image_print

ఒక పరివ్రాజక కల (కవిత) 

ఒక పరివ్రాజక కల – శేషభట్టర్ రఘు నా కాలంలో ఆడపిల్లలు గోరింటాకుతో తిరిగినట్టునా మటుకు నేను గొప్పోడిననే ఖ్యాతితో తిరగాలనికలగనేవాడ్నిఅలా అనుకోవటంలోనే ఒక గమ్మత్తయిన మత్తుందనికలలేవీ లేనివాడ్ని సన్యాసి అంటారనివాడికి అడవులు కొండల్లో జపమాలలు తిప్పటమేపనిగా ఉంటుందని అనుకునే వాడ్ని అప్పుడప్పుడూ కన్న కలలన్నీ గుట్టపోసి చూసేవాడ్నిఏం చేయాలో తోచక మళ్ళీ బుర్రలోనే దాచేవాడ్ని బతకటం అంటే జీవితం చేసే నానా రకాల అలజడినిసితారు తీగల్లా సవరించటం కాదు కనకనా ఖ్యాతి కలలు కూడా గడ్డంలాగే నెరిసిపోయాయిఅప్పుడు పిల్లల నాజూకు […]

Continue Reading
Posted On :

ఓపెన్ సీక్రెట్ (కవిత)

ఓపెన్ సీక్రెట్  -నిర్మలారాణి తోట నాకు తెలుసు నాకే కాదు సమస్తనారీలోకానికీ తెలుసు నీ చూపుడు వేలెప్పుడూ నావైపే చూస్తుందని నే కట్టే బట్టా నా పెరిగే పొట్టా అన్నీ నీకు కాలక్షేపసాధనాలే ఆక్షేపణల శోధనలే.. మడతపడ్డ నాలుగువేళ్ళు నిన్నేమని నిలదీస్తున్నాయో నీకెప్పుడూ కనిపించదు నీ కురుచ బుద్దికి నా దుస్తులు పొట్టివైపోతాయి నీ మైక్రోస్కోపిక్ చూపులకు ఆరు గజాల చీరకూ చిల్లులు పడతాయి నువ్వెప్పుడూ “నేను” కాని మాంసపుముద్దనే చూడగలవెందుకో.. చిత్రంగా అనిపిస్తుంది మేము చేసిన బొమ్మలే మమ్మల్ని బొమ్మల్నిచేసి […]

Continue Reading
Posted On :

దేహచింతన (కవిత)

దేహచింతన   –చల్లపల్లి స్వరూపారాణి నిజానికి మీకో దేశాన్నే యివ్వాలనుకున్నాదేహాన్నిచ్చి పాఠ్య పుస్తకం అవుతున్నా చచ్చినాక పూడ్చుకోడానికి ఆరడుగుల నేలకోసం యుద్ధాలు చేసే సంతతివైద్య విద్యార్దీ!యిది దేహం కాదు, దేశం ఈ దేహాన్ని జాగ్రత్తగా చదువు!దేశం అర్ధమౌతాది పేగుల్లో అర్ధశాస్త్రముంది చూడు చర్మం సుకుమారి కాదు వెన్నపూసల మర్దనా నలుగుపిండి స్నానం యెరగదు అయినా కళ్ళల్లో ఆకాంతి యెక్కడిదో ఆరా తియ్ !యిక గుండెకాయ గురించి యేమి చెప్పను!యెన్ని కొంచెపు మాటలు రంపంతో కోశాయో!ఆ గాయాలే సాక్ష్యం  వూపిరితిత్తులు నవనాడులు కాసింత గౌరవం కోసమే కొట్టుకునేవి ఈ దేహానికి తలకంటే పాదాలే పవిత్రం రాళ్ళూ రప్పల్లో చెప్పుల్లేకుండా తిరుగాడిన కాళ్ళు యెదురు దెబ్బలతో  నెత్తురు […]

Continue Reading

జీవితం(ఆంగ్లం మూలం: క్యారీ లా మోర్గన్ ఫిగ్స్ తెలుగు సేత: ఎలనాగ)

జీవితం ఆంగ్లం: క్యారీ లా మోర్గన్ ఫిగ్స్ తెలుగు సేత: ఎలనాగ 1 ఆనందపు క్షణం, ఆర్తి నిండిన ఘడియ ఎండ కాసిన ఒక దినం, వాన కురిసిన ఏడు రోజులు శాంతి విరిసిన పక్షం, ఘర్షణ ముసిరిన ఒక మాసం ఇవన్నీ కలిస్తే జీవితమౌతుంది 2 డజను శత్రువుల మధ్య నిజమైన స్నేహితుడొక్కడు, మూసిన ఇరవై గేట్లను మరిపిస్తూ తెరిచివున్న ద్వారాలు రెండు భోగభాగ్యాల సింహాసనం, ఆపైన పాడుకాలపు పట్టాకత్తి మిత్రులారా! ఇవన్నీ కలిస్తే జీవితం […]

Continue Reading
Posted On :

సముద్రం (కవిత)

సముద్రం   -వసీరా ఆకాశాన్ని నెత్తి మీదమోస్తూ సముద్రం ఒక చేపగా మారి ఈదేస్తుంది భూతలం మీద సముద్రం ఎగురుతుంది పక్షిగా మారి నీటిరెక్కలతో నీలమేఘమైపోయి సూరీడికి ఆవిరి స్నానం చేయించి సముద్రమే బడి వరండాలోంచి బయటపెట్టిన చిన్నారుల అరచేతుల మీద చినుకులై మునివేళ్లమీద విరిసిన సన్నజాజులై సముద్రమే చిన్నారుల ముఖాలమీద మెరుపులై ముఖపుష్పాల మీంచి ఎగిరే నవ్వుల సీతాకోక చిలుకలై సముద్రమే సముద్రమే బడిగంటమోగినంతనే చినుకుల మధ్య కేరింతలతో మారుమోగే గాలికెరటాలై సముద్రమే తన సొట్టబుగ్గల మీద […]

Continue Reading
Posted On :
gavidi srinivas

గాయం పాడిన గేయం (కవిత)

గాయం పాడిన గేయం -గవిడి శ్రీనివాస్ ఉండుండీ ఒక్కసారీ దుఃఖ దొంతరల్లోకి జారిపోతాను. ఎప్పటికప్పుడు వ్యూహాలు పదును పెట్టడం కన్నీటిని చెక్కడం సుఖమయ ప్రయాణాలుగా మల్చడం. లోతుగా జీవితాన్ని తరచిచూడటం తడిమి చూడటం ఒక లక్ష్యం వైపు దూసుకు పోవటం నిరంతర శ్రమలోంచి దారుల్ని వెలిగించటం తృప్తిని ఆస్వాదిస్తూ అలా అడుగులు సాగుతుంటాయి . నిద్రలేని రాత్రుల్ని గాయం పాడిన గేయం ఓదార్చుతుంది . మౌన ప్రపంచంలోంచి లేచి భావాలు భాషిల్లుతుంటాయి . ఇక్కడ విషాదమేమిటంటే పరిగెత్తేవేగానికి […]

Continue Reading

కొత్త లోకం (కవిత)

కొత్త లోకం   –శిలాలోలిత రంగును కోల్పోయి కొల్లగొట్టబడ్డ నీటి మొహం కెరటాలతో తలబాదుకుంటోంది ఆకాశం ఏ రంగు చొక్కాను తొడిగితే అదే తన రంగనుకునే మురిపెం త్రివేణీ సంగమంలో కనిపించే రంగుల తేడా అండమాన్ దీవుల్లో మెరిసే ముదురు నీలం అంగీ ఆకుపచ్చని నలుపుల భ్రమల చెట్టు చుట్టూ తిరుగుతుంటుంది — ఆమె కూడా అంతే కోల్పోయిన బతుకు రంగుల్ని ఏరుకొనే ప్రయత్నమే బతుకంతా ఆమెకైతే ఉచితంగా గాయాల ఎర్ర రంగు కమిలిన శరీరాల పెచ్చులూడిన తనం […]

Continue Reading
Posted On :

మరణదుఃఖం(ఆంగ్లం మూలం: డబ్ల్యు. ఏచ్. ఆడెన్ తెలుగు సేత: ఎలనాగ)

మరణదుఃఖం ఆంగ్లం: డబ్ల్యు. ఏచ్. ఆడెన్ తెలుగు సేత: ఎలనాగ అన్ని గడియారాలను ఆపేయండి టెలిఫోన్ తీగను తెంపేయండి రుచికరమైన బొమికను నోట్లో పెట్టుకున్న కుక్కను మొరగనివ్వకండి పియానోల శబ్దాన్ని ఆపు చేయండి బ్యాండుమేళపు ధ్వనిని తగ్గించి శవపేటికను బయటికి తీసుకురండి ఏడ్చేవాళ్ళను ఇవతలికి రానీయండి విమానాలు దుఃఖంతో పైన చక్కర్లు కొడుతూ “అతడు చనిపోయాడు” అనే సందేశాన్ని ఆకాశంలో రాయనీయండి కపోతాల తెల్లని మెడల చుట్టూ కట్టండి మెడపట్టీలను ట్రాఫిక్ పోలీసు నల్లని చేతితొడుగులను తొడుక్కోనివ్వండి […]

Continue Reading
Posted On :

అమృత వాహిని అమ్మే కదా (పాట)

అమృత వాహిని అమ్మే కదా (పాట) -డా||కె.గీత ఆనందామృత క్షీరప్రదాయిని అమ్మే కదా అనురాగాన్విత జీవప్రదాయిని అమ్మే కదా ఇల్లాలై ఇలలో వెలసిన ఇలవేలుపు కదా జో లాలై కలలే పంచిన కనుచూపే కదా కడలిని మించే కెరటము ఎగసినా కడుపున దాచును అమ్మే కదా- ఉరుము మెరుపుల ఆకసమెదురైనా అదరదు బెదరదు అమ్మే కదా తన తనువే తరువై కాచే చల్లని దీవెన అమ్మే కదా జీవితమే ఒక ఆగని పోరాటం ఆశనిరాశల తరగని ఆరాటం […]

Continue Reading
Posted On :
T. Hima Bindu

ఆశయాల సాధనలో నిశ్శబ్ద రేయి (కవిత)

ఆశయాల సాధనలో నిశ్శబ్ద రేయి -డా. టి. హిమ బిందు జాబిల్లి చెంత వెన్నెల రేయి చల్లనిదే.. నిదుర ఒడిలో జోల పాడే రేయి మధురమైనదే ఒంటరి మనసులకు నిదానంగా నడుస్తూ రేయి మెల్లనిదే ఒంటరి ప్రయాణంలో గుబులు పుట్టిస్తూ సాగిపోయే రేయి భయానకమైనదే అస్వస్థతలో తోడు దొరకని రేయి నరకప్రాయమైనదే ఆశయాల సాకారంలో సహకరించే రేయి నిశ్శబ్ద మైనదే… కోప తాపాల నడుమ కొట్టుమిట్టాడుతున్న రేయి మౌనమైనదే… ప్రేమ తోడులో ఊసులాడు రేయి ఆనంద నిలయమే…. ఎన్ని రేయిలయినా ప్రతి రేయి ప్రత్యేకమే.. ప్రతి ఉదయం కొత్త ఆశల ఉషోదయమే…. ***** డా. టి. హిమ బిందురంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నాను. స్వస్థలం భద్రాచలం. 2005 సం. లో కాకతీయ యూనివర్సిటీ , వరంగల్ లో పర్యావరణ శాస్త్రంలో నీటి కాలుష్యం పై పీ. హెచ్. […]

Continue Reading
Posted On :
Komuravelli Anjaiah

వెంటాడే కల (కవిత)

వెంటాడే కల -కొమురవెల్లి అంజయ్య వెంటాడే కల ప్రశ్నిస్తుంది చేతగానితనాన్ని నిలదీస్తుంది సోమరిపోతు వైఖరిని మొండి బారకుండా, తుప్పు పట్టకుండా ఎప్పటికప్పుడు నూరుతుంది కొత్తగా దారిలో నుంచి పక్కకు జరుగకుండా చూస్తుంది కలలెన్నో ముల్లె కట్టుకొని ఉంటాయి అన్నీ కుమ్మరిస్తాం, ఏరుతాం నచ్చినవి కొన్ని చొక్కాజేబులో దాచుకుంటాం గుండెకు దగ్గరగా విత్తనం ఏదైనా కనిపిస్తే భూమిలో నాటి నీళ్ళు పోసి పెంచుతాం రాళ్ళల్లో రత్నాన్ని మెడలో ధరిస్తాం వెంటాడే కల సాకారం కోసం నా చెమటతో నా […]

Continue Reading

స్తబ్ధత అడుగున…(హిందీ మూలం: అమృత భారతి ఆంగ్లం: లూసీ రోజెన్ స్టీన్ తెలుగు సేత: ఎలనాగ)

స్తబ్ధత అడుగున… హిందీ మూలం: అమృత భారతి ఆంగ్లం: లూసీ రోజెన్ స్టీన్ తెలుగు సేత: ఎలనాగ ఒక మట్టిపెళ్ళలా నన్ను విసిరేశాడతడు నాకొక ఆత్మ ఉందనీ, నేను జీవం ఉన్న మనిషిననీ తెలియదతనికి అలా మట్టిపెళ్ళలా నన్ను తన మార్గంలోంచి నా మార్గంలోకి విసిరేస్తూ పోయాడు నా తోవ నిర్లక్ష్యానికి గురైంది సొంతమార్గంలో ప్రయాణిస్తూ పోయాను నేను ప్రతిసారీ నాలోని ఒక ముక్క విరిగి పడిపోయింది కొంత మోహం, సుఖం పట్ల కొంత వ్యసనం, కొంత […]

Continue Reading
Posted On :

ఆ చిరునవ్వు ఆగిపోయింది (కవిత)

