image_print

వాంగ్మూలం (మహాశ్వేతాదేవి వర్ధంతి సందర్భంగా) (కవిత)

వాంగ్మూలం (మహాశ్వేతాదేవి వర్ధంతి సందర్భంగా) -అరణ్యకృష్ణ (జులై 28) మహాశ్వేతాదేవి వర్ధంతి. భారతదేశ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన రచయితల్లో ఆమె ఒకరు. నా మీద అమితమైన ప్రభావం చూపిన పుస్తకాల్లో “ఒకతల్లి” ఒకటి. మహాశ్వేతాదేవి రాసిన “హజార్ చురాశిర్ మా” నవలని తెలుగులో “ఒకతల్లి” పేరుతో సూరంపూడి సీతారాం అనువదించారు. ఉద్యమంలో కన్నుమూసిన తన కుమారుడి మరణానికి కారణాల కోసం ఒక తల్లి చేసే అన్వేషణ ఈ అద్భుతమైన నవలకి కథాంశం. ఆ పుస్తకం చదివి నేను […]

Continue Reading
Posted On :

చీకటి పెట్టెలు (కవిత)

చీకటి పెట్టెలు -కొండేపూడి నిర్మల “అమ్మానాన్నెప్పుడొస్తారు ?” ఎడబిడ్డ అడిగాడు వస్తారు బాబూ , తెల్లారి బ౦డికి వస్తారు చండి బిడ్డను ఎత్తుకుని కిటికీలోంచి బైటికి చూస్తూ ఆమె అన్నది దూరంగా జెర్రిపోతులాంటి రైలు చీకటి పెట్టెల్ని ఈడ్చుకుంటూ పరిగెడుతోంది “అమ్మా నాన్న మిఠాయి తెస్తారా ?” తెస్తారు బాబూ పెద్ద పెట్టెనిండా తెస్తారు ఏడ్చి ఏడ్చి చారికలు కట్టిన బుగ్గమీద ముద్దు పెట్టి చెప్పింది తెల్లారుతూనే ఒక పెట్టెను సాయంపడుతూ కొంతమంది మనుషులొచ్చారు “అమ్మా ఈ […]

Continue Reading

నల్ల పాదం (కవిత)

  నల్ల పాదం -సతీష్ బైరెడ్డి మేము శ్వాసిస్తే సహించలేరు మా విశ్వాసాన్ని భరించలేరు శతాబ్దాలుగా  మా స్వేచ్చా కంఠాలపై శ్వేత ఖడ్గాలు వేలాడుతూనే ఉన్నాయి. మేమంటే హృదయము,మేధా లేని ఒట్టి  నల్ల రంగే పుట్టుకతోనే నిషిద్ధ మానవులగా మారిన వాళ్ళం మా కలలు నిషిద్ధం మా కదలికలూ నిషిద్ధం అగ్ర రాజ్యంలో పేదరికంతో పెనవేసుకపోయిన జీవితాలు మావి నల్ల జాతిని నేరానికి చిరునామా చేసింది  శ్వేత రాజ్యం పీఠాల  మీది బతుకులు వారివైతే పాదాల కింద నలిగిన […]

Continue Reading
Posted On :

బాలబాబు-బుజ్జి అత్త (కవిత)

బాలబాబు-బుజ్జి అత్త -యశస్వి ఆమె అనేక యుద్ధముల నారితేరిన నారిఇప్పుడు అంపశయ్య ఎక్కి బాల బాబూ బాలబాబూ అని పిలవరిస్తూ ఉంది నిన్నటి వరకూ నిలిచోడం ఆమె యుద్ధం,  పడకుండా నడవడం యుద్ధాన్ని  గెలవడమే..పడుకుంటే లేచి కూర్చోడం యుద్ధం గెలవడం,కూర్చుంటే అదరకుండా నడుం వాల్చడం యుద్ధంమే మంచాన పడ్డ పెనిమిటిని  పసిపిల్లాడిలా సాకిన గట్టిమనిషేకట్టుకున్నోడ్ని కాటికి అప్పజెప్పాక పట్టు వదిలేసిన ఒళ్లాయే; ఆపై తలతిరిగి   కూలబడి పోతుండేది ఎముక లేనట్టు వండి వడ్డించిన చేయి వందల సార్లు జారి కిందపడ్డందుకు జబ్బ జారిపోయింది కొడుకులు పురిట్లోనే పోయినా అడుగు దూరం నుంచి ప్రేమించే […]

Continue Reading
Posted On :

నీ అస్థిత్వం ఎక్కడిది..? (కవిత)

నీ అస్థిత్వం ఎక్కడిది..? -గట్టు రాధిక మోహన్ పైన కప్పిన ఆ ఆకాశం మారలేదు కింద పరుచుకున్న ఈ పుడమీ మారలేదు. నా జన్మం కూడా మారలేదు. శతాబ్దాల వేదనలో నేనొక చెరగని సంతకంగానే ఉంటున్నాను. నా మీద రాసివ్వబడని పేటెంట్ హక్కులు నీ సొంతం అనుకుంటావు. ఎప్పటికప్పుడు నీకిష్టమైన కొత్త కొత్త నాగరికత విత్తనాలను విత్తుకుంటు నా కన్నీటి చుక్కలతో తడిపేస్తుంటావు. నువ్వు సృష్టించిన ఈ పితృస్వామ్య రాజ్యాంగంలో నా చూపుడు వేలును విరిచేసుకుంట నవ్వుకుంటుంటావు. […]

Continue Reading

రైన్ కోటు (కవిత)

రైన్ కోటు -యలమర్తి అనూరాధ గోడకు వేలాడదీయబడి బిక్కు బిక్కు మంటూ చూస్తూ ఎడారి జీవితాన్ని గడిపేస్తూ.. గాలివాన నేనున్నా అనాలి విప్పుకున్న గొడుగులా అప్పుడే ఊపిరి పోసుకున్న బిడ్డలా ఉత్సాహంగా ఉరకటానికి సిద్ధమవుతుంది కష్టాన్నంతా తనమీద వేసుకుంటూ వెచ్చదనం అంతా నీ సొంతం చేస్తుంది కన్నీళ్లను కనుపాపల్లో దాచుకుంటూ గూటిలో గువ్వలా తన ఒడిలో కాపాడే తల్లి మనసుకు ఏం తీసిపోదు చినుకు చినుకు కి చిత్తడవుతున్నా చిరునవ్వుతో నిన్ను హత్తుకుంటూనే నిలువెల్లా రక్షణ కవచం […]

Continue Reading
Posted On :

వెలుగుల రోజు (కవిత)

