image_print

వసంత కాలమ్-10 నవ్వుల్ నవ్వుల్

నవ్వుల్ నవ్వుల్  -వసంతలక్ష్మి అయ్యగారి ఒకాఫీసు…పాతిక మందిదాకా సిబ్బంది వుంటారు.. జీతాలూ…లీవులూ ..లోనుసాంక్షనులు ..ట్రాన్స్ఫర్లు,ప్రమోషనుకుపుటప్లు…వగైరా లను చూసుకునే సెక్షను ఒకటుంటుంది.ఇంచుమించుHR అనుకోండీ..అందులో యాభైదాటిన గుమాస్తా తనదైన ఇంగ్లీషుతోఅదరగొట్టేస్తూ ఉండేవారు.. .  ఇంగ్లీషు దిగి మాతృభాషలో పలకరించడంకూడా నామోషీ ఆయనకి…ఐతేమాత్రం…అందరినీ కలుపుపోతూఉండేవారు…very “colloquial” అనమాట!!![దయచేసి జోకునుగ్రహించవలెనహో!]ప్రమోషను అంతవరకూ తీసుకోలేదు… ఆయనవద్ద నేను విని..మేధోమథనం  కావించుకున్న కొన్నిమధురాలనుమీతో పంచుకుంటాను..సరేనా!!okay…. నెలపొడుగునా  సిబ్బంది లీవులు పెడుతూనేఉంటారుకదా..మామూలే..అటెండెన్సు రిజిస్టరుచూసుకుంటూ..లీవులెటర్లుఇవ్వని వారందరినీ పేరుపేరునా కలిసిమర్యాదపూర్వకంగా అడిగి..ప్రింటెడు లెటరు మీద వారి పేరుతోపాటురాని తేదీలను రాసిచ్చిమరీ […]

Continue Reading
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -10 హాయిని గొలిపే హిందోళం

ఒక భార్గవి – కొన్ని రాగాలు -10 హాయిని గొలిపే హిందోళం -భార్గవి చక్కగా శ్రుతి శుభగంగా ఆలపించే హిందోళ రాగం వినంగానే , ఆత్మ ఆనందపుటలలలో తేలియాడి,దివ్య లోకాలలో విహరిస్తుందంటారు. అసలు హిందోళ అనే పదానికి అర్థం ఒక రకమైన ఊపు,తూగు,లయ అని చదివాను.ఇంకా ఉద్వేగాలని ఉపశమింప జేసి మనసుకు ఓదార్పుని ఇస్తుందనీ,అందువలన రక్తపోటుని నియంత్రించడానికీ,ఆందోళన తగ్గించడానికీ “మ్యూజిక్ థెరపీ” లో ఈ రాగాన్ని వినియోగిస్తారని విన్నాను. ఇది మంచి రక్తి రాగమని గాత్ర కచేరీలలోనూ,నాదస్వర […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-16

కనక నారాయణీయం -16 –పుట్టపర్తి నాగపద్మిని పుట్టపర్తి సాహిత్య జైత్ర యాత్ర, విజయ మార్గాన ప్రయాణిస్తున్న సమయంలో ఒక రోజు..!! పుట్టపర్తి వారిని కొప్పరపు సుబ్బయ్య హఠాత్తుగా తన గదికి పిలుస్తున్నారని ప్యూన్ వచ్చి చెప్పాడు. హఠాత్తుగా ఇప్పుడీ పిలుపేమిటి?? ‘ఇదుగో సామీ..నీకేదో అనంతపురం కాలేజీ నుంచీ జాబొచ్చిందే!! అంతా ఇంగ్లీష్ లో ఉండాది..మద్రాసోళ్ళు నిన్ను విద్వాన్ అన్నారు. వీళ్ళేమంటుండారో నిన్ను..సూడు …’ నిండారా నవ్వుతూ, ఆ లేఖను పుట్టపర్తి చేతుల్లో పెట్టారు కొప్పరపు సుబ్బయ్య గారు. […]

Continue Reading

చిత్రం-19

చిత్రం-19 -గణేశ్వరరావు  ఆర్టెమిజా జెంటిలెక్సి 17వ శతాబ్దపు ఇటాలియన్ చిత్రకారిణి. ఆమె 1620లో గీసిన ఈ చిత్రం పేరు – జూడిత్, హోలోఫర్నెస్ తల నరకడం. ఓల్డ్ టెస్టమెంట్లోని కథ. అస్సిరియన్ ఆర్మీ జనరల్ హోలోఫర్నెస్ జుడిత్ ఉన్న నగరాన్ని ముట్టడి చేస్తాడు. బాగా తాగి ఉంటాడు. ఆమె అదే అదనుగా అతని తల నరికి, తన సేవకురాలితో సొంత ఊరికి తిరిగి వస్తుంది. ఈ ఇతివృత్తాన్ని ఆర్టెమిజా అందరినీ అబ్బురపరచేటట్టు స్పష్టమైన దృశ్య రూపంలో చూపుతుంది. […]

Continue Reading
Posted On :

షర్మిలాం“తరంగం”-19

షర్మిలాం “తరంగం” మార్పు మంచిదే ! -షర్మిల కోనేరు  “కాలం మారిపోయిందండీ ఆ రోజుల్లో … అని గతంలోకి వెళ్ళి పోతారు. కాలం ఎప్పుడూ మారదు కొత్త పోకడలు వస్తాయంతే . కరెంటు తీగ సన్నగా కనపడ్డా  లావుగా కనబడ్డా లోపల కరెంట్ అలాగే వున్నట్టు లోపల ఒరిజినాలిటీ భద్రంగా వుంటుంది. కాలమాన పరిస్థితులబట్టీ రూపం మారుతుందంతే. “అమ్మో ! ఆ రోజుల్లో మీ మామగారంటే ఎంత భయమో అని మా అత్తగారంటే , ఎందుకూ భయం […]

Continue Reading
Posted On :

కరోనా విరహం- భరోసా వరం (హాస్య కథ)

 కరోనా విరహం- భరోసా వరం  –టి.వి.ఎస్.రామానుజ రావు  సెల్ ఫోను మోత వినగానే, “అమ్మలూ, బావ అనుకుంటా చూడు! ఆ వంకాయలు నేను తరుక్కుంటానులే. నువ్వు పోయి మాట్లాడు.” ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్పింది తల్లి సావిత్రి. తల్లి వంక ఒకసారి కోపంగా చూసి వంటింటిలోంచి తన గదిలోకి పరిగెత్తింది వినతి. గది తలుపు గడియ పెట్టి, ఫోను తీసింది. “హలో, ఇంతసేపూ ఏం చేస్తున్నావోయ్?” చిరుకోపంతో అడిగాడు చంద్ర. “వంటింట్లో కూరలు తరుగుతున్నాను, స్వామీ! ఏదో  […]

Continue Reading

అన్నీ తానే (కవిత)

అన్నీ తానే -చందలూరి నారాయణరావు సూర్యుడు నాకు గుర్తుకు రాడు. నాలో ఉదయించే వెలుగు వేరు.. చంద్రుడు నాకు అవసరం అనుకోను. నాకై పూసే శశి ఉంది గాలితో నాకు పనే లేదు నాకై మొలిచిన నవ్వుల చెట్టుంది. మట్టిని అడిగేది లేదు. ప్రేయసి పాదముద్రలో సంతోషాలే అన్నీ. వానలో తడిసేది లేదు. జ్ఞాపకాల జల్లుతో తేమకు కరువేలేదు. ***** చందలూరి నారాయణరావుపుట్టినది: ప్రకాశం జిల్లా జె. పంగులూరు. వృత్తి: హైస్కూల్ఉపాధ్యాయులు ప్రవృత్తి: వచన కవిత్వం రచనలు: […]

Continue Reading

ఎముకలు విరిగిన నీడ (‘పరివ్యాప్త’ కవితలు)

ఎముకలు విరిగిన నీడ  -డాక్టర్ నాళేశ్వరం శంకరం ఆమె భర్త గుహను ధ్వంసం చేసే లోపునే  ఇనుప చువ్వల చూపుల్ని నాటే  ప్రేమ చక్షువులు కూడా  మృగ పాదాల్ని మోపి తొలగిపోయాయి  ఆమె ఇప్పుడు కాలం గడియారం మీద  కొట్టుకునే ముల్లు మాత్రమే  గతించిన దృశ్యాలు  బింబాలు బింబాలై ద్రవించి నప్పుడల్లా  గాయాలు జీర్ణమై గుండెబండై కళ్ళు గోలి బిళ్ళలై చిట్లిన పత్తిమొగ్గ అవుతోందప్పుడప్పుడు పుట్టిల్లు  ముక్కుకు చెవులకు సౌందర్య తూట్లు పొడిపించినట్లే మెట్టిల్లూ, ఆనవాళ్లే లేని గాయాలతో […]

Continue Reading

రంగవల్లి (కవిత)

రంగవల్లి -అశోక్ గుంటుక తెలుగు లోగిలి ప్రతి వాకిలి ఆనందం ఆకృతి దాల్చిన రంగవల్లి… ముగ్గునగొబ్బిపూలు ఎగురుతున్న గాలిపటాలు హరిదాసులు బసవన్నలు; ప్రతి ఇంటా పరుచుకున్న వసంతం… ప్రకృతి పల్లె చేరి  పరవశం… ఆకాశం రాలిన నక్షత్రాలు.. ఆ వెంటే విరిసిన ఇంద్రధనుస్సులు… అతనొచ్చి ఓ ముగ్గు చుక్కపెట్టి సెల్ఫీ యై… అహాన్ని చల్లార్చుకున్నా ఆకాశంలో సగం అంటూ సగాన్ని మిగుల్చుకున్నా… నిజానికి ఇక్కడ అతనుశూన్యం… పండుగ వేళ – వాకిలి క్యాన్వాస్ పై తీర్చిదిద్దిన కళాకృతులు…… […]

Continue Reading
Posted On :

చూడలేను! (కవిత)

చూడలేను! -డి.నాగజ్యోతిశేఖర్   కరగని దిగులుశిల పగిలిన స్వప్న శిఖరంపై  సాంత్వన తడికై కొట్టుకులాడుతున్నది! మలిగిన ఆశా మిణుగురులు రెక్కల సడి వెతల దిగంతాల అంచుల్లో నిశ్శబ్ధాన్ని ప్రసవిస్తున్నది! కన్నీళ్ల మేఘసంచులు చిల్లులుపడి కంటిఆకాశం దుఃఖ వర్ణం పూసుకుంటున్నది! ఇప్పుడిప్పుడే విచ్చుకున్న అస్తిత్వ రెక్కలకు ఆధారమివ్వని ఈనెల మనస్సులు  వివక్షతను ఈనుతున్నవి! మేధస్సు చంద్రునిపై వెన్నెల సౌధాలు నిర్మిస్తున్నా… ఆంక్షల రాహువులు చీకటి అమవాసలై చుట్టేస్తున్నవి! మాటల్లో ఆకాశంలో సగమైనా…. చూపుల్లో వంకరతనపు   ప్రశ్నాచిహ్నమై స్వేచ్చా హృదయం […]

