image_print

భారతదేశం నా జైలు జీవితం- మేరీ టైలర్

 భారతదేశ జైలు లో ఒక విదేశీ మహిళ పోరాటం – మేరీ టైలర్ అనుభవాలు -పి.జ్యోతి నేను ఎనిమదవ తరగతిలో ఉన్నప్పుడనుకుంటా “భారతదేశంలో నా జైలు జీవితం” అనే ఈ పుస్తకాన్ని మొదట చదివాను, అప్పుడు ఏం అర్ధమయ్యిందో కాని భారతదేశ జైలులో కొన్ని సంవత్సరాలు ఉన్న బ్రిటీషు మహిళ గా మేరీ టైలర్ గుర్తు ఉండిపోయింది. ఈ పుస్తకం మళ్ళీ రీప్రీంట్ అయ్యింది అని తెలుసుకుని ఇది మళ్ళీ చదవాలని కొన్నాను. ఒక విదేశీ మహిళ మరో […]

Continue Reading
Posted On :

రైలుబడి (పుస్తక సమీక్ష)

 రైలుబడి -అనురాధ నాదెళ్ల రచన: టెట్సుకో కురొయనాగి అనువాదం: ఈశ్వరి, ఎన్. వేణుగోపాల్ మనం మట్లాడుకోబోతున్న పుస్తకం చదువుతున్నంతసేపూ మన పెదవులమీద చిరునవ్వు చెరగనివ్వదు. చదువుతున్న అందరినీ బడికెళ్లే పిల్లలుగా మార్చేస్తుంది. మనల్ని మంత్రించి, బాల్యపు లోకాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పటికే ఊహించేసి ఉంటారు కదా, అవును అది “రైలుబడి”. చదివిన ప్రతివారూ ఆ బడిలో తాము కూడా చదువుకుంటే ఎంత బావుణ్ణు అని అనుకోకమానరు. 1933లో జన్మించిన టెట్సుకో కురొయనాగి ఈ “రైలుబడి” పుస్తకం రచయిత్రి, జపాన్ […]

Continue Reading
Posted On :

కథాతమస్విని-4

కథాతమస్విని-4 అంకురం రచన & గళం:తమస్విని ***** https://www.youtube.com/watch?v=KweSP2La4nM&feature=youtu.be తమస్విని -నా పేరు పద్మజ . తమస్విని అనే కలం పేరుతో కవితలు , కథలు రాస్తుంటాను. 2013 నించి కౌముది డాట్ నెట్ లో సంసారంలో సరిగమలు శీర్షికతో కథలు రాస్తున్నాను . మాది గుంటూరు జిల్లా లోని చింతలపూడి అనే గ్రామం . MA Political science చదివాను. హైద్రాబాద్ లో నివాసం. మా వారు ప్రముఖ రచయిత శ్రీ మల్లాది వెంకటకృష్ణ మూర్తి.  […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి-6 (ఆడియో) వాకాటక మహాదేవి (బి. ఎన్. శాస్త్రి నవల-2)

ఏనుగు నరసింహారెడ్డిడిప్యూటీ కలెక్టర్, ప్రముఖ కవియైన డా. ఏనుగు నరసింహారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి. సాహిత్యానికి సంబంధించి అన్ని సాహిత్య ప్రక్రియలను అర్థవంతంగా సృజించిన కవి, రచయిత ఏనుగు నరసింహారెడ్డి. కవిత్వంతో మొదలై పద్యం, నాటకం, వ్యాసం, నవల, ఇలా ప్రతీ సాహిత్య ప్రక్రియతో ఆయన కరచాలనం కొనసాగింది.

Continue Reading

ఖాళీ సంచులు (కె.వరలక్ష్మి కథ)

వసంతవల్లరి ఖాళీ సంచులు (కథ) రచన: కె.వరలక్ష్మి ***** https://youtu.be/5UjzTYiT08M అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను. పుట్టుకతో వచ్చిన గళానుకరణ. ఉద్యోగవిరమణ స్వచ్ఛందంగా 2010 […]

Continue Reading

వెనుతిరగని వెన్నెల(భాగం-16)

వెనుతిరగని వెన్నెల(భాగం-16) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://www.youtube.com/watch?v=8k4MRJo5XdM వెనుతిరగని వెన్నెల(భాగం-16) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు […]

Continue Reading
Posted On :

నారీ”మణులు”- టంగుటూరి సూర్యకుమారి- 4

నారీ”మణులు” టంగుటూరి సూర్యకుమారి-  4 -కిరణ్ ప్రభ టంగుటూరి సూర్యకుమారి (నవంబర్ 13, 1925 – ఏప్రిల్ 25, 2005) అలనాటి తెలుగు సినిమా నటి, ప్రసిద్ధ గాయకురాలు. ఈమె నవంబర్ 13,1925లో రాజమండ్రిలో జన్మించారు. ఈమె ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుగారి తమ్ముడు టంగుటూరి శ్రీరాములు గారి సుపుత్రిక. 1937లో సినీరంగ ప్రవేశం  చేసారు. సూర్యకుమారి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ నాలుగు భాషల్లోనూ మొత్తం ఇరవై ఆరు సినిమాల్లో నటించారు. […]

Continue Reading
Posted On :

ఉత్తరాలు-ఉపన్యాసాలు-8 (మోహన్ దాస్ కరంచంద్ గాంధి & షేక్స్పియర్)

ఉత్తరం-8 నీ చర్యలు రాక్షసంగా వున్నాయి రచయిత: మోహన్ దాస్ కరంచంద్ గాంధీ స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి నేపథ్యం: గాంధీ ….. హిట్లర్ కు రాసిన ఉత్తరంలో ఇది రెండవది. ఆయన రాసిన ఈ రెండు ఉత్తరాలు హిట్లర్ కు చేరకుండా బ్రిటిష్ వారు అడ్డుపడ్డారు. నాయకుడుగా ఎదుగుతున్న దశలో హిట్లర్ కు ఆదర్శం ….. అప్పటి ఇటలి ప్రధానమంత్రి, ముస్సోలిని! ముస్సోలిని ఫాసిస్ట్ చర్యలు హిట్లర్ కు ఎంతగానో నచ్చాయి! హిట్లర్, ముస్సోలిని […]

Continue Reading

రాగో(నవల)-3

రాగో భాగం-3 – సాధన  ఊళ్ళో గోటుల్ ముందు జీపు ఆగి ఉంది. నల్లటి జీపుకు ముందరి భాగంపై “మహారాష్ట్ర శాసన్” అనే అక్షరాలు తెల్లటి రంగుతో ఉండ్రాళ్ళలా చోటు చేసుకున్నాయి. నంబరు ప్లేటుపై హిందీ లిపిలో నంబరు కొట్టొచ్చినట్లు కనపడుతుంది. బాబులు అందరూ గోటుల్ ముందు మంచాల్లో కూచున్నారు. వాళ్ళకెదురుగా గ్రామస్తులు కూచున్నారు. పిల్లలందరూ దాదాపు బరిబాతలనే డ్రైవర్ కసరుకోవడం లెక్క చేయకుండానే ఉరుకులు పరుగులు చేస్తూ దాన్నొక వింత జంతువులా చూస్తున్నారు. ఎవరింటి ముందు […]

Continue Reading
Posted On :

కేశాభరణం (కథ)

తెనిగీయం-4  కేశాభరణం ఆంగ్ల మూలం: మార్గరెట్ ఎట్ వుడ్ స్వేచ్ఛానువాదం: అరుణజ్యోతి  నల్లకోటు కింద ముతక స్కర్టు, బూడిద రంగు తొడుక్కున్నాను. పైన బ్రౌన్ స్వెటరు వేసుకున్నాను. దానిపై కాస్త జాగ్రత్తగా చూస్తె గాని కనిపించని కంత. నీ సిగరెట్లు వల్లే ఆ కంత పడింది. అందుకే నాకు చాలా విలువైన స్వెట్టరు. లోపల ఒక పొడవైన బనీను…ఆ లోపల ఒక చిన్న బ్రా… చిన్న చిన్న పూలు డిజైను ప్యాంటీ వేసుకున్నా. చాలా చవగ్గా ఫుట్ పాత్ […]

Continue Reading
Posted On :

యదార్థ గాథలు- సుఖవంతమైన సుజాత (కథ)

యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి సుఖవంతమైన సుజాత కథ నలుగురు అక్కచెల్లెళ్ళలో నాలుగవది సుజాత. అందరూ పల్లెటూర్లో పుట్టి పెరిగారు. నలుగురూ తెల్లగా చూడడానికి చక్కగా వుంటారు. వాళ్ళ నాన్న రామారావు పక్క ఊరిలో ఫుడ్ కార్పొరేషన్ లో పనిచేేసేవాడు. అమ్మ సీత చక్కటి గృహిణి. ఊళ్ళో అన్నదమ్ములు, మేనమామలు అందరి మధ్యా వుండడంతో ఆవిడకి రోజులు సాఫీగా గడిచిపోతుండేవి. అసలు కథలోకి వస్తే నలుగురు ఆడపిల్లల చక్కదనం చూసి బంధువుల్లోనే తెలిసిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. […]

Continue Reading

అనుసృజన-నిర్మల-9

అనుసృజన నిర్మల (భాగం-9) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ [మన్సారామ్ కి వైద్యం చేసిన డాక్టర్ కుటుంబంతో తోతారామ్ కీ నిర్మలకీ మంచి స్నేహం ఏర్పడింది. ఇళ్ళకి రాకపోకలూ, తరచ్ కలవటం జరుగుతూ ఉండేది. నిర్మల డాక్టర్ భార్య సుధతో  తను కడుపుతో ఉన్నానని చెప్పింది.ఆ విషయం తనకి ఏమాత్రం సంతోషాన్నివ్వటం లేదని కూడా అంది.తన తండ్రి హఠాత్తుగా హత్యకు గురికావటం వల్ల తనకి వచ్చిన ఒక మంచి సంబంధం ఎలా తప్పిపోయిందో, డబ్బులేని […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- నవ్వుకుంటున్నావా…. నీవు ???