వెలుగుల రోజు -డా.కె.దివాకరాచారి నేను నాలాగా ఎదిగేప్పుడు నన్ను నడిపించి అక్కున చేర్చుకున్న అమ్మ ‘తులసి’ కౌగిలి నను ఒంటరిని చేసి వెళ్లినప్పుడు నన్ను అమ్మలా ఆదుకొని నా దారే తన జీవనమని నాతోనే తన జీవితమని అందరినీ, అన్నిటినీ వదిలి, కదిలి వచ్చి తన చేతిని, మనసును తలపుల్ని, బ్రతుకును నాతో పెనవేసుకుని తిరిగి నన్ను నిలబెట్టిన నా నెచ్చెలి వెచ్చని పరిష్వంగంలో ‘అమ్మ తనం’ సదా పరిమళిస్తూనే ఉంటుంది! ‘అమ్మలా’ నన్ను లాలించి మందలించి, […]

Continue Reading

అవేకళ్ళు (కవిత)

అవేకళ్ళు -అశోక్ గుంటుక తెలతెలవారుతూనే వాకిట  నే ముగ్గవుతున్న వేళ డాబాపై వాలిన నీరెండ కురుల ఆరబెడుతున్న వేళ తోపుడు బండిపై బయలెల్లిన కూరగాయల మేలిమి వెతుకుతున్న వేళ : అంతటా అవేకళ్ళు – వెకిలి నవ్వులు వెకిలి చేష్టలు…… పరుగు జీవితమైన వేళ అందీ అందని సిటీబస్సు లేదంటే మెట్రోరైలు చాలీ చాలని సమయం ఒక్కోసారీ వద్దనుకుంటూనే ఓ ఆటో లేదా ఓ క్యాబు – నిలుచున్నా కూర్చున్నా : అంతటా అవేకళ్ళు – వెకిలి […]

Continue Reading
Posted On :

అనాఘ్రాత (కవిత)

అనాఘ్రాత (కవిత) -జయశ్రీ మువ్వా ఊరికి చివరనచితికిన వర్ణం విరగపూసిందిసింధూరం దిద్దుకున్న రేరాణిఇక్కడ పతిత  పాపాల పావని నిదురనెపుడో రేయంచుకు విసిరేసినలుపు రంగు సలపరించే యామిని గంటలెక్కన ఇక్కడ గాయాల గుమ్మాలు ఎప్పుడూ తెరిచే వుంటాయిఉమ్ముతో మలాము అద్దుకోడంఅలవాటు పడిన అద్వంద్వ ఆకలి మంటని ఆర్పుకోలేకకన్నీటి కాష్టాన్నికైపుగా రాజేసుకునే నెరజాణ ఇంత బతుకులో వేల నిశ్శబ్ధ యుద్ధాలభేరినిమునిపంట  మ్రోగించేమంజరి గుప్పెడు పొట్టకి బతుకుని వెక్కిరించే ఆకలెందుకో వెకిలి సైగల వెనక వెతల కుంపటి ఒకటుందికోర్కెల కోరల విషం మింగిన దిగంబరి తనది కాని నిదురలో తానో స్వాప్నిక వీర్యాన్ని ఓపలేని వాడు వీరుడిక్కడతనని తానే ఆడి ఓడేఆమె  ఓ అనాఘ్రాత ***** ఆర్ట్: మన్నెం శారద జయశ్రీ మువ్వా – నా […]

Continue Reading
Posted On :

మాతృత్వపుసంతకం (కవిత)

మాతృత్వపుసంతకం -కె.రూప ౧ పాలబుగ్గల పసిడి నవ్వులు.. కేరింతల బాల్యపు చిగురింతలు ఆ చిట్టి చెక్కిలి నవ్వులలో అమ్మ పాల బువ్వలు దాచుకున్నాయి చిగురు లేత ప్రాయపు మునివేళ్ళ స్పర్శకు నెమలి కన్నులే చిన్నబోయినవి చిట్టి పాదాలే నాట్యమాడిన వేళ ఎన్నో… మధుర స్వరాలను వింటూ! చిన్నారి చూపులు కూడా నిలబడని చిత్రంలో అమ్మ బిడ్డ ప్రేమలో తేనెలద్దుకుంటుంది. ౨ పసిబిడ్డకందించే పాలబువ్వకు తానెన్ని వెతలు పడుతుందో! తాను తినే నాలుగు మెతుకులకు చేరిన రక్తాన్ని ప్రేమలో […]

Continue Reading
Posted On :

యుద్ధం (కవిత)

యుద్ధం -గిరి ప్రసాద్ చెల మల్లు దేశం కోసం  సరిహద్దుల్లో  కులమతాల భద్రతకోసం లోలోన చంపుకునేందుకు చంపేందుకు మంచుదుప్పట్లో వాడక్కడ కాపలా  లైన్ ఆఫ్ కంట్రోల్ మీదుగా రాడ్లు కర్రలు బాహాబాహీ భూముల గెట్ల తగాదాలో లోపల  అక్కడ సమిష్ఠి బాధ్యతకై వాడు ఇక్కడ పెత్తనం కోసం బలవంతుడు బలహీనుడిని తొక్కుతూ అక్కడా పెట్టుబడీ ఇక్కడా పెట్టుబడీ కోరలు అక్కడాఇక్కడా అవినీతి జాడ్యం చిదిమేది బడుగు బతుకునే  దేశమంటే మనుషులని వాడు అచ్చట ప్రాణాలొడ్డి దేశమంటే కులాలఎంపిక మతాల తరిమేత ఇక్కడ గద్దెకోసం రగడ రాజేయు అన్నివేళలా ఇక్కడసౌభ్రాతృత్వం కోసం వాడు రగులు అచ్చట  అచ్చట వాడికి మూడురంగుల జెండా యే కనపడు ఇచ్చట […]

Continue Reading

తక్కెడబాట్లు

తక్కెడబాట్లు -తగుళ్ళ గోపాల్ అయ్యా…వొంటి చేతిదాన్ని తక్కెడబాట్లే నా చేతులు కండ్లకు నల్లరిబ్బను కట్టుకొని న్యాయాన్ని జోకుతున్న ధర్మదేవతను గాదు వొట్టి కండ్లు లేని దాన్ని పండ్లమ్ముకునే ముసలిదాన్ని దినాం ఇక్కడే,ఈ నల్లఛత్రి కిందనే కుళ్లిపోయిన పండ్లలాగ పడుంట బతుకును కుప్పలుకుప్పలుగా పెట్టుకుంట పెద్దకొడుకు పోయినప్పటిసంది ఈ అంగడే నా పెద్దకొడుకు ఈ తక్కెడబాట్లే ఇంతజీవగంజి సారూ….నీకాల్మొక్కుత… వొకచేతిలో పండ్లగంప పట్టుకొని బస్సుకిటికీలెంబడి రయ్యరయ్య ఉరుకలేనిదాన్ని కారుఅద్దాల ముందు ‘పదికి మూడు,పదికి మూడు’ అని కూతేసి వొంగి […]

Continue Reading
Posted On :

మిస్సోరీ లో (మాయా ఏంజిలో-అనువాద కవిత)

