image_print

వీక్షణం (కాలిఫోర్నియా)100వ సాహితీసమావేశం – ఆహ్వానం!

వీక్షణం-100వ సాహితీ సమావేశం సాహిత్యాభిలాషులందరికీ ఆహ్వానం! డిసెంబరు 12, 2020 ఉదయం 9 గం (PST) నుండి 6 గం (PST) వరకు  Youtube live link https://youtu.be/g-8kr-JBHcU Facebook Live link  https://www.facebook.com/vikshanam.vikshanam/posts/1806715576164201 Join Zoom Meeting  https://us02web.zoom.us/j/87662531582 -వీక్షణం  *****

Continue Reading
Posted On :

అనువాద రాగమంజరి – శాంతసుందరి (నివాళి)

అనువాద రాగమంజరి -వారణాసి నాగలక్ష్మి (నెచ్చెలి తొలిసంచిక నుండి ధారావాహికరచనలు చేస్తూ ఇటీవల స్వర్గస్తులైన శ్రీమతి శాంతసుందరి గారికి నెచ్చెలి కన్నీటి నివాళులతో ఈవ్యాసాన్ని అందజేస్తోంది-) శాంత గంభీరమైన ఆమె అంతరంగంలో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలు సహజీవనం చేస్తూంటాయి. అడుగు పెట్టగానే ఆ ఇంట్లోని సాహితీ పరిమళాలు మనని చుట్టేస్తాయి. సాహిత్యమే శ్వాసగా జీవించే శాంత సుందరి, రామవరపు సత్య గణేశ్వరరావు గార్ల అపురూప దాంపత్యం తెలుగు పొదరింటికి ఎన్నో గొప్ప ‘గ్రంథరాజా’లను తెచ్చిపెట్టింది, హిందీ సాహితీ […]

Continue Reading

రాగో(నవల)-5

రాగో భాగం-5 – సాధన  పెద్ద బండను మీదికి దొబ్బినట్టె రాగోకు దిగ్గున తెలివైంది. బండలు దొర్లిస్తున్నారు. గడ్డపారలతో బలంగా తవ్వుతున్నారు. గొడ్డళ్ళతో నరుకుతున్నారు. ఒకరూ, ఇద్దరూ కాదు. ఊరికి ఊరే మీద పడ్డట్టుంది. లోగొంతులో గుసగుసలుగా మాట్లాడుతున్నారు. ఆ అల్లరీ, హడావిడి అంతా దగ్గర్లోనే వినబడుతూంది. లేచింది లేచినట్లే మద్ది చెట్టును పొదువుకుంది రాగో. ఎవరై ఉంటారు? ఏమిటి అల్లరి? ఏం చేస్తున్నారు? తననే వేటాడుతున్నారా? తాను ఎక్కువ దూరం పరుగెత్తలేదా? దార్లోనే మొద్దు నిద్ర […]

Continue Reading
Posted On :

వసంత కాలమ్-9 చేబదుళ్ళు..

చేబదుళ్ళు.. -వసంతలక్ష్మి అయ్యగారి మీలోఎంతమందికి ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే మీరిచ్చిన ”చేబ దు ళ్ళ” సంగతులు గుర్తొస్తాయి..ఇచ్చికాల్చుకోని చేతులుండవనే నమ్మకం…!!అసలంటూ ..ఇచ్చేబుద్ధి,కాస్త ంత మొహమాటం మీకున్నాయో….మీరుఔటే..దొరికిపోయారే..పైగా వయసు ముదురుతుంటే..ఈ గుణం కూడాపరిఢవిల్లుతందే తప్ప తోకముడవదు..తగ్గిచావదూ..! అందరికొంపలలోనూ అనాదిగా అయ్యల అపాత్రదానాలూ…అమ్మలుఅశక్తితో అరచిఅలసిపోవడాలు..దీన్ని ఆసరాగా అలుసుగా చేసేసుకునిఆహా మేమే కదా పేద్దదానకర్ణులదాదీలమన్నట్టూ,బలిగారిబాబులమన్నట్టూ..మాచేతికికఎముకలేదనుకుంటూ.. ఫీలవడమేకాక ఎముకలేని నాలుకను తెగ ఆడిస్తూ..ఆడవారినిఅదేపనిగా   ఈసడిస్తూ..పీనాసి తనంతో పాటూ…మహానసశ్రీలని,మాయదారి గొణుగుడుబతుకులనీ దెప్పిపొడుస్తూ మగవారంతాఏకమైపోతారు..పనికిమాలిన సంతపనులు చేసేసి…మనపైచిందులుతొక్కి చెడుగుడాడేసుకోడం మనందరి ఇళ్ళల్లో ఆనవాయితీగామారింది.ఐతే..ఇదంతా ఓ […]

Continue Reading
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -9 మనసుని ఉప్పొంగించే రాగం- కానడ

ఒక భార్గవి – కొన్ని రాగాలు -9 మనసుని ఉప్పొంగించే రాగం—కానడ -భార్గవి మనసొక మహా సముద్రం అనుకుంటే ,అందులో ఉప్పొంగే భావాలే అలలు.అలా భావాలని ఉప్పొంగించే రాగం కానడ మునిమాపు వేళ సన్నగా వీచేగాలికి ఆలయ ధ్వజస్తంభానికున్న చిరుగంటలు మోగినట్టూ- కార్తీకమాసంలో ఓ రాత్రివేళ చిరుచలిలో తులసికోటలో నిశ్చలంగా వెలిగే నూనెదీపం లాగానూ మరిగిన పాల మీద కట్టిన చిక్కటి మీగడని చిలకితే వచ్చిన వెన్న నోట్లో కరిగిపోయినట్టూ అనిపిస్తుంది ఈ రాగం ఆలపించినప్పుడు వింటే […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-15

కనక నారాయణీయం -15 –పుట్టపర్తి నాగపద్మిని ‘భలేవాడివయ్యా!! ఇంత పనిచేసినా, ఒక్కమాటైనా చెప్పనేలేదే నాకు?? ఐనా నాకు తెలుసు, యాడో ..పొరపాటు జరిగినాదని!! ఎట్టా దెలుసుకోవాలో దెలీక ఊరుకుణ్ణ్యా!! నీ బ్రమ్మాస్త్రానికి జవాబుగూడా బ్రమ్మాండంగానే వచ్చినాది గందా!! ఒరే కొండయ్యా!! సారుకు వేడి వేడి కాఫీ దీసుకురా పో!! ఐనా ఆచార్లూ?? ఈడ గూర్చో!! ఇంతకూ ఏం రాసినావు ఆ యూనివర్సిటీ వాల్లకు??’ పుట్టపర్తి అన్నారు,’విద్వాన్ పరీక్ష పాసవటం, అవకపోవటం – గురించి కాదు సుబ్బయ్య గారూ, […]

Continue Reading

చిత్రం-18

చిత్రం-18 -గణేశ్వరరావు  కొందరు గొప్ప వారు తమ జీవితకాలం లో కీర్తి ప్రతిష్ట లను అనుభవించ కుండానే పోతుంటారు, విన్సెoట్ వాన్గొ తను గీసిన ఒకే ఒక బొమ్మని అమ్ముకో గలిగేడు. మరి కొందరి విషయం లో అదృష్టం ఎప్పుడూ వారి వెంటే ఉంటుంది, ఫ్రాన్స్ చిత్రకారిణి ఎలిజబెత్ వీజీ ల బ్ర న్ గీసిన 900 చిత్రాలన్నీ ఆమ్ముడయాయి – అదీ ఆమె జీవించిన 18వ శతాబ్దంలో. ఆ రోజుల్లో స్త్రీలకి విద్యా సంస్థ లలో […]

Continue Reading
Posted On :

షర్మిలాం“తరంగం”-18

షర్మిలాం “తరంగం” మానవా జయోస్తు !!! -షర్మిల కోనేరు  ఒక ఉపద్రవం మానవాళిని చుట్టుముట్టినప్పుడు మనో నిబ్బరంతోముందుకు సాగడం ముఖ్యం. ప్రాణాల్ని , ఆరోగ్యాన్నే కాదు మానవ సంబంధాలనీ కాపాడుకోవాల్సినతరుణం ఇది. కుటుంబ వ్యవస్థ మీద ఈ కూడా కోవిడ్ దాడి మొదలైంది. కంటికి కనిపించనంత చిన్నగా మొదలైన ఈ ఫ్రస్ట్రేషన్ కొండంతగామారక ముందే వేక్సిన్ వస్తే బాగుండును! మొదట కరోనా వైరస్ నియంత్రణకి లాక్డౌన్ పెట్టినప్పడు రోజుకో రకంవంటలు చేసుకుని తిని అందరూ ఒక్కచోట వున్నామన్న ఆనందంతోగడిపారు. అంతా కొద్ది నెలల్లో సర్దుకుంటుందన్న ధీమాతో కాలంగడిపారు. కానీ ఏడాదైనా అదే పరిస్థితి. ముఖ్యంగా స్కూలుకి వెళ్ళే వయసు పిల్లల మానసిక స్థితి దీనంగావుంది. ఇండియాలో పెద్ద క్లాసుల పిల్లలు  కొంతమేర బడికి వెళ్తున్నా మిగతాఅందరూ ఇళ్ళలోనే …. కొండల మీద నుంచి దూకే జలపాతాల్ని  పిల్ల కాలువలోబంధించగలమా ? పైకి చెప్పుకోలేని శిలువల్ని బాల ఏసుల్లా మోస్తున్నారు. స్కూళ్ళు లేవు, తోటి పిల్లలు. స్నేహితులు లేరు. ఆన్ లైన్ పాఠాలు విజ్ఞానాన్ని ఇస్తాయేమో గానీ ఆ పసి మనసులకివేసిన సంకెళ్ళని ఏ ఆన్ లైన్ పగలగొట్టలేదు. ఇంకోపక్క ఇంట్లో తల్లితండ్రుల నిస్సహాయత అసహనంగా మారుతోంది. రోజూ బడికి వెళ్ళే పిల్లలు ఇంట్లో 24 గంటలూ వుంటే వాళ్ళ అల్లరినిభరించలేని తల్లుల మానసిక స్థితి మారుతోంది. పనివత్తిడి వాళ్ళని యంత్రాలుగా మారుస్తోంది. ఒక పక్క సోషల్ గేదరింగ్స్ లేవు , పార్టీలు లేవు , షాపింగ్లు లేవు. ఎంతసేపూ ఇల్లే ఇల్లు. స్వర్గంగా కనపడాల్సిన  ఇల్లు చాలా మంది గృహిణులకి నరకంగాకనిపిస్తోంది. ఇక ఇళ్ళ నుంచి పనిచేసే మహిళల పాట్లు చెప్పలేము. ఇటు ఇంటిలోనే ఎక్కువ సమయం గడపడం వల్ల భార్యా భర్తలసఖ్యతపైన కూడా ప్రభావం చూపిస్తోంది. ఇన్నాళ్ళూ ఆఫీసుకి వెళ్ళి అక్కడ సహోద్యోగులతో కలిసి పని చేసి ఇంటికివచ్చి కుటుంబంతో గడపడం అలవాటైంది. ఇప్పుడు పరిస్థితి అది కాదు . ఏదో నిరాశాపూరిత వాతావరణం అలముకుంటోంది. ఇది పిల్లల్లోనూ పెద్దలోనూ కనిపిస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మార్గాలు అన్వేషించాలి. ఈ కష్టం మన ఒక్కరికే కాదు ప్రపంచానిది. కరోనా వైరస్సే కాదు దీని తాతల్లాంటి మశూచి , ప్లేగు లాంటి వ్యాధులుఒకప్పుడు ప్రపంచాన్ని గజగజ లాడించాయి . అంతిమంగా మనిషి గెలిచాడు. మనం ఇప్పుడూ గెలుస్తాం . గెలిచే క్రమంలో ఏం  కోల్పోకూడదో దేన్ని వదిలిపెట్టాలో దేన్ని ఒడిసిపట్టాలో తెలుసుకుని ముందుకు సాగుదాం ! బిడ్డల్ని ఈ క్లిష్ట పరిస్థితుల్లో సంయమనంతో పెంచుకుందాం. మనిషి తలుచుకుంటే ఎన్నో అసాధ్యాలే సుసాధ్యం అయ్యాయి… ఈ విపత్తూ అంతే ! మళ్ళీ స్కూళ్ళు తెరుచుకుంటాయ్ ! స్వేచ్చగా ఎగిరే పిట్టల్లా పిల్లలు విహరిస్తారు. మళ్ళీ అంతా మామూలు అవుతుంది. కోవిడ్ ను జయించిన మనిషి చరిత్రని భావితరాలు చెప్పుకుంటాయ్ !!! ***** షర్మిల కోనేరుషర్మిల 20 ఏళ్లు డెస్క్ జర్నలిస్ట్ ఉద్యోగం చేసి విరామం తీసుకున్నారు. అలవాటైన […]

Continue Reading
Posted On :

రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-6

రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-6 -సి.రమణ  బౌద్ధ మూల గ్రంధాలు త్రిపిటకములు:  పిటకం అంటే బుట్ట, గంప అని అర్థం. తథాగతుడు మహా నిర్వాణం చెందిన మూడు నెలల తర్వాత, ఆయన ప్రధాన శిష్యులు, భిక్షువులు కలసి బుద్ధుని బోధనలు, సందేశాలు, ధర్మోపదేశాలు అన్నిటినీ మూడు సంకలనాలుగా  విభజించారు.  వీటిని మౌఖిక  పఠనం  ద్వారా, శుద్ధ రూపంలో శిష్యపరంపర కాపాడగలిగారు. అపారమైన సూక్తులు,  ధర్మాలు,  బోధనలు సహేతుకంగా విభజించాలంటే విశేషమైన మేధస్సు కల వారై ఉండాలి. ఆ రోజుల్లో […]

Continue Reading
Posted On :

అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం (2000-2020)- పరిశోధన పత్రాలకు ఆహ్వానం!

అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం వెబినార్(2000-2020) -ఎడిటర్ తెలుగు అధ్యయన శాఖ బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు &నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక, కాలిఫోర్నియా, యూ.ఎస్.ఏసంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాల అంతర్జాతీయ వెబినార్అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం (2000-2020)2021 జనవరి 19, 20 & 21 తేదీలలో ఈ సదస్సులో పాల్గొనేవారు ఈ క్రింది అంశాలలో మీకు నచ్చిన  ఏ అంశాన్నైనా ఎన్నుకొని పరిశోధన పత్రాన్ని సమర్పించవచ్చు. అంశాలు: తెలుగు కవిత్వం – వస్తు, రూప పరిణామం (2000-2020) 1.1  పద్య కవిత్వం 1.2  వచన కవిత్వం 1.3  మినీ కవిత్వం, హైకూలు, రెక్కలు 1.4  దీర్ఘ కవిత్వం తెలుగు కథ – వస్తు, రూప పరిణామం (2000-2020) 2.1  రాయలసీమ కథా సాహిత్యం 2.2  తెలంగాణ కథా సాహిత్యం 2.3  ఉత్తరాంధ్ర కథా సాహిత్యం తెలుగు నవల – వస్తు, రూప పరిణామం (2000-2020) 3.1  రాయలసీమ నవలా సాహిత్యం 3.2  తెలంగాణ నవలా సాహిత్యం 3.3  ఉత్తరాంధ్ర నవలా సాహిత్యం అస్తిత్వవాద సాహిత్యం – వస్తు, రూప పరిణామం (2000-2020) 4.1  రాయలసీమ అస్తిత్వవాద సాహిత్యం 4.2  తెలంగాణ అస్తిత్వవాద సాహిత్యం 4.3  ఉత్తరాంధ్ర అస్తిత్వవాద సాహిత్యం జానపద/గిరిజన సాహిత్యం – వస్తు,రూప పరిణామం(2000-2020) 5.1    జానపద/గిరిజన కథా సాహిత్యం 5.2    జానపద /గిరిజన గేయ సాహిత్యం ప్రపంచీకరణ తెలుగు సాహిత్యం–వస్తు, రూప పరిణామం       (2000-2020) 6.1    ప్రపంచీకరణ కథా సాహిత్యం 6.2    ప్రపంచీకరణ నవలా సాహిత్యం 6.3    ప్రపంచీకరణ కవిత్వం డయాస్పోరా తెలుగు సాహిత్యం–వస్తు, రూప పరిణామం (2000-2020) 7.1    ప్రవాసాంధ్రుల కవిత్వం 7.2    ప్రవాసాంధ్రుల కథా సాహిత్యం అంతర్జాల తెలుగు పత్రికాసాహిత్యం–వస్తు, రూప పరిణామం (2000-2020) 8.1    అంతర్జాల స్త్రీవాద పత్రికలు – నెచ్చెలి, విహంగ మొ.వి. 8.2    అంతర్జాల పత్రికలు–కౌముది, సారంగ, ప్రతిలిపి, కొలిమి, గోదావరి, […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -17

జ్ఞాపకాల సందడి-17 చిట్కా…. -డి.కామేశ్వరి    చాలామందికి  దంతసమస్య వుంటుందీరోజుల్లో. దంతసమస్యఅనగానే నోరుకంపు , పళ్ళు ఊడిపోవడం అనేవి. ముందునించి  పళ్ళని శుభ్రంగా  వుంచుకోకపోవడం, పళ్ళమధ్య ఆహారపదార్ధాలు ఇరుక్కుని కుళ్ళువాసన ,ఇన్ఫెక్షన్ తో చిగుళ్ళు వాచి బలహీనపడి  దంతాలు రాలడం, పయోరియా వ్యాధికి దారితీస్తుంది. మనిషి నోరువిప్పితే భరించలేని దుర్వాసన. చిన్నప్పటినించి  ఏది తిన్న నోరుపుక్కిలించి కడుక్కోవడం పిల్లలకి నేర్పాలి. లేవగానేహడావిడిగా  నోట్లో బ్రష్ ఆడించేసి  ఒకసారి నోట్లో కాసిని నీళ్ళుకూడా పోసుకోకుండాఉమ్మేసి, నాలిక  ఎంతమంది పిల్లలు […]

Continue Reading
Posted On :

శతక కవయిత్రులు

శతక కవయిత్రులు -ఐ.చిదానందం ప్రాంతం ఏదైనా సరే శతకం లేని దేవుడు లేడు  అనేక ప్రతీకలు గా ; అనేక రీతులు గా ; భక్తి గా ; రక్తి గా ; వ్యంగం గా ; వాజ్యస్తుతి తో ; సమాజ హితం కోరి ఎన్నో శతకాలు వచ్చాయి. తెలుగు సాహిత్యం లో శతకాలు రాసిన వారిని పరిశీలన చేస్తే అందులో దాదాపు గా 99% శాతం మనకు పురుషులు రాసిన శతకాలే కలవు. స్త్రీలు […]

Continue Reading
Posted On :

గిన్నిస్ రికార్డు సాధించిన సరోజిని వీరమాచినేని

గిన్నిస్ రికార్డు సాధించిన సరోజిని వీరమాచినేని -ఎన్.ఇన్నయ్య ఆమె హైస్కూలు విద్యకు మించి చదవలేదు. పట్టుదలతో అందరు స్త్రీలతో “చిన్నారి పాపలు” సినిమా తీసింది. మినహాయింపు లేకుండా కళాకారులు, నేపథ్యంలో పనిచేసినవారు, అంతా స్త్రీలే. ప్రొడ్యూసర్ గా తాను నడిపిస్తూ, సావిత్రి డైరెక్టర్ గా చిత్రించిన సినిమా తొలిసారి తెలుగు రంగంలో గిన్నిస్ రికార్డు సాధించింది!  ఆమె భర్త వీరమాచినేని మధుసూదనరావు విక్టరీ డైరెక్టర్ గా పేరొంది నూరు సినిమాలు తీసి అన్నీ విజయవంతం చేశాడు.   సరోజిని […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-15 (ఆధునిక స్త్రీవాది ‘విప్లవశ్రీ’)

కొత్త అడుగులు – 15 ఆధునిక పునాది ‘విప్లవశ్రీ’ – శిలాలోలిత ‘విప్లవశ్రీ’ కలంపేరుతో శ్రీనిధి ఇట్టే కవిత్వం రాస్తోంది. నిండా పందొనిమిది ఏళ్ళు కూడా లేవు. డిగ్రీ సెకండ్ ఇయర్ ‘సిటీకాలేజ్’ హైదరాబాద్ లో చదువుతుంది. 2019 లో ‘రాలిన చుక్కలు’ – అనే కవితా సంపుటిని తీసుకొనివచ్చింది. తనతల్లి ఆడుకోమని అంటే శ్రీనిధికి ఎంత ప్రాణమో చాలా కవితల్లో చెప్పింది. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా ఉపన్యాసించగల మంచి వక్తగా పేరుతెచ్చుకుంది. సన్నగా, చిన్నగా, […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-14 (ఇది స్వేచ్ఛ గానం!)

కొత్త అడుగులు – 14 ఇది స్వేచ్ఛ గానం! – శిలాలోలిత ‘స్వేచ్ఛ’ ఎగరేసిన స్వేచ్ఛాపతాక బరి. స్వేచ్ఛ అంటే ఎవరి కిష్టం వుండదు? బతుకు కంటే స్వేచ్ఛ గొప్పదికదా! అందుకే స్వేచ్ఛ అందరి ఆకాంక్ష. ఆ పేరుతోనే ఆమె ఆకర్షించింది నన్ను. ఎంతమంచిపేరు పెట్టారు ఆ అమ్మా నాన్నలు అన్పించేది. ఇన్నాళ్ళకు ఓ రోజున స్వేచ్ఛ కలిసి కవిత్వ సంపుటి వేస్తున్నానని చెప్పినప్పుడు చాలా ఆనందించేను. అపురూపంగా అన్పించింది. స్త్రీలు రచనా రంగంలో ఎంత ఎక్కువగా […]

Continue Reading
Posted On :

ఉత్తరాలు-ఉపన్యాసాలు-9 ( జోర్డన్ ఆండర్సన్ & గ్రేటా థూన్ బెర్)

ఉపన్యాసం-9 మీకెంత ధైర్యం? వక్త: గ్రేటా థూన్ బెర్ స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి నేపథ్యం: మూడు రోజుల క్రితం …… సెప్టెంబర్ 23 న ….. అమెరికా ….. న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన “క్లైమేట్ ఆక్షన్ సమ్మిట్” లో ……. ముక్కుపచ్చలారని పదహారేళ్ళ స్వీడిష్ అమ్మాయి ….. గ్రేటా థూన్ బెర్ …. వందలాది ప్రపంచ దేశాధినేతలకు హెచ్చరికలు జారీచేసింది! కేవలం ఓ సంవత్సరం క్రితం పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన ఈ అమ్మాయి […]

Continue Reading

100 వ వీక్షణం (కాలిఫోర్నియా)ప్రత్యేక సంచిక-2020, రచనలకు ఆహ్వానం!

ప్రవాస తెలుగు వారి కోసం “శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ కాలిఫోర్నియాలో నెలకొని ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) ఆధ్వర్యంలో తలపెట్టిన “శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ” సమాచారాన్ని మీ పాఠకులతో పంచుకోవలసినదిగా మా మనవి. విదేశాలలో ఉన్న తెలుగు వారు అందరూ ఈ కథ, కవితల పోటీలో పాల్గొనడానికి అర్హులు అని తెలియజేయడమైనది. రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: నవంబర్ 30, 2020. ***** […]

Continue Reading
Posted On :

ఆశ్చర్యపరిచే మల్లాది సుబ్బమ్మ జీవితం

ఆశ్చర్యపరిచే మల్లాది సుబ్బమ్మ జీవితం -ఎన్.ఇన్నయ్య పురాణాలన్నీ పులిహోర వలె ఆరగించిన కొండూరు వారి వంశంలో సుబ్బమ్మ పుట్టారు. ప్రాథమిక విద్య పూర్తి కాకుండానే పెళ్ళి చేసి పంపారు. తల్లిదండ్రులు 11వ ఏట వివాహం కాగా 13వ ఏట కాపురానికి వచ్చింది. బాల్య వివాహం తప్పుగా భావించలేదు. భర్త మల్లాది రామమూర్తికి 17 ఏళ్ళు. వరుసగా ఐదుగురు సంతానాన్ని కన్నారు. భార్యాభర్తలు తమ తప్పు గ్రహించి దిద్దుకోడానికి ఉపక్రమించారు. అంతటితో జీవితంలో గొప్ప మలుపు తిరిగింది. రామమూర్తి […]

Continue Reading
Posted On :

ప్రవాస తెలుగు వారి కోసం “శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ

ప్రవాస తెలుగు వారి కోసం “శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ కాలిఫోర్నియాలో నెలకొని ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) ఆధ్వర్యంలో తలపెట్టిన “శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ” సమాచారాన్ని మీ పాఠకులతో పంచుకోవలసినదిగా మా మనవి. విదేశాలలో ఉన్న తెలుగు వారు అందరూ ఈ కథ, కవితల పోటీలో పాల్గొనడానికి అర్హులు అని తెలియజేయడమైనది. రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: నవంబర్ 30, 2020. *****

Continue Reading
Posted On :

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-2

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-2 -డా.సిహెచ్.సుశీల డాక్టర్ శివారెడ్డి కవిత్వం లో “ఆమె” ఒక ప్రధాన అంతః స్రోతస్విని. ఈ “ఆమె” స్త్రీయే. తల్లిగా తన పాత్ర నిర్వర్తించిన మహనీయురాలు. భార్యగా తన వంతు నిండుగా నిర్వహించిన సహచరి. కూతురుగా గారాలు పోయింది. తోబుట్టువుగా అనురాగాన్ని పంచింది. కానీ ఆమె  ప్రాధాన్యాన్ని పక్కకు నెట్టి అన్ని విధాల అణగదొక్కుతుంటే ఎంతకాలం ఆమె సహిస్తుంది! పరిస్థితి చేజారిపోతోంది. స్త్రీవాదం మొదలైంది. చిగురించింది. ఉధృతరూపం దాల్చింది. ఈ స్త్రీవాదం ఇలా ఉద్ధృత […]

Continue Reading

ప్రమద -ఫణిమాధవి కన్నోజు

ప్రమద ఫణిమాధవి కన్నోజు –సి.వి.సురేష్  నిన్నేదైతే గాయపరిచి౦దో దాన్ని గురించి గట్టిగా, చాల స్పష్టంగా రాయమని ఎర్నేస్ట్ హెమ్మింగ్వే చెప్తారు. Write hard and clear about what hurts – EARNEST HEMINGWAY కవిత్వం ఎలా పుట్టుకొస్తుంది అన్న అంశం పై షరోన్ ఒల్డ్స్ తన “The dead and living” పుస్తకం లో అనేక అంశాలను చెప్పుకొస్తూ.. “Out of memory—a dress I lent my daughter on her way back to college;” అనే ఒక […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-4

రాగో భాగం-4 – సాధన  రోజులు గడుస్తున్నాయి. రాగో మనసు ఓ పట్టాన నిలవడం లేదు. రకరకాల ఆలోచనలతో పొద్దస్తమానం ఎటూ పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటుంది. ఎక్కడికి పోయినా, ఏ పరిచయస్తుల వద్దనైనా, చిన్ననాటి స్నేహితుల వద్దనైనా తలదాచుకోవడానికి పూట, అరపూట ఉండాల్సి వచ్చేసరికి అక్కడి వారంతా ‘కేర్లే (భర్తను వదలి మరో సంబంధం వెతుక్కునే ఆడది) అంటూ అదో రకంగా చూస్తుంటే దిన దిన గండంగా సాగుతుంది. ఏ కాలం నాడు ఏ పెద్దలు నామకరణం […]

Continue Reading
Posted On :

వసంత కాలమ్-8 అతిసర్వత్ర వర్జయేత్

అతిసర్వత్ర వర్జయేత్ -వసంతలక్ష్మి అయ్యగారి అర్థంపర్థం లేకుండా,వేళాపాళా లేకుండా,వివక్ష,విచక్షణ లేకుండా,రుచీపచీ లేకపోయినా ,తోచినాతోచకకొట్టుకుంటున్నా యాంత్రికంగా చేతులు తినుబండారాల భండారాలవద్దకేగి…అందినంతదోచి నోటిగూట్లో పడేసి గిర్నీ ఆడించి మరపట్టడం  కచ్చితంగా యేదో మాయరోగమే.కాస్త తీక్షణంగా ఆలో చిస్తే బొత్తిగా మనకంటూ ఓ మంచి ఆరోగ్యకరమైన వ్యాపకం లేకపోవడం ఓ ముఖ్య కారణమైతే…మెదడు మరీ తీవ్రంగా ఫలానా నిర్ణయాత్మకవిషయమై చిక్కుకు పోయుండడం యింకో కారణమని తోస్తుంది. అంటే….కొంతమంది టెన్షన్ ఎక్కువగా ఉండి యీ రోగాన్ని ఆశ్రయిస్తే మరికొందరుబొత్తిగా తోచక దీని బారిన […]

Continue Reading
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -8 ఆనంద భైరవి