చిత్రలిపి నవ్వుకుంటున్నావా…. నీవు ??? -మన్నెం శారద గోళాలు దాటి  అనంత దిగంతాలకేగిన నీకు మాలిన్యపు డబ్బాలు  తెచ్చి పూస్తున్న కాలుష్యపు  రంగులు చూసి ….! ఇదేమిటయ్యా ఈ జనం ….. వారి వారి మనసులోని  విషపు రక్తం నీ కీర్తి బావుటా పై నిలువునా వెదజల్లుతున్నారు ! ఎవరు నువ్వు ??? ఆడుతూ ఆడుతూ …. పాడుతూ పాడుతూ … చిలిపిగా గెంతుతూ … చిందులు తొక్కుతూ … కష్యదాటి  కర్మఫలం తో … మా […]

Continue Reading
Posted On :

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ చూపు ఎంత అలిసిందో తోడు ఉన్న చుక్కల్ని అడుగు ఓర్పు ఎంత విసిగిందో గోడు విన్న చంద్రుణ్ణి అడుగు వేచి ఉన్న ఘడియలన్ని వెక్కిరించి వెళుతుంటె అహం ఎంత అలిగిందో కమ్ముకున్న మౌనాన్ని అడుగు ఎన్ని కోర్కెలెన్ని కలలు గంగపాలు అవుతుంటే వలపు ఎంత వగచిందో సాక్ష్యమున్న వెన్నెల్ని అడుగు ప్రతి నిముషం నరకంగా రాతిరంత గండంగా గుండె ఎంత పొగిలిందో ఆదుకున్న సూర్యుణ్ణి అడుగు మనిషె కాదు ఉత్త మాట జాడ […]

Continue Reading

వసంత కాలమ్-7 సంఘర్షణ

సంఘర్షణ -వసంతలక్ష్మి అయ్యగారి తెల్లవారినదగ్గర్నుండీ ప్రతి క్షణం సంఘర్షణే…ఎవరితో తల్లీ అనుకుంటున్నారా.. నాతోనేనే..నాలోనేనే..!నలిగిపోవడమేననుకోండి. లేస్తూనే వార్మప్ కింద సెల్లు తెరచి కొంపలంటుకుపోయే అలర్టులేమైనా ఉన్నాయేమోననిప్రివ్యూలైనా చూడడమా,వాకింగా,యోగానా,లేక లక్షణంగా ఫిల్టర్కాఫీ తో రోజునారంభించి,పనులన్నీ అయ్యాక,తీరిగ్గా  అటుసెల్లులో వాట్సప్పూయిటు ఐపాడ్లో ఫేసుబుక్కూ,దగ్గర్లోనే లాండులైనూ ఏర్పాటు చేసుకుని ,లాపుటాపుకి కాస్త దగ్గరలో ఉంటే పిల్లలుస్కైపు లోకొచ్చినా మిస్సవకుండా ఉండొచ్చు..అన్న విషయంతో మొదలు యీ కాను ఫ్లి క్టూ!! కాఫీటీలు మానేసి పాలో..వుమెన్స్  హార్లిక్స్ తాగి బలం పెంచుకోవాలా?పెద్దలాచరించిన సంప్రదాయాన్ని కొనసాగించాలా? వంటపని […]

Continue Reading

ఒక భార్గవి – కొన్ని రాగాలు -7 వలపులు రేకెత్తించే రాగం వలజి

ఒక భార్గవి – కొన్ని రాగాలు -7 వలపులు రేకెత్తించే  రాగం వలజి -భార్గవి ఒక అందమైన వలలాంటి రాగం వలజి,ఒక సారి వినడం మొదలుపెడితే ,అందులోంచీ ఒక పట్టాన బయట పడలేము. ప్రత్యూష పవనాలలో తేలి వచ్చే ఈ రాగ స్వరాలను వింటుంటే మనసు నిర్మలమై ఒక రకమైన ప్రశాంతత చేకూరుతుంది,అందుకే గాబోలు భక్తి గీతాలనూ,ప్రణయగీతాలను కూడా ఈ రాగంలో కూర్చుతారు వలజి రాగం లో అయిదే స్వరాలుంటాయి –(సగపదనిస)ఆరోహణలోనూ,అవరోహణలోనూ (సనిదపగస)కూడా,ఈ కారణంగా దీనిని పెంటటానిక్ […]

Continue Reading
Posted On :

జానకి జలధితరంగం-11

జానకి జలధితరంగం-11 -జానకి చామర్తి బొమ్మల కొలువు లోకాలను సృజించే శక్తి  విధాతకే ఉండవచ్చు గాక , కాని సృజనాత్మకత స్త్రీల సొత్తు. ఆషామాషీగా , అలవోకగా తలచుకున్నంతలో తలపుల కలబోతగా , మమతల అల్లికగా , పొంగిన పాలవెల్లిలా, అమ్మతనపు కమ్మని కలగా , వేళ్ళతో మీటిన వీణానాదంలా, నైపుణ్యపు గణి గా , ఒడి నిండిన అమృతఫలం లా .. కేవలం సున్నిపిండి నలుగుతో స్నానాలగదిలో పార్వతమ్మ చేతిలో రూపుదిద్దుకున్న బాలుని బొమ్మ  కన్నా […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-13

కనక నారాయణీయం -13 –పుట్టపర్తి నాగపద్మిని   కనకవల్లి తళిహిల్లు (వంటిల్లు) సర్దుకుంటూఉండగా, పుట్టపర్తి, రేపు పొద్దున్న మొదటి బస్సుకే తిరుపతికి పోవాలన్న ఆలోచనల్లో మునిగిపోయారు- ఎవరి ఊహల్లో వారు!!     అప్పట్లో ప్రొద్దుటూరినుండి, తిరుపతికి వెళ్ళాలంటే, ఎర్రగుంట్ల వెళ్ళి రైలు పట్టుకోవలసిందే!! తెల్లవారుఝామునే బయలుదేరి ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ చేరుకుని,రైల్లో  మూడవ తరగతి డబ్బాలో ఏదో తోపులాటల్లో కాస్త చోటు సంపాదించుకుని కూర్చునేందుకు ఎంతో శ్రమపడవలసి వచ్చింది పుట్టపర్తికి !! జీవన సంఘర్షణ కూడా ఇంతే కదా!! […]

Continue Reading

ఇట్లు  మీ వసుధా రాణి- ఉత్తరాల వేళ-2

ఇట్లు మీ వసుధారాణి ఉత్తరాల వేళ-2 -వసుధారాణి  ఉత్తరం అన్ని హంగులతో పూర్తి చేసి మా అక్కయ్యా వాళ్ళింటి పక్కన పెట్టిన తపాలా డబ్బాలో వేసేసాం.ఇక మేము అనుకున్న వారికి అది చేరటం , మేము అందులో  పొందుపరిచిన విషయం వారి మీద చూపబోయే ప్రభావం గురించి ఊహల్లోకి వెళ్లిపోయాం. ఇంతలోకి మా కిషోర్ బాబు అసలు విషయం చెప్పాడు.వాడికి ఓ అలవాటు ఉంది ఏది వద్దు అంటే అది చేయటం.ఆ విషయంలో వాడి మాట వాడే […]

Continue Reading
Posted On :

చిత్రం-16

చిత్రం-16 -గణేశ్వరరావు  ‘ఆలోచనలు కలలతో మొదలవుతాయి, ఎప్పటినుంచో నా కల ‘plein air ‘ పదాలకి ప్రాచుర్యం తీసుకొని రావాలని !’ అంటాడు పత్రికాసంపాదకుడు ఎరిక్. ఆ ఫ్రెంచ్ పదాలకి అర్థం ‘ఆరు బయట’ అని. ప్రకృతి దృశ్యాలని ప్రత్యక్షంగా చూస్తూ వాటిని చిత్రించడం! అభయారణ్యంలో మీరు తిరుగుతూ ఉన్నప్పుడు మీ ముందు ఒక లేడి దూకడం చూస్తారు, చేతిలోని కెమెరా తో ఫోటో తీయడానికి ప్రయత్నిస్తారు. అదే మీరు ఒక చిత్రకారుడు అయితే..ఆ దృశ్యాన్ని కళ్ళల్లో […]

Continue Reading
Posted On :

షర్మిలాం“తరంగం”-16

షర్మిలాం “తరంగం” నో (వరస్ట్ ) కామెంట్స్ ప్లీజ్ ! -షర్మిల కోనేరు  ఇన్నాళ్ళూ మనకి తెలియని మనుషుల మనస్తత్వాలు ఇప్పుడు బయటపడుతున్నాయి . ఫేస్బుక్ ,ట్విటర్ వంటివి రాక ముందు మూక మనస్తత్వం , ఈ గ్రూపులు కట్టడాలు అంతగా తెలిసేవి కాదు . మనుషులు తమ మనస్తత్వాలను  పుస్తకంలో పరిచినట్టు పరిచేస్తుంటే అవి చదివి ఇలా కూడా అలోచిస్తారా అని బెంగ , బాధ , కోపం అన్నీ వస్తాయి . నువ్విలా వుండకపోతే […]

Continue Reading
Posted On :

రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-4

రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-4 -సి.రమణ  క్రిందటి సంచికలో అనుకున్నట్లుగా మనం ఇప్పుడు  దశపారమితల గురించి తెలుసుకుందాం. పారమి అను పాళీ భాష  పదానికి అర్థం కొలత, కొలమానం. మనం దేనినైనా కొలవాలంటే ఒక కొలమానం ఉపయోగిస్తాము. కాలం దూరం,  ఉష్ణోగ్రత, కొలవడానికి  మరియు ఘన ద్రవ పదార్థాలు కొలవడానికి రకరకాల భౌతిక కొలమానాలు ఉపయోగిస్తుంటాం. కానీ ఇక్కడ మనం దేనిని కొలవాలి? ఎందుకు కొలవాలి? మనిషి యొక్క మానవీయ లక్షణాలను కొలవాలి. అతను చేసే కుశల కర్మలు, […]

Continue Reading
Posted On :

The Immortal Life of Henreitta Lacks by Rebecca Skloot (review)

  THE IMMORTAL LIFE OF HENREITTA LACKS –REBECCA SKLOOT – P.Jyothi  We live in a world where people are biased in their views about humanity. We have class caste gender and color differences. In India we have been living under the influence of all these biased views from generations. Sometimes it becomes quite difficult to keep […]

Continue Reading
Posted On :

Haunting Voices: Stories heard and Unheard -4 (Malati Chandur)

Haunting Voices: Heard and Unheard Malati Chandur -Syamala Kallury “Hello grandma. How are you doing? Have you been talking to the sea of late?” “Yes, of course. You know when I was young, I had to go a town 200 km away from my home to join as a lecturer. Till then we were living […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-16 (అలాస్కా-4)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-4 ఏంకరేజ్ నుండి ఉదయం 9.45కు బయలుదేరి గ్లాస్ డూమ్ ట్రైనులో  అనుకున్నట్టే విట్టియార్ అనే ప్రదేశానికి మధ్యాహ్నం 12.45 కు చేరాం. దారిపొడవునా గడ్డి భూములు, ఎత్తైన పర్వతాలు, సరస్సులు, మంచుకొండలు గ్లాస్ డూమ్ ట్రైనులో నుంచి చూసి ఆస్వాదిస్తూ ఉంటే సమయమే తెలియలేదు. రైలు పెట్టెలోనుంచి ఒడ్డునున్న పెద్ద క్రూయిజ్ షిప్పు చూసి సంబరపడిపోయారు పిల్లలు. తీరా చూస్తే ఇంతకీ మేం ఎక్కాల్సింది దాని కొక […]