ఆ చిరునవ్వు ఆగిపోయింది -పారుపల్లి అజయ్ కుమార్ మనిషి ఎంత ఎత్తు ఎదిగి  ఏం లాభం ? మనసులో మాలిన్యాన్ని నింపుకొని ……. ఎంత చదువు చదివి ఏం ప్రయోజనం ? సంస్కారం అన్నది లేకపోయాక …… కత్తితో పొడిస్తేనో, తుపాకీతో కాలిస్తేనో హత్యా ? మాటలను తూటాలుగా పేల్చి మనసును శకలాలుగా చేయటం హత్య కాదా? ఎన్నో గుండెలపై స్టెతస్కోప్ ను పెట్టి హృదయ స్పందనలను విని ప్రతిస్పందించే గుండెలో హేళనగా, అసహ్యకరమైన రాతల గునపాలు […]

Continue Reading
gavidi srinivas

పల్లె పిలుస్తోంది…! (కవిత)

పల్లె పిలుస్తోంది…! -గవిడి శ్రీనివాస్ చిగురుటాకుల్లో  వెన్నెల చూపుల్లో తడిసిలేలేత గాలులతో మురిసి పల్లె నిండుగా పులకరిస్తోంది. చిన్ని సరదాల్ని సూర్య కిరణాల్ని వొంపుతూముఖం లోంచి ఆనందాలు ఉదయిస్తున్నాయి. ఆరుబయట అట్లానేచిరు నవ్వులు వేచివున్నాయి. పల్లెతనం అమ్మతనం ఎంచక్కాఆప్యాయంగా నిమురుతున్నాయి. వేసవి అయితే చాలుపిల్లలు పల్లెకు రెక్కలు కట్టుకునిఎగురుతున్నారు. మామిడి చెట్ల నీడలోజీడి చెట్ల కొమ్మల్లోఅడుగులు వడివడిగామురిసి పోతున్నాయి. మట్టి పరిమళాల్ని అద్దుకునిమంచు బిందువుల్ని పూసుకునిఎగిరే పక్షుల వెంటఆనందాలు సాగిపోతున్నాయి. కరిగిపోతున్న కలల్ని ఎత్తుకునినా పల్లెలో వాలిపోతాను. దోసిళ్ళలో చిరు నవ్వుల్నివెలిగించుకునిఅలసిన క్షణాల నుంచీఅలా సేదదీరుతుంటాను. ***** గవిడి శ్రీనివాస్గవిడి […]

Continue Reading

మధ్య తరగతి మకరందం (కవిత)

మధ్య తరగతి మకరందం -ఎజ్జు మల్లయ్య అమ్మ నేర్పిన తొలి పలుకుల నుంచి అమ్మ ఒడిలో పడుకున్న వెచ్చని నిద్ర నుంచి అమ్మ మోసిన కట్టెల మోపు నుంచి పాత బట్టలకు కుట్టేసిన సూది దారం నుంచి అమ్మ చేసే పరమాన్నం తిన్న పరమానందం నుంచి నాన్న వాడిన ఉల్లి-బాడిష నుంచి నాన్న చెక్కిన పళుగొర్రు నుంచి నాన్న దున్నిన గుంటిక వరుసల్లోంచి నాన్న పేర్చిన బండి పల్గడి దబ్బల నుంచి నాన్న అల్లిన పుల్జరితట్ట నుంచి […]

Continue Reading
Posted On :

మర్చిపోతున్నారు (కవిత)

మర్చిపోతున్నారు -లక్ష్మీ శ్రీనివాస్   అమ్మ పాలు వదిలిఅమ్మకం పాలు రుచి చూచినప్పుడేఅమ్మ భాషను మరిచి ..అమ్మకం భాషకు బానిస అయ్యారు!స్వేచ్ఛగా తెలుగు భాషనుమాట్లాడడానికి మొహం చాటేసుకుంటూ పరాయి భాషను బ్రతికిస్తూగొప్పగా బ్రతుకుతున్నామనిఅనుకొంటున్నారు కానిబ్రతుకంతా బానిసేనని మర్చి పోయారు !! నేడు పరాయి భాష కోసంప్రాకులాడుతున్న వాళ్లంతావిదేశాలకు పారిపోయికన్న వాళ్ళను అనాధలుగా చేసివాళ్ళ కన్నీటికి కారణమవుతున్నారుతెలుగు జాతి ఆత్మ గౌరవానికితెలుగు భాష మనుగడకు భంగం చేకూరుస్తున్నారుచీకటికి వెలుగు కరువైనట్టుతెలుగుకి తెలుగువాడు మరుగౌతున్నాడు!! పెద్ద పెద్ద చట్ట సభలలోసూటు బూటు వేసుకొనిఅర్ధం కాని పదాలతోఫ్యాషన్ […]

Continue Reading

జవాబు జాడ చెప్పడం లేదు… (కవిత)

జవాబు జాడ చెప్పడం లేదు… -చందలూరి నారాయణరావు నా కథలో అడుగుదూరంలో ఓ కొత్త పాత్ర నడుస్తున్న చప్పుడును దగ్గరగా విన్న ఇష్టం కలకు ప్రాణంపోసి…. ప్రవహించే ఊహగా పరిగెత్తె ఆశగా ఎంత వెతికినా నడక ఎవరిదై  ఉందన్న ఒక్క ప్రశ్నకు ఏ క్షణం జవాబు జాడ చెప్పడం లేదు. నెర్రెలు బారిన మోముతో పొడిబారిన కళ్లతో ఏనాడో పుట్టి పెరిగిన ఈ రహస్యమో గుండెలో దాచుకున్న సత్యంగా ఏ గాలికి కొట్టుకురావాలో? ఏ వరదకు నెట్టుకురావాలో? […]

Continue Reading
T. Hima Bindu

తానే (కవిత)

తానే -డా. టి. హిమ బిందు నిస్వార్ధపు లాలిత్యం కురిపించే తల్లీ తానే దూరంగున్నా మమతలో హక్కు కోరే కూతురూ తానే ప్రేమకు సర్వం ధారపోసే అపూర్వం తానే చిలిపి అల్లర్లున్నా కలిమి లేమిలో తోడుగ నిలిచే చెల్లీ తానే పోటీ కొచ్చినా కడుపులో పెట్టుకు చూసే అక్కా తానే సోపతి అనుకునే పతికి సహధర్మచారిణీ తానే అలుపెరగని పతికి ఆలంబన తానే సకలం నీవే అనే పతికి పట్టపు రాణీ తానే కాలం కలిసి రాక […]

Continue Reading
Posted On :

పెదాలు చీకటి పడి (కవిత)

పెదాలు చీకటి పడి – శ్రీ సాహితి మధ్యలో ఓ పేజీలో మాటేసిన ఓ వాక్యం కవాతుకు నిద్ర లేని రాత్రులు తూర్పార పట్టినా గుండెకెత్తలేని కలకు పోగైన జ్ఞాపకాలు నిద్రలో నల్లగా పొంగి పొర్లి పట్టపగలే పెదాలు చీకటి పడి పలుకు స్పర్శలేక ఆకలి కళ్ళు పాత మనసువైపు తీపిగా చూస్తుంటే కొత్త ఆకలికి పాత శరీరంలో లేని రుచి ఉంటుందా? ***** సాహితి -మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) నేను ప్రస్తుతం […]

Continue Reading
Posted On :
subashini prathipati

నీకు నాకు మధ్యన (కవిత)

నీకు నాకు మధ్యన -సుభాషిణి ప్రత్తిపాటి అప్పుడెప్పుడో… దశాబ్దాల క్రితంఏడేడు జన్మల బంధంనీది నాది అనుకుంటూ…అడుగులో అడుగు వేసినప్పుడుమన మధ్యన ఏముంది?? మహా గొప్పగా చెప్పడానికి!తొలి వలపులతహతహల చెర వీడిన మలి అడుగుల్లో …మది తలుపులేవో మెల్లగా తెరిచాక కదాఅగాధాల లోతులు తెలిసిందికర్కశపు జాడలు చూసింది కన్నీటి వ్యథ ఎదురైంది అప్పుడు మన నడుమదట్టమైన గాజు తెరలుమన నీడలే మనకు శత్రువులైఅనిశ్చితంగా కదలాడేవి! గదిలోపలి గోడలు బీటలు వారిన ఇన్నేళ్ళకు,నాకర్థమయింది,కాలంతో పాటు మంచులా కరిగింది మన మధ్యన ఇన్నాళ్లూ పేరుకున్న *నిశ్శబ్దమని*! శాబ్దికమయినాకే తెలిసిందిహృదయం రవళిస్తుందని, అదేమిటోఁ…. ముసురుకున్న హృదయాకాశంకరుణావృష్టిని ధారపోస్తే […]

Continue Reading

నెల పండుగ (కవిత)

నెల పండుగ – డా॥కొండపల్లి నీహారిణి రాతపూతల్లో కవి దోగాడి భావ ధూళి కనిపించిన కన్నులతో నిన్నటి రోజును దోసిట్లో పోసినప్పుడు నేల దాచిన రహస్యాల్ని వెలికి తీయాలి తరాల తరబడి ఎరుపు దుఃఖ సాగరాలను తనతో తెచ్చుకున్న జాతి అంతా నాలుగు రోజుల గుండె బరువు కన్నీటి మడుగులో కడిగి దింపలేని ఇరుకును మనసు గోడలకు తెలియని కడుపుదేనని ఐదు దశాబ్దాల నిశ్శబ్ద క్షుత్తు నొప్పి నుండి దాటిరాలేని బతుకు భ్రమ భ్రమలు బతుకైనప్పుడు దాటిరాగల […]

Continue Reading
gavidi srinivas

కొన్ని పరిమళాలు (కవిత)

కొన్ని పరిమళాలు -గవిడి శ్రీనివాస్ నలుగురితో  మాట్లాడుకోవటంపక్షుల కిలకిల రావాలు వినటంవనాలు పచ్చని తోరణాలు కట్టటంమొగ్గలు వీడి గాలితో పలకరించటంగాలి చేరి హృదయాలు వికశించటం ఇసుక తెన్నెల్లో  కూర్చునిఎగసే కెరటాల్ని చూడటం చుట్టూ ఊగే దృశ్యాల్నికళ్ళల్లో వొంపుకోవటంఆస్వాదించటం నాలో సంచరించే కొన్ని పరిమళాలు. వెన్నెల కాంతుల్ని తొడుక్కోవటంవర‌్షధారల్ని నింపుకోవటం ఆశగాఆకాశం వంకాహరివిల్లు వంకాకొంచెం కొత్తగా చూపుల్ని ఆరేసుకోవటంనాకింకా అలానే ఆనందాలు పొద్దు పొడుస్తున్నాయి. దేహమంతా పరవశంతోఅనేక దీపాలుగా వెలుగుతుంది. చిన్ని కొండలనూ ఎక్కి దృశ్యాల్ని నింపుకుంటాను. పిల్లకాల్వలో గెడ్డలలోచేపలు పట్టుకుంటాను కొన్ని పరిమళాల్నినాతో అంటిపెట్టుకుంటాను. ***** గవిడి శ్రీనివాస్గవిడి శ్రీనివాస్  ఆంధ్ర విశ్వవిద్యాలయం […]

Continue Reading

కీ (కవిత)

కీ -లక్ష్మీ శ్రీనివాస్ ఆనాడు కొందరుఊపిరి విడిచిఊపిరి పోసిరిఊరూరు స్వేఛ్చగా ఉండాలని ఆశ పడిరిఆశలు ఆశలుగానే ఉన్నాయి నేడు స్వేచ్ఛఎగరేసిన ప్లాస్టిక్ పక్షిలామారిపోయిందిఎక్కడ వాలమంటే అక్కడ వాలుతుందిపాపం దానికేం తెలుసు ? నేడు సమాజమే”కీ” ఇచ్చే యంత్రంలామారిపోయింది ఆడించే ఆటబొమ్మలా మారిపోయిందిఇంక ఎక్కడ స్వేచ్ఛస్వేచ్ఛ కూడా అక్కడేఎక్కడ ఉంటే “కీ” ***** లక్ష్మీ శ్రీనివాస్టి.శ్రీనివాసులు (లక్ష్మీ శ్రీనివాస్) చిత్తూరు జిల్లా పలమనేరు తాలూకా దగ్గర తాళ్ళపల్లి గ్రామంలో లక్ష్మీదేవి, ఆంజప్పలకు జన్మించారు. ఎం. ఏ, బి. ఏడ్, పూర్తిచేసి, ప్రస్తుతం తెలుగు అధ్యాపకుడిగా మదర్ థెరిస్సా […]

Continue Reading

Expiration (కవిత)

Expiration -బండి అనూరాధ వెళ్ళిపోతే వెళ్ళిపోయావు. ఈ దిగులునూ పట్టుకునివెళ్ళవలసింది.చేతులు ఖాళీలేకపోతేనేం.మనసు అరలో కుక్కుకునైనాపోవలసింది. ఏకాంతాలదొంతరని తివాచీలా పరచి రాజసంగా నడిచి వెళ్ళిపోయావు. దేదీప్యమాన జ్ఞాపకాల రత్నాలు నలిగి అలిగి ప్రకాశించడం మానేసాయి.  మళ్ళీ వస్తావని నా చుట్టూ ఉన్న ఏ పరిసరమూ నమ్మదు. నేనెలా నమ్మేదీ.  మోహం సడలి మైకం వదిలిహ్మ్ ..మజిలీలుండవు.  ముగింపులే ఉంటాయి. ***** బండి అనూరాధపేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం కృష్ణా జిల్లా తాడిగడప గ్రామం. చదువు ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్. కవిత్వమంటే ఇష్టం. […]

Continue Reading
Posted On :

సంతోషాన్ని వెతుకుతూ (కవిత)

