image_print

ద్వీపాంతం(కవిత)

 ద్వీపాంతం -శ్రీ సుధ ఎక్కడికీ కదల్లేని చిన్న ద్వీపాలవి సముద్రం చుట్టుముట్టి ఎందుకు వుందో అది నది ఎందుకు కాలేదో అర్థంకాదు వాటికి   వెన్నెల లేని చంద్రుడు హృదయం లేని ఆకాశం వుంటాయని తెలియదు వాటికి   విసిరి కొట్టిన రాత్రుళ్ళు వృక్షాలై వీచే ఈదరగాలుల్లో అలసి ఎప్పటికో నిదురపోతాయి   తీరంలేని నేలలవ్వాలని ఆశపడతాయి రెండో మూడో ఝాములు దాటాక నిశ్శబ్దంగా నావలు వచ్చిచేరతాయా   బహుశా యిక ఆ తరువాత దీపస్తంభాలకి ఆ […]

Continue Reading
Posted On :
లక్ష్మీ కందిమళ్ళ

ఆమె ధరణి(కవిత)

ఆమె ధరణి -కందిమళ్ళ లక్ష్మి  కొందరు అప్పుడప్పుడు కఠిన మాటలతో ఆమెను శిలగా మారుస్తుంటారు.  ఆమె కూడా చలనం లేని రాయిలా మారిపోతూ ఉంటుంది. ఆమె  ఒక మనిషని మరచిపోతుంటారు.  కానీ ఆమె మాత్రం చిరచిత్తంతో మమతానురాగాల వంతెనపైనే నడుస్తూ ఉంటుంది. ఆమెనుఒక చైతన్య మూర్తిగా ఎప్పుడు గుర్తిస్తారు?? మీకు తెలియదా??ఆమె ఎప్పుడూ లాలిత్యాన్ని వదలని ఒక ధరణని!!***** కందిమళ్ళ లక్ష్మికర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading

వ్యక్తి-శక్తి(కవిత)

వ్యక్తి-శక్తి -డా||కె.గీత వ్యక్తిగా మొదలవ్వడం అంటే నీకు నువ్వే అంకురమవ్వడం నీ జీవితానికి నువ్వే బాధ్యతకావడం నిన్ను నువ్వే ప్రేమించుకోవడం ద్వేషించుకోవడం నీలోనువ్వే మాట్లాడుకోవడం పోట్లాడుకోవడం నీకు నువ్వుగా మిగలడం వ్యక్తిగా ఉన్నంతసేపు నీ పరిధి నీ కనుచూపుమేర- నీ దుఃఖోపశమనం నీ అరచేతికందినంతమేర- నీ బాధల్ని నువ్వే తుడుచుకోవడం నీ బంధాల్ని నువ్వే పెంచుకోవడం నువ్వే తుంచుకోవడం *** సమిష్టిగా మొదలవ్వడం అంటే నీకు నువ్వే కొత్తగా పరిచయం కావడం సమిష్టిశక్తిగా మొదలవ్వడం అంటే నీ  […]

Continue Reading
Posted On :

ముసలివాడు-సీతాకోక చిలుక(కవిత)

ముసలి వాడు-సీతాకోక చిలుక(కవిత)              – పాలపర్తి ఇంద్రాణి ముసలి వాడొకడు వణుకుతున్న చేతులతో  గాజు జాడీ పైన రంగురంగు పూలు చిత్రించినాడు.  పుట్ట తేనె తీసుకుని అక్కడక్కడ చిలకరించినాడు.   రంగు పూల గాజు జాడీని తన తోటలోన ఉంచినాడు. సీతాకోక చిలకలకై వేచి చూస్తూ నిలచినాడు.   ముసిలివాడు ఒకప్పుడు సీతాకోకల వేటగాడు.  కానీ ఇప్పుడు సత్తువ ఉడిగి అలసినాడు.  పరుగెత్తలేక ఆగినాడు.    తనంత తానుగా సీతాకోక చిలుక వచ్చి వాలేలా  ఉచ్చులల్లి పెట్టడం ఆరంభించి ఆరితేరినాడు.  […]

Continue Reading

గీత శ్రావణం, సంగీతం (కవితలు)

గీత శ్రావణం, సంగీతం (కవితలు) -నాగరాజు రామస్వామి   గీత శ్రావణం   ఉదయాకాశం తడి తడిగా నన్ను పెనవేసుకున్నప్పుడల్లా రాత్రంతా నానిన అక్షరం నాలో మొలకెత్తి గొంతెత్తుతుంటుంది. చీకటి దైన్యానికి ద్రవించిన సూర్యుడు తడి పదాలై బొట్లు బొట్లుగా రాలుతుంటాడు నా చిరు చీకటి చూరు లోంచి. శ్రావణం అంటే ఎంత ఇష్టమో నాకు! ముసురు ముసుగుల వెనుక సప్త వర్ణాలను పాడుకుంటూ వేకువ! ఏడు రాగాలను విచ్చుకుంటూ ఇంద్రచాపం! చీకటి బతుకులలో కిరణమై నదించాలని తొందరిస్తున్న తొలిపొద్దు […]

Continue Reading

   ఆప్షన్(కవిత)

ఆప్షన్   –శిలాలోలిత మనం వింటున్న దేమిటి? మనం చూస్తున్న దేమిటి? మనుషులెందుకింత క్రూరంగా వుంటున్నారు? అసలు మనుషులెందుకు తాగుతున్నారు? తాగనిదే వూరుకోమన్న  రాజ్యం కోసమా? శ్రమను మర్చిపోతున్నానని ఒకరు బాధని మర్చిపోవడానికని ఇంకొకరు ఫ్యాషన్ కోసమని  ఒకరు కిక్ కోసమని ఇంకొకరు ఒళ్ళు బలిసి ఒకరు వెరైటీ బతుకు కోసం ఇంకొకరు అమ్మ,అమ్మమ్మ, పసిపాప నిద్దరోతున్నారట వాడి ఆప్షన్స్ లో పాప నెన్నుకున్నాడు ఏమిటి? ఏమిటి? ఏమిటిది? ఒళ్ళంతా గొంగళిపురుగులు చుట్టుకున్నట్లుంది వేలవేల పురుషాంగాలు నిగడదన్ని వున్నాయి […]

Continue Reading
Posted On :