image_print

యాత్రాగీతం-62 హవాయి- మావీ ద్వీపం (భాగం-3)

యాత్రాగీతం హవాయి దీవులు – మావీ ద్వీపం (భాగం-3) రోజు -3 -డా||కె.గీత మూడవ రోజు మావీలో ప్రసిద్ధి గాంచిన చారిత్రాత్మక  ప్రదేశమైన “లహైనా” లో రకరకాల యాక్టివిటీస్ కోసం ఉదయానే బయలుదేరాం. ఉదయం అల్పాహారం కోసం కూడా లహైనాకే వెళ్లాలని నిర్ణయించుకున్నాం. 9గం.ల ప్రాంతంలో డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ సందర్శన, జిప్ లైన్, ఆక్వా బాల్ వంటి సాహసాలు బుక్ చేసుకున్నందున 8 గం.లకే  రిసార్టులో బయలుదేరాం. అయితే ఆ రోజు అనుకోకుండా జరిగిన ఓ […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-61 హవాయి- మావీ ద్వీపం (భాగం-2)

యాత్రాగీతం హవాయి దీవులు – మావీ ద్వీపం -హాలేకలా నేషనల్ పార్కు (భాగం-2) రోజు -2 -డా||కె.గీత హవాయీ దీవుల్లోకెల్లా బిగ్ ఐలాండ్ తరువాత రెండవ అతి పెద్ద ద్వీపం మావీ. దాదాపు 730 మైళ్ళ విస్తీర్ణం కలిగినది. మావీ నిజానికి అయిదు ద్వీపాల సమూహం. అవి మావీ, మలోకై, లానై, కహోలవే, మలోకినీ (Maui, Molokaʻi, Lānaʻi, Kahoʻolawe, Molokini) ద్వీపాలు. హవాయీ జానపద గాథల్లోని ప్రఖ్యాత వీరుడైన “మావీ” పేరు మీదుగా ఈ ద్వీపానికి […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-60 హవాయి- మావీ ద్వీపం (భాగం-1)