Continue Reading
Posted On :

నీలి మేఘాలు (పుస్తక సమీక్ష)

నీలి మేఘాలు -వురిమళ్ల సునంద కవిత్వం అంటే ఒక అన్వేషణ,ఒక తీరని వేదన,కవిత్వమొక జలపాతం. కవిత్వాన్ని తూచడానికి తూనికరాళ్ళు ఉండవంటారు చలం. అక్షరాన్ని అణువుగా అనుకుంటే ఆటంబాంబు లోని అణుశక్తి కవిత్వమని చెప్పవచ్చు. అక్షరాలను పూవులతో పోలిస్తే ఆ పూలు వెదజల్లే పరిమళాలే కవిత్వం అనవచ్చు. కప్పి చెప్పేది కవిత్వం విప్పి చెప్పేది విమర్శ అని సినారె అంటే.. “కదిలేది కదిలించేది పెను నిద్దుర వదిలించేది కవిత్వమని’ శ్రీ శ్రీ గారు అంటారు. “ప్రశాంత స్థితిలో జ్ఞాపకం […]

Continue Reading
Posted On :

Silicon Loya Sakshiga-2 (Work from home) (Telugu Original by Dr K.Geeta)

Work from Home -Telugu Original by DrK.Geeta -English Translation by Madhuri Palaji Surya is coming home early. When he saw that our daughter and I were in a deep sleep, he woke me up saying, “Chintu, Can you make some tea for me?” “You call me ‘Chintu’ lovingly and then you are asking me to […]

Continue Reading
Posted On :

కథా మధురం- చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి

కథా మధురం   చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి చెదిరే ముగ్గు (కథ)    -ఆర్.దమయంతి కథా మధుర పరిచయం : ‘ఆకాశమంత ప్రేమకి నిర్వచనం అమ్మ ఒక్కటే!’ అని చెప్పిన కథ  – డా!! చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారు రాసిన చెదిరే ముగ్గు కథ! ******** మహిళలు  స్త్రీ పక్షపాతులు కానే కారు. వారికి మగ వారంటేనే గొప్ప నమ్మకం. విశ్వాసం.   వారి  మోసాలు తెలీక ప్రేమించడం , తెలిసాక –  కడ వరకు వగచి […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-13 (తెరిచిన కిటికీలోంచి….)

కొత్త అడుగులు – 13 గీతా వెల్లంకి తెరిచిన కిటికీలోంచి…. – శిలాలోలిత ఈ ప్రకృతి మొత్తంలో అందమైన భావన ప్రేమ. ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును. అన్నదెంత సత్యమో! ప్రేమించడం తెలిసిన వాళ్ళకు అశాంతి వుండదు. ఒక మృదత్వం, సున్నితత్వం, ప్రకృతి ప్రియత్వం, ఊహాశాలిత్వం ఎక్కువగా వుంటాయి. వ్యక్తుల్ని వారి స్నేహాన్ని, ఇష్టాన్ని, ప్రేమను ఒదులుకోడానికి సిద్ధపడరు. ప్రేమనింపిన భావాలున్న వాళ్ళు ఒకవిధంగా చెప్పాలంటే చాలా అమాయకంగా వున్న సందర్భాలే ఎక్కువ. వాళ్ళెంత లలితంగా ఆలోచిస్తారో, […]

Continue Reading
Posted On :

అతడు (కథ)

అతడు –పద్మావతి రాంభక్త కొందరంతే అందమైన అట్టున్న పుస్తకాలను కొత్తమోజుతో కాలక్షేపానికి కాసేపు తిరగేసి బోరు కొట్టగానే అవతల విసివేస్తారు.ఇతడూ అంతే.అయినా నేను అతడిలా ఎందుకు ఉండలేక పోతున్నాను.అతడు నా పక్కన ఉంటే చాలనిపిస్తుంటుంది.అతడి సమక్షంలో ఉంటే చాలు, నా మనసంతా వెన్నెల కురుస్తుంది.ఒక సుతిమెత్తని పరిమళమేదో చుట్టుముడుతుంది.ఆలోచనలలో పడి సమయమే  తెలియట్లేదు.బండి చప్పుడైంది. గడియారం వైపు చూస్తే అర్ధరాత్రి పన్నెండు కొడుతోంది. ఊగుతూ తూగుతూ అతడు ఇంట్లోకి వచ్చాడు.ఇప్పుడిక ఇదివరలోలా గోల చెయ్యడం మానేసాను. నెమ్మదిగా […]

Continue Reading

Fight for Existence (Telugu Original by Rupa Rukmini)

Fight for Existence Telugu Original: Roopa Rukmini English Translation: Geeta Vellanki 1Whenever I see flower petals falling on ground,I re-check myself by keeping a hand on my chestif I ran out of emotions or what?! 2Human to human respect is fading away like a mist,there are several layers of existential fights.. 3I always expect the touch of […]

Continue Reading
Posted On :

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-1

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-1 -డా.సిహెచ్.సుశీల వాగర్థా వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని మహాకవి కాళిదాసు ప్రార్థించి నట్లు ‘వాక్కు’ లేకుండా ‘అర్థం’ లేదు ‘అర్థం’ ‘వాక్కు’ను వదిలి ఉండలేదు. ఇవి పరస్పరం ఆధార ఆధేయాలు. ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఎలా అర్థనారీశ్వరులో ఎలా అవిభక్త జాయాపతులో  అలానే స్త్రీపురుషులు అవిభక్తాలు. కానీ పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీకి పురుషులతో పాటు సమాన స్థాయి సంపాదనలో సాధ్యాసాధ్యాలు చర్చించే అరుదైన వేదిక […]

Continue Reading

నిశిరాతిరి (కవిత)

నిశిరాతిరి – డా. కొండపల్లి నీహారిణి ఎక్కడినుండి రాలిందో ఓ చిమ్మచీకటి కుప్ప. ఎందుకు మౌనంవహించిందో మనసు కుండలో చేరి. ఒలకని మేధోమథనం ఒడవని బతుకుసమరం ఈ నిశిరాతిరి ఏ గుసగుసలుచేస్తున్నది? ఆకలి మంటలవికావు, అన్నపు రాసుల లేమివీకావు, ఒళ్ళు చిల్లుపడ్డ దాఖలాలూలేవు. మృత్యువు ధారాపాతనడకతో వీధుల్ని శవాలుగా ముంచెత్తుతూ ఈ నిశిరాతిరి ఏ గుసగుసలుచేస్తున్నది? సందులు గొందులు మూగవడినవి పనిముట్ల సందోహాలు మూలబడినవి చిక్కాలతో మూతులుముక్కులు ఆలింగనాలు లేని దూరాలవలెనేనన్న ఆనవాళ్ళ చిట్టాలిప్పలేకపోతున్నదంటూ… ఈ నిశిరాతిరి […]

Continue Reading

All That Glitters by Dr K. Meerabai

  All That Glitters (Story) English Translation: Dr. K.Meera Bai Mohanarao, who was relaxing in an easy chair threw down the newspapaer he was reading and closed his eyes desperately . His eyebrows got knitted hearing his wife’s curt and blunt voice calling his daughter “ “Hema where are you? Why can’t you come and […]

Continue Reading
Posted On :

To tell a tale-4

To tell a tale-4 -Chandra Latha Chapter-I (Part-3) Narratology and Novel In narrative theory, the actant is a term from the actantial model of semiotic analysis of narratives.  Greimas’s actantial model reveals the structural roles typically performed in storytelling, such as “hero, villain (opponent of hero), object (of quest), helper (of hero) and sender (who […]

Continue Reading
Posted On :

బాపట్ల నానీలు (కవిత)

బాపట్ల నానీలు – డా.సి.భవానీదేవి నీవాళ్ళు దూరమయ్యారా ? చింతించకు .. మేలు చేసుంటావు అందుకే ! అమ్మ.. నాన్న.. వెళ్లిపోయారు మట్టి మరోరూపందాల్చినా గుర్తించలేం  కదా.. శతాధిక నాటకాల పేటి కొర్రపాటి …. నాటక రచనలో ఘనాపాఠి ! సాహితీ రుద్రమ కప్పిన తొలిశాలువా నాకది బాధ్యతా పులకరింత ! బతుకంతా  నడకైనా కాళ్ళనెప్పుల్లేవు ఆరిపాదాలకు మా ఊరిమట్టి ! కిలో బియ్యం లీటర్ కిరోసిన్ కోసం రోజంతా క్యూలో … తుఫాన్ కు అంతా […]

Continue Reading
Posted On :

నవవాక్యం (కవిత)

నవవాక్యం -గిరి ప్రసాద్ చెల మల్లు అక్కడో పరువుతండ్లాడుతుంది గోబ్యాక్ నినాదాల వెనుక మర్మం జగద్విదితం  కులం గొంతుఆఖరిచూపునిచిదిమేసింది బిడ్డ భర్త హత్యలోప్రేమపర్వం తెరలుతెరలుగా సమాజగోడలపై చిత్రించబడుతుంది  మానసికస్థైర్యానివ్వలేని కులంమనిషిని చంపినా చేవ తగ్గకరంకెలేస్తుంది  గొడ్డలి వేటులో ప్రాణం గిలగిలలాడుతుంటేహర్షాతిరేకాలతోవీధుల్లో పైశాచిక కులోన్మాదం  పరిణతి ఇరవైల్లోనేజవాబులకు రంగుల పులిమే పాత్రికీచకత్వం  ప్రేమ భాష్యం  మారుతుందోమార్చబడుతుందో పరువు పదంలో కొంగ్రొత్తగా చెక్కబడుతున్న శిల్పంప్రేమ సహచర్యాన్ని ఓర్వలేని కులంతెగనరికి ప్రేమంటుంటేశిలపై ఉలి మొరాయిస్తూసమ్మెటకే ఎదురుతిరిగి వెలివాడల్లో ప్రేమకోసం పరుగులెత్తుతుంటే అడుగుల్లో నవవాక్యం కనబడుతుంది ***** గిరి ప్రసాద్ చెలమల్లుపుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. నాన్న గారి నుండి వామపక్ష భావజాలం పొందాను. విద్యార్థి […]

Continue Reading

తొలకరిజల్లుతో చెరువు (కవిత)

 తొలకరిజల్లుతో చెరువు -సుగుణ మద్దిరెడ్డి పాడి పశువులకు గడ్డి మేత లందించు పచ్చని పచ్చిక బీళ్లు!  చెరువులో చెట్ల మధ్యన ఆడిన  దాగుడు మూతలజోరు! పేడ ముద్దలు ఏరి సేకరించిన పిడకలకుప్పలెన్నో! ఎంత గిల్లినా తరగని పొనగంటాకు దిబ్బ లెన్నో!  చెరువునిండాక నీటి కోళ్ల  తల మునకలు రెక్కలు ఇదిలించే నీటి తుంపరలు నీటి పాముల  సొగసైన ఈతలు! చెరువుగట్టు అడుగున ఎండ్రకాయ బొక్కలుజూసి వాటిలో పుల్లలతో కలబెట్టి అవి బొక్కనుంచి బయటకొస్తే ఆనంద డోలికలూగినవేళ! ఆవులు, […]

Continue Reading

Garland (Telugu Original by Vasudha Rani)

Garland Telugu Original: Vasudha Rani English Translation: Kalyani Neelarmbham I garlanded You and felt so proudBut ,look at You , You created a gardenFor me ,You sent me wild flowersFilled with fragrance.Am I a fool toPresume that you await my offerings?In return for all Your gifts ,let meFor Atleast offer my heart.You are not the […]

Continue Reading
Posted On :

My Life Memoirs-4

My Life Memoirs-4 My Life, Full of Beautiful Memories -Venigalla Komala 5. MY STUDIES IN ANDHRA UNIVERSITY VISAKHAPATNAM  (1955-58 ) My father wanted me to study law. I always dreamed of being an English teacher, so I wanted to join B.A. (Hons) English Literature and language. My brother applied to both  on my behalf. He […]

Continue Reading
Posted On :

Creativity!