సంతోషాన్ని వెతుకుతూ -హేమావతి బొబ్బు సంతోషాన్ని వెతుకుతూ కొండ కోనలు తిరుగుచూ ఎక్కడున్నదో తెలియక ఎప్పుడోస్తుందో, అసలు వస్తుందో రాదోనని పబ్బుల్లో ఉందో మబ్బుల్లో ఉందో తాగే మందులో ఉందో చల్లటి చెట్టు నీడలో ఉందో మదిలో ఉందో షాపింగ్ మాల్స్ లో ఉందో పర్స్ లో లేకా ప్రేమించే గుండెలోన హిమాలయాల లోనే కలియతిరుగుచూ కనిపించే ప్రతి హృదయాన్ని నే అడిగా నాకు కొంచెం సంతోషాన్ని ఇవ్వమని విరిసే ప్రతి పువ్వుని అడిగా దారి తప్పిన నా సంతోషాన్ని దరి చేర్చమని మీకు తెలిస్తే తప్పక చెప్పండి నా సంతోషాన్ని రమ్మని పొత్తిళ్ళలో పసిపాపలా పెంచాను నేను దాన్ని మొగ్గలా తొడిగేను అది నా పసిప్రాయంలో యవ్వనాన ఎదిగేను మహావృక్షంగా నడుమొంగిన వయస్సులో నా మెడలు వంచి నడచి పోయెను నేను ఎదిగానని తలచి ***** హేమావతి బొబ్బునేను హేమావతి బొబ్బు తిరుపతి వాసిని, ప్రాధమిక విద్య తిరుమల శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో, ఉన్నత విద్య శ్రీ పద్మావతి మహిళా కళాశాల  తిరుపతి లో జరిగింది. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి […]

Continue Reading
Posted On :

చకోర పక్షి (కవిత)

చకోర పక్షి – గంగాపురం శ్రీనివాస్ జీలకర్ర, బెల్లం విడివడక ముందే గోరింటాకు ఎరుపు ఎల్వకముందే అప్పుల కుప్పలు కరిగించడానికై నెత్తి మీదున్న చెల్లి పెళ్లి కుంపటి దించడానికి చకోర పక్షిలా చక్కర్లు కొడుతూ గొంతుక తడారలేని ఇసుక దిబ్బలపై రెక్కలు తెగి వాలిన ఓ. వలస విహంగామా, ఎన్నో ఆశల ఊసులతో ఎగిరొచ్చిన ఓ. కలల పావురమా హృదయం ద్రవించలేని సాయబుల చేతిలో బందీవై, బానిసవైనావా! ఎడారి దేశంలో రాళ్ళు కరిగి చమురౌతదేమోగానీ, మనసు కరగదని […]

Continue Reading

ఓ కవిత విందాం! “పంజరాన్నీ నేనే పక్షినీ నేనే”

https://youtu.be/Cjm7xzplHpU శిలాలోలిత1958 జూలై 12 న పుట్టిన శిలాలోలిత అసలుపేరు పి.లక్ష్మి. వీరు కవియాకూబ్ గారి సహచరి. పుట్టింది, పెరిగింది హైదరాబాద్ కు సమీపంలోని శంషాబాద్. తండ్రిగారు కీ.శే. పురిటిపాటి రామిరెడ్డి హిందీ పండిట్ గా హైదరాబాద్ పరిసరాల్లోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం వల్ల బాల్యమంతా ఇసామియా బజార్,నింబోలిఅడ్డ, మలక్ పేటలలో గడిచింది. తెలుగుసాహిత్యంలో ఎం ఏ, ఎం ఫిల్, పిహెచ్ డి లు తెలుగు విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలలో పూర్తిచేసి తెలుగు అధ్యాపకత్వంలో స్థిరపడి ఇటీవలే […]

Continue Reading
Posted On :

బద్ధకంగా బతికే ఉంటాయి (కవిత)

బద్ధకంగా బతికే ఉంటాయి – శ్రీ సాహితి ఒక్కో రోజుకు బాకీ పడతామో, బాకీ తీరుతుందో తెలియదు. పగలంతా ఊహల్లో ఈత రాత్రంతా మెలకువలో మునక ఊడిగం చేసే ఆలోచనలో విశ్రాంతి లేని నిజాలు వెలుతురును కప్పుకుని ఎండలో ఎగురుతూ చీకటిని చుట్టుకుని చలిలో ముడుక్కుని తలను నేలలో పాతి ఆకాశానికి కాళ్ళను వ్రేలాడుతీసి సంద్రంలా మారిన మెదడులోని తెరలు తెరలుగా కలలు నిద్రను ఢీ కొని బద్దలైన రోజులో బద్ధకంగా బతికే ఉంటాయి. ***** సాహితి […]

Continue Reading
Posted On :

ఓ కవిత విందాం! “బతుకు”

https://youtu.be/lnpxteuu6Mk వారాల ఆనంద్వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. నాలుగు దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో పని చేసారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవలల్లో జ్యూరీగా వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు కమిటీలలో కూడా సభ్యుడిగా వున్నారు. రచనలు- లయ (కవిత్వం), మానేరు తీరం (కవిత్వం), మానేరు గలగల (సాహిత్య విమర్శ), మనిషి లోపల (కవిత్వం), మెరుపు ( సాహిత్య కారుల ఇంటర్వూలు), అక్షరాల చెలిమె (కవిత్వం), […]

Continue Reading
Posted On :

ఓ కవిత విందాం! “అసింట”

అసింట -డా.కె.గీత అయ్యగోరికీ దణ్ణంబెట్టు అమ్మగోరికీ దణ్ణవెట్టని డూ డూ బసవన్న బతుకేనెహె అయ్యగోరు పెరట్లోకి పిలిత్తే అదురుస్టవనుకుని లగెత్తేవు గొబ్బిరి గాయలు దించనాకెహె అమ్మగోరు సెర్లో పూలు తెంపుకు రమ్మంటే గుమ్మం తొక్కొచ్చనుకునేవు దేవుడు గూడా ఆళ్ల పార్టీయేనెహె మటవేసుకుని మూలన కుయ్ కయ్ అనకండా కూకుని పెసాదాన్ని మా సేతల్లోకి ఇసిరే సేతి కోరికలు మాత్తరవే తీరుత్తాడు అమ్మాయిగోరు తొంగి తొంగి సూత్తంటే బూలోకరంబ నీ మీద మనసుపడ్డాదనుకునేవు అసింట మొకం ఎలా ఉంటాదో […]

Continue Reading
Posted On :

నీకు నా కృతజ్ఞతలు ప్రభూ (కవిత)

నీకు నా కృతజ్ఞతలు ప్రభూ -హేమావతి బొబ్బు దప్పికతో ఒయాసిస్సులు వెదకుచూ ఎండమావుల వెంట పరుగులు తీస్తున్నపుడు గుక్కెడు నీటిని ఇచ్చి దప్పికను తీర్చినందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ ఆకలితో నకనక లాడుచున్న కడుపును చేతబట్టి దేశదిమ్మరినై తిరుగుతున్నపుడు గుప్పెడు మెతుకులతో ఆకలిని తీర్చినందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ నాది నా వాళ్లంటూ  ప్రాణం పోయినా మమకారాన్ని చంపుకోలేక నా ఆత్మ దిక్కులేక ఆక్రోశిస్తున్నపుడు అమ్మ కడుపులో ఊపిరి పొసినందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ లోకం పోకడ తెలియక బుడి బుడి నడకలతో చెడుబాట పట్టినపుడు నడక నేర్పడానికి తండ్రివి నీవై నందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ కడుపు నిండిన మనస్సు పండక ప్రేమను కోరుతున్న కట్టెని కాల్చడానికి  నా గుండె దాహాన్ని తీర్చడానికి ప్రియురాలి వై, భార్య వైనందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ వాలుతున్న శరీరాన్ని వసంతంలో నింపడానికి వయస్సుడుగుతున్నపుడు నా భుజాల చుట్టూ చేతులు వేసి నన్ను నడిపించడానికి నా బిడ్డవైనందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ నాకు పునరుజ్జీవితం ఇవ్వడానికి నాకు మరణాన్ని ప్రసాదిస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు ప్రభూ ***** హేమావతి బొబ్బునేను హేమావతి బొబ్బు తిరుపతి వాసిని, ప్రాధమిక విద్య తిరుమల శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో, […]

Continue Reading
Posted On :
T. Hima Bindu

ఆశయాల సాధనలో నిశ్శబ్ద రేయి (కవిత)

ఆశయాల సాధనలో నిశ్శబ్ద రేయి -డా. టి. హిమ బిందు జాబిల్లి చెంత వెన్నెల రేయి చల్లనిదే.. నిదుర ఒడిలో జోలపాడే రేయి మధురమైనదే ఒంటరి మనసులకు నిదానంగా నడుస్తూ రేయి మెల్లనిదే ఒంటరి ప్రయాణంలో గుబులు పుట్టిస్తూ సాగిపోయే రేయి భయానకమైనదే అస్వస్థతలో తోడు దొరకని రేయి నరకప్రాయమైనదే ఆశయాల సాకారంలో సహకరించే రేయి నిశ్శబ్ద మైనదే… కోప తాపాల నడుమ కొట్టుమిట్టాడుతున్న రేయి మౌనమైనదే… ప్రేమ తోడులో ఊసులాడు రేయి ఆనంద నిలయమే…. ఎన్ని […]

Continue Reading
Posted On :

నేతన్నలూ! (అనువాద కవిత)

నేతన్నలూ! -దాసరాజు రామారావు ఆంగ్లమూలం – సరోజినీ నాయుడు తెల్లారగట్లనే నేత పనిలో పడ్డ నేతన్నలూ! అర్ధనగ్న దుస్తుల నెందుకు నేస్తరు?… పాలపిట్ట నీలపు రెక్క లాంటిది కాకుండా మేం పురిటి బిడ్డకు రాజస మొలికే నిలువు శేర్వాణీలను నేస్తం- చీకట్లొస్తున్నా నేస్తూనే వున్న నేతన్నలూ! మిరుమిట్లు గొలిపే వస్త్రాల నెందుకు నేస్తరు?… నెమలి లాంటి ఉదా, ఆకుపచ్చల సహజాకర్షణ లేకుండా మేం మహారాణికి పెళ్ళి కళ తొంగి చూచే మేలిముసుగులను నేస్తం- కర్కశమైన శీతల శరత్తులో ఇంకనూ పని నిష్టలో […]

Continue Reading
sailaja kalluri

సౌందర్య సీమ (కవిత)

సౌందర్య సీమ -డా.కాళ్ళకూరి శైలజ హిమాలయం నా పుట్టిల్లు’గుల్మార్గ్’ నే విరబూసిన బాట. తొలి అడుగుల తడబాటు నుంచి,ఇన్నేళ్లు నడిచిన దూరమంతా,నేనై తమ దరికి వచ్చేదాకావేచి చూసిన ఉత్తుంగ శ్రేణులవి.  కొండల భాష వినాలంటే మనసు చిక్కబట్టుకోవాలి.ఆ భాషకు లిపి లేదు.ఆ పాటకు గాత్రం ఉండదు. ఎంత ఎత్తైనవో అంత లోతైన అంతర్మధనం జరిగేలా దీవించి,అక్కున చేర్చుకునే సీమ. ఆకలి,దప్పిక,ప్రేమ,గాయం పదేపదేతూట్లు పొడిచిన జల్లెడను నేను.ఈ దేహం పక్కకు పెట్టి, ఇక పర్వతాల గాలి పీల్చుకోవాలి. చీనార్ ఆకుల నడుమ పండి, ఎలా వర్ణశోభితమయ్యానో!తోటలోనే మాగిన ఆపిల్ గుత్తిలోఎన్ని […]

Continue Reading

ఆలాపన (కవిత)

ఆలాపన -బండి అనూరాధ నిదానంగా కురిసే ప్రేమని పెనుగాలులు అసలేమీ చెయ్యలేవు. దీపాలు కొండెక్కడం మామూలుకాదు. నానాతంటాలూ పడి ఏదో అనాలని చూస్తారుకానీ కాంతిలో తేలిపోతారు ఎవరివి హృదయాలని వెతకకుఎక్కడ మనుష్యులూ అని తిరుగకువిరిగిపోయిన ముక్కల్లో లెక్కలు చూడకుదూరమైనసూదుల్లాంటిభావాల్లో తలనుదూర్చినిన్ను నువ్వు గుచ్చుకోకుగ్రహించుదారంలేనివి ఆధారాలు కావెప్పుడూ  అయినా పలకరింపుల్లేని ప్రేమల్లో విహరించడంద్వంద్వాల్లో మరణించడంఇప్పుడసలేమీ బాగోదు సంధిచేసేవాళ్ళకి తెలియదువిసిరివెయ్యబడిన రాళ్ళు మునిపటిలా దొరకవనిఎరవేసేవన్నీ వ్యర్ధవెన్నెలప్రయత్నాలనీనూ పెనుగాలులు నిజాలని కరుచుకుని ప్రేమని తెలుసుకునే రోజొకటి రావొచ్చుప్రయాణం తప్పనప్పుడు, ప్రేమ మృత్యువంత అందంగా ఉండితీరుతుంది. ***** బండి అనూరాధపేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా […]

Continue Reading
Posted On :

ఆలస్యంగా (కవిత)

ఆలస్యంగా -మనోజ్ఞ ఆలమూరు  మనిద్దరం ఆలస్యంగా ఒకరి జీవితాల్లోకి ఒకరం అడుగుపెట్టాం ఎవరు కాదనగలరు? అయినా నేను ప్రతీరోజూ నీ గురించి కలగంటాను ఏ ఒక్కటీ నిజం కాదని తెలిసినా…. ప్రతీ కలనీ….అందులోంచి కదలివచ్చే నీ రూపాన్నీ… తల్చుకుంటూ రోజులు దొర్లించుకుంటాను ఎన్నెన్నో మధుర స్మృతులు మరెన్నో చేదు జ్ఞాపకాలునూ.. అన్నింటినీ కలిపే తీపి కల…. వాస్తవంలోకి లాక్కొచ్చే జీవితం కలలోని నీ రూపం కోసం నా ఎదురుచూపు ఆ ఎదురుచూపులో మిగిలే నైరాశ్యం అది ఎప్పటికీ […]