మిస్సోరీ లో (అనువాద కవిత) -దాసరాజు రామారావు నేనున్న మిస్సోరీలో ఒక సగటు మనిషి ఒక కఠిన మనిషి బాధకు అర్థం తెలియని చలన రహిత మనిషి కడుపులో పేగుల్ని దేవేసినట్లు హింసిస్తుంటడు వాణ్ణి చల్లని వాడనాల్నా పరమ కసాయి ఆ మనిషి   నేనెప్పుడూ మధురమైన మనిషిని కలువలేదు దయగల మనిషిని నిజమైన మనిషిని ఎవరొకరో చీకటిలో వుంటే భరోసా మనిషి తోడుండాలనుకుంట ఖచ్చితమైన మనిషే ఆ మనిషి   జాక్సన్ ,మిస్సిసిపీలో లక్షణమైన పురుషులున్నరు […]

Continue Reading

బ్రహ్మ కడగని పాదము (కవిత)

బ్రహ్మ కడగని పాదము (కవిత) -జయశ్రీ మువ్వా ఎల్లిపోతున్నాం… ఖాళీ పాదాలు మావి , అందుకే … తేలిగ్గా కదిలెల్లిపోతున్నాం .. బరువవుతున్న బ్రతుకుని చింకి చాపల్లో చుట్టుకెళ్ళిపోతాం చిరిగిన కలల్ని  చీకట్లో దాచుకుంటూ .. మా పొలిమేర పొరల్లోకి లాక్కెళ్ళి పోతాం శెలవు చీటీ కూడా రాసిచ్చి పోలేని నిశానీ కలాలం మేమిన్నాళ్ళూ గుర్తించలేదు కానీ మిగులు జీవితాల మూలల్లో గుంపుగా కంపు వాడల మీద  పరాన్నజీవులు కారా మీరూ..? పురుగు వచ్చిందని  ఏరివేసిన  మెరిగలయ్యాము […]

Continue Reading
Posted On :

క్షమించు తల్లీ!

క్షమించు తల్లీ! -ఆది ఆంధ్ర తిప్పేస్వామి అమ్మా! నీ అడుగులకు ఓసారి సాగిలబడాలనుంది! చెమ్మగిల్లిన కళ్ళతో .. నీ పాదాల చెంత మోకరిల్లాలనుంది! నీదంటూ ఒకరోజుందని…గుర్తుచేసుకుని నిన్ననే ఆకాశంలో సంబరాలు చేసుకున్నాం! నీకు సాటిలేరంటూ గొప్పలు పోయాం! గుండెలో పెట్టుకుని గుడికడతామంటూ కవితలల్లి ఊరువాడ వూరేగాం! క్షమించు తల్లీ! నిచ్చెనేసి ఆకాశంలో నిలబెట్టాలని నువ్వుడగలేదు సొంతూరికి చేర్చమని కాళ్లా వేళ్లా పడుతున్నావు..! రోజూ పరమాన్నంతో కడుపునింపమని కోరలేదు ఆకలితో చచ్చిపోయే ప్రాణాలకింత గంజి పోయ మంటున్నావు ..! […]

Continue Reading

ఏడికి (కవిత)

ఏడికి (కవిత) -డా||కె.గీత 1 ఏడికి బోతున్నవే? బతుకుదెర్వుకి- ఈడనె ఉంటె ఏమైతది? బతుకు బుగ్గయితది- 2 యాడికి బోతున్నావు? పొట్ట కూటికి- ఈడేడనో నెతుక్కోరాదూ? బతుకా ఇది- 3 ఎందాక? అడగ్గూడదు- ఊళ్లోనే సూసుకుంటేనో? కూలి పనైనా లేందే- *** 1 ఎందాక? ఏమో- 2 యాడికి? ఊరికి- 3 ఏడికి? బతకనీకి ***** డా||కె.గీతడా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి […]

Continue Reading
Posted On :

మనిషితనం(కవిత)

మనిషితనం (కవిత) -కె.రూప ఒంటరితనం కావాలిప్పుడు  నన్ను నాకు పరిచయం చేసే చిన్న చప్పుడు  కూడా వినపడని చోటుఏ వస్తువు కనబడని చోటునాలో  మెదులుతున్న శ్వాసనుకూడా దూరం చేసేదినన్ను నన్నుగా గుర్తించేది ౧ ఏ సంద్రపు ఘోషలు వినలేని నా మది నాకు వినపడేలా నాలో లేని తనాన్ని ఏదో వెతుక్కుని నాలో నింపుకోవలసిన సమయమిప్పుడు!౨బిగుతై పోతున్న గుండె బరువుల నుండి సేదతీరాలనే సంకల్పంతో౩ఉదయపు వేకువల చప్పుళ్ళనుండి మొదలురాత్రి వెన్నెలకు కురిసే తడి కూడా అంటనంత  నా అడుగుల చప్పుడు కూడా నన్ను గుర్తించనంతగాఏ శబ్దమో ..ఏ రాగమో ..వినపడనంత దూరంకొండవాలుగా […]

Continue Reading
Posted On :

అభినయ (కవిత)

అభినయ (కవిత) -లక్ష్మీ కందిమళ్ళ అది కాదు ఇంకేదో అనుకుంటూ కంటినుంచి కన్నీటిచుక్క రాలింది. కన్నీరు కనిపించకుండా ముఖం పక్కకు తిప్పుకొని తడిని  తుడుచుకుంటూ పెదవులపై, జీవంలేని నవ్వులను మొలిపించుకుంటూ కళ్ళల్లో లేని ఆనందాన్ని అభినయిస్తూ.. ఆమె. అందుకు తడిచిన గులాబీ సాక్ష్యం! ***** ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి కందిమళ్ళ లక్ష్మికర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading

విడదీయ లేరూ (కవిత)

విడదీయ లేరూ !!! -గిరి ప్రసాద్ చెల మల్లు నేను ఆమె మెడచుట్టూ అల్లుకుపోయి రెండుమూడు చుట్లు తిరిగి భుజాల మీదుగా ఆమె మెడవంపులోకి జారి గుండెలమీద ఒదిగిపోగానే ఆమెలో అనుభూతుల పర్వం  ఆమె కళ్ళల్లో మెరుపు కళ్ళల్లో రంగుల స్వప్నాలు ఆమె అధరాలపై అందం కించిత్తు గర్వం  తొణికిసలాడు ఆమె రూపులో కొత్తదనం బహిర్గతం  నేను  ఆమె అధరాలను స్పృశిస్తూ నాసికాన్ని నా ఆధీనంలోకి తీసుకు రాగానే ఆమె ఉఛ్వాసనిశ్వాసాల గాఢత నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది  ఆమె కింది కనురెప్పల వారగా నేను ముడతలను మూసేస్తూపై కనురెప్పల ఈర్ష్యను గమనిస్తూ ముంగురులను ముద్దాడుతూ ఆమె […]