ఒక భార్గవి – కొన్ని రాగాలు -8 ఆనంద భైరవి -భార్గవి ప్రాంతాలు వేరైనా ,భాషలు ఒకటి కాకపోయినా  కులాలూ,మతాలూ జాతుల ప్రమేయం లేకుండా సమస్త మానవాళికి సాంత్వన నిస్తూ ఆనందాన్ని కలగజేసేది సంగీతం. అందుకే సంగీతాన్ని దైవభాష అంటారు. దేశాన్ని బట్టీ,ప్రాంతాన్ని బట్టీ,కాలాన్ని బట్టీ —దేశీ సంగీతమనీ ,విదేశీ సంగీతమనీ,కర్ణాటకమనీ,హిందుస్థానీ అనీ,జానపదమనీ,సంప్రదాయమనీ వివిధ రకాలుగా వర్గీకరించినప్పటికీ, ప్రాథమికంగా సంగీతం ప్రయోజనం ,వినే జనులకు ఉల్లాసాన్నీ ఉత్సాహాన్నీ కలిగించడం,ఉద్వేగాలని ఉపశమింప జేయడం అలా మనసును శాంత పరచి,ఆనందాన్ని కలగ జేసే […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-14

కనక నారాయణీయం -14 –పుట్టపర్తి నాగపద్మిని కొప్పరపువారు పరీక్ష వివరాలన్నీ కనుక్కున్నారు. వారి ఆప్యాయత చూసి పుట్టపర్తి చెప్పారు, తాను ఒకే ప్రశ్న మూడు గంటలూ వ్రాసినట్టు!! ఆశ్చర్యపోవటం కొప్పరపు వారి వంతైంది. ‘ఏందీ?? మూడూ గంటలూ కూచుని ఒకే ప్రశ్నకు జవాబు రాసినావా??’ మౌనవే సమాధానం. తాను ప్రొద్దుటూరిలో అడుగుపెట్టినప్పటినుంచీ, తనకు పెద్దదిక్కుగా నిలిచిన వారిముందు, మరో సమాధానం ఏమిచెప్పగలడు తాను?? ఐతే మరి…రిజల్ట్ వచ్చిందిగదా?? ఏంజెయ్యాలనుందిప్పుడు?? అడిగారు కొప్పరపు సుబ్బయ్య. ‘ఏముంది..మల్లీగట్టుకోవాల పరీచ్చకు!!’ఎవరో అందించారు, […]

Continue Reading

జ్ఞాపకాలసందడి -16

జ్ఞాపకాల సందడి-16 -డి.కామేశ్వరి  మనం ఒక మొక్కనాటితే పెరిగి పువ్వులో, కాయో పండో ఇవ్వడానికి కొన్ని ఏళ్ళు  పడుతుంది. కడుపులో బిడ్డ ఎదిగి బయట పడడానికి తొమ్మిదినెలలు పడుతుంది. బియ్యం అన్నం అవడానికి అరగంటన్నా పడుతుంది. ఒక పరీక్ష పాస్ అవ్వాలంటే కనీసం ఏడాది పడుతుంది. ఆఖరికి పాలనించి నెయ్యి కావాలంటే పెరుగవాలి, చిలకాలి,  వెన్నతీయాలి, నెయ్యికాచాలి. అన్నీ ఎంతో కష్టపడితే తప్ప ఫలితం చేతికందదుకదా! మరి దేముడిని మనం ఒక కొబ్బరికాయ కొట్టేసో, పది ప్రదక్షిణాలు చేసేసి, […]

Continue Reading
Posted On :

చిత్రం-17

చిత్రం-17 -గణేశ్వరరావు  గత పదేళ్లలో ఆఫ్రికన్ చిత్రాలకు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా ఇర్మా స్టెర్న్ చిత్రాలకు. చిత్రకళా ప్రపంచంలో ఆమె విశ్వవ్యాప్తంగా పేరు పొందింది. 1966లో ఆమె మరణించింది. ఆ మధ్య   ఆమె గీసిన లేడి కళ్ళ భారతీయ వనిత బొమ్మ $3 మిలియన్ల కు అమ్ముడయింది. 2015 లో ఒక లండన్ ఫ్లాట్ లో వంట గదిలో నోటీస్ బోర్డు లా వాడుతున్న ఆమె చిత్రం బయట పడింది. మండేలా సహాయార్థం అది […]

Continue Reading
Posted On :

రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-5

రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-5 -సి.రమణ  గత సంచికలలో బౌద్ధధర్మం గురించి చాలా విషయాలు చెప్పుకున్నాం.  ఇంకా తెలుసుకోవలసినది అంతులేనంత ఉన్నది. ప్రపంచానికి  పంచశీలాలు బోధించిన భూమి, మన భారతావని. పంచశీలాలను మననం చేసుకోకపోతే అసంపూర్ణమే, మన విషయ పరిజ్ఞానం. అందరికీ తెలిసినవే అయినా మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. శీలం అనే పదం వినగానే స్త్రీలకు సంబంధించిన విషయంగా అనుకుంటారు మనలో చాలామంది. అసలు శీలం అంటే ఏమిటి?  శీలం అంటే నడవడిక , నైతిక ప్రవర్తన. ఆధునిక […]

Continue Reading
Posted On :

షర్మిలాం“తరంగం”-17

షర్మిలాం “తరంగం” నో (వరస్ట్ ) కామెంట్స్ ప్లీజ్ ! -షర్మిల కోనేరు  ఇన్నాళ్ళూ మనకి తెలియని మనుషుల మనస్తత్వాలు ఇప్పుడు బయటపడుతున్నాయి . ఫేస్బుక్ ,ట్విటర్ వంటివి రాక ముందు మూక మనస్తత్వం , ఈ గ్రూపులు కట్టడాలు అంతగా తెలిసేవి కాదు . మనుషులు తమ మనస్తత్వాలను  పుస్తకంలో పరిచినట్టు పరిచేస్తుంటే అవి చదివి ఇలా కూడా అలోచిస్తారా అని బెంగ , బాధ , కోపం అన్నీ వస్తాయి . నువ్విలా వుండకపోతే […]

Continue Reading
Posted On :

పరాయి దేశంలో కరోనా (మలుపు ) (కథ)

పరాయి దేశంలో కరోనా -జానకీ చామర్తి కుటుంబజీవనంలో గృహిణి గా ఆడవారిపాత్ర మీద నాకెప్పుడూ విశ్వాసము గౌరవము ఎక్కువే. నన్ను నేను ఎప్పుడూ తక్కువ చేసుకోను. నా వాళ్ళతో కలసి నడిచే ఆ ప్రయాణంలో , ఎప్పుడూ వెనుకంజ వేయకూడదనుకుంటూ అందులో భాగంగా ఫిట్ గా ఉండటానికి రోజూ సాయంకాలాలు నడకకి వెడతా. అది నాకు శారీరక ఆరోగ్యమూ, మానసిక ఉల్లాసమూ ఇస్తుంది.  నిండుగా వర్షపు నీరు కలగలిపి ప్రవహిస్తోంది ఆ ఏరు.  ఏటి ఒడ్డున వేసిన […]

Continue Reading
Posted On :

ప్రమద -నందిని సాహు

ప్రమద నందిని సాహు –సి.వి.సురేష్    “నా కలం నాలిక పై ఎప్పుడైతే పదాలు నర్తిస్తాయో.ఏది కూడా దాచుకోకుండా..ఏ దాన్ని, వదలకుండాపొంగి పొరలే నదిలా నేను  భాష ను అనుభూతిస్తాను నా మది అంతః పొదల నుండి కట్టలు తెంచుకొని కవిత్వం వెల్లువై ప్రవహిస్తుంది… మీరెందుకు కవిత్వాన్ని రాస్తారు? అన్న ప్రశ్నకు …ఆమె కోట్ చేసిన సమాధానం ఇది. తన ఏడవ తరగతి లోనే మాతృ బాష అయిన ఒడియ లో మొదటి పోయెమ్ ను రాసిన నందిని సాహు  ఒరిస్సా లోని జి. ఉదయ గిరి లో […]

Continue Reading
Posted On :

రాయలసీమ పాటకు ఆహ్వానం

రాయలసీమ పాటకు ఆహ్వానం రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో శ్రీయుత అప్పిరెడ్డి వెంకటరెడ్డి స్మారకార్థం రాయలసీమ పాటలను ఆహ్వానిస్తున్నాం. ఎంపికైన పాటలకు పదివేల రూపాయల మొత్తాన్ని బహుమతులుగా అందచేస్తాము. పాట రాయలసీమ నిర్దిష్ట జీవితాన్ని  ప్రతిబింబించాలి. పాట ప్రక్రియ లక్షణాలు తప్పని సరిగా పాటించాలి. ఇరవై పాదాలకు మించకుండా ఉండాలి. ఈ పోటీల కోసమే కొత్తగా రాయాలి. అక్టోబరు నెల 15 వ తేదిలోపు రాసిన పాటను  9492287602 వాట్సప్ నెంబరుకు పంపాలి.  దసరా సందర్భంగా అంతర్జాల వేదికలో ఏర్పాటు చేసే రాయలసీమ‌పాట కార్యక్రమంలో తమ పాట ఎలా […]

Continue Reading
Posted On :

తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి స్మారక తొలి కథల పోటీ ప్రకటన

తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి స్మారక తొలి కథల పోటీ ప్రకటన తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి తొలి స్మారక కథల పోటీని  సారంగ పక్ష పత్రిక సౌజన్యంతో నిర్వహిస్తున్నాం. ఒకో కథకు పదివేలుగా మూడు ఉత్తమ కథలకు ముఫ్ఫైవేల రుపాయలు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించాం. కథలు అభ్యదయ భావాలతో  సమాజాన్ని పురోగమనం దిశగా నడిపించేవై ఉండాలి. కథలు యూనికోడ్ వర్డ్ ఫార్మాట్ లో ఉండాలి. సొంత కథ అని హామీపత్రం కూడా తప్పనిసరిగా పంపాలి. కథలను15 అక్టోబర్ 2020 తేదిలోపు‌  tbkr.sahityam@gmail.com మెయిల్ కు పంపాలి. *****

Continue Reading
Posted On :

ఉత్తరాలు-ఉపన్యాసాలు-8 (మోహన్ దాస్ కరంచంద్ గాంధి & షేక్స్పియర్)

ఉత్తరం-8 నీ చర్యలు రాక్షసంగా వున్నాయి రచయిత: మోహన్ దాస్ కరంచంద్ గాంధీ స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి నేపథ్యం: గాంధీ ….. హిట్లర్ కు రాసిన ఉత్తరంలో ఇది రెండవది. ఆయన రాసిన ఈ రెండు ఉత్తరాలు హిట్లర్ కు చేరకుండా బ్రిటిష్ వారు అడ్డుపడ్డారు. నాయకుడుగా ఎదుగుతున్న దశలో హిట్లర్ కు ఆదర్శం ….. అప్పటి ఇటలి ప్రధానమంత్రి, ముస్సోలిని! ముస్సోలిని ఫాసిస్ట్ చర్యలు హిట్లర్ కు ఎంతగానో నచ్చాయి! హిట్లర్, ముస్సోలిని […]

Continue Reading

రాగో(నవల)-3

రాగో భాగం-3 – సాధన  ఊళ్ళో గోటుల్ ముందు జీపు ఆగి ఉంది. నల్లటి జీపుకు ముందరి భాగంపై “మహారాష్ట్ర శాసన్” అనే అక్షరాలు తెల్లటి రంగుతో ఉండ్రాళ్ళలా చోటు చేసుకున్నాయి. నంబరు ప్లేటుపై హిందీ లిపిలో నంబరు కొట్టొచ్చినట్లు కనపడుతుంది. బాబులు అందరూ గోటుల్ ముందు మంచాల్లో కూచున్నారు. వాళ్ళకెదురుగా గ్రామస్తులు కూచున్నారు. పిల్లలందరూ దాదాపు బరిబాతలనే డ్రైవర్ కసరుకోవడం లెక్క చేయకుండానే ఉరుకులు పరుగులు చేస్తూ దాన్నొక వింత జంతువులా చూస్తున్నారు. ఎవరింటి ముందు […]

Continue Reading
Posted On :

కేశాభరణం (కథ)

తెనిగీయం-4  కేశాభరణం ఆంగ్ల మూలం: మార్గరెట్ ఎట్ వుడ్ స్వేచ్ఛానువాదం: అరుణజ్యోతి  నల్లకోటు కింద ముతక స్కర్టు, బూడిద రంగు తొడుక్కున్నాను. పైన బ్రౌన్ స్వెటరు వేసుకున్నాను. దానిపై కాస్త జాగ్రత్తగా చూస్తె గాని కనిపించని కంత. నీ సిగరెట్లు వల్లే ఆ కంత పడింది. అందుకే నాకు చాలా విలువైన స్వెట్టరు. లోపల ఒక పొడవైన బనీను…ఆ లోపల ఒక చిన్న బ్రా… చిన్న చిన్న పూలు డిజైను ప్యాంటీ వేసుకున్నా. చాలా చవగ్గా ఫుట్ పాత్ […]

Continue Reading
Posted On :

వసంత కాలమ్-7 సంఘర్షణ

సంఘర్షణ -వసంతలక్ష్మి అయ్యగారి తెల్లవారినదగ్గర్నుండీ ప్రతి క్షణం సంఘర్షణే…ఎవరితో తల్లీ అనుకుంటున్నారా.. నాతోనేనే..నాలోనేనే..!నలిగిపోవడమేననుకోండి. లేస్తూనే వార్మప్ కింద సెల్లు తెరచి కొంపలంటుకుపోయే అలర్టులేమైనా ఉన్నాయేమోననిప్రివ్యూలైనా చూడడమా,వాకింగా,యోగానా,లేక లక్షణంగా ఫిల్టర్కాఫీ తో రోజునారంభించి,పనులన్నీ అయ్యాక,తీరిగ్గా  అటుసెల్లులో వాట్సప్పూయిటు ఐపాడ్లో ఫేసుబుక్కూ,దగ్గర్లోనే లాండులైనూ ఏర్పాటు చేసుకుని ,లాపుటాపుకి కాస్త దగ్గరలో ఉంటే పిల్లలుస్కైపు లోకొచ్చినా మిస్సవకుండా ఉండొచ్చు..అన్న విషయంతో మొదలు యీ కాను ఫ్లి క్టూ!! కాఫీటీలు మానేసి పాలో..వుమెన్స్  హార్లిక్స్ తాగి బలం పెంచుకోవాలా?పెద్దలాచరించిన సంప్రదాయాన్ని కొనసాగించాలా? వంటపని […]