Continue Reading

అమ్మతనాలు (కవిత)

అమ్మతనాలు -పద్మావతి రాంభక్త ఏ దేశమేగినా ఎడారిలో ఒంటరిగా నిలబడి సతమతమవుతున్నపుడు నువ్వు అక్కడ ఎగరేసిన అమెరికా టికెట్టు నా భుజంపై పిట్టలా వాలింది నేను ఉత్సాహపు ఊయలలో ఊగుతూ తూగుతూ ఊరంతా దండోరా వేసేసాను నీకు నాపై ఉన్న ప్రేమ ఎవరెస్టు శిఖరమంత ఎత్తుగా అగుపించింది నిరంతరం ఎన్నో కలలలో తేలి తూలిపోయాను రోజులు యుగాల రూపమెత్తి కదలక మెదలక కలవరపరుస్తున్నట్టే అనిపించింది కళ్ళు కాలెండర్ కు అతుక్కుని దిగాలుగా వేళ్ళాడుతున్నాయి నిరీక్షణ నిస్సహాయతను తొడుక్కుని […]

Continue Reading
subashini prathipati

ప్రత్తిపాటి నానీలు (కవిత)

ప్రత్తిపాటి నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి 1️⃣గాయాలన్నీ…నెత్తురోడవు!!కొన్ని జీవితాలనుఅశ్రువుల్లా..రాల్చేస్తాయి!2️⃣కనులుంది..చూసేందుకే!తెరచిన ప్రతికన్నుమెలకువ కాదే!!3️⃣కరుణ నిండినకళ్ళు కలువలు!వేదనా వేసటతీర్చేది వెన్నెలేగా!4️⃣కనబడని క్రిమిస్వైర విహారం!మారువేషాన తిరిగేయమునిలా!!5️⃣మల్లెఎప్పటికీ ఆదర్శమే!!మండుటెండలోనవ్వుపూలై పూస్తున్నందుకు!!    ***** ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ  కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల […]

Continue Reading

లతా ఫల కుచ ద్వయి

లతా ఫల కుచ ద్వయి – అపర్ణ మునుకుట్ల గునుపూడి అయిదేళ్ల క్రితం ఆఫీస్ లో పని ముగించుకుని ఇంటికి బయలుదేరేను.  కారు డ్రైవ్ చేస్తూ రేడియోలో వార్తలు వినడం నా దిన చర్య. రోజూ వినే వార్తలే అయినా ఆ రోజు ఒక ప్రకటన నా మనసుకి తగిలింది. అది ఆ నెల అక్టోబర్ నెల కావడం మూలాన, అది బ్రెస్ట్ కాన్సర్ గుర్తించే నెల అని చెప్పి స్త్రీలందరిని తమంతట తామే స్వీయ స్తన […]

Continue Reading
Posted On :

యుద్ధం ఒక గుండె కోత-1 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండెకోత-1 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి బాధ సన్నటి సూదిములుకై రక్తంలో ప్రవేశించింది నరాల్ని కుట్టుకుంటూ రక్తంతోబాటుగా శరీరమంతటా ప్రవహించటం మొదలైంది శరీరంలో ఎక్కడో ఒకచోట ఉండుండి ప్రవాహమార్గంలో సున్నితమైన నరాల గోడల్ని తాకుతూ స్పందనల్ని మీటుతూ చురుకు చురుకు మనిపిస్తూనే ఉంది హాహాకారాల్ని ఆహ్లాదంగా పరిగణించలేంకదా ఆక్రందనల్ని ఆనందంగా ఆస్వాదించలేంకదా చాటున మాటేసి పంజా విసిరినా పంజాదెబ్బ పడేది అమాయకులమీదే గాయం అయ్యేది తల్లి గర్భంపైనే ఆకాశం పిడుగై వర్షించినా పక్షులకు […]

Continue Reading

కొడుకు-కూతురు (కథ)

కొడుకు-కూతురు -జి.అనంతలక్ష్మి ఆడపిల్ల పుట్టింది అనగానే ఆడ  పిల్ల అంటారు. ఏందుకు? పెళ్ళి అయి అత్తవారింటికి వెళి పోతుంది అని. ఈనాడే కాదు ఆనాడు మగపిల్లాడు పుట్టి ఏమి వుద్దరించాడు? ఆ మాటంటే ఇంట్లో అందరు యుద్ధానికి వచ్చేస్తారు.  మగపిల్లాడు నెత్తిన పెట్టే రాయి ఏమిటి? ఆడపిల్ల నిజంగా రాయి పెట్టకపోవచ్చు. తల్లిదండ్రుల కష్టాలలోను చివరి పరిస్థితుల్లోను వెన్నంటి కాపాడేది ఆడపిల్లే. కాని చివరకి ఆ తల్లిదండ్రులకు కూడ ఆడపిల్ల పనికిరానిదవుథోందా! ఏందుకు?  ఇలా ఆలోచిస్తూ తల్లి […]

Continue Reading
Posted On :

సన్న జాజులోయ్ (కథ)

సన్న జాజులోయ్ -ఎన్నెల పెళ్ళప్పుడు మా అమ్మ నన్ను అప్పగిస్తూ మా వారితో…’ అమ్మాయి సెవెన్ జాస్మిన్ హయిటు నాయనా, జాగర్త గా చూసుకో ‘ అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది. మా వాళ్ళందరూ అయోమయం గా మొహం పెట్టి,” పాపం బాధలో ఏదో మాట్లాడుతోందిలే పిచ్చి తల్లి” అని సర్దుకున్నా, తర్వాత చుట్టూ చేరి, ” మీ అమ్మ గారు ఏమన్నారు ఇందాకా అప్పగింతలప్పుడూ” అని నన్నడిగారు.”అదా….సెవెన్ జాస్మిన్స్ హయిటు అనగా ‘ఏడు మల్లెల […]

Continue Reading
Posted On :

War a hearts ravage-1 (Long Poem)

War a hearts ravage-1 English Translation: P. Jayalakshmi & Bhargavi Rao Telugu Original : “Yuddham oka Gunde Kotha” by Seela Subhadra Devi Gnawing pain pricking like sharp needle end tacking nerves along blood stream began flowing through human frame. Somewhere, now and then touching delicate nerve walls in its course strumming sensations, smarts and shoots […]

Continue Reading

జ్ఞాపకాల ఊయలలో (భాగం-1)

జ్ఞాపకాల ఊయలలో-1 -చాగంటి కృష్ణకుమారి అవి  మారాజునాన్నకాల్చే సిగరెట్టుపెట్టెలలోని తెల్లని ముచ్చికాగితాలు అడిగి పుస్తకాలలో పదిలంగా దాచుకొనే రోజులు;చిన్నిరబ్బరుమూతతోవున్న ఖాళీఅయిన బుల్లిఇంజక్షన్  సీసా రాజునాన్నగారి మెడికల్ షాపు నుండి తెచ్చుకొని పలక తుడుచుకోవడానికి  నీటితో నింపుకొన్న రోజులు.పుస్తకాలలో నెమలి ఈకలను దాచి వాటిమీద మూడు,నాలుగు బియ్యపుగింజలువేసి అది పిల్లలు పెడుతుందని  మాటిమాటికీ  పేజీలు తిరగేసే రోజులు. రాజునాన్న మానాన్న చాగంటి సోమయాజులు( చాసో)కి తమ్ముడి వరస.అప్పుడు నేను చదువు తున్నది విజయనగరం చిన్నిపల్లి వీధిబడిలో ఒకటవ తరగతి.బడిమెట్లుఎక్కగానే […]

Continue Reading

కొత్త అడుగులు-16 బహుముఖీనప్రజ్ఞ – ఇందిరాభైరి

కొత్త అడుగులు – 16 ‘‘బహుముఖీనప్రజ్ఞ – ఇందిరాభైరి” – శిలాలోలిత ఖమ్మం జిల్లాలోని ఇల్లెందులో వుంటున్న ‘ఇందిరాభైరీ’ – సాహిత్య జీవితాన్ని ఓసారి చూద్దాం. కొత్తగూడెంలో బాల్యం గడిచిపోయి, ఇల్లెందులో స్థిరపడిన టీచర్ ఇందిర. మాటెంత సున్నితమో మనసంత భావుకత నిండిపోయి వుంటుంది. మొత్తం 6 పుస్తకాలను ప్రచురించింది ఇప్పటికి. ఈమె కవిత్వంలో కనిపించే ప్రధాన గుణం తక్షణ ప్రేరణ. రైతుల ఆత్మహత్యో, నిర్భయ లాంటి జీవితాలు వినగానే, చూడగానే భావోద్వేగానికి లోనై కవిత్వం వస్తుంది. […]

Continue Reading
Posted On :

వాన (కవిత)

వాన -సంధ్యారాణి ఎరబాటి ముసురుపట్టిన వాన కురుస్తుఉంటే గుండెల్లో ఎదో గుబులైతాది గరం గరంగా తిందామంటూ నోరేమో మొరబెడుతాది దోమనర్తకీలు  వీధుల్లో భాగోతాలు మొదలెడతాయి మ్యాన్ హోలులు సొగసరిప్రియురాళ్లలా నవ్వుతూ నోరంతా తెరుస్తాయి గుంతలన్నీ నిండి నిండుచూలాలవుతాయి వీధులన్నీ గోదారిలా వయ్యారాలు పోతాయి.. రోడ్డులన్ని పుటుక్కున తెగిపోతాయి దారులన్నీ కర్ఫ్యూ పెడతాయి.. మురికి కాలువలన్నీ ఒక్కసారే ఉరికి ఉరికి పారుతాయి వీధి చివరి బజ్జీల బండి తీరిక లేకుండా వెలుగుతుంది మూలన ముదురుకున్న ముసలమ్మ  మరికాస్త ముడుచుకుంటుంది […]

Continue Reading
P.Satyavathi

ఇట్లు మీ స్వర్ణ (కథ)

ఇట్లు మీ స్వర్ణ -పి సత్యవతి పొద్దున్న లేచి, పాలు తెచ్చి, టీ కాచి మంచినీళ్ళు పట్టి తెచ్చి, ఇల్లూడ్చి  వంటింటి పనులు  అందుకుని తమ్ముడుకి తనకీ  బాక్సులు కట్టి షాపుకి తయారైంది స్వర్ణ. , ఎర్ర చుడీ, దానిమీదకి రంరంగుల పువ్వుల కుర్తీ ,పలచని ఎర్ర చున్నీ, వేసుకుంటే జడ లేకపోతె ‘పోనీ’ కట్టుకోవాలి  కానీ జుట్టు వదిలెయ్య కూడదు ‘పోనీ’ కోసం కాస్త జుట్టు కత్తిరించుకుంటానంటే అమ్మ చంపేస్తుంది.చచ్చి నట్టు చిక్కులు తీసుకుని జడ […]

Continue Reading
Posted On :

