స్వదేశం -కుందుర్తి కవిత విదేశంలో ఉంటూ దేశభక్తిమీద కవితేంటని మొదట వ్యంగ్యంగా నవ్వుకున్నా… ఆలోచనలు ఏదో అజెండా తో గిర్రున వెనక్కి తిరిగి జ్ఞాపకాల వీధిలో జెండా పాతాయి… పదిహేనేళ్ళ నా పూర్వం పరదేశంలో తన పునాదులు వెతికింది!! ఆరునెలలకు మించి ఇంటికెళ్ళకపోతే మనసు మనసులో ఉండకపోవడం… మన దేశం నుంచి ఎవరొచ్చినా సొంతవాళ్ళలా మర్యాదలు చేయడం… మన జాతీయ హస్తకళలతో ఇంటినంతా నింపుకోవడం మన దేశపు చిన్ని భాగాన్నైనా ఇంట్లో బంధించామని పొంగిపోవడం… పిల్లలకి దేశభక్తి పాటలు నేర్పుతూ , “ఏ దేశమేగినా, ఎందుకాలిడినా” అని మైమరిచి పాడటం.. జణగణమన తరువాత జై హింద్ కి ప్రతీసారీ అప్రమేయంగా చేయెత్తి జై కొట్టడం… ఇవన్నీ దేశాభిమానానికి నిదర్శనం కాదా?! మన సినిమాల ప్రీమియర్ షోల కి వెళ్ళి ఈలలు వేయడం నుంచీ… మార్స్ మంగళ్ మిషన్ సఫలానికి గుండె గర్వంతో ఉప్పొంగిపోవడం వరకూ..!! ఆనాటి క్రికెట్ వరల్డ్ కప్పులో టీం ఇండియాకి పై కప్పులెగిరేలా ఛీర్ చేయడం నుండి మొన్న ఒలంపిక్సులో సింధు కంచుపతాకానికి కంచు కంఠంతో అరవడం వరకూ !! అన్నిట్లో దేశారాధరోదన వినిపించలేదా ?! కాషాయవన్నె ధైర్యం వెన్నంటే ఉంచుకుని తేటతెల్లని మమతలు మనసులో నింపుకొని అభివృద్ధికై పచ్చటి శుభసంకల్పంతో ధర్మసందేశాన్ని విస్తరించే విహంగాలై వినీలాకాశంలో విహరిస్తూ త్రివర్ణ తత్వాన్ని త్రికరణశుద్ధిగా పాటిస్తున్న మనం.. ప్రవాసంలో కూడా స్వదేశ ఛాయలనే కదా వెతుక్కుంటున్నది?! దేశభక్తుడంటే… దేశాన్ని ఉద్ధరించే […]
Continue Reading