Continue Reading

ఒక భార్గవి – కొన్ని రాగాలు -7 వలపులు రేకెత్తించే రాగం వలజి

ఒక భార్గవి – కొన్ని రాగాలు -7 వలపులు రేకెత్తించే  రాగం వలజి -భార్గవి ఒక అందమైన వలలాంటి రాగం వలజి,ఒక సారి వినడం మొదలుపెడితే ,అందులోంచీ ఒక పట్టాన బయట పడలేము. ప్రత్యూష పవనాలలో తేలి వచ్చే ఈ రాగ స్వరాలను వింటుంటే మనసు నిర్మలమై ఒక రకమైన ప్రశాంతత చేకూరుతుంది,అందుకే గాబోలు భక్తి గీతాలనూ,ప్రణయగీతాలను కూడా ఈ రాగంలో కూర్చుతారు వలజి రాగం లో అయిదే స్వరాలుంటాయి –(సగపదనిస)ఆరోహణలోనూ,అవరోహణలోనూ (సనిదపగస)కూడా,ఈ కారణంగా దీనిని పెంటటానిక్ […]

Continue Reading
Posted On :

జానకి జలధితరంగం-11

జానకి జలధితరంగం-11 -జానకి చామర్తి బొమ్మల కొలువు లోకాలను సృజించే శక్తి  విధాతకే ఉండవచ్చు గాక , కాని సృజనాత్మకత స్త్రీల సొత్తు. ఆషామాషీగా , అలవోకగా తలచుకున్నంతలో తలపుల కలబోతగా , మమతల అల్లికగా , పొంగిన పాలవెల్లిలా, అమ్మతనపు కమ్మని కలగా , వేళ్ళతో మీటిన వీణానాదంలా, నైపుణ్యపు గణి గా , ఒడి నిండిన అమృతఫలం లా .. కేవలం సున్నిపిండి నలుగుతో స్నానాలగదిలో పార్వతమ్మ చేతిలో రూపుదిద్దుకున్న బాలుని బొమ్మ  కన్నా […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-13

కనక నారాయణీయం -13 –పుట్టపర్తి నాగపద్మిని   కనకవల్లి తళిహిల్లు (వంటిల్లు) సర్దుకుంటూఉండగా, పుట్టపర్తి, రేపు పొద్దున్న మొదటి బస్సుకే తిరుపతికి పోవాలన్న ఆలోచనల్లో మునిగిపోయారు- ఎవరి ఊహల్లో వారు!!     అప్పట్లో ప్రొద్దుటూరినుండి, తిరుపతికి వెళ్ళాలంటే, ఎర్రగుంట్ల వెళ్ళి రైలు పట్టుకోవలసిందే!! తెల్లవారుఝామునే బయలుదేరి ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ చేరుకుని,రైల్లో  మూడవ తరగతి డబ్బాలో ఏదో తోపులాటల్లో కాస్త చోటు సంపాదించుకుని కూర్చునేందుకు ఎంతో శ్రమపడవలసి వచ్చింది పుట్టపర్తికి !! జీవన సంఘర్షణ కూడా ఇంతే కదా!! […]

Continue Reading

ఇట్లు  మీ వసుధా రాణి- ఉత్తరాల వేళ-2

ఇట్లు మీ వసుధారాణి ఉత్తరాల వేళ-2 -వసుధారాణి  ఉత్తరం అన్ని హంగులతో పూర్తి చేసి మా అక్కయ్యా వాళ్ళింటి పక్కన పెట్టిన తపాలా డబ్బాలో వేసేసాం.ఇక మేము అనుకున్న వారికి అది చేరటం , మేము అందులో  పొందుపరిచిన విషయం వారి మీద చూపబోయే ప్రభావం గురించి ఊహల్లోకి వెళ్లిపోయాం. ఇంతలోకి మా కిషోర్ బాబు అసలు విషయం చెప్పాడు.వాడికి ఓ అలవాటు ఉంది ఏది వద్దు అంటే అది చేయటం.ఆ విషయంలో వాడి మాట వాడే […]

Continue Reading
Posted On :

చిత్రం-16

చిత్రం-16 -గణేశ్వరరావు  ‘ఆలోచనలు కలలతో మొదలవుతాయి, ఎప్పటినుంచో నా కల ‘plein air ‘ పదాలకి ప్రాచుర్యం తీసుకొని రావాలని !’ అంటాడు పత్రికాసంపాదకుడు ఎరిక్. ఆ ఫ్రెంచ్ పదాలకి అర్థం ‘ఆరు బయట’ అని. ప్రకృతి దృశ్యాలని ప్రత్యక్షంగా చూస్తూ వాటిని చిత్రించడం! అభయారణ్యంలో మీరు తిరుగుతూ ఉన్నప్పుడు మీ ముందు ఒక లేడి దూకడం చూస్తారు, చేతిలోని కెమెరా తో ఫోటో తీయడానికి ప్రయత్నిస్తారు. అదే మీరు ఒక చిత్రకారుడు అయితే..ఆ దృశ్యాన్ని కళ్ళల్లో […]

Continue Reading
Posted On :

షర్మిలాం“తరంగం”-16

షర్మిలాం “తరంగం” నో (వరస్ట్ ) కామెంట్స్ ప్లీజ్ ! -షర్మిల కోనేరు  ఇన్నాళ్ళూ మనకి తెలియని మనుషుల మనస్తత్వాలు ఇప్పుడు బయటపడుతున్నాయి . ఫేస్బుక్ ,ట్విటర్ వంటివి రాక ముందు మూక మనస్తత్వం , ఈ గ్రూపులు కట్టడాలు అంతగా తెలిసేవి కాదు . మనుషులు తమ మనస్తత్వాలను  పుస్తకంలో పరిచినట్టు పరిచేస్తుంటే అవి చదివి ఇలా కూడా అలోచిస్తారా అని బెంగ , బాధ , కోపం అన్నీ వస్తాయి . నువ్విలా వుండకపోతే […]

Continue Reading
Posted On :

రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-4

రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-4 -సి.రమణ  క్రిందటి సంచికలో అనుకున్నట్లుగా మనం ఇప్పుడు  దశపారమితల గురించి తెలుసుకుందాం. పారమి అను పాళీ భాష  పదానికి అర్థం కొలత, కొలమానం. మనం దేనినైనా కొలవాలంటే ఒక కొలమానం ఉపయోగిస్తాము. కాలం దూరం,  ఉష్ణోగ్రత, కొలవడానికి  మరియు ఘన ద్రవ పదార్థాలు కొలవడానికి రకరకాల భౌతిక కొలమానాలు ఉపయోగిస్తుంటాం. కానీ ఇక్కడ మనం దేనిని కొలవాలి? ఎందుకు కొలవాలి? మనిషి యొక్క మానవీయ లక్షణాలను కొలవాలి. అతను చేసే కుశల కర్మలు, […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-13 (తెరిచిన కిటికీలోంచి….)

కొత్త అడుగులు – 13 గీతా వెల్లంకి తెరిచిన కిటికీలోంచి…. – శిలాలోలిత ఈ ప్రకృతి మొత్తంలో అందమైన భావన ప్రేమ. ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును. అన్నదెంత సత్యమో! ప్రేమించడం తెలిసిన వాళ్ళకు అశాంతి వుండదు. ఒక మృదత్వం, సున్నితత్వం, ప్రకృతి ప్రియత్వం, ఊహాశాలిత్వం ఎక్కువగా వుంటాయి. వ్యక్తుల్ని వారి స్నేహాన్ని, ఇష్టాన్ని, ప్రేమను ఒదులుకోడానికి సిద్ధపడరు. ప్రేమనింపిన భావాలున్న వాళ్ళు ఒకవిధంగా చెప్పాలంటే చాలా అమాయకంగా వున్న సందర్భాలే ఎక్కువ. వాళ్ళెంత లలితంగా ఆలోచిస్తారో, […]

Continue Reading
Posted On :

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-1

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-1 -డా.సిహెచ్.సుశీల వాగర్థా వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని మహాకవి కాళిదాసు ప్రార్థించి నట్లు ‘వాక్కు’ లేకుండా ‘అర్థం’ లేదు ‘అర్థం’ ‘వాక్కు’ను వదిలి ఉండలేదు. ఇవి పరస్పరం ఆధార ఆధేయాలు. ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఎలా అర్థనారీశ్వరులో ఎలా అవిభక్త జాయాపతులో  అలానే స్త్రీపురుషులు అవిభక్తాలు. కానీ పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీకి పురుషులతో పాటు సమాన స్థాయి సంపాదనలో సాధ్యాసాధ్యాలు చర్చించే అరుదైన వేదిక […]

Continue Reading

పునాది రాళ్ళు-15

పునాది రాళ్లు-15 -డా|| గోగు శ్యామల  మేటి కళాకారిణి  చిందు ఎల్లమ్మ కళా రూపాల్లో కులం జెండర్ రాజకీయాల పాత్ర  ఇప్పటి వరకు మనం తెలుగు జనుల మనసును చూరగొని  ఆ తదుపరి  బాధితులైన మహా నటినే చూసాం. ఇప్పుడు మనం అదే తెలుగు జనుల మనుసును చూరగొని గెలిచి నిలిచిన మేటి  మహా కళాకారిణిని చూడాల్సి ఉంది. ఆమెనే  చిందు ఎల్లమ్మ.  చిందు యక్షగాన  కళారూపాన్ని, చిందు మేళాన్ని సబ్బండ పని పాటొల్ల చరిత్రలోని  కథలని […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -15

జ్ఞాపకాల సందడి-15 -డి.కామేశ్వరి  వరలక్ష్మీవ్రతం  నాడు తప్పకుండ నాకు  గుర్తువచ్చే మాట ఓటుంది. మా అక్క  బావ  ఓసారి పూజ  టైంకి  మాఇంట్లో వున్నారు . అక్కని ,నన్నుచూసి మావారు వీళ్ళు మన భార్యలు  మనడబ్బు  ఖర్చుపెట్టి మళ్ళీ జన్మలో మంచి మొగుడు రావాలని పూజలు  చేస్తారు ఎంత అన్యాయం అంటూ  జోకారు.నేను ఊరుకోనుగా  ఆలా కోరుకున్నారంటే దానర్ధం ఏమిటో మరి రిటార్ట్ ఇచ్చా , మా బావగారు అయితే  మరి మేం  ఏ కేటగిరి  అంటారు  […]

Continue Reading
Posted On :

అమెరికాను ఉర్రూతలూగించిన మాడలిన్

అమెరికాను ఉర్రూతలూగించిన మాడలిన్ -ఎన్.ఇన్నయ్య ఒకే ఒకసారి భారతదేశం సందర్శించిన మాడలిన్, హైదరాబాద్ లో మల్లాది సుబ్బమ్మ – రామమూర్తి మానవవాద దంపతులకు అతిథిగా వున్నది. ఆ తరువాత విజయవాడలో గోరా కుమారుడు లవణం, తదితరులతో కార్యక్రమాలు నిర్వహించింది. ఆమె ఫోటోను ముఖచిత్రంగా ప్రచురించిన ఆమెరికా సుప్రసిద్ధ పత్రిక టైం, “అమెరికా ద్వేషించే స్త్రీ” అని వర్ణించింది. ఎందుకని ఆమె వీర నాస్తికురాలు గనుక! హైదరాబాద్ లో మల్లాది వారితో వున్నప్పుడు నేను కలసి మాట్లాడాను. తరువాత […]

Continue Reading
Posted On :

ప్రమద -శృతి హాసన్(ఒక మాట దొర్లితే-కవిత)

ప్రమద శృతి హాసన్ ఒక  మాట దొర్లితే (కవిత) –సి.వి.సురేష్  నవంబర్ 20, 2013 లో ఒకరోజు ఉదయాన్నే ఆమె తన ఇంట్లో ఉండగా, ఒక దుండగుడు ఇంటి తలుపు తట్టి, ఆమె తలువు తీసాక,  “నువ్వు నన్నెందుకు గుర్తు పట్టడం లేదు. ఎందుకు మాట్లాడటం లేదు”? అని ప్రశ్నించాడు.”నువ్వెవరో నాకు తెలియదు” అని ఆమె బదులిచ్చింది. అయితే ఆ దుండగుడు ఆమె గొంతు పట్టుకొని లోపలికి చొరబడేందుకు ప్రయత్నించాడు. వెంటనే, ఆమె అతన్ని వెనక్కు తోసి, […]

Continue Reading
Posted On :

సిలికాన్ వాలీలో శాంతిదేవి!

సిలికాన్ వాలీలో శాంతిదేవి! -ఎన్.ఇన్నయ్య అంతర్జాతీయంగా శాంతిదేవి చారిత్రక పాత్ర వహించింది. ఆమె అమెరికాలో ప్రతిభావంతురాలుగా పేరొంది, ధనగోపాల్ ముఖర్జీ వద్ద చదివి, రవీంద్రనాథ్ ఠాగోర్ కవిత్వాలను ఆనందించిన మేథావి. ఇదంతా మొదటి ప్రపంచ యుద్ధ కాలంనాటి ముచ్చట. శాంతిదేవి అసలు పేరు ఎవిలిన్. 1915 నాటికి ఆమె గ్రాడ్యుయేట్ గా జీవితంలో ప్రవేశించడానికి సిద్ధంగా వుంది. అనుకోకుండా ఆమెకు మానవేంద్రనాథ్   రాయ్ తటస్థించాడు. వారిరువురినీ పరిచయం చేసిన ధనగోపాల్ వారి పెళ్ళికి దారితీశాడు. బ్రిటిష్ […]

Continue Reading
Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- ఉత్తరాల వేళ

ఇట్లు మీ వసుధారాణి ఉత్తరాల వేళ -వసుధారాణి  ప్రతి విషయాన్నీ తెలుసుకోవాలనే ఉత్సుకత ,ఉత్సాహం ఎక్కువగా ఉండే బాల్యావస్థలో చక్కటి మార్గదర్శనం చేయటానికి మాకు దొరికిన మార్గదర్శి మా కృష్ణానందం బావగారు.మా రెండవ అక్కయ్యా,బావగార్లయిన సావిత్రి,కృష్ణానందం (ఇద్దరూ జువాలజీ లెక్చరర్లు)వాళ్ళ పిల్లలు చిన్నారి,కిషోర్ తో పాటు నన్ను కూడా వారింట పుట్టిన పిల్లలా చూసేవాళ్ళు.మా బావగారు పిల్లల పెంపకం గురించి మా కాలం కంటే చాలా ముందు ఆలోచనలు చేసి మా ముగ్గురి పెంపకం కొంచెం ప్రయోగాత్మకం […]

Continue Reading
Posted On :

ఉత్తరాలు-ఉపన్యాసాలు-7 (ఎం.కె.గాంధీ & సుభాష్ చంద్ర బోస్)