Creativity! -Sahithi ALBERT EINSTEIN once said “Creativity is intelligence having fun” The use of imagination to develop a simple idea or a concept in a unique way is creativity. It adds colors, joy and attraction to a simple idea. As we all know The world is rapidly changing from the information age into the innovation […]

Continue Reading
Posted On :

The Farewell Plane (Telugu Original “Vidkolu Vimanam” by Dr K.Geeta)

The Farewell Plane Telugu Original: Dr K.Geeta English Translation: Madhuri Palaji Dark clouds are swarming in the skies outside Same as in my heart– By now… the flight you boarded Must have crossed those clouds above I didn’t know it was so easy for you to cross over Enough pain to get accustomed For two […]

Continue Reading
Posted On :

అన్నిటా సగం (కవిత)

 అన్నిటా సగం -చెరువు శివరామకృష్ణ శాస్త్రి నీవో సగం, నేనో సగం ఆకాశంలో, అవనిలో అన్నిటా మనం చెరి సగమంటూ తాయిలాల మాటలతో అనాదిగా మీరంటున్న సగానికే కాదు అసలు మా అస్తిత్వానికే సవాలుగా మిగిలిపోయాము అబలలమై! నిన్ను అన్నగా, నాన్నగా, తాతగా, మామయ్యగా, బావగా తలచి చెల్లినై, కూతురినై, మనుమరాలిగా, కోడలిగా, ముద్దుల మరదలిగా బహురూపాలుగా విస్తరించి ప్రేమను, కరుణను పంచగల మహోత్తుంగ జలపాతాన్ని నేను! సంపాదనలో నీ కన్నా మెరుగ్గా ఆర్జిస్తూ నీతో బాటు […]

Continue Reading

సంతకం (కవిత్వ పరామర్శ)-4 (చూపుడువేలు పాడేపాట-శిఖామణి)

సంతకం (కవిత్వ పరామర్శ)-4 చూపుడువేలు పాడేపాట-శిఖామణి -వినోదిని ***** https://www.youtube.com/watch?v=lh6w06S9waE&feature=youtu.be వినోదిని -వినోదిని స్త్రీవాద సాహిత్యం మీద ఎంఫిల్ , పీహెచ్డీ చేశారు. గత 12 సంవత్సరాలుగా యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పని చేస్తున్నారు.  అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సోషల్ డిస్క్రిమినేషన్ ప్రాజెక్ట్, మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. అంటరానితనం జోగిని వ్యవస్థ పై గ్రామీణ అభివృద్ధి శాఖ లో పని చేశారు స్వచ్ఛంద సంస్థలతో కలిసి రైతు ఆత్మహత్యలు […]

Continue Reading
Posted On :

అమెరికా తెలుగు కథలు- స్థానిక సమస్యలు

అమెరికా తెలుగు కథలు  – స్థానిక సమస్యలు -డా||కె.గీత (మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ వెబినార్ “తెలుగుకథ- వస్తు రూప వైవిధ్యం” లో డా|| కె.గీత ప్రత్యేక ప్రసంగం) ముందుగా నేను ఇవేళ ముఖ్యంగా తెలుగు సాహిత్య విద్యార్థులు కోసం నాలుగు మాటలు చెప్పాలనుకుంటున్నాను. మనకి సాహిత్య పఠనం అనేది దేనికి ఉపయోగపడాలి? అనేది ఆలోచించాలి మీరంతా. ఒక రచన చదివిన తరువాత మనకు మనమే కొన్ని  ప్రశ్నలు వేసుకోవాలి. సాహిత్య పఠనం కాలక్షేపం కోసమో, వినోదం […]

Continue Reading
Posted On :

పునాది రాళ్ళు-15

పునాది రాళ్లు-15 -డా|| గోగు శ్యామల  మేటి కళాకారిణి  చిందు ఎల్లమ్మ కళా రూపాల్లో కులం జెండర్ రాజకీయాల పాత్ర  ఇప్పటి వరకు మనం తెలుగు జనుల మనసును చూరగొని  ఆ తదుపరి  బాధితులైన మహా నటినే చూసాం. ఇప్పుడు మనం అదే తెలుగు జనుల మనుసును చూరగొని గెలిచి నిలిచిన మేటి  మహా కళాకారిణిని చూడాల్సి ఉంది. ఆమెనే  చిందు ఎల్లమ్మ.  చిందు యక్షగాన  కళారూపాన్ని, చిందు మేళాన్ని సబ్బండ పని పాటొల్ల చరిత్రలోని  కథలని […]

Continue Reading
Posted On :

బహుళ-4 కె.సరోజిని కథ “తీరని బాధ”

బహుళ-4                                                                 – జ్వలిత కె. సరోజినీ కథ “తీరని బాధ” తెలంగాణాలో గ్రంధాలయోద్యమంతో మొదలైన “చదివించే” ఉద్యమం “ఆది హిందూ ఉద్యమం” ప్రోత్సాహంతో 1906 లో స్త్రీ విద్యకు పునాదులు పడ్డాయి. 1920 నాటికి స్త్రీల సమస్యలపై హైదరాబాదులో చర్చలు ఆరంభమై మహిళా వికాసానికి దారితీశాయి. 1934 లో వెలువడిన గోలకొండ కవుల సంచికలో తెలంగాణ మహిళలు పది మంది మాత్రమే ఉన్నారు. ప్రతిభ కలిగినప్పటికీ అనేక కారణాల వల్ల తెలంగాణ కథయిత్రులు తగిన గుర్తింపు పొందలేక […]

Continue Reading
Posted On :

స్వప్న వీధిలో… (కవిత)

స్వప్న వీధిలో… -డి.నాగజ్యోతిశేఖర్ రోజూ రెప్పలతలుపులు మూయగానే … నిద్రచీకటిలో గుప్పున వెలుగుతుందో నక్షత్రమండలం! కలతకృష్ణబిలాల్ని కలల లతల్లో చుట్టేసి… దిగులు దిగుడుబావిని దిండుకింద పూడ్చేసి ఒళ్లు విరుచుకుంటుందో వర్ణప్రపంచం! ఊహాల్ని శ్వాసల్లో నింపి… ఊసుల్ని పూలలోయల్లో  ఒంపి… మనస్సు మూట విప్పుతుందో వినువీధి! ఆ వీధి మధ్యలో పచ్చటి చెట్టయి నవ్వుతుంటుంది నా మస్తిష్కం.! ఆ సందు చివర కురులారాబోసుకుంటుంది నా నవ్వుల వెన్నెల కెరటం! నడి వీధిలో నవ్వేెంటనే ఆధిపత్యపు స్వరాలు లేవు! ఆకాశపు అంచుల్లో నువ్వేెంటనే అమావాస్యపు […]

Continue Reading

What’s your name -3 (Gurajada Apparao Story)

What’s Your Name? (Part-3) Telugu Original : Gurajada Appa Rao English Translation: Naudury Murthy “Raminaidu walked up to Manavallayya. Holding his hand and pressing it as a gesture of immediacy, said, ‘Listen, you Vaishnavite! If Sarathi Naidu converts to Saivism, all of us will miss his special oblations Pulihora and Chakkera Pongali offered every Dwadasi […]

Continue Reading
Posted On :

Upaasana- Amazing Grace!

Amazing Grace! -Satyavani Kakarla We are surrounded by inspirational people, of all genders and ages. Some really make a difference, move you to transcend in a special way just hearing about them in several places, in person and in thoughts. Few weeks back, social media was rolling, filling space with one such human being – […]

Continue Reading
Posted On :

Need of the hour -4

Need of the hour -4 What Next! A Question @ Every Adversity… -J.P.Bharathi Right from the day an individual appears on this earth, the struggle for existence begins. In fact, the struggle for existence begins much much before we realise and understand the worldly situations. We live most of our life as a child in […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-5 ఆశాజీవులు కథ గురించి

నా జీవన యానంలో- రెండవభాగం- 16 ఆశాజీవులు కథ గురించి -కె.వరలక్ష్మి 1972లో నేను స్కూలు ప్రారంభించాను, నాలుగేళ్ళ మా అబ్బాయితో కలిపి ఏడుగురు పిల్లల్లో ప్రారంభించినప్పటి నా ధ్యేయం నా ముగ్గురు పిల్లలకీ లోటులేకుండా తిండి, బట్ట సమకూర్చుకోవాలనే, కాని, నాలుగైదు నెలలు గడిచేసరికి మంచి ప్రాధమిక విద్యను అన్ని వర్గాల పిల్లలకీ అందుబాటులోకి తేవడం ముఖ్యమని అర్ధమైంది. అందుకే ప్రారంభంలో మొదలుపెట్టిన పది రూపాయల ఫీజును పాతికేళ్ళైనా మార్చలేదు. కూలి జనాల పిల్లలకి పుస్తకాలు, […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -15

జ్ఞాపకాల సందడి-15 -డి.కామేశ్వరి  వరలక్ష్మీవ్రతం  నాడు తప్పకుండ నాకు  గుర్తువచ్చే మాట ఓటుంది. మా అక్క  బావ  ఓసారి పూజ  టైంకి  మాఇంట్లో వున్నారు . అక్కని ,నన్నుచూసి మావారు వీళ్ళు మన భార్యలు  మనడబ్బు  ఖర్చుపెట్టి మళ్ళీ జన్మలో మంచి మొగుడు రావాలని పూజలు  చేస్తారు ఎంత అన్యాయం అంటూ  జోకారు.నేను ఊరుకోనుగా  ఆలా కోరుకున్నారంటే దానర్ధం ఏమిటో మరి రిటార్ట్ ఇచ్చా , మా బావగారు అయితే  మరి మేం  ఏ కేటగిరి  అంటారు  […]