Story for Kids – CITIZENS OF TOMORROW

Story for Kids – CITIZENS OF TOMORROW English Translation: M.Venkateshwarlu Telugu original: “Bhavi pourulu” by P.S.M. Lakshmi Jagtap Water Falls is a popular tourist attraction in Mau near Pune, Maharashtra.  In August (normally in rainy season), a lot of tourists flock to these beautiful water falls. In 2019, on a Sunday morning at 1030hrs,  four […]

Continue Reading
Posted On :

Early Detection

Early Detection -Aparna Munukutla Gunupudi 5 years ago, I was driving home from work and heard on the radio that October is breast cancer awareness month.  I thought, that is nice, they have a dedicated month for this cause and wondered what I can do to recognize that.  I certainly can tell my two daughters […]

Continue Reading
Posted On :

కాలిఫోర్నియాలో ఘనంగా జరిగిన వీక్షణం-100వ సాహితీ సమావేశం

https://www.youtube.com/watch?v=IbyyBv9WLw4 కాలిఫోర్నియాలో ఘనంగా జరిగిన వీక్షణం-100వ సాహితీ సమావేశం -ఎడిటర్ కాలిఫోర్నియా బే ఏరియాలోని “వీక్షణం” సంస్థాపక  అధ్యక్షులు డా|| కె.గీత ఆధ్వర్యంలో జరిగిన 100 వ సాహితీ సమావేశం అంతర్జాల సమావేశంగా డిసెంబరు 12, 2020న విజయవంతంగా జరిగింది.  డా|| కె.గీత, శ్రీ కిరణ్ ప్రభ, శ్రీ వేమూరి వేంకటేశ్వర్రావు గార్లు స్వాగతోపన్యాసాలు చేశారు. ఈ సభకు విశిష్ట అతిథులుగా తానా పూర్వ అధ్యక్షులు శ్రీ జంపాల చౌదరి గారు,  వంగూరి ఫౌండేషన్ సంస్థాపకులు శ్రీ  చిట్టెన్ […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-18

  నారిసారించిన నవల-18                       -కాత్యాయనీ విద్మహే  1950 వ దశకంలో ప్రారంభమైన   లత  నవలా రచన 1960 వ దశకంలో వేగంపుంజుకొంది.  1960 ఫిబ్రవరి లో ‘ఎడారి పువ్వులు’(ఆదర్శగ్రంథమండలి) నవల వచ్చింది. మళ్ళీ  ఆగస్టు నెలలో ‘రాగ జలధి’ నవల వచ్చింది. ఈ ఆరు నెలల వ్యవధిలో ఆమె వ్రాసిన నవలలు అయిదు.రాగజలాధి నవలలో ‘ఈ రచయిత్రి నవలలు’ అనే  […]

Continue Reading

కథాకాహళి-పి.శ్రీదేవి కథలు

స్త్రీల లైంగిక సంఘర్షణలను చిత్రించిన పి.శ్రీదేవి కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి యాభై దశాబ్దం నాటికి కథాసాహిత్యానికి చక్కటి పునాది, భద్రతా పేర్పడ్డాయి. దీనికి తోడు మెదటి తరం రచయిత్రులు ఇచ్చిన ప్రేరణతో, చదువుకున్న స్త్రీలు కలం పట్టారు. ఈదశాబ్ది మధ్యలోనే కాలంలో రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, మాలతీచందూర్, కె. రామలక్ష్మి, పి. శ్రీదేవి లాంటి రచయిత్రుల స్వతంత్ర భావజాలం ఆతర్వాతి దశాబ్దాన్ని రచయిత్రుల దశాబ్దంగా నిలిపింది. తెలుగు కాల్పనిక సాహిత్యంలో లైంగికతను చర్చనీయాంశం చేసే క్రమంలో […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-1)

బతుకు చిత్రం – రావుల కిరణ్మయి అదో పెద్ద అడవిలాగుంది.చుట్టూ ఎంత దూరం నడిచినా దట్టంగా అల్లుకున్న పెద్ద పెద్ద వృక్షాలు. తాను ఆ చెట్లు ఎక్కుతున్నది. బాగా విరగకాసిన పండ్ల తో చెట్లన్నీ గూని అవ్వ లా కనిపిస్తుంటే,ఎక్కిన చెట్లను దిగి ఆ చెట్ల వైపు పరుగు తీస్తున్నది. చిత్రం….అక్కడికి వెళ్లి వాటిని అందుకొని అవి ఏ పండ్లు?..అని పరికిస్తూ…..జామ ,మామిడి,సపోటా….అంటూ ఒక్కో చెట్టును గుర్తిస్తూ పోతూ ఉంటే ఆశ్చర్యంగా పూలతోట లోకి చేరుకుంది. పువ్వులు…..పిచ్చిపట్టినట్టుగా […]

Continue Reading
Posted On :

పరిశోధకుల కరదీపిక – సిరికోన భారతి

పరిశోధకుల కరదీపిక – సిరికోన భారతి -డా. రాయదుర్గం విజయలక్ష్మి “నేర్చుకుంటూ, నేర్పిస్తుంటాం, పంచుకుంటూ పెంచుకుంటాం” అనే ధ్యేయంతో, ‘సాహిత్య సిరికోన’ వాక్స్థలిలో వచ్చిన, విలువైన, పరిశోధనాత్మకమైన వ్యాసాలతో, విద్వత్చర్చలతో వెలసిన, “సిరికోన భారతి” అన్న  పుస్తకం, తెలుగు సాహితీ వనంలో కొత్తగా నాటబడిన, సురభిళసుమాలను పూయించే స్వచ్ఛమైన పారిజాతం మొక్క! భాష, సాహిత్య, సంస్కృతులకు సంబంధించిన వ్యాసాలు, చర్చాకార్యక్రమాలతో కూడిన ముప్ఫై వ్యాసాలతో విలసిల్లే ఈ పుస్తకం లోని ప్రత్యంశమూ, మౌలికమైనది, కొత్త ఆలోచనలను రేకెత్తించేది […]

Continue Reading

Tell-A-Story (New Column) (Top 10 Emerging Technologies of 2020)

https://youtu.be/VecmjZJmCtw Tell-A-Story Top 10 Emerging Technologies of 2020 -Suchithra Pillai 2020 was definitely unique with so many unforeseen circumstances, but we all have emerged  stronger to face a promising New Year 2021! The year that went by may remind us of tough times, however it also paved the way for an array of amazing technologies […]

Continue Reading
Posted On :

విషాద కామరూప

విషాద కామరూప        -అనురాధ నాదెళ్ల రచనః ఇందిరా గోస్వామి అనువాదంః గంగిశెట్టి లక్ష్మీనారాయణ కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించిన ‘’విషాద కామరూప’’ నవలా రచయిత్రి ఇందిరా గోస్వామి. ఈ నవలను కామరూప మాండలికంలో ‘’ఊనే ఖోవా హౌదా’’ పేరుతో రాయటం జరిగింది. ఈ అస్సామీ మాండలికం ఎక్కువ మందికి తెలియకపోవటం వలన రచయిత్రి స్వయంగా ‘’ఎ సాగా ఆఫ్ సౌత్ కామరూప” పేరుతో తన నవలను ఇంగ్లీషులోకి అనువదించారు. దానిని గంగిశెట్టి లక్ష్మీ […]

Continue Reading
Posted On :

“My Father Bertrand Russel” by Katherine Tait

“My Father Bertrand Russel” by Katherine Tait – P.Jyothi A Daughters life caught between her “self” and her intelligent father’s influence- MY FATHER BERTRAND RUSSEL is a book by Russel’s daughter Katharine Tait. Its the most honest book i ever came across about a daughter who was a product of her fathers experimentation, suffered in […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-19 (అలాస్కా-7)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-7 దెనాలి నేషనల్ పార్కు  సందర్శనకు ఉదయానే రెడీ అయ్యి మా రిసార్టు బయటికి వచ్చేం. అనుకున్న సమయానికి బస్సు వచ్చింది. కానీ ముందురోజు లాంటి ఎర్రబస్సే ఇది కూడా. అనుకున్న సమయానికి బస్సు వచ్చింది. కానీ ముందురోజు లాంటి ఎర్రబస్సే ఇది కూడా. అన్ని రిసార్టుల నించి ఎక్కించుకున్నా సగం బస్సు కూడా నిండలేదు. కొండ తరవాత కొండ ఎక్కి దిగుతూనే ఉన్నాం. అక్కడక్కడా ఆగుతూ అక్కడక్కడా […]

Continue Reading
Posted On :

Her Decision (Telugu Original story “NIRNAYAM” by Dr K. Meerabai)

Her Decision English Translation: Dr. K.Meera Bai Telugu original: “NIRNAYAM” by Dr K. Meerabai Ten year old Varuni saw her sister Vasavi getting down from the rickshaw and ran into the house announcing to her mother “ amma! Elder sister has come” and ran back. Krishnamma’ hands shivered as she was draining out the excess […]

Continue Reading
Posted On :

America through my eyes-Death Valley

America Through My Eyes- Death Valley Telugu Original : Dr K.Geeta  English Translation: Madhuri Palaji California state in America is very diversified. The weather is different in each corner. Snow towards the north, hot towards the south, seashore on the west. The unconquerable Sierra Nevada mountain range on the east. Not only that, the world […]

Continue Reading
Posted On :

Silicon Loya Sakshiga-5 (“Driving License” Story) (Telugu Original “Driving License” by Dr K.Geeta)

Driving – License -Telugu Original by Dr K.Geeta -English Translation by Madhuri Palaji When I talked about the driving license again, Surya got embarrassed. If you want to know why, you must know the story of Surya’s Driving License. Surya came to America two month before I came. He started trying to get the driving […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-8 స్వస్తి కథ

నా జీవన యానంలో- రెండవభాగం- 19 స్వస్తి – కథానేపధ్యం -కె.వరలక్ష్మి బాబ్రీ మసీదు సంఘటన తర్వాత కవుల కలాలు, గళాలు ఆవేశంతో వెల్లువెత్తాయి. కథకులూ విశేషంగా స్పందించారు. నేనూ ఓ కథ రాయాలనుకున్నాను ఎక్కడో జరిగిన సంఘటనకు, ఎవరి కళ్ళతోనో చూసినదానికి నేనెలా స్పందించాలో అర్థం కాలేదు. ఆ సంఘటనను వ్యతిరేకిస్తూ కొందరు, అనుకూలంగా కొందరు పేపర్లలో రాస్తున్నారు. రాజకీయ పార్టీలు చూద్దామా అంటే ఒక పార్టీ ‘అలా మసీదును కూలగొట్టడం తప్పు’ అంటే వెంటనే […]

Continue Reading
Posted On :

సర్వధారి- సంవేదనల కవితాఝరి (పుస్తక సమీక్ష)