ఉత్తరం-7 నీవొక్కడివే యుద్ధాన్ని ఆపగలవు రచయిత: ఎం.కె.గాంధీ స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి   నేపథ్యం: మానవజాతికి పోరాటాలు, యుద్దాలు కొత్త కాదు. కానీ, శాస్త్రవిజ్ఞానం తోడయి ……. రెండవ ప్రపంచ యుద్ధం సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు. ఆ యుద్ధానికి ప్రధాన కారకుడు అడాల్ఫ్ హిట్లర్. ఆ యుద్ధ మేఘాలు అలుముకొన్న దశలో … యుద్ధ ప్రారంభానికి కొద్దికాలం ముందుగా … యుద్ధం మానివేయమని సలహా ఇస్తూ గాంధిజీ హిట్లర్ కు రాసిన […]

Continue Reading

రాగో(నవల)-2

రాగో భాగం-2 – సాధన  గోటుల్ ముందు కూచున్న వాళ్ళల్లో కూడ రకరకాల ఆలోచనలున్నయి. లచ్చుకు ఎటూ తేలకుండా ఉంది. నాన్సుకు మొదటి పెళ్ళి పెళ్ళాముంది. పెళ్ళయి మూడేళ్ళైనా కోడలు కడుపు పండకపోవడంతో నాన్సుకి మరోపిల్లను తెస్తే బాగుండుననే ఆలోచన లచ్చుకు లేకపోలేదు. అందుకే వరసైన రాగో వస్తానంటుందంటే నాన్సును తాను వారించలేదు. రాగోకైనా సంతానమైతే తన ఇల్లు నిలబడుతుందనేది లచ్చు ఆపతి. అయితే రాగో తండ్రి దల్సు మొండిగా వ్యవహరించి పిల్లను ససేమిరా ఇయ్యనని మేనవారికి […]

Continue Reading
Posted On :

శిథిలం కాని వ్యర్థాలు (మార్గరెట్ ఎట్ వుడ్ కథ)

తెనిగీయం-3  శిధిలం కాని వ్యర్ధాలు ఆంగ్ల మూలం: మార్గరెట్ ఎట్ వుడ్ స్వేచ్ఛానువాదం: అరుణజ్యోతి  వెయిట్రస్ అమ్మాయిలను చూస్తె ఎండకు ఒడ్డుకువచ్చి సేదతీరుతున్న సీల్స్ లా కనిపిస్తున్నారు. నూనె పట్టించిన వారి గులాబి శరీరాలు మెరుస్తున్నాయి. అది సాంయంకాల సమయం. ఆందరూ బాతింగ్ సూట్స్లో వున్నారు. డాని కళ్ళార్పకుండా వారినే చూస్తున్నారు. బైనార్కులర్స్ మాంటి దగ్గర అద్దెకు తీసుకున్నాడు. డాని చాలాసేపటి నుంచి చూడవలసిన దృశ్యాలన్ని చూసేశాడు. అయినా ఇచ్చిన డబ్బులు పూర్తిగా రాబట్టుకోవాలి కాబట్టి ఇంకా ఇంకా […]

Continue Reading
Posted On :

వసంత కాలమ్ -6 పలుకేబంగారాలు

పలుకేబంగారాలు -వసంతలక్ష్మి అయ్యగారి అమ్మలదినం .. అయ్యలదినం తోబుట్టువుల దినం స్నేహదినం డాక్టర్లదినం , యాక్టర్లదినం యీ క్రమంలో నోటిదినం అంటూ యింకా పుట్టలేదుకదా! ఏమైనా ప్రస్తుత కాలంలో సర్వేంద్రియాణాం నోరే ప్రధానం!!పదునైనదానోరు. స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన వాక్కు ను వెలువరించేదానోరే కదా! అవతలి మనిషిని ఆకట్టుకొనేదీ ఆ నోరే..అల్లంత ఆవలికి నెట్టేసేదీఆ నోరే! మన జీవితంలో ఎన్నిరకాలు తింటున్నామో..అన్ని రకాల నోటితీరులు ..మాటతీరులు చూస్తుంటాం. ముందుగా బాహ్యప్రపంచానికి చెందినవి. రాజకీయనాయకుల ఉపన్యాసాలు..హెచ్చు శృతి ..అధిక శ్రమ..వాళ్ళ […]

Continue Reading

ఒక భార్గవి – కొన్ని రాగాలు -6 ( సింధుభైరవి )

ఒక భార్గవి – కొన్ని రాగాలు -6 సింధుభైరవి -భార్గవి భైరవి అనేది శక్తి స్వరూపమైన దేవికి వున్న నామాలలో ఒకటి, అందుకేననుకుంటా అమ్మవారి మీద రాసిన ఎన్నో కృతులు ఈ రాగంలో స్వరపరచ బడ్డాయి, పైగా ఈ రాగంలో భక్తి రసం బాగా పలుకుతుండటం కూడా దానికి దోహదం చేసి వుండవచ్చు ఇది శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన అనేక ప్రత్యేకతలున్న ఒక రాగం. హిందుస్థానీలో భైరవి అనీ, కర్ణాటక లో సింధు భైరవి అనీ పిలుస్తారు.  […]

Continue Reading
Posted On :

జానకి జలధితరంగం-10

జానకి జలధితరంగం-10 -జానకి చామర్తి శూర్పణఖ పురాణాలు పుణ్యగ్రంధాలు చదవడం పారాయణం చేయడం వల్ల తప్పకుండా భక్తిభావము  మంచి పని చేస్తున్నామన్న తృప్తి  భగవంతునకు చేరువగా ఉంటున్నామన్న సంతోషము  కలుగుతాయి. అది అందరకీ అనుభవైక వేద్యమే. కాని , లౌకిక జీవితంలో దారితప్పకుండా చేయగలిగే జీవన ప్రయాణంలో అవి మనకి ఎంత తోడు , ఎంత ఉపయోగం. గాంధీజీ తనకు ఏదైనా సమస్యో ధర్మ సంకటమో ఎదురైనపుడు “ భగవద్గీత” తీసి , అందులో ఏదొక శ్లోకం […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-12

కనక నారాయణీయం -12 –పుట్టపర్తి నాగపద్మిని ఇంటి పనులూ, భర్త నారాయణాచార్యులవారి శిష్య వర్గానికి పాఠాలు పునస్చరణ చేయించటంలోనూ తలమునకపైపోతూకూడా, భర్త విద్వాన్ పరీక్ష బాగా వ్రాశారని విని చాలా సంతోషపడిపోయిందా నేదరి ఇల్లాలు – పుట్టపర్తి కనకవల్లి!! ఇక పరీక్ష ఫలితాలకోసం ఎదురుచూపు !!   ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. విద్వాన్ పరీక్ష ఫలితాలొచ్చాయి. అది విని కనకవల్లి దిగ్భ్రాంతి చెందింది!! కానీ పుట్టపర్తి కి యీ విషయాలే పట్టటం లేదు. పరీక్ష […]

Continue Reading

కొత్త అడుగులు-12 (మౌనభాషిణి – అరుణ కవిత్వం)

కొత్త అడుగులు – 12 మౌనభాషిణి – అరుణ కవిత్వం – శిలాలోలిత ఇటీవలి కాలంలో సీరియస్ పొయిట్రీ రాస్తున్న వారిలో అరుణ నారదభట్ల ఒకరు. ‘ఇన్నాళ్ళ మౌనం తరవాత’ అంటూ 2016 లో తానే ఒక కవితై మన ముందుకొచ్చింది. ఇది ఆమె తొలి పుస్తకమైనప్పటికీ అలా అనిపించదు. తననీ భూమికి పరిచయం చేసి, నడక, నడత నేర్పిన అమ్మానాన్నలకు అంకితం చేసింది. ఎం. నారాయణ శర్మకు సహచరి. మంధనిలో జన్మించి, హైదరాబాద్ లో ప్రస్తుతం […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -14

జ్ఞాపకాల సందడి-14 -డి.కామేశ్వరి  The sky is  pink …. ఈ మధ్యే ఈ అద్భుతమైన  సినిమా చూసా. ఇంత గొప్ప సినిమా ఎలా మిస్ అయ్యానో, పేరుకూడా విన్న గుర్తు  లేదు. మొన్న రోహిత్  “తప్పకుండా చూడు” అంటే సరే అనుకుని పెళ్లి హడావిడి అయ్యాక netflix లో చూస్తే కనపడలేదు. మళ్లీ మర్చిపోయి నిన్న వెతికితే దొరికింది. సినిమాకాదు జీవితం చూస్తున్నంత సహజంగా ప్రతి సీను, ప్రతిమాట, నటన… ఏం చెప్పాలి? ప్రియాంకచోప్రా ,ఫరనక్తర్, భార్యాభర్తలు. కొడుకు, […]

Continue Reading
Posted On :

చిత్రం-15

చిత్రం-15 -గణేశ్వరరావు  కళా హృదయం కలవారు తమ పరిసరాలలో వున్న వాటి నుంచి తరచూ సృజనాత్మక ప్రేరణను పొందుతుంటారు. వాటిని తమ కళా ప్రక్రియలలోకి అనువదించడానికి ప్రయత్నిస్తుంటారు.రష్యన్ ఫోటోగ్రాఫర్ క్రిస్టినా తన కెమెరా తీసుకొని ప్రపంచం అంతా పర్యటిస్తుంటుంది. ఫ్యాషన్, ఆర్కిటెక్చర్ రంగాలు కలిసే వుంటాయి. క్రిస్టినా తన ట్రావెల్ ఫోటోగ్రఫీ లో ఆ రెండూ ఎలా కలిసిపోతాయో చూపిస్తుంది.ఆమె అందమైన రూప చిత్రాలను ఎన్నో తీసింది, ఆ సిరీస్ లో సుందరమైన ప్రకృతి దృశ్యాల నేపథ్యంలో […]

Continue Reading
Posted On :

పునాది రాళ్ళు-14

పునాది రాళ్లు-14 -డా|| గోగు శ్యామల  మేటి కళాకారిణి  చిందు ఎల్లమ్మ సజీవ కథ (సాoస్కృతిక  కళారూప రంగాల్లో కులం & జండర్ల ఆధిపత్య రాజకీయాల పాత్ర)  రాతకు నోచుకోని వందలాది  మౌఖిక   గాధలను, పురాణాలను అలవోకగా పాడే విశిష్ట  మేటి కళాకారిణి  చిందు ఎల్లమ్మ.  ఈమె చిందు  కళాకారుల వంశంలో పుట్టి పెరిగింది. బాల్యం నుండే కళాకారిణిగా రానిoపచేయడం చిందు వంశానికే సాధ్యమైన అరుదైన కళాకారిణి.  చిందు బాగోతం, (చిందు యక్షగానం) కళారూపంలో చిందేస్తూ,  […]

Continue Reading
Posted On :

రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-3

రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-3 -సి.రమణ  మానవుని సంపూర్ణ సుఖశాంతుల కొరకు నిర్దేశించబడిన మార్గమే అష్టాంగమార్గం. బుద్ధుడు, సామాన్యుల నుండి మేధావుల వరకు, భిన్న పద్ధతులలో, విభిన్నమైన మాటలతో, వారి ఆలోచన, అవగాహన  స్థాయిని బట్టి, వారి వారి ఆచరణ సామర్థ్యాన్ని బట్టి, అష్టాంగ మార్గాన్ని బోధించాడు. అవి ఎనిమిది అంగాలుగా ఉండటం వలన అష్టాంగ మార్గం అయినది.బౌద్ధ గ్రంథాలలో ఉన్న వేలకొలది ఉపదేశాల సారాంశం అష్టాంగ మార్గంలో ఉన్నది. 1.సమ్యక్ వాక్కు          […]

Continue Reading
Posted On :

ఉత్తమ ఉపాధ్యాయురాలు – ఆన్ సులివాన్

ఉత్తమ ఉపాధ్యాయురాలు – ఆన్ సులివాన్ -శర్వాణి ఒక ఆణిముత్యాన్ని లోకానికి అందించిన ఉపాధ్యాయురాలు “ఆన్ సులివాన్”.  ఆ ఆణిముత్యం మరెవరోకాదు  ప్రపంచములో ఆత్మవిశ్వాసముతో అంగ వైకల్యాన్నిజయించి జీవించి చూపిన మహత్తర మహిళ “హెలెన్ కెల్లర్” . ఆవిడ పేరు విననివారు సామాన్యముగా వుండరు ఆవిడ  వికాలుంగుల సంక్షేమార్థము నిరంతరముశ్రమించిన మహిళా కెల్లర్. అంగవైకల్యముతో కృంగిపోయిన వారిలోఆత్మవిశ్వాసాన్ని నమ్మకాన్ని కల్పించిన కర దీపికగా కేల్లర్ నుఅభివర్ణిస్తారు కానీ ఆశ్చర్యము ఏమిటి అంటే కెల్లర్ వంటి దీపాన్నివెలిగించిన కొవ్వొత్తి […]

Continue Reading
Posted On :

షర్మిలాం“తరంగం”-15

షర్మిలాం “తరంగం” ఇండియా వెలిగిపో !! -షర్మిల కోనేరు  దేశమంతా లాక్డౌన్ కాగానే హాస్టళ్ళ నుంచి పిల్లలు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వర్క్ ఫ్రం హోం లని ఇళ్ళకి చేరితే…అబ్బ ఇళ్ళన్నీ మళ్ళీ కళకళలాడుతున్నాయ్అనిఅనుకున్నాను. మరో రెండువారాలకు ఆ ఇంటిఇల్లాలు చాకిరీతో అలిసి వెలవెలబోవడం చూసి ఏంటా అని ఆరాతీశా… పిల్లలు యూట్యూబుల్లో చూసి రకరకాల కేకులనీ, కుక్కీలనీ వాళ్ల తలకాయనీ వంటలుచేయడం… ఆ బండెడు సామాను తోమలేక వాళ్ళ అమ్మ సతమతం అవ్వడం. పోన్లే పిల్లలు […]

Continue Reading
Posted On :

ప్రమద – కుప్పిలి పద్మ

ప్రమద కుప్పిలి పద్మ  –సి.వి.సురేష్  కుప్పిలి పద్మగారు రాసిన అద్భుతమైన పోయమ్ ఎంతో లోతైన అర్థాన్ని నాలో నింపింది. అటు ఖరీదైన … ఇటు సామాన్యమైన జీవితాల్లోని సంక్లిష్టత కు అద్దం పట్టినట్లనిపించి౦ది నా చిన్ని బుర్రకు…. ఈ పోయెమ్ ను translate చేయాలనిపించి చేసిన ఒక చిన్న ప్రయోగం..!!! *** That pretty jasmine English Translation – C. V. Suresh That pretty jasmine is such a miser Either two […]