Continue Reading
Posted On :

అమెరికాను ఉర్రూతలూగించిన మాడలిన్

అమెరికాను ఉర్రూతలూగించిన మాడలిన్ -ఎన్.ఇన్నయ్య ఒకే ఒకసారి భారతదేశం సందర్శించిన మాడలిన్, హైదరాబాద్ లో మల్లాది సుబ్బమ్మ – రామమూర్తి మానవవాద దంపతులకు అతిథిగా వున్నది. ఆ తరువాత విజయవాడలో గోరా కుమారుడు లవణం, తదితరులతో కార్యక్రమాలు నిర్వహించింది. ఆమె ఫోటోను ముఖచిత్రంగా ప్రచురించిన ఆమెరికా సుప్రసిద్ధ పత్రిక టైం, “అమెరికా ద్వేషించే స్త్రీ” అని వర్ణించింది. ఎందుకని ఆమె వీర నాస్తికురాలు గనుక! హైదరాబాద్ లో మల్లాది వారితో వున్నప్పుడు నేను కలసి మాట్లాడాను. తరువాత […]

Continue Reading
Posted On :

కథాపరిచయం -నేను చంపిన అమ్మాయి -ఆనంద

కథాపరిచయం నేను చంపిన అమ్మాయి – ఆనంద -జానకి చామర్తి ఆ తరం కన్నడకథకులలో మాస్తిగారి తరువాత ఎక్కువ ప్రజాదరణ పొందిన రచయిత అజ్జింపుర సీతారామం ( ఆనంద)గారు. వారు వ్రాసిన కథలలో మంచిపేరు పొందిన కథ  ‘ నాను కొంద హుడిగి’ (నేను చంపిన అమ్మాయి) . చాలా ముఖ్యమైన కథ కూడా. ఈ కథను తెలుగులోకి శర్వాణి గారు అనువదించారు. ఇంకో వ్యక్తి నమ్మకాల పట్ల తీర్పు నివ్వడం  వల్ల కలిగిన దుష్పరిమాణాన్ని ధ్వనింపచేసే […]

Continue Reading
Posted On :

ట్రావెల్ డైరీస్ -6 (నక్షత్రాలు నేలదిగే నగరం)

ట్రావెల్ డైరీస్ -6 నక్షత్రాలు నేలదిగే నగరం -నందకిషోర్  హిమాలయాల్లో ఏడు సరస్సులు (సాత్ తాల్) ఒకే చోట ఉండే ప్రాంతం ఒకటుంది. ఆ ప్రాంతానికంతా వన్నె తెచ్చిన్నగరం నైనితాల్. ఇది ఉత్తరాఖండ్ రాజధాని. మనదేశంలోని అందమైన నగరాల్లో ఒకటి. నయనాదేవి మందిరం ఉన్నందుకు నైనితాల్ అనేపేరు. ఆ మందిరం పక్కనే సరస్సు. ఆ సరస్సు నీళ్ళన్నీ నయనాదేవి కన్నీళ్ళంత తేటగా ఉంటాయ్. నైనితాల్‌కి నేను చాలాసార్లే వెళ్ళాను. మనసు కుదురులేదంటే చాలు, హర్దోయి నుండి శుక్రవారం అర్ధరాత్రి […]

Continue Reading
Posted On :

ముసురు (కథ)

ముసురు –మణి వడ్లమాని వాన  జల్లు  పడుతూనే ఉంది. ఒక్కసారి  పెద్దగా, ఒక్కోసారి చిన్నగా  జల్లులు  పడుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా జనం,సందడిగ  కోలాహలంగ ఉంది , కుర్చీలలో  కూర్చొని   కునికి పాట్లు పడేవారు కొందరు. పుస్తకాలు  తెచ్చుకొని  చదువుకునే  వారు మరి కొందరు.  చెవులకి  హియర్  ఫోన్స్  పెట్టుకుని  మ్యూజిక్  ని వింటూ ఉండేవాళ్లు ఇంకొంతమంది. మొత్తానికి   ఎవరి కి వాళ్ళు  యేదో రకంగా  బిజీ గా ఉన్నారు. “బయట వాతావరణం బాగా […]

Continue Reading
Posted On :

ప్రమద -శృతి హాసన్(ఒక మాట దొర్లితే-కవిత)

ప్రమద శృతి హాసన్ ఒక  మాట దొర్లితే (కవిత) –సి.వి.సురేష్  నవంబర్ 20, 2013 లో ఒకరోజు ఉదయాన్నే ఆమె తన ఇంట్లో ఉండగా, ఒక దుండగుడు ఇంటి తలుపు తట్టి, ఆమె తలువు తీసాక,  “నువ్వు నన్నెందుకు గుర్తు పట్టడం లేదు. ఎందుకు మాట్లాడటం లేదు”? అని ప్రశ్నించాడు.”నువ్వెవరో నాకు తెలియదు” అని ఆమె బదులిచ్చింది. అయితే ఆ దుండగుడు ఆమె గొంతు పట్టుకొని లోపలికి చొరబడేందుకు ప్రయత్నించాడు. వెంటనే, ఆమె అతన్ని వెనక్కు తోసి, […]

Continue Reading
Posted On :

కథాకాహళి- జి. నిర్మలారాణి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి జి. నిర్మలారాణి కథలు జి. నిర్మలా రాణి అనంతపురం లోని ఫుట్టపర్తి సాయిబాబా జూనియర్ కాలేజిలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి, పదవీవిరమణ చేశారు. “గాజుకళ్ళు” పేరుతో  2003 సంవత్సరంలో కథా సంకలనాన్ని ప్రచురించారు. పదిహేనేళ్ళనుండి కథలు రాస్తున్నారు. జన్మస్థలం కోస్తాంధ్ర ప్రాంతమైనా రాయలసీమ  ప్రాంతీయ జీవితానికి ప్రాతినిధ్యం వహించే “గాజుకళ్ళు” లాంటి కథలు కూడా రాశారు. అనంతపురం నుండి కథలు రాస్తున్న సీనియర్ రచయితగా ఈమెను చెప్పవచ్చు. […]

Continue Reading
Posted On :

Blazing Lake (Telugu Original by Dr K.Geeta)

Blazing Lake Telugu Original: Dr K.Geeta English Translation: Madhuri Palaji The modern demon swallowed her night Thousands of browser windows swirled him like a whirlpool The night to be shared equally Is limiting her only to the waiting part He doesn’t need romance in the bedroom Internet harlotry Even when the beautiful goddess is sleeping […]

Continue Reading
Posted On :

Depression (Shortfilm Review)

https://youtu.be/NOwNP3sg76I SPEAK UP IF DEPRESSED. YOU ARE NEVER WRONG! -Nikhitha Challapilli Depression, a Telugu short film released in BVC studios youtube channel is gaining a good amount of positive feedbacks from netizens. This short film was written and directed by Roop PS, CEO of BVC studios. He is also the DOP of this film.  This […]

Continue Reading
Posted On :

సిలికాన్ వాలీలో శాంతిదేవి!

సిలికాన్ వాలీలో శాంతిదేవి! -ఎన్.ఇన్నయ్య అంతర్జాతీయంగా శాంతిదేవి చారిత్రక పాత్ర వహించింది. ఆమె అమెరికాలో ప్రతిభావంతురాలుగా పేరొంది, ధనగోపాల్ ముఖర్జీ వద్ద చదివి, రవీంద్రనాథ్ ఠాగోర్ కవిత్వాలను ఆనందించిన మేథావి. ఇదంతా మొదటి ప్రపంచ యుద్ధ కాలంనాటి ముచ్చట. శాంతిదేవి అసలు పేరు ఎవిలిన్. 1915 నాటికి ఆమె గ్రాడ్యుయేట్ గా జీవితంలో ప్రవేశించడానికి సిద్ధంగా వుంది. అనుకోకుండా ఆమెకు మానవేంద్రనాథ్   రాయ్ తటస్థించాడు. వారిరువురినీ పరిచయం చేసిన ధనగోపాల్ వారి పెళ్ళికి దారితీశాడు. బ్రిటిష్ […]

Continue Reading
Posted On :

బహుళ-3 (దాసరి శిరీష)

బహుళ-3                                                                 – జ్వలిత దాసరి శిరీష కథ “వ్యత్యాసం” వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో కథకు శతాధిక సంవత్సరాలు నిండిపోయిన సమయంలో కరోనా కరాళ నృత్యం కథలపై కూడా ప్రభావం చూపిస్తోంది. అయినా ప్రపంచవ్యాప్తంగా తెలుగు కవులు రచయితలు భయపడకుండా అంతర్జాలంలో సాహిత్య జాతరలు నడుపుతూనే ఉన్నారు. కరోనా కథల సంపుటాలు వెలువడుతున్నాయి. లిఖిత కథల ముందు మౌఖిక కథలకు చెప్పలేనంత నష్టం జరుగుతూనే ఉన్నది. లక్షల కొద్దీ రాతప్రతుల్లో, నాలుగు లక్షలకు పైగా అచ్చయిన పుస్తకాల్లో కథ […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-14

  నారిసారించిన నవల-14 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే  డా. పి. శ్రీదేవి  వ్రాసిన నవల  ఒకే ఒక్కటి  ‘కాలాతీత వ్యక్తులు’. అయినా ఆ నవలే సాహిత్య చరిత్రలో ఆమె పేరును సుస్థిరం చేసింది. 1929 లో సెప్టెంబర్ 21 వ తేదీన అనకాపల్లిలో జన్మించిన శ్రీదేవి వృత్తిరీత్యా వైద్యురాలు. ప్రవృత్తి సాహిత్యం. స్వయంగా కవిత్వం, కథలు వ్రాసింది.1957 లో ఆమె ప్రచురించిన ‘ఉరుములు- మెరుపులు’ అనే కథల సంపుటికి ముందుమాట వ్రాసిన గోరాశాస్త్రి ఆమెను […]

Continue Reading

యాత్రాగీతం-15 (అలాస్కా-3)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-3 మర్నాడు ముందే బుక్ చేసుకున్న టూరు ప్రకారం మేం ఏంకరేజ్ నుండి ఉదయం 9.45కు బయలుదేరే గ్లాస్ డూమ్ ట్రైనులో  విట్టియార్ అనే ప్రదేశానికి మధ్యాహ్నం 12.45 కు చేరుతాం. అక్కణ్ణించి వెంటనే బయలుదేరే షిప్పులో గ్లేసియర్ టూరుకి వెళ్లి సాయంత్రం 6 గం. కు విట్టియార్ తిరిగొచ్చి మళ్లీ ఏంకరేజ్ కు రాత్రి 9 గం. కు గ్లాస్ డూమ్ ట్రైనులో తిరిగొస్తాం.  మొత్తం టూరులో […]