యాత్రాగీతం హవాయి దీవులు – మావీ ద్వీపం (భాగం-1)రోజు -1 -డా||కె.గీత ప్రయాణం:మొదటిసారి హవాయిలో బిగ్ ఐలాండ్ ని చూసొచ్చిన అయిదేళ్ళకి గానీ మళ్ళీ హవాయికి వెళ్ళడానికి కుదరలేదు మాకు. అందుకు మొదటి కారణం వెళ్ళిరావడానికి అయ్యే ఖర్చు కాగా, రెండోది అందరికీ కలిసొచ్చే సెలవులు లేకపోవడం. ఏదేమైనా ఇక్కడ జూలై నెలలో కాస్త ఖరీదెక్కువైనా వేసవిలో పిల్లలందరికీ సెలవులు కావడంతో ఈ సారి అందరినీ తీసుకుని వెళ్ళాం. ఎలాగైనా కుటుంబంతా కలిసి వెళ్తే ఉండే ఆనందమే […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-59 అమెరికా నించి ఆస్ట్రేలియా (చివరి భాగం)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (చివరి భాగం) (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత మెల్ బోర్న్ – రోజు 3 (ట్రామ్ & సాహితీ మిత్రుల కలయిక) & రోజు- 4 (అమెరికా తిరుగుప్రయాణం)  మెల్ బోర్న్ లో మూడవ రోజున మధ్యాహ్నం వరకు యర్రా నది మీద బోట్ […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-58 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-19)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-19 మెల్ బోర్న్ – రోజు 3 మెల్ బోర్న్ సిటీ హైలాండ్స్ బోట్ టూర్ మర్నాడు మా ప్యాకేజీ టూరులో మేం ఎంపిక చేసుకున్న ప్రైవేట్ మెల్ బోర్న్ సిటీ టూరు క్యాన్సిల్ అవడంతో రోజంతా ఖాళీ […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-57 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-18)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-18 మెల్ బోర్న్ – రోజు 2- క్వీన్ విక్టోరియా మార్కెట్- ఫిలిప్ ఐలాండ్ – పెంగ్విన్ పెరేడ్ టూరు తరువాయి భాగం  బ్రైటన్ నించి మరోగంట పాటు ప్రయాణించి మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతానికి మూన్లిట్ జంతు సంరక్షణాలయానికి […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-56 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-17)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-17 మెల్ బోర్న్ – రోజు 2 – క్వీన్ విక్టోరియా మార్కెట్- ఫిలిప్ ఐలాండ్ – పెంగ్విన్ పెరేడ్ టూరు మెల్ బోర్న్ లో రెండో రోజు మేం ప్యాకేజీటూరులో భాగంగా మొదటి టూరైన ఫిలిప్ ఐలాండ్ […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-55 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-16)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-16 మెల్ బోర్న్ – రోజు 1 మెల్ బోర్న్ లో వాతావరణం సిడ్నీ కంటే చల్లగా ఉంది. చల్లదనంలో  ఇంచుమించుగా మా శాన్ ఫ్రాన్ సిస్కోతో సమానంగా అనిపించింది. కెయిర్న్స్ లోని వేడిమి, ఉక్కపోతల నించి రెండు […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-54 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-15)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-15 కెయిర్న్స్ నించి మెల్ బోర్న్ కి గ్రేట్ బారియర్ రీఫ్ టూరు నించి వెనక్కి వచ్చే పడవలో పిల్లలు దారంతా నిద్రపోతూనే ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నంతసేపు మధ్యాహ్న సమయానికి అందరికీ జెట్ లాగ్ చుట్టుముట్టేది. మూడు, నాలుగు […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-53 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-14)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-14 గ్రేట్ బారియర్ రీఫ్ టూరు (Great Barrier Reef Tour) తరువాయిభాగం  దాదాపు పదిన్నర ప్రాంతంలో ఫిట్జ్ రాయ్ ద్వీపానికి (Fitzroy Island) చేరుకున్నాం. ఇక్కడ కొందరు దిగి, మరి కొందరు ఎక్కారు. ఈ ద్వీపంలో కూడా […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-52 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-13)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-13 గ్రేట్ బారియర్ రీఫ్ టూరు (Great Barrier Reef Tour)  గ్రాండ్ కురండా టూరు నించి వచ్చిన సాయంత్రం హోటలు దాటి రోడ్డుకావలగా ఉన్న థాయ్ రెస్టారెంటుకి వెళ్ళి వెజ్ స్ప్రింగ్ రోల్స్, టోఫూ రోల్స్, హోల్ […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-51 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-12)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-12 గ్రాండ్ కురండా టూరు (Grand Kuranda) తరువాయి భాగం  దాదాపు పదిన్నర ప్రాంతంలో కురండా స్టేషనుకి చేరుకున్నాం. రైల్లో ఇచ్చిన వివరాల అట్టలోని ప్రతి ప్రదేశం వచ్చినప్పుడల్లా సమయాన్ని రాసిపెట్టాడు సత్య. చివర్లో మేం అందరం ఆటోగ్రాఫులు […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-50 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-11)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-11 గ్రాండ్ కురండా టూరు (Grand Kuranda)  కెయిర్న్స్ లోని ఇండియన్ రెస్టారెంటులో రాత్రి భోజనం మెన్యూలో అత్యంత ప్రత్యేక మైన రెండు ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి నలభై డాలర్ల ఖరీదైనవి. ఒకటి కంగారూ మాంసం, రెండు మొసలి […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-49 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-10)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-10 సిడ్నీ నించి కెయిర్న్స్ ప్రయాణం బ్లూ మౌంటెన్స్ డే ట్రిప్ కి వెళ్లొచ్చి హోటలుకి తిరిగి చేరేసరికి సాయంత్రం ఆరు గంటలు కావొచ్చింది. పిల్లల్ని వదిలి కాఫీ తాగుదామని బయటికి వచ్చి మళ్ళీ మార్కెట్ సిటీ ప్రాంతాని […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-48 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-9)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-9 బ్లూ మౌంటెన్స్ డే ట్రిప్ (Blue Mountains Day Trip) తరువాయి భాగం  మరో అయిదునిమిషాల తరవాత త్రీ  సిస్టర్స్ శిలల్ని వెనుక నుంచి చూడగలిగిన బుష్‌ ట్రయిల్ దగ్గిర ఆగేం. అయితే రహదారి సరిగా లేనందు […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-47 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-8)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-8 బ్లూ మౌంటెన్స్ డే ట్రిప్ (Blue Mountains Day Trip) సిడ్నీ పరిసర ప్రాంతాల్లో చూడవలసిన ముఖ్యమైన ప్రాంతం బ్లూ మౌంటెన్స్. సిడ్నీ నుంచి డే ట్రిప్స్ ఉంటాయి. కానీ సీజనులో ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-46 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-7)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-7 సిడ్నీ (రోజు-2)సిటీ టూర్ తరువాయి భాగం మొత్తం సిడ్నీ సిటీ టూరులో ఒకట్రెండు చోట్ల మాత్రమే దిగి నడిచేది ఉంది. మొదట  ఓపెరా హౌస్ , హార్బర్ బ్రిడ్జి లని పక్కపక్కన ఆవలి తీరం నించి చూడగలిగే […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-45 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-6)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-6 సిడ్నీ (రోజు-2) సిటీ టూర్ మేం సిడ్నీ చేరుకున్న రెండో రోజు ప్యాకేజీ టూరులో భాగమైన “సిడ్నీ లగ్జరీ సిటీ టూర్”  చేసేం. అప్పటికే సిడ్నీలో మేం చూసేసిన సర్క్యులర్ కే ప్రాంతంలోని ఓపెరా హౌస్ , […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-44 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-5)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-5 సిడ్నీ (రోజు-1 తరువాయి భాగం) ఓపెరాహౌస్ సమక్షంలో పుట్టినరోజు ప్రారంభం కావడం భలే ఆనందంగా అనిపించింది. ఆ ఏరియాని సర్క్యులర్ కే (Circular Quay) అంటారు. అంటే సముద్రం లోపలికి అర్థ వృత్తాకారంలోకి చొచ్చుకుని వచ్చిన ప్రాంతమన్నమాట. […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-43 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-4)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-4 ప్రయాణం మా ఇంటి నుంచి శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్టు ట్రాఫిక్ లేని వేళల్లో సరిగ్గా గంట వ్యవధిలో ఉంటుంది. ముందు చెప్పినట్టుగా మేం ముందుగా శాన్ఫ్రాన్సిస్కో నించి లాస్ ఏంజిల్స్ వెళ్లి అక్కణ్ణించి సిడ్నీ వెళ్లాలి. సాయంత్రం 5 […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-42 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-3)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-3 లగేజీ ఏ టూరుకి వెళ్ళినా లగేజీ ఒక పెద్ద సమస్యే. ‘అసలు అక్కడి వాతావరణానికి ఏం బట్టలు వేసుకోవాలి? ఎన్ని జతలు పట్టుకెళ్ళాలి?’ లాంటి ప్రశ్నలతో మొదలయ్యి చివరికి ‘ఎన్ని కేజీలు పట్టుకెళ్ళనిస్తారు’ తో ముగుస్తుంది. నిజానికి […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-41 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-2)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-2 వీసా ప్యాకేజీ టూరుకి డబ్బులు కట్టిన తరువాత వీసా రాకపోతే, లేదా సరైన సమయానికి రాకపోతే కలిగే నష్టం కంటే వీసా వచ్చిన తరువాత ప్యాకేజీ టిక్కెట్లు కొనుక్కుంటే వచ్చే నష్టమే తక్కువ. కాబట్టి మేం వీసా […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-40 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-1)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-1           కాలిఫోర్నియాలో గత పదిహేనేళ్లుగా నివాసం ఉంటున్న మాకు ప్రపంచయాత్రలు చెయ్యాలనే కోరిక ఇన్నాళ్ళకి నెరవేరే అవకాశం వచ్చింది. ఇలా ఇతర దేశాలకు వెళ్లాలంటే మాకున్న సమస్యలు ఇప్పటి వరకు రెండు. […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-39 (బహామాస్ – భాగం-10) బహామాస్ క్రూజ్ రోజు -4 చివరిభాగం

