథలకు ఒక్కొక్కటికి రూ.1116 (వెయ్యి నూట పదహార్లు) బహుమతిగా ఇవ్వబడతాయి. 10 కథలు సాధారణ ప్రచురణకు స్వీకరించబడతాయి. ఎంపిక చేసిన కథలు “నెచ్చెలి”లో నెలనెలా ప్రచురింపబడతాయి. నిబంధనలు:- ఇతివృత్తం స్త్రీలకు సంబంధించినదై ఉండాలి. కథపేరుతో బాటూ ఎక్కడా ప్రచురణ కాలేదనీ, పరిశీలనకు పంపలేదని హామీపత్రం […]

Continue Reading
Posted On :

నెచ్చెలి & బెంగళూరు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో-అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం (2000-2020)- సదస్సుకు ఆహ్వానం!

అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం వెబినార్(2000-2020) -ఎడిటర్ తెలుగు అధ్యయన శాఖ బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు & నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక, కాలిఫోర్నియా, యూ.ఎస్.ఏ సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాల అంతర్జాతీయ వెబినార్ అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం (2000-2020) 2021 జనవరి 19, 20 & 21 తేదీలలో ఈ సదస్సులో పాల్గొనేవారు ఈ క్రింది అంశాలలో మీకు నచ్చిన  ఏ అంశాన్నైనా ఎన్నుకొని పరిశోధన పత్రాన్ని సమర్పించవచ్చు. అంశాలు: తెలుగు కవిత్వం – వస్తు, రూప పరిణామం (2000-2020) 1.1  పద్య కవిత్వం 1.2  వచన కవిత్వం 1.3  మినీ కవిత్వం, హైకూలు, రెక్కలు 1.4  దీర్ఘ కవిత్వం తెలుగు కథ – వస్తు, రూప పరిణామం (2000-2020) 2.1  రాయలసీమ కథా సాహిత్యం 2.2  తెలంగాణ కథా సాహిత్యం 2.3  ఉత్తరాంధ్ర కథా సాహిత్యం తెలుగు నవల – వస్తు, రూప పరిణామం (2000-2020) 3.1  రాయలసీమ నవలా సాహిత్యం 3.2  తెలంగాణ నవలా సాహిత్యం 3.3  ఉత్తరాంధ్ర నవలా సాహిత్యం అస్తిత్వవాద సాహిత్యం – వస్తు, రూప పరిణామం (2000-2020) 4.1  రాయలసీమ అస్తిత్వవాద సాహిత్యం 4.2  తెలంగాణ అస్తిత్వవాద సాహిత్యం 4.3  ఉత్తరాంధ్ర అస్తిత్వవాద సాహిత్యం జానపద/గిరిజన సాహిత్యం – వస్తు,రూప పరిణామం (2000-2020) 5.1    జానపద/గిరిజన కథా సాహిత్యం 5.2    జానపద /గిరిజన గేయ సాహిత్యం ప్రపంచీకరణ తెలుగు సాహిత్యం–వస్తు, రూప పరిణామం       (2000-2020) 6.1    ప్రపంచీకరణ కథా సాహిత్యం 6.2    ప్రపంచీకరణ నవలా సాహిత్యం 6.3    ప్రపంచీకరణ కవిత్వం డయాస్పోరా తెలుగు సాహిత్యం–వస్తు, రూప పరిణామం (2000-2020) 7.1    ప్రవాసాంధ్రుల కవిత్వం 7.2    ప్రవాసాంధ్రుల కథా సాహిత్యం అంతర్జాల తెలుగు పత్రికాసాహిత్యం–వస్తు, రూప పరిణామం (2000-2020) 8.1    అంతర్జాల స్త్రీవాద పత్రికలు – నెచ్చెలి, విహంగ మొ.వి. 8.2    అంతర్జాల […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-1