Continue Reading
Posted On :
komala

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-3

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-3 -వెనిగళ్ళ కోమల సీతమ్మ పెద్దమ్మ ఒంటరి. అమ్మమ్మ నాటి నుండి స్నేహమట. అమ్మమ్మ, తాతయ్యలను నేను ఎరుగను. అది నా జీవితంలో లోటుగానే ఉండేది. ఆమె మా యింట్లో పెద్ద తోడుగా సహాయపడేది. అన్నయ్య తెనాలిలో చదువు కుంటుంటే దగ్గర ఉండి వండి పెట్టింది. నా పెండ్లి దాకా ఉన్నది పెద్దమ్మ. మేమంతా గౌరవించి, ప్రేమించిన సీతమ్మ పెద్దమ్మ. నాన్నగారి తరఫున తాతయ్య, బాబాయిలు, నాగమ్మత్తయ్య ఎక్కువ వచ్చిపోతుండేవారు. నాన్న స్థితిమంతుడవటాన […]

Continue Reading
Posted On :

మా కథ -దొమితిలా చుంగారా- 12

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం- సైగ్లో – 20 గృహిణుల సంఘం నా భర్త అక్కడ ఉన్నాడా? అని అడుగగానే ఆయన నా కోసం బయటికి వచ్చాడు. ఆయన రాత్రంతా కాపలా కాస్తూ అక్కడ నిలబడి ఉన్నాడట. నన్ను చూడగానే ఆయన చాలా సంతోషంగా “చూశావా, వాళ్ళు మన నాయకులను లోపాజ్లో ఖైదీలుగా పెట్టారు. మనం విదేశీయులను ఇక్కడ పట్టుకున్నాం. స్త్రీలు, మేమూ కలిసి కాపలా కాస్తున్నాం” అన్నాడు. […]

Continue Reading
Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- ఉత్తరాల వేళ

ఇట్లు మీ వసుధారాణి ఉత్తరాల వేళ -వసుధారాణి  ప్రతి విషయాన్నీ తెలుసుకోవాలనే ఉత్సుకత ,ఉత్సాహం ఎక్కువగా ఉండే బాల్యావస్థలో చక్కటి మార్గదర్శనం చేయటానికి మాకు దొరికిన మార్గదర్శి మా కృష్ణానందం బావగారు.మా రెండవ అక్కయ్యా,బావగార్లయిన సావిత్రి,కృష్ణానందం (ఇద్దరూ జువాలజీ లెక్చరర్లు)వాళ్ళ పిల్లలు చిన్నారి,కిషోర్ తో పాటు నన్ను కూడా వారింట పుట్టిన పిల్లలా చూసేవాళ్ళు.మా బావగారు పిల్లల పెంపకం గురించి మా కాలం కంటే చాలా ముందు ఆలోచనలు చేసి మా ముగ్గురి పెంపకం కొంచెం ప్రయోగాత్మకం […]

Continue Reading
Posted On :

విరోధాభాస (ఝాన్సీ కొప్పిశెట్టి నవల పై సమీక్ష)

విరోధాభాస (ఝాన్సీ కొప్పిశెట్టి నవల పై సమీక్ష) -డా.సిహెచ్. సుశీల అతివేగంగా మారిపోతున్న ప్రపంచపోకడలు అన్ని రంగాలకూ వర్తించినట్లే మానవసంబంధాలు, ప్రేమలు, అనుబంధాలు, ఆప్యాయతలకు కూడ వర్తిస్తూ, “ ఆత్మాభిమానం, వ్యక్తిత్వం” వంటి వాటిని బీటలు వారేలా గట్టి దెబ్బే కొడుతున్నాయి. కంప్యూటర్ లా వేగంగా ఆలోచించే మనిషి మెదడు ‘కేవలం ‘ కంప్యూటర్ లాగానే ఆలోచిస్తోంది కాని ‘మనసు తడి’ లుప్తమైపోతోంది. అలాంటి వాటిని అందిపుచ్చుకుని వస్తున్న రచనలు వున్నాయి. కానీ, అయితే అతి మంచిపాత్రలు, […]

Continue Reading

మా అమ్మమ్మ సుబ్బలక్ష్మి – మైధిలీ శివరామన్

 మా అమ్మమ్మ సుబ్బలక్ష్మి – మైధిలీ శివరామన్ – పి.జ్యోతి ఈ ప్రపంచంలో ఎందరో స్త్రీలు పుడుతున్నారు, చనిపోతున్నారు. కొందర్ని మనం మనకు అనుకూలంగా గుర్తుపెట్టుకుంటాం, మనం అనుకున్న విధంగా కొందరు లేరని ఆశ్చర్యపడతాం. కాని మన తోటి సామాన్య స్త్రీలను వారి పరిధి నుండి అర్ధం చేసుకునే ప్రయత్నం స్త్రీలమైన మనమే చేయం. సమాజం కోరుకునే ముద్రలలో ఇమడలేని స్త్రీలను, మనకు అర్ధం కాకుండా బ్రతికే వ్యక్తులను, మనకు ఆమోదం కలిగించే విధంగా లేని కొందరి […]

Continue Reading
Posted On :

అదిగో ద్వారక

అదిగో ద్వారక (డా. చింతకింది శ్రీనివాసరావు) -అనురాధ నాదెళ్ల తమ పాలనలో ఉన్న ప్రజలని ఎక్కువ తక్కువ వర్గాలుగా విభజించి, ఆ విభజన బలంతో అదే ప్రజలమీద పెత్తనం చేసే స్వార్థపరులైన అధికారవర్గం, ఆ విభజన వెనుక ఉన్న అసలు తత్త్వం తెలియక తమ అనైక్యతల మధ్య నలుగుతూనే, ఆ అధికారం కింద సతమతమయే ప్రజలు… ఇదేకదా వర్తమాన ప్రపంచంలో ఎక్కడ చూసినా జరుగుతున్నది. అయితే ఈ వర్తమానానికి పునాదిగా బలమైన చరిత్రే ఉంది. అది మహాభారత […]

Continue Reading
Posted On :

అభిమతం

అభిమత -వురిమళ్ల సునంద కవిత్వాన్ని చూడగానే ముందుగా మనసులో కొన్ని రకాల ప్రశ్నలు మెదులుతుంటాయి.. అది సామాజిక బాధ్యత గల కవిత్వమా.. స్వీయానుభవాల వ్యక్తీకరణా? భావోద్వేగాలతో ముడిపడిన స్పందనా… అస్తిత్వ స్పృహ..  సమస్యలకు పరిష్కారమా.. అని ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను వెతికే క్రమంలో ఆయా వ్యక్తులు  రాసిన కవితలను ఆద్యంతం చదవాలనే ఆలోచన  కలుగుతుంది. భైరి ఇందిర గారు 2007 లో ప్రచురించిన కవితా సంపుటి ఇది. తెలంగాణలో మొట్టమొదటి గజల్ రచయిత్రిగా , ఫేస్ బుక్ […]

Continue Reading
Posted On :

పౌలస్త్యహృదయం దాశరథి విజయం – 2

 పౌలస్త్యహృదయం దాశరథి విజయం-2 -వసుధారాణి  హిందీ మూలం: ఆచార్య చతుర్ సేన్ శాస్త్రి,’వయం రక్షామః’ తెలుగు అనుసృజన: శోభిరాల బాలా త్రిపురసుందరి సమీక్ష రెండవ భాగం పౌలస్త్య రావణుని హృదయం నరజాతులన్నింటినీ ఏకీకృతం చేసి వారందని రక్ష సంస్కృతిలో వైదిక ధర్మం ఆచరించేలా చేయటం అన్న యోచనకు బద్ధమై ఉంది.అనుక్షణం అతని నోటినుంచి వెలువడే పదం ‘వయం రక్షామః’ . శూర్పణక భర్త విద్యుజ్జిహ్వుని రక్ష సంస్కృతిలోకి రాలేదు అన్న కారణంగా అతన్ని చంపివేయటం,చెల్లెల్లు ఎంత ప్రియమైనప్పటికీ వయం రక్షామః […]

Continue Reading
Posted On :

కథాతమస్విని-3

కథాతమస్విని-3 అర్ధాంగి రచన & గళం:తమస్విని ***** https://youtu.be/JOsK1_EnX7M తమస్విని -నా పేరు పద్మజ . తమస్విని అనే కలం పేరుతో కవితలు , కథలు రాస్తుంటాను. 2013 నించి కౌముది డాట్ నెట్ లో సంసారంలో సరిగమలు శీర్షికతో కథలు రాస్తున్నాను . మాది గుంటూరు జిల్లా లోని చింతలపూడి అనే గ్రామం . MA Political science చదివాను. హైద్రాబాద్ లో నివాసం. మా వారు ప్రముఖ రచయిత శ్రీ మల్లాది వెంకటకృష్ణ మూర్తి.  […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి-5 (ఆడియో) వాకాటక మహాదేవి (బి. ఎన్. శాస్త్రి నవల)

రామోజు హరగోపాల్ -రామోజు హరగోపాల్‌, కవి, పురాతత్వ పరిశోధకులు, హైదరాబాదు

Continue Reading

జగదానందతరంగాలు-6(ఆడియో) నిజమైన పారితోషికం

జగదానందతరంగాలు-7 నిజమైన పారితోషికం రచన: డాక్టర్ కొచ్చెర్లకోట జగదీశ్ గళం: శ్రీమతి తురగా కనకదుర్గా భవాని నోటిమీద వేలుపెట్టి వారించాను మాట్లాడొద్దని. స్టెతస్కోపుతో చూస్తున్నాను. బాగా గాలి పీల్చుకొమ్మని, అస్సలు మాట్లాడకూడదని ముందే హెచ్చరించాను. అయినా వినదు ఈ మామ్మ. మాట్లాడ్డం ఒక వ్యసనం తనకి. అప్పటికే హాస్పిటల్లో చేరి నెలరోజులు దాటిపోయింది. ఈసారి ఎలాగైనా టేబులెక్కించెయ్యాలి. పాపం, ఎన్నాళ్లని ఇలా పడిగాపులు పడుతుంది? బీపీ తగ్గలేదని, సుగర్ కంట్రోలవ్వలేదని అలా నానుస్తున్నాం. అవి తగ్గకపోతే ఆరోగ్యశ్రీ […]

Continue Reading

వసంతవల్లరి – అతడు-నేను (కె.వరలక్ష్మికథ)

ఆడియో కథలు  అతడు-నేను రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను. పుట్టుకతో వచ్చిన గళానుకరణ. ఉద్యోగవిరమణ స్వచ్ఛందంగా […]

Continue Reading

వెనుతిరగని వెన్నెల(భాగం-15)