Continue Reading
Posted On :

ఉత్తరాలు-ఉపన్యాసాలు-6 (విలియం లియాన్ ఫెల్ప్స్)

ఉత్తరం-6 సింగపూర్ ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు రాసిన లేఖ  మూలం: ఇంగ్లీష్ స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి   నేపథ్యం: ఈ ఉత్తరం ……. ఒకరకంగా ….. నా ఆవేదన! ఓ సింగపూర్ ప్రిన్సిపాల్ ……. తల్లిదండ్రులకు రాసినట్లుగా చెప్పబడుతున్న ఈ ఉత్తరం చాలా రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇది నకిలీ ఉత్తరం. ఏ స్కూల్ ప్రిన్సిపాల్ రాసినాడో వివరాలు ఎక్కడా లేవు. కాబట్టి, అనుభవజ్ఞులు దీనిని నకిలీదిగా తేల్చిచెప్పారు. ఇందులోని భాషతో పాటు […]

Continue Reading

రాగో(నవల)-1

రాగో – సాధన  1 రాగో దిగాలుగా కూచొని ఉంది. మనసంతా కకావికలమై ఉంది. కొలిక్కి రాని ఆలోచనలు. ఊరి బయటి గొడ్ల సదర్లలా చెల్లాచెదురుగా ఉన్నాయి తన ఆలోచనలు. ఎంత కూడదనుకున్నా గతమంతా దేవర జాతర్లా బుర్రలో అదే పనిగా తిరుగుతోంది. తోవ తప్పినోళ్ళు ఆగమాగమై అడవిలో తిరుగుతున్నట్లుంది రాగో జీవితం. తారీఖులు, పంచాంగాలు లెక్కలు తెలియకపోయినా, ఊరోళ్ళందరూ ‘పడుచుపోరి’ అని వెక్కిరిచ్చినప్పుడల్లా తనకూ వయసొస్తుందని అర్థమయేది. ఊళ్లో చలికాలం రాత్రుళ్ళు డోళ్ళు, డప్పులతో నెగళ్ళ […]

Continue Reading
Posted On :

వెంట్రుకల బంతి (మార్గరెట్ ఎట్ వుడ్ కథ)

తెనిగీయం-2 వెంట్రుకల బంతి (కథ) ఆంగ్ల మూలం: మార్గరెట్ ఎట్ వుడ్ స్వేచ్ఛానువాదం: అరుణజ్యోతి   కేట్ ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వచ్చింది. ఆమె గ్భాశయంపై ఒక కంతి పెరింగింది. కాస్త పెద్దదే. చాలా మంది ఆడవాళ్ళకు ఇలా అవుతుందని డాక్టరు చెప్పారు. అయితే ప్రమాదకరమైన కేన్సర్ కంతి అవునో కాదో ఇప్పుడే చెప్పలేమన్నారు. ఆ కంతిని తాను చూస్తానని కేట్ చెప్పింది. ఆపరేషన్ జరిగింది…ఆ కంతి కేన్సర్ కాదు. కాస్త పెద్ద కంతి డాక్టర్ ఆపరేషన్ చేసి […]

Continue Reading
Posted On :

వసంత కాలమ్ -5 అతిథి వచ్చి ఆకలంటే

అతిథి వచ్చి ఆకలంటే -వసంతలక్ష్మి అయ్యగారి మాపక్కగుమ్మమే  ఓ పేరున్న డయాగ్నోస్టిక్ సెంటరు..నూతనంగా వెలసిన వైద్యపరీక్షాలయం…మనకి గుడి తోసమానం.. గుడ్డిలో మెల్లన్నట్టు …అదో ఆనందం…ముఖ్యంగా తెల్లారుతూనే పరకడుపున చేయించుకోవలసినరక్తపరీక్షలువంటివాటికి   చెప్పలేనిదాహాయి! రక్తహీనత,ఎముకసాంద్రత,సంపూర్ణ రుధిర చిత్రం..ఇలా ఓనాలుగు పరీక్షలకి, నాలుగువేలు వారికిచ్చి…స్కూల్ లో లాగా  క్యూ క్రమశిక్షణ పాటించి రక్తనమూనా స్వీకర్త వద్దకూర్చుని వారడిగిన హస్తాన్ని వారికే చాచి ఇవ్వడం..పిడికిలిబిగించి,కనులు గట్టిగా మూసుకొని బలిసిన చేయిలో నరందొరకక ఆవిడ నొక్కులకు,సన్నాయినొక్కులకు అసహనంఅసంపూర్ణంగా వ్యక్త పరచడం..పరిపాటి.ఇన్ని పరీక్షలుకనుక  హోల్సేల్ గా కాస్త యెక్కువగానే గుంజివుంటారునారక్తం..పైకంలాగే.. ఏం శిక్షణ తీసుకుంటారోగానీ..రక్త సేకరణ ఘడియల్లో మనలను ఏమార్చడం కోసం..ఒక్కొక్కరిదీ  ఒక్కోవైనం. నాకు దొరికిన మహిళామణి, ముసుగులో మునిగి పోయి నేత్రద్వయాన్ని మాత్రం   ప్రదర్శించుకుంటున్నముసలమానుభామ! ఈ ఘట్టం నాకు త్రైమాసిక  పండగే ! నాక్రితం విజిట్ లో కూడా ఆవిడే లాగినట్టు గుర్తు.అందుకనేమో  నన్ను హలో..కైసేహై? అని పలకరించింది.నేనూ ఆబీబీ కినా సలాము చెప్పాను. చెయ్యి..ఇయ్యి…మడుచు..ముడుచు..మామూలే..సిరంజి గుచ్చుతూ…మాటల్లో పెట్టింది,అదీ మామూలే.. “జరా వెయిట్ జ్యాదా పుటాన్ కియే క్యా…? అంది. “ హాఁ..బిల్కుల్ .. థేరాయిడ్ ఠీక్ నహీ హై షాయద్”అనేశా. ఇంతలో ఈ నారీ మణి నాడీని నరాలను వెతికి పట్టింది.ఇంకేముంది…మాటలు పెంచి..లోతుగా దించుటే..దృష్టిమరలుస్తూ ఆవిడన్నమాటలు ఉభయతారకంగా తెలుగులోరాస్తానేం..జరిగినది ఉర్దూలోనైనా. నేను మిమ్మల్ని రోజూ మీ బాల్కనీలో వాకింగ్ చేసే టపుడు చూస్తుంటా. చానా సార్లు చెయ్యిఊపి హాయ్ చెప్పినా. మీరు భీనవ్వినార్ . కానీ నేను మీకు తెల్వ కుండచ్చు..బుర్ఖా ఉందికదా. మీ ఇంటి ముంగల రోజూ మామిడి పళ్ళ బండిఉంటదికదా. అక్కడ కొన్కోని మీదగ్రా వచ్చీ తిందామనుకున్నా. అంటూ తలతోక లేకుండా  అర్థంపర్థం కాకుండాపరభాషలో పలుకుతూ పోయింది. నాకు సగంఎక్కలేదు..ఒక పక్క పీకేస్తున్నందుకేమో తెలియదు. అయినా నా సహజ శైలిలో  పక్కనే కదా,ఎటువంటిఅవసరముదన్నా రండి మాయింటికి. లంచ్కి కూడారావచ్చునన్నానను కుంట..రెండోసారి చూపులు కలసినందుకే. అదీకేవలం చూపులేఅని చెప్పాగా ! బురఖా బీబీ కనక  రూపురేఖలు  రూల్డౌట్!వెనక బోలెడుమంది క్యూలో వెయిటింగూ. ఐనా యీవిడ ఓచక్కని scribble pad తీసుకుని  friends are always better than relatives అనే అర్థమొచ్చేలా ఏదోగొణుగుతూ నా సెల్ నంబర్ తీసుకుంది. నిరభ్యంతరంగా యిచ్చా! రాత్రి తొమ్మిదికి మావారే వెళ్ళి తెచ్చిన రిపోర్టులను ఎంసెట్ రిజల్ట్ లెవెల్లో కిందాపైనా చూసేశాం. సరిగ్గా నోరుతిరగని పేరుగల ఆ బీబీగారు, ఒకేఒక్క రోజు gap లోపదకొండింటివేళ నాకు ఫోను. “నాకు మీ దీ ఫేవర్ కావాలి,మీయింటికి లంచ్కీ వస్తాన్, ఒకటిగంట కొట్టినంకా. నాకు డబల్ డ్యూటీ పడిందిజీ, నాకోసం యిస్పేషల్ యేదీ భీ వండొద్దు, మీరు చేసినదేది ఉంటే అదేసాల్…ఐదు మినట్కూడా కూసోనూ” అన్నది. దానిదేముందీ  నావంట పదింటికే పూర్తవుతుంది కనక ఫ్రెష్ గా కాస్త అన్నం వండి పిలవచ్చులే అనుకుంటూనేఉన్నా..మనసు దానిపని అది చేస్తూ పోతోంది. కాస్త అజీబ్ గా,వింతగా,కొద్దిగా భయంగా…పిసరంత ఫన్నీగా ఎవరబ్బా ఈ అజ్నబీ అంటూ ఏంటేంటో మిశ్రమభయాలు,భావాలమధ్య అన్నం వండడమేకాక అలంకరణలుకూడా ఆరంభించా. ఇంతలో వచ్చేసా  మీ గేటులోకంటూ కాల్ రానే వచ్చింది. తలుపు తెరచి మెట్లెక్క మని చెప్పి లోపలికొచ్చా. అమ్మగారువేంచేశారు.”ఆయియేఆయియే..” అంటూ సాదరంగా నేను ఆహ్వానించాను. “ముందు నీ పేరు స్పెల్లింగుతో పాటూ చెప్పుమహాతల్లీ”అన్నాను.అమ్తుల్ హజీజ్ అన్నట్టనిపించింది.  వస్తూనే  “సారీ!  నేన్ లోపల్ రాను. నాకు ఈ డబ్బాలో ఏమేస్తావో వేసెయ్,టైమ్లేదు,పేషంట్ వెయిటింగ్,యేమనుకోవద్దూ ….ప్లీజ్అంటుంటే, వడ్డనకు సిద్ధంచేస్తూ నేను పడిన శ్రమకి  నాకు  చిరాకు కలిగింది. అయ్యో ..అదేమిటీ,,తినడానికికూడా తీరిక లేదా   అదెక్కడి ఆఫీసూ?  లోపలికైతే రాతల్లీ అన్నాను. చాలాసంకోచిస్తూ  డైనింగ్టేబుల్ దగ్గరకొచ్చింది.  కంచంలో కప్పులవారీగా అమర్చడమూ చూసింది. వసంతాజీ,  మీతో చాలాచాలా చెప్పుకోవాలీ.కానీ యిపుడుకాదూ అని రక్షించింది.  ఒక మాదిరి పెద్దసైజు ప్లాస్టిక్ డబ్బాతెరిచి కలగూరగంపలా అన్నీ  యిందులోపడేయండి అంటే నేను ఆపనే చేశాను. అన్నమూ,దానిమీదమామిడికాయపప్పు,వంకాయకారంపెట్టినకూర,టమాటా పచ్చడి…వేసి, వేడిచేసిరెడీగా పెట్టిన రసంమాటేమిటీ    పాపం వాళ్ళు రసంఅనబడే ఈ చారు చేసుకుంటారో లేదోకదా  అని గాబరా పడుతూ కాలూచేయీఆడనంత కంగారుపెట్టేస్తుండడంతో   నాకు ఏమీ తోచని పరిస్థితి! ఇంకా కొత్తావకాయబద్ద వెయ్యాలని ఆరాటం. కుచ్ డిస్పోసబుల్ హైతో ఉస్మే దాల్దో మేడమ్.  (నేనలాగే నీళ్ళసీసాలో పోసిచ్చాను రసం). ఫిర్భీ మీరు అన్ని రకాలు ఇస్తున్నారుమేడమ్..అంత వద్దు,ఇంటి తిండి తిని పదిదినాలైంది  అంటూ..దుఃఖాన్నిదిగమింగుతూ   బురఖా ముసుగు పైకెత్తి కన్నీరు తుడుచుకున్న పుణ్యఘడియల్లో వారిముఖారవిందం నామదిలో ముద్రించేసుకున్నాను..అంతకుమించి..పెద్దగా పర్సనాలిటీ…[మిడిలేజ్అనితప్ప] మరేమీతెలియలేదు. అదేమిటీజీ   లంచ్ అవర్ కూడా యివ్వరా  మీ దగ్గరా..యెంతిస్తారసలుజీతం..ఇస్తారా అదీ ఎగవేతేనా..అయినాసెక్యూరిటీకి చెప్పి హోటల్నుండీ తెప్పించుకుంటే..తప్పా…టూమచ్..అంటూ చిటపటలాడాను. “ఏంచెప్పమంటారు  మేడమ్, మీతో బహుత్కుచ్బోల్నాహై” అంది అమ్మో..గుండెగుటుక్కుమందినాకు..ఉన్నకతలకే తలలో చోటుసరిపోవడంలేదని సిగ్నల్స్ వస్తుంటే  ఇదేంగోల..వద్దుతల్లీ..అని అచ్చతెలుగులోకచ్చితంగా నాతోనేననుకున్నాను. “ఎనిమిదివేలిస్తారు..నాకు ఇద్దరుపిల్లలు.మా సిస్టర్కిచ్చేసినా.  నాది  పూరా  పైసల్వారికొరకే. సబ్కుచ్ యిచ్చేస్తాన్, నేను ఫారిన్ రిటన్వుందీ”అంది. “మరింకేం..మీఆయనెక్కడా..?” ఆమెదుఃఖం ద్విగుణీకృతమైంది.  కన్నీరు కాల్వలుకట్టకుండా తమాయించుకుంది. యింతలో నేను నా ఉర్దూ హిందీమిశ్రమ్ భాషా ప్రావీణ్యం ప్రదర్శిస్తూ. “క్యా ఆప్కే పతీజీ గుజర్గయే..? “అని నోరు జారేశా..ఏడుపుచూసనుకుంట.. “నైనై,  కళ్ళు తుడుచుకుంటూ..హైహైఉనోహై,  లేకిన్,  క్యా బతావూఁ..చాలా చెప్పేదివుందీజీ..”అంది.. చాలా వద్దులేతల్లీ..అని స్వగతంలోనేనుమళ్ళీ.. మీరు టీవీలలో చూసేదీ చాలా తక్వ వుందీ.  నాదీ కష్టాల్ ఎవర్కీ భీ వద్దు అంది. ఓ.అలాంటివా…అనుకుంటూతలూపాను, […]