సర్వధారి- సంవేదనల కవితాఝరి -వురిమళ్ల సునంద కవితా సంపుటి పేరు చూడగానే  ఇది సర్వధారి సంవత్సరానికి  సంబంధించి రాసిన కవితలు కావచ్చు అనే అపోహ కలగడం సహజం.. కవయిత్రి ఇందులో మనిషి జీవితంలోని ఆశలు,ఆశయాలు స్నేహం.స్వప్నాలు, భావోద్వేగాలు, ఉద్యోగం పండుగలు పబ్బాలు, సమాజంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఒకటేమిటి  మనిషి సకల  అనుభవాల ఆకృతి ఇందులో దాగుంది కాబట్టి .. సర్వం కలిగియున్నదనే అర్థంతో ‘సర్వధారి’ అని ఈ సంపుటికి నామకరణం చేశానని తన మాటలో చెప్పుకుంటారు.నిజమే […]

Continue Reading
Posted On :

వినిపించేకథలు-1 ప్రత్యామ్నాయం (కె.వరలక్ష్మికథ)

వినిపించేకథలు-1 ప్రత్యామ్నాయం (కె.వరలక్ష్మికథ) గళం: వెంపటి కామేశ్వర రావు https://www.youtube.com/watch?v=USQlJFnYQGY&feature=youtu.be వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. గతంలో దూరదర్శన్ లోనూ న్యూస్ రీడర్ గా […]

Continue Reading

సంతకం (కవిత్వ పరామర్శ)-7 ( గుర్రం జాషువా – స్వయంవరం )

సంతకం (కవిత్వ పరామర్శ)-7 గుర్రం జాషువా – స్వయంవరం -వినోదిని ***** https://youtu.be/PrgQaKeB0cA వినోదిని -వినోదిని స్త్రీవాద సాహిత్యం మీద ఎంఫిల్ , పీహెచ్డీ చేశారు. గత 12 సంవత్సరాలుగా యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పని చేస్తున్నారు.  అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సోషల్ డిస్క్రిమినేషన్ ప్రాజెక్ట్, మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. అంటరానితనం జోగిని వ్యవస్థ పై గ్రామీణ అభివృద్ధి శాఖ లో పని చేశారు స్వచ్ఛంద సంస్థలతో కలిసి […]

Continue Reading
Posted On :

కథాతమస్విని-7

కథాతమస్విని-7 మనిషికి కావాల్సింది రచన & గళం:తమస్విని **** https://www.youtube.com/watch?v=sQw3zKMnbWY&list=PL-mKR_VQSvIcrc1MBoxY_WrTgZTnXgyCe&index=1 తమస్విని -నా పేరు పద్మజ . తమస్విని అనే కలం పేరుతో కవితలు , కథలు రాస్తుంటాను. 2013 నించి కౌముది డాట్ నెట్ లో సంసారంలో సరిగమలు శీర్షికతో కథలు రాస్తున్నాను . మాది గుంటూరు జిల్లా లోని చింతలపూడి అనే గ్రామం . MA Political science చదివాను. హైద్రాబాద్ లో నివాసం. మా వారు ప్రముఖ రచయిత శ్రీ మల్లాది వెంకటకృష్ణ […]

Continue Reading
Posted On :

జోగినీ మంజమ్మ – ఆత్మ కథ

జోగినీ మంజమ్మ – ఆత్మ కథ     -పి.జ్యోతి కర్ణాటక జానపద అకాడేమీకి అధ్యక్షురాలిగా నియమించబడ్డ తొలి ట్రాన్స్జెండర్ మహిళ మంజెమ్మ ఆత్మకథ యొక్క తెలుగు అనువాదం ఇది. డా. చంద్రప్ప సోబటి దీన్ని కన్నడలో రాస్తే, రంగనాధ రామచంద్రరావు గారు దీని తెలుగులోకి అనువాదించారు. ట్రాన్స్జెండర్ల జీవితాన్ని సానుభూతితో అర్ధం చెసుకునే పరిస్థితులు ప్రస్తుత సమాజంలో రావడం మంచి పరిణామం. తమ ప్రమేయం లేకుండా తమ శరీరం తో మనసు కలవలేక, తాము మరొకరి […]

Continue Reading
Posted On :

అనగనగా- మాతృదీవెన (బాలల కథ)

మాతృదీవెన -ఆదూరి హైమావతి   నారాయణపురం అనేగ్రామంలో అనంతమ్మ తన ఏకైక కుమారుడైన నారాయణతో జీవిస్తుండేది.ఆమె భర్త ఎండుకట్టెలు అడవినుంచీతెచ్చి అమ్మి సంసారం గడిపేవాడు. ఒకరోజున కట్టెలకోసం అడవికివెళ్ళి గంధం చెట్టు ఎండుకట్టెలు కొడు తుండగా నాగుపాము కాటేసి అక్కడికక్కడే మరణించాడు.       అనంతమ్మ ఎంతో నిబ్బరంగా  తన గుడిసె చుట్టూతా కూర పాదులు పెంచుకుంటూ ,అవి అమ్ముకుని వచ్చిన సొమ్ముతో పొదుపుగా  ,కుదురుగా కుమారుని పోషించుకుంటూ జీవించేది.    నారాయణ కూడా తల్లి రాగన్నం పెట్టినా, జొన్నన్నం పెట్టినా, గంజి […]

Continue Reading
Posted On :

My Life Memoirs-7

My Life Memoirs-7 My Life, Full of Beautiful Memories -Venigalla Komala   Mr. Vijay Rajkumar and family Innaiah’s brother Vijaya Raj Kumar lived in Sangareddy for many years along with his wife Kanya Kumari and two sons- Devaraj Kumar and Rajendra Kumar. He cultivated his lands there and also ran a printing press. He was a […]

Continue Reading
Posted On :

Victory Behind Wings (Telugu Original Rekka Chaatu Gelupu by Dr K.Geeta)

Victory Behind Wings English Translation: Kalyani Neelarambham Telugu Original : Dr K.Geeta When I stand hanging in the mid-air with outstretched arms You are the tiny star that sprouted from deep inside my core Every step I walked holding you in my arms Every second I crossed Is wearing a mask of smiles Stifling the […]

Continue Reading
Posted On :

ఉరితాళ్ళే గతాయే (కవిత)

ఉరితాళ్ళే గతాయే -నల్లెల్ల రాజయ్య అహో ! నా పాలక వర్గమా మా కడుపులు నింపే అన్నదాతని అందలమెక్కించి అంగలారుస్తూ చొంగ కారుస్తవ్ ! దేశానికే ఎన్నెముకలు. నా రైతన్నలని అదేపనిగా అంటుంటవ్ ! కని మీ మనసు నిండా అన్నదాతల ఎన్నెముకల్లోని మూలుగను సైతం లేకుండా పీల్చుకతినే నయవంచక ఎవ్వారం నీది. నీ మాటల్లో మర్మముంటది చేతల్లో చెప్పలేనంత సత్తెన నాశన కార్యాలు జరిపిస్తుంటవ్ ! గిట్టుబాటు ధరలివ్వని గిదేం రాజ్యమనీ ఆగ్రహించిన అన్నదాత ఆక్రోషిస్తే […]

Continue Reading
Posted On :

To tell a tale-7 (Chapter-1 Part-6)

To tell a tale-7 -Chandra Latha Chapter-I (Part-6) After examining the different definitions of narratology, an attempt is made to list out the various narrative techniques with respect to the aspects such as narrator, theme, characters, plot, setting, time, the use of imagery, history, cultural, social, economic, narrative modes, narrative styles, narrative tones and so […]

Continue Reading
Posted On :

బహుళ-7 చీకటి ఒప్పు (అంగలూరి అంజనాదేవి కథ)

బహుళ-7 చీకటి ఒప్పు (అంగలూరి అంజనాదేవి కథ)  – జ్వలిత మోసపోయే అమాయకత్వం చుట్టబెట్టుకుని ఉన్నప్పుడు. మోసగించే వాళ్ళు కోకొల్లలుగా మన చుట్టూ ఉంటారు. ఒక మహిళ  కరోనా సమయంలో చిన్న విషయానికే భర్తమీద అలిగి, ఇద్దరు పిల్లలను తీసుకొని ఊరు నుండి హైదరాబాద్ కు వచ్చింది. ఆమెను మరో మహిళా ఆదుకొని పని చూపిస్తానని, నమ్మించి ముంబై తీసుకెళ్ళి ఒక వ్యక్తికి లక్ష రూపాయలకు అమ్మేసింది. ఆమెను కొన్న వాడికి ముగ్గురు భార్యలు ఉన్నా, ఈ […]

Continue Reading
Posted On :

కలసి ఉంటే కలదు సుఖము (బాల నెచ్చెలి-తాయిలం)

కలసి ఉంటే కలదు సుఖము -అనసూయ కన్నెగంటి వేసవి శెలవులకు వచ్చిన మనవడు సుశాంత్ ని  పొలం తీసుకెళ్ళాడు తాతయ్య. పొలంలో ధాన్యాన్ని రాశులుగా పోసి బస్తాలకు ఎత్తుతున్నారు పనివాళ్ళు. అక్కడికి  రివ్వుమని ఎగురుతూ గుంపులు గుంపులుగా  వచ్చి ధాన్యం రాశుల మీద వాలుతున్న  పిచ్చుకలను చూశాడు సుశాంత్. వాడికి చాల ఆనందం కలిగింది వాటన్నింటినీ ఒకచోట అలా గుంపుగా చూస్తే. “ తాతయ్యా ..అవి చూడు “ అంటూ తాతయ్య వేలు విడిచి పెట్టి అక్కడ […]

Continue Reading
Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-7

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-7 -వెనిగళ్ళ కోమల వివాహం, పిల్లలు, బాధ్యతలు అన్నయ్యకు చదువుతుండగానే పెండ్లయింది. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో డి్గ్రీ చదివారు. ముగ్గురు పిల్లల తండ్రయ్యారు. తార, నాగమణి, కృష్ణమోహన్ – వదిన ఎంపికే ముగ్గురి పేర్లు. పెంచే విధానం గూడా ఆమెకు తోచినట్లే. ఆ తరుణంలో మా అమ్మ నాకూ శ్యామలక్కకూ పెండ్లి విషయం నాన్న, అన్నయ్య శ్రద్ధ పట్టటం లేదని కొంత బెంగ పడింది. స్నేహితుల పెళ్ళిళ్ళ విషయంలో చూపే శ్రద్ధ మాపట్ల […]

Continue Reading
Posted On :

నారీ”మణులు”- యద్దనపూడి సులోచనారాణి

నారీ”మణులు” యద్దనపూడి సులోచనారాణి  -కిరణ్ ప్రభ ****** https://youtu.be/Ti0MSYjWBH0 కిరణ్ ప్రభతెలుగు సాహితీ లోకానికి కిరణ్ ప్రభ పేరు సుపరిచితమే. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. దాదాపు అయిదారువందల ఫోటో కవితలు రాసారు. వీరు కౌముది అంతర్జాల మాసపత్రిక సంస్థాపకులు & సంపాదకులు. రేడియోలలో ప్రసారమయ్యే వీరి టాక్ షోలు అత్యంత ప్రజాదరణను పొందుతూ ఉన్న తెలుగు పరిశోధనాత్మక ప్రసంగాలు.