Continue Reading
Posted On :

ఓ కవిత విందాం! “డ్రీమీ ఐస్”

https://youtu.be/iHPzR__jS60 డ్రీమీ ఐస్ -అనూరాధ బండి వాళ్ళు నా స్వప్నాల పై నీళ్ళు చిలకరిస్తునే ఉన్నారు.నా దారులనిండా ముళ్ళు పరచి ఉంచారు.వాళ్ళెలా ఊహించి ముందుగా అక్కడికి చేరారా యని ఆశ్చర్యపోయాను.తెలుసు నాకు, మరి అదే ముళ్ళలో వాళ్ళు వెనుకకి మరలలేరని. వాళ్ళిక్కడ లేరని నేను ముందుకు వెళ్ళడం విరమించి గుప్పెడు గింజలను తీసుకుని చుట్టూ విసిరాను.కొన్ని పక్షులు వచ్చి చేరాయి.వాటి కిలకిలల మధ్య నేను కొత్తచిగురులేసుకున్నాను.అవి తినగా మిగిలినవన్నీ మొలకెత్తి పెరుగుతున్నప్పుడునాలో వసంతం వెయ్యిరకాల ధ్వనులను  చేసింది. కొత్త పనులు నేర్చుకున్నాను, […]

Continue Reading
Posted On :

అనుసృజన-మీరా పదావళి (తరువాయి గీతాలు)

అనుసృజన మీరా పదావళి (తరువాయి గీతాలు) అనువాదం: ఆర్.శాంతసుందరి 19. బరసే బుందియా సావన్ కీ సావన్ కీ మన్ భావన్ కీ (వాన చినుకులు కురుస్తున్నాయి వర్షాకాలం మనసుకి ఎంత ఆహ్లాదకరం !) సావన్ మే ఉమగ్యో మేరో మన్ భనక్ సునీ హరి ఆవన్ కీ ఉమడ్ ఘుమడ్ చహు దిసా సే ఆయో దామిని దమకే ఝరలావన్ కీ ( వర్షాకాలంలో నా మనసు ఉప్పొంగుతుంది హరి వచ్చే సవ్వడి విన్నాను మరి […]

Continue Reading
Posted On :

అంతస్సూత్రం (కవిత)

అంతస్సూత్రం -పి.లక్ష్మణ్ రావ్ మండుతున్న అగ్ని కొలిమి పైభూతలాన్ని పెనంగా పెట్టిచంద్రుడ్ని అట్టుగా‌‌పోస్తుంది అమ్మ ! అట్టు మధ్య చిన్నచిన్న రంధ్రాలేచంద్రునితో జత కలిసే తారలు ! ముఖస్తంగా చంద్రుడువెన్నెలై మెరుస్తున్నాక్రింద అమావాస్య చీకటిదాగి వుందనేది నర్మగర్భం ! అట్టుని అటూ ఇటూ తిరగేయడమేశుక్ల పక్షం, కృష్ణ పక్షం ! ఓ చిన్నారీ !వెన్నెల కురిపించే చంద్రునికేచీకటి వెలుగులున్నట్లుజీవితంలోకష్టసుఖాలు సమానమే తండ్రీ ! నోరూరించే అట్టులోనూదాగివున్న రహస్యమదే! ఒకవైపే వుంటే మాడిపోద్దిరెండు వైపులా తిరగేస్తుంటేనేరుచులు పంచుతాది ! ***** లక్ష్మణ్ రావ్ పోతుబరినేను సాహిత్య రంగంలో 2004లో అడుగుపెట్టాను. నానీలు,హైకూలు, […]

Continue Reading

కొత్త రంగు (కవిత)

కొత్త రంగు -లక్ష్మీ శ్రీనివాస్ ఈ రంగుల ప్రపంచంలో ఈ రంగుకు రూపం ఉండదు ఇదొక వింత రంగు మార్కెట్లో దొరికే రంగుల కంటే చాలా చిత్రమైనది దుర్గుణ వర్ణాలతో కూడి మనిషి రూపాన్ని మార్చేస్తుంది ఈ రంగు పులుముకొన్న మనుషుల్లో ప్రేమలకు అనురాగాలకు మంచితనానికి మానవత్వానికి బంధాలకు బంధుత్వాలకు బాధ్యతకు  భరోసాకు తేడా తెలియని మనిషిగా ఒక వింత మనిషిగా ఒక విచిత్ర వేష భాష ధారణతో వికృత చేష్టలతో విహరిస్తుంటారు. ఈ రంగులద్దుకొన్న మనుషుల్ని కాస్తా గుర్తించండి […]

Continue Reading

బొమ్మను (కవిత)

బొమ్మను -రాధాకృష్ణ కర్రి బొమ్మనుగమ్యానికి బాటలు వేసుకోలేని రాతి బొమ్మను.దిక్సూచికి వ్యతిరేక దిశలో పయనించేకళ్ళు ఉన్న కబోది బొమ్మను.కర్కశత్వం, మొండితనమే ఇంధనంగాసాగే మనసు లేని మరబొమ్మను.అష్ట వంకరల మార్గంలో పయనించేరెక్కలు లేని విహంగాన్ని.ప్రేమ అనే తెరచాపకై వెదుకులాడుతూరుధిరమైన తనువుతోసాగరంలో నడిచే నావికను.వందశాతం పరీక్షలు రాసిఅద్భుతమైన శూన్య ఫలితాలను సాధించే నిత్య నూతన విఫల విద్యార్థిని.లోటుపాట్ల జాడ తెలుసుకోలేకచతికిలపడ్డ పంకిలాన్ని.నాకు నేనే అర్థం కాని ఒక చిక్కు ప్రశ్నను. ***** రాధాకృష్ణ కర్రినా పేరు రాధ కర్రి. నివాస స్థలం విజయవాడ. భాగస్వామి పేరు […]

Continue Reading
Posted On :
gavidi srinivas

అదే వర్షం…! (కవిత)

అదే వర్షం…! -గవిడి శ్రీనివాస్ వేకువల్లే వేయి కలలు వెలిగించుకుని తూరుపు కాంతులు పూసుకుని చూపులు మార్చుకున్న రోజులు కళ్ల పై వాలుతున్నాయ్ . హాయిని గొలిపే ప్రపంచమంటే కళ్ళలో  వెలిగే దీపాలు దారిచూపటం . మనసున ఊగే భావాలు ఊరించటం అలరించటం అంతే కదా … వర్షాల ఊయల్లో అలా ఊగిపోవటం బంధాల్ని ముడిపెట్టుకోవటం కదూ… ఇంతలా వెన్నెల  ఆకాశాన్ని వొంచి తల నిమురుతూంటేనూ… లోలోపల జ్ఞాపకాలు  తడుముతుంటేనూ… ఏదో వెన్నెల వాకిలి వొలికి చిలికి […]

Continue Reading

పరిష్కార దీపం (కవిత)

పరిష్కార దీపం -యలమర్తి అనూరాధ అమ్మా! ఆర్తనాదం గుమ్మంలోబిచ్చగత్తె కాదు ఎక్కడో దూరంగాబావి లోంచి వినబడనట్లు కొడుకులు వదిలించుకున్న వృద్ధుల మౌన ఘోష ఇది మన దేశమేనా !?సందిగ్దంలో పడ్డ మనసు ఒంటరి తనం చీకటిన మ్రగ్గుతున్న కర్కశహృదయాలుచివరి అంకానికి ఇదా ముగింపు ?  ఆ నిముషాన కొడుకులనంతా వృద్ధులుగా మార్చాలన్నంత ఆవేశం హిప్నాటెస్ట్ నై ఒక్కసారి ఆ అనుభవాన్ని రుచి చూపించాలనిమూసుకున్న కళ్ళు అప్పుడైనా తెరుచుకుంటాయేమో?వదిలిన అనుబంధపు పాశాలు మళ్ళీ చుట్టుకుంటాయేమో! ***** యలమర్తి అనూరాధ -యలమర్తి అనూరాధ నివాసం హైదరాబాద్. కృషాజిల్లా ముదునూరులో […]

Continue Reading
Posted On :

దుఃఖపుమిన్నాగు (కవిత)

దుఃఖపుమిన్నాగు -డా.కె.గీత దుఃఖం జీవితం అడుగున పొంచి ఉన్న మిన్నాగు ఎప్పుడు నిద్రలేస్తుందో దానికే తెలీదు ఎప్పుడు జలజలా పాకుతుందో ఎవరికీ తెలీదు ఎగిసిపడ్డప్పుడు మాత్రం ఎప్పటెప్పటివో నిశ్శబ్ద వేదనలన్నీ ఒక్కోటిగా తవ్వుకుంటూ జరజరా బయటికి పాక్కొస్తుంది దాని పడగ నీడలో ప్రతిరోజూ నిద్రిస్తున్నా ఏమీ తెలియనట్టే గొంతు కింద ఎడమ పక్క సిరలు ధమనులు చుట్ట చుట్టుకుని బయట పడే రోజు కోసం తపస్సు చేస్తుంటుంది ఒక్కసారి నెత్తుటి గంగలా బయట పడ్డదా దాని తాండవం […]

Continue Reading
Posted On :

సమయం (కవిత)

సమయం -బండి అనూరాధ ఎండకి గొంతెండిన మొక్కలకి నీళ్ళిస్తూ సాయంత్రంలో నేను.మొక్కలకి పైగా సాయంత్రంపై వీచే గాలుల్లో గూళ్ళకి చేరుతూ పక్షులు. ముసురుకుంటున్న చీకట్లలో సమయం.రాత్రిని అంటుకుంటున్న చలిగాలులు.బయటకి చూస్తే నలుపు. గుబురుచెట్ల మధ్యన అంధకారం.మొదళ్ళ మౌనం. ఇంకొంచం గడిచిన సమయం.మరింత సాగిన రాత్రి. నడినెత్తిన సగం చంద్రుడు.అరవెన్నెల్లో ఆకాశం. లోపలా బయటా ఒకే నిశ్శబ్దం. ***** బండి అనూరాధపేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం కృష్ణా జిల్లా తాడిగడప గ్రామం. చదువు ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్. […]

Continue Reading
Posted On :

ఎప్పటికీ నిండని కుండ (కవిత)

ఎప్పటికీ నిండని కుండ -పాపినేని శివశంకర్ ‘చావదురా ఈ పాము / చప్పిడి దెబ్బలకు / భావించి వైరాగ్యమనే/ బడితెదెబ్బబడితె గాని’ అంటూ అప్పుడెప్పుడో మా అమ్మ పాడిందొక తత్త్వం. ఇప్పుడైతే ‘నిండదురా ఈ కుండ / మెండైన సంపదల్తో’ అని పాడేదేమో. కాకికి దప్పికైనప్పుడు అడుగున నీళ్లున్న కుండని గులకరాళ్లతో నింపి దాహం తీర్చుకొంది. కానీ,             ఈ కుండలు నిండవు. ఎవరికుండా నిండటం లేదు. నువ్వు కొండల్ని పిండిచేసి కూరినా నిండదు. ఎన్నికార్లు, అద్దాల మేడలూ, […]

Continue Reading

అనుసృజన-మీరా పదావళి (తరువాయి గీతాలు)

అనుసృజన మీరా పదావళి (తరువాయి గీతాలు) అనువాదం: ఆర్.శాంతసుందరి 17. ఓ జీ హరీ కిత్ గయే నేహా లగాయే నేహా లగాయే మన్ హర్ లియో రస్ భరీ టేర్ సునాయే మేరే మన్ మే ఐసీ ఆవే మరూ జహర్ విష్ ఖాయకే (మహానుభావా హరీ ! ప్రేమలో బంధించి ఎక్కడికెళ్ళిపోయావయ్యా? ప్రేమిస్తున్నానని చెప్పి నా మనసు దొంగిలించావు తీయటి మాటలెన్నో చెప్పావు ప్రస్తుతం నా మనసు ఇంత విషం తాగి చనిపోమంటూంది) ఛాడి […]

Continue Reading
Posted On :

అమ్మసంచి (కవిత)

అమ్మసంచి -బంగార్రాజు కంఠ నువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక నాజూకుతనంనువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక చలాకీ చిరునామానువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక ఆశల తేనెపట్టునువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక ఉరికే వాగునీరు నువ్వు పుట్టాకతన సమస్తం గాలికి గిరాటుకొట్టాకఇక నువ్వే తన బంగరుకొండ తప్పో ఒప్పోపదినెలలు ఈ భూమిని మోసిన అమ్మకు తప్పఎవరికీ వుండదు ఆ చారికల సంచిప్రపంచం మొత్తం మీద అమ్మకి తప్ప ఎవరికీ నచ్చవుకడుపు మీది ఆ బాధానంద ముద్రలుపొత్తికడుపు మొత్తం కత్తితో చీరినట్టునువ్వూ నేనూ చీరే వుంటాం పొట్టలో […]

Continue Reading
Posted On :

ఓటమి ఎరుగని తల్లి (కవిత)

ఓటమి ఎరుగని తల్లి -శింగరాజు శ్రీనివాసరావు కడుపు సంచి ఖాళీగా వున్న దేహాన్ని గర్భసంచి బరువు సమం చేసింది బక్కచిక్కిన శరీరపు ఒడిలోకి చచ్చుబడిన పిండం ప్రాణం పోసుకుంది నవ్వే బిడ్డకు నడకలేని కాళ్ళు దిష్టి చుక్కల్లా.. దరిద్రానికి తోబుట్టువులా అవిటితనం.. అసంపూర్ణ పుష్పాన్ని చూసి ఆమె దూషించలేదు నడవలేని కన్నయ్యవని మురిసి రొమ్ముపీకను నోటికందించింది తరువుకు కాయ బరువు కాదని తనయుడి భారాన్ని భుజాన వేసుకుంది కదలలేని కాయం మోయలేనంత ఎదిగితే నడుము వంచి గజమై […]

Continue Reading

‘అపరాజిత’ పై అవసరమైన చర్చలు చేద్దాం!

