సముద్రం (కవిత)
సముద్రం -వసీరా ఆకాశాన్ని నెత్తి మీదమోస్తూ సముద్రం ఒక చేపగా మారి ఈదేస్తుంది భూతలం మీద సముద్రం ఎగురుతుంది పక్షిగా మారి నీటిరెక్కలతో నీలమేఘమైపోయి సూరీడికి ఆవిరి స్నానం చేయించి సముద్రమే బడి వరండాలోంచి బయటపెట్టిన చిన్నారుల అరచేతుల మీద చినుకులై మునివేళ్లమీద విరిసిన సన్నజాజులై సముద్రమే చిన్నారుల ముఖాలమీద మెరుపులై ముఖపుష్పాల మీంచి ఎగిరే నవ్వుల సీతాకోక చిలుకలై సముద్రమే సముద్రమే బడిగంటమోగినంతనే చినుకుల మధ్య కేరింతలతో మారుమోగే గాలికెరటాలై సముద్రమే తన సొట్టబుగ్గల మీద […]
Continue Reading