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా-16)

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం- సైగ్లో – 20 గృహిణుల సంఘం జరగబోయే సంఘటనలపట్ల కొందరు వ్యాకులపడ్డారు. ఏం జరగబోతోందో తెలియని అమోయమంలో ఎన్నెన్ని ఘోరాలు జరిగాయని! కటావి సంఘటన వింటే గుండె చెరువవుతుంది. సెలవులు గనుక భర్త ఎటో ప్రయాణమయి వెళ్ళిపోయాడు. కాల్పులూ, ఘర్షణలూ – ఈ గందరగోళమంతా చూసి భార్య తన పిల్లల్ని మంచంకింద దాచింది. మా దగ్గర ఇది ఒక అలవాటు. కాల్పులు జరిగేటప్పుడు పిల్లల్ని […]

Continue Reading
Posted On :

కెథారసిస్ (కథ)

కెథారసిస్ –సునీత పొత్తూరి చటుక్కున కళ్లు విప్పి చూసింది సునంద. ఏదో కల. అది కలా అనే స్పృహ కలిగినా, కల మిగిల్చిన చిన్న అసౌకర్యం మస్తిష్కాన్ని అంటిపెట్టుకునే వుంది. సునంద వచ్చిన కల ఓ క్రమంలో గుర్తు తెచ్చుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తోంది.    పైగా కల కూడా అస్పష్టంగా, తెగిన సాలిగూడు లా.. అన్నీ   పొంతన లేని దృశ్యాలు! ఎవరో గొంతు నులిమేస్తున్నట్టు.. అరుద్దామంటే తన నోరు పెగలడం లేదు. అరుపూ బయటకు రావడం లేదు.  అదీ […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -18

జ్ఞాపకాల సందడి-18 -డి.కామేశ్వరి  ఈ రోజు కట్టుపొంగల్  నైవేద్యం  అమ్మవారికి. పాపం ఆతల్లికూడా   మూడురోజులుగా  రకరకాల నయివేద్యాలు ఆరగించి  కాస్తభారంగావుండి  ఒకటి రెండురోజులు  తేలికగావుండేవి  పడితేబాగుండుననుకుంటిందిగదా .ఆవిడ సంగతి ఏమో నాకు  తేలిగ్గా. తినాలనిపించి ఈజీగా  అయిపోయే  కట్టుపొంగల్చేశా,  అందరికి తెలిసిన వంటే,తెలియనివారికి … అరగ్లాసు బియ్యం ,అరగ్లాసు పెసరపప్పు ,కడిగి  అరగంట నానాక నీరు వార్చి పెట్టుకోండి .చిన్నకుక్కరులో  రెన్డుచెంచాలా నెయ్యివేసి   అరచెంచా జీలకర్ర ,,అరచెంచా కచ్చాపచ్చాగా చితకొట్టిన  మిరియాలు ,ఇంగువ. కరివేపాకు […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- డిసెంబర్, 2020

“నెచ్చెలి”మాట  2020 నేర్పిన పాఠం -డా|| కె.గీత  వచ్చినంత వేగంగానూ వెళ్లిపోయే వాటిల్లో మొట్టమొదటిది సంవత్సరం! కానీ వెళ్ళిపోతూ చేదు జ్ఞాపకాల్ని మాత్రమే మిగిల్చేవి కొన్ని మాత్రమే- అందులో  మొట్టమొదటిది 2020 వ సంవత్సరం! చేదు జ్ఞాపకాలు ఎవరో ఒకరిద్దరికి కాదండోయ్  భూమ్మీద అందరికీ సమానంగా పంచడంలోనూ  మొట్టమొదటిది 2020 వ సంవత్సరం! అందమైన సంఖ్య- ఆనందదాయకమైన రోజులు- ఎన్నో గొప్ప  కొత్త ఉత్సాహాలు-  అంటూ  ప్రారంభమైన  జనవరి 1, 2020 నాడు  ఎవరమైనా  కలనైనా ఊహించామా? […]

Continue Reading
Posted On :

వీక్షణం (కాలిఫోర్నియా)100వ సాహితీసమావేశం – ఆహ్వానం!

వీక్షణం-100వ సాహితీ సమావేశం సాహిత్యాభిలాషులందరికీ ఆహ్వానం! డిసెంబరు 12, 2020 ఉదయం 9 గం (PST) నుండి 6 గం (PST) వరకు  Youtube live link https://youtu.be/g-8kr-JBHcU Facebook Live link  https://www.facebook.com/vikshanam.vikshanam/posts/1806715576164201 Join Zoom Meeting  https://us02web.zoom.us/j/87662531582 -వీక్షణం  *****

Continue Reading
Posted On :

అనువాద రాగమంజరి – శాంతసుందరి (నివాళి)

అనువాద రాగమంజరి -వారణాసి నాగలక్ష్మి (నెచ్చెలి తొలిసంచిక నుండి ధారావాహికరచనలు చేస్తూ ఇటీవల స్వర్గస్తులైన శ్రీమతి శాంతసుందరి గారికి నెచ్చెలి కన్నీటి నివాళులతో ఈవ్యాసాన్ని అందజేస్తోంది-) శాంత గంభీరమైన ఆమె అంతరంగంలో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలు సహజీవనం చేస్తూంటాయి. అడుగు పెట్టగానే ఆ ఇంట్లోని సాహితీ పరిమళాలు మనని చుట్టేస్తాయి. సాహిత్యమే శ్వాసగా జీవించే శాంత సుందరి, రామవరపు సత్య గణేశ్వరరావు గార్ల అపురూప దాంపత్యం తెలుగు పొదరింటికి ఎన్నో గొప్ప ‘గ్రంథరాజా’లను తెచ్చిపెట్టింది, హిందీ సాహితీ […]

Continue Reading

మన’వరాలు’ (కవిత)

మన ‘వరాలు’ -ప్రసేన్ “పెంటకుప్పలో పసికందును వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు” “వైద్యుల నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువు మృతి. ఆసుపత్రిని ధ్వంసం చేసిన బంధువులు” వంటి  వార్తలు నాకు నిత్యకృత్యం. అయితే జర్నలిస్టుగా ఈ సందర్భాలలో నేను  గమనించిన  విషయం ఒకటుంది. పెంటకుప్పమీద దొరికిన పసికందు అన్ని సందర్భాలలోనూ ఆడపిల్లే.  ఆసుపత్రుల మీద దాడి జరిగిన ప్రతి సందర్భంలోనూ మరణించింది మగబిడ్డే. ఆడ శిశువు మరణిస్తే సంబంధిత బంధువులు ఏ గొడవా చేయకుండా నిశ్శబ్దంగా […]

Continue Reading
Posted On :

కథాకాహళి- ఆచంట శారదాదేవి కథలు

రాయలసీమ కరువు ప్రతిఫలనాల ప్రతిరూపం శశికళ కథలు                                                                 – కె.శ్రీదేవి ఆధునిక తెలుగుకథ వయసు ఒకటిన్నర శతాబ్దం పైనే అనుకుంటే, అందులో రాయలసీమ కథాచరిత్ర “ఋతుచర్య” ద్వారా మొదలైంది ఒక  శతాబ్దం క్రితం మాత్రమే. అదీగాక గత ఆరు దశాబ్దాలలో రాయలసీమ కథ వస్తు, రూప పరంగా మిగిలిన ప్రాంతీయ కథలకు ధీటుగా వెలువడుతూ వచ్చింది. 19౨0ల నుంచి ఇప్పటిదాకా రాయలసీమలో అనేక ప్రాంతాలలో విస్తరించివున్న రచయితలు ప్రథమంగా రాయలసీమ సాహిత్యాన్ని తద్వారా మొత్తం తెలుగు సాహిత్యాన్ని […]

Continue Reading
Posted On :

సంతకం (కవిత్వ పరామర్శ)-6 ( జీవన తాత్వికత చెప్పిన దేవిప్రియ కవిత్వం )

సంతకం (కవిత్వ పరామర్శ)-6 జీవన తాత్వికత చెప్పిన దేవిప్రియ కవిత్వం -వినోదిని ***** https://youtu.be/clPVKQnGvnw వినోదిని -వినోదిని స్త్రీవాద సాహిత్యం మీద ఎంఫిల్ , పీహెచ్డీ చేశారు. గత 12 సంవత్సరాలుగా యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పని చేస్తున్నారు.  అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సోషల్ డిస్క్రిమినేషన్ ప్రాజెక్ట్, మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. అంటరానితనం జోగిని వ్యవస్థ పై గ్రామీణ అభివృద్ధి శాఖ లో పని చేశారు స్వచ్ఛంద సంస్థలతో […]

Continue Reading
Posted On :

వసంతవల్లరి – నిరసన (కె.వరలక్ష్మికథ)

ఆడియో కథలు  నిరసన రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** https://youtu.be/EM5VSjzS4Ng అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను. పుట్టుకతో వచ్చిన గళానుకరణ. ఉద్యోగవిరమణ […]

Continue Reading

లైఫ్ టర్నింగ్ టైం (కథ)

లైఫ్ టర్నింగ్ టైం -కె.రూపరుక్మిణి అదో అందాల ప్రపంచం అందు తానో వెన్నెల దీపం ఆ తండ్రి కాపాడుకునే కంటిపాప ….తన కూతురి కోసం తన ఛాతిని పట్టుపరుపుగా మార్చుకునే అంత ప్రేమ తన పట్టుకొమ్మ కోరింది నెరవేర్చాలని ఆశ…. ఓ మధ్యతరగతి తండ్రిగా ఏ ఆవేదన తన కూతురిని అంటకుండా పెంచుకునే ఓ తండ్రి కి కూతురిగా గారాలపట్టి గా ఆఇంటి మహాలక్ష్మి గా పిలిచే వల్లి పేరుకు తగ్గట్టు గానే చక్కని రూపం చదువుల్లో […]

Continue Reading
Posted On :

చదువువిలువ (కథ)

చదువువిలువ -రమాదేవి బాలబోయిన రోజూ ఐదింటికే లేచి ఇల్లు వాకిలి ఊకి సానుపు జల్లి ముగ్గులేసే కోడలు ఇయ్యాల సూరీడు తూరుపు కొండ మీద నిలుచున్నా లేత్తలేదు…ఎందుకో…అని మనుసుల్నే అనుకుంటా కొడుకు పడకగదిలోకి తొంగిచూసింది నర్సమ్మ కొడుకు లేచి పళ్ళల్ల పలుగర్రేసినట్లున్నడు…బయట సప్పుడు ఇనాత్తాంది గనీ…కోడలీ ఉలుకూలేదు పలుకూ లేదు నిన్న రాత్రి ఏందో గడబిడైతే ఇనబడ్డది వాళ్ళరూముల…కాని…ఏమైందో ఏమోనని…నర్సమ్మ పాణం కల్లెపెల్లళ్ళాడుతాంది “శీనయ్యా…ఓ శీనయ్యా….ఏం జేత్తానవ్ బిడ్డా..” అని కొడుకును పిలిచుకుంట…బయట కొడుకున్న కాడికి నిమ్మళంగ […]