Continue Reading

బంగారమంటి (కవిత)

బంగారమంటి- -డా||కె.గీత ష్ …. పాపా నాన్నని డిస్టర్బ్ చెయ్యకు పని చేసుకొనీ అర్థరాత్రి వరకూ మీటింగులనీ చాటింగులనీ పాపం ఇంటి నించే మొత్తం పనంతా భుజాన మోస్తున్న బ్రహ్మాండుడు పొద్దుటే కప్పుడు కాఫీ ఏదో ఇంత టిఫిను  లంచ్ టైముకి కాస్త అన్నం  మధ్య ఎప్పుడైనా టీనో, బిస్కట్టో రాత్రికి ఓ చిన్న చపాతీ ఏదో ఓ కూరో, పప్పో పాపం సింపుల్ జీవితం అట్టే ఆదరాబాదరా లేని జీవితం లాక్ డవున్ లోనూ ఇవన్నీ […]

Continue Reading
Posted On :

రిస్క్ తీసుకుంటాను(కవిత)

రిస్క్ తీసుకుంటాను(కవిత) -కొండేపూడి నిర్మల మొదటి పెగ్గు.. మొగుడు సీసాలో వున్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను సాయంత్రం రొట్టెలోకి తైలం లేక నేను రోడ్డెక్కిన సమయానికి తను నిండు సీసాతో ఇల్లు చేరుకుంటాడు జరగబోయే దేమిటో నా జ్ణానదంతం సలపరించి చెబుతుంది సోడాకోసం లోపలికొచ్చి అనవసరంగా నవ్విపోతాడు గోడమీద తగ కావిలించుకుని దిగిన హనీమూన్ ఫొటో వింత చూస్తూ వుంటుంది. సత్యనారాయణ వ్రతం మాదిరి సరంజామా సిద్ధం చేసుకుని ఎంతో తన్మయంతో సీసా మూత తిప్పుతాడు […]

Continue Reading

చీకటి వేకువ (గుగి వా థియోంగో) (అనువాద కవిత)

చీకటి వేకువ  (అనువాద కవిత) ఆంగ్ల మూలం: గుగి వా థియోంగో  తెలుగు అనువాదం: ఎన్. వేణుగోపాల్ (24 మార్చ్ 2020) తెలుసు, తెలుసు, నాకు తెలుసు ఒక కరచాలనం ఒక బిగి కౌగిలి దుఃఖ భారం దించుకోవడానికి ఒకరికొకరం అందించే భుజం ఎప్పుడైనా సరాసరి లోపలికి నడవగల పొరుగిల్లు మానవానుబంధపు అతి సాధారణ ఆనవాళ్లన్నిటినీ సవాల్ చేస్తున్నదిది ఎగుడుదిగుళ్ల వ్యక్తివాదపు గొప్పలతో మన భుజాలు మనమే చరుచుకుంటూ, మనిషి మీద సకల హక్కులూ ఆస్తికే ఉన్నాయంటూ […]

Continue Reading
Posted On :

ముందస్తు కర్తవ్యం (కవిత)

ముందస్తు కర్తవ్యం (కవిత) -యలమర్తి అనూరాధ కనికరం లేని కబళింపు  జాపిన చేతులు పొడగెక్కువ గాలి కన్నా వేగంగా వ్యాప్తి లక్షణాలు మెండే అయితే ఏంటంట చేయి చేయి కలుపు ఒకప్పటి నినాదమైతే దూరం దూరంగా జరుగు ఇప్పటి నినాదం  ఎంతలో ఎంత మార్పు?  ఊహించనవి ఎదురవ్వటమేగా జీవితమంటే!? తట్టుకుని నిలబడటమేగా ధైర్యమంటే  కరోనా అయినా మరేదైనా  ఆత్మస్థైర్యంతో తరిమి కొట్టడమే  ముందస్తు కర్తవ్యం    వైద్యులు అండ  పోలీసులు తోడు  శాస్త్రజ్ఞులు సహకారం నిస్వార్థ హృదయాల మానవత్వం […]

Continue Reading
Posted On :

ఒంటరి (కవిత)

ఒంటరి (కవిత) -ములుగు లక్ష్మీ మైథిలి రాతిరి కొన్ని బాధలు కరిగిస్తుంది అర్థరాత్రి నిశ్శబ్దం వెలుతురు నాహ్వానిస్తూ గడిచిన వెతలకు జవాబు చెపుతుంది రాతిరి నా అక్షరాలు నల్లని చీకటిని చీల్చే కాంతి పుంజాలవుతాయి చెదిరిన ఆశల తునకలను కవిత్వం గా అల్లుకుంటాను రాతిరి వెన్నెల లో ఊసులు చెప్పుకొని ఎన్నాళ్ళయిందో? ఆ నిశీధి మౌనంలో హృదయాల సవ్వడులు మూగగా మాట్లాడుకుంటాయి రాతిరి నిదురలేని రాత్రులు ఈ దేహపు ఆకాశం లో ఉదయాస్తమయాలు ఒక్కటే కన్నీటి నక్షత్రాలు […]

Continue Reading

లక్ష్మణరేఖ (కవిత)

లక్ష్మణరేఖ (కవిత) -డా.సి.భవానీదేవి నీకిది సరికొత్త కాలం నాకుమాత్రం ఇది అసలు కొత్తకాదు నా జీవితమంతా ఎప్పుడూ లాక్ డౌనే ! అందుకే నాకస్సలు తేడా కనిపించటం లేదు ఏ మాల్స్ మూసేశారో ఏ మార్కెట్ తీసిఉందో నాకెప్పుడయినా తెలిస్తేగా… ఇప్పుడు నీ మార్నింగ్ వాక్ బంద్ నీ ఉద్యోగానికి నిర్విరామ విశ్రాంతి నువ్వు నిరంతరం ఇల్లు కదలకపోబట్టే నేను మరింత చాకిరీకాళ్ళకింద..నలుగుతూ తరతరాలుగా నాకోసం నువ్వు గీసిన లక్ష్మణరేఖను కరోనా భయంతోనైనా మొదటిసారి నువ్వు అనుభవిస్తుంటే […]

Continue Reading
Posted On :

మైల (కవిత)

మైల(కవిత) -జయశ్రీ మువ్వా మాకొద్దీ ఆడతనం అనుక్షణం అస్థిత్వం కోసం మాకీ అగచాట్లెందుకు..?? పిచ్చికుక్క సమాజం పచ్చబొట్టేసూకూర్చుంది అణుక్షణం అణువణువూ తడుముతూ వేధిస్తూనే ఉంది.. ఆకలి కోరలకి అమ్మతనాన్ని అమ్ముకున్నాం ఆబగా వచ్చే మగడికై ఆలితనాన్ని తాకట్టుపెట్టాం .. చివరికి మూడు రోజుల ముట్టు నెత్తుటి పుట్టుకకి ఇప్పుడు బతుకంతా మడికట్టా?? సమాజమా…సిగ్గుపడు… !! అలవాటుపడ్డ ప్రాణలే సిగ్గుకి ముగ్గుకి తలొంచుకున్నాం ఇక చాలు ఓ ఆడతనమా మరీ ఇంత సహనమా తాతమ్మ ,బామ్మ అంటు అంటూ […]