‘అపరాజిత’ పై అవసరమైన చర్చలు చేద్దాం! -కొండేపూడి నిర్మల డా.కె.గీత ఇటీవల వెలువరించిన అపరాజిత స్త్రీవాద కవితా సంకలనంలో 93మంది కవయిత్రులు వెలువరించిన 168 కవితలు ఉన్నాయి. 85 నుంచి ఇప్పటి వరకు కూడా స్త్రీల కవితలు- స్త్రీవాద కవితలు మధ్య వున్న చిన్నసరిహద్దు గీత స్పష్టంగా ఎవరికీ అర్ధంకావడం లేదు. అపరాజితతో బాటూ, ఇంత క్రితం వచ్చిన గురిచూసి పాడే పాట , నీలిమేఘాలు సంకలన సందర్భాలు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈ గతం ప్రస్తావించకపోతే […]

Continue Reading

రోజు ఇలాగే (కవిత)

రోజు ఇలాగే -మహెజబీన్ రోజు ఇలాగే కొత్తగా మొదలవుతుంది జీవితం తొలిసారి చూసినట్టు ప్రతీ సూర్యోదయం అద్భుతమే సంధ్యా సాయంకాలం ప్రతీ రోజు వర్ణ చిత్ర మవుతుంది చూసినప్పుడల్లా సముద్రం ఆశ్చర్యమవుతుంది పుట్టినప్పటి నుండి చూస్తున్ననీలాల గగనమే, అయినా తనివి తీరదు నక్షత్రాల్నిచెల్లా చెదురుగా పడేసుకున్న రాత్రి ఆకాశం, దాని మీద కురిసే వెన్నెల చూపు తిప్పనీదు ప్రతీ ఋతువు కొత్తగా కనిపిస్తుంది వచ్చిన ప్రతీసారి వసంతం కొత్త రంగుల్నిఇచ్చి వెళుతుంది వాన కురిసిన ప్రతీసారి అహ్లాదమే […]

Continue Reading
Posted On :

అనుసృజన-మీరా పదావళి (తరువాయి గీతాలు)

అనుసృజన మీరా పదావళి (తరువాయి గీతాలు) అనువాదం: ఆర్.శాంతసుందరి 15. ఓ రమైయా బిన్ నీంద్ న ఆవే బిరహా సతావే ప్రేమ్ కీ ఆగ్ జలావే (అయ్యో , నా ప్రియుడు ఎడబాటుతో నాకు కంటిమీద కునుకే రాదే విరహతాపం వేధిస్తోందే ప్రేమ జ్వాల దహించివేస్తోందే !) బిన్ పియా జ్యోత్ మందిర్ అంధియారో దీపక్ దాయ న ఆవే పియా బిన్ మేరీ సేజ్ అనూనీ జాగత్ రైన్ బిహావే పియా కబ్ ఆవే […]

Continue Reading
Posted On :
T. Hima Bindu

స్టేబుల్-స్టాఫ్ రూమ్ టేబుల్ (కవిత)

స్టేబుల్-స్టాఫ్ రూమ్ టేబుల్ -డా. టి. హిమ బిందు నిశ్శబ్దంగా వింటున్నాను ఆశ్చర్యంగా చూస్తున్నాను కళకళలాడే అందమైన అలంకారాల అరుదైన అందాలు చూస్తున్నాను అంతకన్నా మించిన సృజనా శైలిలు చూస్తున్నాను ఆనంద క్షణాలలో కంటి వెలుగులు చూసి సంతోషిస్తున్నాను దుఃఖ సమయాన కన్నీటి సాగరాల అలలకు విలవిల లాడుతున్నాను గుస గుసల చెవుల కోరుకుల్లు మింగుడు బడక ముసి ముసి నవ్వులతో ముడుచుకు పోతున్నాను! గల గల నవ్వుల జల్లులు, ఏడిపించడాలు, ఓదార్పులు తీపి కబుర్లు, మిఠాయిల […]

Continue Reading
Posted On :
gavidi srinivas

పొలం ఒక బంధం (కవిత)

పొలం ఒక బంధం -గవిడి శ్రీనివాస్ కాసిన్ని చినుకులు రాలటం కాబోలు నాల్గు మడి సెక్కలు సూర్యుణ్ణి చూసి మురిసిపోతున్నాయి. ఉత్సాహం ఉత్సవమౌతూ కళ్ళల్లో వరి కలల కాంతులు దర్శిస్తున్నాడు రైతు . గుంపు కొంగల బారులా వరినాట్లు నాటిన ఆడోళ్ళు. నిజమే కదా మట్టిని తాకిన పాదాలు మొక్కలై  ఎదుగుతుంటాయి . నడిచిన  మట్టి మీద మమకారపు  పొరలు విప్పుకుంటాయి . అస్థిత్వాన్ని నెత్తిన ఎత్తుకుని పంట చేల కోసం పాట మొలుస్తుంది . రేపటి భయాలని […]

Continue Reading

Raw Beauty (కవిత)

Raw Beauty -బండి అనూరాధ ఈ పొద్దూ వానొచ్చినదితనదారిన తాను పోయినదిఎవరి దారిన వాళ్ళు పోవాలిగా ఇక్కడ మిగిలినది చూస్తే- కొంత మట్టీ కొంత ఇసుకాకొన్ని రాళ్ళూ మరికొన్ని మొక్కలూవిరిసిన ఒకే ఒక రోజా పువ్వు పాకుడుపట్టిన పాతగోడ,..తడికి మరింత పచ్చగా మెరుస్తూగాయమంత పచ్చిగా.. గోడకు పాకించిన మనీప్లాంట్ ఆకులనుండీఅప్పుడప్పుడూఒక్కో మిగులు వాన చుక్కా.. నా కళ్ళు ఇక విదిలించలేని చినుకులేనా అవి!?ఎవరో తమ అసలుకి పోయారు.నొప్పై, ఇదిగోనేను ఇలాగ నవ్వుతున్నానా!? పట్టిచూడడం అందం.పట్టించుకోకపోవడం పెను విషాదం. ***** బండి అనూరాధపేరు అనూరాధ బండి. స్వస్థలం […]

Continue Reading
Posted On :

కలను ఏ కన్నీళ్లు ఆపలేవు (కవిత)

కలను ఏ కన్నీళ్లు ఆపలేవు – శ్రీ సాహితి నిద్రను హత్యచేసిన ఆ కల పట్టపగలు ఎన్నో రాత్రులను మోసుకుంటూ ఏ రోజుకు చిక్కకుండా ఏ గంటకు పట్టుపడక నగ్నంగా తిరుగుతుంది. ఎదురొచ్చిన ముఖంపై చెంబుడు కబుర్లు చల్లి చిందుల్ని ఏరుకుంటూ పసి హృదయంలో లోతుగా పాకిన ఇష్టం పెద్దయ్యాక వటవృక్షమై ఇప్పుడు కలకు కళ్ళతో పనిలేక కాలంతో ముడి వీడి కోరికగా మారి మనసులో మాటైయింది…చూపైయింది… చప్పుడైంది….చిత్రమైంది. ఇక కాలు ఆగేదాక కళ్ళు ఆరేదాకా ఏ […]

Continue Reading
Posted On :

వేయి మాటల ఉప్పెన (కవిత)

వేయి మాటల ఉప్పెన -చందలూరి నారాయణరావు కోపానికి చీల్చుకొచ్చిన లోపలి మనిషి నోరు బయట పుట్టపలిగి వంద నాలుకల వేయి మాటల ఉప్పెన నాలుగు కళ్ళుగుండా వేలమైళ్ళ మీటవేసి మెదడును ఖాళీ చేసిన రక్తం పాదాలకి చేరి తలలో పాతపగను తాకి మొగ్గలేసిన సమస్య పచ్చని గాయమై ఎర్రగా నవ్వింది. ఆ నల్లని రోజు నిండా నిమిషానికో గాయానికి స్రవించే అరుపుల తరంగాలు చెవుల్లో పొంగి పొర్లి పక్కనున్న రోజుపై చింది పగలు చీకటి దుప్పటి కప్పుకుంటే […]

Continue Reading

అనుసృజన-మీరా పదావళి (తరువాయి గీతాలు)

అనుసృజన మీరా పదావళి (తరువాయి గీతాలు) అనువాదం: ఆర్.శాంతసుందరి 13. కో బిరహినీ కో దుఖ్ జాణే హోమీరా కే పతి ఆప్ రమైయాదూజో నహీ కోయీ ఛాణే హో(ఒక విరహిణి అనుభవించే దుఃఖం ఎవరికి అర్థమౌతుంది?మీరాపతి ఒక్క ఆ గిరిధరుడే తప్ప ఆమెకి ఇంకే ఆధారమూ లేదు)రోగీ అంతర్ బైద్ బసత్ హైబైద్ హీ ఔఖద్ జాణే హోసబ్ జగ్ కూడో కంటక్ దునియాదర్ద్ న కోయీ పిఛాణే హో(రోగి మనసులో ఉండేది ఆ వైద్యుడేఆయనకే […]

Continue Reading
Posted On :

ఎండి తుమ్మ గజ్జెలు (కవిత)

ఎండి తుమ్మ గజ్జెలు -గుమ్మల సాయితేజ ఆడుతున్న మా అయ్య చెప్పిన ఎండి తుమ్మ గజ్జెలు కట్టి ఆడుతున్న  నవ్వుతున్న నవ్వుతూ ఆడుతున్న కొత్త బొబ్బలెక్కిన పెయ్యి ఏడెక్కినకంట్లో నీళ్లు బయటికొస్తేచెమట అనుకోని తుడుసుకుంట  ఆ డముకు డముకు సప్పుల్ల  నా ఏడుపును కలిపేసి పండ్లు ఇకిలిచ్చి కండ్లు సిన్నంగ చేసి నడుం మీదో చేయి నెత్తి మీదో చేయి పెట్టి  భరతనాట్యం అయ్య పిల్ల తిని చాలా రోజులైందయ్య అని పాన్ పరాగ్ ఉమ్మేసుకుంటా చెప్తున్న  మా అయ్య మొహం చూసి నవ్వుతున్న నవ్వుతూ ఆడుతున్న  మూగవోయిన చేయి చూపించి పైసలు ఇచ్చిన పెద్దనాన్న , మామయ్య , పెద్దమ్మలను చూసి పొర్లు దండాలు పెడుతున్న తమ్ముని చూసి అయ్యా […]

Continue Reading
Posted On :
gavidi srinivas

యుద్ధం ఒక అనేక విధ్వంస దృశ్యాలు (కవిత)

యుద్ధం  ఒక అనేక విధ్వంస దృశ్యాలు -గవిడి శ్రీనివాస్ యుద్ధం ఎపుడు విధ్వంసమే విద్వేషాలే యుద్దానికి మూల ధాతువులు . ఆధిపత్యం పోరు ప్రాణాల్ని ఛిద్రం చేస్తుంది . అండ చూసుకొని ఒక చిన్న దేశం అంగ బలం చూసుకొని ఒక పెద్ద దేశం యుద్దానికి తెరలేపాయి. శూన్యాన్ని విధ్వంసం చేసి ఆకాశాన్ని అల్లకల్లోలం చేసి రక్తపు మడుగుల వాసన తో యుద్ధం తడిసిపోతోంది. నాటో వ్యూహాల మధ్య దేశాల దేహాలు తగలబడిపోతున్నాయి. ఇప్పుడు బతకడమంటే మూడో ప్రపంచ […]

Continue Reading

అబద్ధమాడని నిజం (కవిత)

అబద్ధమాడని నిజం -చందలూరి నారాయణరావు నిత్యం వారిద్దరి విందులో రుచిగల మాటలు అబద్దమాడని నిజాలు ప్రియమైన వంటకాలు. ఎదుటపడని కలయికలో ఎదమాటున సంగతులు మధురంగా మైమరిపించే మనసూరించే ఇష్టాలు. నిద్రమంచానే చూపులు ముఖాల్లో ఏరులా ప్రవహించి సంతోషసారాన్ని ఇచ్చి పదునుగా ప్రవర్తించి రోజూ గుప్పెడు అనుభావాల్ని ఒకరిలో మరొకరు చల్లుకుని ముసురుపట్టి మెరుపులతో జోరుగా కురుసుకుంటారు తనివితీరా తడిసిన తలపులకు మన్ను వెన్నులో పదాల మొలకలు పుట్టపగిలి ఉదయించుకుంటారు వాక్యాల మెరుపులతో కౌగిలించుకుంటారు. కవితల విరుపులతో రెపరెపలాడతారు… […]

Continue Reading

ఎందాకని జ్ఞాపకాలకు రుచౌతావు? (కవిత)

ఎందాకని జ్ఞాపకాలకు రుచౌతావు?  – శ్రీ సాహితి ఎన్నాళ్ళని ఆ ఒక్క ప్రశ్నను ఈడ్చుకుంటూ దగ్గరతనాన్ని కలగంటూ దూరాన్ని మోస్తావు? చాటేసిన ముఖంతో మౌనాన్ని తప్పతాగి వేళకు మనసుకు రాని జవాబుకు ఎన్ని రాత్రులను తీవాచిగా పరుస్తావు? చూపలరిగి చుక్కలై అలిసిన ఆశకు దప్పిక తీర్చాలని కన్నీళ్లను గొంతులో రహస్యంగా ఎందాకని దాస్తావు? కాలం తొక్కిడికి ఒరిగిన కోరికను సున్నితంగా చేరదీసి కడుపున దాచి ఎందాకని గుట్టుఔతావు? కళ్ళకు తెలియకుండా కన్న కలను కరిగి ఆరకుండా చెదరి […]