నిష్కల – 1  – శాంతి ప్రబోధ ‘మనకున్నది ఒకటే పుట్టుక . ఒక్కటే మరణం. ఈ మధ్య కాలమే కదమ్మా జీవితం . ఇంత చిన్న జీవితకాలంలో జలపాతాల్లా ఎగిసిపడే ఆనందాల కంటే, ఉప్పెనల్లా వురికొచ్చే  దుఃఖాలే ఎక్కువమో.. మనసును ఆహ్లాద పరిచే సంఘటనల కంటే హృదయాన్ని మెలిపెట్టి పిండేసే వ్యధలే ఎక్కువ కావచ్చు.. మనిషికీ మనిషికీ మధ్య మంచుపొరల్లా కమ్మేసిన అహంభావపు తెరలు,  ఆధిపత్యపు కోట్లాటలూ .. ఆంక్షల అడ్డుగోడలూ .. ఎన్ననీ.. ఒకటా రెండా .., దాటుకొచ్చినకొద్దీ, మేమున్నామంటూ కొత్తవి మొలుసుకుంటూ పోతుండడమేనా .. జీవితం? మరీ ముఖ్యంగా ఆడపిల్లల జీవితంలో క్షణక్షణం అనుక్షణం ఎదురయ్యే చింతనిప్పుల గుండాలు , కుప్పలు తెప్పలుగా తుమ్మముళ్ళూ ..బ్రహ్మ జెముళ్లూ .. […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-6

రాగో భాగం-6 – సాధన  మర్కనాలో ఫారెస్టువారి నర్సరీ పనులు జోరుగా సాగుతున్నాయి. సమ్మె చేసి కూలిరేట్లు పెంచుకున్న కూపు కూలీలు ఆ రోజే పనుల్లోకి దిగారు. వీడింగ్ పని చకచకా సాగిపోతుంది. సాయంకాలం ఆరున్నర అవుతుంది. ఊరి బయటే తెలుగు ప్రాంతీయ వార్తలు విని దళం ఊళ్ళోకొచ్చింది. మసక మసకగా ఉన్న వెలుతురు కాస్తా మనుషుల్ని గుర్తు పట్టరాని చీకటిగా చిక్కపడింది. అడవిని అనుకొనే ఉన్న చివరి ఇంటి ముందు దళం ఆగింది. దళ కమాండర్ […]

Continue Reading
Posted On :

వసంత కాలమ్-10 నవ్వుల్ నవ్వుల్

నవ్వుల్ నవ్వుల్  -వసంతలక్ష్మి అయ్యగారి ఒకాఫీసు…పాతిక మందిదాకా సిబ్బంది వుంటారు.. జీతాలూ…లీవులూ ..లోనుసాంక్షనులు ..ట్రాన్స్ఫర్లు,ప్రమోషనుకుపుటప్లు…వగైరా లను చూసుకునే సెక్షను ఒకటుంటుంది.ఇంచుమించుHR అనుకోండీ..అందులో యాభైదాటిన గుమాస్తా తనదైన ఇంగ్లీషుతోఅదరగొట్టేస్తూ ఉండేవారు.. .  ఇంగ్లీషు దిగి మాతృభాషలో పలకరించడంకూడా నామోషీ ఆయనకి…ఐతేమాత్రం…అందరినీ కలుపుపోతూఉండేవారు…very “colloquial” అనమాట!!![దయచేసి జోకునుగ్రహించవలెనహో!]ప్రమోషను అంతవరకూ తీసుకోలేదు… ఆయనవద్ద నేను విని..మేధోమథనం  కావించుకున్న కొన్నిమధురాలనుమీతో పంచుకుంటాను..సరేనా!!okay…. నెలపొడుగునా  సిబ్బంది లీవులు పెడుతూనేఉంటారుకదా..మామూలే..అటెండెన్సు రిజిస్టరుచూసుకుంటూ..లీవులెటర్లుఇవ్వని వారందరినీ పేరుపేరునా కలిసిమర్యాదపూర్వకంగా అడిగి..ప్రింటెడు లెటరు మీద వారి పేరుతోపాటురాని తేదీలను రాసిచ్చిమరీ […]

Continue Reading
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -10 హాయిని గొలిపే హిందోళం

ఒక భార్గవి – కొన్ని రాగాలు -10 హాయిని గొలిపే హిందోళం -భార్గవి చక్కగా శ్రుతి శుభగంగా ఆలపించే హిందోళ రాగం వినంగానే , ఆత్మ ఆనందపుటలలలో తేలియాడి,దివ్య లోకాలలో విహరిస్తుందంటారు. అసలు హిందోళ అనే పదానికి అర్థం ఒక రకమైన ఊపు,తూగు,లయ అని చదివాను.ఇంకా ఉద్వేగాలని ఉపశమింప జేసి మనసుకు ఓదార్పుని ఇస్తుందనీ,అందువలన రక్తపోటుని నియంత్రించడానికీ,ఆందోళన తగ్గించడానికీ “మ్యూజిక్ థెరపీ” లో ఈ రాగాన్ని వినియోగిస్తారని విన్నాను. ఇది మంచి రక్తి రాగమని గాత్ర కచేరీలలోనూ,నాదస్వర […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-16