Continue Reading
Posted On :

నాన్నే ధైర్యం(కవిత)

నాన్నే ధైర్యం(కవిత) -కె.రూప ఆడపిల్లకు ధైర్యం నాన్నే! గుండెలపై ఆడించుకునే నాన్న చదువులకు అడ్డుచెప్పని నాన్న ఉద్యోగంలో అండగా నిలిచిన నాన్న చిన్నగాయానికే  అమ్మకు గాయంచేసే నాన్న ఇప్పుడెందుకు ఇలా! మనసుకైన గాయాలను చూడడెందుకో! చిన్నపాటి జ్వరానికే అల్లాడిపోయేవాడు పెద్ద తుఫానులో వున్నాను అంటే పలకడెందుకో! నీ సుఖమే ముఖ్యం అనే వ్యక్తి వ్యక్తిత్వం మర్చిపోయి సర్దుకోమంటాడే! ధైర్యంగా బ్రతకమని చెప్పిన మనిషి అణగారిన బ్రతుకునుండి బయటకు వస్తాను అంటే ఒప్పుకోడెందుకో! నా చిట్టిపాదాల మువ్వలచప్పుళ్లు చూసి […]

Continue Reading
Posted On :

ఆమె (కవిత)

ఆమె (కవిత) -గిరి ప్రసాద్ చెల మల్లు ఆమె ఒక ప్రశ్న జవాబు దొరకదు ఆమె ఒక పజిల్ అంచనాకు అందదు ఆమె వర్షిణి కురిపించే ప్రేమ కొలిచే పరికరం లేదు ఆమె సృష్టి బిడ్డ కోసం పంచే పాల నాణ్యత లాక్టో మీటర్ కి చేరదు ఆమె దుఖం కుటుంబ పాలన లో అడుగడుగునా రెప్పల మాటున గడ్డ గట్టి ఏకాంతంలో విష్పోటనం ఆమె ఆరోగ్యం జీవన శైలి ప్రతిబింబం ఆమె భద్రత ఆమె చుట్టూ […]

Continue Reading

ఎందుకు (కవిత)

ఎందుకు(కవిత) -లక్ష్మీ దేవరాజ్ కంటికి కనిపించని జీవికంటి మీద కునుకు లేకుండా చేస్తుంటేమార్స్ వరకూ వెళ్ళిన మనిషిమౌనంగా మిగిలిపోయాడేం? ఎంతో కష్టపడి ఇష్టంగా కూడబెట్టిన డబ్బుఆరోగ్యాన్ని మాత్రం కొనలేదనిమరోసారి మరచిపోయాడేం? డైనోసార్లు….సరే ఎప్పటివోపులులు మాత్రం నిన్నమొన్నేగాకాలగర్భంలో కలిసిపోతుంటేఅంటీముట్టనట్టున్న మనిషిఇప్పుడెందుకిలా అల్లాడిపోతున్నాడు? ప్రకృతి నేర్పే పాఠం కష్టమేఇది మన దురాశ వల్ల కలిగిన నష్టమే ఇకనుంచైనా బాహ్య శుభ్రంతో పాటుఅంతఃశుభ్రంపై ఆలోచన పెడదాం అలాగే ప్రపంచంలో మనతోపాటు సంచరించేప్రతీజీవి ప్రాణంఖరీదుమనిషి ప్రాణంతో సమానమే అని ఒప్పుకుందాం ***** ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి లక్ష్మీ దేవరాజ్పేరు: లక్షీ దేవరాజ్ వృత్తి: […]

Continue Reading
Posted On :

కరోనా ఆంటీ (కథ)

కరోనా ఆంటీ (కథ) -లక్ష్మీ కందిమళ్ల  మా కిటికీకి చేతులు వచ్చాయిఅవునండీ బాబు ఈమధ్య మా హాల్లో కిటికీకి చేతులు వచ్చాయి. నిజంగా..నిజం.. మా అపార్ట్మెంట్ లో, ప్లోరుకు ఐదు ఇల్లు ఉంటాయి. అందునా మా ఇల్లు  ఫస్ట్ ప్లోర్ లో ..  అటు రెండు ఇల్లు, ఇటు రెండు ఇల్లు మధ్యలో మా ఇల్లు. కారిడార్ వైపు హాల్ కిటికీ వుంటుంది. ఆ కిటికీకి  అద్దాలున్న రెక్కలు బయటికి వుంటాయి. ఇంకో జత రెక్కలు మెష్ ఉన్నవి లోపలికి వుంటాయి.” అందునా […]

Continue Reading

నడుస్తున్న భారతం (కవిత)

నడుస్తున్న భారతం (కవిత) – వేముగంటి మురళి ముఖానికి మాస్క్దుఃఖానికి లేదుఆకలి ఎండినతీగల్లాంటి పేగుల్నిమెలిపెడుతున్నది ఒంట్లో నగరాల నరాల్లో విచ్చలవిడిగా మండుతున్న భయంపూరిగుడిసెలోచల్లారిన  కట్టెల పొయ్యిఅవయవాలు ముడుచుకొని ఉండడమేపెద్ద శ్రమ  కరెన్సీ వైరస్ ను జోకొట్టలేదుకాలాన్ని వెనకకు తిప్పలేదుప్రజలకు పాలకుల మధ్య డిస్టెన్స్ గీత మాత్రమే గీస్తుంది తిరిగే కాలు మూలకు,ఒర్రే నోరుకు రామాయణ తాళంగదంతా ఆధ్యాత్మిక ధూపదీప యాగంకంట్లో నిండుతున్న విశ్వాసాల పొగలుఎర్రబారిపోయింది పిచ్చి మనసు రోడ్డుమీద ఒక పక్కకు పక్షుల రాకడమరోదిక్కు వలసొచ్చిన మనుషులు పోకడ పిట్టలు ఎగరగలవుకరువు అమాంతం నెత్తిమీద వాలుతుందిభుజం మీద […]

Continue Reading
Posted On :

చైత్రపు అతిథి (కవిత)