Continue Reading
Rajita Kondasani

జవాబు (కవిత)

జవాబు -రజిత కొండసాని ఓ ఉషోదయాన ఎందుకో సందేహం వచ్చి భయం భయంగా లోలోపల ముడుచుక్కూర్చున్న గుండెను తట్టి అడిగా! ప్రపంచాన్ని చూసే కన్నుల్లానో ప్రాణ వాయువుల్ని పీల్చే ముక్కులానో సప్త స్వరాల్ని దేహంలోకి ఒంపే చెవిలానో సప్త స్వరాల్ని దేహంలోకి ఒంపే చెవిలానో సిగ్గుతో ఎర్రబారే చెంపలానో సాటి వారి మీద ప్రేమ ప్రకటించే నోరులాగనో దేహం మీద బాహాటంగా కనిపించక ఎముకల గూడు మధ్య ఏ మూలనో చిమ్మ చీకట్లో దాక్కున్నావెందుకని ? నేనీ […]

Continue Reading
Posted On :

ఊటబాయి కన్నీరు (కవిత)

ఊటబాయి కన్నీరు -డా. కొండపల్లి నీహారిణి ఎందుకింత ఏకాంత నిశీధి గమనాలో ఎందుకింత విషాద పవనసమూహాలో ఎక్కడినుండో పొగబండి ఏడుపుకు వేళ్ళాడుతూ ఎందర్నో మోసుకొస్తున్నది. పరాయీకరణను , పరాభవాలను కూరుకొని ఎఱ్ఱటి పట్టాలపై ఇటుగా….. ఆర్తనాదాలతో,ఆధిపత్యాలతో…. కాలం చేసే గాయాల్లో ఋతువుల్ని ప్రాణాల చెంత జేర్చ, అనుమానాలు చెప్పే బాధల గాధల్ని అననుకూల భావాలకూర్చి, కళ్ళసామ్రాజ్య సింహభాగాన సింహాసనమెక్కి , అట్లా…… అవునూ, నీదీ నాదీ ఒక్కచూపుల పొద నీదీ నాదీ ఒక్కమాటల సొద కలలతీరాన కనరాని […]

Continue Reading

ఆమెప్పటికీ…..!? (కవిత)

ఆమెప్పటికీ…..!? -సుధామురళి అకస్మాత్తుగా ఓ రాత్రి భోరున వర్షం కురుస్తుంది నదులన్నీ కళ్ళ కరకట్టల మీద యుద్ధం ప్రకటిస్తాయి మమ్మల్ని ఆపేందుకు మీకేం హక్కు ఉందని ప్రశ్నిస్తూ చెక్కిళ్ళ నిండా సైన్యాలను చారలు చారులుగా నిలబెట్టేస్తాయి ఆ వర్షం ఆమెకు మాత్రమే సొంతం మనసుంది కదా తనకు చిన్నా పెద్దా మాటలతో గాయపరుచుకునేందుకు ఒకటో రెండో గదమాయింపుల గద్దెల్ని ఎక్కేందుకు పొలిమేర దాటని తనను ఊరుకాని ఊరుకు తరిమినా మిన్ను విరగనట్టు విర్రవీగేందుకు ఎన్ని కష్టాల్ని దాపెట్టిందో […]

Continue Reading
Posted On :

వరద (కవిత)

వరద -శ్రీధరరెడ్డి బిల్లా జనసంద్ర నగరం జలసంద్రమయ్యింది. పెట్రోలు కొట్టకుండానే కార్లు కొట్టుకు పోతుంటే , చెరువుల్లో తిరిగే బోట్లు కాలనీల మధ్య తిరుగుతూ ఇంటి సామాను, వంట సామాను  మోస్తున్నాయి! వీధి రోడ్డు మాయమై, భీకర వాగు అయ్యింది. “వీధి మలుపు” వాగుకొక వంక అయ్యింది! దారి చూపిస్తూ పంపించే ట్రాఫిక్ సిగ్నలు , దారి తెల్వకుండా ఎటువైపో తేలిపోతా ఉంది ! కాళ్ళతో  టిక్కుటిక్కున నడిచిన నిన్నటి రోడ్డు మీద కాళ్ళు నేలకు ఆనక, […]

Continue Reading

రాగో(నవల)-5

రాగో భాగం-5 – సాధన  పెద్ద బండను మీదికి దొబ్బినట్టె రాగోకు దిగ్గున తెలివైంది. బండలు దొర్లిస్తున్నారు. గడ్డపారలతో బలంగా తవ్వుతున్నారు. గొడ్డళ్ళతో నరుకుతున్నారు. ఒకరూ, ఇద్దరూ కాదు. ఊరికి ఊరే మీద పడ్డట్టుంది. లోగొంతులో గుసగుసలుగా మాట్లాడుతున్నారు. ఆ అల్లరీ, హడావిడి అంతా దగ్గర్లోనే వినబడుతూంది. లేచింది లేచినట్లే మద్ది చెట్టును పొదువుకుంది రాగో. ఎవరై ఉంటారు? ఏమిటి అల్లరి? ఏం చేస్తున్నారు? తననే వేటాడుతున్నారా? తాను ఎక్కువ దూరం పరుగెత్తలేదా? దార్లోనే మొద్దు నిద్ర […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-11

అనుసృజన నిర్మల (భాగం-11) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ [పెళ్ళి ఇంక రెండు రోజులుందనగా తోతారామ్ వచ్చాడు.వరుడి అన్న డాక్టర్ సిన్హా ,వదిన సుధ మగపెళ్ళివారితో వచ్చారు.డాక్టర్ తనకి తప్పిపోయిన వరుడని తెలిసినప్పట్నించీ నిర్మల అతని ఎదుటికి వెళ్ళేందుకు బిడియపడసాగింది. సుధ ఒంటరిగా దొరికినప్పుడు మాటల్లో కృష్ణకి తన మరిది సంబంధం కుదిర్చింది సుధేనని నిర్మలకి తెలుస్తుంది.కట్నం తీసుకోకూడదని మామగారిని ఒప్పించింది కూడా తనేనని తెలిసి నిర్మల ,”ఎంత టక్కరి దానివి? నాకు తెలీకుండా […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- “నాకలలే నా ఊపిరి !”

చిత్రలిపి “నాకలలే నా ఊపిరి !” -మన్నెం శారద రాత్రంతా  రేపటి వికాసంకోసం   ఒకానొక మొగ్గనై  …..కలలుకంటూ  యోగనిద్రలో తేలియాడుతూ  రేపటి వెలుగురేఖకై  నిరీక్షిస్తుంటానా …. ఎక్కడివో కొన్ని దుష్టక్రిములు నా రేకులపై వాలి  నా కలల్ని ఛిద్రం చేస్తుంటాయి    చిరుగాలితో సయ్యాటలాడుతూ  నునులేత కిరణ  స్పర్శతో  పులకించి పులకించి  తరియించి తరియించి  రంగుల హంగుతో   రాసక్రీడలో ఉండగా  అండగా ఉండవలసిన  నాకొమ్మ ముళ్ళే ననుగీరి  గాయపరుస్తున్నాయి    ఒకానొక భావుకతని  మనసు ఆపుకోలేక  గుండె […]

Continue Reading
Posted On :

వసంత కాలమ్-9 చేబదుళ్ళు..

చేబదుళ్ళు.. -వసంతలక్ష్మి అయ్యగారి మీలోఎంతమందికి ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే మీరిచ్చిన ”చేబ దు ళ్ళ” సంగతులు గుర్తొస్తాయి..ఇచ్చికాల్చుకోని చేతులుండవనే నమ్మకం…!!అసలంటూ ..ఇచ్చేబుద్ధి,కాస్త ంత మొహమాటం మీకున్నాయో….మీరుఔటే..దొరికిపోయారే..పైగా వయసు ముదురుతుంటే..ఈ గుణం కూడాపరిఢవిల్లుతందే తప్ప తోకముడవదు..తగ్గిచావదూ..! అందరికొంపలలోనూ అనాదిగా అయ్యల అపాత్రదానాలూ…అమ్మలుఅశక్తితో అరచిఅలసిపోవడాలు..దీన్ని ఆసరాగా అలుసుగా చేసేసుకునిఆహా మేమే కదా పేద్దదానకర్ణులదాదీలమన్నట్టూ,బలిగారిబాబులమన్నట్టూ..మాచేతికికఎముకలేదనుకుంటూ.. ఫీలవడమేకాక ఎముకలేని నాలుకను తెగ ఆడిస్తూ..ఆడవారినిఅదేపనిగా   ఈసడిస్తూ..పీనాసి తనంతో పాటూ…మహానసశ్రీలని,మాయదారి గొణుగుడుబతుకులనీ దెప్పిపొడుస్తూ మగవారంతాఏకమైపోతారు..పనికిమాలిన సంతపనులు చేసేసి…మనపైచిందులుతొక్కి చెడుగుడాడేసుకోడం మనందరి ఇళ్ళల్లో ఆనవాయితీగామారింది.ఐతే..ఇదంతా ఓ […]

Continue Reading
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -9 మనసుని ఉప్పొంగించే రాగం- కానడ

ఒక భార్గవి – కొన్ని రాగాలు -9 మనసుని ఉప్పొంగించే రాగం—కానడ -భార్గవి మనసొక మహా సముద్రం అనుకుంటే ,అందులో ఉప్పొంగే భావాలే అలలు.అలా భావాలని ఉప్పొంగించే రాగం కానడ మునిమాపు వేళ సన్నగా వీచేగాలికి ఆలయ ధ్వజస్తంభానికున్న చిరుగంటలు మోగినట్టూ- కార్తీకమాసంలో ఓ రాత్రివేళ చిరుచలిలో తులసికోటలో నిశ్చలంగా వెలిగే నూనెదీపం లాగానూ మరిగిన పాల మీద కట్టిన చిక్కటి మీగడని చిలకితే వచ్చిన వెన్న నోట్లో కరిగిపోయినట్టూ అనిపిస్తుంది ఈ రాగం ఆలపించినప్పుడు వింటే […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-15

కనక నారాయణీయం -15 –పుట్టపర్తి నాగపద్మిని ‘భలేవాడివయ్యా!! ఇంత పనిచేసినా, ఒక్కమాటైనా చెప్పనేలేదే నాకు?? ఐనా నాకు తెలుసు, యాడో ..పొరపాటు జరిగినాదని!! ఎట్టా దెలుసుకోవాలో దెలీక ఊరుకుణ్ణ్యా!! నీ బ్రమ్మాస్త్రానికి జవాబుగూడా బ్రమ్మాండంగానే వచ్చినాది గందా!! ఒరే కొండయ్యా!! సారుకు వేడి వేడి కాఫీ దీసుకురా పో!! ఐనా ఆచార్లూ?? ఈడ గూర్చో!! ఇంతకూ ఏం రాసినావు ఆ యూనివర్సిటీ వాల్లకు??’ పుట్టపర్తి అన్నారు,’విద్వాన్ పరీక్ష పాసవటం, అవకపోవటం – గురించి కాదు సుబ్బయ్య గారూ, […]