కనక నారాయణీయం -16 –పుట్టపర్తి నాగపద్మిని పుట్టపర్తి సాహిత్య జైత్ర యాత్ర, విజయ మార్గాన ప్రయాణిస్తున్న సమయంలో ఒక రోజు..!! పుట్టపర్తి వారిని కొప్పరపు సుబ్బయ్య హఠాత్తుగా తన గదికి పిలుస్తున్నారని ప్యూన్ వచ్చి చెప్పాడు. హఠాత్తుగా ఇప్పుడీ పిలుపేమిటి?? ‘ఇదుగో సామీ..నీకేదో అనంతపురం కాలేజీ నుంచీ జాబొచ్చిందే!! అంతా ఇంగ్లీష్ లో ఉండాది..మద్రాసోళ్ళు నిన్ను విద్వాన్ అన్నారు. వీళ్ళేమంటుండారో నిన్ను..సూడు …’ నిండారా నవ్వుతూ, ఆ లేఖను పుట్టపర్తి చేతుల్లో పెట్టారు కొప్పరపు సుబ్బయ్య గారు. […]

Continue Reading

చిత్రం-19

చిత్రం-19 -గణేశ్వరరావు  ఆర్టెమిజా జెంటిలెక్సి 17వ శతాబ్దపు ఇటాలియన్ చిత్రకారిణి. ఆమె 1620లో గీసిన ఈ చిత్రం పేరు – జూడిత్, హోలోఫర్నెస్ తల నరకడం. ఓల్డ్ టెస్టమెంట్లోని కథ. అస్సిరియన్ ఆర్మీ జనరల్ హోలోఫర్నెస్ జుడిత్ ఉన్న నగరాన్ని ముట్టడి చేస్తాడు. బాగా తాగి ఉంటాడు. ఆమె అదే అదనుగా అతని తల నరికి, తన సేవకురాలితో సొంత ఊరికి తిరిగి వస్తుంది. ఈ ఇతివృత్తాన్ని ఆర్టెమిజా అందరినీ అబ్బురపరచేటట్టు స్పష్టమైన దృశ్య రూపంలో చూపుతుంది. […]

Continue Reading
Posted On :

షర్మిలాం“తరంగం”-19

షర్మిలాం “తరంగం” మార్పు మంచిదే ! -షర్మిల కోనేరు  “కాలం మారిపోయిందండీ ఆ రోజుల్లో … అని గతంలోకి వెళ్ళి పోతారు. కాలం ఎప్పుడూ మారదు కొత్త పోకడలు వస్తాయంతే . కరెంటు తీగ సన్నగా కనపడ్డా  లావుగా కనబడ్డా లోపల కరెంట్ అలాగే వున్నట్టు లోపల ఒరిజినాలిటీ భద్రంగా వుంటుంది. కాలమాన పరిస్థితులబట్టీ రూపం మారుతుందంతే. “అమ్మో ! ఆ రోజుల్లో మీ మామగారంటే ఎంత భయమో అని మా అత్తగారంటే , ఎందుకూ భయం […]

Continue Reading
Posted On :

కరోనా విరహం- భరోసా వరం (హాస్య కథ)

 కరోనా విరహం- భరోసా వరం  –టి.వి.ఎస్.రామానుజ రావు  సెల్ ఫోను మోత వినగానే, “అమ్మలూ, బావ అనుకుంటా చూడు! ఆ వంకాయలు నేను తరుక్కుంటానులే. నువ్వు పోయి మాట్లాడు.” ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్పింది తల్లి సావిత్రి. తల్లి వంక ఒకసారి కోపంగా చూసి వంటింటిలోంచి తన గదిలోకి పరిగెత్తింది వినతి. గది తలుపు గడియ పెట్టి, ఫోను తీసింది. “హలో, ఇంతసేపూ ఏం చేస్తున్నావోయ్?” చిరుకోపంతో అడిగాడు చంద్ర. “వంటింట్లో కూరలు తరుగుతున్నాను, స్వామీ! ఏదో  […]

Continue Reading