చైత్రపు అతిథి (కవిత) – విజయ దుర్గ తాడినాడ కుహు కుహు రాగాల ఓ కోయిలమ్మా! ఎట దాగుంటివి చిరు కూనలమ్మా!! మానుల రెమ్మల దాగితివందున,  కొమ్మలె లేని మానులకు రెమ్మలె కరువాయే !!  కాకులు దూరని కీకారణ్యమునెగిరెదవేమో, మనుషులు తిరిగెడి కాంక్రీటడవులనగుపడవాయే !! చైత్రపు అతిథిగ ఆహ్వానిద్దునా, ఆదరముగ చూత చివురులు సిద్ధమాయే !! గ్రీష్మ తాపపు భగభగలు, చేదువగరుల చిరచిరలు మేమున్నామని గుర్తించమనీ నీ వెంటే ఏతెంచునాయే !! వగరుల చిగురులు తిందువు ‘ఛీ ఛీ’ […]

Continue Reading
Posted On :

మానవాళికి కరోనా వైరస్ ఉత్తరం (అనువాద కవిత)

మానవాళికి కరోనా వైరస్ ఉత్తరం (అనువాద కవిత) ఆంగ్ల మూలం: వివియన్ ఆర్ రీష్  తెలుగుసేత: ఎన్.వేణుగోపాల్    నేలతల్లి నీ చెవిలో గుసగుసలాడింది నువ్వది ఆలకించలేదు  నేలతల్లి పెదవి విప్పి నీకు చెప్పింది నువ్వది వినలేదు నేలతల్లి అరిచి గగ్గోలు పెట్టింది నువు చెవిన పెట్టలేదు అప్పుడు నేను పుట్టాను… నిన్ను శిక్షించడానికి కాదు నిన్ను మేల్కొల్పడానికే నేను పుట్టాను… సాయానికి రమ్మని నేలతల్లి విలపించింది… బీభత్సమైన వరదలు. నువు వినలేదు. మహారణ్య దహనాలు. నువు […]

Continue Reading
Posted On :

ఖాళీ (కవిత)

ఖాళీ (కవిత) – జయశ్రీ మువ్వా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా..? ఏదని చెప్పాలి.. ముగించాలనుకున్నపుడు కామా కోసం వెతకులాట ఎందుకు? చదవబడని పేజీలన్నీ వదిలెళ్ళు నేనూ వదిలేస్తాలే అందమైన కాగితం పడవలుగా – అన్నట్టూ… అద్దాన్ని ఓ సారి తుడుచుకో బొట్టుబిళ్ళలు అంటించిన మరకలుంటాయేమో కన్నీటి చారల మొకాన్ని కడుక్కున్నట్టు  ఫ్రెష్ గా- అవునూ.. ముందు డికాక్షన్ పెట్టుకో చేతికందించే కాఫీ కప్పు టేస్ట్ మారినా, వంటగదిలో గాజుల మెలోడి వినపడ్డా పట్టించుకోకు ఇలాంటివేగా ఎన్ని చెప్పినా… నాకంటూ ఏమి  చెప్పాలని […]

Continue Reading
Posted On :

ఆమె (కవిత)

ఆమె (కవిత) -కె.రూప ఆమెను నేను…… పొదరిల్లు అల్లుకున్న గువ్వ పిట్టను లోగిలిలో ముగ్గుని గడపకు అంటుకున్న పసుపుని వంటింటి మహారాణిని అతిథులకు అమృతవల్లిని పెద్దలు మెచ్చిన అణుకువను మగని చాటు ఇల్లాలుని ఆర్ధిక సలహాదారుని ఆశల సౌధాల సమిధను చిగురించే బాల్యానికి వెలుగురేఖను స్వేచ్ఛనెరుగని స్వాతంత్ర్యాన్ని కనుసైగలోని మర్మాన్ని భావం లేని భాద్యతను విలువ లేని శ్రమను ఆమెను నేను… కల్లోల సంద్రంలో కన్నీటి కడలిగా ఎన్ని కాలాలు మారిన నిలదొక్కుకోవాలనే అలుపెరుగని పోరాటం సమానత్వం […]

Continue Reading
Posted On :

ఈ వనము లో నీకు చోటెందుకు? (కవిత)

ఈ వనము లో నీకు చోటెందుకు? (కవిత) -డా|| మీసాల అప్పలయ్య ఇది జీవన వనం వర్ణాల పరిమళాల రుచుల తాదాత్మ్యాల శిబిరం ఈ రంగుల బొకేలు నాజూకుని తొడుక్కొని  మృదుత్వాన్ని ఊ రేగించుకొంటున్న సీతాకోక చిలుకలు నీ పేలవ బ్రతుక్కి రంగవల్లులు , కానీ ఇవి నీ  కర్కశత్వంలో చెరిగి నలిగిన కళేబరాలు కావచ్చు ! ఆర్ద్రత చిమ్మే ఈ మల్లెలు పరిమళాల తెమ్మెరలు పరామర్శల పరవశాలు, కానీ ఇవి నీ కళింకిత బూటు కాళ్ల […]

Continue Reading

నేను నేనేనా (కవిత)

నేను నేనేనా.. -లక్ష్మీ_కందిమళ్ళ నిశ్చింతకై వెతుకులాట శూన్యమైపోతున్నానేమోనన్న బెంగ. నిన్నటిలా నేడూ వుండాలని. నేటిలా రేపూ వుండాలని. ఎందుకో మరి తళుక్కున మెరిసీ మాయమవుతున్న వెలుతురు. నేనంటూ వున్నానా నేను నేనేనా నేను ఇంకోలా నా ఇంకోలా అంటే ఏమో?? మాటలన్నీ మౌనాలై ఊసులన్నీ భోషాణం లో చేరాయి. తలుపు తెరుచుకొని రాలేకున్నాయి. ఎదురు చూస్తూ.. నేను..!! ***** కందిమళ్ళ లక్ష్మికర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading

ఎర్రకాలువ(కవిత)

ఎర్రకాలువ -తోట సుభాషిణి నా గదంతా రక్తంతో నిండిపోతుంది ఆ నాలుగు రాత్రుల యుద్ద సమయంలో అమావస్యనాడు వెన్నెల చూసావా నేను చూసాను చాలాసార్లు లోదుస్తులపై ఎర్రటి మరకలు మెరుస్తుంటే మా ఇంటిముందు మోరీ యుద్ధంలో సైనికుల మరణానికి ఆనవాలు చరిత్ర నల్లరక్తం …. ఎరుపు విరిగి సన్నని తీగరాగం అందుకుంటుంది అదే విప్లవగీతం స్నానాల గదిలో  ఆ గేయం వర్ణనాతీతం నేను కమ్యూనిస్టుగా ముద్రవేయించుకుంటుంటా అడవికి ప్రేమికురాలునై ఋతు చక్రాన్ని మొలిపించుకునేందుకు అవునూ నాకు కొన్ని […]

Continue Reading
Posted On :

ఓ నా బట్టా ముట్టుకో (కవిత)