Continue Reading

జానకి జలధితరంగం-9

జానకి జలధితరంగం-9 -జానకి చామర్తి అహల్య ఏకాంతవాసము ఏకాంతవాసము ( ఐసోలేషన్) . ప్రస్తుతం ఈ మాట ఎక్కువ వినిపిస్తోంది. తమని తాము వ్యాధి నుంచి విముక్తి పొందడానికి,  పరిరక్షించుకోవడానికి , మిగతావారికి కూడా మాటల ద్వారానూ తమ నడవడిక ద్వారా సోకకుండా ఉండటానికి విధించుకున్న  ఒక నియమము . ఆ వ్యాధి ఎటువంటిదైనా కావచ్చు గాలిలా తాకేది కావచ్చు , స్పర్శ తో అంటేది కావచ్చు , బలహీనమై మనసును కట్టుపరచుకోలేక సామాజిక దూరాన్ని లేదా […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-11

కనక నారాయణీయం -11 –పుట్టపర్తి నాగపద్మిని తెలుగు సాహిత్య చరిత్రలో మునుపెన్నడూ వినని కనని సందర్భమిది!! ఒక కవి, తాను వ్రాసిన కావ్యాన్నే, తాను విద్యార్థిగా చదవి, పరీక్ష వ్రాయవలసి రావటం ఎప్పుడైనా జరిగిందా?? ఈ వార్త క్షణాలమీద ప్రొద్దుటూరు సాహిత్య లోకంలో పాకి పోయింది. ఏమిటేమిటీ?? పుట్టపర్తి నారాయణాచార్యులనే యువ కవి వ్రాసిన కావ్యం, విద్వాన్ పరీక్షకు పాఠ్యాంశంగా ఉండటమేమిటి?? అతడు ప్రొద్దుటూరు వాసి కావడమేమిటి?? పైగా అతడే విద్వాన్ పరీక్షలు హాజరుకాబోతుండటమేమిటి?? అన్నీ ఉత్కంఠభరితమైన […]

Continue Reading

జ్ఞాపకాలసందడి -13

జ్ఞాపకాల సందడి-13 -డి.కామేశ్వరి  కరోనా  …హహ …కరోనా తాత వచ్చినా  భారత జనాభాని  ఏమి చెయ్యలేక తోకముడిచి  పారిపోతుంది. కుళ్ళు కాళ్లతో కుళ్ళునేలమీద పానీపూరి  పిండి తొక్కి తొక్కి మర్దించే పానీపూరీలు లొట్టలేసుకుతింటం, బండిమీద ఆకుకూరలమ్మేవాడు డ్రైనేజీ వాటర్ లో ఆకుకూరలు కడిగేసినా చూస్తూ కూడా కొనేసి వండేసుకుంటాం, రోడ్డుసైడ్ బండిమీద టిఫిన్ లు సప్లై చేసేవాడు  ఎంగిలి ప్లేట్లు రోడ్డుమీద కుళ్ళుగుంటలో కడిగేసినా ఎగబడి తింటాం, చెత్తకుప్పలమధ్య ఆవాసముండే కోట్ల జనాభా పందులమధ్య హాయిగా బతికేస్తారు, […]

Continue Reading
Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- నా నీలి ఎవాన్ యెస్ ఎల్ ఆర్ సైకిల్

ఇట్లు మీ వసుధారాణి నా నీలి ఎవాన్ యెస్ ఎల్ ఆర్ సైకిల్ -వసుధారాణి  కోతికి కొబ్బరికాయ ఇస్తే ఏమవుతుందో , నా చేతికి క్షమించాలి కాలికి సైకిల్ ఇచ్చాక మా ఇంట్లో వాళ్ళకి తెలిసొచ్చింది.”అందుగలడిందులేడను సందేహము వలదు” లాగా మా బుల్లి టౌన్ లో ఎక్కడ చూసినా నా నీలి సైకిల్ తో,హిప్పీ జుత్తుతో,బోలెడు నిర్లక్ష్యం తో నేనే కనిపిస్తూ వుండేదాన్ని. ఒక బజారులో పని ఉంటే మరి రెండు బజార్లు అదనంగా తిరిగి వచ్చేదాన్ని.నాకు […]

Continue Reading
Posted On :

చిత్రం-14

చిత్రం-14 -గణేశ్వరరావు   లాండ్స్కేప్ పెయింటర్స్ ఉన్నప్పుడు సీస్కేప్ పెయింటర్స్ కూడా ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? అసలు  ప్రకృతి దృశ్యాలలో కనిపించేవే  మూడు ప్రధాన దృశ్యాలు : నేల , నీళ్లు, కొండలు!    ఈ  మూడిటినీ కలిపి గీసిన బొమ్మలు ఎన్నో ఉంటాయి. కేవలం కడలిని చిత్రించే చిత్రకారిణులు ఉన్నారు. వారిలో చెప్పుకోదగ్గ ఆర్టిస్ట్ – ఫీబీ సొండెర్స్ . ఆమె చిత్రాల్లో కనిపించే అలల వయ్యారం మనల్ని సమ్మోహితుల్ని చేస్తుంది. సముద్రం ఒడ్డున నిల్చున్న […]

Continue Reading
Posted On :

షర్మిలాం“తరంగం”-14

షర్మిలాం “తరంగం” -షర్మిల కోనేరు  వెంటాడే అపరిచితులు జీవనయానం లో మనకు తారసపడే అసంఖ్యాక జనప్రవాహంలో కొందరుజీవితాంతం గుర్తుండి పోతారు. ఒకపోర్టర్, డ్రైవర్ , రిక్షావాలా ఎవరైనా కావచ్చు.వాళ్ళు చేసిన ఉడతసాయం జీవిత కాలం తలపుల్లో మిగిలిపోతుంది. సహ ప్రయాణీకులు గమ్యంవచ్చినాక దిగిపోతారు. కానీకొందరు మాత్రం మన మనసులో తిష్ట వేసుకుంటారు .ఇలాంటి అనుభవాలు అందరికీవుంటాయనుకుంటాను. మా నాయనమ్మ ఏడేళ్ళ చిన్నపిల్లగా వున్న నన్ను వెంటబెట్టుకుని వెస్ట్ బెంగాల్ దగ్గర అస్సాం అనుకోండి ఒంటరిగా బయల్దేరింది. మాకు […]

Continue Reading
Posted On :

రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-2

రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-2 -సి.రమణ  బుద్ధ గయలో, నెరంజరా నది ఒడ్డున, ఒక రావి చెట్టు క్రింద జ్ఞానోదయం కలిగింది  సిద్ధార్థు డికి. ప్రజల వేదనలకు, బాధలకు హేతువు కనుగొన్నాడు. వాటికి మూల కారణం తెలుసుకున్నాడు. దాని నివారణ మార్గం ఆవిష్కృతమైన తరువాత, తాను తెలుసుకున్న సత్యాలను, ప్రజలకు బోధించి, వారి  బాధలను తొలగించి, వారికి ముక్తిమార్గం  చూపించాలని అనుకున్నాడు. కానీ  అవి  సామాన్య ప్రజలకు అర్థం అవుతాయా, అని సందేహం కలిగింది. ఈ సత్యాలు ముక్తికి […]

Continue Reading
Posted On :

పునాది రాళ్ళు-13

పునాది రాళ్లు-13 -డా|| గోగు శ్యామల   కుదురుపాక రాజవ్వ కథ అదో కల్లోల దశాబ్దం .  గడిచి  యాబై నాలుగు సంవత్సరాలు  ఆ  తరువాత  ఆ భూమంతా  నీటి పారుదల ప్రాజెక్టు కింద  మధ్య మానేరు నది లో మునిగిపోయింది.    భూమి కథ అలా ముగిసింది. ఈ భూమి కథలో కుదురుపాక గ్రామ ప్రజల జీవితాలతో సహా  రాజవ్వ జీవితం కలసిపోయి ఉన్నది.  ప్రత్యేకంగా   చెప్పాలంటే  రాజవ్వ కథలో భూమి కథ, భూమి కథలో […]

Continue Reading
Posted On :

అమ్మకు అరవైయేళ్ళు

అమ్మకు అరవైయేళ్ళు -రాజన్ పి.టి.ఎస్.కె ఈ కథానాయకురాలికి ఈరోజుతో అరవై ఏళ్ళు నిండాయి. ఈవిడకు తన 22వ యేట నుంచీ ఈ వ్యాస రచయిత తెలుసు. అసలు ఈ వ్యాస రచయితకు తన అసలు పేరేంటో తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. కారణం ఈ కథానాయకురాలే. ఎప్పుడూ కన్నయ్యా అనో, నా బంగారుకొండా అనో, పండుబాబూ అనో పిలుస్తుండేది. అందుకే అతని చిన్నతనంలో ఎవరైనా “నీ పేరేమిటబ్బాయ్?” అని అడిగితే… అసలు పేరు ఆ ముద్దు పేర్ల […]

Continue Reading

పూర్ణస్య పూర్ణమాదాయ.. (విలియం డాల్ రింపుల్-నైన్ లైవ్స్ నుంచి)

https://www.youtube.com/watch?v=D6_AGuFTSmA పూర్ణస్య పూర్ణమాదాయ… -లక్ష్మణశాస్త్రి                  అర్ధరాత్రి కావస్తోంది. కొండలమీదనుంచి మత్తుగా జారిన పున్నమివెన్నెల యేటి నీటిమీద వులిక్కిపడి, ఒడ్డున ఉన్న పంటపొలాలూ, ఆ వెనక వున్న రబ్బరు తోటలసందుల్లోకి విచ్చుకుంటోంది. ఎటుచూసినా వెన్నెల వాసన. కొంచెం ఎడమగా ఉన్న కొబ్బరి తోటల్లో వెలుగుతున్న  ఆ మంటలోకి కర్పూరం ముద్దలు ముద్దలుగా కురుస్తోంది. చుట్టూ వందల్లో వేలల్లో జనం. ఆత్రంగా ఎదురుచూస్తున్నారు అమృతం కురిసే వేళకోసం. ఏడాదికోసారి […]

Continue Reading

ఒక భార్గవి – కొన్ని రాగాలు -5 ( హంసధ్వని)

ఒక భార్గవి – కొన్ని రాగాలు -5  హంసధ్వని -భార్గవి హంస యెలా వుంటుందో చూసిన వారు లేరు,కానీ దాని చుట్టూ అల్లుకున్న కథలెన్నో! సరస్వతీ దేవి వాహనం రాజహంస.బహుశా అది చేసే ధ్వని యే హంసధ్వని అనే భావనతో ఒక రాగం పేరుగా పెట్టి వుండొచ్చు హంసని  ,ఒక పవిత్రతకీ,ప్రేమకీ ,అందానికీ,ఒయ్యారానికీ ప్రతిరూపం గా భావిస్తారు.ఆత్మ ,పరమాత్మ లకి హంసని ప్రతీక గా వాడతారు,ఎవరైనా ఈ లోకం నుండీ నిష్క్రమిస్తే “హంస లేచిపోయిందంటారు”.ఒక కళాకారుడో,ఉన్నతమైనవ్యక్తో తన […]

Continue Reading
Posted On :

నెచ్చెలికి ఆత్మీయ వాక్యాలు

“నెచ్చెలి”కి  ఆత్మీయ వాక్యాలు నెచ్చెలి ప్రథమ జన్మదినోత్సవం సందర్భంగా నెచ్చెలి రచయిత్రు(త)లు అందజేసిన ఆత్మీయ స్పందనలు ఇక్కడ  ఇస్తున్నాం: మా గీత : నెచ్చెలి మా గీతకు బాల్యం నుంచి అనుకున్నదేదైనా సాధించి తీరడం అలవాటు. స్వదేశంలో రెండుభాషల్లో పి.జి. చెయ్యడం, ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో డిప్లొమా, నెట్ పాసై చిన్నవయసులోకే లెక్చరర్ కావడం, తర్వాత డాక్టరేట్ చెయ్యడం, ఉద్యోగం చేస్తూనే  గ్రూప్-1 సాధించడం ఇలా ఎన్నెన్నో. తల్లిగా మా అమ్మాయి గొప్పలు నేను చెప్పుకోకూడదు. తన పరిజ్ఞానాన్ని […]

Continue Reading
Posted On :

మా నాన్నగారు

మా నాన్నగారు -రాజన్ పి.టి.ఎస్.కె “ఓరేయ్ డాడీ! నువ్వు మీ అమ్మ పార్టీయా? నా పార్టీయా?” మా నాన్నగారి ప్రశ్న. “నేను అమ్మ పార్టీనే” క్షణం ఆలస్యం చేయకుండా, అమ్మను వాటేసుకుని మరీ ఖరాఖండీగా చెప్పేసేవాడిని. అప్పుడు మా అమ్మ “నా బంగారం” అంటూ నన్ను ముద్దు పెట్టుకునేది. అప్పటికే మా అక్క, మంచం మీద కూర్చున్న మా నాన్నగారి మెడ చుట్టూ వెనకనుండి చేతులు వేసి ఊగుతూ ఉండేది; నన్నా ప్రశ్న అడగాల్సిన అవసరమే లేదన్నట్టు […]

Continue Reading

రాగో(నవల)

రాగో (నవల)  – సాధన సృజన ప్రచురణలు, మలుపు బుక్స్ సౌజన్యంతో “నెచ్చెలి” పాఠకుల కోసం ప్రత్యేకంగా “రాగో” నవలను ఈ నెల నుండి ధారావాహికగా అందిస్తున్నాం.  అడగగానే “రాగో” నవలను ప్రచురించడానికి సమ్మతించిన శ్రీ ఎన్. వేణుగోపాల్ గారికి, శ్రీ బాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు. *** “రాగో అంటే రామచిలుకే గాని పంజరంలో చిలుక కాదు. అర్థం లేని కట్టుబాట్లను మనస్సు లేని మనువును ఎదిరించి, అడవిలోకి, అక్కడి నుంచి ఆశయంలోకి పయనించిన వీరవనిత. […]

Continue Reading
Posted On :

కోపం లేని మనుషులపై కనికరం లేని దేశం

కోపం లేని మనుషులపై కనికరం లేని దేశం -సి. వనజ హైదరాబాద్ లో వలస శ్రామికుల సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవంతో మొత్తంగా వలస శ్రామికుల సమస్యలో ఇమిడి ఉన్న కోణాలను చర్చిస్తున్నారు సి. వనజ-  దేశంలో కోవిడ్ కేసులు 340 ఉన్న రోజే తెలంగాణాలో జనం మీద లాక్ డౌన్ బాంబు పడితే మరో రెండు రోజులకు అది దేశమంతా పడింది. ఒక డిమానెటైజేషన్ లాగా, ఒక జిఎస్టీ లాగ ఇది కూడా ముందూ వెనకా […]

Continue Reading
Posted On :

