image_print

నువ్వు లేని ఇల్లు (కవిత)

నువ్వు లేని ఇల్లు -డా|| కె.గీత నువ్వు లేని ఇల్లు సాయంత్రానికే డీలా పడిపోయింది రోజూ ఆఫీసు నుంచి నువ్వెప్పుడొస్తావా గరాజు ఎప్పుడు తెరుచుకుంటుందా అని రిక్కించుకుని ఉండే చెవులు కళ్లని ఓదార్చే పనిలో పడ్డాయి పగలంతా ఏదో హడావిడిగా గడిచిపోయినా సాయంత్రం గూటికి చేరే వేళ నువ్వు కనబడని ప్రతి గదీ కాంతివిహీనమై పోయింది నువ్వు వినబడని ప్రతీ గోడా స్తబ్దమై వెలవెలబోయింది నీతో తాగని ఈవెనింగ్ కాఫీ ఖాళీ కప్పై సొరుగులో బోర్లా పడుకుంది […]

Continue Reading
Posted On :

తపస్సు (కవిత)

 తపస్సు -వసుధారాణి  ఒక తపస్సులా గమనించు తూనీగల రెక్కల చప్పుడు కూడా వినిపిస్తుంది. కొండ యుగయుగాల కథలు చెపుతుంది. జలపాతం చిలిపితనం నేర్పిస్తుంది. నది ఆగిపోని జీవనగమనం చూపిస్తుంది. ఆకాశం ఉన్నదేమిటో,లేనిదేమిటో ఒక్క క్షణంలో మార్చేస్తుంది. ముని అవ్వటం అంటే ఇదేనేమో జనజీవనంలో నిలబడి కూడా. ఏమయినా సముద్రుడు నాకు బోలెడు కబుర్లు చెపుతాడు. నది వచ్చి నాలో చేరేటప్పుడు ఆ మంచినీరు నేనేమి చేసుకోనూ? వెనక్కి తోసే ప్రయత్నం చేస్తాను. ఐనా నది సంగమించే తీరుతుంది. […]

Continue Reading
Posted On :

ముగింపు లేని సమయం(అనువాద కవిత)

ముగింపు లేని సమయం -దాసరాజు రామారావు ముగింపు లేని సమయం నా చేతుల్లో వున్నది, ఓ నా ప్రభూ నిమిషాలను లెక్కించేందుకు ఎవరూ లేరు దివా రాత్రాలు వెళ్లిపోయి,వయస్సు మళ్లిపోయి వికసించీ, వాడిపోయీ పూల వోలె. నువ్వు తెలుసుకోవాల్సింది ఎట్లా వేచివుండటం. నీ సంవత్సరాలు ఒకటొకటి అనుసరిస్తూ ఒక సంపూర్ణమైన చిన్ని అడవి మల్లె కోసం. మనకు సమయం లేదు కోల్పోవడానికి. మరియు సమయం కలిగి లేం మనం  ఒక అవకాశం కోసం పాకులాడక తప్పదు మనం […]

Continue Reading

పరవశాల మత్తు(కవిత)

పరవశాల_మత్తు -లక్ష్మీ కందిమళ్ల  సాయం సంధ్యల కలయికలు సంతోషాల సుర గీతికలు పరవశపు మత్తులో సుమ పరిమళ హాసాలు ఋతువుల కేళీ విలాసాలు పలకరింతల పులకరింతలు పిలుపు పిలుపు లో మోహన రాగాలు పదిలం గా దాచుకునే కానుకల వసంతాలు వాలిన రెప్పల చాటున రహస్యాలు ఊపిరి పరిమళమై మురిపిస్తుంటాయి ఒక నిశ్చల నిశ్చింతతో..!! ***** కందిమళ్ళ లక్ష్మికర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading

ఇదీ నా కవిత్వం(కవిత)

 ఇదీ  నా కవిత్వం – వసుధారాణి   నీపై ప్రేమ ఎలాగో ఈ కవిత్వమూ అంతేలా ఉంది . నా ప్రమేయం లేకుండా నాలో నిండిపోయి అక్షరాల్లో ఒలికిపోతోంది.   కవి అంటే  ఓ వాన చినుకు,  ఓ మబ్బుతునక మండేసూర్యగోళం చల్లని శశికిరణం కన్నీటికెరటం ఉవ్వెత్తు ఉద్వేగం పేదవాడికోపం పిల్లలకేరింత కన్నతల్లి లాలిత్యం గడ్డిపూవు,గంగిగోవు ఒకటేమిటి  కానిదేమిటి కవి అంటే విశ్వరూపం వేయిసూర్య  ప్రభాతం.   గుండెకింద చెమ్మ, కంటిలోన తడి ఇవి లేకుండా  కవిత్వం […]

Continue Reading
Posted On :

ద్వీపాంతం(కవిత)

 ద్వీపాంతం -శ్రీ సుధ ఎక్కడికీ కదల్లేని చిన్న ద్వీపాలవి సముద్రం చుట్టుముట్టి ఎందుకు వుందో అది నది ఎందుకు కాలేదో అర్థంకాదు వాటికి   వెన్నెల లేని చంద్రుడు హృదయం లేని ఆకాశం వుంటాయని తెలియదు వాటికి   విసిరి కొట్టిన రాత్రుళ్ళు వృక్షాలై వీచే ఈదరగాలుల్లో అలసి ఎప్పటికో నిదురపోతాయి   తీరంలేని నేలలవ్వాలని ఆశపడతాయి రెండో మూడో ఝాములు దాటాక నిశ్శబ్దంగా నావలు వచ్చిచేరతాయా   బహుశా యిక ఆ తరువాత దీపస్తంభాలకి ఆ […]