ఓ నా బట్టా! ముట్టుకో! Day – 1 అదొక ఎర్రనదిఅదొక అరుణ గంగఅదొక రుధిర యమునఅదొక నెలసరి బ్రహ్మ ఇది ఓ తిట్టు ఆత్మ కధఉండచుట్టి చాటుగా దాపెట్టివిసిరేసిన ప్యాడ్ అనే బట్ట తిట్టు వ్యధ కోపాన్ని నొప్పినీఅసహనాన్నీ తిట్టుగా మోస్తున్న ఆత్మ కధ బడి పీరియడ్ లకీ బాడీ పీరియడ్లకూతేడా తెలియని అజ్ఞానాన్ని ఆమెకు ప్రసాదించిన మనమ్ కదా అంటరానివాళ్ళం.. పాపం ఆ పిచ్చి టిచర్నేమీ అనకండి ఆమెకూ ఆ మూడురోజులున్నాయిఆమెకూఅంటుముట్టుమైలలున్నాయిపీడకురాలి రూపంలోని పీడిత ఆమె Day -2 ఆ రక్తంలోనే పుట్టి దాంతోనే స్నానంచేసి  అందులోనే ప్రవహించి బయటకొచ్చిన నీకు …మరకలేంట్రా నీకు ఒళ్ళంతా మరకేగా నీదేహం […]

Continue Reading
Posted On :

నువ్వు లేని ఇల్లు (కవిత)

నువ్వు లేని ఇల్లు -డా|| కె.గీత నువ్వు లేని ఇల్లు సాయంత్రానికే డీలా పడిపోయింది రోజూ ఆఫీసు నుంచి నువ్వెప్పుడొస్తావా గరాజు ఎప్పుడు తెరుచుకుంటుందా అని రిక్కించుకుని ఉండే చెవులు కళ్లని ఓదార్చే పనిలో పడ్డాయి పగలంతా ఏదో హడావిడిగా గడిచిపోయినా సాయంత్రం గూటికి చేరే వేళ నువ్వు కనబడని ప్రతి గదీ కాంతివిహీనమై పోయింది నువ్వు వినబడని ప్రతీ గోడా స్తబ్దమై వెలవెలబోయింది నీతో తాగని ఈవెనింగ్ కాఫీ ఖాళీ కప్పై సొరుగులో బోర్లా పడుకుంది […]

Continue Reading
Posted On :

తపస్సు (కవిత)

 తపస్సు -వసుధారాణి  ఒక తపస్సులా గమనించు తూనీగల రెక్కల చప్పుడు కూడా వినిపిస్తుంది. కొండ యుగయుగాల కథలు చెపుతుంది. జలపాతం చిలిపితనం నేర్పిస్తుంది. నది ఆగిపోని జీవనగమనం చూపిస్తుంది. ఆకాశం ఉన్నదేమిటో,లేనిదేమిటో ఒక్క క్షణంలో మార్చేస్తుంది. ముని అవ్వటం అంటే ఇదేనేమో జనజీవనంలో నిలబడి కూడా. ఏమయినా సముద్రుడు నాకు బోలెడు కబుర్లు చెపుతాడు. నది వచ్చి నాలో చేరేటప్పుడు ఆ మంచినీరు నేనేమి చేసుకోనూ? వెనక్కి తోసే ప్రయత్నం చేస్తాను. ఐనా నది సంగమించే తీరుతుంది. […]

Continue Reading
Posted On :

ముగింపు లేని సమయం(అనువాద కవిత)

ముగింపు లేని సమయం -దాసరాజు రామారావు ముగింపు లేని సమయం నా చేతుల్లో వున్నది, ఓ నా ప్రభూ నిమిషాలను లెక్కించేందుకు ఎవరూ లేరు దివా రాత్రాలు వెళ్లిపోయి,వయస్సు మళ్లిపోయి వికసించీ, వాడిపోయీ పూల వోలె. నువ్వు తెలుసుకోవాల్సింది ఎట్లా వేచివుండటం. నీ సంవత్సరాలు ఒకటొకటి అనుసరిస్తూ ఒక సంపూర్ణమైన చిన్ని అడవి మల్లె కోసం. మనకు సమయం లేదు కోల్పోవడానికి. మరియు సమయం కలిగి లేం మనం  ఒక అవకాశం కోసం పాకులాడక తప్పదు మనం […]

Continue Reading

పరవశాల మత్తు(కవిత)

పరవశాల_మత్తు -లక్ష్మీ కందిమళ్ల  సాయం సంధ్యల కలయికలు సంతోషాల సుర గీతికలు పరవశపు మత్తులో సుమ పరిమళ హాసాలు ఋతువుల కేళీ విలాసాలు పలకరింతల పులకరింతలు పిలుపు పిలుపు లో మోహన రాగాలు పదిలం గా దాచుకునే కానుకల వసంతాలు వాలిన రెప్పల చాటున రహస్యాలు ఊపిరి పరిమళమై మురిపిస్తుంటాయి ఒక నిశ్చల నిశ్చింతతో..!! ***** కందిమళ్ళ లక్ష్మికర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading

ఇదీ నా కవిత్వం(కవిత)

 ఇదీ  నా కవిత్వం – వసుధారాణి   నీపై ప్రేమ ఎలాగో ఈ కవిత్వమూ అంతేలా ఉంది . నా ప్రమేయం లేకుండా నాలో నిండిపోయి అక్షరాల్లో ఒలికిపోతోంది.   కవి అంటే  ఓ వాన చినుకు,  ఓ మబ్బుతునక మండేసూర్యగోళం చల్లని శశికిరణం కన్నీటికెరటం ఉవ్వెత్తు ఉద్వేగం పేదవాడికోపం పిల్లలకేరింత కన్నతల్లి లాలిత్యం గడ్డిపూవు,గంగిగోవు ఒకటేమిటి  కానిదేమిటి కవి అంటే విశ్వరూపం వేయిసూర్య  ప్రభాతం.   గుండెకింద చెమ్మ, కంటిలోన తడి ఇవి లేకుండా  కవిత్వం […]

Continue Reading
Posted On :

ద్వీపాంతం(కవిత)

 ద్వీపాంతం -శ్రీ సుధ ఎక్కడికీ కదల్లేని చిన్న ద్వీపాలవి సముద్రం చుట్టుముట్టి ఎందుకు వుందో అది నది ఎందుకు కాలేదో అర్థంకాదు వాటికి   వెన్నెల లేని చంద్రుడు హృదయం లేని ఆకాశం వుంటాయని తెలియదు వాటికి   విసిరి కొట్టిన రాత్రుళ్ళు వృక్షాలై వీచే ఈదరగాలుల్లో అలసి ఎప్పటికో నిదురపోతాయి   తీరంలేని నేలలవ్వాలని ఆశపడతాయి రెండో మూడో ఝాములు దాటాక నిశ్శబ్దంగా నావలు వచ్చిచేరతాయా   బహుశా యిక ఆ తరువాత దీపస్తంభాలకి ఆ […]

Continue Reading
Posted On :
లక్ష్మీ కందిమళ్ళ

ఆమె ధరణి(కవిత)