వెనుతిరగని వెన్నెల(భాగం-15) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/4DBE8bapHso వెనుతిరగని వెన్నెల(భాగం-15) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు […]

Continue Reading
Posted On :

ఉత్తరాలు-ఉపన్యాసాలు-7 (ఎం.కె.గాంధీ & సుభాష్ చంద్ర బోస్)

ఉత్తరం-7 నీవొక్కడివే యుద్ధాన్ని ఆపగలవు రచయిత: ఎం.కె.గాంధీ స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి   నేపథ్యం: మానవజాతికి పోరాటాలు, యుద్దాలు కొత్త కాదు. కానీ, శాస్త్రవిజ్ఞానం తోడయి ……. రెండవ ప్రపంచ యుద్ధం సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు. ఆ యుద్ధానికి ప్రధాన కారకుడు అడాల్ఫ్ హిట్లర్. ఆ యుద్ధ మేఘాలు అలుముకొన్న దశలో … యుద్ధ ప్రారంభానికి కొద్దికాలం ముందుగా … యుద్ధం మానివేయమని సలహా ఇస్తూ గాంధిజీ హిట్లర్ కు రాసిన […]

Continue Reading

Earthly Bonds (Story)

  Earthly Bonds(Story) Telugu Original & English Translation: Dr. K.Meera Bai Sivayya completed the task of cleaning the bicycle , stood at a distance and examined it. His eyes  reflected the longing of a mother who was looking at her  baby for  the last time after having  carrying it in her womb  for nine months,  giving […]

Continue Reading
Posted On :

జాబిల్లి ఎప్పుడూ ఆడ నే! (మార్గె పియర్సీ-అనువాద కవిత)

జాబిల్లి ఎప్పుడూ ఆడ నే! మూలం: మార్గె పియర్సీ అనువాదం: ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ జాబిల్లి ఎప్పుడూ ఆడ నే! ఈ రేజర్ బ్లేడ్ల నడుమ లోయలో నా ఆడతనాన్ని అలానే దుస్తుల్లా మార్చుకొంటూండాలని ఉంది… ఏం,ఎందుక్కూడదు? మగాళ్ళెప్పుడూ తమ మగతనాన్ని తొడుక్కొనే ఉంటారా? ఆ ఫాదరీ, ఆ డాక్టరు, ఆ మాష్టారు అందరూ విలింగతటస్థభావంలో నత్తగుల్లల్లా తమ వృత్తులకు హాజరవుతున్నామంటారా? నిజానికి నేను పనిలో ఉన్నప్పుడు ఏంజిల్ టైగర్ లా స్వచ్ఛంగా ఉంటాను చూపు స్పష్టంగా […]

Continue Reading

తండ్రీ, కూతురూ (కవిత)

తండ్రీ, కూతురూ -చెరువు శివరామకృష్ణ శాస్త్రి ఆనాడు అల్లరి చేసే పిల్ల ఈనాడు చల్లగ చూసే తల్లి ఆనాడు ముద్దులొలికే బంగరు బొమ్మ నేడు సుద్దులు చెప్పే చక్కని గుమ్మ నీ పసితనమున నీకు అన్నం తినిపించబోతే నీ చిన్ని చేతులతో తోసి వేసినావు మారం చేసినావు, హఠం చేసినావు కథలూ కబుర్లు చెప్పి, నిను మాయ చేసినాను. కాలము కరుగగ, ఈ మలి వయసులో చేయూత నిచ్చావు, నాకు అన్నం తినిపించావు చదువు కోకుండా, ఆడుతూ […]

Continue Reading

ఆత్మీయ నేస్తం (కవిత)

ఆత్మీయ నేస్తం -ములుగు లక్ష్మీ మైథిలి ప్రతి ఉదయం అలారమై పిలుస్తుంది బ్రతకడానికి పాచిపని అయినా ఇంటి మనిషిలా కలిసిపోతుంది ఒక్క చేత్తో ఇల్లంతా తీర్చిదిద్దుతుంది నాలుగు రోజులు రాకపోతే డబ్బులు తగ్గించి ఇచ్చే నేను.. ఇప్పుడు లాక్ డౌన్ కాలంలో పనంతా నా భుజస్కంధాలపై వేసుకున్నా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ పని మొత్తం చిటికెలో చేసేది నిత్యం ముంగిట్లో ముగ్గులు ఆమె రాకను తెలియచేస్తాయి పెరట్లో చిందరవందరగా వేసిన గిన్నెలన్నీ ఒద్దికగా బుట్టలో చేరేవి ఒక్కోరోజు […]

Continue Reading

దుఃఖ మోహనం (కవిత)

దుఃఖ మోహనం -ఐ.చిదానందం నీవెప్పుడు ఏడవాలనుకున్నా నిస్సంకోచంగా ఏడ్చేయ్ దుఃఖాన్ని వర్షపు నీటిలో తడిపేయ్ కానీ మద్యంలో తేలనీయకు ఏడ్వలనిపించినప్పుడల్లా ఏడ్చేయ్ కానీ ఈ లోకానికి  దూరంగా వెళ్లి ఏడ్వు ప్రతి దుఃఖాన్ని వెలకట్టే ఈ దుష్టప్రపంచం నీ గొంతుతో ఎప్పటికీ గొంతు కలపదు ఈ లోకం మాటలు ఒట్టి ఓదార్పులు నీ హృదయంలో సంతోషం మొలిచే వరకు ఏడ్వు నీ గుండె లో ఆవేదన తొలిగే వరకు ఏడ్వు నీ బాధను చూసి ఎప్పుడైతే ఈ లోకం […]

Continue Reading
Posted On :

ప్రత్తిపాటి నానీలు (కవిత)

ప్రత్తిపాటి నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి నా ఉనికి నిశ్శబ్దం! కానీ నా రాతలు మాత్రం ఓ శబ్దస్పర్శే!! వేలభావాలు తోడుతున్నాను! చిత్రంగా గుండెబావి ఊరుతూనే ఉంది!! కలం విప్లవానికి తొలి గళం! సంఘం గుట్టు విప్పుతుంది కదా! కాలం కరిగిపోతోంది!! ఆయువు కూడా తరిగిపోతోంది!! చందమామ మెరిసిపోతున్నాడు!! మకిలిలేని.కొత్తగాలి కమ్ముతోందిగా!! అంతులేని విశ్రాంతిలో ఆయనకు నడక! అలసటతో.. ఆమె పడక! ***** ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా […]

Continue Reading

బతుకు బీడీలు (కవిత)

బతుకు బీడీలు -అశోక్ గుంటుక నా పెళ్లిచూపుల్లో నాన్నకెదురైన మొదటి ప్రశ్న “అమ్మాయికి బీడీలు వచ్చు కదా ?” లోపల గుబులున్నా నేనపుడే అనుకున్నా జవాబు వారికి నచ్చేనని కట్నం తక్కువే ఐనా నేనే ఆ ఇంటి కోడలయ్యేనని………. నీటిలో తడిపి కొంచెం ఆరిన తునికాకు కట్టల్ని బీడీలు చుట్టే ఆకుగా కత్తిరించాక ఒక్కో ఆకులో కాసింత తంబాకు పోసి బీడీలుగా తాల్చి దారం చుట్టేది……. ఈ రోజుకివ్వాల్సిన వేయి బీడీల మాపుకి తక్కువైన నాలుగు కట్టల […]

Continue Reading
Posted On :

వర్షానికి ప్రేమ లేఖ (కవిత)

వర్షానికి ప్రేమ లేఖ -వెంకటేష్ పువ్వాడ ఒక ఉష్ణ ధామ హృదయం ఊసులు బాసలు ఉడుకుతున్న సాయంకాలం వేల దేహమంతా పగుళ్లు ఉచ్వాశ నిశ్వాసాలనిండా విరహ గేయం పశ్చిమ మలయ మారుత వింజామరాల హాయి లాలనలో లోలనమై ఊగుతున్న క్షణాన ఒక కణాన సంధ్య తో సంధి కుదిరింది కుదరక ఏంచేస్తుంది ఇద్దరి రందీ ఒకటే మరి అల గడ్డి పోచల మెత్త పై వొళ్ళు వాల్చి కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నా మబ్బుల పందిరికేసి మరో […]

Continue Reading

ఊరుపిలుస్తుంది (కవిత)

ఊరుపిలుస్తుంది -కె.రూపరుక్మిణి అది నివాస స్థలమే నల్లని మేఘాలు ఆవరించాయి చుట్టూ దట్టమైన  చీకటి గాలులు ఎక్కడా నిలబడే నీడ కూడా  దొరకడం లేదు కడుపు తీపి సొంత ఊరిని  అక్కడి మట్టి వాసనను గుర్తుచేస్తుంది ఊరు *ప్రేమ పావురం* లా మనసున  చేరి రమ్మని పిలుస్తోంది ఆ ..నల్లని దారుల్లో ఎక్కడి నుంచో  వలస పక్షులు దారికాచుకుంటూ రక్తమోడుతూ వస్తున్నాయి చూపరులకు ఎదో *కదన భేరీ* మ్రోగిస్తున్నట్లుగా  గుండేలవిసేలా నిశ్శబ్ద శబ్దాన్ని వినిపిస్తున్నాయి ఏ దారిలో […]

Continue Reading
Posted On :

నలుపు (కవిత)

నలుపు -గిరి ప్రసాద్ చెల మల్లు నేను నలుపు నా పొయ్యిలో కొరకాసు నలుపు రాలే బొగ్గు నలుపు నాపళ్లని ముద్దాడే బొగ్గు పొయ్యిమీది కుండ  నలుపు నాపొయ్యిపై పొగచూరిన  తాటికమ్మ నలుపు కుండలో బువ్వ నా దేహదారుఢ్య మూలం నల్లని నాదేహం నిగనిగలాడే నేరేడు నల్లని నేను కనబడకపోతే ఎవ్వరిని నల్లగా చేయాలో తెలీక సూరీడు తికమక సూరీడు  తూర్పునుండి  పడమర నామీదుగానే పయనం పొద్దుని చూసి కాలం చెప్పేంత స్నేహం మాది నా పందిరిగుంజకి […]

Continue Reading

ప్రకృతి నా నేస్తం (కవిత)

ప్రకృతి నా నేస్తం -యలమర్తి అనూరాధ పువ్వు నన్ను అడిగింది  దేవుని పాదాలచెంతకు నన్ను తీసుకెళ్ళావూ అని  గోడ నాకు చెప్పింది  బంధాలకూ అనుబంధాలకూ తాను అడ్డుగోడ కానని పక్షి నాతో గుసగుసలాడింది మాటలు రాకపోయినా కువకువల భాష తమకుందని  శునకం కాళ్ల దగ్గర చేరింది బుద్ధివంకరకు కాదు విశ్వాసానికి గుర్తుగా తమని చూపమని చెట్టు నన్ను స్పృశించింది  గాలి ,నీడ ,పండు సరిగా అందుతున్నాయా అని  ఆకాశం నా నీలికళ్ళతో ఊసులాడింది  నీకూ నాకూ మధ్యన […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-2

