అష్టభుజి (కవిత)
అష్టభుజి -సుభాషిణి ప్రత్తిపాటి చించేసిందినా రాతల్ని కాదు..వేవేల నా భావాల్ని…ఎన్నో అంటని రెప్పల కాగడాలతో..నన్ను,నేనురగిలించుకుని…నిలుపుకున్న అస్తిత్వపు జాడల్ని!!వేకువకి మొలిచేవైతే…నా చేతులు తెగిపడేవే…ఇరు సంధ్యల మధ్య కడుపు నింపే…వంటలకవి అవసరం కనుకపాపం మిగిలాయవి…నాతో!!కాగితపు గీతలకు గిరి గీయగలవు కానీ…మరిగే మది తలపులనెలా….ఆపగలవు???ఎగిరే ఊహాల రెక్కలనెలాకట్టగలవు??అరచేతితో..అర్కుని ఆపగలవా…???జ్వలించే కవనోదయానికైఏదో ఓ ఉదయంనేను అష్టభుజిగా..అవతరిస్తాను.అక్షర సేవకై సరికొత్త అవతారికవ్రాసుకుంటా నా నవ జీవితానికి!! ***** ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల. గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత […]
Continue Reading