అరచేత మాణిక్యము & శ్రీమతి కె.వరలక్ష్మి గారితో ముఖాముఖి

అరచేత మాణిక్యము  శ్రీమతి కె.వరలక్ష్మి గారితో ముఖాముఖి- -చంద్రలత నాజూకైన ‘గాజు పళ్ళెం’లో, ‘మట్టినీ బంగారాన్ని’ ఒకేసారి వడ్డించేసి, లయతప్పిన ‘జీవరాగాన్ని’ శృతి చేస్తూ , ఏమీ ఎరుగని ‘పాప’లా, వరలక్ష్మి గారు నిమ్మళంగా నిలబడి, ఫక్కున నవ్వేయగలరు కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లేలా! గోదావరి మన్యం అంచుల్లో, పాడిపంటల నడుమ  విరిసిన పల్లె మందారం వరలక్ష్మి గారు. చిన్నతనాన వెన్నమీగళ్ళ గోరు ముద్దలను అమ్మ బంగారమ్మగారు తినిపిస్తే, నాన్న వెంకట రమణగారు పుస్తకలోకాన్ని రుచి చూపించారు. ఆ […]

Continue Reading
Posted On :

ఉత్తరాలు-ఉపన్యాసాలు-5 (అబ్రాహం లింకన్ & స్వామి వివేకానంద)

ఉత్తరం-5 “స్కూల్ టీచర్ కు అబ్రహం లింకన్ రాసిన ఉత్తరం” ఆంగ్ల మూలం: అనానిమస్ స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి   నేపథ్యం: అమెరికా 16 వ అధ్యక్షుడు, అబ్రహం లింకన్ తన కుమారుని స్కూల్ టీచర్ కు రాసినట్లుగా చెప్పబడుతున్న ఈ లేఖ ఇంటర్నెట్ లో…. సోషల్ మీడియాలో చాల ప్రాచుర్యం పొందింది. కానీ…. అమెరికాలోని పేరొందిన పత్రికలకు వ్యాసాలు రాసే ప్రముఖ పాత్రికేయుడు ….. జోనాథన్ మిటిమోర్ …. ఈ ఉత్తరం లింకన్ […]

Continue Reading

వసంత కాలమ్ -4 పామరపాండిత్యం

పామరపాండిత్యం -వసంతలక్ష్మి అయ్యగారి పదిరోజులుగా లోసుగరనీ,హైసాల్టనీ..డాక్టర్ వద్దకి చక్కర్లుకొట్టానే తప్ప,యింటిగడపేకాదు..పక్కదిగి ఐపాడూ పట్టుకోలేదు.కాలుకదపనిదే కబుర్లెలా వస్తాయిచెప్పండి..పదిరోజులుగా పనమ్మాయే నాలోకం! నెల్లాళ్లుగా దానిది ఒకటే గోడు..యిల్లుఖాళీచేయాలనీ..మరోయిల్లు వెతుక్కోవాలనీ!నెలలో మూడుసార్లుశలవు చీటీ యివ్వడమూ..చివరినిముషంలోతేడాలొచ్చి డ్యూటీ కి వచ్చేయడం జరిగింది…నాకు pleasant surprise లనమాట! ఓరోజు మాయిల్లూడుస్తూ…అమ్మా..మంచిరోజెప్పుడోచెప్పరా…అంది!ఎందుకనంటే…యిల్లు యెదుకుడు మొదలుపెట్టనికీ..అంది. ఇల్లుమారేరోజు కి…పాలుపొంగించుకోవడానికి మంచిరోజుచూడాలితప్పితే…వెతుక్కోడానికి కాదుపద్మా..అని చెప్పాను. చివరాఖరుకి ..ఓగది..వంటిల్లు,బాత్రూమ్ఉన్నబుజ్జిపోర్షన్, బేచిలర్స్ ఖాళీ చేయగా అయిదువేలకి తీసుకుని ముహూర్తం పెట్టించుకుందినాతో!రెండురోజులశలవడిగి..వాళ్లపాపను పంపినన్ను తప్పక తనకొత్తింటికి తోలుకరమ్మంటాననిపదేపదే చెప్పింది.అలాగేవస్తాలేఅన్నాను. పద్మమంచి ప్లానర్..చాలా క్రమశిక్షణ […]

Continue Reading

ఒక భార్గవి – కొన్ని రాగాలు -4 (మలయమారుతం)

ఒక భార్గవి – కొన్ని రాగాలు -4 మనసా ఎటులోర్తునే —-మలయమారుతం -భార్గవి మనసు గుర్రము రోరి మనిసీ మనసు కళ్లెము పట్టి లాగు అన్నాడో మహా రచయిత కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు ఊహల ఉయ్యాలవే మనసా మాయల దయ్యానివే అన్నాడింకో రచయిత అయితే త్యాగరాజ స్వామేమన్నాడు మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే —అంటూ దినకర కులభూషణుడైన రాముని సేవ చేసుకుంటూ దినము గడుకోమంటే వినవెందుకూ గుణవహీన అని విసుక్కున్నాడు ఇంకా […]

Continue Reading
Posted On :

జానకి జలధితరంగం-8

జానకి జలధితరంగం-8 -జానకి చామర్తి ఉత్తర మడచిపెట్టిన పువ్వుల పొట్లం లాటివారు ఆడపిల్లలు. యుక్తవయసు వచ్చేటప్పటికి పొట్లం విచ్చి వాసనలు వెదజల్లినట్టు , ఆశలు పరిమళిస్తాయి.  ఈ విచ్చుకునే కలలు కోరికలకి పేదా గొప్పా భేదాలు లేవు, ఉద్యోగి నిరుద్యోగి అనే తారతమ్యం లేదు , లోకం చూసిన ధీర  అమాయకపు ముగ్ధ అనే వేరు భావమూ లేదు. కన్నెపిల్ల కలలు అందరకీ సమానం గానే కలుగుతాయి. కాలం సమయమూ తేడా.. అది అప్పుడెప్పటికాలమో, ఇది ఇప్పటి […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-10

కనక నారాయణీయం -10 –పుట్టపర్తి నాగపద్మిని ప్రొద్దుటూరిలో, సుందరాచార్లు వీధిలో మా మాతామహులు శ్రీ ధన్నవాడ  దేశికాచార్య పనిచేస్తున్న  ప్రాథమిక పాఠశలలోనే పని చేస్తున్న కేశవమ్మ టీచర్ (బ్రాహ్మణేతరురాలు) మా అమ్మమ్మ శేషమ్మగారికి చాలా మంచి స్నేహితురాలట!! శేషమ్మ గారికేకష్టం వచ్చినా ఆమె తక్షణం ఆదుకునేదట!! కులం వేరైనా, గుణం బట్టి మాత్రమే ఆనాటి స్నేహాలు ఉండేవని, దీనివల్ల తెలుస్తున్నది కదా?? శేషమ్మగారికి ఎప్పుడూ ఒకటే చింత!! భర్త దేశికాచార్యులవారి తండ్రి గారు ధన్నవాడ రాఘవాచార్యులవారు కాకలు […]

Continue Reading

కొత్త అడుగులు-11 (జ్యోతి నండూరి)

కొత్త అడుగులు – 11 – శిలాలోలిత జ్యోతి నందూరి మరణించిందన్న వార్తను నమ్మలేకపోతున్నాను. నవ్వూతూ, తుళ్ళుతూ, సౌమ్యంగా, స్నేహంగా కనిపించే  ఈ కవయిత్రి ఇలా తన జీవనగీతను కోల్పొతుందని తెలీదు. ‘కాలంగీసిన చిత్రం’ అనే కవితా సంపుటి 2017 లో తీసుకొచ్చింది. చాలా అద్భుతమైన కవిత్వముంది. నర్సింగ్లో యం.ఫిల్ కూడా చేసింది. ఈకోర్సు క్లిష్టమని అతి తక్కువమంది చేస్తారు. దాన్ని తాను సాధించింది. ఇద్దరు పిల్లలూ, భర్త, కవిత్వమూ ఆమె వెంటే నడిచాయి. హఠాత్తుగా బ్రెయిన్కి ఏదో […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -12

జ్ఞాపకాల సందడి-12 -డి.కామేశ్వరి  మనం నాలుగు ఐదు వారాలకే lockdown  భరించలేక , ఆపసోపాలు పడిపోతూ బందిఖానాలో  ఉన్నట్టు గిల గిలాడిపోతున్నాం , స్వేచ్ఛ కోల్పోయిన ఖ్యదీల్లాగా ఫీల్ అవుతూఎప్పటికి  విముక్తి అన్నట్టు ఎదురు చూస్తున్నాం . అలాటిది  రెండేళ్లు బయటి ప్రపంచం మొహం చూడకుండా, ఒక పెద్ద అటక  (annex ) మీద ప్రాణభయంతో  రెండు కుటుంబాలు ఎనిమిదిమంది సభ్యులు దాక్కుని ఎవరికంటా బడకుండా , అనుక్షణం భయంతో , గట్టిగ మాట్లాడకూడదు , శబ్దాలు […]

Continue Reading
Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- గవాక్షం

ఇట్లు మీ వసుధారాణి      గవాక్షం -వసుధారాణి  గులాబీ నగరం అదేనండి మన జయపూర్ వెళ్ళినప్పుడు హవామహల్  ముందు నుంచుని కిందనుంచి అన్ని కిటికీలతో నిండిన ఆ కళాత్మకమైన గోడని చూసినప్పుడు,ఒక ఆనందం,ఒక విషాదం ఒకేసారి తోచాయి.ఆనందం మన కళాకారుల ప్రతిభకి, విషాదం ఆ రాణీవాసంలోని రాణులందరి పట్ల.విషాదం అని ఎందుకు అంటున్నాను అంటే కేవలం కిటికీ నుంచి కనపడేదే వారి బయటి ప్రపంచం.బయట వైపునుంచి వారి కిటికీలు ఎంత అందంగా ఉన్నా ,సన్నని కన్నాలే […]

Continue Reading
Posted On :

బి.వి.ఎస్ భానుశ్రీ -నివాళులు

బి.వి.ఎస్ భానుశ్రీ -నివాళులు -లక్ష్మీ వసంత నివాళి .. మా భాను నాకు మా దొడ్డమ్మ కూతురు. తన హఠాన్మరణం మమ్మల్ని షాక్ చేసి షేక్ చేసింది.అదేమిటి ఇంకా తన పిలుపు నందుకున్న మేం తాను ఎంతో ప్రియంగా  ‘ కట్టుకున్న గూడు ‘ , దయాల్ బాగ్లో తన ఇంటికి వెళ్లి చూడనే లేదు , నార్త్ అంతా చూద్దాము అనే ఆహ్వానం మేం మన్నించనే లేదు , ఎన్నెన్ని ఊహలు , ఎన్నెన్ని ఆశలు […]

Continue Reading
Posted On :

రాతిపరుపు (మార్గరెట్ ఎట్ వుడ్ కథ)

తెనిగీయం  రాతిపరుపు(కథ) ఆంగ్ల మూలం: మార్గరెట్ ఎట్ వుడ్ స్వేచ్ఛానువాదం: అరుణజ్యోతి   వెర్నా ఎవరినీ చంపాలనుకోలేదు మొదట. ఆమె ధ్యాసంతా కేవలం విహారయాత్రను ఎలా ఆస్వాదిద్దామన్నదానిపైనే. ఆర్కిటిక్ వాతావరణం కూడా ఆమెను ఉత్సాహపరుస్తోంది. తనతో పాటు విహారానికి వచ్చిన వారిని… ప్రత్యేకించి మగాళ్లను ఒక్కసారి పరికించింది. ఇన్నేళ్ల జీవితంలో తనతో పరిచయానికి తహతహలాడిన వారు చాలామందే వున్నారు. పాత అలవాట్లు అంత త్వరగా వదలవు మరి. అందుకే ఆ షిప్ డెక్ పై చేరిన వారిని ఆసక్తిగా […]

Continue Reading
Posted On :

చిత్రం-13

చిత్రం-13 -గణేశ్వరరావు   నిత్య జీవితంలో మనకు కనిపించే ప్రకృతి దృశ్యాల్లో అత్యంత ఆకర్షణీయమైనవి – సూర్యాస్తమయాలు! సూర్యాస్తమాయల దృశ్యాలను ప్రత్యక్షంగా చూడటాన్ని మించినది – పగిలిన అద్దం లో సూర్యాస్తమయ ప్రతిబింబాన్ని చూడటం! ఇదో అపురూప అనుభవం.. అమెరికన్ ఫోటోగ్రాఫర్ బింగ్ రైట్ కి అస్తమిస్తున్న సూర్యుడి అందo అద్దం ముక్కల్లో ప్రతిబింబిస్తూన్నప్పుడు తన కెమెరా కన్నుతో చూస్తూ బంధించడం అంటే మోజు, తానూ తీసిన సీరీస్ కు ‘పగిలిన అద్దం : సాయం సంధ్యలో […]

Continue Reading
Posted On :

ప్రమద – జయశ్రీ నాయుడు

జయశ్రీ నాయుడు –సి.వి.సురేష్  ప్రముఖ రచయిత్రి, జయశ్రీ నాయుడు గారిని నెచ్చెలి కి పరిచయం చేయాలని, ఆమెతో కాసేపు మాట్లాడాను… ఆమె గురించి ఆమె మాటల్లోనే విందాం..! “నా పేరు జయశ్రీ నాయుడు.అమ్మ పేరు సీతారత్నమ్మ, నాన్నగారి పేరు బ్రహ్మా రావు. నాన్న గారికి ఆంధ్రా స్పెషల్ పోలీస్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా ఉద్యోగం. అందువలన ఉమ్మడి ఆంధ్రా రాష్ట్రం లోని కాకినాడ లో కొన్నాళ్ళు, కర్నూల్ లో కొన్నాళ్ళు ఉద్యోగ పరం గా వుండవలసి వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత […]

Continue Reading
Posted On :

షర్మిలాం“తరంగం”-13

షర్మిలాం “తరంగం” -షర్మిల కోనేరు  ఇల్లాళ్లూ వర్ధిల్లండి! ” పాపం పొద్దున్నుంచి ఇంటెడు చాకిరీ , అందుకే మా అవిడకి సాయం చేస్తున్నా ‘” అని ఈ మధ్య మగాళ్ల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాట ! కరోనా తల్లి పుణ్యమా అని ఇండియాలో మగాళ్ళూ కాస్త వంటింటి వైపు చూస్తున్నారు . మార్పు మంచిదే ! కానీ నన్ను ఎప్పుడూ ఒక ప్రశ్న ఎప్పుడూ వెంటాడుతుంది . ఆ ఇంటి పని ఆవిడదేనా ? మరి […]

Continue Reading
Posted On :