రాగో భాగం-2 – సాధన  గోటుల్ ముందు కూచున్న వాళ్ళల్లో కూడ రకరకాల ఆలోచనలున్నయి. లచ్చుకు ఎటూ తేలకుండా ఉంది. నాన్సుకు మొదటి పెళ్ళి పెళ్ళాముంది. పెళ్ళయి మూడేళ్ళైనా కోడలు కడుపు పండకపోవడంతో నాన్సుకి మరోపిల్లను తెస్తే బాగుండుననే ఆలోచన లచ్చుకు లేకపోలేదు. అందుకే వరసైన రాగో వస్తానంటుందంటే నాన్సును తాను వారించలేదు. రాగోకైనా సంతానమైతే తన ఇల్లు నిలబడుతుందనేది లచ్చు ఆపతి. అయితే రాగో తండ్రి దల్సు మొండిగా వ్యవహరించి పిల్లను ససేమిరా ఇయ్యనని మేనవారికి […]

Continue Reading
Posted On :

శిథిలం కాని వ్యర్థాలు (మార్గరెట్ ఎట్ వుడ్ కథ)

తెనిగీయం-3  శిధిలం కాని వ్యర్ధాలు ఆంగ్ల మూలం: మార్గరెట్ ఎట్ వుడ్ స్వేచ్ఛానువాదం: అరుణజ్యోతి  వెయిట్రస్ అమ్మాయిలను చూస్తె ఎండకు ఒడ్డుకువచ్చి సేదతీరుతున్న సీల్స్ లా కనిపిస్తున్నారు. నూనె పట్టించిన వారి గులాబి శరీరాలు మెరుస్తున్నాయి. అది సాంయంకాల సమయం. ఆందరూ బాతింగ్ సూట్స్లో వున్నారు. డాని కళ్ళార్పకుండా వారినే చూస్తున్నారు. బైనార్కులర్స్ మాంటి దగ్గర అద్దెకు తీసుకున్నాడు. డాని చాలాసేపటి నుంచి చూడవలసిన దృశ్యాలన్ని చూసేశాడు. అయినా ఇచ్చిన డబ్బులు పూర్తిగా రాబట్టుకోవాలి కాబట్టి ఇంకా ఇంకా […]

Continue Reading
Posted On :

విషాద నిషాదము-9 (చివరి భాగం)

విషాద నిషాదము నవమ భాగము – స్వర నీరాజనాలు -జోగారావు ఏమిచ్చిందీ జీవితం ? రోషనారాకు ? అన్నపూర్ణాదేవి కి ? పదునాల్గేళ్ళ వయసు వరకు తండ్రి అదుపాజ్ఞలలో ఉంటూ, నేర్చుకున్న సంగీత విద్య తదుపరి డెభ్భయ్యేడేళ్ళ జీవితానికి పునాది వేసింది. కానీ…ఆ తరువాత డెభ్భయ్యేడేళ్ళ జీవితము విషాద భరితమే అయ్యింది . సుఖము, సంతోషము, ఆనందము, ఉల్లాసము దూరమైన దుర్భర జీవితమే అయ్యింది కదా ! నేర్చుకున్న సంగీతమే ఆమె అంతిమ శ్వాస వరకూ తోడుగా […]

Continue Reading
Posted On :

యదార్థ గాథలు- కష్టాలకు కళ్ళెం

యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి కష్టాలకు కళ్ళెం విరిత, వాళ్ళన్న శేఖర్ ఎప్పుడూ ఒక్కక్షణం కూడా విడిచి వుండేవారు కాదు. బి.టెక్. చదువుతున్న విరితకి ఏ సందేహం వచ్చినా శేఖర్ చిటికలో దాన్ని తీర్చేవాడు. ఇద్దరికీ ఒకళ్ళంటే ఒకరికి చాలా ప్రాణం.  అన్నా నేను చదువయ్యాక మంచి ఉద్యోగం చేస్తాను. బాగా సెటిల్ అయ్యాక పెళ్ళి చేసుకుంటాను అంది. దానికి శేఖర్ ఎందుకమ్మా… నీకు ఉద్యోగం చెయ్యాల్సిన  అవసరం ఏముంది…? చక్కగా చదువయ్యాక కొన్నాళ్ళు ఎంజాయ్ చెయ్యి […]

Continue Reading

అనుసృజన-నిర్మల-8

అనుసృజన నిర్మల (భాగం-8) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ మూడు రోజులు గడిచినా తోతారామ్ ఇంటికి రాలేదు.రుక్మిణి రెండు పూటలా ఆస్పత్రికి వెళ్ళి మన్సారామ్ ని చూసి వస్తోంది.పిల్లలిద్దరూ అప్పుడప్పుడూ వెళ్తున్నారు,కానీ నిర్మల ముందరి కాళ్ళకి కనిపించని బంధం! ఆడబడుచుని అడిగితే ఎత్తిపొడుస్తూ ఏదో ఒకటి అంటుంది.పిల్లలు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఒకరోజు జియారామ్ రాగానే అతన్ని మన్సారామ్ పరిస్థితి ఎలా ఉందని అడిగింది.మొహం వేలాడేసుకుని,” ఇద్దరు ముగ్గురు డాక్టర్లు వచ్చారు.ఏం చెయ్యాలని సంప్రదింపులు జరిగాయి.ఒక […]

Continue Reading
Posted On :

చిత్రలిపి-కర దీపిక

చిత్రలిపి కర దీపిక -మన్నెం శారద యవ్వనం ఉరకలేస్తున్నప్పుడు మనసు ముందుకే ఉరకలు వేస్తుంది సై అంటే సై అని కాలు దువ్వుతూనే ఉంటుంది పర్వతాలని అధిరోహించాలని పైపైకి ఎగబాకాలని సవాళ్ళని ఎదుర్కోవాలని అందరికన్నా ముందు నిలవాలని కొండమీద జెండా పాతాలని ఎన్నో కలలు ! మరెన్నో ఆశలు ! అలుపెరుగని పయనం ఇప్పుడిక ప్రొద్దుగుంకుతున్నది , పగలంతా ప్రచండం గా వెలిగిన వెలుగులిప్పుడు ఎర్రబడి ఆనక  నల్లబారుతున్నాయి అధిరోహణవెంట  అవరోహణ అంటుకునే ఉంటుంది ఎత్తులక్రింద లోయల […]

Continue Reading
Posted On :

వసంత కాలమ్ -6 పలుకేబంగారాలు

పలుకేబంగారాలు -వసంతలక్ష్మి అయ్యగారి అమ్మలదినం .. అయ్యలదినం తోబుట్టువుల దినం స్నేహదినం డాక్టర్లదినం , యాక్టర్లదినం యీ క్రమంలో నోటిదినం అంటూ యింకా పుట్టలేదుకదా! ఏమైనా ప్రస్తుత కాలంలో సర్వేంద్రియాణాం నోరే ప్రధానం!!పదునైనదానోరు. స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన వాక్కు ను వెలువరించేదానోరే కదా! అవతలి మనిషిని ఆకట్టుకొనేదీ ఆ నోరే..అల్లంత ఆవలికి నెట్టేసేదీఆ నోరే! మన జీవితంలో ఎన్నిరకాలు తింటున్నామో..అన్ని రకాల నోటితీరులు ..మాటతీరులు చూస్తుంటాం. ముందుగా బాహ్యప్రపంచానికి చెందినవి. రాజకీయనాయకుల ఉపన్యాసాలు..హెచ్చు శృతి ..అధిక శ్రమ..వాళ్ళ […]

Continue Reading

జలపాతం (పాటలు) -3 తూరుపోడో చందురయ్య

https://youtu.be/FETIjpvoc3k జలపాతం (పాటలు) -3 తూరుపోడో చందురయ్య -నందకిషోర్ కట్టమీదీ కన్నె బొత్తాకన్నె బొత్తల్ల కేరి గెబ్బెకేరిగెబ్బెల కల్లుదాగు పిలగోతూరుపోడో చందురయ్య ఎడ్లు ఎడ్లు కూడిరాంగదుక్కిటెడ్లు దున్నిరాంగకాలి దుమ్ము కంట్లపాడె పిలగోతూరుపోడో చందురయ్య |కట్టమీదీ| బువ్వ తింటే బుడ్డు బుడ్డుగడక తింటే గంజి గంజిరొట్టె తింటె రోత పుట్టే పిలగోతూరుపోడో చందురయ్య దగ్గరుంటే వెచ్చ వెచ్చదూరముంటే పచ్చి పచ్చిపాడు ఈడు కచ్చగట్టె పిలగోతూరుపోడో చందురయ్య |కట్టమీదీ| నీళ్ల రేవు నీళ్లు ముంచినీళ్లబిందే లెత్తుకుంటేఅల్లిపువ్వు అలిగినాది పిలగోతూరుపోడో చందురయ్య […]

Continue Reading
Posted On :

ఒక భార్గవి – కొన్ని రాగాలు -6 ( సింధుభైరవి )

ఒక భార్గవి – కొన్ని రాగాలు -6 సింధుభైరవి -భార్గవి భైరవి అనేది శక్తి స్వరూపమైన దేవికి వున్న నామాలలో ఒకటి, అందుకేననుకుంటా అమ్మవారి మీద రాసిన ఎన్నో కృతులు ఈ రాగంలో స్వరపరచ బడ్డాయి, పైగా ఈ రాగంలో భక్తి రసం బాగా పలుకుతుండటం కూడా దానికి దోహదం చేసి వుండవచ్చు ఇది శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన అనేక ప్రత్యేకతలున్న ఒక రాగం. హిందుస్థానీలో భైరవి అనీ, కర్ణాటక లో సింధు భైరవి అనీ పిలుస్తారు.  […]

Continue Reading
Posted On :

జానకి జలధితరంగం-10

జానకి జలధితరంగం-10 -జానకి చామర్తి శూర్పణఖ పురాణాలు పుణ్యగ్రంధాలు చదవడం పారాయణం చేయడం వల్ల తప్పకుండా భక్తిభావము  మంచి పని చేస్తున్నామన్న తృప్తి  భగవంతునకు చేరువగా ఉంటున్నామన్న సంతోషము  కలుగుతాయి. అది అందరకీ అనుభవైక వేద్యమే. కాని , లౌకిక జీవితంలో దారితప్పకుండా చేయగలిగే జీవన ప్రయాణంలో అవి మనకి ఎంత తోడు , ఎంత ఉపయోగం. గాంధీజీ తనకు ఏదైనా సమస్యో ధర్మ సంకటమో ఎదురైనపుడు “ భగవద్గీత” తీసి , అందులో ఏదొక శ్లోకం […]

Continue Reading
Posted On :