అనుసృజన-ఏడుగురు అన్నదమ్ముల మధ్య చంపా
ఏడుగురు అన్నదమ్ముల మధ్య చంపా హిందీ మూలం – కాత్యాయని అనుసృజన – ఆర్ . శాంత సుందరి ఏడుగురు అన్నదమ్ముల మధ్య పెరిగి పెద్దదయింది చంపా వెదురు కొమ్మలా నాజూగ్గా తండ్రి గుండెలమీద కుంపటిలా కలల్లో కదులుతూన్న నల్లటి నీడలా రోట్లో ధాన్యంతోపాటు రోకటి పోటులని భరించి పొట్టుతోపాటు చెత్తకుప్పలో పారేస్తే అక్కడ పూలతీవై మొలిచింది. అడవి రేగుపళ్ళ ముళ్ళపొదల్లో మాధవీలతలా పెరిగిన చంపా ఇంట్లో ప్రత్యక్షమైంది మళ్ళీ. ఏడుగురు అన్నదమ్ములతో కలిసి పుట్టిన చంపా […]
Continue Reading