Continue Reading

చిత్రం-18

చిత్రం-18 -గణేశ్వరరావు  కొందరు గొప్ప వారు తమ జీవితకాలం లో కీర్తి ప్రతిష్ట లను అనుభవించ కుండానే పోతుంటారు, విన్సెoట్ వాన్గొ తను గీసిన ఒకే ఒక బొమ్మని అమ్ముకో గలిగేడు. మరి కొందరి విషయం లో అదృష్టం ఎప్పుడూ వారి వెంటే ఉంటుంది, ఫ్రాన్స్ చిత్రకారిణి ఎలిజబెత్ వీజీ ల బ్ర న్ గీసిన 900 చిత్రాలన్నీ ఆమ్ముడయాయి – అదీ ఆమె జీవించిన 18వ శతాబ్దంలో. ఆ రోజుల్లో స్త్రీలకి విద్యా సంస్థ లలో […]

Continue Reading
Posted On :

షర్మిలాం“తరంగం”-18

షర్మిలాం “తరంగం” మానవా జయోస్తు !!! -షర్మిల కోనేరు  ఒక ఉపద్రవం మానవాళిని చుట్టుముట్టినప్పుడు మనో నిబ్బరంతోముందుకు సాగడం ముఖ్యం. ప్రాణాల్ని , ఆరోగ్యాన్నే కాదు మానవ సంబంధాలనీ కాపాడుకోవాల్సినతరుణం ఇది. కుటుంబ వ్యవస్థ మీద ఈ కూడా కోవిడ్ దాడి మొదలైంది. కంటికి కనిపించనంత చిన్నగా మొదలైన ఈ ఫ్రస్ట్రేషన్ కొండంతగామారక ముందే వేక్సిన్ వస్తే బాగుండును! మొదట కరోనా వైరస్ నియంత్రణకి లాక్డౌన్ పెట్టినప్పడు రోజుకో రకంవంటలు చేసుకుని తిని అందరూ ఒక్కచోట వున్నామన్న ఆనందంతోగడిపారు. అంతా కొద్ది నెలల్లో సర్దుకుంటుందన్న ధీమాతో కాలంగడిపారు. కానీ ఏడాదైనా అదే పరిస్థితి. ముఖ్యంగా స్కూలుకి వెళ్ళే వయసు పిల్లల మానసిక స్థితి దీనంగావుంది. ఇండియాలో పెద్ద క్లాసుల పిల్లలు  కొంతమేర బడికి వెళ్తున్నా మిగతాఅందరూ ఇళ్ళలోనే …. కొండల మీద నుంచి దూకే జలపాతాల్ని  పిల్ల కాలువలోబంధించగలమా ? పైకి చెప్పుకోలేని శిలువల్ని బాల ఏసుల్లా మోస్తున్నారు. స్కూళ్ళు లేవు, తోటి పిల్లలు. స్నేహితులు లేరు. ఆన్ లైన్ పాఠాలు విజ్ఞానాన్ని ఇస్తాయేమో గానీ ఆ పసి మనసులకివేసిన సంకెళ్ళని ఏ ఆన్ లైన్ పగలగొట్టలేదు. ఇంకోపక్క ఇంట్లో తల్లితండ్రుల నిస్సహాయత అసహనంగా మారుతోంది. రోజూ బడికి వెళ్ళే పిల్లలు ఇంట్లో 24 గంటలూ వుంటే వాళ్ళ అల్లరినిభరించలేని తల్లుల మానసిక స్థితి మారుతోంది. పనివత్తిడి వాళ్ళని యంత్రాలుగా మారుస్తోంది. ఒక పక్క సోషల్ గేదరింగ్స్ లేవు , పార్టీలు లేవు , షాపింగ్లు లేవు. ఎంతసేపూ ఇల్లే ఇల్లు. స్వర్గంగా కనపడాల్సిన  ఇల్లు చాలా మంది గృహిణులకి నరకంగాకనిపిస్తోంది. ఇక ఇళ్ళ నుంచి పనిచేసే మహిళల పాట్లు చెప్పలేము. ఇటు ఇంటిలోనే ఎక్కువ సమయం గడపడం వల్ల భార్యా భర్తలసఖ్యతపైన కూడా ప్రభావం చూపిస్తోంది. ఇన్నాళ్ళూ ఆఫీసుకి వెళ్ళి అక్కడ సహోద్యోగులతో కలిసి పని చేసి ఇంటికివచ్చి కుటుంబంతో గడపడం అలవాటైంది. ఇప్పుడు పరిస్థితి అది కాదు . ఏదో నిరాశాపూరిత వాతావరణం అలముకుంటోంది. ఇది పిల్లల్లోనూ పెద్దలోనూ కనిపిస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మార్గాలు అన్వేషించాలి. ఈ కష్టం మన ఒక్కరికే కాదు ప్రపంచానిది. కరోనా వైరస్సే కాదు దీని తాతల్లాంటి మశూచి , ప్లేగు లాంటి వ్యాధులుఒకప్పుడు ప్రపంచాన్ని గజగజ లాడించాయి . అంతిమంగా మనిషి గెలిచాడు. మనం ఇప్పుడూ గెలుస్తాం . గెలిచే క్రమంలో ఏం  కోల్పోకూడదో దేన్ని వదిలిపెట్టాలో దేన్ని ఒడిసిపట్టాలో తెలుసుకుని ముందుకు సాగుదాం ! బిడ్డల్ని ఈ క్లిష్ట పరిస్థితుల్లో సంయమనంతో పెంచుకుందాం. మనిషి తలుచుకుంటే ఎన్నో అసాధ్యాలే సుసాధ్యం అయ్యాయి… ఈ విపత్తూ అంతే ! మళ్ళీ స్కూళ్ళు తెరుచుకుంటాయ్ ! స్వేచ్చగా ఎగిరే పిట్టల్లా పిల్లలు విహరిస్తారు. మళ్ళీ అంతా మామూలు అవుతుంది. కోవిడ్ ను జయించిన మనిషి చరిత్రని భావితరాలు చెప్పుకుంటాయ్ !!! ***** షర్మిల కోనేరుషర్మిల 20 ఏళ్లు డెస్క్ జర్నలిస్ట్ ఉద్యోగం చేసి విరామం తీసుకున్నారు. అలవాటైన […]

Continue Reading
Posted On :

రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-6

రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-6 -సి.రమణ  బౌద్ధ మూల గ్రంధాలు త్రిపిటకములు:  పిటకం అంటే బుట్ట, గంప అని అర్థం. తథాగతుడు మహా నిర్వాణం చెందిన మూడు నెలల తర్వాత, ఆయన ప్రధాన శిష్యులు, భిక్షువులు కలసి బుద్ధుని బోధనలు, సందేశాలు, ధర్మోపదేశాలు అన్నిటినీ మూడు సంకలనాలుగా  విభజించారు.  వీటిని మౌఖిక  పఠనం  ద్వారా, శుద్ధ రూపంలో శిష్యపరంపర కాపాడగలిగారు. అపారమైన సూక్తులు,  ధర్మాలు,  బోధనలు సహేతుకంగా విభజించాలంటే విశేషమైన మేధస్సు కల వారై ఉండాలి. ఆ రోజుల్లో […]

Continue Reading
Posted On :
Padmaja Kundurti

విముక్త (కథ)

విముక్త -పద్మజ కుందుర్తి ఆఫీసులో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది అనుపమకు ఈరోజు. అసలే కొత్తరాష్ట్రం కొత్త గవర్నమెంటూ కూడా కావటం తో రక రకాల పథకాలూ, లబ్ధిదారుల ఎంపికా, ఆతాలుకు ఫైళ్ళన్నీ ఒక్కరోజు నిర్లక్ష్యం చేసినా పేరుకుపోతున్నాయి. అసలే తరలివచ్చిన ఆఫీసు, హైదరాబాదు నించి వచ్చాక ఒక్కతే ఉంటుంది కనుక వీలైన, అన్నివసతులూఉన్న అపార్ట్మెంటు వెతుక్కోవడమే పెద్ద తలనెప్పిగా తయారైంది. మరీ దూరంగా పట్నంలో మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉన్న అపార్ట్మెంట్లు దొరుకుతున్నా, కాస్త […]

Continue Reading
Posted On :

Haunting Voices: Stories heard and Unheard -6 (Abburi Chayadevi)

Haunting Voices: Heard and Unheard Abburi Chayadevi -Syamala Kallury Happy Ending Abburi Chaya Devi: Happy Ending, Sukhantam; Published in Katha Bharati, National Book Trust (1972) Translated into English by Syamala Kallury in her collection Telugu Short Stories; Women’s Voices; An Inner Voyage (1930-2000) in 2001. “Hi, grandma, can I come in?” “Of course, you can. […]

Continue Reading
Posted On :

ఆపత్కాల ప్రకంపనల రికార్డే “అవలోకనం” (పుస్తక సమీక్ష)

ఆపత్కాల ప్రకంపనల రికార్డే ” అవలోకనం” -నాంపల్లి సుజాత కనీ వినీ ఎరుగని ఓ చిన్న వైరస్ యావత్ ప్రపంచాన్నీ గడగడ లాడిస్తోంది..కరోనా వైరస్ కోవిడ్-19 చైనా లోని ఊహాన్ లో పుట్టి ఇతరప్రాంతాలకు సంక్రమిస్తున్నదనీ…లేదా బయోవార్ లో భాగంగా శత్రుదేశాలు పన్నిన కపట అస్త్రమో..మరి ప్రయోగాల పేరిట వికటించిన తప్పిదమో..పర్యావరణ సమతుల్యత లోపించిన కారణమో..ఏదియేమైనా విశ్వవ్యాప్తంగా విధ్వంసాన్ని నెలకొల్పుతోంది..కనబడని ఓ భయంకర యుద్ధం కళ్ళముందు జరుగుతూనే ఉంది.. కనబడని శత్రువు యే దిక్కునుంచి దాడి చేస్తాడో..ఎంత […]

Continue Reading
Posted On :

లక్ష్మణశాస్త్రీయం – చుట్టుకునే బంధాలు (వారణాసి నాగలక్ష్మి కథ)

https://youtu.be/zE4jCJoa1k4 లక్ష్మణశాస్త్రీయం  చుట్టుకునే బంధాలు (కథ) రచన: వారణాసి నాగలక్ష్మి గళం: లక్ష్మణశాస్త్రి “పిన్నీ! వాట్ హాపెంటు అమ్మా?” అవతల్నించి ప్రశ్న. కత్తిదూసినట్టు.  గగనకి చాలా కోపం వచ్చినపుడు తన కంఠధ్వని కత్తితో కోస్తున్నట్టుంటుంది. మాట వేడిచువ్వతో వాత పెట్టినట్టుంటుంది.  పొద్దున్నే ఫోన్ చేసి పలకరింపుగా అన్నమొదటి వాక్యమే అది. ఎందుకో దానికి అక్క మీద చాలా కోపంగా, చిరాకుగా ఉందని అర్ధమైంది. గడియారం వైపు చూశా. నా యోగా క్లాసుకి టైమైపోతోంది.  “గగనా! ఏమిటైందో చెప్పకుండా […]