Continue Reading
Posted On :

భవిత (కవిత)

భవిత – టి. వి. యెల్. గాయత్రి చెట్టులేదు చేమ లేదుచిట్టడవు లెక్కడ? లేనే లేవుపులుగు పోయి పుట్ర పోయిపశుల జాతి పోయి పోయివెనకడుగై కనుమరుగైగతము లోకి జారి పోతేఒంటరిగా వేదనతోభగభగమని మండి పోతూవేడి పుట్టే వాడి సెగలుపుడమి తల్లి కక్కు తుంటేఎక్కడ? ఎక్కడ? నీ భవిత?చెప్ప వోయి వెఱ్ఱి మనిషి! గాలి నిచ్చి జీవమిచ్చి చేవ నిచ్చి మేలుచేయుచెట్టు చేమ పెంచ వోయి!చేర దీసి నీరు పెట్టిభూత కోటి బ్రతుకు పట్టిభూమాతకు బహుమతిగాపచ్చదనము పెరగనీయి! ***** టి. వి. […]

Continue Reading
subashini prathipati

ఆరాధనాగీతి (కవిత)

ఆరాధనాగీతి -సుభాషిణి ప్రత్తిపాటి పాత పుస్తకాలుతిరగేస్తుంటే నెమలీక జారిపడింది,ఎన్ని దశాబ్దాల నాటిదోఇంకా శిథిలం కాలేదుగుండెలో దాచుకున్నతొలివలపులా ఇంకామెరుపులీనుతూనే ఉంది! ఊరంతామారిపోతోందిపాతభవనాలన్నీ రాళ్ళగుట్టలవుతుంటేఅల్లుకున్న నా జ్ఞాపకాలన్నీచెంపలపై చెమ్మగా జారసాగాయి!అదిగో ఆ రంగువెలసినఅద్దాలమేడ కిటికీ మాత్రంతెరిచే ఉందిఅక్కడినుంచి ఒకప్పుడునన్ను తడిమిన పద్మనేత్రాలులేకపోవచ్చుకానీఆ ఆరాధనా పరిమళం మాత్రంఇప్పటికీనాకు నిత్యనూతనమే!!మా కళాశాలకుపాతబడిన విద్యార్థిగావెళ్లాను,అన్నీ నవాంశలే అక్కడ,కొత్త గదులు,చెట్లుఒక్కటిమాత్రమేనన్ను హృదయానికిహత్తుకుందిపాత మిత్రుడిలా..నా వేళ్ళు తడిమిన ఆ పుటలన్నీవిశ్వభాషలో నన్నుపలకరించాయి,నన్ను సేదతీర్చాయిచంటిపాపను చేసి లాలించాయితాదాత్మ్యతలోకాలం తెలీనేలేదు.సముద్రం వైపునడిచాను.తీరం హంగులు దిద్దుకుంది గానీ…అలల దాహమే ఇంకాతీరినట్టు లేదునా బాల్యంలోలాగేఒకటే […]

Continue Reading

తూకం (కవిత)

తూకం -రూపా దూపాటి అందమైన మనిషిని పువ్వుతో పోల్చడం తప్పేమీ కాదు! కానీ ఒక అబ్బాయిని రోజా పువ్వులా ఉన్నావు అనడాన్ని నేను ఇప్పటి వరకు వినలేదు!! వండు కోవడం, తినడం మానవ అవసరాలే! కానీ మీ బాబుకు వంట వచ్చా అని పెళ్లి కుదుర్చుకున్న సంఘటన నేను ఇప్పటి వరకు చూడలేదు!! స్వతంత్రం మనకి ఎపుడో వచ్చింది! కానీ ఆడపిల్ల ఒంటరిగా తిరుగుతున్నప్పుడు ధైర్యంగా ఉన్న మనసును నేను ఇప్పటి వరకు తారసపడలేదు!! అమ్మాయి, అబ్బాయి […]

Continue Reading
Posted On :

అనుసృజన-మీరా పదావళి (తరువాయి గీతాలు)

అనుసృజన మీరా పదావళి (తరువాయి గీతాలు) అనువాదం: ఆర్.శాంతసుందరి 11. రాధా ప్యారీ దే డారో నా బంసీ మోరీయే బంసీ మే మేరో ప్రాణ్ బసత్ హైవో బంసీ హో గయీ చోరీ(రాధా , నా బంగారూ!  నా మురళిని ఇచ్చెయ్యవా?నా ప్రాణాలన్నీ ఈ మురళిలోనే ఉన్నాయిదాన్నే ఎవరో దొంగిలించారు)కాహే సే గాఊం కాహే సే బజాఊంకాహే సే లాఊం గైయా ఘేరీ(ఇక నేను దేన్ని వాయిస్తూ పాడను?అసలు దేన్ని వాయించను?మురళి లేనిదే గోవుల్ని కూడగట్టుకుని […]

Continue Reading
Posted On :

వివక్ష?! (కవిత)

వివక్ష?! -అనురాధ నాదెళ్ల వివక్షా? అలాటిదేం లేదే. భారత రాజ్యాంగం ఎప్పుడో చెప్పింది- కులం, మతం, వర్గం, లింగం, భాష ఇలాటి భేదాలేవీ ఉండవని, అన్నిటా అందరూ సమానమేననీ! అంటే వివక్షలంటూ ఉండవన్నమాట! మరి, ఈ పదం ఎలా పుట్టిందంటారా? భలే సులువు! ఇంట్లోంచి, మనుషుల్లోంచి, ఆలోచనల్లోంచి, అహంకారాల్లోంచి అలా వైనవైనాలై, రాజ్యాంగ నిర్మాతలకు తోచని ఎన్నో మార్గాల్లోంచి పుడుతూనే ఉంది! వారి మేధకు అందని దారుల్లో పెత్తనం చేస్తూనే ఉంది. ముందుగా ఏదైనా ఒక ఇంటి […]

Continue Reading
Posted On :
rajeswari diwakarla

తల్లి చీర (కవిత)

తల్లి చీర -రాజేశ్వరి దివాకర్ల మమతల వాలుకు చిక్కి వలస వెళ్ళిన వాళ్ళిద్దరు తిరిగి రాని సమయాలకు ఎదురు చూపుల ఇల్లు మసక బారిన కళ్ళతో ఇసుక రాలిన చిన్న శబ్దానికైనా ఇటుక గోడల చెవిని ఆనించు కుంది. విశ్రాంతి పొందిన ఉత్తరాలు కొన్ని బ్యాంకు జమా బాపతు తాఖీదులు కొన్ని పిల్లల పుట్టిన రోజులకు గుడి పూజల తారీఖుల పిలుపు రివాజులు కొన్ని గాలి వాటుకు ఎగిరి ధూళి కమ్ముకున్న నేలకు ఒరుసుకున్నాయి. సంవత్సర చందాలకు […]

Continue Reading

చూపు చెంగున….. (కవిత)

  చూపు చెంగున….. -చందలూరి నారాయణరావు నేను అనుకోలేదు నా కవిత ఓ బంధానికి పెద్దమనిషి అవుతుందని… ఓ మనసుకు చుట్టరికంతో చిత్రాలు చేస్తుందని… ఓ సంతోషాన్ని వరంగా బలమై నిలుస్తోందని…. ఓ కదలికను పుట్టించి కలగా దగ్గరౌతుందని… ఓ కమ్మనిమాట సువాసనతో మనసు నింపుతుందని ఓ ఆనందాన్ని పంచే అందాన్ని మదికిస్తుందని…. ఎప్పుడు పుట్టిందో? ఎక్కడ పెరిగిందో? ఎలా ఎదురైందో మరి? ఇప్పుడు నాకై అనిపించేలా నాలో ఇష్టమై నా కవిత కొంగున ఆమె బంగారం. […]

Continue Reading
gavidi srinivas

తీపి దుఃఖాలు (కవిత)

తీపి దుఃఖాలు -గవిడి శ్రీనివాస్ ఒక అసంపూర్ణ సంధ్యాకాలం నీ విచ్చిన సంతోషంతో నువ్ పంపిన సందేశంతో ఇక్కడ నీ జ్ఞాపకాల్ని ధ్యానిస్తున్నా . ఒక్క మాట చెప్పు నీ తపస్సులో ఉషస్సుని చూస్తున్న నాకు ఈ తీపి దుఃఖాలు ఓదారుస్తాయా ..! నీ చూపులు వెన్నెల్ని కురుస్తున్నపుడు నీ ఊహలు తూనీగల్ని ఎగరేస్తున్నపుడు నీ కన్నుల్లో అఖండ దీపాలు వెలుగుతున్నపుడు నిశ్చేష్ఠుడనై నిర్ఘాంత పోయినపుడు ఆ ఉఛ్వాస నిశ్వాసాల్లో ధ్వనించిన అనురాగ మధురిమల్ని  ఏరుకుంటున్నపుడు నాలో […]

Continue Reading

చెరగని చిరునామా (కవిత)

చెరగని చిరునామా  -రామ్ పెరుమాండ్ల రాత్రి వాహనాలన్ని ఇంటికెళ్ళాయి .కానీ ఫుట్ పాత్ పైకి ఎవరొస్తారో తెలియదు.కడుపులో ఖాళీలను పూరించడానికి ఈ లోకం ఏ ఒక్క అవకాశం ఇవ్వను లేదు .ఆకలిని వెతికి వెతికి అలిసిన కన్నులు కునుకు కోసం దారి వెతుకుతున్నాయి . ఈ దేశం చేసిన సంతకాల చట్టాలు రోజూలాగే తన ఖాళీ సంచిలో నింపుకోవడానికి వెళితే చెత్త కుప్పలో విరివిగా దొరికాయి .అయిన తనకేం తెలుసు బడి లేదు బలపం లేదు . అలా ఆ కాగితాలను పరుపుగా ఇటుక పెళ్లను దిండుగా జేసుకున్నాడు .తన ఖాళీకడుపుపై […]

Continue Reading
Posted On :

పెళ్లయ్యాక ..! (కవిత)

పెళ్ళయ్యాక ..! – సిరికి స్వామినాయుడు నీ కళ్ళు .. కలువ రేకులన్నప్పుడు అనుకోలేదుకలలు చిక్కేసి నన్నో కబోదిని జేస్తావనీ ..! నీ మోము .. పున్నమి చందమామన్నపుడు పసిగట్టలేదురోజుకో వెలుగురేకును కోల్పోయిన వెన్నెలపూవును జేస్తావనీ ..! ఆకాశంలో .. సగం నీవన్నపుడు అర్ధం జేసుకోలేదుమసిగుడ్డల్లాంటి ఆమాస పూటల్ని మొహాన కొడతావనీ ..! గుడిలో దేవత ఇల మీదికొచ్చిందన్నపుడైనా ఊహించలేదుఇంటికి  నన్నో జీతం భత్యం లేని పని మనిషిని చేస్తావనీ ..! బతుకుబండికి మనిద్దరం  రెండెద్దులమన్నప్పుడైనా బోధపడలేదునన్నో గానుగెద్దుని చేసి గంతలు కడతావనీ .. ! చిన్నీ బుజ్జీ ..‌ యన్న  ప్రేమ పిలుపుపెళ్లయ్యాక .. ఒసే గిసేంటూ  బుసలెందుకు […]

Continue Reading

అనుసృజన-మీరా పదావళి

అనుసృజన మీరా పదావళి అనువాదం: ఆర్.శాంతసుందరి భక్తి అనే మాటకి ఆరాధన, విశ్వాసం, అంకిత భావం లాంటి అనేక అర్థాలు ఉన్నాయి. భారతీయ భాషల్లోని సాహిత్యంలో భక్తి విభిన్న రూపాల్లో వ్యక్తమయింది. హిందీ సాహిత్యంలో భక్తి సాహిత్యం 1375 నుంచి 1700 వరకు అని నిర్ణయించడమైంది. ఈ నాలుగు శతాబ్దాలలోనే తులసీదాస్, సూరదాస్, మీరాబాయి, కబీర్ వంటి కవులు తమ కావ్యాలనీ , కవితలనీ, పదాలనీ రాశారు. తులసీదాస్ ది దాస్యభక్తి (తులసీదాస్ రచించిన ‘రామ్ చరిత్ […]

Continue Reading
Posted On :

యుద్ధం ఒక గుండె కోత-19 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండెకోత-19 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి ఉగ్రమో ఆగ్రమో పదునెక్కిన రెండు కొమ్ముల అమానుష మృగాలు ఆవురావురుమంటూ కాలుదువ్వుతున్నప్పుడు మదం తలకెక్కినవి కొన్ని, మతం దిమ్మెక్కినవి కొన్ని రెండు తలల సర్పాలు రెండు నాల్కల సరీసృపాలు పెనుబుసల ఊపిర్లతో అంతకంతకూ మంటని రాజేస్తున్నప్పుడు ఇతిహాసాలలోంచి సైతాన్లూ, హిరణ్యకశిపులూ నల్లమాంత్రికులూ, భస్మాసురులూ ఏ మత గ్రంథాలలోంచో ఊపిర్లు పోసుకొని భూగర్భ సమాధుల్లోంచి పైకి లేస్తున్నప్పుడు మూఢనమ్మకాల అగ్ని పర్వతాల్ని రగిల్చి భూ ఆవరణల్ని స్మశానాల్ని […]

Continue Reading

గృహవాసం (కవిత)