Continue Reading
Posted On :
లక్ష్మీ కందిమళ్ళ

ఆమె ధరణి(కవిత)

ఆమె ధరణి -కందిమళ్ళ లక్ష్మి  కొందరు అప్పుడప్పుడు కఠిన మాటలతో ఆమెను శిలగా మారుస్తుంటారు.  ఆమె కూడా చలనం లేని రాయిలా మారిపోతూ ఉంటుంది. ఆమె  ఒక మనిషని మరచిపోతుంటారు.  కానీ ఆమె మాత్రం చిరచిత్తంతో మమతానురాగాల వంతెనపైనే నడుస్తూ ఉంటుంది. ఆమెనుఒక చైతన్య మూర్తిగా ఎప్పుడు గుర్తిస్తారు?? మీకు తెలియదా??ఆమె ఎప్పుడూ లాలిత్యాన్ని వదలని ఒక ధరణని!!***** కందిమళ్ళ లక్ష్మికర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading

వ్యక్తి-శక్తి(కవిత)

వ్యక్తి-శక్తి -డా||కె.గీత వ్యక్తిగా మొదలవ్వడం అంటే నీకు నువ్వే అంకురమవ్వడం నీ జీవితానికి నువ్వే బాధ్యతకావడం నిన్ను నువ్వే ప్రేమించుకోవడం ద్వేషించుకోవడం నీలోనువ్వే మాట్లాడుకోవడం పోట్లాడుకోవడం నీకు నువ్వుగా మిగలడం వ్యక్తిగా ఉన్నంతసేపు నీ పరిధి నీ కనుచూపుమేర- నీ దుఃఖోపశమనం నీ అరచేతికందినంతమేర- నీ బాధల్ని నువ్వే తుడుచుకోవడం నీ బంధాల్ని నువ్వే పెంచుకోవడం నువ్వే తుంచుకోవడం *** సమిష్టిగా మొదలవ్వడం అంటే నీకు నువ్వే కొత్తగా పరిచయం కావడం సమిష్టిశక్తిగా మొదలవ్వడం అంటే నీ  […]

Continue Reading
Posted On :

ముసలివాడు-సీతాకోక చిలుక(కవిత)

ముసలి వాడు-సీతాకోక చిలుక(కవిత)              – పాలపర్తి ఇంద్రాణి ముసలి వాడొకడు వణుకుతున్న చేతులతో  గాజు జాడీ పైన రంగురంగు పూలు చిత్రించినాడు.  పుట్ట తేనె తీసుకుని అక్కడక్కడ చిలకరించినాడు.   రంగు పూల గాజు జాడీని తన తోటలోన ఉంచినాడు. సీతాకోక చిలకలకై వేచి చూస్తూ నిలచినాడు.   ముసిలివాడు ఒకప్పుడు సీతాకోకల వేటగాడు.  కానీ ఇప్పుడు సత్తువ ఉడిగి అలసినాడు.  పరుగెత్తలేక ఆగినాడు.    తనంత తానుగా సీతాకోక చిలుక వచ్చి వాలేలా  ఉచ్చులల్లి పెట్టడం ఆరంభించి ఆరితేరినాడు.  […]

Continue Reading

గీత శ్రావణం, సంగీతం (కవితలు)

గీత శ్రావణం, సంగీతం (కవితలు) -నాగరాజు రామస్వామి   గీత శ్రావణం   ఉదయాకాశం తడి తడిగా నన్ను పెనవేసుకున్నప్పుడల్లా రాత్రంతా నానిన అక్షరం నాలో మొలకెత్తి గొంతెత్తుతుంటుంది. చీకటి దైన్యానికి ద్రవించిన సూర్యుడు తడి పదాలై బొట్లు బొట్లుగా రాలుతుంటాడు నా చిరు చీకటి చూరు లోంచి. శ్రావణం అంటే ఎంత ఇష్టమో నాకు! ముసురు ముసుగుల వెనుక సప్త వర్ణాలను పాడుకుంటూ వేకువ! ఏడు రాగాలను విచ్చుకుంటూ ఇంద్రచాపం! చీకటి బతుకులలో కిరణమై నదించాలని తొందరిస్తున్న తొలిపొద్దు […]

Continue Reading

   ఆప్షన్(కవిత)

ఆప్షన్   –శిలాలోలిత మనం వింటున్న దేమిటి? మనం చూస్తున్న దేమిటి? మనుషులెందుకింత క్రూరంగా వుంటున్నారు? అసలు మనుషులెందుకు తాగుతున్నారు? తాగనిదే వూరుకోమన్న  రాజ్యం కోసమా? శ్రమను మర్చిపోతున్నానని ఒకరు బాధని మర్చిపోవడానికని ఇంకొకరు ఫ్యాషన్ కోసమని  ఒకరు కిక్ కోసమని ఇంకొకరు ఒళ్ళు బలిసి ఒకరు వెరైటీ బతుకు కోసం ఇంకొకరు అమ్మ,అమ్మమ్మ, పసిపాప నిద్దరోతున్నారట వాడి ఆప్షన్స్ లో పాప నెన్నుకున్నాడు ఏమిటి? ఏమిటి? ఏమిటిది? ఒళ్ళంతా గొంగళిపురుగులు చుట్టుకున్నట్లుంది వేలవేల పురుషాంగాలు నిగడదన్ని వున్నాయి […]

Continue Reading
Posted On :