Continue Reading

గోర్ బంజారా కథలు-3 ఆదివాసి గిరిజన దినోత్సవం

గోర్ బంజారా కథలు-3 ఆదివాసి గిరిజన దినోత్సవం -రమేశ్ కార్తీక్ నాయక్ 1. యూనివర్సిటీ ప్రాంగణ మైదానమంత పూల చెట్లతో నిండుగా ఉంది. మైదానానికి చుట్టూ అర్థ చంద్రాకారంలో చెట్లు ఉన్నాయి. కానీ ఆ చెట్లు ఏవికుడా ఎక్కువగా అడవుల్లో ఉండవు.రెండు రెండు చెట్లకు మద్య వేరే చెట్లు ఉన్నాయి.కొన్ని పూలతో, కొన్ని కాయలతో కొన్ని వివిధ రంగుల జెండాలు, బానార్లతో నిండి ఉన్నాయి. దాదాపుగా అక్కడ ఉన్న చెట్ల పై మొలలు కొట్టి ఉన్నాయి.కొన్ని మొలలు […]

Continue Reading

A Midst the wild crowd (Telugu original story “Gudem cheppina kathalu-1” by Anuradha Nadella)

Amidst the Violent Crowd English Translation: Srinivas Banda Telugu original: “Gudem cheppina kathalu-1” by Anuradha Nadella I was heading home after teaching the evening class in the hamlet. Streetlights were lit, making the night darker, except for the feeble light from the huts flanking the street spilt on to it. My torch was helping me […]

Continue Reading
Posted On :

పారని ఎత్తు (బాల నెచ్చెలి-తాయిలం)

     పారని ఎత్తు -అనసూయ కన్నెగంటి ఒకానొక అడవిలో ఉదయాన్నే తల్లి జింక పిల్ల జింకా గడ్డి మేయసాగాయి.  అలా గడ్డి తింటూ తింటూ పిల్ల జింక తల్లికి దూరంగా వెళ్ళిపోయింది.  అది గమనించిన తల్లి గడ్డి తింటూనే మధ్య మధ్యలో  దుష్ట జంతువులు ఏమన్నా వస్తున్నాయేమోనని తలెత్తి చుట్టూ ఒకసారి చూసి ఏమీ లేవు అనుకున్నాకా గడ్డి తినటం చేయసాగింది.    అలా చూడగా చూడగా  కొంతసేపటికి దూరంగా వస్తూ ఒక నక్క తల్లి జింక కంటపడింది.     దానికి […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-18 (అలాస్కా-6)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-6 ఏంకరేజ్ నుండి ఆ ఉదయం బయలుదేరి గ్లాస్ డూమ్ ట్రైనులో అత్యంత హాయిగా ప్రయాణించి దెనాలి నేషనల్ పార్కు స్టేషనుకి మధ్యాహ్నం 3 గం.ల ప్రాంతంలో చేరుకున్నాం. దెనాలి నేషనల్ పార్కు చూడకుండా అలాస్కాని చూసినట్టే కాదని ఎన్నో చోట్ల చదివేను. మొత్తానికి ఈ రోజు ఆ పార్కులో బస చెయ్యబోతున్నామన్న విషయం భలే ఆనందాన్నిచ్చింది. పట్టాల్ని అనుకుని ఉన్న పార్కింగు లాటులో మా విడిదికి మమ్మల్ని […]

Continue Reading
Posted On :

Uttara Kanda (by Bhairappa)

Bhyrappa’s latest book translated into English – UTTARA KAANDA – P.Jyothi UTTARA KAANDA is a novel by S.L. Bhyrappa. Originally written in Kannada this is translated into English by Rashmi Terdal. Bhyrappa is a popular name in the South India and we all are acquainted with his sensible writing style and logical representation of the […]

Continue Reading
Posted On :

Silicon Loya Sakshiga-4 (College Story) (Telugu Original “College Story” by Dr K.Geeta)

College Story -Telugu Original by Dr K.Geeta -English Translation by Madhuri Palaji “‘Como estas?’ means ‘How are you?’ in Spanish,” said Maria. She was standing in the verandah talking to her mom when she saw me coming from the shop. She came to me and hugged me affectionately. Maria is Alicia’s eldest daughter. She works […]

Continue Reading
Posted On :

My Life Memoirs-6

My Life Memoirs-6 My Life, Full of Beautiful Memories -Venigalla Komala My Marriage with  Innaiah Narisetti on 31st May, 1964 Justice Sambasiva Rao  played an important role in fixing our marriage. He knew Innaiah closely as an active worker in the Humanist and Rationalist movement and in keeping with that, Innaiah refused to accept dowry […]

Continue Reading
Posted On :

A Poem A Month -8 Death Sentence (Telugu Original by Viswanatha Satyanarayana)

Death Sentence   -English Translation: Nauduri Murthy -Telugu Original: Viswanatha Satyanarayana    Viswanatha Satyanarayana , Telugu Indian Poet (10 September 1895 – 18 October 1976) “You have sentenced me to death; and now ask me to say whatever I want to say. There would be some meaning if you had asked me before passing the […]

Continue Reading
Posted On :

Cineflections:16 Charulata (Bengali,1964)

Cineflections-16 Charulata – Bengali,1964 -Manjula Jonnalagadda Soumitra Chatterjee collaborated with Satyajit Ray on 14 films. They were like Marcello Mastroianni and Federico Fellini, Toshiro Mifune and Akira Kurosawa, and Tony Leung and Wong Kar-Wai. Charulatha is a film directed by Satyajit Ray based on a novella called Nastanirh (Broken Nest) by Rabindranath Tagore. It premiered […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-7 ఏ గూటి సిలక – కథానేపధ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 18 ఏ గూటి సిలక – కథానేపధ్యం -కె.వరలక్ష్మి సరిగా గమనించగలిగితే జీవితాల్లోని కదిలించే సంఘటనలన్నీ కథలే. మా అత్తగారికి కొడుకు తర్వాత ఐదుగురు కూతుళ్ళు, అంటే నాకు అయిదుగురు ఆడపడచులు. అందులో పెద్దమ్మాయి భర్త ఇంజనీరు కావడంతో ఆమె జీవితం ఆర్థికంగా బావుండేది. మిగతా నలుగురివీ అంతంతమాత్రపు ఆర్థిక స్థితులు. దాంతో ఆవిడ చాలా అతిశయంతో డామినేటింగ్ పెర్సన్ గా వుండేది. కాని, ఆమెకు పిల్లలు కలగలేదు. అప్పటికి మెడికల్ […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-17

  నారిసారించిన నవల-16 తెన్నేటి హేమలత -కాత్యాయనీ విద్మహే  ‘లత’ గా తెలుగు నవలా సాహిత్యచరిత్రలో ప్రసిద్ధురాలైన   తెన్నేటి హేమలత వందకు పైగా నవలలు వ్రాసింది.  విజయవాడలో నిభానపూడి విశాలాక్షీ నారాయణరావు దంపతులకు 1935 లో పుట్టింది లత. ఆమె పూర్తిపేరు జానకీరామ కృష్ణవేణి హేమలత. అయిదవతరగతితో బడిచదువు ఆగి పోయింది. ఇంటిదగ్గరే సంస్కృతం, తెలుగు ఇంగ్లీష్ సాహిత్యాలు చదువుకున్నది. తెలుగు సాహి త్యంలో లబ్ధ ప్రతిష్టులైన వారు ఎందరో ఇంటికి వచ్చిపోతుండే వాతావరణంలో తండ్రితో […]

Continue Reading

అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం (2000-2020)- పరిశోధన పత్రాలకు ఆహ్వానం!

అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం వెబినార్(2000-2020) -ఎడిటర్ తెలుగు అధ్యయన శాఖ బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు &నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక, కాలిఫోర్నియా, యూ.ఎస్.ఏసంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాల అంతర్జాతీయ వెబినార్అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం (2000-2020)2021 జనవరి 19, 20 & 21 తేదీలలో ఈ సదస్సులో పాల్గొనేవారు ఈ క్రింది అంశాలలో మీకు నచ్చిన  ఏ అంశాన్నైనా ఎన్నుకొని పరిశోధన పత్రాన్ని సమర్పించవచ్చు. అంశాలు: తెలుగు కవిత్వం – వస్తు, రూప పరిణామం (2000-2020) 1.1  పద్య కవిత్వం 1.2  వచన కవిత్వం 1.3  మినీ కవిత్వం, హైకూలు, రెక్కలు 1.4  దీర్ఘ కవిత్వం తెలుగు కథ – వస్తు, రూప పరిణామం (2000-2020) 2.1  రాయలసీమ కథా సాహిత్యం 2.2  తెలంగాణ కథా సాహిత్యం 2.3  ఉత్తరాంధ్ర కథా సాహిత్యం తెలుగు నవల – వస్తు, రూప పరిణామం (2000-2020) 3.1  రాయలసీమ నవలా సాహిత్యం 3.2  తెలంగాణ నవలా సాహిత్యం 3.3  ఉత్తరాంధ్ర నవలా సాహిత్యం అస్తిత్వవాద సాహిత్యం – వస్తు, రూప పరిణామం (2000-2020) 4.1  రాయలసీమ అస్తిత్వవాద సాహిత్యం 4.2  తెలంగాణ అస్తిత్వవాద సాహిత్యం 4.3  ఉత్తరాంధ్ర అస్తిత్వవాద సాహిత్యం జానపద/గిరిజన సాహిత్యం – వస్తు,రూప పరిణామం(2000-2020) 5.1    జానపద/గిరిజన కథా సాహిత్యం 5.2    జానపద /గిరిజన గేయ సాహిత్యం ప్రపంచీకరణ తెలుగు సాహిత్యం–వస్తు, రూప పరిణామం       (2000-2020) 6.1    ప్రపంచీకరణ కథా సాహిత్యం 6.2    ప్రపంచీకరణ నవలా సాహిత్యం 6.3    ప్రపంచీకరణ కవిత్వం డయాస్పోరా తెలుగు సాహిత్యం–వస్తు, రూప పరిణామం (2000-2020) 7.1    ప్రవాసాంధ్రుల కవిత్వం 7.2    ప్రవాసాంధ్రుల కథా సాహిత్యం అంతర్జాల తెలుగు పత్రికాసాహిత్యం–వస్తు, రూప పరిణామం (2000-2020) 8.1    అంతర్జాల స్త్రీవాద పత్రికలు – నెచ్చెలి, విహంగ మొ.వి. 8.2    అంతర్జాల పత్రికలు–కౌముది, సారంగ, ప్రతిలిపి, కొలిమి, గోదావరి, […]

Continue Reading
Posted On :