image_print

యుద్ధం ఒక గుండె కోత-17 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-17 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి ఖాండవ దహనంతోగాని జఠరాగ్ని చల్లారని ఈ మహానలానికి శాంతి ఎప్పుడు కలుగుతుందో? ఎన్ని ప్రాణాల్ని పుడిసిటపట్టి ఔపోసన పడ్తే చల్లారుతుందో? ఎందరు తల్లుల గర్భశోకాన్ని మింగితే ఎందరు పసిపిల్లలు తల్లి ఒడిని వదిలి దారి పక్కన గడ్డిపూలై తలవాల్చేస్తే ఎందరు కన్నెపిల్లల యవ్వన స్వప్నాలు గాలిమేడలుగా కూలిపోతే ఇంకెందరి విచక్షణ కోల్పోయిన యువావేశాలు యుద్ధయాగంలో సమిధలైతే ఎందరు యువకులు సిద్ధార్ధులై మృత్యువును అన్వేషిస్తూపోతే ఎప్పటికి… […]

Continue Reading

యుద్ధం ఒక గుండె కోత-16 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-16 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి నింగిని తాకుతోన్న మంటల వృక్షాలు ఆగి ఆగి చటుక్కున విచ్చుతోన్న జ్వాలా తోరణాలు రేకులు రాలుస్తున్న నిప్పురవ్వలు జూలు విదిల్చి ఆవులిస్తున్న మృగరాజు ఒళ్ళు విరుచుకొంటున్న క్రూరత్వం నిశ్శబ్ద శకలాలు చిట్లి జారిన శబ్దం తాను కాల్చకుండానే దహించుకుపోవటాన్ని అడవితీగల్ని అందుకొని ఎగబాకి అబ్బురంగ చూస్తోన్న వానర సమూహాలు రెండు నాలుకల ప్రహసనాల్ని చూస్తూ నివ్వెరపోతూ నాలుకల్ని దాచేసుకొంటోన్న సర్పాలు ముందున్నవి కదిలిపోతున్న దారిలో […]

Continue Reading

యుద్ధం ఒక గుండె కోత-15 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-15 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి స్మశానమైపోతోన్న ఇసుక తిన్నెల్లో జండా కొయ్యల్లా నిల్చున్న విరిగిన బొమ్మజెముళ్ళ దారిలో కాందిశీకులై పొలిమేరలు దాటుతోన్న జనం శిబిరాలు చేరి తలదాచుకొంటున్నా ముఖాల్నిండా ఆర్తి పరచుకొని అంగరఖా చాటున గుళ్లు నింపిన తుపాకీల్లా మృత్యువుని సవాలు చేస్తూ ఆకాశానికి చూపులు ఎక్కుపెట్టే ఉన్నారు రాబందుల రెక్కల చప్పుడుకి పెట్రేగిపోతూ బంధుజనాల మృత్యువాసన వంటినిండా పూసుకొంటూ ఆకల్ని మింగేస్తున్న పూనకంతో ఊగిఊగి ఆదమరుపుగా రెప్పవాలిస్తే నిద్రాలింగనంలో […]

Continue Reading