యాత్రాగీతం బహామాస్  -డా||కె.గీత భాగం-10 బహామాస్ క్రూజ్ (రోజు -4, చివరిభాగం)           నాసో నగర సందర్శన పూర్తయిన రోజు క్రూయిజ్ లో రాత్రి భోజనం ప్రత్యేకమైనది. ఫార్మల్ దుస్తులు వేసుకుని రెస్టారెంటులో సీటు రిజర్వ్ చేసుకుని చేసే భోజనం అన్నమాట. మగవారు సూటు, బూటు లేదా కనీసం ఫుల్ హాండ్ షర్టు ఇన్ షర్టు చేసుకుని, బూట్లు వేసుకుని, ఆడవారు చక్కని గౌన్లు వేసుకుని చక్కగా తయారయ్యి మరీ భోజనానికి […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-38 (బహామాస్ – భాగం-9) బహామాస్ క్రూజ్ రోజు -3 భాగం-2

యాత్రాగీతం బహామాస్  -డా||కె.గీత భాగం-9 బహామాస్ క్రూజ్ (రోజు -3, భాగం-2)           అక్కణ్ణించి సిడ్నీ పోయిటర్ బ్రిడ్జి మీదుగా నాసోని ఆనుకుని ఉన్న పారడైజ్ ద్వీపంలోని అట్లాంటిస్ (Atlantis) లగ్జరీ  కేసినో & రిసార్ట్ సందర్శనానికి తీసుకెళ్ళేరు. వ్యానులో నుంచి దిగిన మొదటి ప్రదేశం అది కావడంతో పిల్లలు హుషారుగా పరుగులు తీసేరు. ప్రాచీన ఈజిప్ట్ కళాకృతిలో నిర్మించబడిన అధునాతనమైన అతి పెద్ద రిసార్ట్ అది. మధ్య బ్రిడ్జితో కలపబడిన […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-37 (బహామాస్ – భాగం-8) బహామాస్ క్రూజ్ రోజు -3