గృహవాసం – డా॥కొండపల్లి నీహారిణి అంతు తెలియని ఆలోచనలు ఆరబోస్తూ గుప్పిటబట్టని దినపత్రికయ్యింది నా మనసు ఇప్పుడు. వంటర్రకు ఏదో కొత్త వెలుగు సహాయజ్యోతి ప్రసరిస్తున్నది! కూరలో కారమెంతేయాలని కారణాన్ని వెతుకుతూ, గంటె తిప్పనీయక ఖాళీ సమయాన్నిచ్చిన విచిత్ర కాలానికో నమస్కారం!! నాలో నేను రంగులేసుకున్న బొమ్మనై, నవ్వుల్ని విచ్చుకుంటుంటే, మరో ఆశ్చర్యం ముందటర్ర వరకూ తీసుకుపోయింది. వాళ్ళమ్మకు అందిచ్చినట్టే మా అమ్మకూ ఆయన చాయగిలాసనిస్తుంటే, ఇనుమడించిన గౌరవాలకు హృదయ ఛాయ ఒకటేదో చెప్పని సాక్ష్యమయ్యింది నేను […]

Continue Reading

పరంపర (కవిత)

పరంపర -బండి అనూరాధ మరలిపోయినాయధాస్థితిలో తిరిగి నిన్ను నిలిపే కాలస్ప్రుహ ఏదో వెన్నునంటే ఉంటుందెందుకో. ఆగి చూసుకుంటే-విడిచివచ్చినవేం పెద్ద బాధించవు.అంతర్లీనమై కొంత దుఃఖాన్ని నిక్షిప్తం చేస్తాయ్. అంతే. కొంచం సమయం చిక్కి వెనుకకి ప్రయాణమై చూసుకోలనుకుంటేఒక్క అద్దముంటుంది లోన. అంతే ముందుకుపోయే ఉత్సాహమో చింతనోఏదయితేనేం ఒక కొనసాగింపుకిక్షణాల ముస్తాబుని గురించివేడుకయిన గొంతుతో-ఒక పాటలానోకన్నీటి చరణమంత రాతతోనోచెప్పుకుపోతుంటావు. అంతే అపరిపక్వ పగళ్ళలో పగుళ్ళనూ చూసిపరిపక్వ రాత్రుళ్ళల్లో చీకటినీ చూసాకవెన్నెలకి చలించలేదని అమాసకి పున్నమి ఊసుల్ని కథలుగా గుచ్చాక ఓ నా అసమతుల్య ప్రపంచమా!- జీవనమనోవికాస సాఫల్యతకైఏ సమాజంవెంట నేనిపుడు ప్రయాణించాలీ?ఎక్కడ! మళ్ళీ […]

Continue Reading
Posted On :

భూమాతలు (కవిత)

భూమాతలు – సిరికి స్వామినాయుడు వాళ్ల  త్యాగాల ముందు మనమెంత ?వాళ్ల సహనంముందు మనమెంత ? వాళ్ళు .. భూమాతలు కాసింత బరువును మోసేందుకేమనం ఆపసోపాలు పడతాంగానీ ..అంతటి యింటిని – వాళ్లుభుజాలమీద ఇట్టే మోస్తారు ! చీకట్లను మింగి వేకువల్ని ప్రసవిస్తారు ఆశల్నీ కోర్కెల్నీ ..తమలోనే సంలీనం జేసుకొనీనిర్మల నదీప్రవాహాలై సాగిపోతారు ! వాళ్లు .. దుర్గమ అరణ్యాలు ఛేదించాలనుకుంటే .. మొలకై ప్రణమిల్లాల్సిందే వాళ్లు .. దయా కల్పవృక్షాలు కరుణపొందాలనుకుంటే .. దోసిలి పట్టాల్సిందే ! వాళ్లు .. జీవనదులు అమేయ జలగీతాల్ని వినాలనుకుంటే .‌.అంతరాంతరగాధాల్లోకి దూకాల్సిందే ..వాళ్ళు […]

Continue Reading

అందీ అందని ఆకాశం (కవిత)

అందీ అందని ఆకాశం (కవిత) -ఝాన్సీ కొప్పిశెట్టి ఓ కవి ‘మధుశాల’ లోతుల్లో మునిగి వున్నాన్నేను అదేమిటో… మనసు పొరల్లో దాచుకున్న ఇష్టమైన అనుభవాలన్నీ అనుభవంలోకి వచ్చాయి..! జ్ఞాపకాల పొరల్లోని కౌగిలింతల స్పర్శలు చిక్కటి స్నేహాలు జో కొట్టిన హస్తాలు… ఎందుకో మరోసారి పితృస్వామ్యం పైన అక్కసు ఎగిసిపడింది..! పురుషుడు ఆడమాంసపు ఆఘ్రాణింపుపై రాసినా వేశ్యల భోగలాలసపై మనసు పడినా ప్రియురాళ్ళ ఓణీల్లోని అందాల్లో ఓలలాడినా అన్నీ స్వానుభవాలేనని ఒత్తి పలికినా ఆక్షేపణ లేదు ఈ పితృస్వామ్య […]

Continue Reading

అద్దం మీది తడిఆవిరి (కవిత)

అద్దం మీది తడిఆవిరి – శ్రీధర్ చౌడారపు కాలం కత్తికట్టిందని తిట్టుకోకు విధి వెక్కిరించిందని వెక్కివెక్కి ఏడవకు ఎదిగేకొద్దీ ఎన్నెన్నో జతకూడుతూనే ఉంటాయి అంతులేనన్ని అనుబంధాలు అలవోకగా అంటుకట్టుకుంటుంటాయి బరువు ఎక్కువైందనో ఏమో బాధ్యతలు దూరంగా లాగేసాయనో ఏమో సంబంధాలు కొన్ని సడలి విడిపోతుంటాయి అనుబంధాలు మరికొన్ని అనుకోనివిధంగా అకస్మాత్తుగా తెగిపోతుంటాయి ఏడడుగులు నడిచినవాడూ ఏళ్ళుగా వెన్నంటి ఉన్నవాడు ఏడని, ఏడున్నాడని, ఏడకెళ్ళిపోయాడని నిన్ను వీడి ఏ మిన్నుల్లోకెళ్ళిపోయాడని ఏడవకు నీ కంటిపాపల్లో చల్లని వెన్నెల వెలుగుగా […]

Continue Reading
Posted On :

కలలు (కవిత)

కలలు – డా॥కొండపల్లి నీహారిణి వెన్నెల కాసారపు వన్నెల రేడు కలల తీరపు కనుల కొలనులో కలువల విలాసంలా మునకలేస్తు ప్రశ్నల పరంపరను సంధిస్తున్నాడు విజయ రథం మోసిన పనుల పూరెమ్మలు రోజు ఒక్క పరిమళాన్ని వెదజల్లి అధికార అనధికార గాజు పాత్రలో నింపినప్పుడు అభివృద్ధి ఒత్తిడీ విడదీయరాని బాంధవ్యాల సుగంధాలు మోసుకొస్తూ చెమట చుక్కల లెక్కలు ఎందుకు అన్నప్పుడు సాయం సమయపు యానం ఏమీ ఆనంద విమానం ఎక్కనప్పుడు నిమిషాలు గంటలుగా విరాజిల్లే నాలుగు చక్రాల […]

Continue Reading

అనుసృజన-యుద్ధం సోకని మూడడుగుల నేల (కవిత)

అనుసృజన యుద్ధం సోకని మూడడుగుల నేల (కవిత) మూలం : రిషభదేవ్ శర్మ అనువాదం: ఆర్.శాంతసుందరి (రిషబ్ దేవ్ శర్మ కవి, విమర్శకులు, స్నేహశీలి. హైదరాబాద్ లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ సంస్థ నుంచి ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసారు. చిల్లర భవానీదేవి, పెద్దింటి అశోక్ కుమార్, సలీం లాంటి ఎందఱో తెలుగు రచయితల హిందీ అనువాదాలకు విశ్లేశానాత్మకమైన ఉపోద్ఘాతాలు రాసారు. ఇటీవల రాసిన ఈ కవిత వారి కవిత్వానుభావానికి ఒక మచ్చు […]

Continue Reading
Posted On :

సాగర సంగమం (కవిత)

సాగర సంగమం – సిరికి స్వామినాయుడు నువ్వేమో చల్లని జాబిలివి .. నేనేమో మండే సూరీడ్ని ..ఇన్నేళ్లూ ..  ఒక విరహాన్ని భారంగా మోస్తూఒక ఎడబాటు ఎడారిమీద చెరో దిక్కున – మనంఉరకలెత్తే నది  సముద్రాన్ని కలసినట్టువెన్నెల వేడిమి ఒకరికొకరు ఓదార్చుకున్నట్టు ఇన్నాళ్లకీవేళ .. మనం ! ఆ క్షణం .. కాసేపు మన మాటలు మూగవోతాయిగుండెలు ఆర్తిగా కొట్టుకుంటాయిమన దేహాలు సన్నగా కంపిస్తాయి చిగురుటాకుల్లా..ముద్ద మందారాన్ని తీసుకున్నట్టునీ మోమును నా చేతుల్లోకి తీసుకొని ప్రేమగా నీ కళ్లలోకి చూస్తాను పచ్చని వనాలు విరబూస్తాయి పారే నదులు […]

Continue Reading
Kandepi Rani Prasad

అంతా నీటి మీద రాతలే (కవిత)

అంతా నీటి మీద రాతలే (కవిత) -కందేపి రాణి ప్రసాద్ ఆకాశం లో నువ్వు సగం అంటారు అంతా వాళ్ళే దోచుకు పోతారు ఆకాశమే నీ హద్దు అంటారు అంగుళం కూడా ఎదగనివ్వరు నువ్వెంతయిన చదువుకో అంటారు అబ్బాయిని మాత్రం మించకు అంటారు నిన్ను ఎక్కడికైనా పంపిస్తాం అంటారు పక్కింటికైన తోడు లేనిదే పంపించరు. వరుడిని ఎంచుకునే హక్కుంది అంటారు ఎంచుకుని తీసుకెళ్తే ఇంట్లోంచి గెంటేస్తారు సమాన హక్కులు ఇచ్చాం అంటారు ఎప్పుడు వెనక వరసే మిగులుస్తారు […]

Continue Reading

మేకప్ (కవిత)

మేకప్ -బండి అనూరాధ మరోసారి గాయాలని పిలుద్దాంరహస్య చల్లగాలితో హృదయాల్ని లాలిద్దాంకాస్త కుదురుకున్నట్లు ధైర్యాన్ని ప్రకటిద్దాంలోలోపల బావురుమనే కరువుని పక్కకిజరుపుదాం రేకులురాలిన గులాబీలకి ముఖాలనంటిద్దాంముళ్ళని తాకిన మనసుల కథలని దాటిద్దాంపచ్చని ఆకుల వెచ్చని శ్వాసన నిదురిద్దాంఅద్దాల్లో నిజాలకు నీడలు కల్పిద్దాం చూసినకొద్దీ ఎముంటుందీ చీకటి తప్పవెలుగులుచిందే ముఖాలు ఎన్నీ భూమండలమ్మీదఅయినా ఎందుకో దుఃఖాన్నంతా తలగడకిద్దాంచిరునవ్వుతో కాలంపై యుద్ధం చేద్దాం ***** బండి అనూరాధపేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం కృష్ణా […]

Continue Reading
Posted On :
subashini prathipati

ప్రత్తిపాటి నానీలు (కవిత)

ప్రత్తిపాటి నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి 1. అమ్మే.. నా బలం ఎప్పుడూ! నా కలంలో సిరా.. అమ్మ కన్నీళ్ళేగా! 2. ఆమె కళ్ళకు ఒకటే ఋతువు! అతని అహం తీర్చే… శ్రావణమేఘాలవి! 3. ఆ రాత్రి అరుణమై జ్వలించింది! వీరుని రక్తం పూసుకుందదిగో కశ్మీరం! 4. ఆదివారం ఒక్కటే, బతికిపోయాను…! రెండైతే… బొందితో స్వర్గమే!.. 5. అంతా ఆ నలుగురే! ఆహ్వానించడానికీ‌… సాగనంపడానికి కూడా! 6. అవమానాలు తూటాల్లాంటి మాటలవ్వచ్చు. కానీ… గుండెకు తూట్లు కారాదు! 7. […]

Continue Reading

ఆమె లోకం (కవిత)

ఆమె లోకం -గూండ్ల వెంకట నారాయణ ఎండకు ఎండివానకు తడిసిఇంటికి రాగానే బయట ఎక్కడెక్కడో గాలి రెమ్మల్లా తిరిగిన కోళ్లన్నీఆమె కాల్లచుట్టూ తిరుగుతూచీరకి ముక్కులు తుడుస్తూగోల పెడుతూ ఉంటాయి.ఆమె ఒక్కో రోజు వాటిని కసురుకుంటుంది.’ నా సవుతుల్లారా చీర వదలండే ‘ అని.ఒక్కో సారి ‘ నా బంగారు తల్లుల్లారా ‘ అని ముద్దు చేస్తుందిఆ కోళ్ళు ఆమెకి బిడ్డలు మసి నిండిన ఆవేసిన కుండలాంటి బూజు మొలిచిన రేకుల కొంపలోఆ మొక్కతే కోళ్ల కౌగిలింతల మధ్యపగలంతా పొలం కూలీలో కరిగిన ఒంటిని నిద్ర పుచ్చుతుందిదోసిటి […]

Continue Reading

సరికొత్తగా … (కవిత)

సరికొత్తగా ….. -రామ్ పెరుమాండ్ల అనగనగా ఓ ఉదయం కనులకు చూపులను అద్దుకొని పాదాలకు  అడుగులను తొడుక్కొని నిన్నటిదాకా చెల్లా చెదురుగా పడి ఉన్న హృదయం రాత్రి వచ్చిన పీడకలను చెరిపేస్తూ స్వేచ్ఛగా ,విశాలంగా మార్పుకు సిద్ధమైంది . కాలం మనస్సుకు అంటుకున్న గతకాలపు మాసిన చేదు జ్ఞాపకాలను ఊరవతలి కాలువ బండ కాడ ఉతికేసి శుభ్రంగా గాలికి ఆరవేసి ఓ చెట్టుకింద సేద తీరుతున్నది. అలా ఆకాశాన్ని గుండెల్లోకి ఒంపుకొని చూడగా అటు ఇటు కదలాడే […]