ఆమె ధరణి -కందిమళ్ళ లక్ష్మి  కొందరు అప్పుడప్పుడు కఠిన మాటలతో ఆమెను శిలగా మారుస్తుంటారు.  ఆమె కూడా చలనం లేని రాయిలా మారిపోతూ ఉంటుంది. ఆమె  ఒక మనిషని మరచిపోతుంటారు.  కానీ ఆమె మాత్రం చిరచిత్తంతో మమతానురాగాల వంతెనపైనే నడుస్తూ ఉంటుంది. ఆమెనుఒక చైతన్య మూర్తిగా ఎప్పుడు గుర్తిస్తారు?? మీకు తెలియదా??ఆమె ఎప్పుడూ లాలిత్యాన్ని వదలని ఒక ధరణని!!***** కందిమళ్ళ లక్ష్మికర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading

వ్యక్తి-శక్తి(కవిత)

వ్యక్తి-శక్తి -డా||కె.గీత వ్యక్తిగా మొదలవ్వడం అంటే నీకు నువ్వే అంకురమవ్వడం నీ జీవితానికి నువ్వే బాధ్యతకావడం నిన్ను నువ్వే ప్రేమించుకోవడం ద్వేషించుకోవడం నీలోనువ్వే మాట్లాడుకోవడం పోట్లాడుకోవడం నీకు నువ్వుగా మిగలడం వ్యక్తిగా ఉన్నంతసేపు నీ పరిధి నీ కనుచూపుమేర- నీ దుఃఖోపశమనం నీ అరచేతికందినంతమేర- నీ బాధల్ని నువ్వే తుడుచుకోవడం నీ బంధాల్ని నువ్వే పెంచుకోవడం నువ్వే తుంచుకోవడం *** సమిష్టిగా మొదలవ్వడం అంటే నీకు నువ్వే కొత్తగా పరిచయం కావడం సమిష్టిశక్తిగా మొదలవ్వడం అంటే నీ  […]

Continue Reading
Posted On :

ముసలివాడు-సీతాకోక చిలుక(కవిత)

ముసలి వాడు-సీతాకోక చిలుక(కవిత)              – పాలపర్తి ఇంద్రాణి ముసలి వాడొకడు వణుకుతున్న చేతులతో  గాజు జాడీ పైన రంగురంగు పూలు చిత్రించినాడు.  పుట్ట తేనె తీసుకుని అక్కడక్కడ చిలకరించినాడు.   రంగు పూల గాజు జాడీని తన తోటలోన ఉంచినాడు. సీతాకోక చిలకలకై వేచి చూస్తూ నిలచినాడు.   ముసిలివాడు ఒకప్పుడు సీతాకోకల వేటగాడు.  కానీ ఇప్పుడు సత్తువ ఉడిగి అలసినాడు.  పరుగెత్తలేక ఆగినాడు.    తనంత తానుగా సీతాకోక చిలుక వచ్చి వాలేలా  ఉచ్చులల్లి పెట్టడం ఆరంభించి ఆరితేరినాడు.  […]

Continue Reading

గీత శ్రావణం, సంగీతం (కవితలు)

గీత శ్రావణం, సంగీతం (కవితలు) -నాగరాజు రామస్వామి   గీత శ్రావణం   ఉదయాకాశం తడి తడిగా నన్ను పెనవేసుకున్నప్పుడల్లా రాత్రంతా నానిన అక్షరం నాలో మొలకెత్తి గొంతెత్తుతుంటుంది. చీకటి దైన్యానికి ద్రవించిన సూర్యుడు తడి పదాలై బొట్లు బొట్లుగా రాలుతుంటాడు నా చిరు చీకటి చూరు లోంచి. శ్రావణం అంటే ఎంత ఇష్టమో నాకు! ముసురు ముసుగుల వెనుక సప్త వర్ణాలను పాడుకుంటూ వేకువ! ఏడు రాగాలను విచ్చుకుంటూ ఇంద్రచాపం! చీకటి బతుకులలో కిరణమై నదించాలని తొందరిస్తున్న తొలిపొద్దు […]

Continue Reading

   ఆప్షన్(కవిత)

ఆప్షన్   –శిలాలోలిత మనం వింటున్న దేమిటి? మనం చూస్తున్న దేమిటి? మనుషులెందుకింత క్రూరంగా వుంటున్నారు? అసలు మనుషులెందుకు తాగుతున్నారు? తాగనిదే వూరుకోమన్న  రాజ్యం కోసమా? శ్రమను మర్చిపోతున్నానని ఒకరు బాధని మర్చిపోవడానికని ఇంకొకరు ఫ్యాషన్ కోసమని  ఒకరు కిక్ కోసమని ఇంకొకరు ఒళ్ళు బలిసి ఒకరు వెరైటీ బతుకు కోసం ఇంకొకరు అమ్మ,అమ్మమ్మ, పసిపాప నిద్దరోతున్నారట వాడి ఆప్షన్స్ లో పాప నెన్నుకున్నాడు ఏమిటి? ఏమిటి? ఏమిటిది? ఒళ్ళంతా గొంగళిపురుగులు చుట్టుకున్నట్లుంది వేలవేల పురుషాంగాలు నిగడదన్ని వున్నాయి […]

Continue Reading
Posted On :

 నాన్నని పోగొట్టుకుని ! (కవిత) 

    నాన్నని పోగొట్టుకుని !     – రేణుక అయోల     1 .  అస్తికలు బూడిద ఒడిలోకి తీసుకున్న గోదావరి –       ప్రవాహంలో నాన్న జీవితం –       పాదాలని కడుగుతూన్న గోదావరి       అలలకి నా దుఃఖం వో చినుకు      నది మెట్ల మీదనుంచి అడుగులు  వెన క్కివేయడం      ఒక దీర్ఘ జ్జాపకాన్ని మోయడం పల్చటి చలిలో      అగ్నిని  బొడ్డుకి చుట్టుకున్నట్టుగా ఉంది      నిన్నటి వరకు నీది  నాది ఒక పేగు బంధం      ఇప్పుడది ఎముకలు […]

Continue Reading
Posted On :

కాళీ పదములు       

కాళీ పదములు                                 -పాలపర్తి ఇంద్రాణి 1. ధూళి ధూసరితమైన  భూమి పైన్నుంచి లేచి హంసలా మబ్బులలో  ఎగురుతున్నాను సాటి రాయంచల  హొయలు చూచి  మైమరచానో మోహించానో ఆ వేల అడుగుల  ఎత్తునుంచి జారి పడబోయాను  అమ్మా,అమ్మా, అమ్మా,అమ్మా! అద్భుతమాశ్చర్యమానందం!  మూడు హస్తాలు  నిలువరించాయి నన్ను నువ్వు పంపిన పరమ గురువులు ముగ్గురు పక్షి పాదాల వారు కాంతి కమండలాల వారు గాలి బిరడాల వారు […]

Continue Reading