యాత్రాగీతం బహామాస్  -డా||కె.గీత భాగం-8 బహామాస్ క్రూజ్ (రోజు -3, భాగం-1)           మర్నాడు ఉదయం ఎనిమిది ప్రాంతంలో మా నౌక “నాసో” నగరపు ఒడ్డున ఆగింది. ఇక్కణ్ణించి ఊళ్లోకి వెళ్ళడానికి పడవ మీద వెళ్లనవసరం లేదు. నౌక ఆగేందుకు వీలుగా షిప్ యార్డ్ ఉంది ఇక్కడ. మేం ఆ రోజంతా నాసో నగరంలో డే టూరుకి వెళ్తామన్నమాట.  ముందుగా ఏ టూర్లు కావాలో బుక్ చేసుకున్న ప్యాకేజీ కాబట్టి మేం […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-36 (బహామాస్ – భాగం-7) బహామాస్ క్రూజ్ రోజు -2

యాత్రాగీతం బహామాస్  -డా||కె.గీత భాగం-7 బహామాస్ క్రూజ్ (రోజు -2)           మర్నాడు ఉదయం మేం లేచేసరికి మా ఓడ బహమాస్ టూరులోని మొదటి దీవికి సమీపంలో సముద్రంలో లంగరు వేసి ఆగి ఉంది.  అక్కణ్ణించి మేం చిన్న బోట్ల ద్వారా అతిచిన్న ప్రైవేట్ ఐలాండ్ కి చేరుకోవాలి. రోజల్లా అక్కడే ఉండాలి కాబట్టి అవసరమైన సామాన్లు పట్టుకుని వెళ్ళాలి. ముఖ్యంగా స్విమ్మింగు, స్నోర్కలింగు వంటివి చేసే ప్రదేశం కాబట్టి మార్చుకుందుకు […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-35 (బహామాస్ – భాగం-6) క్రూజ్ రోజు -1

యాత్రాగీతం బహామాస్  -డా||కె.గీత భాగం-6 బహామాస్ క్రూజ్ (రోజు -1)           మర్నాడు ఉదయం 11 గం.లకి మేం బహమాస్ క్రూజ్ టూరు కోసం మయామీ షిప్పుయార్డులో షిప్పు ఎక్కాల్సి ఉంది.  మయామీలో మేం బస చేసిన హోటల్ లో బ్రేక్ ఫాస్టు చేసి  రెంటల్ కారు తిరిగి ఇవ్వడానికి ఎయిర్పోర్టుకి వెళ్లాలి. కారు తిరిగిచ్చేసేక మళ్లీ వెనక్కొచ్చి మిగతా అందరినీ పికప్ చేసుకోవడానికి మళ్ళీ ఏ టాక్సీ నో  తీసుకోవాలి. […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం(మెక్సికో)-12 (కాన్ కూన్)

యాత్రాగీతం(మెక్సికో)-12 కాన్ కూన్ ( చివరి భాగం) -డా||కె.గీత మర్నాడే  మా తిరుగు ప్రయాణం.  ఆ రోజుతో కాన్ కూన్ లో చూడవలసిన ప్రదేశాలు చూడడం, చెయ్యవలసిన  ఎడ్వెంచర్  టూర్లు  చెయ్యడం, అన్నీ అనుకున్నట్టుగా అయ్యేయి.  అంత వరకు బయట అన్నీ చూసేం గానీ మా రిసార్టు లో విశేషాలు ఏవీ చూడలేదు.  కాబట్టి ఆరోజు అందుకోసం కేటాయించేం. అంతే కాదు సముద్ర తీరంలోనే ఉన్నా ఇసుకలో అడుగులు మోపి నాలుగడుగులు కూడా వెయ్యలేదు.  ఇంకేం పొద్దున్నే […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం(మెక్సికో)-11 (కాన్ కూన్ -సిటీ టూర్- మార్కెట్-28)

యాత్రాగీతం(మెక్సికో)-11 కాన్ కూన్ (సిటీ టూర్- మార్కెట్-28) -డా||కె.గీత భాగం-13 ఇక మా తిరుగు ప్రయాణం రెండు రోజుల్లోకి వచ్చేసింది. మర్నాడు కాన్ కూన్ లో అప్పటివరకూ సిటీ టూర్ చెయ్యలేదు మేం.  అంతే కాదు,  అప్పటివరకూ టాక్సీల్లో, టూరు బస్సుల్లోనే తిరిగేం కానీ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఎలా ఉంటుందో చూడలేదు. కానీ పిల్లలతో బస్సుల్లో తిరగడం జరిగే పని కాదు కాబట్టి పిల్లలిద్దరినీ రూములోనే వదిలేసి మేమిద్దరమే బయలుదేరుదామని అనుకున్నాం. ముందు సత్య వెళ్లాలనుకున్న […]

Continue Reading
Posted On :