Continue Reading
Posted On :
subashini prathipati

హృదయ పుష్పకం (కవిత)

హృదయ పుష్పకం -సుభాషిణి ప్రత్తిపాటి ఆ మూడుకాళ్ళ ముసలితో…పరుగులు తీయలేక…పగలంతా అలసి , సొలసినిద్రా శయ్యపై తలవాల్చగానే…కలలు తలగడై జోలపాడగాఅంతులేని శాంతి పొందిన నా హృదయంలోవేకువ రాలే పారిజాతాల్లా…… నూతనోత్తేజపు పరిమళాలు! జారే వెచ్చని కన్నీళ్ళనుపీల్చుకునేనా కొంగు చల్లని తోడై నాతో నడుస్తూ…అవసరమైన చోటల్లా…నడుంచుట్టూ బిగిసినవశకానికి నాందీ వాక్యమైసుప్రభాతపు పూవై వికసిస్తుంది! తలపుల తడితో…ఊహల అల్లరితో వల్లరిగా సాగి,హృదయ కుహరంలో బీజమై…లోలోపలి ఆశలకు చివురులు తొడిగి,రగిలే క్షణాలను సింధూరంగా మార్చుకుంటూ…తూరుపు వీణెపై పలికే నవరాగానికిజత కలిసే తాళమై….వేవేల మయూఖలుగా ఉదయించేభానుతేజమై…భావికి వెలుగయే […]

Continue Reading

మౌనశిఖ ( కవిత)

మౌనశిఖ -లక్ష్మీ కందిమళ్ళ ఆమె మౌనశిఖ  ఆమెలోని సున్నితత్వమే ఆమె మాటలోని మాధుర్యం  తన మనసులోకి ఏది ఒంపుకోవాలో తెలిసిన సహృదయిని  తనకు ఎంతో ఇష్టమైంది స్వచ్ఛత ఆమె గురించి ఎంతో చెప్పాలనే ఉంటుంది  కానీ  వినిపించుకునేవారెవరు?? వినేవాళ్ళు లేరనే నేమోఎప్పుడో మూగబోయింది గొంతు. ***** కందిమళ్ళ లక్ష్మికర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading

యుద్ధం ఒక గుండె కోత-18 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండెకోత-18 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి హింసా ప్రతిహింసా ద్వేష ప్రతీకారాల వైరస్సులతో వణికిపోతున్న వాళ్ళకి అమ్మ అనురాగం ఏం రుచిస్తుంది? నోరంతా యుద్ధవాసనతో పుళ్ళుపడిపోయిన వారికి కన్నపిల్లల అమాయకపు ముద్దు మాటలు ఎక్కడ గొంతు దిగుతాయి? తలనిండా ఎత్తులు పైఎత్తులూ జులపాల్లా పెంచుకొంటున్న వాళ్ళకి శిరోభారం తగ్గించేందుకు భార్య అనురాగంతో రాయబోయే ప్రేమమందు ఎక్కడ పనిచేస్తుంది? యుద్ధజ్వర కలవరింతల్ని ప్రపంచమంతా వినిపించేవరకూ నిద్ర ఎక్కడ పడుతుంది? యుద్ధ క్షుద్ర దేవతకి ప్రజాస్వామ్యాన్ని […]

Continue Reading
jayasree atluri

ఉప్పు నీరు (కవిత)

ఉప్పు నీరు -జయశ్రీ అట్లూరి ఎండి పొడారిన కనుగవచెలరేగే తుఫానుల తాకిడికుమిలి కదలి చెమ్మారిన అలికిడిఆరని జ్వాల కరిగిన కల విరిగిన అల  చేరేసిన తట్టా బుట్టా మట్టిపాలుకనిపెంచిన పిల్లా జెల్లా నిన్నటి మురిపాలుకసాయికన్ను పడితే కడదేరిపోయే జీవితాలుఆశలు ఆశయాలు కొడిగట్టిన దీపాలు తరతరాలుగా ఎత్తుతున్న తలల అణచివేత  యుగయుగాలుగా ఎవరూ వినని ఆత్మఘోషదినదినపు సుడిగుండాల గుండెకోత నాకు నేను నాది..నాకుండకూడని భాష కోటానుకోట్ల మగువల తీరని దుఃఖంగుండె సెగకు కరిగిన వ్యథ రుధిరాక్ష స్రవంగాబాధా సాంద్రపు రక్తకన్నీటి చుక్కలుగా లక్షల కోట్ల కన్నీటి […]

Continue Reading
Posted On :

యుద్ధం ఒక గుండె కోత-17 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-17 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి ఖాండవ దహనంతోగాని జఠరాగ్ని చల్లారని ఈ మహానలానికి శాంతి ఎప్పుడు కలుగుతుందో? ఎన్ని ప్రాణాల్ని పుడిసిటపట్టి ఔపోసన పడ్తే చల్లారుతుందో? ఎందరు తల్లుల గర్భశోకాన్ని మింగితే ఎందరు పసిపిల్లలు తల్లి ఒడిని వదిలి దారి పక్కన గడ్డిపూలై తలవాల్చేస్తే ఎందరు కన్నెపిల్లల యవ్వన స్వప్నాలు గాలిమేడలుగా కూలిపోతే ఇంకెందరి విచక్షణ కోల్పోయిన యువావేశాలు యుద్ధయాగంలో సమిధలైతే ఎందరు యువకులు సిద్ధార్ధులై మృత్యువును అన్వేషిస్తూపోతే ఎప్పటికి… […]

Continue Reading

పుత్తడి బొమ్మ మనసు తెలుసునా ?

పుత్తడి బొమ్మ మనసు తెలుసునా ? -శ్రావణి బోయిని పచ్చని తోరణాలు … ఇంటి నిండా బంధువులు … బంగారు బొమ్మల ముస్తాబు చేశారు తనని … పక్కన స్నేహితులు … ఎవరి పనుల్లో వారు … ముస్తాబు గురించి అడిగే స్నేహితులు … బాధ్యతలో బిజీగా అమ్మా నాన్నా… పైకి కనపడకుండా బాధని లోపల దాచుకున్న అమ్మా నాన్నా… బాధని భరిస్తూ అన్ని సిద్ధం చేస్తున్న సోదరి… అందరికి సంతోషంగా ఉన్న … తన మదిని […]

Continue Reading
Posted On :
rajeswari diwakarla

అపరాజిత – గ్రీన్ కార్డ్ (కవిత)

గ్రీన్ కార్డ్ -రాజేశ్వరి దివాకర్ల పొదుపుబతుకులశ్రీమతులు కొంగు బంగారాన సంతానవతులు సంసార చక్రాలకు బండి కందెన ఇరుసులు హక్కుల ఆత్మగతానికి విడిపోనివి ఆప్యాయతలు, అనుబంధాలు అందుకే ఎడతెగని ప్రయాసలు. విశ్రాంతి తీరాన ఉబలాట ప్రయత్నాలు . తోలుపెట్టెల తూకాల బరువుకు కిటికీలు తెరుచుకోని గాలి పయనాలు. దిగగానే బిత్తరిచూపుల కలయికలు, తివాచీల మెత్తదనానికి కాలిమడమల పగుళ్ళు గుచ్చుకోనీయక పదిలపడిన వాళ్ళు . వాలుకుర్చీలో దినపత్రికను అక్షరాలకు ఒంటరిగా విడువక ఆయనను సిగముడిలో తురుముకుని వచ్చినవాళ్ళు కొరియన్అంగళ్ళ భారతీయతలో […]

Continue Reading

నిశ్శబ్ద గ్రంథాలయం ( కవిత)

నిశ్శబ్ద గ్రంథాలయం -లక్ష్మీ కందిమళ్ళ ఇప్పుడు సత్యం పలికే చోటికి పయనం  అక్కడంతా సీతాకోకచిలుకల సందడి ఇంకా శంఖు శబ్దాలు మధురంగాఆ ముచ్చట ఎంత చెప్పినా తక్కువే మరిఇహ ఆ అనుబంధపు తడికి ఎండిన కొమ్మైనా చిగురించదూ ఆ మాటలు వినగలగడం ఒక వరంపాషాణమైనా కరిగి కదులుతుంది నదిలా  ఇహ, అలా బ్రతికేస్తే చాలనిపిస్తుందిఅప్పుడు అదంతా ఒక మురిపెం ఆ నిశ్శబ్ద గ్రంథాలయంలో.. ***** కందిమళ్ళ లక్ష్మికర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading

అల్లిక (కవిత)

అల్లిక -నస్రీన్ ఖాన్ సున్నితత్వం నీ చిరునామాదుఃఖాలన్నింటినీ గుండెలోతుల్లో కుదేసిఅప్పుడే విచ్చుకున్న పువ్వులా చక్కటి నవ్వులు చిందిస్తావ్కవచకుండలంలా సహజంగా అబ్బినదేమోరంకెలకైనా మృదుత్వమే  జోడిస్తావ్ ఎక్కడిదో ఈ సహనంరంగు రంగుల దారాలతో అందమైన అల్లికేసిపిట్టగూడులా కలుపుకుపోదామని తపన పడుతుంటావ్నిటారుతనాన్నివిచ్చుకత్తుల పదును వెన్నుపై సలపరిస్తూంటే దోస్త్ఏ చిరునవ్వులో జీవాన్ని రంగరించాలని తపిస్తున్నావ్ఎప్పుడో పావువై బరిలో ఉన్నావ్గమనించావా?క్విడ్ ప్రో కో రోజుల్లో ఇంకా నీకు మానవతా ఆలోచనలేమిటి? ఆర్ యా పార్మనసుకు గాయాలని చింతిస్తున్నావా చిందేరక్తంలో ఏ ఖుర్బానీ కోసం వెతుకుతావ్ చెప్పూఅన్నీ కలగలిసి ఒకే రంగై వెలిగిపోతూంటే నీ […]

Continue Reading
Posted On :

నిశ్శబ్ద శిలలు ( కవిత)

నిశ్శబ్ద శిలలు -లక్ష్మీ కందిమళ్ళ ఒట్టి శిలలు కాదవి కన్న కలలు  రాళ్ళలా పడివున్న అంతరాత్మలు  కన్నీటిలో తడిచిన కథలు చెబుతాయి  మరచిపోకు రాళ్ళల్లోనూ కన్నీళ్ళుంటాయి అవి శూన్యంలో నిలిచిన నిశ్శబ్ద శిలలు  గత చరిత్ర సాక్షాలు. ***** కందిమళ్ళ లక్ష్మికర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading

డైరీలో ఒక పేజీని…

డైరీలో ఒక పేజీని… -సుభాషిణి తోట కొన్ని సమాధుల గురించి మాత్రమే మాట్లాడే మనంచావులు వాటికి కారాణాల గురించి ఏ ధారావాహికను  ప్రసారం చేయలేం చేసినా ప్రాణం మన నుండి వీడినాక మొదలెడతాం. ఒక బిడ్డ  బతుకు కోసం నీ కలం వేల కన్నీళ్ల ఆర్తనాదమై గర్జించాలి లేదంటే శవమో ఆ అంతర్భాగమో నదులై పారుతాయికుండపోతగా కురుస్తాయి కాలం కాని కాలంలోభూమి మీద పాపాలై మొలుస్తాయి కూడా….విషపూరితమైన గాలులు వీస్తాయిఅడవుల్లోకి దట్టమైన మంటలై పారుతాయి…ప్రతి చెట్టు కొమ్మా పామైమళ్ళీ మళ్ళీ నిన్ను విషపూరితం చేస్తుంది…. మొక్కలు బ్రతకవుగాలి పలకదునది సాగదునీరు పారదుఆకాశంలో ఒక్క […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- విరోధాభాసల సనాతన గ్రీకు తాత్వికుడు హిరాక్లిటస్

క ‘వన’ కోకిలలు – 9 :  విరోధాభాసల సనాతన గ్రీకు తాత్వికుడు హిరాక్లిటస్    – నాగరాజు రామస్వామి (Heraclitus 535–475 BC) Thunderbolt steers all things. The fiery shaft of lightning is a symbol of the direction of the world – Heraclitus. హిరాక్లిటస్ క్రీ.పూ. 5వ శతాబ్దపు గ్రీకు తాత్వికుడు. సోక్రటీస్ కన్న పూర్వీకుడు. గ్రీకు సాంస్కృతిక సనాతనులైన ఐయోనియన్ల ( Ionian ) సంతతికి చెందిన వాడు. గ్రీకు సంపన్న కుటుంబంలో, నాటి పర్షా దేశానికి చెందిన ఎఫిసస్ పట్టణం (Ephesus)  (ప్రస్తుత టర్కీ) లో జన్మించాడు. ఐయోనియన్ […]

Continue Reading

తెలియనిదే జీవితం (కవిత)

తెలియనిదే జీవితం -చందలూరి నారాయణరావు మనిషో పుస్తకం మనసో నిఘంటువు గుంపుగా చేరితే గ్రంధాలయమే. ఎప్పుడు తెరుచుండె సందడే. చదువుకుపోతుంటే కలిసేది ఎందరి ఆలోచనలనో! ఏరుకుపోతుంటే దాచుకునేది మరెందరి అనుభవాలనో! ఎంత చిన్న పుస్తకమైనా ఎంతో కొంత వెలుగే. ముద్రించిన అనుభావాలను చదువుతుంటే  సంతోషమే. కొన్ని గొప్ప గ్రంధాల్లో ప్రతి ఘట్టం ఆమోఘమే ప్రతి మలుపు ఆశ్చర్యమే అనుసరించాల్సిన యోగ్యాలే. కొన్ని దినపత్రికల్లో పొట్టి బాధలు, పొడుగు కన్నీళ్ళు ఊరిని అద్దంగా చేసి పచ్చి వింతలను వేడిగా […]

Continue Reading