గజల్
గజల్ -జ్యోతిర్మయి మళ్ళ మౌనానికి మాటలనూ నేర్పిద్దాం కాస్త మనంచీకటికీ చిరుకాంతిని అరువిద్దాం కాస్త మనం కోకిలమ్మ పూలకొమ్మ కవులకెపుడు నేస్తాలుకాకి కథను కూడ రాసి చూపిద్దాం కాస్త మనం కులమతాలు పరపతులూ విభజించే జాడ్యాలునినదించే స్నేహగీతి వినిపిద్దాం కాస్త మనం లోపలొకటి పైకొకటీ కాపట్యం మనకెందుకుముసుగులేని ముఖంతోటి కనిపిద్దాం కాస్త మనం మేడలలో ప్రగతి జ్యోతి పూరిగుడిసె గతి చీకటిమనుషులంత ఒకటికాద? యోచిద్దాం కాస్త మనం ***** జ్యోతిర్మయి మళ్లజ్యోతిర్మయి మళ్ళ బహుముఖ ప్రజ్ఞాశాలి. తొలి […]
Continue Reading